breaking news
yellow media
-
బాబు ఆర్థిక విధ్వంసం.. ఎల్లో మీడియా మాటల్లో!
‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరు నానాటికీ మరింత అధ్వాన్నంగా మారిపోతుంది. తప్పుడు లెక్కలతో తీరని ద్రోహం జరుగుతోంది’.. ఈ మాటలు అంటోంది ప్రతిపక్షాలు కాదు.. కూటమి ప్రభుత్వానికి దన్నుగా నిలిచే ఎల్లోమీడియా!. ఒకపక్కమే సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి అప్పులు పుట్టడం లేదని ఒకసారి.. జీఎస్డీపీ బ్రహ్మాండమని ఇంకోసారి చెబుతూంటే.. ఎల్లోమీడియా ఇలా వాస్తవాలు వెల్లడించి పరువు బజారున పడేసింది.అయితే.. ఈ కథనంలో ఎక్కడా చంద్రబాబును తప్పు పట్టలేదు లెండి. తప్పంతా అధికారులదే అన్నట్టుగా ఈ కథనం సాగింది. జీఎస్డీపీ, తలసరి ఆదాయాలు బాగున్నట్లు చూపించి అసలు కష్టాలను దాచేశారని, కాగితాలపై గొప్పలు చెప్పారని వ్యాఖ్యానించింది. దీనివల్ల కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాలో ఏపీకి భారీ కోత పడిందని కూడా పేర్కొంది. రెవెన్యూ గ్రాంట్లలోనూ నష్టమే జరుగుతోందని, కేవలం అప్పుల కోసమే జీఎస్డీపీకి రెక్కలు తొడిగారని కూడా వెల్లడించింది.కొంతకాలంగా ఏపీ ఆర్ధిక పరిస్థితి, దొంగ లెక్కల గురించి ఆర్థిక నిపుణులు, అనుభవజ్ఞులైన జర్నలిస్టులు చెబుతున్నది కూడా అదే. అయితే, అప్పుడు పచ్చ మీడియా చంద్రబాబును వెనకేసుకొచ్చింది. ఇప్పుడు కూడా కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో చంద్రబాబు వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకే ఇలాంటి కథనాలు రాసిందని అంటున్నారు. అందుకే ఇందులో వాస్తవమున్నా నిజాయితీ మాత్రం కనిపించదు. వైఎస్ జగన్ హయాంలో అప్పులే ఆలంబన అని, ఇప్పుడేమో అప్పులతోపాటు ఇమేజీ కోసం ఆరాటం అని ఎల్లో మీడియా వ్యాఖ్యానించింది. అంతే తప్ప జగన్ టైమ్‌లో రెండేళ్లపాటు కరోనా సంక్షోభంతో వచ్చిన సమస్యలను రాయడానికి వీరికి చేయి రాలేదు. పైగా జగన్ హయాంలో రాష్ట్రం బ్రాండ్ పాతాళానికి చేరిందంటూ తప్పుడు వ్యాఖ్యలతో కథనాన్ని ఆరంభించడమే వీరి కుళ్లుకు దర్పణంగా కనిపిస్తుంది. అప్పుడేమో సంక్షేమమేనట, బటన్ నొక్కడమేనట. ఇప్పుడేమో పరిస్థితి మారిందట. సంక్షేమం, అభివృద్ది కావాలట. పెట్టబడులు రావాలట.ఆ రోజుల్లో టీడీపీ, జనసేన కలిసి ఇచ్చిన సంయుక్త ఎన్నికల ప్రణాళికలో ఇష్టం వచ్చినట్లు హామీలు ఇచ్చారని, అందుకు సుమారు రూ.లక్షన్నర కోట్లు ప్రతి ఏటా ఖర్చు చేయాల్సి ఉంటుందని జగన్ చెబితే ఈ మీడియా అంగీకరించిందా?. లేకపోగా జగన్‌పై చంద్రబాబు శరాలు సంధించారని గొప్పగా రాసింది. జగన్ టైమ్‌లో పోర్టులు, మెడికల్ కాలేజీలు కడితే, అవేవీ ఎల్లో మీడియా కళ్లకు కనిపించలేదు. పోనీ చంద్రబాబు టైమ్‌లో వచ్చిన కొత్త పరిశ్రమలు కనిపించాయా అంటే లేదు. కంపెనీలకు 99 పైసలకే ఎకరాలకు ఎకరాలు ధారాదత్తం చేస్తుంటే, రాష్ట్ర ప్రజల సంపదను కొంతమంది పెట్టుబడిదారులకు కట్టబెడుతుంటే వీరికి తప్పు అనిపించదు. కానీ, జగన్ అలాంటి పనులు చేయకపోయినా ఆయనపై పడి ఏడుస్తుంటుంది. ఈ మీడియా ఇచ్చిన కథనంలో వృద్దిరేటుపై చంద్రబాబు చెబుతున్న విషయాలు రాష్ట్రానికి నష్టం చేస్తున్నాయని తెలిపింది. ఈ లెక్కల వల్ల రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లలో గండి పడుతోందని తెలిపింది. చంద్రబాబేమో తనంత ఘనాపాటి లేడని అనిపించుకోవాలని అతిశయోక్తులతో కూడిన అంకెలతో గారడి చేస్తుంటే, ఆర్థిక శాఖకు చెందినవారో, లేక మంత్రి ఎవరో ఈ విషయాలు చెప్పి కథనం రాయించినట్లు అనిపిస్తుంది.ఈ తప్పుడు లెక్కల వల్ల ఏపీకి కేవలం రూ.7500 కోట్ల మేర మాత్రమే కేంద్రం గ్రాంట్ వచ్చిందని, అదే బీహారుకు రూ.17500 కోట్లు వచ్చిందని వివరించారు. కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాలో కూడా ఇలాగే నష్టపోతున్నదట. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెలిగిపోతోందన్న లెక్కలవల్లే ఈ వాటా తగ్గుతోందట. అయితే ఏపీలో జీఎస్టీ వసూళ్లు తగ్గిన అంశాన్ని ఈ మీడియా కప్పిపుచ్చేసింది. జగన్ టైమ్‌లో జీఎస్డీపీ రూ.14 లక్షల కోట్ల ఉంటే, దానిని ఏడాదికి రెండు లక్షల కోట్ల చొప్పున పెంచేశారని, దీనికి తగినట్లుగానే తలసరి ఆదాయం అంచనాలు కూడా పెంచేశారని ఈ పత్రిక తెలిపింది. అప్పుల కోసం, బ్రాండ్ ఇమేజీ కోసం ఇలా చేస్తున్నారట. దేశంలో జీఎస్డీపీ 8.7 శాతం ఉంటే, ఏపీలో మాత్రం అది 11.28 శాతంగా చూపించడాన్ని ఈ మీడియా తప్పుపట్టింది. దేశ సగటు కన్నా తక్కువగా ఉన్న రాష్ట్రాలకు ఆర్థిక సంఘం నిధులు ఎక్కువగా వస్తాయని, ఏపీలో చాలా ఎక్కువగా చూపినందున తక్కువ నిధులు వస్తాయని ఈ మీడియా వాపోయింది. అలాగే జాతీయ తలసరి ఆదాయం కన్నా ఏపీ తలసరి ఆదాయం ఎక్కువగా ఉందని ప్రభుత్వం గొప్పలు పోయిందట. ఈ పరిస్థితిలో కేంద్రం నుంచి అధిక నిధులు, పన్నులలో ఎక్కువ వాటా ఎలా వస్తుందని అధికారులు అంటున్నారట.చంద్రబాబు ప్రభుత్వ బడ్జెట్ లెక్కల్లోని డొల్లతనం కూడా ఈ పత్రిక బహిర్గతం చేసింది. ఏపీకి పన్నేతర ఆదాయం రూ.19,119 కోట్లుగా అంచనా వేశారని, అవన్ని గాలి మేడలే అని చెబుతూ ఈ పద్దు కింద రూ.ఐదు వేల కోట్లు వస్తే గొప్ప అని స్పష్టం చేసింది. ఇప్పటికి వచ్చింది రూ.3671 కోట్లేనట. రాష్ట్ర పన్ను ఆదాయం కింద రూ.1.09 లక్షల ఆదాయం వస్తుందని అంచనా వేస్తే నవంబర్ నాటికి వచ్చింది రూ.68 వేల కోట్లేనని తేలింది. ఆదాయం పరిస్థితి ఇలా ఉండగా, ప్రభుత్వ ఖర్చులు మాత్రం తడిసి మోపెడవుతున్నాయి. రెవెన్యూలోటు 163 శాతానికి చేరుకుంది. రూ.1.60 లక్షల కోట్లు వ్యయం చేస్తే అందులో కేవలం రూ.17 వేల కోట్లే మూలధన వ్యయంగా ఉంది. ఈ అంకెల విషయంలో ఎక్కడా జగన్ ప్రభుత్వం నాటి లెక్కలతో పోల్చకుండా ఈ ఎల్లో మీడియా జాగ్రత్తపడింది.కేంద్రం నుంచి కూడా అప్పట్లో అధిక నిధులను జగన్ ప్రభుత్వం సాధించింది. ఉదాహరణకు రెవెన్యూ లోటు కిందే సుమారు రూ.పది వేల కోట్లు పొందింది. పోలవరం ప్రాజెక్టుకు రూ.12 వేల కోట్లు రాబట్టుకోగలిగింది. కేంద్రం ప్రతిపాదించిన సంస్కరణలు అమలు చేసి, అదనపు నిధులు సాధించింది. పైగా ఆ రోజుల్లో జీఎస్టీ వసూళ్లలో కూడా దేశంలోనే మొదటి ఐదు స్థానాలలో ఉండేది. అయినా అప్పుడు బ్రాండ్ పాతాళంలో ఉందని తప్పుడు రాతలు రాసిన ఈ ఎల్లో మీడియా ఇప్పుడు ఈ దారుణ పరిస్థితికి ఎన్ని పాతాళాల లోతున కూటమి ప్రభుత్వ ప్రతిష్ట దిగజారిందో మాత్రం చెప్పలేదు.వ్యాపార లావాదేవీలు, ప్రజల కొనుగోలు శక్తి మొదలైనవన్నీ జగన్ టైమ్‌లో మెరుగ్గా ఉన్న విషయాన్ని ఎల్లో మీడియా కప్పిపుచ్చే యత్నం చేసింది. కేవలం చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎగవేయడానికి వీలుగా గత కొన్నాళ్లుగా కథనాలు ఇస్తున్న ఈ పచ్చ మీడియా అందులో భాగంగానే తాజా కథనమూ ఇచ్చి ఉండవచ్చు. కానీ, ఈ క్రమంలో చంద్రబాబు ప్రభుత్వ ఆర్థిక విధ్వంస పాలనను తనకు తెలియకుండానే ప్రజల ముందు ఉంచింది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
రుషికొండ భవనం.. ఏపీ వైట్ హౌస్
-
కోటి గళాలను పక్కదోవ పట్టిస్తారా?
ఆంధ్రప్రదేశ్‌లో వైద్య కళాశాలల ప్రైవెటీకరణపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఉద్యమానికి కోటి గొంతుకలు మద్దతిస్తూంటే.. ప్రజల్లో ఏర్పడ్డ ఈ అసంతృప్తిని తగ్గించేందుకు ప్రభుత్వం నానా తంటాలూ పడుతోంది. ఇదే అదనుగా ఎల్లోమీడియా కూడా విషయాన్ని పక్కదారి పట్టించేందుకు పడుతున్న పాట్లు ప్రజల్లో ఏహ్యభావాన్ని కలిగిస్తున్నాయి. అయితే ఈ క్రమంలోనే ఎల్లోమీడియా కొన్ని వాస్తవాలను తమకు తెలియకుండానే ఒప్పుకుంటూండటం గమనార్హం. ఎల్లోమీడియా ప్రతినిధి ఈనాడు అకస్మాత్తుగా వైద్యకళాశాలల నిర్వహణపై పీపీపీ విధానమే మేలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసు చేసిందంటూ ఒక భారీ కథనాన్ని ప్రచురించింది. సహజంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పాట అందుకున్నారు. కమిటీ సిఫారసులేమిటన్నది కాసేపు పక్కనబెడదాం. అసలు చంద్రబాబుకు ఇలాంటి కమిటీలపై నమ్మకం ఉందా? మూడు పంటలు పండే అమరావతి ప్రాంతంలో రాజధాని వద్దు అని కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ నిర్ణయాన్ని బేఖాతరు చేసింది ఈ చంద్రబాబే కదా? ఈనాడు ఈ రకంగా విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తే... ఆంధ్రజ్యోతి వైఎస్సార్ సీపీ కోటి సంతకాల ఉద్యమానికి ప్రజా మద్దతు పెద్దగా లేదని సన్నాయి నొక్కులు నొక్కింది. దీన్ని బట్టి మరోసారి స్పష్టమైన విషయం ఏమిటంటే... చంద్రబాబుకు కష్టం కలిగిన ప్రతి సందర్భంలోనూ కాపు కాసేందుకు ఈ ఎల్లో పత్రికలు రెండూ తమదైన డ్రామాను తెరమీదకు తెస్తాయి అని!వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగానే 17 వైద్య కళాశాలలకు అనుమతులు సాధించారన్న విషయం అందరికీ తెలిసిందే. దశాబ్దాలుగా సాధించిన కళాశాలలు కేవలం 12 మాత్రమే. కానీ ఎకాఎకిన 17 కాలేజీలకు అనుమతి సాధించిన జగన్‌ను పచ్చ మీడియా, తెలుగుదేశం నేతలు ఎన్నడూ అభినందించిన పాపాన పోలేదు. పైపెచ్చు తప్పుడు ప్రచారాలు ఆరంభించారు. జగన్ ఈ కాలేజీల సమర్థ నిర్వహణ కోసం ఎన్నారై కోటా కింద నిర్దిష్ట ఫీజులు నిర్ణయిస్తే ఇదే టీడీపీ, జనసేనలు తీవ్ర విమర్శలకు దిగాయి. సీట్లు అమ్ముకుంటారా తెగ బాధపడిపోయాయి. బాబు గారి తనయుడు లోకేశ్ యువగళం కార్యక్రమాల్లో మాట్లాడుతూ సీట్లు అన్నింటిని ప్రభుత్వమే కేటాయిస్తుందని, బి కేటగిరి కింద సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ఉండబోవని హమీ ఇచ్చారు. చంద్రబాబు సైతం అదే చెప్పారు కానీ అధికారం రాగానే మాట మార్చేశారు. ప్రభుత్వ కాలేజీలన్నింటినీ ప్రైవేటుపరం చేయడానికి రెడీ అయ్యారు. అదేమని అడిగితే ఇవి ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటాయి కానీ ప్రైవేటు వారు నడుపుతారంటూ బుకాయించడం ఆరంభించారు. ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని చెప్పడం ఆరంభించారు. అదే టైమ్‌లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల ఖరీదును భారీగా పెంచేశారు. ప్రభుత్వం ప్రతి కాలేజీకి కేటాయించిన ఏభై నుంచి వంద ఎకరాల భూమిని, ఇప్పటికే సాగిన నిర్మాణాలను ప్రైవేటు సంస్థలకు, అవి కూడా వారి తైనాతీలకు కట్టబెట్టడానికి రంగం సిద్దం చేశారు. పైగా జగన్ టైమ్‌లో అసలు కాలేజీలు రానట్లు తప్పుడు ప్రచారం చేయాలని కూడా ఆలోచించి చంద్రబాబు, అయ్యన్నపాత్రుడు వంటివారు కాలేజీలు ఎక్కడ అంటూ ప్రశ్నించి ఆశ్చర్యం కలిగించారు. దాంతో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ ఈ మెడికల్ కాలేజీల అంశాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని జనంలోకి వెళ్లారు. ఆయా చోట్ల జగన్ ప్రభుత్వం నిర్మించిన మెడికల్ కాలేజీలు, అలాగే వైసీపీ బృందాలు నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీల వద్దకు వెళ్లేలా ప్లాన్ చేశారు. తాను స్వయంగా నర్సీపట్నం మెడికల్ కాలేజీ వద్దకు వెళ్లినప్పుడు వచ్చిన అనూహ్య స్పందన రాష్ట్ర ప్రజలందరిని ఆకట్టుకుంది. అప్పటి నుంచి రకరకాల దశలలో ఈ ఉద్యమాన్ని ఒక క్రమబద్దంగా సాగించారు. ప్రజలలో ఉన్న వ్యతిరేకతను రాష్ట్రం, దేశం దృష్టికి తీసుకురావడానికి ఆయన కోటి సంతకాల ఉద్యమాన్ని చేపట్టారు. దీంతో వైసీపీ క్యాడర్‌కు కూడా ఒక ఊపు, ఉత్తేజాన్ని ఇచ్చింది. ప్రతిపక్షంగా ప్రజలలో గట్టిగా పనిచేయడానికి ఇది ఒక అవకాశం కల్పించింది. ప్రభుత్వ పెద్దలకు కంగారు ఏర్పడింది. దాంతో చంద్రబాబు ప్రభుత్వాన్ని రక్షించేందుకు, ప్రజలలో ప్రభుత్వ కాలేజీలపై వ్యతిరేకత తీసుకురావడానికి ఎల్లో మీడియా ప్రయత్నాలు ఆరంభించింది.అయినా ప్రజలలో ఈ అంశంపై ఆగ్రహం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఈనాడు మీడియా కొద్దిరోజుల క్రితం ‘పీపీపీ విధానమే మేలు’ అన్న శీర్షికతో ప్రజలను తప్పుదారి పట్టించే యత్నం చేసింది. వివిధ శాఖలకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు ఉంటాయి. అవి ఆయా అంశాలపై చర్చలు జరిపి కొన్ని సిఫారసులు చేస్తుంటాయి. అవేవి కేంద్ర ప్రభుత్వ అధికార పార్టీ అభిప్రాయాలుగా చూడరు. ఈ స్టాండింగ్ కమిటీ సిఫారసులను కేంద్రం పట్టించుకున్న సందర్భాలు అరుదు. రాష్ట్రాలలో కూడా శాసనసభ కమిటీల సిఫారసుల పరిస్థితి ఇలాగే ఉంటుంది. అది ఒక కోణం అయితే ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఏమైనా ప్రస్తుతం ఉన్న వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేయాలని సూచించిందా? అంటే లేదు. భవిష్యత్తులో మరిన్ని కాలేజీల అవసరం ఉంటే ప్రైవేటు వారిని కూడా భాగస్వాములు చేయవచ్చని అభిప్రాయపడింది. ప్రత్యేకించి ప్రభుత్వ ఆస్పత్రులను వాడుకోవచ్చని తెలిపింది. అంతే తప్ప ప్రభుత్వ కాలేజీలు వద్దని కాని, ప్రభుత్వ కాలేజీల కోసం కేటాయించిన భూములు, నిర్మించిన భవనాలను ప్రైవేటు వారికి దోచిపెట్టవచ్చని కాని ఎక్కడా సిఫారసు చేయలేదు. ఒక్కో కాలేజీకి కేటాయించిన ఏభై నుంచి వంద ఎకరాల భూములను ఎకరా రూ.వందకు లీజుకు ఇవ్వాలని, అది కూడా 66 ఏళ్లకు లీజుకు ఇవ్వాలని ఎక్కడా పేర్కొనలేదు. ఈనాడు మీడియా ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ అమలు చేస్తున్న విధానానికి స్టాండింగ్ కమిటీ మద్దతు ఇచ్చిందేమో అన్న అభిప్రాయం కలిగించాలని కుట్రపూరితంగా ఈ కథనం ఇచ్చింది. అందుకే వైసీపీ నేతలు టీజేఆర్ సుధాకర్ బాబు, సిదిరి అప్పలరాజు తదితరులు చంద్రబాబు జేబు సంస్థ మాదిరి ఈనాడు మీడియా తప్పుడు కథనాలు ఇస్తోందని మండిపడ్డారు. చిత్తశుద్ది ఉంటే ఈనాడు ఇప్పటికే మంజూరైన ప్రభుత్వ కాలేజీలకు సంబంధించి ఈ సిఫారసులు చేయలేదని, భవిష్యత్తులో వచ్చేవాటికి అని రాసి ఉండేది. ఆ పని చేయలేదు. ప్రతి దానికి సొంత భాష్యం ఇచ్చి వైసీపీపై విషం కక్కే ఎల్లో మీడియా ఈ కమిటీ సిఫారసులకు ఉన్న విలువ ఏమిటి? కేంద్రం వీటిలో ఎన్నిటిని పట్టించుకుంటుంది? ఇప్పటికే ప్రైవేటు రంగంలో ఉన్న వైద్యకాలేజీలు ఎలా నడుస్తున్నాయి. పేదలకు ఏ మేరకు ఉచిత వైద్యం అందుతున్నది? ప్రభుత్వ కాలేజీలలో ఉండే లాభనష్టాలు మొదలైన వాటిని విశ్లేషించి ఉంటే ప్రజలకు వాస్తవ పరిస్థితులు చెప్పినట్లయ్యేది. అవేవి చేయకుండా ప్రజలను మభ్య పెట్టి, కోటి సంతకాల ఉద్యమంపై నీళ్లు చల్లే ఉద్దేశంతో కథనం రాయడంపై వైసీపీ మండిపడింది. దేశంలో కొత్తగా 75 వేల వైద్య విద్య సీట్లు పెంచడం కోసం స్టాండింగ్ కమిటీ సిఫారసు చేసింది తప్ప, ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా ఎక్కడా వ్యాఖ్యానించలేదన్నది వాస్తవం. వైద్య కళాశాలలు లేని జిల్లాలు, వెనుకబడిన ప్రాంతాలలో కొత్త కాలేజీలు ఏర్పాటు కావాలని కమిటీ అభిప్రాయపడింది. జగన్ తన హయాంలో చేసింది కూడా అదే కదా! కేంద్రం కూడా ప్రభుత్వరంగంలోనే వైద్యకాలేజీలు మంజూరు చేసింది తప్ప పీపీపీ విధానంలో కాదు. బహుళజాతి సంస్థలకు, వేల కోట్ల రూపాయల లాభార్జన చేస్తున్న సంస్థలకు ఎకరా 99 పైసలకే భూములు కేటాయిస్తున్న ప్రభుత్వం, పేదలకు ప్రయోజనం కలిగించే వైద్య కాలేజీలకు ఐదువేల కోట్లు ఖర్చు చేయడానికి ఇష్టపడడం లేదు. ప్రైవేటువారికే సంపదగా మార్చడానికి ప్రయత్నిస్తోంది. ఏది ఏమైనా ఏపీలో ప్రభుత్వ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి మందికి పైగా గళం విప్పడం అభినందనీయం అని చెప్పాలి. ఎల్లో మీడియా ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్నట్లు కాకుండా ప్రజల కోసం పనిచేస్తే మంచిది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
సుప్రీం తీర్పునే మార్చేసిన ఈనాడు..
-
వివేకా కేసులో చంద్రబాబుకు సీబీఐ కోర్టు షాక్
-
ప్రైవేటు వ్యక్తులకు లాభాలు, పేదలపై భారమా?: సీదిరి
సాక్షి, శ్రీకాకుళం: పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణమే మేలంటూ ఎల్లోమీడియా రాతలు రాయడం అన్యాయం, దుర్మార్గమని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ డాక్టర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆక్షేపించారు. ‘‘గతంలో విశాఖపట్నం తూర్పు తీరంలో ఉండటం వల్ల తీవ్రవాద దాడులకు టార్గెట్, విదేశీ దాడులకు సాఫ్ట్ టార్గెట్ అని రాశారని, విశాఖ భూకంపాల జోన్లో ఉంది. హైరిస్క్ ఏరియా అని రాశారని, గ్లోబల్ వార్మింగ్ వల్ల సముద్ర మట్టాలు పెరిగిపోయి విశాఖ మునిగిపోతుంది, కాబట్టి రాజధానిగా చేయొద్దంటూ రాతలు రాశారని గుర్తు చేశారు.‘‘ఇప్పుడు విశాఖపట్నం అద్బుతం, ఇక్కడే సూర్యుడు ఉదయిస్తున్నాడు, బంగారం పండుతుంది, సిలికాన్ లభిస్తుంది, కాబట్టి ఇక్కడే పెట్టుబడులు పెట్టండి, చంద్రబాబు విజన్ వల్లే విశాఖ ఇలా మారిపోతుందని రాస్తున్నారు’’ అంటూ సీదిరి అప్పలరాజు దుయ్యబట్టారు. ప్రెస్మీట్లో ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..ఆ సంఘం సిఫార్సులంటూ పిచ్చిరాతలు:పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే పేదలకు మేలు జరుగుతుందని చంద్రబాబు ఏడాదిగా చెబుతున్నారు. ప్రైవేటు గుత్తాధిపత్యం ఎక్కువైతే ఏం జరుగుతుందో ఇండిగో వ్యవహారంలో చూశాం. మన ఎంపీ కేంద్రమంత్రిగా ఉండి ఏం చేశారో చూశాం. ప్రభుత్వ ఆస్పత్రులు, కాలేజీలు లేకపోతే మన పరిస్ధితి ఏంటో అంతా అలోచించాలి. వైద్య వ్యవస్థలు ప్రైవేటు చేతుల్లో ఉంటే కరోనా లాంటి విపత్తుల్లో ఏం జరిగి ఉండేదో ఆలోచించాలి.ఇప్పుడు పార్లమెంటరీ స్దాయీ సంఘం పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసిందంటూ పిచ్చి రాతలు రాస్తున్నారు. నిజానికి కమిటీ ఏం చెప్పిందన్నది చూస్తే.. మెడికల్ కాలేజీల నిర్వహణకు ఎవరైనా ముందుకొస్తే రాయితీలు ఇవ్వాలని, అర్హులైన విద్యార్ధులుంటే స్కాలర్ షిప్పులు ఇవ్వాలని, వైద్య విద్యలో సీట్లు పెంచడం తప్పనిసరి అని పార్లమెంటరీ స్థాయీ సంఘం చెప్పింది. వైద్య విద్య, సామాగ్రి ఖర్చు పెరిగిపోతున్న తరుణంలో పీపీపీ విధానంలో నిర్వహించే అంశం గురించి ఆలోచించాలని మాత్రమే సిఫార్సు చేసింది.అంతే తప్ప ఉన్నవాటిని పీపీపీ విధానంలో చేపట్టాలని ఎక్కడా చెప్పలేదు. అదే వాస్తవమైతే ఎయిమ్స్, జిప్ మర్, ఐఐటీ వంటి సంస్థలు కూడా పీపీపీ విధానంలో పెట్టుకోవాలి కదా?. ప్రైవేటువాళ్లు ముందుకొస్తే పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు చేపట్టాలని మాత్రమే పార్లమెంటరీ స్థాయీ సంఘం చెప్తే ఉన్న కాలేజీల్ని ప్రైవేటు చేతుల్లో పెడుతున్నారు.ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ ఆస్పత్రులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడం స్కాం, నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం, వెన్నుపోటే కాదు పేదల కలకల్ని తుంచేయడమే అవుతుంది. దీనికి తోడు ప్రైవేటు ఆస్పత్రుల్లో జీతాలు కూడా ప్రభుత్వమే రెండేళ్ల పాటు ఇస్తుందంటున్నారు. ఇలాంటి ఆఫర్లు ఎక్కడైనా విన్నామా ? భూములు, భవనాలు, ఆస్పత్రులు, మౌలిక సదుపాయాలు, జీతాలు ప్రభుత్వం ఇస్తుంటే లాభాలు ప్రైవేటుకు ఇచ్చి, భారం పేదలపై వేస్తారా? ఇదీ చంద్రబాబు చెప్తున్న పీపీపీ మోడల్. మొన్నటివరకూ పీపీపీ మోడ్ లో ఏర్పాటు చేసినా ప్రభుత్వం నిర్వహణ చూస్తుందన్నారు. అంటే జీతాలు ప్రభుత్వం ఇచ్చి లాభాలు ప్రైవేటు వ్యక్తులకు వెళ్లడమా ?, ఇది కొత్త మౌలిక సదుపాయాల కల్పన కాదు, ఉన్న వాటినే ప్రైవేటు చేతుల్లో పెట్టడం. మెడికల్ కాలేజీలు కొత్త వారు ఏర్పాటు చేస్తామంటే వారికి రాయితీలతో అవకాశం ఇవ్వండి. అంతే తప్ప మనం డబ్బులు పెట్టి, భూసేకరణ చేసి, భవనాలు కట్టి ప్రైవేటుకు లాభాలు ఇస్తారా ? ఇది మంచి విధానం అంటూ ఆస్థాన కరపత్రికలతో పొగడ్తలా ?జగన్‌కి పేరు వస్తుందనే ఇదంతా..:మొన్నే రెండు వారాల క్రితం అమరావతి కోసం రూ.7500 కోట్లు అప్పు చేశారు. నిన్న దాన్ని క్యాబినెట్లో ఆమోదించారు. 2027లో రానున్న గోదావరి పుష్కరాలకు రూ.5 వేల కోట్లు కేటాయిస్తున్నారు. కలల రాజధానిలో కి.మీ రోడ్డు వేసేందుకు రూ.180 కోట్లకు టెండర్ ఇచ్చారు. అలా మూడు కి.మీ రోడ్డు కోసం రూ.540 కోట్లకు టెండర్ ఇచ్చారు. రెండు, మూడు కిలోమీటర్ల రోడ్డు ఖర్చుతో ఒక మెడికల్ కాలేజీ పూర్తయిపోతుంది. కానీ మెడికల్ కాలేజీలు పెట్టడానికి డబ్బులు లేవంటున్నారు.పీపీపీ పేరుతో మెడికల్ కాలేజీలు దోచి పెడుతున్నారు:అసలు మెడికల్ కాలేజీలకు కొత్తగా డబ్బు తీసుకు రావాల్సిన అవసరం లేదు. వైఎస్ జగన్ హయాంలోనే నాబార్డ్ వంటి ఆర్థిక సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. నాబార్డ్‌ను సంప్రదిస్తే మెడికల్ కాలేజీలకు నిధులు దొరుకుతాయి. కొత్తగా అప్పులు చేయాల్సిన అవసరమే లేదు. కేవలం వైఎస్ జగన్‌కు పేరు వస్తుందనే దుగ్ద తప్ప ఇందులో మరొకటి లేదు. అందుకే వాటిని ప్రైవేటు వ్యక్తులకు, బినామీలకు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్క మెడికల్ కాలేజీలో ఉద్యోగుల నెల జీతాలకు రూ.5 కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. అలా ఏడాదికి రూ.60 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకు అవుతుంది. 10 మెడికల్ కాలేజీలకు ఇలా ఇస్తే రూ.700 కోట్లు అవుతుంది. రెండేళ్లు ఇలా ఇస్తారా?. ఇది ఎంత వరకు సబబు?ఇంకా 10 మెడికల్ కాలేజీలకు సుమారు 257 ఎకరాలు సేకరించాం. ఒక్కో కాలేజీకి 50 ఎకరాల చొప్పున దోచి పెడుతున్నారు. కేంద్రం ఇచ్చిన పీజీ సీట్లు కూడా సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల కింద ప్రైవేటుకు ఇచ్చేశారు. ఎన్నారై సీటు ఫీజు రూ.29 లక్షలని జీవో కూడా ఇచ్చారు. మేనేజ్ మెంట్ కోటా సీటు రూ.9 లక్షలని ఇచ్చారు.రికార్డుస్థాయిలో అప్పు:అసలు ఈ ప్రభుత్వం ఎటు పోతోంది? డబ్బుల్లేవంటూనే 18 నెలల్లోనే రూ.2.66 లక్షల కోట్లు అప్పు చేశారు. రాష్ట్రానికి భారీ అప్పులు తెచ్చుకుంటూ మరోవైపు జగన్ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని చెప్పుకుంటున్నారు. అన్ని రంగాల్లోనూ రాష్ట్రాన్ని అధఃపాతాళానికి తీసుకెళ్తున్నారు.కోటి సంతకాలు గవర్నర్‌కి సమర్పణ:10 కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చర్యలపై ప్రజా ఉద్యమం చేపట్టిన వైయస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కొనసాగించింది. దానికి అన్ని చోట్ల, అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభించింది. ఆ కోటి సంతకాల పత్రాలు ఇప్పటికే జిల్లా కేంద్రాలకు చేరుకోగా, సోమవారం (డిసెంబరు 15వ తేదీ) అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నాం. అక్కణ్నుంచి అవి విజయవాడ చేరుకుంటాయి. ఆ పత్రాలను ఈనెల 18న గవర్నర్‌కి సమర్పిస్తాం. ఆ మేరకు ఆరోజు సా.4 గం.కు, మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్‌నజీర్‌తో భేటీ కానున్నారని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు వివరించారు. -
రఫ్పాడించిన వైఎస్ జగన్
ఎవరన్నారు ర్యాగింగ్, ట్రోలింగ్లు.. కాలేజీలు, సోషల్ మీడియాలకు మాత్రమే పరిమితమని? రాజకీయాల్లోనూ వీర ర్యాగింగ్ చేయవచ్చు. కావాలంటే వైఎస్ జగన్ తాజా ప్రెస్‌మీట్ చూడండి!. కాలేజీలలో ర్యాగింగ్ నిషిద్ధం కానీ రాజకీయాలలో ప్రత్యర్థులను సమర్థంగా ఇరుకున పెట్టగలిగే ర్యాగింగ్‌పై అడ్డంకులేవీ లేవు. రఫ్ఫా రఫ్పా అన్న సినిమా డైలాగును ఫ్లెక్సీల్లో పెడితే ఏపీ పోలీసులు కేసులు పెట్టగలరేమో కానీ.. ఈటెల్లాంటి మాటలతో దాడి చేసే రాజకీయ ప్రత్యర్థులను బిత్తరపోయేలా రఫ్పాడిస్తే ఎవరైనా ఏం చేయగలరు చెప్పండి?.వైఎస్ జగన్ ర్యాగింగ్‌కు తెలుగుదేశం పార్టీ కాని, ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ సమాధానం చెప్పలేని స్థితిలో పడ్డారు. దీంతో ఏవేవో అర్థం పర్థం లేని విమర్శలు చేశారు. మరి కొందరు పిచ్చి వ్యాఖ్యలు చేసి సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వైఎస్ జగన్ వాదనతో బిత్తరపోయిన ఎల్లో మీడియా సహజంగానే దాన్ని తక్కువ చేసేందుకు, వక్రీకరించేందుకు అన్ని శక్తులూ ఒడ్డింది. ఇదంతా వారి ఉడుకుమోతు తనానికి నిదర్శనం అనుకోవాలి. ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర మీడియా సంస్థలు ఎంతసేపూ చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎలా కాపాడాలన్న ధోరణితో తప్ప, నిజానిజాలపై దృష్టి పెట్టడం మానేశాయి. జగన్‌పై రాస్తున్న ఏడుపుగొట్టు కథనాలే అందుకు నిదర్శనం.జగన్ ర్యాగింగ్ ఏ స్థాయిలో ఉందో తెలియాలంటే..మొట్టమొదట అరటి రైతుల సమస్యల గురించి.. అరటి, మిర్చి, తదితర ఉద్యాన పంటలకు మద్దతు ధర లేక రైతులు అల్లాడుతున్న విషయాన్ని కూటమి ప్రభుత్వం పంటల బీమా సదుపాయాలు లేకుండా చేసిన అంశాన్ని ప్రస్తావించారు. చంద్రబాబు దీనికి సమాధానం ఇవ్వలేదు. ‘‘సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఎక్కడ అమలు చేశారు?’’ అని అడుగుతూ అది సూపర్ మోసం అని, చంద్రబాబుపై చీటింగ్ కేసుపెట్టాలని జగన్ వ్యాఖ్యానించారు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఏభై ఏళ్లకే పెన్షన్ తదితర హామీలు అమలుపై నిలదీశారు. అమలు చేసినట్లు చెప్పుకుంటున్న కొన్ని హామీలలోని డొల్లతనాన్ని, ఏడాది కాలం ఎగవేసిన వైనాన్ని కూడా ఎండగట్టారు. ఆయా స్కీములలో ఎగవేతల ద్వారా కూటమి సర్కార్ ప్రజలకు ఎంతెంత బాకీ పడింది లెక్కలు చెప్పారు. వీటికి కూడా టీడీపీ నుంచి నేరుగా జవాబు రాలేదు. కూటమి తన మేనిఫెస్టోలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఎలా హుళ్లక్కి చేసింది జగన్ సోదాహరణంగా వివరించారు. విశాఖ ఉక్కుకు గనుల కేటాయింపు అడక్కుండా, ప్రైవేటు కంపెనీ కోసం టీడీపీ ఎంపీలు గనులు మంజూరు చేయడం గురించి అడగడంపై ఆయన మండిపడ్డారు. వీటన్నిటిపై తన ప్రశ్నల పరంపరతో చంద్రబాబును రాజకీయంగా జగన్ మాస్ ర్యాగింగ్ చేశారని చెప్పాలి. అయితే ఇది ఆరోగ్యకరమైన ర్యాగింగ్. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు ఉన్న అవకాశం.చంద్రబాబు సత్యాసత్యాలతో సంబంధం లేకుండా ప్రత్యర్థులపై బురద చల్లుతుంటారు. జగన్ అలా కాకుండా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్‌తో మాట్లాడుతుంటే టీడీపీ, జనసేన, బీజేపీలకి ముచ్చెమటలు పట్టి ఉంటాయనడంలో సందేహం లేదు. తిరుమల లడ్డూ ప్రసాదం, పరకామణి కేసుల గురించి జగన్ చెప్పిన విషయాలు వింటే ఎవరికైనా ఈ విషయం అర్థమైపోతుంది. లడ్డూ ప్రసాదంపై నిరాధార నిందలేసి ఇప్పుడు ఆ ఊసెత్తకపోవడాన్ని ప్రశ్నించారు. ఈ కేసులో జంతు కొవ్వు ఆరోపణలు చేసిన చంద్రబాబు, పవన్‌లను సిట్ ముందుగా ఎందుకు ప్రశ్నించలేదు? ఇదే పెద్ద అనుమానం. అంతేకాక టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిందని చెబుతున్న బోలేబాబా సంస్థకు అనుమతి ఇచ్చిందే చంద్రబాబు సర్కార్ టైమ్‌లో అన్న సంచలన వాస్తవాన్ని జగన్ వెల్లడించడంతో కూటమి పెద్దలు, ఎల్లో మీడియా కిక్కురమనలేకపోయాయి. అప్పట్లో టీటీడీ బోర్డు చేసిన తీర్మానం కాపీని కూడా జగన్ ప్రదర్శించడం విశేషం. ఆ రోజుల్లో ఒక అధికారిక బృందం వెళ్లి బోలేబాబా కంపెనీలను తనిఖీ చేసి వచ్చీ మరీ ధ్రువీకరించాయన్న సంగతి బయటపడింది. ఇక్కడ ఇంకో సంగతి గమనించాలి.చంద్రబాబు కూడా హెరిటేజ్ పేరుతో డెయిరీ సంస్థను నడుపుతున్నారు. ఆయనకు బోలే బాబా కంపెనీ గురించి ముందే తెలిసే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు అది సరైన కంపెనీ కాకపోతే అప్పుడే తప్పించి ఉండాలి కదా! అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొన్ని నెయ్యి ట్యాంకులను తిప్పి పంపడం, మళ్లీ తర్వాత వాటిలో కొన్నిటిని అనుమతించడం వంటి విషయాలను కూడా జగన్ వెలుగులోకి తీసుకురావడంతో ప్రభుత్వ పెద్దలకు ,ఎల్లో మీడియాకు దిమ్మదిరిగినంత పనైంది. వీటిపై వీరెవ్వరూ నోరు విప్పితే ఒట్టు. కూటమి అధికారంలోకి వచ్చాక ఒకసారి తిరస్కరణకు గురైన నెయ్యిని వాడారని, అయినా చైర్మన్, అధికారులపై ఎందుకు కేసులు పెట్టలేదని జగన్ ప్రశ్నించారు. పరకామణి కేసు గురించి మాట్లాడుతూ తమ ప్రభుత్వ టైమ్‌లోనే నిందితుడిని పట్టుకున్న విషయాన్ని గుర్తుచేశారు. ఆ కేసులో నిందితుడి ఆస్తి మొత్తం స్వామి వారికి రాసిస్తే అది తప్పన్నట్లుగా ప్రభుత్వం ప్రచారం చేయడం ఏమిటో తెలియదు.చంద్రబాబు ప్రభుత్వ టైమ్‌లో కూడా ఈ నిందితుడు దొంగతనాలు చేసి ఉండవచ్చు కదా! అదే కదా సీఎం పరోక్షంగా అంగీకరిస్తున్నది?. అలాంటప్పుడు! అప్పుడెందుకు పట్టుకోలేకపోయారు. అంతేకాదు. తిరుమల, ఇతర ఆలయాలలో అప్పుడప్పుడూ ఇలాంటి ఘటనలు జరిగాయి. వారు పట్టుబడితే కేసులు పెట్టి చర్య తీసుకుంటారు. అంతే తప్ప ఆస్తుల స్వాధీనం వరకు వెళ్లరు. కానీ, ఈ కేసులో లోక్ అదాలత్ నిర్ణయం మేరకు ఆస్తి మొత్తం రాయించుకుంటే సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంకెంత చోరీ చేశారో అని అడుగుతున్నారు. దీనిపై ఇప్పటికే ఉన్న సిట్ ఆ విషయం విచారించి ఉంటుంది కదా! ఇంకేమైనా ఆస్తులు ఎవరికైనా రాసిచ్చారా అన్నది పట్టుకునేవారు కదా! ఈ కేసును ఏదో రకంగా మాజీ చైర్మన్ కరుణాకరరెడ్డికి పులమాలని విశ్వప్రయత్నం చేసి విఫలం అయ్యారు. ఈ అంశాలన్నిటినీ ప్రస్తావిస్తూ టీడీపీ నేత వర్ల రామయ్య ఈ కేసుకు సంబంధించి ఉన్నత స్థాయి జడ్జి ఒకరు సిఫారసు చేశారని చెప్పిన వీడియోను జగన్ ప్రదర్శించారు. ఆ జడ్జి టీడీపీకి దగ్గరగా ఉండేవారని అంటున్నారు. ఇప్పుడు ఆయనను కూడా విచారించవలసి ఉంటుంది కదా!అలాగే పరకామణి కేసులో ఆరోపణలు చేసిన లోకేశ్ తదితర మంత్రులను కూడా పిలిచి మాట్లాడి ఉండాలి కదా! ఇవేవీ ఎందుకు చేయలేదు! ఇక్కడే చంద్రబాబు సర్కార్ దొరికిపోతోంది. వేల కోట్ల రూపాయల మార్గదర్శి అక్రమ డిపాజిట్ల కేసును మాఫీ చేయించుకున్న ఈనాడు మీడియా పరకామణిలో డెబ్బేవేల రూపాయల చోరీ కేసు చాలా పెద్దదిగా భావిస్తున్నట్లుగా ఉంది. దీనిని జగన్ చిన్న కేసు అన్నారని రాయడం, పిమ్మట చంద్రబాబు మాట్లాడడం, సంబంధం లేని వివేకా హత్యకేసుకు ముడిపెట్టడం ఇదో వింతగా ఉంది.పరకామణి కేసు నిందితుడు తను చేసిన తప్పుకు పశ్చాతాపంగా తన ఆస్తులను రాసిస్తే, వందల కోట్ల స్కామ్ కేసులను ఎదుర్కుంటున్న చంద్రబాబు విచారణ ఎదుర్కోకుండా భయపడి ఆ కేసులను తానే ఎలా మాఫీ చేయించుకుంటున్నారు? ఎవరు ధర్మంగా ఉన్నట్లు అని కొందరు ప్రశ్నిస్తున్నారు. దీనికి జవాబు దొరుకుతుందా?. ఈ విషయాలతో పాటు ఏపీలో సాగుతున్న రెడ్ బుక్ అరాచకాలపై కూడా జగన్ గట్టిగా ప్రశ్నించి సిట్ల పేరుతో సాగుతున్న దర్యాప్తు తంతులను ఎండగట్టారు. ఈ విషయాలలో ఒక్కదానికి కూడా చంద్రబాబు లేదా ఇతర కూటమి నేతలు జవాబు ఇవ్వలేకపోయారు. అందుకే జగన్ వారిని రాజకీయంగా ర్యాగింగ్ చేశారని, రఫ్పాడించారని అనాల్సి వస్తోంది. -కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కేంద్రమంత్రి రామ్మోహన్‌కు టీడీపీ ఎంపీల భజన
సాక్షి, న్యూఢిల్లీ: పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు వైఫల్యంపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్న సమయంలో.. ఆయనను జాకీలు పెట్టి లేపేందుకు టీడీపీ ఎంపీలు నడుంబిగించారు. ఇందుకోసం రెండు రోజుల క్రితం ‘ఎక్స్’లో అనుకూలమైన ట్వీట్లు చేయగా.. సోమవారం రాత్రి ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయులు, బీకే పార్ధసారధి, నాగరాజు, ప్రసాదరావు, లక్ష్మీనారాయణ, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, రాజ్యసభ ఎంపీలు సాన సతీష్, బీద మస్తాన్‌రావు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. రెండు రోజుల క్రితం కేంద్ర మంత్రి కేవలం ఎల్లో మీడియాను పిలిపించుకుని ఆయనకు నచ్చిన వార్తలు వచ్చేలా ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు మీడియా సమావేశం బాధ్యతను ఎంపీలకు అప్పజెప్పారు. ఈసందర్భంగా లావు శ్రీకృష్ణదేవరాయులు మాట్లాడుతూ.. చాలా మంది చాలా రకాలుగా రామ్మోహన్ నాయుడుపై బురద జల్లుతున్నారన్నారు. సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసేవారికి సరైన అవగాహన ఉండదని, వాళ్లు ముందూ వెనకా తెలియకుండా మాట్లాడతారని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలు, సోషల్ మీడియా వాళ్లు పూర్తి వివరాలు తెలుసుకోకుండా బురద జల్లుతున్నట్లు చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా మంత్రిని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు, కేంద్ర మంత్రిగా సమాధానం చెప్పాల్సింది రామ్మోహన్ కదా? మీరెందుకు చెబుతున్నారని మీడియా ప్రశ్నించగా.. ‘‘పార్టీ పరంగా మేం చెప్పాల్సింది మేం చెబుతున్నాం, కేంద్ర మంత్రిగా ఆయన సమాధానం చెప్పాల్సిన చోట అంటే రాజ్యసభలో అందరికీ సమాధానం చెప్పారు. మేం మా వెర్షన్ మేం చెప్పాలి కాబట్టి మేం చెబుతున్నాం’’ అని లావు చెప్పుకొచ్చారు. -
ఎల్లో మీడియా ఏడుపు... జగన్‌కు దిష్టిచుక్క!
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు వస్తున్న జనసందోహాన్ని చూసి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నేతల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి ఈ పార్టీల నాయకులు జగన్‌పై, ఆయన పర్యటనలపై విమర్శలు చేయడం సహజం. కానీ స్వతంత్ర మీడియా పేరు చెప్పుకునే ఎల్లోమీడియా కూడా గుక్కపెట్టి రోదిస్తున్న తీరు మాత్రం జనంలో నగుబాటుకు గురవుతోంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5 వంటి సంస్థలు బరితెగించి చేస్తున్న చిల్లర విమర్శలు కాస్తా.. వారి దిగజారుడుతనానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. జగన్ కొద్ది రోజుల క్రితం ఒక వివాహానికి హాజరయ్యేందుకు అనంతపురం సమీపంలోని రాప్తాడుకు వెళ్లారు. ఆ సందర్భంగా ఏభైవేల మందికి పైగా జనం ఆయనకు స్వాగతం చెప్పారు. ఆయన కాన్వాయి వెంట పరుగెడుతూ జయజయధ్వానాలు చేశారు. ఎన్నికలై ఏడాదిన్నర కాలం కాకముందే ప్రజలకు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం విఫలమైందని స్పష్టమైనట్లు ఈ జనసందోహం చెబుతోంది. అదే సమయంలో ఇంత ప్రజాభిమానం కలిగిన నేత ఆధ్వర్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ ఎన్నికల్లో నిజంగానే ఓడిందా అన్న సంశయం చాలామందికి కలిగింది. ఏదో మతలబు జరిగిందని ఈవీఎంల ప్రభావమో, పోలింగ్ సమయం తరువాత పోలైనట్టుగా చెబుతున్న సుమారు ఏభై లక్షల అదనపు ఓట్ల మహత్యమో కావచ్చు కానీ ప్రజలు మాత్రం అప్పుడు, ఇప్పుడు జగన్‌వైపే ఉన్నారన్న మాటలూ వినిపిస్తున్నాయి. ఒక రాప్తాడు మాత్రమే కాదు.. తుపాను బాధితుల పరామార్శకు మచలీపట్నం వెళ్లినా అదే జన కెరటం. సత్తెనపల్లిలో ఒక పార్టీ నేత కుటుంబాన్ని పలకరించడానికి వెళ్లినా రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. కొన్ని నెలల క్రితం జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన రెడ్డిని కలిసేందుకు వెళ్లినప్పుడు కూడా నెల్లూరు నగరం అంతా కదిలివచ్చినంత జన తరంగం కనిపించింది. ఏపీలోనే కాదు.. తెలంగాణ రాజధాని హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా ఆయన అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే ఏమాటకామాట. తెలంగాణ పోలీసులు ఏపీ పోలీసుల మాదిరి కాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. ఎవరో ఒకరు రఫ్పా,రప్ఫా అని సినిమా డైలాగును పోస్టరు రూపంలో ప్రదర్శించినా తప్పుడు కేసు పెట్టే ఆలోచన చేయలేదు. ఏపీలో అయితే జగన్ అభిమానులు కదిలితే కేసు. మాట్లాడితే కేసుగా ఉంది పరిస్థితి. జగన్ మచిలీపట్నం టూర్ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలను సైతం పోలీసులు అడ్డుకున్నారు. పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్‌పై కేసులు పెట్టారు. నెల్లూరులో మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై కేసులు పెట్టారు. హైదరాబాద్‌లోనూ తరగని జగన్ అభిమానాన్ని చూసి తెలుగుదేశం పార్టీతోపాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5లు జీర్ణించుకోలేకపోయాయి. అసహ్యం పుట్టించేలా పిచ్చి రాతలు రాశాయి. టీవీ చానళ్లలో పిచ్చి వాగుడు వాగారు. ఇవి ఎంతవరకు వెళ్లాయంటే అర్జంట్‌గా జగన్‌పై కేసులను తేల్చేయాలట. వారు కోరుకున్న రీతిలో శిక్షించాలట. ఈ సందర్భంలో కొంతమంది టీడీపీ నేతలు చేసిన ప్రకటనలు వెగటు పుట్టించాయి. వర్ల రామయ్య వంటివారు ఏకంగా న్యాయమూర్తులకే విజ్ఞప్తి చేసినట్లు మాట్లాడారు. మరో చోటా నేత జగన్‌ను ఎన్ కౌంటర్ చేయాలని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం యాంకర్లుగా ఉన్న కొందరు పార్టీ కార్యకర్తలు జగన్ కోసం ఆ రకంగా రావడం ఏమిటని ప్రశ్నించారు. చాలాచాల అనుచిత వ్యాఖ్యలు చేశారు. జనాన్ని ఏపీ నుంచి తరలించారని ఏడుపుగొట్టు కూతలు కూశారు. జగన్ కోర్టుకు వెళ్ళినప్పుడు లోపల సన్నివేశాలు వీడియో తీయరాదు.అయినా కొందరు రహస్యంగా తీసి సోషల్ మీడియాలో పెట్టారు. జగన్ కోర్టు హాలులో నిలబడితే అదేదో తప్పు అన్నట్లుగా ప్రచారం చేశారు. కోర్టులో జగన్ సాక్ష్యుల స్థానాలలో కూర్చుని కనిపించారని మరొకరి ఆక్షేపణ. న్యాయమూర్తి రావడానికి ముందు ఎవరైనా కోర్టులో కూర్చోవచ్చు. దీనిపై వైసిపి నేత, మాజీ అదనపు ఆడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకరరెడ్డి చాలా సీరియస్ గా స్పందించారు. కోర్టులో వీడియోలు తీయడంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్ కేసులో అరెస్టు అయినప్పుడు ఆయనను హెలికాఫ్టర్‌లో విజయవాడకు తీసుకు రావాలని పోలీసు అధికారులు భావించారు.కాని చంద్రబాబు అందుకు అంగీకరించలేదు. బస్సులోనే ప్రయాణిస్తానని పట్టుబట్టారు. పోలీసులు ఒప్పుకుని నంద్యాల నుంచి విజయవాడకు తరలించారు. అది అప్పట్లో పోలీసులు వ్యవహరించిన పద్దతి. కాని ఇప్పుడేమో ఎలా ప్రవర్తిస్తున్నారో వేరే చెప్పనవసరం లేదు. చిలకలూరిపేట మరికొన్ని చోట్ల టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు బస్సు వద్ద హడావుడి చేశారు. నినాదాలు చేశారు. చంద్రబాబు విజయవాడ కోర్టుకు హాజరైనప్పుడు ఆయన కూడా తన లాయర్ పక్కన కూర్చున్న సంగతిని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. తదుపరి ఆయన కూడా లేచి నిలడ్డారు.ఆ సన్నివేశాలను ఎవరూ రికార్డు చేయలేదు. ఆరోగ్య సమస్యల పేరు చప్పి చంద్రబాబు హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నప్పుడు కూడా వైసీపీ ఎక్కడా అభ్యంతర వ్యాఖ్యలు చేయలేదని, అది తమ సంస్కృతి అని పొన్నవోలు అన్నారు. కాని ప్రస్తుతం టీడీసీ సోషల్ మీడియా ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చాక, ఆరోగ్య సమస్యలు ఏమయ్యాయో కాని రాత్రంతా గంటల తరబడి ర్యాలీ చేసి రాజమండ్రి నుంచి ఉండవల్లి కరకట్ట నివాసానికి చేరుకున్నారు. అప్పుడు ఈనాడు ‘‘జైలు నుంచి జనం గుండెల్లోకి’’ అని శీర్షిక పెట్టింది. దారి పొడవునా నీరా'జనాలు"అని రంకెలేసింది. చంద్రబాబుకు నిజంగా అన్ని ఆరోగ్య సమస్యలు ఉంటే తెల్లవార్లూ ర్యాలీ చేయవచ్చా అని ప్రశ్నించలేదు. జగన్ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు మాత్రం ఇదే పత్రిక ‘‘జగన్ మార్కు బలప్రదర్శన’’ అని ఏడుపుగొట్టు వార్త ఇచ్చింది. ఆయన అనుచరులు హల్ చల్ చేశారట. అంతకు ముందు బందరు ప్రాంతానికి వెళ్లినప్పుడైతే ‘‘అడుగడుగునా అరాచకమే’’ అంటూ నీచమైన శీర్షిక పెట్టింది. హైవేపై గుమికూడదని పోలీసులు షరతు పెట్టడాన్ని కూడా సమర్థించి తన లేకి బుద్ది ప్రదర్శించుకుంది. చంద్రబాబు హైవేలపై ర్యాలీ తీసినప్పుడు, పుంగనూరు వంటి చోట్ల టీడీపీ కార్యకర్తలు పోలీస్ వ్యాన్‌ను దగ్ధం చేసినప్పుడు మాత్రం ఈ మీడియాకు ఎక్కడా తప్పు కనిపించలేదు. చంద్రబాబు కందుకూరులో రోడ్డు మధ్యలో మీటింగ్ పెట్టినప్పుడు తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది మరణించినా అది పోలీసుల వైఫల్యం అని ప్రచారం చేసింది. మరో పత్రిక ఆంధ్రజ్యోతి యజమాని రాధాకృష్ణ తన వికృతత్వాన్ని అంతా ప్రదర్శించి జగన్‌కు హైదరాబాద్‌లో ప్రజాస్పందనపై ఒక వ్యాసం రాసి అక్కసు వెళ్లగక్కారు. చంద్రబాబుపై అసలు కేసులే లేనట్లు, బెయిల్‌పై లేనట్లు ఆ విషయాలేవి ప్రస్తావించకుండా, జగన్ కేసులపైనే నీచాతినీచంగా రాసుకుని స్వామి భక్తి ప్రదర్శిస్తే, సోషల్ మీడియాలో పలువురు ఆయనను ఉతికి ఆరేశారు.అయినా వారేమి సిగ్గుపడే పరిస్థితి లేదనుకోండి. ఏది ఏమైనా టీడీపీ ఎంత ఘోరంగా మాట్లాడినా, వారికి బానిసత్వం చేసే ఎల్లో మీడియా ఎంతగా ఏడ్చి పెడబొబ్బలుపెట్టినా, జగన్‌కు దిష్టి తీసిన చందమేనని ఆయన అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
చంద్రబాబు, ఎల్లో మీడియాకు జగదీష్‌రెడ్డి కౌంటర్
సాక్షి, యాదాద్రి భువనగిరి జిల్లా: చంద్రబాబు, ఎల్లో మీడియాకు మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. దావోస్ పర్యటనపై ఎల్లో మీడియాది అత్యుత్సాహం అంటూ చురకలు అంటించారు. భువనగిరిలో ఆయన మాట్లాడుతూ.. ‘‘తెల్లారకముందే చంద్రబాబు స్టాల్స్ వద్దకు వెళ్లాడట. అప్పటికే సెక్రటరీలు రాకపోతే ఫోన్ చేశారట. ఇంతకన్నా సిగ్గులేకుండా మాట్లాడటం ఇంకోటి ఉంటుందా?’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.‘‘చీమ కూడా దూరని హోటల్లో బాబుకు నిద్రపట్టలేదట. బాబు సెక్రటరీలకు దుప్పట్లు ఇవ్వలేదట. ఇంతకన్నా నిస్సిగ్గు ఇంకామైనా ఉంటుందా? అంటూ జగదీష్‌రెడ్డి వ్యాఖ్యానించారు. -
రాధాకృష్ణ.. పిచ్చి రాతలు మానుకో: పొన్నవోలు సీరియస్
సాక్షి, హైదరాబాద్: న్యాయవ్యవస్థను కించపరిచే విధంగా ఎల్లో మీడియా వార్తలు ప్రచురించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణా పిచ్చి రాతలు మానుకోవాలని హితవు పలికారు. మీడియా ముసుగులో ఫేక్ పోస్టులు పెట్టే ఎల్లో మీడియాపై చట్టపరంగా ముందుకు వెళ్తాం’ అని హెచ్చరించారు.వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్ జగన్ మొన్న హైదరాబాద్‌కు వస్తే ఆయనను చూసేందుకు వేలాది మంది అభిమానులు వచ్చారు. దానిపై ఆంధ్రజ్యోతి తప్పుడు వార్తలు ప్రచురించింది. హైదరాబాద్‌కు జగన్ వస్తే వేల మంది ఆంధ్ర నుంచి వచ్చారని ఆంధ్రజ్యోతి తప్పుడు వార్తలు రాసింది. అలా రావాలంటే ఎన్ని వందల బస్సులు పెట్టాలో అర్థం చేసుకోండి. కోర్టు వారి అనుమతి లేకుండా వీడియోలు తీసి.. ఎలా ప్రచారం చేస్తారు?. చెత్త పలుకులు రాసే రాధాకృష్ణ అప్డేట్ కావాలి. రాధాకృష్ణ ఎప్పటికప్పుడు నేర్చుకొని వార్తలు రాయాలి. ఆంధ్రజ్యోతి, టీవీ5 జర్నలిజం కించపరిచే విధంగా వార్తలు ప్రచురిస్తున్నాయి. మీడియా ముసుగులో ఫేక్ పోస్టులు పెట్టే ఎల్లో మీడియాపై చట్టపరంగా ముందుకు వెళ్తాం.రాధాకృష్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నాడా? న్యాయవ్యవస్థను నడుపుతున్నాడా? అని ప్రశ్నించారు. ఆంధ్రజ్యోతి.. కోర్టులో ఒక విధంగా, కోర్టు బయట ఒక విధంగా తప్పుడు వార్తలు రాసింది. జగన్ ఎక్కడ అడుగుపెట్టినా జన సునామే. జగన్‌ను ఎన్కౌంటర్ చేయాలని చెత్త డిబేట్లు పెట్టి మాజీ ముఖ్యమంత్రిపై చట్ట విరుద్ధంగా మాట్లాడుతున్నారు. మీ అంతు చూస్తాం. ఒక పార్టీ అధ్యక్షుడిని, మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఎన్కౌంటర్ చేయాలి అనడం అహంకారానికి నిదర్శనం. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు న్యాయబద్ధంగా పాలించారు. ఇవాళ ఆంధ్రాలో కొన్ని గ్రామాల్లో గ్రామాలను వదిలి పారిపోయే పరిస్థితికి చంద్రబాబు పాలన తీసుకొచ్చారు. -
పెంపుడు మీడియా..పెయిడ్ చిలుకలు.. విధ్వంసంపై విష ప్రచారం
-
కోర్టు వీడియోలు రిలీజ్ చేయడం నేరం: టీజేఆర్
సాక్షి, తాడేపల్లి: ఎల్లో మీడియాకు ప్రజా సమస్యలు ఏమాత్రం పట్టదు.. ఎల్లోమీడియాకు విపరీతమైన కుల గజ్జి పట్టింది అంటూ ఘాటు విమర్శలు చేశారు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. వైఎస్సార్సీపీ వైఎస్ జగన్ సీబిఐ కోర్టులో ఉన్నప్పుడు వీడియో ఎలా తీశారు? అని ప్రశ్నించారు. ఆ వీడియోలను ప్రసారం చేసిన ఎల్లోమీడియా, సోషల్ మీడియాపై కేసులు పెట్టాలి అని డిమాండ్ చేశారు. కుట్ర, చంద్రబాబు కవల పిల్లలు అంటూ సెటైర్లు వేశారు. మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్ జగన్ కోర్టులో ఉన్న వీడియోలు రిలీజ్ చేయటం నేరం. దీనిపై కోర్టు సుమోటోగా కేసు నమోదు చేయాలి. దొంగతనంగా వీడియోలు తీసిన వారిపై చర్యలు తీసుకోవాలి. జడ్జి గారిని కూడా వీడియో తీసి దాన్ని ఎల్లో మీడియాలో ప్రసారం చేశారు. జడ్జిని కూడా చూపుతూ వీడియోలు తీయటం తీవ్రమైన నేరం. ఆ ఛానళ్లపై కోర్టు చర్యలు తీసుకోవాలి. వైఎస్ జగన్ అంటే ఎల్లో మీడియాకు భయం అందుకే.. ప్రతి నిమిషం జగన్ నామస్మరణే చేస్తున్నారు.ఎల్లోమీడియాకు విపరీతమైన కుల గజ్జి పట్టింది. జగన్ కోసం కార్యకర్తలు, అభిమానులు వచ్చినా పచ్చ బ్యాచ్ తట్టుకోలేక పోతోంది. హైదరాబాదు సీబిఐ కోర్టుకు జగన్ వెళ్తే బల ప్రదర్శన అంటూ ఎల్లోమీడియా దుష్ప్రచారం చేసింది. ఎల్లోమీడియా, సోషల్ మీడియాపై కేసులు పెట్టాలి. దీనిపై కోర్టు సుమోటోగా కేసు నమోదు చేయించాలి. చివరికి కోర్టు ప్రొసీడింగ్స్ ను కూడా దొంగతనంగా చిత్రీకరిస్తారా?. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు మేము కూడా వీడియో తీయించవచ్చు. కానీ అలాంటి దుర్మార్గపు పనులు మేము చేయలేదు. జగన్‌కు వచ్చినట్టు చంద్రబాబు, లోకేష్‌కు ఏనాడూ జనం రారు. ఏ రాష్ట్రం వెళ్లినా జగన్‌కు అభిమానులు ఉన్నారు.విజయవాడలో ఒక్కడే బైకు మీద వెళ్లినా జనం తండోపతండాలుగా వస్తారు. అదంతా జగన్ మీద ఉన్న అభిమానం. జగన్ తన సొంత డబ్బుతో విమాన ఖర్చు పెట్టుకున్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ తిరుగుతున్న స్పెషల్ ఫ్లైట్ల ఖర్చు ఎవరిది?. ప్రజా సొమ్ముతోనే వారు ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్నారు. చివరికి లండన్ వెళ్లినా ప్రభుత్వ సొమ్మునే ఖర్చు చేశారు. ప్రజా సొమ్ముతో విలాసాలు చేయటంలో చంద్రబాబుకు మించిన వారు లేరు అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
Karumuri Venkat Reddy: 5 కోట్లు పరువునష్టం దావా? వెంకటరెడ్డి ఫుల్ క్లారిటీ
-
బాబు దుష్ప్రచారం.. చిన్న అప్పన్న నా PA కాదు..
-
జగన్ కోసం తండోపతండాలుగా జనాలు... ABN, TV5 థంబ్ నైల్స్ పై అంబటి మాస్ ర్యాగింగ్
-
తప్పుడు వార్తలకు చెంపదెబ్బ.. ఎల్లో ఉగ్రవాదుల తాట తీసిన ఈశ్వర్
-
తిక్క కుదిరిందా..! ఇకనైనా మారు బాబు
-
వైఎస్ జగన్‌పై.. కుమ్మక్కై అక్రమ కేసులు.. కుట్రలు పన్ని దుష్ప్రచారం
సాక్షి, అమరావతి: పదిహేనేళ్ల క్రితం కాంగ్రెస్, టీడీపీలు ఒక్కటై కుట్రపూరితంగా వైఎస్ జగన్‌పై తప్పుడు కేసులు బనాయించాయి. ఓదార్పు యాత్ర చేయడానికి వీల్లేదన్న కాంగ్రెస్‌తో తెర వెనుక జట్టుకట్టిన చంద్రబాబు తన వాళ్లు కూడా తప్పుడు కేసులు పెట్టేలా చక్రం తిప్పారు. రాజకీయంగా వైఎస్ జగన్‌ను అణగదొక్కాలన్న కాంగ్రెస్, చంద్రబాబు కుట్రలకు వంతపాడుతూ ఎల్లో మీడియా నిత్యం పచ్చి అబద్ధాలు, కట్టుకథలతో తప్పుడు రాతలు రాసింది.మహానేత వైఎస్సార్ జీవించి ఉన్నంత కాలం కాంగ్రెస్ అప్పటి అధినేత్రి సోనియా గాంధీకి, అధిష్ఠానానికి మంచివాడిలా కనిపించిన వైఎస్ జగన్.. వైఎస్సార్ హఠాత్ మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన ఆయన అభిమానులను పరామర్శించేందుకు ఓదార్పు యాత్ర చేపట్టడంతోనే నచ్చకుండాపోయారు. నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఓవైపు కేంద్రంలో చేతిలో ఉన్న అధికార దుర్వినియోగంతో, మరోవైపు టీడీపీతో కుమ్మక్కయి రాజకీయంగా దిగజారి వైఎస్ జగన్‌పై అక్రమ కేసులు నమోదు చేసింది.16 నెలలు జైల్లో అక్రమంగా నిర్బంధించింది. అయినా, వైఎస్ జగన్ వెరవలేదు. 2009 నుంచి పదేళ్ల పాటు తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రజల కోసం నిలిచారు. అధికారంలోకి వచ్చాక 2019–24 మధ్య జనం మెచ్చేలా సుపరిపాలన అందించారు. ఆత్మీయత.. విశ్వసనీయత.. దార్శనికత.. పారదర్శకత.. మానవీయత కలగలసిన ప్రజా నాయకుడిగా ఎదిగారు. దీంతో వైఎస్ జగన్‌పై మళ్లీ కుట్రలు, కుయుక్తులకు తెరలేపారు.గత నెల యూరప్ పర్యటనకు అనుమతిస్తూ కోర్టు సూచన మేరకు మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ గురువారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని న్యాయస్థానం ఎదుట హాజరుకానున్నారు. కోర్టు అనుమతితో వైఎస్ జగన్ గత నెల యూరప్ పర్యటనకు వెళ్లారు. అనుమతి మంజూరు చేసే సమయంలో పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత ఈ నెల 14లోపు కోర్టు ఎదుట హాజరుకావాలని జడ్జి సూచించారు. నేరుగా హాజరైతే తగిన ఏర్పాట్లు చేయడం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతుందని, ఆన్లైన్లో హాజరుకు అవకాశం ఇవ్వాలని జగన్ మెమో దాఖలు చేశారు. 16 నెలల అక్రమ నిర్బంధం అనంతరం విడుదలైన వైఎస్ జగన్‌కు అపూర్వ స్వాగతం పలికిన అభిమానులు (ఫైల్) అయితే, నేరుగా హాజరుకావాలని నిర్ణయించుకుని ఆ మెమోను వెనక్కు తీసుకున్నారు. ఈ సందర్భంగా 21లోగా హాజరుకావాలని న్యాయమూర్తి సూచించారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ గురువారం హాజరుకానున్నారు. దీనిపైన కూడా ఎల్లో మీడియా, టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. మద్యం, స్కిల్ డెవలప్మెంట్, తదితర కేసుల్లో బెయిల్‌పైన ఉన్న సీఎం చంద్రబాబే అసలు దోషి. బెయిల్‌పైన ఉండే చంద్రబాబు సీఎంగా కొనసాగుతున్నారు. దీన్ని విస్మరించి జగన్ లక్ష్యంగా ఎల్లో మీడియా, టీడీపీ నేతలు దుష్ప్రచారం సాగిస్తుండటంపై రాజకీయ పరిశీలకుల్లో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. ఓదార్పు యాత్రలో ఓ అవ్వ ఆత్మీయత(ఫైల్) తప్పుడు కేసులేనని అంగీకరించిన శంకర్రావు, ఆజాద్వైఎస్ జగన్మోహన్రెడ్డిని అణగదొక్కేందుకు చంద్రబాబు నాయుడుతో జట్టు కట్టిన కాంగ్రెస్ అధిష్ఠానం... తమ ఎమ్మెల్యే శంకర్రావు ద్వారా తప్పుడు ఆరోపణలతో హైకోర్టులో కేసు వేయించింది. దీనికి టీడీపీ నుంచి ఎర్రన్నాయుడు, అశోక్ గజపతిరాజు జత కలుస్తూ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే, ఈ కుమ్మక్కు కొంతకాలం తర్వాత కాంగ్రెస్ నేతల మాటల్లోనే స్పష్టమైంది. ‘‘వైఎస్ జగన్‌ను రాజకీయంగా వేధించేందుకే కేసులు వేశా. ఆయనపై కేసులు వేసేందుకు మా పార్టీ చీఫ్ (అప్పటి) సోనియాగాంధీ పేపర్లు పంపి సంతకాలు చేయమన్నారు.నేను చేశానంతే’’ అని శంకర్రావు, ‘‘రాజకీయంగా వైఎస్ జగన్‌ను ఇబ్బంది పెట్టాలనే అక్రమ కేసులు వేశాం’’ అని కాంగ్రెస్ మాజీ అగ్ర నేత గులాం నబీ అజాద్ వేర్వేరు సందర్భాల్లో మీడియా ఎదుట కుండబద్దలు కొట్టారు. అంతేకాదు, సోనియా మాట విని ఓదార్పు యాత్ర చేయకుండా కాంగ్రెస్‌లోనే ఉండి ఉంటే 2014కు ముందే వైఎస్ జగన్ సీఎం అయ్యేవారని స్పష్టం చేయడం గమనార్హం. ఇలా, వైఎస్ జగన్మోహన్రెడ్డిని అణగదొక్కేందుకు దశాబ్దంన్నర కిందట చేసిన కుట్రలను నేటికీ టీడీపీ, ఎల్లోమీడియా కొనసాగిస్తుండడం గమనార్హం.‘‘వైఎస్ జగన్‌ను రాజకీయంగా వేధించేందుకే కేసులు వేశా. ఆయనపై కేసులు వేసేందుకు మా పార్టీ చీఫ్ (అప్పటి) సోనియాగాంధీ పేపర్లు పంపి సంతకాలు చేయమన్నారు. నేను చేశానంతే’’-కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు బతికుండగా పలుమార్లు చేసిన వ్యాఖ్యలు ఇవీ... ‘‘రాజకీయంగా వైఎస్ జగన్‌ను ఇబ్బంది పెట్టాలనే అక్రమ కేసులు వేశాం. సోనియా గాంధీ మాట విని ఓదార్పు యాత్ర చేయకుండా కాంగ్రెస్‌లోనే ఉండి ఉంటే 2014కు ముందే వైఎస్ జగన్ సీఎం అయ్యేవారు’ - ఇవీ కాంగ్రెస్ మాజీ సీనియర్ నాయకుడు గులాంనబీ ఆజాద్ గతంలో చేసిన వ్యాఖ్యలు -
అటకెక్కుతున్న బాబు కేసులు
చంద్రబాబే కర్త, కర్మ, క్రియగా.. స్కిల్ స్కామ్, అసైన్డ్, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్, మద్యం, ఇసుక కుంభకోణాలకు పాల్పడ్డారని సీఐడీ ఆధారాలతో సహా ఇప్పటికే నిగ్గు తేల్చింది. అన్ని కేసుల్లోనూ దర్యాప్తు సంస్థ చార్జ్షీట్లు కూడా దాఖలు చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంపై కేంద్ర సంస్థ ఈడీ కూడా దర్యాప్తు చేపట్టింది. అక్రమ నిధులను షెల్ కంపెనీల ద్వారా సింగపూర్‌కు తరలించినట్లు గుర్తించడంతో డిజైన్ టెక్కు చెందిన రూ.31.20 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లను సైతం జప్తు చేసింది. చంద్రబాబు సన్నిహితులు, షెల్ కంపెనీల ప్రతినిధులు సుమన్ బోస్ తదితరులను అరెస్టు చేసింది. రాజ్యాంగబద్ధ సంస్థ ‘కాగ్’ కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, ఖజానాకు గండి పడిందని నిర్ధారించింది. 2024లో అధికారంలోకి వచ్చిన వెంటనే అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ.. సాక్షులు, అధికారులను బెదిరిస్తూ తనపై నమోదైన కేసులను నీరుగార్చే కుట్రలకు చంద్రబాబు తెర తీశారు. న్యాయస్థానం ఆదేశించిన విధంగా వివరణలతో చార్జ్షీట్లు దాఖలు చేయకుండా కేసులను అటకెక్కిస్తున్నారు. చంద్రబాబు ఒకవైపు తనపై ఉన్న కేసులను తొక్కిపెట్టి నీరుగారుస్తూ... మరోవైపు కాంగ్రెస్–టీడీపీ కుమ్మక్కు కుట్రలను కొనసాగిస్తూ ఎల్లో మీడియా ద్వారా మాజీ సీఎం వైఎస్ జగన్‌పై విష ప్రచారాన్ని సాగిస్తున్నారు. గత నెలలో యూరప్ పర్యటనకు న్యాయమూర్తి అనుమతిస్తూ.. జగన్ తన లండన్ పర్యటన ముగిశాక కోర్టుకు హాజరు కావాలన్న సూచన మేరకు వైఎస్ జగన్ నేడు కోర్టుకు హాజరు కానున్నారు. స్కిల్ కుంభకోణం కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్తున్న చంద్రబాబునాయుడు (ఫైల్) దీన్ని చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా వక్రీకరిస్తూ భారీగా దుష్ప్రచారానికి పాల్పడుతోంది. కేసుల విచారణలో భాగంగా ఆరేళ్ల తరువాత ఆయన కోర్టుకు వస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తోంది. నిజానికి స్కిల్, లిక్కర్, ఫైబర్‌నెట్, ఇన్నర్ రింగ్ రోడ్డు, అసైన్డ్ భూ కుంభకోణం, ఇసుక కుంభకోణాలకు పాల్పడిందే చంద్రబాబు. అధికారాన్ని వినియోగించుకుని వాటి నుంచి తప్పించుకోవడానికి వ్యవస్థలను మేనేజ్ చేçస్తున్నదే చంద్రబాబు.సాక్షి, అమరావతి: భూ దోపిడీ, భారీ కుంభకోణాలకు ముఖ్యమంత్రి చంద్రబాబే బ్రాండ్ అంబాసిడర్ అన్నది నిర్వివాదాంశం. ముఖ్యమంత్రి పదవిని తన దోపిడీకి సాధనంగా చేసుకున్న చరిత్ర ఆయన సొంతం. 2014–19 మధ్య టీడీపీ హయాంలో పచ్చ ముఠాలు సాగించిన దోపిడీలే అందుకు తార్కాణం. చంద్రబాబే కర్త, కర్మ, క్రియగా.. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అసైన్డ్, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్, మద్యం, ఇసుక కుంభకోణాలకు పాల్పడ్డారని సీఐడీ ఆధారాలతో సహా నిగ్గు తేల్చింది. స్కిల్ కుంభకోణంలో చంద్రబాబును అరెస్టు చేయగా, రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో 52 రోజులపాటు రిమాండ్ ఖైదీగా ఉన్న అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. అన్ని కేసుల్లోనూ సీఐడీ చార్జ్షీట్లు కూడా దాఖలు చేసింది. 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఆ కేసుల దర్యాప్తును పక్కనపెట్టేసింది. న్యాయస్థానం కోరిన వివరణలతో చార్జ్‌షీట్ దాఖలు చేయకుండా కేసులను అటకెక్కించింది. గతంలో సీఆర్పీసీ 164 కింద వాంగ్మూలాలు ఇచ్చిన అధికారులను బెదిరించి వారితో నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేయిస్తోంది. అన్ని కేసుల్లోనూ చంద్రబాబు పేరును తొలగించేందుకు కార్యాచరణను వేగవంతం చేసింది. ఢిల్లీ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా పర్యవేక్షణలో డీజీపీ, సీఐడీ చీఫ్ తదితరులు చంద్రబాబుపై కేసులను నీరుగార్చడమే ఏకైక కర్తవ్యంగా కుట్రను తీవ్రతరం చేశారు. 2014–19 మధ్య ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు బరితెగించి సాగించిన కుంభకోణాలివిగో..!సీమెన్స్ కంపెనీ ముసుగులో దోపిడీ షెల్ కంపెనీల ద్వారా నిధుల మళ్లింపుటీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబే కుట్రదారు, లబ్ధిదారుగా స్కిల్ కుంభకోణానికి తెర తీశారు. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి ఏమాత్రం తెలియకుండా ఆ కంపెనీ పేరుతో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా మోసగించి ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. రూ.3,300 కోట్ల ప్రాజెక్టును కాగితాలపై చూపించి సీమెన్స్ కంపెనీ 90 శాతం నిధులు సమకూరుస్తుందంటూ బుకాయించి రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులిచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే సీమెన్స్ ఒక్క రూపాయి ఇవ్వకుండానే ప్రభుత్వ వాటా 10 శాతం కింద జీఎస్టీతో కలిపి మొత్తం రూ.371 కోట్లను అడ్డగోలుగా చెల్లించేశారు. ఆ నిధులను షెల్ కంపెనీల ద్వారా హైదరాబాద్‌లోని చంద్రబాబు ప్యాలస్‌కు తరలించారు. ఈ అవినీతి నెట్‌వర్క్‌ను సీఐడీ పక్కా ఆధారాలతో ఛేదించింది. ఈ కేసులో చంద్రబాబును ఏ–1గా పేర్కొంటూ చార్జ్‌షీట్ నమోదు చేసింది. ఐపీసీ సెక్షన్లు 120(బి), 166, 167, 418, 420, 465, 468, 471, 477(ఏ), 409, 201, 109 రెడ్‌విత్ 34, 37లతోపాటు అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 13(2) రెడ్‌విత్ 13(1) (సి), (డి) కింద అభియోగాలు నమోదు చేసి 2023 సెపె్టంబరు 9న చంద్రబాబును అరెస్టు చేసింది. సీఐడీ అధికారుల రిమాండ్ నివేదికతో ఏకీభవించిన ఏసీబీ న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించింది. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో 52 రోజులపాటు రిమాండ్ ఖైదీగా ఉన్న అనంతరం బెయిల్‌పై విడుదల అయ్యారు. రాజ్యాంగబద్ధ సంస్థ కం్రప్టోలర్ అండ్ ఆడిటర్( కాగ్) కూడా చంద్రబాబు హయాంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నిర్ధారించింది. మద్యం భూతం చంద్రబాబే! సీఐడీ కేసులో ఇప్పటికీ బెయిల్‌పైనే బాబు మద్యం దందా డాన్ చంద్రబాబేనని రాష్ట్రంలో 2014–19 మధ్య సాగిన మద్యం దోపిడీ నిరూపిస్తోంది. తన బినామీలు, సన్నిహితుల మద్యం కంపెనీల ముసుగులో ఖజానాకు భారీగా గండి కొట్టారు. నిబంధనలకు విరుద్ధంగా అస్మదీయుల కంపెనీలకు అడ్డగోలు లబ్ధి కలిగించారు. అందుకోసం ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు స్వయంగా సంతకాలు చేసి భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. తద్వారా ఖజానాకు ఏటా రూ.1,300 కోట్ల చొప్పున 2015 నుంచి 2019 వరకు రూ.5,200 కోట్ల మేర ఆదాయానికి తూట్లు పొడిచారు. ఎంఆర్పీ కంటే 20 శాతం అధిక ధరలకు మద్యం విక్రయాలు సాగించి ఐదేళ్లలో రూ.20 వేల కోట్లు కొల్లగొట్టారు. వెరసి గతంలో టీడీపీ హయాంలో ఏకంగా రూ.25 వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారు. ఈ బాగోతం ఆధారాలతో సహా బయటపడటంతో 2023లోనే సీఐడీ కేసు నమోదు చేసింది. 2014–19 టీడీపీ హయాంలో సాగించిన మద్యం దోపిడీ కేసులో ప్రధాన నిందితుడు చంద్రబాబే. సీఐడీ ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేసిన ఆ కేసులో చంద్రబాబు ఇప్పటికీ బెయిల్‌పైనే ఉండటం గమనార్హం. 2023లో డిస్టిలరీస్ ఎండ్ బేవరేజస్ కార్పొరేషన్ కమిషనర్ డి.వాసుదేవరెడ్డి ఫిర్యాదు మేరకు చంద్రబాబు, కొల్లు రవీంద్ర, ఐఎస్ శ్రీనరేష్ తదితరులపై కేసు నమోదు సీఐడీ అధికారులు కేబినెట్ కళ్లుగప్పి.. 2014–19 మధ్య మద్యం విధానం ముసుగులో చంద్రబాబు యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారు. 2012 నుంచి అమలులో ఉన్న ప్రివిలేజ్ ఫీజును నిబంధనలకు విరుద్ధంగా రద్దు చేశారు. ఆర్థిక శాఖ, కేబినెట్ ఆమోదం లేకుండానే చాపకింద నీరులా పన్నాగాన్ని అమలు చేశారు. చంద్రబాబు ఆమోదంతోనే ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ గుట్టుగా జీవో జారీ అయ్యింది. దాదాపు 200 రకాల బ్రాండ్లను మార్కెట్లో ప్రవేశపెట్టి మద్యం ప్రియుల ఆరోగ్యంతో చెలగాటమాడింది చంద్రబాబు ప్రభుత్వమే. రాష్ట్రంలో 20 మద్యం డిస్టిలరీలు ఉండగా, వాటిలో 14 డిస్టిలరీలకు చంద్రబాబు ప్రభుత్వమే అనుమతులు ఇవ్వడం గమనార్హం. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు 2019–24 మద్య రాష్ట్రంలో కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వ లేదు.ఉచిత ఇసుక ముసుగులో దోపిడీ రూ.10 వేల కోట్లు కొల్లగొట్టిన ఎల్లో గ్యాంగ్ 2014–19 మధ్య టీడీపీ హయాంలో యథేచ్ఛగా ఇసుక దోపిడీ కోసం చంద్రబాబు బరితెగించారు. కేంద్ర చట్టం, గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాలనే కాదు రాష్ట్ర కేబినెట్‌ను కూడా చీకట్లో పెట్టి మరీ ఏకంగా రూ.10 వేల కోట్ల ఇసుక దోపిడీకి పాల్పడినట్టు సీఐడీ నిర్ధారించింది. ఈ కేసులో చంద్రబాబుతోపాటు అప్పటి మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పీతల సుజాత తదితరులపై కేసు నమోదు చేసింది. నాడు టీడీపీ అధికారంలోకి రాగానే ఇసుక రీచ్‌లను రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ద్వారా మహిళా సమాఖ్యలకు అప్పగించినట్లు కథ నడిపింది. అయితే ఈ విధానం ద్వారా ఆశించినంత దోపిడీ సాధ్యం కాదని గ్రహించడంతో రెండు నెలల్లోనే టెండర్ల ద్వారా ఇసుక రీచ్ కేటాయింపు విధానాన్ని పక్కన పెట్టి ‘ఉచిత ఇసుక విధానం’ దొడ్డిదారిన తెచ్చారు. టీడీపీ పెద్దల బినామీలు, సన్నిహితులు, ఆ పార్టీ ప్రజాప్రతినిధులు ఇసుక రీచ్‌లను గుప్పిట పట్టి యథేచ్చగా దోపిడీకి పాల్పడ్డారు. ఓటుకు కోట్లు రింగ్ మాస్టర్.. రాష్ట్ర విభజన అనంతరం 2015లో తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నగదు వెదజల్లి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ చంద్రబాబు అక్రమాలకు పురిగొల్పారు. అందుకు అప్పటి టీడీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ద్వారా నామినేటెడ్ సభ్యుడు స్టీఫెన్‌సన్‌తో బేరసారాలు సాగించారు. సూట్‌కేసులో రూ.కోట్ల నగదును పంపారు. స్టీఫెన్‌సన్‌తో ఫోన్లో చంద్రబాబు మాట్లాడటం.. మావాళ్లు బ్రీఫ్డ్ మీ..! అని హామీ ఇవ్వడం ఆడియో వీడియో ఆధారాలతో సహా బట్టబయలైంది. ప్రజాస్వామ్య ప్రక్రియను అపహాస్యం చేస్తూ చంద్రబాబు వ్యవహరించిన తీరుపై సర్వత్రా తీవ్ర విభ్రాంతి వ్యక్తమైంది.ఫైబర్ నెట్ స్కామ్ మాస్టర్ మైండ్ బాబే బినామీ కంపెనీకి అడ్డగోలుగా కాంట్రాక్టు అస్మదీయులకు ప్రాజెక్టులు కట్టబెట్టి ప్రజాధనాన్ని కొల్లగొట్టడంలో చంద్రబాబు మాస్టర్‌మైండ్ అనేందుకు ఫైబర్ నెట్ కుంభకోణమే తార్కాణం. 2014–19 మధ్య టీడీపీ హయాంలో యథేచ్ఛగా సాగిన దోపిడీ పర్వంలో ఫైబర్ నెట్ స్కామ్ మరో అంకం. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఈ ప్రాజెక్టును చంద్రబాబు తన సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీకి కట్టబెట్టి నిధులు కొల్లగొట్టారని సీఐడీ పూర్తి ఆధారాలతో నిగ్గు తేల్చింది. ఈ స్కామ్‌లో ఏ 1గా చంద్రబాబు, ఏ 2గా టెరాసాఫ్ట్ కంపెనీ ఎండీ వేమూరి హరికృష్ణ, ఏ3గా ఏపీ ఫైబర్‌నెట్ కార్పొరేషన్, ఇన్‌క్యాప్ సంస్థల అప్పటి ఎండీ కోగంటి సాంబశివరావులతోపాటు మరికొందరిని నిందితులుగా పేర్కొంది. వారిపై ఐపీసీ సెక్షన్లు 166, 167, 418, 465, 468, 471, 409, 506 రెడ్ విత్ 120(బి)లతోపాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 13(2), రెడ్ విత్ 13(1)(సి)(డి) ప్రకారం కేసు నమోదు చేసింది. ఫైబర్‌నెట్ ప్రాజెక్ట్ పేరుతో చంద్రబాబు బృందం ప్రజాధనాన్ని ఎలా కొల్లగొట్టిందో సీఐడీ తన చార్జ్‌షీట్‌లో సవివరంగా వివరించింది. బ్లాక్ లిస్టులో ఉన్న కంపెనీకి..! టెరాసాఫ్ట్ కంపెనీకి అడ్డగోలుగా ఫైబర్‌నెట్ ప్రాజెక్ట్‌ను కట్టబెట్టడం ద్వారా చంద్రబాబు యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారు. మొత్తం రూ.2 వేల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు మొదటి దశలో రూ.333 కోట్ల విలువైన పనుల్లో అక్రమాలకు బరితెగించారు. వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్‌కే ఈ ప్రాజెక్టును అప్పగించాలని ముందే నిర్ణయించుకుని పక్కాగా కథ నడిపారు. అందుకోసం వేమూరి హరికృష్ణ ప్రసాద్‌ను ఏపీ ఈ–గవర్నింగ్ కౌన్సిల్లో సభ్యుడిగా చేర్చారు. నిబంధనలను విరుద్ధంగా ఫైబర్‌నెట్ టెండర్ల మదింపు కమిటీలో సభ్యుడిగా కూడా నియమించారు. ఎలాంటి సర్వే చేపట్టకుండానే సరఫరా చేయాల్సిన పరికరాలు, వాటి నాణ్యతను ఖరారు చేసి ప్రాజెక్ట్ విలువను అమాంతం పెంచేశారు. ఈ ప్రాజెక్ట్ టెండర్ల ప్రక్రియ నాటికి టెరాసాఫ్ట్ బ్లాక్ లిస్ట్‌లో ఉంది. పౌర సరఫరాల శాఖకు ఈ–పోస్ యంత్రాల సరఫరాలో విఫలం కావడంతో ఆ కంపెనీని బ్లాక్ లిస్టులో చేర్చారు. చంద్రబాబు ప్రభుత్వం ఆ కంపెనీని బ్లాక్ లిస్టు నుంచి తొలగించి పోటీలో ఉన్న పలు కంపెనీలను పక్కకు తప్పించింది. అభ్యంతరాలను లెక్క చేయకుండా టెరాసాఫ్ట్‌కే ప్రాజెక్టును కట్టబెట్టారు. టెండర్లు పారదర్శకంగా నిర్వహించాలని పట్టుబట్టిన అధికారి బి.సుందర్‌ను హఠాత్తుగా బదిలీ చేసి తమకు అనుకూలమైన వారిని నియమించారు. అమరావతిలో అసైన్డ్ భూదోపిడీ రూ.5,500 కోట్ల విలువైన 1,100 ఎకరాలు హస్తగతం 2014లో అధికారంలోకి రాగానే రాజధాని అమరావతి ముసుగులో చంద్రబాబు భారీ భూ దోపిడీకి పాల్పడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులను భయభ్రాంతులకు గురి చేసి వారి అసైన్డ్ భూములను కొల్లగొట్టారు. రికార్డులు తారుమారుచేసి ప్రభుత్వ భూములను చెరబట్టారు. ప్రైవేటు భూములను హస్తగతం చేసుకున్నారు. ఏకంగా రూ.5,500 కోట్ల విలువైన 1,100 ఎకరాల అసైన్డ్ భూ దోపిడీ విభ్రాంతి కలిగిస్తోంది. మొత్తం 1,336 మంది బినామీల పేరిట ఆ భూములను హస్తగతం చేసుకున్నారు. అసైన్డ్ భూములకు పరిహారం ఇవ్వబోమని ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులను బెదిరించి వారి భూములను బినామీల ద్వారా తొలుత హస్తగతం చేసుకున్నారు. అనంతరం అసైన్డ్ భూములకు ప్యాకేజీ ప్రకటించడం ద్వారా కుతంత్రానికి పాల్పడినట్లు సీఐడీ నిర్ధారించింది. ఈ కేసులో ఏ–1గా చంద్రబాబు, ఏ–2గా నారాయణతోపాటు పలువురిపై విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో చార్జ్‌షీట్ కూడా దాఖలు చేసింది. ఐపీసీ సెక్షన్లు 420, 409, 506, 166, 167, 217, 120 (బి), 109 రెడ్‌విత్ 34, 35, 36, 37.. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంలోని సెక్షన్లు 3(1),(జి), 3(2), అసైన్డ్ భూముల అన్యాక్రాంత నిరోధక చట్టంలోని సెక్షన్లు 13(2) రెడ్‌విత్ 13(1), (సి), (డి) కింద వారిపై అభియోగాలు నమోదు చేసింది. బాబు క్విడ్ ప్రోకో ఇన్నర్ రింగ్ రోడ్డులో అవినీతి మెలికలురాజధాని అమరావతి ముసుగులో చంద్రబాబు బృందం బరితెగించి సాగించిన భారీ అవినీతి దందాకు ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం మరో తార్కాణం. చంద్రబాబు, నారాయణ పక్కా పన్నాగంతో లింగమనేని రమేశ్‌తో కలసి క్విడ్‌ప్రోకో ద్వారా రూ.వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారని సీఐడీ పూర్తి ఆధారాలతో బయటపెట్టింది. ఈ కుంభకోణంలో నారా లోకేశ్ కూడా ప్రధాన పాత్ర పోషించారు. చంద్రబాబు బినామీ, ఆయన సన్నిహితుడు లింగమనేని రమేష్ భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్ల నుంచి రూ.877.50 కోట్లకు.. రాజధాని నిర్మాణం అనంతరం ఏకంగా రూ.2,130 కోట్లకు చేరేలా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌ను సవరించి ఖరారు చేయడం భారీ దోపిడీకి నిదర్శనం. ఈ అవినీతి పాపంలో పవన్ కళ్యాణ్‌కూ పిడికెడు వాటా ఇవ్వడం గమనార్హం. ఈ కేసులో ఏ–1గా చంద్రబాబు, ఏ–2గా పి.నారాయణ, నారా లోకేశ్‌ను ఏ–14గా సీఐడీ పేర్కొంది. వారిపై ఐపీసీ 120(బి), 409, 420, 34, 35, 37.. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(2), రెడ్‌విత్ 13(1)(సి),(డి)ల కింద కేసులు నమోదు చేసింది. సింగపూర్ కన్సల్టెన్సీ ముసుగులో.. సింగపూర్‌కు చెందిన సుర్బాన జ్యురాంగ్ కన్సల్టెన్సీ ముసుగులో చంద్రబాబు బృందం ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ పేరిట భూ దోపిడీకి పాల్పడింది. ఏకంగా సింగపూర్ ప్రభుత్వంతోనే ఒప్పందం చేసుకున్నట్టుగా భ్రమింపజేసింది. ఆ పేరుతో సింగపూర్ ప్రైవేట్ కన్సల్టెన్సీ సుర్బాన జ్యురాంగ్ను తీసుకొచ్చి అవినీతి కథ నడిపించింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కోసం సీఆర్డీయే అధికారులు 94 కి.మీ. పొడవుతో తొలుత అలైన్మెంట్ రూపొందించారు. ఆ ప్రకారం చంద్రబాబు, లింగమనేని రమేష్, నారాయణ కుటుంబాలకు చెందిన భూములకు 3 కి.మీ. దూరం నుంచి పెదపరిమి, నిడమర్రు, చినవడ్లపూడి, పెదవడ్లపూడి మీదుగా ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మించాలి. అయితే దానివల్ల తమ భూముల విలువ పెరగదని పసిగట్టిన చంద్రబాబు, నారాయణ సీఆర్డీయే అధికారులపై మండిపడ్డారు. వారిద్దరి ఆదేశాలతో సీఆర్డీయే అధికారులు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పులు చేశారు. అలైన్‌మెంట్‌ను 3 కిలోమీటర్లు దక్షిణానికి జరిపి తాడికొండ, కంతేరు, కాజలో చంద్రబాబు, లింగమనేని కుటుంబాలకు చెందిన 355 ఎకరాలు, హెరిటేజ్ ఫుడ్స్‌కు చెందిన 13 ఎకరాలను ఆనుకుని నిర్మించేలా ఖరారు చేశారు. ఆ విషయాన్ని గోప్యంగా ఉంచి చంద్రబాబు, నారాయణ తమ కుటుంబ సంస్థలు హెరిటేజ్, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్‌లతోపాటు తమ బినామీ లింగమనేని రమేష్ సంస్థల పేరిట ఇన్నర్ రింగ్ రోడ్డుకు అటూ, ఇటూ భారీగా భూములు కొనుగోలు చేశారు. అనంతరం సుర్బాన జ్యురాంగ్ కన్సల్టెన్సీని రంగంలోకి తెచ్చి అప్పటికే ఖరారు చేసిన ఇన్నర్ రింగ్ రోడ్ డిజైన్‌ను అమరావతి మాస్టర్ ప్లాన్‌లో చేర్చారు. అనంతరం ఎస్టీయూపీ అనే కన్సల్టెన్సీని నియమించి తాము సవరించిన అలైన్‌మెంట్‌ను ఆమోదించుకున్నారు. -
‘మన డప్పు కొట్టదు.. అందుకే రానివ్వొద్దు’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పాలకుల ధోరణి పక్షపాతంగా మారితే ప్రజాస్వామ్య విలువలు తుడిచిపెట్టుకుపోతాయి. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పే బాధ్యతను మరిచి, మీడియా స్వేచ్ఛను అడ్డుకుంటే అది ప్రజాస్వామ్యానికి పెను ముప్పుగా మారుతుంది. ఇదే పరిస్థితి ప్రస్తుతం కూటమి ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తోంది.ఇటీవల పెండ్లిమర్రిలో నిర్వహించిన పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ నిధుల విడుదల కార్యక్రమానికి అన్ని మీడియా సంస్థలకు అనుమతి ఇచ్చినప్పటికీ, 'సాక్షి' మీడియా ప్రతినిధిని అనుమతించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. సీఎంఓ కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారమే అనుమతి నిరాకరణ జరిగిందని అధికారులు పేర్కొనడం మరింత చర్చనీయాంశమైంది.ఇది కేవలం ఒక మీడియా సంస్థను లక్ష్యంగా చేసుకున్న కుట్రగా భావిస్తున్నట్లు జర్నలిస్టు సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వమే మంజూరు చేసిన పాస్ ఉన్నా, చివరి నిమిషంలో అనుమతి నిరాకరించడం పక్షపాత ధోరణికి నిదర్శనమని వారు పేర్కొన్నారు. ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లోనూ, మీడియా వర్గాల్లోనూ తీవ్ర చర్చ జరుగుతోంది. అధికారిక కార్యక్రమాల్లో మీడియాను అడ్డుకోవడం అనేది ప్రజాస్వామ్యానికి విరుద్ధం అనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలో ఉన్నా.. లేకున్నా.. మీడియా ప్రతినిధులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశం ఉండేది. మీడియా ముఖంగా ప్రజలతో మాట్లాడే ధోరణి ఆయనలో కనిపించేది. ఇది పాలకుడిగా ఆయనలో ఉన్న ప్రజాస్వామ్య గుణాన్ని ప్రతిబింబిస్తుంది. అదే చంద్రబాబు పాలనలో మాత్రం మీడియా స్వేచ్ఛపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాస్తవాలతో ప్రశ్నించడం.. అనుకూల పత్రికల్లా బాకా ఊదకపోవడమే సాక్షికి అనుమతి నిరాకరించారనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. -
ఎల్లో మీడియాపై పేర్ని నాని ఆగ్రహం
సాక్షి,తాడేపల్లి: ఎల్లోమీడియాపై మాజీ మంత్రి పేర్నినాని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ మాజీ ఏవీఎస్వీ సతీష్ కుమార్ మరణంపై ఇష్టం వచ్చినట్లు వార్తా కథనాల్ని ప్రసారం చేస్తోందని ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం పేర్నినాని మీడియాతో మాట్లాడారు.రెండేళ్లుగా రాష్ట్రంలో చంద్రబాబు ఆటవిక పాలన కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ నేతలపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. టీటీడీ మాజీ ఏవీఎస్ఈవో చనిపోతే ఆయన ఇంటిని పోలీసులే జల్లెడ పట్టారు. కనీసం సానుభూతి కూడా చూపించలేదు. సతీష్ కుమార్‌పై ఎల్లో మీడియా ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేస్తోంది. సతీష్ కుమార్‌ది అసలు ఆత్మహత్య?హత్య?అని తెలుసుకునేలోపే ఇల్లంతా జల్లెడపట్టారు. సతీష్ కుమార్ భార్య ఫోన్ కూడా లాక్కున్నారు. ఆ ఫోన్ ఎక్కడుందో ఇప్పటి వరకూ తెలియదు. సతీష్ కుమార్ కాల్ డేటా ఎక్కడ? అని ప్రశ్నించారు. -
ఈనాడు ‘స్వామి’ భక్తి పారవశ్యం!
వ్యాపార ప్రయోజనాల కోసం ఏనాడో ప్రజాహితాన్ని వదిలేసిన ఈనాడుకు అకస్మాత్తుగా ఎక్కడలేని భక్తి పుట్టుకొచ్చింది. అయితే ఇది తిరుమల వెంకటేశ్వర స్వామి వారి మీదా? లేక తెలుగుదేశం అధినేత చంద్రబాబు మీదా? అన్నది తేలాలి. ఈ అనుమానం వచ్చింది కూడా ఈనాడు రాసిన ఓ దిక్కుమాలిన సంపాదకీయం తరువాతే. ‘‘వైకాపాసురుల మహాపచారాలు’’ అంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తనకున్న అక్కసంతా వెళ్లగక్కుకుంది ఆ పచ్చమీడియా సంస్థ. కానీ.. ఆ క్రమంలోనే హిందూ మతానికి తీరని ద్రోహం చేస్తోందన్న సంగతి మరచిపోయింది. పవిత్రమైన తిరుమల లడ్డూ గురించి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు చేసిన వివాదాస్పద అభియోగం ఏమిటి? ఆ తర్వాత ఈ అంశంపై విచారణ జరుగుతున్న తీరు ఏమిటి? లడ్డూ ప్రసాదంలో జంతుకొవ్వు కలిసిందని చంద్రబాబు అధికారికంగా ప్రకటించిన విషయాన్ని ఈనాడు మీడియా ఇప్పుడు ఎందుకు కప్పిపెడుతోంది? అసలు మొదలు ప్రశ్నించాల్సిన విషయాన్ని డైవర్ట్ చేయడం ఈనాడు మీడియా నీచ జర్నలిజానికి నిదర్శనం. చిత్తుశుద్ధి ఉంటే సంపాదకీయం ద్వారా ప్రశ్నించాల్సింది రాష్ట్రాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రిని కదా? కల్తీకి ఆధారాలు ఏమిటి నిలదీయాలి కదా? దానికి సంబంధించిన విచారణ కాకుండా ఏదేదో కల్తీ అంటూ కొత్త కథలు సృష్టిస్తూ విచారణనున ఇష్టారీతిన నడిపిస్తే అది స్వామి వారిపట్ల అపచారమే అవుతుంది. ఈనాడుకు అంత భక్తే ఉంటే, విశాఖలో టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడి గోదాములో లక్షల కిలోల గోమాంసం పట్టుబడిన సంగతిని ఎందుకు ప్రస్తావించడం లేదు. తప్పు పట్టలేదు? ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు? అలాగే పిఠాపురం వద్ద జరుగుతున్న దారుణ నెయ్యి కల్తీపై నోరు మెదపదు ఎందుకు? జంతుకొవ్వు కలిపిన నెయ్యితో తయారు చేసిన లడ్డూలు అయోధ్యకూ పంపించారని ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ఎందుకు తప్పు పట్టలేదు? ఈ ఆరోపణలో నిజం లేదని ఇదే ఈనాడు ఇటీవల కథనం ఒకటి ప్రచురించింది కదా? పవన్ చేసిన పాపం గురించి ఎందుకు ప్రస్తావించలేదు? ఇవన్నీ హిందూ మతానికి అపచారం చేసినట్లు కాదన్నది ఈనాడు నమ్మకమా? ఎన్నికల హామీలను నెరవేర్చకుండా ప్రజలను ఏమారుస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వాన్ని కాపాడేందుకు వికృత రాతలు రాయడాన్ని ప్రజలు కనిపెట్టలేరని అనుకుంటోందా? బాబుపై ప్రీతితో ఆఖరికి ఈ మీడియా సంస్థ నకిలీ మద్యం తయారీదారుల కొమ్ముకాస్తోంది.టీడీపీ ప్రభుత్వం వచ్చాక జరిగిన తొక్కిసలాట మరణాలు, మాంసాహారం భుజించడం, మద్యం సీసాలు దొరకడం వంటి అపచారాలు, ఈనాడు మీడియాకు పవిత్ర కార్యక్రమాలుగా కనబడుతున్నాయోమే తెలియదు. జంతు కొవ్వు కలిసిందంటూ అసత్య ప్రచారం చేసి స్వామి వారి లడ్డూ ప్రసాదం పవిత్రతకు భంగం కలిగించవద్దని జగన్ అప్పట్లో చెబితే వక్రీకరించి జగన్ అబద్దాలు చెప్పారని రాసి ఈనాడు అల్పబుద్దిని ప్రదర్శించింది. రామోజీరావుకు దైవ భక్తి పెద్దగా లేదు. కాని ఆయన కుమారుడు కిరణ్ మాత్రం భక్తి విశేషంగా ఉన్నట్లు ప్రవర్తిస్తారు. కోట్లాది హిందువుల మనో భావాలను దెబ్బతీసేలా లడ్డూ ప్రసాదంపై అసత్య కథనాలతో పాటు, ఏకపక్షంగా సంపాదకీయం రాసి తాను నమ్మే స్వామి వారికి కిరణ్ కూడా తీరని అపచారం చేశారు!తిరుమల లడ్డూపై ప్రత్యేక దర్యాప్తు బృందం చేస్తున్న విచారణకు హాజరైన టీటీడీ మాజీ కార్యనిర్వాహణాధికారి ధర్మారెడ్డి చెప్పిందేమిటి? ఈ మీడియా రాసిందేమిటి?పైగా ఆ మీడియా సేకరించిన సమాచారం అంతా సత్యమన్నట్లు సంపాదకీయం కూడా రాసేసి తెలుగుదేశం పార్టీపై, కూటమి ప్రభుత్వంపై ఎనలేని భక్తిప్రపత్తులు చాటుకుంది. లవలేశమైనా నిజాయితీ ఉన్నా తొలుత తిరుమల లడ్డూలో జంతుకొవ్వు కలిసిందన్న ఆరోపణలో వాస్తవం ఏమిటన్నది రాయాలి కదా? ఆ పని ఎందుకు చేయలేదు? దానిపై ఎందుకు విచారణ చేయడం లేదని ప్రభుత్వాన్ని, సిట్‌ను ప్రశ్నించాలి కదా! దర్యాప్తు అంతటిని ఎలాగొలా టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారరెడ్డికి చుట్టేందుకు ఒకవైపు ప్రభుత్వం, మరో వైపు ఈనాడు, ఎల్లో మీడియా పాట్లు పడుతోంది. ఎవరో ఒకరిని పట్టుకోవడం, వారితోటే ఆ రోజుల్లో అక్రమాలు జరిగాయని వాంగ్మూలం ఇప్పించుకోవడం,తదుపరి తాము అనుకున్న వైఎస్సార్సీపీ నేతను టార్గెట్ చేయడం పనిగా పెట్టుకుంది. నెయ్యి తక్కువ ధరకు కొన్నందున అందులో కల్తీ ఉందనే అభిప్రాయానికి వస్తే, 2014-19లో అంతకంటే తక్కువ ధరకు చేశారు కదా? అప్పుడు కూడా ఇలాగే జరిగిందా? టీడీపీ, వైఎస్సార్సీపీ రెండింటి హయాంలో పలుమార్లు నాణ్యతా ప్రమాణాలు లేని నెయ్యి టాంకర్లను వెనక్కి పంపించారు కదా? ఆ కోణంలో ఎందుకు ఆలోచించడం లేదు. టీటీడీకి సంబంధించిన లేబొరేటరీలు ఎప్పుడైనా కల్తీ అంశాన్ని కనిపెట్టాయా? ఆ మేరకు ఉన్నతాధికారులకు రిపోర్టు చేశాయా? అయినా చర్య తీసుకోలేదా? అన్నదానికి జవాబు దొరకదు. రెండేళ్ల క్రితం పంపిణీ చేసిన లడ్డూ కల్తీ నెయ్యితో చేసిందని చెప్పడానికి మెటిరీయల్ ఎవిడెన్స్ ఏమైనా ఉందా? తిరుమలకు వచ్చిన నెయ్యిలో వెజిటబుల్ ఫాట్ అంటే డాల్డా వంటివి కలిసి ఉండవచ్చన్న అనుమానం వచ్చే కొన్ని టాంకర్లను వెనక్కి పంపించారు కదా? అలాంటిది రసాయనాలతో తయారు చేసినవాటిని పట్టుకోలేరా? ఏకంగా 68 లక్షల కిలోల కల్తీ నెయ్యి వచ్చిందట. దీనికి ఆధారం చెప్పకుండా ఏమిటో ఈ అర్ధం లేని రాతలు! పైగా సంపాదకీయమట. ధర్మారెడ్డి సిట్ అధికారులను ఎదురు అనేక ప్రశ్నలు వేశారు. అయినా ఆయన టీటీడీ ఛైర్మన్ ఒత్తిడి తెచ్చారని, అందువల్లే నెయ్యి కొన్నామని చెప్పినట్లు ఎల్లో మీడియా రాసుకుంది.ఈ అంశాన్ని సిట్ అధికారులు అధికారికంగా ఏమైనా వారికి వెల్లడించారా? ధర్మారెడ్డి ఏదో చెప్పారంటూ అది నిజమో కాదో, నిర్దారించుకోకుండా అడ్డగోలుగా ఈనాడు సంపాదకీయం రాసుకున్నట్లు అనిపించడం లేదా? ధర్మారెడ్డి ఒకవైపు తన వాంగ్మూలం గురించి ఒక వర్గం మీడియా అవాస్తవాలు రాస్తోందని చెబతే దానిని పట్టించుకోరా? తాను విచారణలో చెప్పింది ఒకటైతే ఎల్లో మీడియా ప్రచారం చేసింది మరొకటని ఆయన స్పష్టం చేశారు. కల్తీ జరగకుండానే ఏదేదో జరిగిపోయిందని అసత్య ప్రచారం చేశారని ధర్మారెడ్డి సిట్ అధికారులకు కూడా స్పష్టం చేశారని చెబుతున్నారు కదా! తక్కువ ధరకు కోట్ చేసేవారికే నెయ్యి టెండర్ ఇవ్వడం ఎప్పటి నుంచో ఉన్న విధానమని ఆయన తెలిపారు. టీడీపీ హయాంలో కేవలం రూ.276లకే కిలో నెయ్యి కొనుగోలు చేశారన్న వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ హయాంలో పర్చేజ్ కమిటీలో ప్రస్తుత మంత్రి కె.పార్థసారథి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కూడా ఉన్నారు. మరి వారికి కూడా దీనితో సంబంధం ఉండాలి కదా! ఇంతవరకు వారిని ఎందుకు విచారించలేదు? అంతా అయిన తర్వాత ప్రభుత్వం వారికి కావల్సిన రీతిలో సాక్ష్యం ఇప్పించుకోవడానికి ఇలా చేస్తున్నారా? కల్తీ జరిగినా మీరు ఎందుకు చర్య తీసుకోలేదని సిట్ అధికారులు లీడింగ్ ప్రశ్న వేసినప్పుడు ధర్మారెడ్డి సూటిగా సమాధానం ఇస్తూ, అసలు కల్తీ జరగకుండానే యాక్షన్ ఎలా తీసుకుంటామని అని ఎదురు ప్రశ్నించారు. టీటీడీ రికార్డులు చూసుకుంటే అన్ని సందేహాలు నివృత్తి అవుతాయని కూడా స్పష్టం చేశారట. తొలుత జంతు కొవ్వు అన్నారు.. తదుపరి కల్తీ నెయ్యి అని చెప్పారు.. ఆ తర్వాత రసాయనాలు కలిశాయని అంటున్నారు. తాజాగా ఆయా కంపెనీల టర్నోవర్‌ను పరిగణనలోకి తీసుకోవాలని అంటున్నారు. కల్పిత మద్యం కేసులో కూడా ఇలాగే ఇద్దరు సాక్ష్యులు చెప్పని అంశాలను ప్రస్తావించి కోర్టుకు సమర్పించారట.దాంతో ఆ సాక్ష్యులు ఎదురు తిరిగి హైకోర్టులో ఆ మేరకు పిటిషన్ వేశారు. ఇలా పోలీసు వ్యవస్థను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తూ రాజకీయ ప్రత్యర్ధులను ఇబ్బంది పెట్టడానికి యత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. ఏపీలో అసలు అంశాలను పక్కదారి పట్టించడానికి ఇంకెన్ని కథలు పుట్టుకువస్తాయో చూడాలి.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
చంద్రబాబు ఘనమైన రికార్డే సాధించారు!
సంపద సృష్టించి మరీ ఆంధ్రప్రదేశ్‌ను నెంబర్ వన్ స్థానానికి తీసుకెళతానని టీడీపీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరచూ చెబుతుంటారు. కానీ గత ఏడాది జనసేన, బీజేపీలతో కలిసి అధికారంలోకి వచ్చిన తరువాత కానీ ఆయన గారి సంపద సృష్టి అసలు రహస్యం ప్రజలకు అర్థం కాలేదు. అప్పులు, రెవెన్యూ లోటుల్లో మాత్రం ఏడాదిన్నర కాలంలో రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేసేశారు. ఒకప్పటి బీమారు రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తర ప్రదేశ్ రుణాల విషయంలో బాగా మెరుగైన స్థితిలో ఉండటం గమనార్హం. ఇవన్నీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తాజా నివేదికలోని అంశాలు.ఏపీలో చంద్రబాబు అండ్ కో.. పాలన, అభివృద్ధి వంటి విషయాలపై కాకుండా.. ప్రత్యర్థులపై, ప్రశ్నించే వారిపై కేసులో పెట్టడంలోనే బిజీ అయిపోతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నివేదిక ఇచ్చిన కాగ్‌పై కూడా కేసు పెడతామని బెదిరిస్తారేమోనని ఓ సీనియర్ పాత్రికేయుడు, యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు వ్యాఖ్యానించడంలో ఆశ్చర్యమేమీ లేదు. తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకుని మోసే ఎల్లో మీడియా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాదకరంగా ఉందంటూ ఒక కథనాన్ని ఇచ్చి అనవసర వ్యయాలను తగ్గించుకోవాలని సలహా ఇచ్చింది. ఇదేదో వ్యూహాత్మకంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తరపున కథనం రాశారేమో అన్న అనుమానం వస్తుంది. ఎందుకంటే ఏడాదిన్నర కాలంగా రాష్ట్ర ఆర్థిక నిర్వహణ అధ్వాన్నంగానే ఉందన్న సంగతి అందరికీ తెలుసు. అయినా ఆహో, ఓహో అంటూ డబ్బా కొట్టిన ఎల్లో మీడియా ఇప్పుడు కాస్త భిన్నమైన కథనం రాయడం ద్వారా ప్రజలకిచ్చిన హామీలు ఎగవేయడానికి రంగం సిద్దం చేస్తున్నట్లుగా అనిపిస్తుంది.వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయా స్కీములు అమలు చేసినప్పుడు, అప్పులు తీసుకువచ్చినప్పుడు రాష్ట్రం శ్రీలంక అయిపోతోందని టీడీపీ, జనసేనతో కలిసి ఎల్లో మీడియా నానా రచ్చ చేసేది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, దగ్గుబాటి పురందేశ్వరి వంటివారు ఏపీ అప్పులు రూ.14 లక్షల కోట్లకు చేరాయని, అదంతా జగన్ ప్రభుత్వమే చేసిందేమో అన్న అనుమానం కలిగేలా ప్రచారం చేసేవారు. తీరా చూస్తే జగన్ ప్రభుత్వంలో తీసుకున్న అప్పు రూ.మూడున్నర లక్షల కోట్లేనని తేలింది. జగన్ టైమ్‌లో అప్పులు అంటూ గోలగోలగా చెప్పిన వారు తాము అధికారంలోకి వస్తే ఏడాదికి లక్షన్నర కోట్ల మేర సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని ప్రకటించారు. అది అసాధ్యమని జగన్ అంటే, చంద్రబాబుకు సంపద సృష్టించడం తెలుసని, తద్వారా స్కీములు అమలు చేస్తామని ఆకాశమే హద్దుగా అబద్దాలు చెప్పారు. ఎల్లో మీడియా తాన తందానా అని పాట పాడేవి. ఇప్పుడేమో ప్రమాదంలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, పోటెత్తిన లోటు అని కథనాలు ఇస్తున్నారు. మరి అప్పుడు అన్ని చేసేస్తామని చెప్పారు కదా.. ఇప్పుడేమిటి ఇలా చేతులెత్తేస్తున్నారని వారు ప్రశ్నించరు. ఎవరైనా అడిగితే వారిపై తప్పుడు కేసులు ఎలా పెట్టాలా అన్నదానిపైనే ప్రభుత్వం దృష్టి ఉంటోంది.తాజాగా కాగ్ ఇచ్చిన నివేదికను పరిశీలిస్తే ఆర్థిక నిర్వహణ ఏ రకంగా చూసినా జగన్ టైమ్‌లో మెరుగ్గా ఉన్నట్లు అర్థమవుతుంది. రెండేళ్లపాటు కరోనా సంక్షోభం ఉన్నా జగన్ ప్రభుత్వం సమర్థంగా ఆర్ధిక నిర్వహణ చేసినట్లు వెల్లడవుతుంది. కూటమి ప్రభుత్వం 2025-26లో రెవెన్యూ లోటు రూ.33185 కోట్లు అంచనా వేస్తే ఆరు నెలలకే రూ.46652 కోట్లకు చేరిందని కాగ్ వెల్లడించింది. ఇది అధికారుల అంచనా తప్పా? లేక లక్ష్య సాధనలో వైఫల్యమా అన్నదానిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, ఆ పని ఎటూ చేయరనుకోండి. దాదాపు రూ.2.17 లక్షల కోట్ల రెవెన్యూను అంచనా వేస్తే రూ.74234 కోట్లు మాత్రమే వచ్చాయి. ఖర్చు మాత్రం రూ.120887 కోట్లుగా లెక్కగట్టారు. బడ్జెట్ రూపొందించిన సమయంలో అంచనా వేసిన ఆదాయంలో కేవలం 34 శాతం మాత్రమే ఇప్పటికి వచ్చిందట. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.32284 కోట్లు గ్రాంట్లుగా వస్తాయని భావిస్తే, ఈ ఆరు నెలల్లో రూ.4014 కోట్లే రావడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఏడాది మొత్తానికి తీసుకోవాలని తలపెట్టిన రూ.79926 కోట్ల రుణంలో ఆరు నెలల్లోనే 78 శాతం పైగా, అంటే రూ.63వేల కోట్ల రుణాన్ని తీసేసుకుంది. ఇది దేశంలోనే అత్యధికం.2019లో చంద్రబాబు అధికారం కోల్పోయినప్పుడు కేవలం ఖజానాలో రూ.వంద కోట్లు మాత్రమే ఉంచి దిగిపోయారు. అదే 2024లో చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడు ట్రెజరీలో సుమారు రూ.ఏడు వేల కోట్లు ఉన్నాయి. అయినా జగన్ ఆర్థిక విధ్వంసం చేశారని కూటమి పెద్దలు, ఎల్లో మీడియా విష ప్రచారం చేసింది. ఒకప్పుడు ఆర్థిక నిర్వహణలో ఉత్తరప్రదేశ్ అట్టడగున ఉండేది. బీమారు రాష్ట్రాలలో ఒకటిగా చెప్పేవారు. చంద్రబాబు నాయుడు ఆ రోజుల్లో యూపీ, బీహారులు సరిగా పర్ఫార్మ్ చేయడం లేదని, దానివల్ల బాగా పనిచేసే ఏపీ వంటి రాష్ట్రాలకు నష్టం జరుగుతోందని, కేంద్రం నుంచి ఆ రాష్ట్రాలకు అధికంగా నిధులు వెళుతున్నాయని, నిధుల పంపిణీ ఫార్ములా మార్చాలని వాదించేవారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయినట్లుగా ఉంది. అప్పులు, ఆర్ధిక నిర్వహణలో యూపీ బాగా పనిచేస్తున్నట్లు అనుకోవాలి.ఉత్తరప్రదేశ్ ఈ ఆరు నెలల్లో కేవలం రూ.9332 కోట్లు అప్పు మాత్రమే చేసింది. ఏపీ తర్వాత మధ్యప్రదేశ్ (రూ.49100 కోట్లు), తెలంగాణ(రూ.45139 కోట్లు) అధిక అప్పులు చేసిన రాష్ట్రాలలో ఉన్నాయి. మధ్యప్రదేశ్, తెలంగాణలతో పోల్చినా ఏపీ పరిస్థితి మరీ దారుణంగానే ఉన్నట్లు కనిపిస్తుంది. జగన్ ప్రభుత్వం రెండేళ్లపాటు కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొంది. అప్పుడు ఆదాయం దాదాపుగా లేని పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో రుణాలు తీసుకోండని రాష్ట్రాలకు కేంద్రం సూచన చేసింది. ఆ ప్రకారం అప్పులు చేసినా, అదేదో జగన్ తప్పు పనిచేసినట్లు ఎల్లో మీడియా అభూత కల్పనలు సృష్టించింది. ఇప్పుడు అలాంటి సంక్షోభాలు ఏమీ లేకపోయినా చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసింది. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలోనూ జగన్ ప్రభుత్వమే బాగా పని చేయగలిగిందని లెక్కలు చెబుతున్నాయి. ఏపీ విభజన నాటి రెవెన్యూ లోటు పదివేల కోట్లు కాని, పోలవరం ప్రాజెక్టుకు రూ.12 వేల కోట్ల ఆర్ధిక సాయం కాని జగన్ సాధించారు. ఆ రోజుల్లో జనంలో డబ్బులు రొటేట్ అవడం వల్ల జీఎస్టీ వసూళ్లు కూడా గణనీయంగానే ఉండేవి. కాని ఇప్పుడు జీఎస్టీ వసూళ్లు పడిపోయాయి. ఇతర రాష్ట్రాలలో వృద్ధిరేటు కనిపిస్తుంటే ఏపీ అందుకు భిన్నంగా ఉంది. ఈ సందర్భంగా ఎల్లో మీడియా రాసిన కొన్ని కథనాల విశ్లేషణ ఆసక్తికరంగా ఉంటుంది. తల్లికి వందనం పథకంతో జీఎస్టీ జోష్, ప్రజలలో కొనుగోలు శక్తి పెరిగిందని ఎల్లో మీడియా కొద్దికాలం క్రితం ప్రచారం చేసింది. ఆ తర్వాత జీఎస్టీ తగ్గింపుతో జనంలో జోష్ అని, సూపర్ సేవింగ్స్ అంటూ కూడా ప్రజలను మభ్యపెట్టింది. ఇప్పుడు అదే మీడియా జీఎస్టీ రాబడులు తగ్గాయని రాస్తోంది. సేవింగ్స్‌కు సూపర్ మస్కా, రిటైల్ మాయలో జీఎస్టీ పొదుపు ఆవిరి అయిపోయిందని రాస్తోంది. మొదటేమో అద్భుతమని ప్రచారం చేయడం, ఒక్కో కుటుంబానికి రూ.25 వేల రూపాయల నుంచి నలభై వేలు సేవ్ అవుతున్నాయని ప్రభుత్వానికి డబ్బా కొట్టడం, ఇప్పుడేమో సేవింగ్స్ కనిపించడం లేదని చెప్పడం.. ఇలా ఉంది ఎల్లో మీడియా తీరు.ఈ 17 నెలల్లో రికార్డు స్థాయిలో రూ.249350 కోట్ల మేర అప్పులు చేసిందని మాజీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. తమ హయాంలో ఐదేళ్లలో రూ.332670 కోట్లు అప్పుచేస్తే శ్రీలంక అయిపోయిందని విష ప్రచారం చేసిన ఎల్లో మీడియాకు ఇప్పుడు ఏపీ అమెరికా అయినట్లు కనిపిస్తోందా అని బుగ్గన ప్రశ్నించారు. టీడీపీ, జనసేనలు చేసిన వాగ్దానాలలో అనేకం అమలు చేయకుండానే దాదాపు రూ.రెండున్నర లక్షల కోట్ల అప్పు చేస్తే, వచ్చే సంవత్సరాలలో ఇంకెంత అప్పు చేస్తుందో అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతోంది. వీటిపై సమాధానాలు ఇవ్వలేక, ఇప్పటికి జగన్ ప్రభుత్వం విధ్వంసం అంటూ తప్పుడు ప్రచారం చేస్తూ కాలక్షేపం చేస్తే కూటమి ప్రభుత్వానికి కలిసి వచ్చేది ఉండదని గమనించాలి. సంపద సంగతేమోకాని, ఏపీని అప్పుల కుప్పగా చేసి ప్రజలను సంక్షోభంలోకి నెట్టకుండా ఉంటే అదే పదివేలు అని చెప్పాలి.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
తిరుమల లడ్డూ వివాదం.. పచ్చమీడియా అబద్దాలన్నీ బయటపెడతాం
-
‘దేవుడితో రాజకీయాలు వాళ్లకు బాగా అలవాటే!’
సాక్షి, గుంటూరు: దేవుడితో రాజకీయాలు చేయడం చంద్రబాబు అండ్ కోకు చాలా సర్వసాధారణమైన విషయమని మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. తిరుమల అన్నప్రసాదంపై తాను చేసిన కామెంట్లను ఎల్లో మీడియా ప్రచురించడంపై ఆయన తాజాగా స్పందించారు. గుంటూరు జిల్లా కోర్టు వద్ద కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజ్ లను ప్రైవేటీకరణ చేయటాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ.. తిరుమలలో 1985 నుంచి ఉచిత భోజనం పెడుతున్నారు. ఉచిత భోజనం కోసం భక్తులు రూ. 27 వేల కోట్లు చందాలు ఇచ్చారు. కొండపైన దాదాపు 40 సంవత్సరాలు నుంచి భక్తులకు ఉచితంగా అన్న ప్రసాదం అందిస్తున్నారు. నేను ఇప్పుడు వెళ్లి భోజనం చేశాను కాబట్టి భోజనం బాగుందని చెప్పాను. కానీ ఎల్లో మీడియా బీఆర్ నాయుడు ఏదో గొప్పగా పని చేశాడని వాళ్ళ ఛానల్ లో వేసుకుంటున్నారు.బీఆర్ నాయుడు ఏమన్నా భక్తుడా...?టీవీ5 బీఆర్ నాయుడు ఓ బ్రోకర్. దేవుడితో రాజకీయాలు చేయటం వాళ్లకు బాగా అలవాటు. అందుకే చంద్రబాబు నాయుడు లడ్డు ప్రసాదంతో రాజకీయం చేశాడు. ఇప్పుడు నా వ్యాఖ్యలతో బీఆర్ నాయుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాజకీయం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు దేవుడితో రాజకీయాలు చేస్తాడు కాబట్టి ఒకసారి అలిపిరిలో ల్యాండ్ మైన్ పేలింది అని అంబటి అన్నారు... వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి పేదలకు వైద్యం అందించడంతో పాటు పేద విద్యార్థులు డాక్టర్లు కావాలని భావించారు. కానీ చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీ లతో వ్యాపారం చేయాలని భావిస్తున్నారు. మెడికల్ కాలేజీలు అమ్మేసి లోకేష్ జేబులు నింపాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు అని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
తిరుమల లడ్డుపై తప్పుడు వార్తలతో అడ్డంగా దొరికిన ఎల్లో మీడియా..
-
ఇది ఆరంభం మాత్రమే.. ఎల్లో మీడియా గుట్టువిప్పుతున్న సోషల్ మీడియా
-
అడ్డుకుంటే ఆగేదా.. జనాభిమానం!
వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనలతో చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని కూటమి సర్కారు వణికిపోతున్నట్లుగా ఉంది. ప్రతి పర్యటన సందర్భంగా పలు రకాల ఆంక్షలు పెట్టి.. ఎలాగైనా సరే ఆ పర్యటనను అడ్డుకోవాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. పాపం.. వారి ప్రయత్నాలేవీ ఫలించడం లేదు సరికదా.. జగన్ సభలు, పర్యటనలు జనసంద్రాలవుతున్నాయి. తాజాగా జగన్ చేసిన కృష్ణ జిల్లా పర్యటనలో కేవలం 70 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు ఏడు గంటల సమయం పట్టిందంటే.. జనాభిమానం ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. సహజంగానే ఇవన్నీ ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర సంస్థలకు కడుపు మంట మిగులుస్తుంది. వారి కథనాలు చూస్తే అవి ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా స్వప్రయోజనాల కోసమే మీడియాను నడుపుతున్నట్లు తేటతెల్లమవుతుంది. అయితే జగన్ టూర్‌కు ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తోందన్న విషయాన్ని వారు చెప్పకనే చెప్పేస్తున్నారు. ‘‘అడుగడుగునా అరాచకమే’’ అన్న ఈనాడు కథనం చూడండి... జగన్ పోలీసులు పెట్టిన షరతులను ఉల్లంఘించారన్నది ఏడుపు. ఆంధ్రజ్యోతి కూడా జగన్ టూర్‌తో జనం పాట్లు పడ్డారని గొంతు చించుకుంది. అంతేకానీ ఈ ఎల్లోమీడియా పత్రికలు జనం రాలేదని మాత్రం రాయలేకపోయాయి. రాజకీయ నాయకుల పర్యటనల్లో సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. వాటిని నియంత్రణకే పోలీసులు ఉంటారు. కానీ వారు ఆ పని చేయకుండా ఎక్కడెక్కడి నుంచో పరుగులు తీసుకుంటూ వస్తున్న జగన్ అభిమానులను అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నం ఆశ్చర్యం కలిగిస్తుంది. 2019-24 మధ్య ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణలు కూడా చాలా చోట్ల పర్యటించారు. కానీ ఎన్నడూ ఈ రోజు జగన్ పర్యటనలకు పెట్టినన్ని ఆంక్షలు పెట్టలేదు. శాంతి భద్రతల సమస్య ఏర్పడే అవకాశం ఉన్నప్పుడు ఇంటినుంచి బయటకు వెళ్లవద్దని, ఫలానా టూర్ చేయవద్దని పోలీసులు చంద్రబాబును చెబితే ఆయన ఊరుకోలేదు సరికదా... అంతెత్తున విమర్శించారు. పోలీసుల సూచనలను పట్టించుకోకుండా వారిపై దుర్భాషలాడారు. హెచ్చరికలు జారీ చేశారు. పుంగనూరు, అంగళ్లు వద్ద పార్టీ కార్యకర్తలను వైఎస్సార్సీపీపై ఉసికొల్పిన సందర్భాన్ని ఎల్లో మీడియా మర్చిపోయి ఉండవచ్చు. పుంగనూరులో టీడీపీ కార్యకర్తలు దూకుడు కారణంగా ఒక కానిస్టేబుల్ కన్ను పోయింది. పోలీసు వాహనం దగ్ధమైంది. అప్పట్లో అవన్ని ప్రజాస్వామ్యయుతంగా జరిగినట్లు, అదంతా ప్రభుత్వ తప్పు, పోలీసుల వైఫల్యం అని చెప్పుకుంది టీడీపీ, చంద్రబాబు బృందం. కందుకూరు వద్ద నడిరోడ్డు మీద సభ పెట్టినప్పుడు తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది మరణించినప్పుడు ఎల్లో మీడియాకు జనం పాట్లు కనిపించలేదు. వారికి ఇవి నరకంగా అనిపించలేదు. గుంటూరులో టీడీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు సభ పెట్టి చీరల పంపిణీ చేసినప్పుడు జరిగిన తొక్కిసలాట వీరికి గుర్తుకు రాదు. విజయవాడలో ఒకసారి పవన్ కళ్యాణ్ రోడ్ షో చేసినప్పుడు గంటలకొద్ది ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. మాబోటి వాళ్లం కూడా ఒక సందర్భంలో ట్రాఫిక్‌లో చిక్కుకున్నాం. జగన్ సీఎంగా ఉండగా... బహిరంగ సభల్లో తొక్కిసలాటలు, మరణాలు లేకుండా చూడడానికి, నిర్దిష్ట ప్రదేశాలలో మాత్రమే సభలు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం జీవో ఇస్తే టీడీపీ, ఎల్లో మీడియాకాని రచ్చ రచ్చ చేశాయి. సంపాదకీయాలు సైతం రాసి గగ్గోలు పెట్టాయి. కోర్టుకు వెళ్లి రద్దు చేయించాయి! జగన్ టూర్లో ఎక్కడైనా తొక్కిసలాటలు జరిగాయా? పొరపాటున వాహనం తగిలి ఒక వ్యక్తి మరణించిన ఘటన తప్ప ఇంకేమైనా ప్రమాదాలు జరిగాయా? కృష్ణా జిల్లా టూర్లో జగన్ కాన్వాయితోపాటు ఇతర ప్రయాణికుల వాహనాలు, బస్సులు అన్నీ మామూలుగానే నడిచాయి. జనం గూమికూడిన చోట ట్రాఫిక్ కొద్దిసేపు ఆటంకం కలిగి ఉండవచ్చు. జనం పెద్ద ఎత్తున తరలివచ్చి జగన్‌కు స్వాగతం చెబుతుంటే ఆయన వారిని కాదని ఎలా వెళ్లిపోగలుగుతారు? ఇవన్ని ప్రజాస్వామ్యంలో భాగం కాదా? జగన్ టూర్ వల్ల జనానికి ఇబ్బందులు వస్తుంటే, అధికార హోదాతో తిరుగుతున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ల టూర్ల వల్ల ఇంకెంత ఇబ్బంది కలుగుతుంది? పర్యటన ప్రాంతానికి రావడానికి అరగంటో, గంట ముందునుంచే ట్రాఫిక్ నిలిపివేయడమో, నియంత్రణలు పెట్టడమో చేస్తుంటారు కదా! అప్పుడు జనం పాట్లు పడినా, నరకం చూసినా తప్పు లేదా? జనం జగన్‌కు నీరాజనం పలుకుతున్న వైనం కూటమి నేతలకు ఆందోళన కలిగిస్తుండవచ్చు. వైఎస్సార్సీపీ ఓటమి పాలైన ఏడాదికే జగన్ సమావేశాలకు ప్రజలు తండోపతండాలుగా వస్తూండేందుకు కూటమి ప్రభుత్వ వైఫల్యాలే కారణమన్ని సంగతి వారికి తెలియదా? నిజానికి పోలీసులు జగన్ టూర్‌పై పోలీసులు పెట్టిన షరతులు అసంబద్ధమైనవి. హైవేపై గుమి కూడకూడదట. రాకపోకలకు, ప్రజాజీవనానికి అంతరాయం కలగరాదట. జగన్ తో పాటు ఏభై మంది మాత్రమే ఉండాలని, పది వాహనాలే వెళ్లాలని, దిచక్ర వాహనాలకు అనుమతి లేదని మరో షరతు పెట్టారట. ఇలాంటి షరతులు పెట్టిన పోలీసులను విమర్శించాల్సి మీడియా వాటిని సమర్థిస్తూ కథనాలు రాయడం, ఉల్లంఘించారని వైసీపీపై ఎదురుదాడి చేయడం చూస్తే ఈనాడు మీడియా జర్నలిజం ఎంత నీచంగా మారిందో తెలుస్తుంది. అత్యంత ప్రజాదరణ కలిగిన ఒక నాయకుడు వెళుతున్నప్పుడు జనం పోగవ్వకుండా ఎలా ఉంటారు? 1982లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు చైతన్యరథం వేసుకుని రాష్ట్రమంతటా టూర్ చేశారు.రహదారులన్నీ కిక్కిరిసిపోయేవి. అయినా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి దిక్కుమాలిన ఆంక్షలు పెట్టలేదు. అది వదిలేద్దం. చంద్రబాబు కుమారుడు లోకేశ్ యువగళం కార్యక్రమంపై కూడా ఇలాంటి నియంత్రణలు లేవు. సినిమా నటుడు కూడా అయిన పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా పర్యటనలు జరిపిన సందర్భంలోనూ పోలీసులు ఇలాంటి షరతులు పెట్టలేదు. రాజకీయ నేతలు రోడ్లపై టూర్లు చేయకూడదని, తద్వారా ప్రజలకు అసౌకర్యం కలిగించరాదన్నదే ఎల్లో మీడియా విధానమైతే అదే మాట చంద్రబాబు పర్యటనల సందర్భంలోనూ చెప్పి ఉండాల్సింది. అప్పుడు చెప్పని సుద్దులు ఇప్పుడు చెప్పడం కచ్చితంగా ద్వంద్వ ప్రమాణాల కిందకే వస్తుంది. జగన్ తాజా టూర్లో జనం ప్రభుత్వంపైకి సంధించిన ప్రశ్నలకన్నా, ఇతర చిల్లర అంశాలే ఫోకస్ అవ్వాలన్నదే ఎల్లో మీడియా లక్ష్యం కావచ్చు. రైతులకు రైతు భరోసా కేంద్రాల ద్వారా జగన్ రైతుల పంట ఉత్పత్తుల కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉచిత బీమా, ఇన్ పుట్ సబ్సిడీ, రైతు భరోసాగా రూ.13500 చెల్లింపు మొదలైన హామీలను అమలు చేశారు.దాంతో రైతులను ఏమార్చడానికి ‘‘అన్నదాత సుఖీభవ’’ కింద తాము ఏడాదికి రూ.ఇరవై వేలు ఇస్తామని, ఇతరత్రా అన్నిప్రయోజనాలు కల్పిస్తామని టిడిపి, జనసేన తమ ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేశారు. ఇప్పుడేమో వాటిని అమలు చేయడం లేదు. ఒక ఏడాది ఎగవేసి, తదుపరి రూ.ఐదు వేలే ఇచ్చారు. రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేసే పనిలో ఉన్నారు. మోంథా తుపాను వల్ల రైతుల వరి పంట నేలవాలి పోవడంతో చాలా నష్టపోయారు. వారికి నష్టపరిహారం ప్రకటించలేదు. పైగా పరిహారం తీసుకుంటే ధాన్యం కొనుగోలుకు బాధ్యత లేదని రైతులను బెదిరిస్తున్నారు. రైతులు వీటన్నిటిని జగన్ వద్ద ప్రస్తావించారు. అవన్ని జనంలోకి వెళతాయి కనుక ఈ రకంగా పోలీసులతో అడ్డదిడ్డమైన కండిషన్లు పెట్టించి టూర్ విఫలం చేయాలని చూశారనుకోవాలి. అయినా రైతులే వైసీపీ శ్రేణులే కాదు..సాధారణ జనం కూడా తరలిరావడం కూటమి నేతలకు, ఎల్లో మీడియాకు గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మోంథా తుపాన్.. లోకేష్‌కు నెట్ ప్రాక్టీస్!
రాష్ట్రాన్ని మోంథా తుపాను వణికించింది. రైతులను, మత్స్యకారులను ఇతర చిరు జీవితాలపై తీవ్ర ప్రభావం చూపింది. వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. నాలుగైదు రోజులు ప్రజలు ఇళ్ళకే పరిమితమైపోయి గుమ్మం దాటి బయటికి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ప్రభుత్వ అధికారులు సైతం తమ స్థాయిల్లో శ్రమించి తుపాను నష్టాన్ని.. కష్టాన్ని తగ్గించడానికి కృషి చేశారు. అయితే, ఈ మొత్తంలో మోంథా తుఫానుపై ప్రభుత్వ సహాయ చర్యలు.. నష్ట నివారణకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు వాటి అమలు తదితర అంశాలు అన్ని లోకేష్ బాబుకు ఉపకరించేలా ఉన్నాయి. అటు లోకేష్, చంద్రబాబు ఇద్దరు కూడా తుపాను నష్టాన్ని తగ్గించడంలో తీవ్రంగా కృషి చేశారు అని రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వివిధ శాఖల అధికారులు, మంత్రులను ఆదేశిస్తూ సమన్వయపరుస్తూ లోకేష్ అత్యద్భుత పనితీరు కనబరిచారని తెలుగుదేశం నాయకులతో పాటు అధికార యంత్రాంగం సైతం సర్టిఫికెట్లు ఇస్తూ వస్తోంది.అంటే రాష్ట్రంలో తుపాను నష్టాన్ని తగ్గించడంలో చంద్రబాబు కన్నా లోకేష్ మరింత సమర్థవంతంగా పనిచేశారు అనేది తెలుగుదేశం వాదన. ఇది వాదన కాదు లోకేష్ బాబుకు స్థాయికి నుంచి ఎలివేషన్లు ఇస్తూ ఆయన సామర్ధ్యాన్ని ప్రజల్లోకి మరింత గొప్పగా తీసుకువెళ్లడానికి టీడీపీతో పాటు దాని అనుబంధ మీడియా సోషల్ మీడియా వ్యవస్థలకు కూడా శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాయి. క్యాబినెట్లో కేవలం ఒక మంత్రిగా ఉన్న లోకేష్ అన్ని శాఖలను సమన్వయపరుస్తున్నారని వివిధ శాఖలపై అవగాహన పెంచుకొని ఆ మంత్రులను సైతం కమాండ్ చేస్తూ మార్గదర్శకునిగా నిలబడ్డారని టీడీపీ సోషల్ మీడియా విభాగం ఇప్పటికే ఎలివేషన్లు ఇస్తుంది. తెలుగుదేశం నాయకులు, మంత్రులు కూడా లోకేష్ సామర్థ్యాన్ని గొప్పగా చెబుతూ ఆయనకు తిరుగులేదు అన్నట్లుగా మాట్లాడుతున్నారు.లోకేష్ ప్రాక్టీస్ కోసం మోంథా సహాయ చర్యలు..వాస్తవానికి ప్రస్తుత ప్రభుత్వ కాలంలోనే అంటే 2029 ఎన్నికలలోపే లోకేష్‌ను ముఖ్యమంత్రిగా ప్రతిష్టించాలన్నది చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి అభీష్టంగా కనిపిస్తున్నది. దీనికి సపోర్టివ్ అన్నట్లుగా ఇప్పటికే తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం లోకేష్ బాబుకు ఎనలేని ప్రాధాన్యమిస్తూ చంద్రబాబు సమక్షంలోనే చినబాబును ముఖ్యమంత్రిగా చేయాలంటూ డిమాండ్లు చేస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే లోకేష్ సత్తాను, సమర్ధతను చాటుకోవడానికి ఈ తుఫాను సహాయ చర్యలు.. ముందస్తు ఏర్పాట్లు.. ప్రజలకు పునరావాస కల్పన.. విద్యుత్ పునరుద్ధరణ.. వంటి పనులన్నీ లోకేష్ సునాయాసంగా చేసేసినట్లుగా తెలుగుదేశం నాయకులు చెబుతున్నారు. అంటే ఈ విపత్తు.. లోకేష్‌కు ఒక ప్రాక్టీస్ మ్యాచ్ లాగా ఉపయోగపడిందని టీడీపీ భావిస్తోంది. ఇక, ఆయన అన్ని పనులు చేసేయగలుగుతున్న నేపథ్యంలో లోకేష్‌ను ఇక ముఖ్యమంత్రిగా చేసేయాల్సిందే అన్నట్లుగా డిమాండ్లు వస్తున్నాయి. నెట్ ప్రాక్టీస్ బాగా చేసి బ్రహ్మాండమైన పనితీరు కనబరుస్తున్నందున ఆయన్ను ముఖ్యమంత్రిగా చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతున్నారు.మరోవైపు.. మోంథా తుఫాను రైతులను, ఇతర ప్రజలను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టిన లోకేష్‌కు మాత్రం ప్రయోజన కార్యగా మారిందని.. ఆయన సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఆ ఉత్పాతం ఒక అవకాశంగా మారిందని తెలుగుదేశం నాయకులు చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే లోకేషను ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేయాల్సిందే అన్నట్లుగా ఎలివేషన్లు ఇస్తున్నారు. దీనికి జనసేనాని పవన్ కళ్యాణ్, కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఏమంటారో చూడాలి.-సిమ్మాదిరప్పన్న. -
మోంథా తుఫాన్ కు ఎంత ధైర్యం.. బాబు గారు సీఎంగా ఉంటే వస్తదా?
-
బాబు గారు సీఎంగా ఉంటే వస్తదా? ఎల్లో మీడియా వార్తలపై ఈశ్వర్ సెటైర్లు
-
ఇంతటి విపత్తులో కూడా నీ ప్రచార పిచ్చి ఏంటి బాబూ!
-
చంద్రబాబు ప్రచార ‘విపత్తు’
సాక్షి, అమరావతి: ‘‘కుదర్లేదు కాని... కుదిరితే ఆ మోంథా తుపానును పట్టుకుని తిప్పికొట్టేవారు..!’’ ‘‘ఎన్నో తుపాన్లను సమర్థంగా అడ్డుకున్న చరిత్ర చంద్రబాబుది. ఆయన సలహా కోసం ఇతర రాష్ట్రాల సీఎంలే సంప్రదించేవారు..’’ ఇదీ సీఎం చంద్రబాబు గురించి ఎల్లో మీడియాలో సాగుతున్న భజన. విపత్తులను కూడా రాజకీయ మైలేజీకి వాడుకోవడంలో దిట్ట అయిన చంద్రబాబు ఇప్పుడు తుపానును అవకాశంగా తీసుకున్నారు. విదేశాల నుంచి చేరుకున్న బాబు, ఆయన కుమారుడు మంత్రి లోకేశ్ క్షేత్రస్థాయికి వెళ్లకుండా ఆర్టీజీఎస్ కేంద్రం నుంచే హడావుడి చేశారు. ప్రకృతి వైపరీత్యాన్ని తండ్రీకొడుకులే అడ్డుకున్నారన్న స్థాయిలో ప్రచారం హోరెత్తించారు. దీన్నంతటినీ గమనిస్తున్న ప్రజలు విపత్తు సమయంలో కూడా ఈ ప్రచార యావ ఏంటి బాబూ? అని మండిపడుతున్నారు. » మోంథా తుపాను ప్రళయం సృష్టిస్తుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి సమయంలో మంత్రులు సొంత జిల్లాల్లో ఉండి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సహాయ చర్యలను పర్యవేక్షించాలి. స్థానిక యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలి. ఇలాగైతే తమకు క్రెడిట్ దక్కదనుకున్నారో ఏమో? చంద్రబాబు, లోకేశ్. విదేశాల నుంచి వచ్చాక మోంథాను మొత్తం వారే పర్యవేక్షించినట్టు హైప్ సృష్టించి మిగిలినవారిని డమ్మీలను చేశారని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్లనే తుపాను ప్రభావిత జిల్లాల్లో చాలా మంది మంత్రులు ఫోన్లలో ఆదేశాలు, అడపాదడపా పర్యటనలకే పరిమితం అయ్యారని గుసగుసలాడుతున్నారు. ఈ విషయాన్ని టీడీపీకి చెందిన కొందరు సీనియర్ నాయకులు సైతం అంగీకరిస్తున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌తోపాటు మరో ముగ్గురు మంత్రులు అమరావతి నుంచే హడావుడి చేశారు. కానీ, తండ్రీకొడుకులే అంతా పర్యవేక్షిస్తున్నట్టు ప్రచారం జరిగింది. ఈ మేరకు ఎల్లో మీడియా సైతం విపరీతంగా ప్రచారం చేసింది. దీన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్దఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు. » మోంథా తుపానుతో పెను ముప్పు అని ప్రజలు ఆందోళన చెందినా కొద్దిపాటి ప్రభావంతో తీరం దాటింది. ప్రభుత్వ పెద్దలు ప్రచారం ఊదరగొట్టినా పలుచోట్ల పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి సకాలంలో ఆహారం కూడా అందించలేకపోయారు. అయినా, ఎంతో చేసేసినట్టు అదే పనిగా ప్రచారం ఊదరగొట్టడంపై బాధితులు మండిపడుతున్నారు. భారీ వర్షాలు లేనప్పుడు నీరు వస్తుందా? వ్యవస్థలను మేనేజ్ చేయడంలో, వాస్తవాలకు మసిపూయడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబుతో పాటు పచ్చ పత్రికలు మోంథా వేళ కూడా అదే పంథాలో నడిచాయి. అయితే, గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకున్న చందంగా దానికీ పెద్ద కలరింగ్ ఇచ్చారు. వర్షాలకు బుడమేరు ప్రాంతం మునిగిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇక్కడ ఇలాంటి పరిస్థితి లేదంటూ ఓ పత్రికలో పెద్ద ఫొటోతో వార్త ప్రచురించారు. ఇది చూసిన పాఠకులు అసలు భారీ వర్షాలు లేకుండా ఎలా నీరు చేరుతుంది? ఈ రాతలు ఎవరి మెప్పు కోసం? అని చర్చించుకోవడం కనిపించింది. ‘ఆయన రెండు చేతుల్తో పట్టుకొని ఈ తుపాన్‌ను వెనక్కు పంపేవాడే.. ఆ రోజులుకూడా వస్తాయి.. ‘!! మహాటీవీ బిల్డప్..!! నిజమే కదా.! ఆయన వేసవికాలంలో టెంపరేచర్ తగ్గిస్తాడు. ఎద్దులతో విద్యుత్ ఉత్పత్తి చేస్తాడు. సముద్రాన్ని వెనక్కు పంపుతాడు అసలాయన తలుచుకుంటే కానిదేముంది బాబు.!! – ఓ నెటిజన్ -
క్రెడిట్ చోరీ... డెబిట్ బదిలీ!
నిజాలపై నివురు కప్పడం, అసత్యాలకు అలంకారం చేయడం ఇప్పుడొక రాజకీయ క్రీడ. ఇందులో చంద్రబాబు, ఆయన బృందం ఆరితేరిన ఆటగాళ్లని ప్రశస్తి. ఈ ఖ్యాతిలో సింహభాగం యెల్లో మీడియాకు దక్కుతుంది. ఈ మీడియా గత మూడు దశాబ్దాలుగా ఊదరగొట్టిన ఫలితంగా, తెలుగునాట ప్రత్యామ్నాయ మీడియా నిలబడకుండా చేసిన కుట్రల కారణంగా నిజంగానే చంద్రబాబును ఒక ఐటీ నిపుణుడిగా, దూరదృష్టి గల విజనరీగా నమ్మేవారి సంఖ్య గణనీయంగానే ఉన్నది. సాంఘిక శాస్త్రాల అధ్యయనానికి దూరమై ప్రాపగాండా ప్రవాహంలో కొట్టుకుపోయే నవతరంలో కూడా ఇటువంటి అభిప్రాయాలున్నాయి.ఈ వ్యవహారంలో అసలు వాస్తవాలేమిటో తెలిసిన వారు లేకపోలేదు. అప్పుడూ ఉన్నారు. ఇప్పుడూ ఉన్నారు. కానీ నిజం నిద్ర లేచే సరికే అబద్ధం ఊరేగివస్తుందంటారు కదా! అదే జరుగుతున్నది. చంద్రబాబుకు విజనరీ వేషం వేయడానికి యెల్లో మీడియా పౌండ్రక వాసుదేవ పాత్రను కాపీకొట్టినట్టుంది. వసుదేవుని కుమారుడు గనుక శ్రీకృష్ణ పరమాత్మను వాసుదేవుడంటారు. ఆ వసుదేవునికి ఇంకో కొడుకుండేవాడట! ఆయనకు కొందరు ‘వాలతుల్యుల’తో కూడిన ఒక కోటరీ ఉండే దట! అసలైన వాసుదేవుడివి నువ్వేనంటూ ఈ కోటరీ ఉబ్బేయ డంతో ఆయన కూడా నెమలి పింఛం ధరించడం, పిల్లనగ్రోవి పట్టుకోవడం సహా కృష్ణ వేషధారణ వేయడం మొదలు పెట్టాడట! అంతటితో ఆగలేదు – తన వేషాన్ని వేసుకోవద్దని శ్రీకృష్ణుడినే బెదిరించేదాకా వెళ్లాడు.ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మొన్నటి మీడియా సమావేశంలో ఇటువంటి పౌండ్రక వాసు దేవ ఇమేజ్‌నే చీల్చి చెండాడారు. నేటి తరం రాజకీయ నేతల్లో అత్యంత జనాకర్షణ కలిగిన నాయకుడు జగన్మోహన్రెడ్డి. ఆయన ప్రెస్మీట్లను గానీ, ఇతర కార్యక్రమాలను గానీ ఒక్క ‘సాక్షి’ యూ–ట్యూబ్ ప్లాట్‌ఫామ్ వీడియోల్లోనే 50 లక్షల మందికి పైగా వీక్షిస్తారు. ‘సాక్షి’ టీవీ, దాని డిజిటల్ ప్లాట్ ఫామ్లతోపాటు ఇతర దృశ్య మాధ్యమాలతో కలిపితే ఈ సంఖ్య ఒక్కరోజులోనే కోట్లలో ఉంటున్నది. దీనికి పత్రికా పాఠకులు, డిజిటల్ ఎడిషన్లలో చదివే వారి సంఖ్య తోడవుతుంది. ఆయన మెసేజ్‌లు ఈ స్థాయి విస్తృతికి చేరడమే కాదు, వాటికి విశ్వస నీయత కూడా ఎక్కువ. జగన్మోహన్రెడ్డి ప్రసంగాల్లో ఊకదంపుడు తక్కువ. సూటిగా తాను చెప్పదల్చుకున్న పాయింట్‌ను ప్రస్తావించడం, అందుకు సాక్ష్యంగా సాధికారికమైన లెక్కల్ని ఉటంకించడం, డాక్యుమెంట్లను ప్రదర్శించడం ఆయన అనుస రించే పద్ధతి. ఈ వైఖరి కారణంగా కూటమి సర్కార్ బండారాన్ని ఏడాదికాలంలోనే బట్టబయలు చేయగలిగారు.గురువారం జరిగిన మీడియా సమావేశంలో నాలుగు అంశాలపై జగన్ మాట్లాడారు. ముఖ్యంగా సర్కార్ ఆడుతున్న కల్తీ లిక్కర్ నాటకంపైనా, డేటా సెంటర్‌కు సంబంధించి చేస్తున్న క్రెడిట్ చౌర్యంపైనా సుదీర్ఘంగా మాట్లాడారు. ‘క్రెడిట్ చోరీ’ అనే మాటను కాయిన్ చేస్తూ, సైబర్ టవర్స్, ఔటర్ రింగ్‌రోడ్డు, ఎయిర్‌పోర్టు దాకా హైదరాబాద్ నిర్మాతగా బాబు తగిలించుకున్న నకిలీ మెడల్స్‌ను పీకిపారేశారు. ఆరెకరాల స్థలంలో లక్షా నలభైవేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కట్టిన ‘సైబర్ టవర్స్’కు ‘హైటెక్ సిటీ’ అని నామకరణం చేసి ప్రచారం చేసుకున్న వైనాన్ని ఆయన ఎండగట్టారు. ఆ భవనానికి కూడా అంతకుముందే కాంగ్రెస్ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేసిన విషయాన్ని కూడా గుర్తుచేశారు. వైఎస్సార్ హయాంలో ప్రారంభించి, భూసేకరణతోపాటు తొలి దశ నిర్మాణం కూడా పూర్తిచేసుకున్న ఔటర్ రింగ్ రోడ్డు, ఆయన హయాంలోనే ప్రారంభమై పూర్తిచేసుకొని వినియోగంలోకి వచ్చిన ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, 12 కిలోమీటర్ల ‘పీవీ ఎక్స్ ప్రెస్ వే’లు హైదరాబాద్ నగరాభివృద్ధికి వన్నెలద్దిన విషయాన్ని జగన్ గుర్తుచేశారు.ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు గద్దెదిగే నాటికి రాష్ట్ర ఐటీ ఎగుమతుల విలువ రూ.5,660 కోట్లు మాత్రమే. దేశంలో నాలుగో స్థానం. వైఎస్సార్ అధికారంలోకి వచ్చిన ఐదేళ్ల లోనే రాష్ట్రం రెండో స్థానానికి ఎగబాకింది. ఎగుమతుల విలువ రూ.32,500 కోట్లకు చేరింది. కేసీఆర్ పదేళ్ళ పాలన తర్వాత ఆ ఎగుమతులు రెండు లక్షల కోట్లకు చేరుకున్నాయి. తాను న్యూయార్క్‌లో ఉన్నానా, హైదరాబాద్‌లో ఉన్నానా అని హీరో రజనీకాంత్‌కు ఆశ్చర్యం కలిగించిన దృశ్యాలన్నీ కేసీఆర్ కాలంలోనే ఆవిష్కృతమయ్యాయి. ఇలాంటి వాస్తవాలతో పొంతన లేకుండా వందిమాగధ మీడియా బృందంచే బాబు వేయించు కున్న వీరతాళ్ల బాగోతాన్ని జగన్ విప్పిచెప్పారు. అన్నిటికంటే ముఖ్యం – తాజా డోల్బాజా విశాఖ డేటా సెంటర్.ఈ డేటా సెంటర్ మీద టీడీపీ యెల్లో మీడియా సృష్టించిన సంరంభాన్ని, జగన్ మీడియా సమావేశానికి ముందూ, వెనకగా విభజించాలి. గురువారానికి ముందు ఆ సందడే వేరు! సాక్షాత్తూ గూగుల్ సంస్థే ఆంధ్రప్రదేశ్ కేరాఫ్ చంద్రబాబు అడ్రస్ వెతుక్కుంటూ వచ్చి దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి సిద్ధమైందని ప్రచారం చేశారు. జరిగిన నేపథ్యాన్ని, అంతకుముందే పడిన పునాదిని మరుగునపెట్టారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఒకటే హోరు. చంద్రబాబంటే డేటా సెంటర్లు, అమరా వతి నిర్మాణాలు – జగనంటే మటన్ షాపులు, చికెన్ సెంటర్లని ప్రచారం చేశారు. జగనంటే పోర్టులు, ఎయిర్‌పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, పిల్లలందరికీ నాణ్యమైన ఉచిత విద్య, అందరికీ ఆరోగ్యశ్రీ, ఇంటింటికీ ఫ్యామిలీ డాక్టర్, 30 లక్షలమంది ఇళ్లు – ఇళ్ల స్థలాలు, అధికార వికేంద్రీకరణ, రైతు భరోసా కేంద్రాలు అనే విషయాన్ని జనం మరిచిపోయి ఉంటారని వారి నమ్మకం కావచ్చు. గురువారం నాటి జగన్ సమావేశం తర్వాత టీడీపీ నేతలు, యెల్లో మీడియాల సందడి తేలు కుట్టిన దొంగల చందంగా మారింది.ప్రతిపక్ష నేత వెల్లడించిన వివరాల ప్రకారం 2020 నవంబర్లోనే విశాఖలో 300 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు అదానీ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వానికి ఒప్పందం కుదిరింది. డేటా సెంటర్‌కు డేటా తీసుకురావడానికి వీలుగా సింగపూర్ నుంచి 3,900 కిలోమీటర్ల పొడవునా సబ్‌సీ (సముద్ర మార్గం) కేబుల్ వేయాల్సి ఉంటుంది. ఇందుకోసం సింగపూర్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం 2021 మార్చి 9నే లేఖ రాసింది. ఈ లేఖ కాపీని కూడా ఆయన విడుదల చేశారు. ఢిల్లీ సమీపంలోని నోయిడాలో డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్ అనుబంధ సంస్థ రైడాన్ ఇన్ఫోటెక్‌తో అదానీ సంస్థకు ఒప్పందం కుదిరింది. ఈమేరకు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’లో అప్పుడే ప్రచురితమైన వార్తా కథనం కటింగ్‌ను జగన్ విడుదల చేశారు. అంటే మూడేళ్ళుగా ఈ రంగంలో అదానీ గ్రూప్, గూగుల్ కలిసి పనిచేస్తున్నాయి. 2023 మే నెలలో విశాఖలో డేటా సెంటర్‌కు శంకుస్థాపన జరిగింది. అంతకుముందటి రెండేళ్ళలో ఎక్కువకాలం కోవిడ్ పరిస్థితులు న్నాయని గమనంలో ఉంచుకోవాలి.ఇప్పుడు కూటమి సర్కార్ ఆర్భాటంగా ప్రకటించుకున్న వెయ్యి మెగావాట్ల గూగుల్ సెంటర్, 2023లో జగన్ శంకు స్థాపన చేసిన 300 మెగావాట్ల అదానీ డేటా సెంటర్ విస్తరణ మాత్రమే! ఈ డేటా సెంటర్‌కు అవసరమైన సబ్ సీ కేబుల్, డేటా ల్యాండింగ్ స్టేషన్ల ఏర్పాటుకు అవసరమైన పూర్వరంగం జగన్ హయాంలోనే సిద్ధమైంది. కేవలం డేటా సెంటర్ మాత్రమే అయితే ఉద్యోగాల కల్పన పెద్దగా ఉండదు కాబట్టి దానికి అనుబంధంగా ఐటీ పార్క్, స్కిల్ సెంటర్, రిక్రియేషన్ సెంటర్లు ఏర్పాటు చేసి, పాతిక వేలమందికి ఉపాధి కల్పించాలని జగన్ సర్కార్ షరతు పెట్టింది. ఇప్పుడు ముందుకొచ్చిన విస్తరణలో అటువంటిదేమీ కనిపించలేదు. కేవలం డేటా సెంటర్ మాత్రమే. దాని ఏర్పాటుకు దోహదం చేసిన పూర్వరంగంలోని అదానీ– గూగుల్ గ్రూప్‌తో పాటు అప్పటి జగన్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వం పాత్రధారులే! పాత్రధారులందరినీ మరుగునపెట్టి, కేవలం గూగుల్కూ, చంద్రబాబుకూ మధ్య జరిగిన ఒప్పందం ఫలితంగా వచ్చిన కొత్త ప్రాజెక్టుగా కూటమి సర్కార్ ప్రచారం చేసుకున్న తీరును జగన్ ప్రశ్నించారు.‘క్రెడిట్ చోరీ’ అనే పదబంధం కొత్తది కావచ్చు కానీ, ఇతరుల క్రెడిట్‌ను చంద్రబాబు కోసం యెల్లో మీడియా కొట్టేస్తుందనే విషయం చాలాకాలంగా తెలిసిందే. ఈ విధానా నికి ఇంకో పార్శ్వం కూడా ఉన్నది. అదే డెబిట్ బదిలీ. తాము తప్పు చేస్తూ, ఆ తప్పును ప్రత్యర్థుల ఖాతాలో వేయడం! మీడియా సమావేశంలో జగన్ ప్రస్తావించిన నకిలీ లిక్కర్ తయారీ అంశం ఈ కోవలోనిదే. రాష్ట్రవ్యాప్తంగా ఒక పరిశ్రమ మాదిరిగా విరాజిల్లుతున్న నకిలీ మద్యం తయారీ, సరఫరా వ్యవహారాన్ని ఫోటోలతో సహా ఆయన మీడియా ముందు బహిరంగపరిచారు. ముల్కల చెరువు, ఇబ్రహీంపట్నం, పర వాడ, అమలాపురం, పాలకొల్లు, ఏలూరు, రేపల్లె, నెల్లూరుల గురించే ఆయన ప్రస్తావించినప్పటికీ ఇటువంటి కార్ఖానాలు ఇంకా డజన్లకొద్దీ ఉన్నట్టు సమాచారం.నకిలీ మద్యం తయారీ – అమ్మకాలపై కూటమి ప్రభుత్వం ప్రారంభం నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు కనిపి స్తున్నది. ఈ రంగంలో అనుభవం ఉన్న జయచంద్రారెడ్డి అనే వ్యక్తికి పార్టీ తరఫున ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చి పోటీకి నిలిపారు. ఈ కార్యక్రమంలో మరో ‘నిపుణుడు’ జనార్దన్‌రావు కూడా పాల్గొన్నట్టు వార్తలు, ఫోటోలు బయటకు వచ్చాయి. జగన్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన మద్యం షాపుల వ్యవస్థ ఈ నకిలీ మద్యం ప్రవాహానికి అనుకూలించదు. అందువల్ల దాన్ని రద్దు చేయాలి. మద్యం అలవాటును నియంత్రించే ఉద్దేశంతో జగన్ ప్రైవేట్ వ్యాపారుల వ్యవస్థను తొలగించారు. బెల్ట్‌షాపులను, పర్మిట్ రూములను పూర్తిగా తొలగించారు. లైసెన్స్డ్ మద్యం షాపులను కూడా కుదించి, ప్రభుత్వ రంగంలోనే నిర్ణీత వేళల్లో మాత్రమే అమ్మకాలు సాగించారు.సామాజిక ప్రయోజనాల రీత్యా, ఆరోగ్యాల రీత్యా కూడా అది మంచి వ్యవస్థ. దాన్ని తొలగించి ప్రైవేట్ వ్యాపారాన్ని ప్రవేశపెట్టాలంటే ఉన్న వ్యవస్థ మంచిది కాదని ప్రచారం చేయాలి. కూటమి సర్కార్ అదే పని చేసింది. వ్యాపారాన్ని ప్రైవేట్ వాళ్లకు అప్పగించి అమ్మకాలను ప్రోత్సహించినట్లయితే, బెల్ట్ షాపులకు ఇబ్బడిముబ్బడిగా అనుమతులిచ్చినట్లయితే, మద్యం తయారు చేసే డిస్టిలరీలకు కొత్తగా అనుమతులిచ్చి నట్లయితే అందులో స్కామ్ ఉండేందుకు అవకాశం ఉంటుంద నేది కామన్సెన్స్. ఇవేమీ లేని వ్యవస్థలో స్కామ్ జరిగిందనేది ఏడాది కాలంగా సర్కార్ చేస్తున్న న్యూసెన్స్. దీనికోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించి డైలీ సీరియల్ మాదిరిగా ఈ కేసును నడుపుతున్నారు. జగన్ హయాంలో స్కామ్ జరిగిందని నమ్మించడానికి అనేకమంది ముఖ్యనాయకులను, ప్రముఖ వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు. ఎటువంటి ఆధారాలు లేకున్నా సరే, ఒకరిద్దరిని బెదిరించి తీసుకున్న వాఙ్మూలాల ఆధారంగా ఈ కేసు నడుస్తున్నది. ఈ దర్యాప్తు నిర్వా కాన్ని చూసి పలుమార్లు న్యాయస్థానం కూడా అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.అయితే అసలు ఉద్దేశం వేరు. ఈ కేసు పేరుతో రచించే బేతాళ కథలతో మీడియాను ముంచెత్తుతూ, నిశ్శబ్దంగా నకిలీ మద్యం వ్యాపారం – తయారీ రాష్ట్రమంతటా విస్తరించింది. కేవలం మూడువేల పైచిలుకు మద్యంషాపులు, అవి ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రభుత్వ ఆధ్వర్యంలో అమ్మకాలు జరిగే వ్యవస్థ పాతది. ఇప్పుడు ప్రతి షాపుకూ ఓ బార్ లాంటి భారీ పర్మిట్ రూమ్ నడుస్తూ, అరవైవేల పైచిలుకు బెల్టు షాపుల్లో తాగిస్తున్నప్పుడు గతంతో పోలిస్తే అమ్మకాలు ఎన్ని రెట్లు పెరగాలి? కానీ, ఎక్సైజ్ ఆదా యాన్ని చూస్తే ఏటికేడు సహజంగా పెరగాల్సినంత కూడా పెరగడం లేదు. మరి ఇన్ని పర్మిట్ రూమ్లూ, బెల్ట్ షాపుల ద్వారా వస్తున్న రెండు మూడు రెట్ల ఆదాయం ఎక్కడికి పోతు న్నట్టు? ... నకిలీ మద్యం పాలవుతున్నట్టు లెక్క.ముల్కల చెరువు, ఇబ్రహీంపట్నం కార్ఖానాలు బయట పడకముందే తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో ఏపీ సరిహద్దున ఉన్న మేళ్ళచెరువులో ఇటువంటి కార్ఖానా బయట పడింది. దర్యాప్తులో ఈ కార్ఖానాకు జనార్దన్‌రావుకు సంబంధా లున్నాయని వెల్లడైనట్టు విశ్వసనీయ సమాచారం. దుకాణా న్నయితే మూసేశారు కానీ, తెలంగాణ ఎక్సైజ్ సిబ్బంది ఇంకా ముందుకెళ్లి దర్యాప్తు చేయలేదు. జనార్దన్‌రావు పేరు బయటకు రాకుండా తెలంగాణ అధికార యంత్రాంగాన్ని ప్రభావితం చేయగల స్థితిలో ఉన్న ఆంధ్ర నేతలెవరు?... కనిపెట్టడం ఓ బ్రహ్మవిద్యేం కాదు గదా! రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ బంధువైన చంద్రశేఖరనాయుడు ఎక్సైజ్ శాఖలో మాజీ అధికారి. జాయింట్ కమిషనర్‌గా పనిచేసి ఐదేళ్ల కిందనే రిటైరయ్యారు. అధికారికంగా ఆయన్ను ఈ ఫిబ్రవరి నెల నుంచి ఎక్సైజ్ శాఖలో ఓఎస్డీగా నియమించారు. రాష్ట్రంలో ఉన్న డిస్టిలరీలు, బ్రూవరీ లన్నింటినీ ఆయన అజమాయిషీలోకి తెచ్చారని సమాచారం. అనధికారికంగా అంతకుముందు నుంచే ఆయన ఈ పనుల్ని చక్కబెడుతున్నారని ఆ శాఖలో ఉన్న టాక్. నకిలీ మద్యం తయారీదారులు మందుబాబుల్ని బురిడీ కొట్టించడం కోసం అసలు బ్రాండ్లకు సంబంధించిన ఫ్లేవర్ వచ్చేలా ఎసెన్స్‌ను కొంత కలుపుతున్నారని తెలుస్తున్నది. ఈ ఎస్సెన్స్ ఆ బ్రాండ్ కంపెనీల వద్ద గానీ, దాన్ని లీజుకు తీసుకున్న డిస్టలరీల వద్దగానీ ఉంటుంది. మరి నకిలీ కార్ఖానాలకు ఎలా చేరుతున్నాయనేది రాజకోట రహస్యమే! ఇప్పుడు జరుగుతున్న కల్తీ మద్యం వ్యాపారంలో కూడా వైసీపీ వాళ్లను ఇరికించడమెలా అనే అంశంపై అధికార యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. కొంతమందిని కొంతకాలం మోసం చేయవచ్చు. కానీ అందరినీ ఎల్లకాలం మోసం చేయలేరనే నానుడి ఏమవుతుందో చూద్దాం.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
లోకేష్ గాలి తీసిన ఈనాడు
-
ఎల్లో మీడియాకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి సవాల్
సాక్షి, కర్నూలు జిల్లా: ఎల్లో మీడియాకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి సవాల్ విసిరారు. ప్రధాని మోదీ పర్యటనలో వైఎస్సార్సీపీ నేతలు కలవలేదని అసత్య ప్రచారం చేసిన ఎల్లో మీడియాకు ఆయన కౌంటర్ ఇచ్చారు. మేం ఫేక్ ఎమ్మెల్యేలం కాదు.. ఎల్లో మీడియా ఫేక్ అంటూ విరూపాక్షి మండిపడ్డారు. మేం వినతి పత్రం ఇవ్వలేదని నిరూపిస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. నిరూపించకపోతే ఈటీవీ, ఏబీఎన్ మూసేస్తారా? అంటూ విరూపాక్షి ఛాలెంజ్ విసిరారు.వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వమే చేపట్టాలని.. ప్రజల సమస్యలపై పోరాటం చేస్తుంటే దాన్ని పచ్చ మీడియా తప్పుదోవ పట్టిస్తుందంటూ విరూపాక్షి దుయ్యబట్టారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రధాని మోదీకి వినతి పత్రం ఇస్తే జీర్ణించుకోలేక పోయారంటూ ఎల్లో మీడియాపై ఆయన మండిపడ్డారు.కాగా, మెడికల్ కళాశాలలను ఏపీలోని కూటమి ప్రభుత్వం ప్రైవేట్‌పరం చేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా చర్యలు చేపట్టాలని వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిధులు ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. గురువారం(అక్టోబర్ 16, గురువారం) కర్నూలుకు వచ్చిన మోదీని ఓర్వకల్లు విమానాశ్రయంలో జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, ఆలూరు ఎమ్మెల్యే బి.విరూపాక్షి కలిసి పలు అంశాలపై వినతి పత్రాన్ని అందించారు.అనంతరం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డితో కలిసి వినతిపత్రంలో పేర్కొన్న అంశాలను మీడియాకు వివరించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర ప్రభుత్వ సహకారంతో 17 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారన్నారు. 2023–24 విద్యా సంవత్సరం నుంచి 5 మెడికల్ కళాశాలలు కూడా ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు.ఈ కళాశాలల నిర్వహణను ప్రస్తుత కూటమి ప్రభుత్వం పీపీపీ తరహాలో ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు అప్పగించడంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందన్నారు. జిల్లాలో రక్షిత మంచినీటి పథకాల నిర్వహణకు అధిక నిధులు విడుదల చేసేలా నీతి ఆయోగ్‌కు సూచనలు ఇవ్వాలని కోరామన్నారు. తెలంగాణలోని కల్వకుర్తి నుంచి ఏపీలోని నంద్యాల వరకు నిరి్మంచనున్న 167కే జాతీయ రహదారి మధ్యలో కొల్హాపూర్ సమీపంలో ప్రవహిస్తున్న కృష్ణా నదిపై వైర్ కమ్ రోడ్ వంతెనగా మార్చాలని కోరామన్నారు. 2019లో ఇచ్చిన హామీ మేరకు వాల్మీకులకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలని కోరామన్నారు. -
ముఖ్యనేత డైరెక్షన్... జనార్దన్ యాక్షన్!
సాక్షి, అమరావతి: భారీ దోపిడీయే లక్ష్యంగా నకిలీ మద్యం మాఫియాతో బరితెగించి అడ్డంగా దొరికిన ముఖ్యనేత సరికొత్త కుట్రకు తెరతీశారు. ఇప్పటికే భేతాళ కథలతో, అక్రమ కేసులతో విరుచుకుపడుతున్న ఆయన ఈ కుతంత్రాన్ని పతాకస్థాయికి చేర్చి పొలిటికల్ సోషియో ఫాంటసీ కథతో కనికట్టు చేసే ఎత్తుగడ వేశారు. ఐదేళ్లలో రూ.45 వేల కోట్ల మద్యం దోపిడీ కుట్రలో పాత్రధారి జనార్దన్‌రావుతో డైవర్షన్ కుట్రకు ముఖ్యనేత పక్కా స్క్రిప్టుతో రంగంలోకి దిగారు. ఈ కుట్ర సినిమా షూటింగ్ కోసం పోలీసులే ఆర్ట్ డైరెక్షన్ బాధ్యత భుజానికెత్తుకుని గుర్తు తెలియని ప్రదేశంలో సెట్ రెడీ చేశారు. ముఖ్యనేత స్టార్ట్ కెమెరా అనగానే.. జనార్దన్‌రావు చిలుక పలుకుల్లా డైలాగులు చెప్పేశారు! ఆయన దారి తప్పకుండా పక్కనుంచి పోలీసులు ప్రాంప్టింగ్ అందిస్తూ డైలాగులు గుర్తు చేశారు. నకిలీ మద్యంపై ప్రజలను తప్పుదారి పట్టించేలా వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ చుట్టూ కట్టుకథ అల్లారు. ముఖ్యనేత అనుకున్నట్లుగా కుట్రకథ చిత్రీకరణ పూర్తి కాగానే ప్యాకప్ చెప్పారు. ఆదివారం తన నివాసంలో ఈ కుట్ర కథ గురించి మీడియాకు లీకులు ఇచ్చి టీజర్ విడుదల చేసిన ముఖ్యనేత.. సినిమా విడుదలకు సోమవారం ముహూర్తం పెట్టారు. టీడీపీ వీరవిధేయులతో సిట్ ఏర్పాటు చేసిన వెంటనే తమ పొలిటికల్ సోషియో ఫాంటసీ సినిమా రిలీజ్‌కు పచ్చ జెండా ఊపారు. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, డైరెక్షన్.. అంతా ముఖ్యనేత కేంద్రంగా సాగిన ఆ తెర వెనుక కుట్ర ఇలా ఉంది.. ఆధారాలతో అడ్డంగా దొరికిన టీడీపీ మాఫియా.. దిక్కుతోచని స్థితిలో ముఖ్యనేత టీడీపీ కూటమి ప్రభుత్వం పక్కా పన్నాగంతో రాష్ట్రంలో వ్యవస్థీకృతం చేసిన నకిలీ మద్యం మాఫియా బాగోతం ఆధారాలతో సహా బట్టబయలైంది. ఐదేళ్లలో రూ.45 వేల కోట్ల దోపిడీ కుతంత్రం పూర్తి ఆధారాలతో బయటపడటంతో మాఫియా సూత్రధారిగా ఉన్న ముఖ్యనేత బెంబేలెత్తారు. ఎందుకంటే.. ఈ దందాలో బయటపడిన పాత్రధారులు అందరూ ముఖ్యనేతకు అత్యంత సన్నిహితులే. 2024 ఎన్నికల ముందు చంద్రబాబు స్వయంగా టీడీపీ బీఫాం ఇచ్చి మరీ తంబళ్లపల్లె నియోజకవర్గ పార్టీ అభ్యర్థిగా నిలిపిన జయచంద్రారెడ్డి ఈ మాఫియాలో కీలక పాత్రధారి అన్నది నిగ్గు తేలింది. అన్నమయ్య జిల్లా ములకలచెరువులో టీడీపీ ఏర్పాటు చేసిన నకిలీ మద్యం తయారీ ప్లాంటు జంట హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న టీడీపీ నేత సురేంద్ర నాయుడుకు 2014లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండగా క్షమాభిక్ష ప్రసాదించిన విషయం వెలుగు చూసింది. ఆయన ద్వారానే జయచంద్రారెడ్డికి టీడీపీ టికెట్ లభించిందన్నది బయటపడింది. ఇక ఈ కేసులో ఏ1గా ఉన్న ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన అద్దేపల్లి జనార్ధన్‌రావు ఈ మాఫియాలో క్రియాశీల పాత్రధారి. జయచంద్రారెడ్డి టీడీపీలో చేరినప్పుడు, పార్టీ బీఫాం ఇచ్చినప్పుడు ఆయన కూడా అక్కడే ఉన్నారు. బీఫాం స్వీకరించేటప్పుడు సాధారణంగా అత్యంత సన్నిహిత కుటుంబ సభ్యులు మాత్రమే ఉంటారు. జయచంద్రారెడ్డికి టీడీపీ బీఫాం ఇస్తున్నప్పుడు జనార్దన్‌రావు పక్కనే ఉండటం వారి అనుబంధాన్ని బలపరుస్తోంది. నకిలీ మద్యం మాఫియాలో ప్రధాన పాత్రధారులైన జయచంద్రారెడ్డి, సురేంద్ర నాయుడు, జనార్దన్‌రావు టీడీపీ అధిష్టానానికి అత్యంత సన్నిహితులన్నది ఫొటో, వీడియో ఆధారాలతో సహా బహిర్గతమైంది. అన్నమయ్య జిల్లా ములకలచెరువులో పది రోజుల క్రితం బయటపడిన నకిలీ మద్యం మాఫియా వేళ్లు రాష్ట్రం అంతటా విస్తరించాయి. టీడీపీ సీనియర్ నేతలు ప్రాంతాలవారీగా నకిలీ మద్యం పంపిణీ బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు. ఈ బాగోతం అంతా ఫొటో, వీడియో ఆధారాలతోసహా బయటపడింది. టీడీపీ మద్యం సిండికేట్ ద్వారానే నకిలీ సరుకును మద్యం దుకాణాలు, పర్మిట్ రూమ్‌లు, బెల్ట్ దుకాణాలు, బార్లలో విక్రయిస్తున్నారన్న వాస్తవం వెల్లడి కావడంతో దేశవ్యాప్తంగా కలకలం రేగుతోంది. పచ్చముఠాల దందా, టీడీపీ పెద్దల నిర్వాకాలపై ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత పెల్లుబుకుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ధర్నాలు, ఆందోళనలతో రాష్ట్రం దద్దరిల్లుతోంది. దాంతో నకిలీ మద్యం మాఫియా సూత్రధారి, అంతిమ లబి్ధదారుగా ఉన్న ముఖ్యనేత బెంబేలెత్తారు. తమ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో ఆయన దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. దాంతో ఆగమేఘాలపై ఈ వ్యవహారాన్ని దారి మళ్లించాలని ఎత్తుగడ వేశారు. ఈ క్రమంలో తనకు అలవాటైన రీతిలో డైవర్షన్ కుట్రకు తెరతీశారు. సీబీఐ అంటే గుబులు... అందుకే ‘పచ్చ’ సిట్‌తో పన్నాగం! గతంలో నమోదు చేసిన అక్రమ మద్యం కేసులోగానీ... ప్రస్తుతం నకిలీ మద్యం కేసులో గానీ సీబీఐ దర్యాప్తు అంటేనే ముఖ్యనేత బెంబేలెత్తుతున్నారు. అందుకే టీడీపీ వీర విధేయ ఐపీఎస్ అధికారులతో కూడిన సిట్‌తో రాజకీయ వేధింపులకు పాల్పడడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై అక్రమ కేసులో సిట్ ద్వారానే వేధింపులకు పాల్పడుతున్న విషయం విదితమే. ఆ కేసును సీబీఐకి అప్పగించాలన్న వైఎస్సార్సీపీ డిమాండ్‌ను ఉద్దేశపూర్వకంగానే పట్టించుకోవడం లేదు. అయితే అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో సిట్ కుట్రలు వరుసగా బెడిసికొడుతున్నాయి. వైఎస్సార్సీపీ నేతలు, అప్పటి అధికారులకు వ్యతిరేకంగా సిట్ నమోదు చేసిన అభియోగాలు న్యాయస్థానాల్లో ఒక్కొక్కటిగా వీగిపోతున్నాయి. అదే సమయంలో అసలు మద్యం మాఫియాను నిర్వహిస్తోంది టీడీపీ పెద్దలేనన్న విభ్రాంతికర వాస్తవం వెలుగులోకి వచ్చింది. 2014–19లో టీడీపీ హయాంలో సిండికేట్ ద్వారా రూ.25 వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారు. ఆ అవినీతిని గతంలోనే సీఐడీ ఆధారాలతో సహా నిగ్గు తేల్చింది. ఈసారి టీడీపీ కూటమి ప్రభుత్వం ఏకంగా నకిలీ మద్యం దందాకు బరితెగించినట్లు ఆధారాలతోసహా వెల్లడైంది. భారీగా పట్టుబడిన నకిలీ మద్యం బాటిళ్లు అన్నమయ్య జిల్లా ములకలచెరువులో బయటపడిన కల్తీ మద్యం మాఫియా రాష్ట్రం అంతటా విస్తరించినట్లు నిగ్గు తేలింది. ఆ మాఫియా సూత్రధారి ముఖ్యనేత కాగా... పాత్రధారులు టీడీపీ నేతలు జయచంద్రారెడ్డి, సురేంద్రనాయుడు, అద్దేపల్లి జనార్దన్‌రావు... పంపిణీదారులు టీడీపీ సీనియర్ నేతలన్నది బట్టబయలైంది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని వైఎస్సార్సీపీతోపాటు ప్రజలూ డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్‌ను కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం తోసిపుచ్చడం గమనార్హం. తమకు అలవాటైన రీతిలో టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో మరో సిట్‌ను నియమించింది. తద్వారా నకిలీ మద్యం దందా సూత్రధారులు, పాత్రధారులైన టీడీపీ నేతలను ఈ కేసు నుంచి తప్పించే ఎత్తుగడ వేసింది. వైఎస్సార్సీపీ నేతలను అక్రమంగా ఈ కేసులో ఇరికించే కుట్రకు తెరతీసింది. అందులో భాగంగానే సిట్‌ను నియమిస్తూ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు విడుదల అయిన కాసేపటికే... ముఖ్యనేత డైరెక్షన్లో ఏ1 జనార్దన్ మాట్లాడిన వీడియోను ఎల్లో మీడి యా ద్వారా విడుదల చేయించారు. అది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం మీడియా సమావేశంలో చూచాయగా వెల్లడించిన విషయాలనే జనార్దన్ వీడియోలో వల్లె వేయడం గమనార్హం. మొదట పోలీసుల అదుపులో.. ఇప్పుడు జైల్లో .. అసలు జనార్దన్ మీడియాతో ఎలా మాట్లాడారు? ఎల్లో మీడియా ద్వారా విడుదలైన ఏ1 జనార్దన్‌రావు వీడియో ముఖ్యనేత కుతంత్రాన్ని బట్టబయలు చేసింది. ఆయన ప్రభుత్వానికి అధికారిక అతిథి అన్నది కూడా స్పష్టమైంది. కేసు దర్యాప్తును పక్కదారి పట్టించకుంటే నకిలీ మద్యం మాఫియా వెనుక ఉన్న టీడీపీ పెద్దల పేర్లను బయటపెడతానని జనార్దన్‌రావు బెదిరించినట్లు చర్చ జరుగుతోంది. దాంతో కేసును పక్కదారి పట్టిస్తామని ముఖ్యనేత డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో విదేశాల్లో ఉన్న జనార్దన్‌రావు ఓ సెలబ్రిటీ తరహాలో దర్జాగా గన్నవరం విమానాశ్రయంలో దిగారు. వెంటనే ఆయన్ను అరెస్టు చేసినట్టు ప్రకటించిన పోలీసులు ప్రభుత్వ అతిథిగా రాచమర్యాదలు చేశారు. ఇక తాజా వీడియో ఆయన ముఖ్యనేత కుట్రలో పాత్రధారేనని స్పష్టం చేసింది. అసలు జనార్ధన్‌రావు ఎల్లో మీడియాకు ఎలా ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వగలిగారన్నదే అంతు చిక్కని ప్రశ్న. ఎందుకంటే.. జనార్దన్‌రావును పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఆ రోజు గుర్తు తెలియని ప్రదేశంలో విచారించి శనివారం న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయస్థానం రిమాండ్ విధించంతో నెల్లూరు సబ్ జైలుకు తరలించారు. అంటే శుక్రవారం నుంచే ఆయన పోలీసులు, అనంతరం జైలు అధికారుల అదుపులో ఉన్నారు. ఆయన మాట్లాడిన వీడియోను ఎల్లో మీడియా సోమవారం విడుదల చేసింది. మరి ఆయన ఎల్లో మీడియాతో ఎప్పుడు మాట్లాడినట్లు...? పోలీసులు, జైలు అధికారుల అదుపులో ఉన్న వ్యక్తి నిబంధనల ప్రకారం మీడియాతో మాట్లాడకూడదు. అయినా సరే జనార్ధన్‌రావు ఎల్లో మీడియాతో మాట్లాడారంటే.. అది ప్రభుత్వ పెద్దల కుట్రలో భాగమేనన్నది సుస్పష్టం. పచ్చ పలుకులే పలికిన చిలుక... జనార్దన్‌రావు ఇక ఆ వీడియోను నిశితంగా పరిశీలిస్తే అసలు కుట్ర మరింత స్పష్టంగా వెల్లడవుతోంది. పక్కన పోలీసులు, టీడీపీ నేతలు పక్కనుంచి చెబుతున్న విషయాలనే జనార్ధన్ రావు వల్లె వేస్తున్నట్లు స్పష్టంగా వినిపిస్తోంది. తమ కుట్రకు అనుకూలంగా అవాస్తవాలను ఆయనతో చెప్పించారన్నది వెల్లడవుతోంది. ఫాంటసీ కథకు క్లాప్ కొట్టిన ముఖ్యనేత.. ఏ1 జనార్దన్రావుతోనే కట్టుకథల వీడియోసోషియో ఫాంటసీ సినిమాలు, యూట్యూబ్ వీడియోలను తలదన్నే రీతిలో ముఖ్యనేత కట్టుకథలతో కుతంత్రానికి తెర తీశారు. పిల్లలను ఊహా ప్రపంచంలో విహరింపచేసి మైమరపింపచేసే జానపద కథల మాదిరిగా పొలిటికల్ ఫాంటసీ కథకు క్లాప్ కొట్టారు. కల్తీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు (ఏ1) అద్దేపల్లి జనార్ధన్‌రావు ప్రధాన పాత్రధారిగా ఫాంటసీ కథలను వినిపించారు. ముఖ్యనేత స్క్రిప్టును ఆయనతో చెప్పించారు. ఆ ఫాంటసీ వీడియో షూటింగ్ బాధ్యతను ఎల్లో మీడియాకు అప్పగించారు. జనార్దన్‌రావుతో చెప్పించిన కట్టుకథ ముఖ్యనేత కుట్రకు పరాకాష్టగా నిలుస్తోంది. ఎంతగా అంటే.. ఈ కల్తీ మద్యం కేసులో ప్రధాన పాత్రధారిగా ఉన్న టీడీపీ నేత జయచంద్రారెడ్డి పాత్రేమీ లేదన్నట్లుగా చిత్రీకరించారు. ఇక మరో పాత్రధారి సురేంద్రనాయుడు ఊసే లేదు. నకిలీ మద్యం పంపిణీ బాధ్యతలు నిర్వహిస్తున్న టీడీపీ సీనియర్ నేతల ప్రస్తావనే లేకుండా జాగ్రత్తపడ్డారు. నకిలీ మద్యం కేసును 360 డిగ్రీల కోణంలో అడ్డంగా దారి మళ్లిస్తూ... వైఎస్సార్సీపీ నేత జోగి రమేశ్ పేరును జనార్దన్‌రావు నోటితో చెప్పించడం ముఖ్యనేత భేతాళ కుట్రలకు పరాకాష్ట. జోగి రమేశ్ చెబితేనే తాను నకిలీ మద్యం రాకెట్ నిర్వహించానని జనార్ధన్‌రావు నమ్మబలకడం టీడీపీ మార్కు బరితెగింపు దు్రష్పచారమే. గత ప్రభుత్వ హయాంలోనే తాను కల్తీ మద్యం రాకెట్ నిర్వహించానని... టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే నిలిపివేశానని... మళ్లీ కొన్ని నెలల క్రితం జోగి రమేశ్ చెబితేనే నకిలీ మద్యం దందా మొదలు పెట్టానంటూ ఊసరవెల్లి కూడా సిగ్గుపడే స్థాయిలో నిస్సిగ్గుగా అబద్ధాలు వల్లించారు. ములకలచెరువులో నిందితులను పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులుజనార్దన్రావు వీడియో కుట్రపూరితం.. ఎందుకంటే..?⇒ నిందితులు ఎవరైనా పోలీసుల విచారణలో చేతులు కట్టుకుని నిలబడి వినయంగా మాట్లాడతారు. ఎల్లో మీడియా విడుదల చేసిన వీడియోలో జనార్దన్‌రావు ఓ కురీ్చలో తాపీగా కూర్చుని మాట్లాడటం గమనార్హం. ⇒ ఇక ఈ వ్యవహారంలో కుట్ర కోణం ఉంది కదా.. అది చెప్పాలంటూ పక్క నుంచి ఎవరో ప్రోత్సహిస్తుండగా జనార్దన్‌రావు ఆ స్క్రిప్ట్ వల్లె వేశారు. తన పాత్ర, ప్రమేయం ఏదీ లేదని.. జోగి రమేష్ ఆధ్వర్యంలోనే అంతా చేశానంటూ చెప్పుకొచ్చారు. అంటే జోగి రమేష్ పేరు చెప్పాలన్న పోలీసుల ఆదేశాలనే జనార్దనరావు పాటించారన్నది స్పష్టమైంది. ⇒ గతంలో తాను కల్తీ మద్యం వ్యాపారం చేశానని జనార్దన్‌రావు చెప్పగానే... గతంలో అంటే ఎప్పుడు? అంటూ పక్కనే ఉన్న ఓ పోలీసు అధికారి ఉద్దేశపూర్వకంగా ప్రశ్నించారు. దాంతో గత ప్రభుత్వ హయాంలో అని ఆయన చెప్పారు. అంటే గత ప్రభుత్వం హయాంలో నకిలీ మద్యం వ్యాపారం చేసినట్టుగా జనార్దనరావుతో బలవంతంగా చెప్పించారన్నది తేటతెల్లమవుతోంది. ⇒ అంతటితో ఈ కుట్రలు ఆగలేదు. టీడీపీ ప్రభుత్వంపై బురదజల్లేందుకే నకిలీ మద్యం వ్యాపారం మళ్లీ చేయాలని ఈ ఏడాది ఏప్రిల్‌లో జోగి రమేష్ చెప్పారని జనార్దన్‌రావుతో పలికించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెడ్డపేరు తేవాలనే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దీన్ని నిర్వహించాలంటూ తనకు నిర్దేశించారన్నారు. జోగి రమేషే తనను ఆఫ్రికా పంపించారని.. నిధులు సమకూర్చారని.. పోలీసులే జనార్దన్‌రావుతో దగ్గరుండి మరీ చెప్పించినట్లు ఆ వీడియో స్పష్టం చేస్తోంది. అంటే ఎంత పక్కాగా జనార్దన్‌రావుతో అవాస్తవాలను చెప్పించారన్నది వెల్లడవుతోంది. -
నకిలీ మద్యంలో ఈ ప్రశ్నలకు బదులేది..?
సాక్షి, అమరావతి: యావజ్జీవ ఖైదీకి క్షమాభిక్ష నుంచి... తంబళ్లపల్లె టీడీపీ టికెట్ జయచంద్రారెడ్డికి ఇవ్వడం వరకు... ఏ1 జనార్దనరావు అత్యంత ధీమాగా రాష్ట్రానికి తిరిగిరావడం దాక.. నకిలీ మద్యం కేసులో అనేక ప్రశ్నలు...! వీటికి సమాధానాలు వెదుక్కుంటూ పోతే... కీలక నిందితుడు, టీడీపీ నేత సురేంద్రనాయుడుకు ముఖ్యనేతలతో సన్నిహిత సంబంధాలు బయటపడుతున్నాయి... జంట హత్యల కేసులో 2014 తర్వాత ఆయనకు జీవిత ఖైదు నుంచి క్షమాభిక్ష దక్కిన విషయం విస్తుగొలుపుతోంది... 2024 ఎన్నికల్లో సీనియర్లను కాదని మరీ తంబళ్లపల్లె టీడీపీ టికెట్‌ను జయచంద్రారెడ్డికి ఇప్పించింది కూడా సురేంద్రనాయుడే అనే స్పష్టం అవుతోంది. ఇంత లోతైన సంబంధాలు ఉన్నందునే... నకిలీ మద్యం వ్యవహారం కుదిపేస్తున్నా... జయచంద్రారెడ్డిపై టీడీపీ నుంచి తూతూమంత్రం సస్పెన్షన్ తప్ప ఇప్పటివరకు అరెస్టు చేయలేదని స్పష్టమవుతోంది. వెరసి ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం డీల్ డొంక కదులుతోంది. ...రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న నకిలీ మద్యం మాఫియా దందాలో అన్ని వేళ్లూ ముఖ్యనేతవైపే చూపిస్తున్నాయి. భారీ దోపిడీకి తెగించిన ఈ ముఠాలో పాత్రధారులు జయచంద్రారెడ్డి, టీడీపీ నేత కట్టా సురేంద్రనాయుడులు ముఖ్యనేతకు అత్యంత సన్నిహితులన్నది బహిరంగ రహస్యం. ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం రాకెట్లో జయచంద్రారెడ్డి, సురేంద్రనాయుడుతో ముఖ్యనేతకు ఉన్న ‘క్షమాభిక్ష’ బంధం వారి బాగోతం బయటపెడుతోంది. మొత్తం నకిలీ లిక్కర్ మాఫియాకే అది పునాదిగా నిలిచింది. ఐదేళ్లలో ఏకంగా రూ.45 వేల కోట్లు దోపిడీకి పక్కాగా పన్నిన పన్నాగం అమలులో శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం వరకు నకిలీ మద్యం మాఫియాను వ్యవస్థీకృతం చేసేంతగా ఎదిగింది. ఆఫ్రికాలో డిస్టిలరీల... అవే పునాదిగా తనకు ఆఫ్రికాలో డిస్టిలరీలు ఉన్నట్లు జయచంద్రారెడ్డి గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. దీన్నిబట్టి ఎన్నికల నాటికే నకిలీ మద్యం దందాకు బీజం పడినట్లు స్పష్టమవుతోంది. ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం దోపిడీ డీల్‌తోనే ముఖ్య నేత నుంచి సురేంద్రనాయుడి ద్వారా టీడీపీ టికెట్ పొందినట్లు అర్థమవుతోంది. ఇక వీరు కూటమి అధికారంలోకి రాగానే ముఖ్య నేత పూర్తి అండతో మాఫియాను వ్యవస్థీకృతం చేశారు. జయచంద్రారెడ్డి, ఆయన బావమరిది గిరిధర్‌రెడ్డి, సురేంద్రనాయుడు, అద్దేపల్లి జనార్దన్‌రావు తదితరులు ముఠా కట్టి తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువు నుంచి మొదలు రాష్ట్రస్థాయిలో నకిలీ మద్యం నెట్వర్క్ ఏర్పాటు చేశారు. అసలు మద్యం ఏదో నకిలీది ఏదో తెలియని స్థాయిలో నకిలీ మద్యం తయారు చేసి పేదలు, మధ్య తరగతి వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. 2024: ఆఫ్రికా నకిలీ మద్యం డీల్... జయచంద్రారెడ్డికి టీడీపీ టికెట్ ముఖ్య నేత ఇచ్చిన క్షమాభిక్షతో దర్జాగా బయటకు వచ్చిన సురేంద్రనాయుడు ఉమ్మడి చిత్తూరు, ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లాల్లో టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. పారీ్టలో ఆయన చెప్పిందే చెల్లింది. ఈ ప్రభావం ఏస్థాయికి చేరిందంటే 2024 ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యేలు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, శంకర్‌యాదవ్‌ను పక్కనపెట్టి మరీ జయచంద్రారెడ్డికి తంబళ్లపల్లె టీడీపీ టికెట్ ఇప్పించేవరకు వెళ్లింది. తర్వాత జయచంద్రారెడ్డి, గిరిధర్‌రెడ్డి, తమ అత్యంత సన్నిహితుడు అద్దేపల్లి జనార్దన్‌తో జట్టు కట్టి ముఖ్యనేతతో ఆఫ్రికా మోడల్నకిలీ మద్యం డీల్‌ను కుదిర్చారు. ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం వస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం మాఫియాను వ్యవస్థీకృతం చేయడం ఐదేళ్లపాటు భారీ దోపిడీకి తెగబడటం... ఇదీ డీల్. నాడు సిండికేట్ దోపిడీ.. నేడు నకిలీ దందా 2014–19లో టీడీపీ ప్రభుత్వం ఉండగా మద్యం సిండికేట్ ద్వారా యథేచ్ఛగా దోపిడీకి పాల్పడ్డారు. 2024–29లో ఏకంగా నకిలీ మద్యాన్ని అధికారికంగా విక్రయించి అంతకుమించి భారీ దోపిడీకి ముఖ్యనేతలు పన్నాగం పన్నారు. అందుకే సురేంద్రనాయుడు చెప్పినట్టు జయచంద్రారెడ్డికి తొలి జాబితాలోనే తంబళ్లపల్లె టికెట్ కేటాయించారు. గమనించాల్సిన విషయం ఏమంటే.. రాయలసీమలో సీనియర్ టీడీపీ నేతలకూ మొదటి జాబితాలో టికెట్ రాలేదు. జయచంద్రారెడ్డికి టికెట్ ఇవ్వొద్దని పలువురు నేతలు, కార్యకర్తలు ఉండవల్లిలో ధర్నాలు చేసినా పట్టించుకోలేదు. అదీ ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం డీల్ పవర్..!సురేంద్రనాయుడు ద్వారా కుదిరిన ఆఫ్రికా మోడల్ నకిలీ మాఫియా డీల్‌ను 2024 ఎన్నికలకు ముందే రుచి చూపించారు. అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం మద్యం దుకాణాలను ప్రభుత్వపరం చేసింది. మద్యం దుకాణాల ద్వారా అమ్మకాలపై నియంత్రణ విధించింది. దీంతో ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు, విచ్చలవిడిగా పంపిణీకి మద్యం అందుబాటులో లేదు. కానీ, టీడీపీ కూటమి మాత్రం తమ అభ్యర్థులకు భారీగా మద్యం సరఫరా చేయడం గమనార్హం. దీనివెనుక జయచంద్రారెడ్డి, సురేంద్రనాయుడుతో కూడిన తంబళ్లపల్లె టీడీపీ బ్యాచ్ ఉంది. వీరు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల్లో మద్యం పంపిణీని పర్యవేక్షించారు. అప్పటికే సరిహద్దులకు అవతల కర్ణాటకలో గుట్టుచప్పుడు కాకుండా నకిలీ మద్యం యూనిట్లు ఏర్పాటు చేశారు. అక్కడినుంచి భారీగా నకిలీ మద్యాన్ని టీడీపీ అభ్యర్థులకు అందజేయగా వారు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పంపిణీ చేశారు. ఆఫ్రికాలో మద్యం వ్యాపారంలో పెట్టుబడులు ఉన్నాయని టీడీపీ తంబళ్లపల్లె అభ్యర్థి జయచంద్రారెడ్డి 2024 ఎన్నికల అఫిడవిట్లో స్వయంగా పేర్కొన్న భాగం మనం నకిలీ మద్యం పంచామా? రాయలసీమ, ఉత్తరాంధ్ర టీడీపీ కూటమి ఎన్నికల బాధ్యతలు చూసిన పలువురు సీనియర్ నేతలు ప్రస్తుతం నకిలీ మద్యం బాగోతాన్ని గుర్తుచేసుకుంటున్నారు.జయచంద్రారెడ్డి, సురేంద్రనాయుడు బ్యాచ్ మా ద్వారా పంపిణీ చేయించింది నకిలీ మద్యమా? అని అవాక్కవుతున్నారు. ‘‘తంబళ్లపల్లె నియోజకవర్గంలో రాజకీయంగా కనీసం పట్టు లేని జయచంద్రారెడ్డికి ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఎందుకిచ్చారో... సురేంద్రనాయుడు కింగ్ మేకర్‌గా చక్రంతిప్పడం వెనుక ఉన్నది నకిలీ మద్యం డీల్ అని మాకు ఇప్పుడు తెలుస్తోంది’’ అని పేర్కొంటున్నారు.2014: ముఖ్యనేత... సురేంద్రనాయుడు.. ఇది ‘క్షమాభిక్ష’ బంధంకట్టా సురేంద్రనాయుడు... ముఖ్య నేతతో లోతైన బంధం ఉన్న నాయకుడు. 2002 నాటి దారుణ జంట హత్యల కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఈయనకు 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చాక క్షమాభిక్ష దక్కింది. జంట హత్యల కేసులో సురేంద్రనాయుడుకు జిల్లా న్యాయస్థానం 2006లో యావజ్జీవం విధించింది. ఈ తీర్పును సురేంద్ర హైకోర్టులో సవాల్ చేసినా, జిల్లా కోర్టు తీర్పునే సమరి్థంచింది. అయితే, ముఖ్య నేతకు అత్యంత సన్నిహితుడు కావడంతో టీడీపీ సర్కారు క్షమాభిక్ష ప్రసాదించింది. ప్రభుత్వ మద్యం దుకాణాలను ఎత్తేసి... టీడీపీ సిండికేట్‌కు మొత్తం కట్టబెట్టిన కూటమి2024లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక టీడీపీ సిండికేట్ ద్వారా సాగిస్తున్న మద్యం దోపిడీ బహిరంగ రహస్యమే. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన ప్రభుత్వ మద్యం దుకాణాల విధానాన్ని తొలగించి మొత్తం 3,396 మద్యం దుకాణాలను టీడీపీ సిండికేట్‌కు కట్టబెట్టింది. పర్మిట్ రూమ్‌లకు అనుమతులిచ్చింది. 75 వేల బెల్ట్ దుకాణాలు ఏర్పాటు చేసినా ఉదాసీనంగా ఉంటోంది. 540 బార్లను (త్వరలో మరో 300 బార్లు కూడా) టీడీపీ సిండికేట్‌కు కట్టబెట్టింది. ఇలా రాష్ట్రంలో మద్యం నెట్‌వర్క్‌ను టీడీపీ సిండికేట్ గుప్పిటపట్టింది. అనంతరం జయచంద్రారెడ్డి, సురేంద్రనాయుడు, జనార్దన్‌రావు ఆధ్వర్యంలో ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం యూనిట్లను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసింది. టీడీపీ సీనియర్ నేతలకు ప్రాంతాలవారీగా పంపిణీ బాధ్యతలు అప్పగించింది. నకిలీ మద్యాన్ని ప్రభుత్వ లైసెన్స్ పొందిన ప్రైవేటు మద్యం దుకాణాలు, పర్మిట్ రూమ్‌లు, బార్లు, బెల్ట్ షాపుల్లో దర్జాగా విక్రయిస్తూ భారీ దోపిడీకి తెగబడుతోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తొలి ఏడాదిలోనే రూ.5,280కోట్లు కొల్లగొట్టిన ఈ మద్యం మాఫియా వచ్చే నాలుగేళ్లలో మరో రూ.40 వేల కోట్లు కొల్లగొట్టేందుకు సిద్ధపడింది. అందులో 30 శాతం వాటా కరకట్ట బంగ్లాకే ముడుపులుగా చెల్లించాలన్నది డీల్. నకిలీ మద్యం కేసు నిందితుడు కట్టా సురేంద్రనాయుడు నేర చరిత్రకు సంబంధించిన పత్రాలు అంటే నకిలీ మద్యం మాఫియా ద్వారా సూత్రధారిగా ఉన్న ముఖ్య నేత కరకట్ట బంగ్లాకు దక్కేదే దాదాపు రూ.13,500 కోట్లు... ఇక ప్రాంతాలవారీగా పంపిణీ బాధ్యతలు చూస్తున్న టీడీపీ సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు, మద్యం సిండికేట్‌కు 50 శాతం, నకిలీ మద్యం రాకెట్ పాత్రధారులుగా జయచంద్రారెడ్డి, సురేంద్రనాయుడు, జనార్దన్రావులకు 20 శాతం పంచుకోవాలన్నది డీల్. అందుకే ముఖ్యనేత అండతో రాష్ట్రంలో నకిలీ మద్యం మాఫియా బరితెగించి దోపిడీకి పాల్పడుతోందన్నది స్పష్టమవుతోంది.ఎల్లో మీడియాలో అడ్డగోలు రాతలు దందా బయటపడడంతో డైవర్షన్ ప్లాన్ అడ్డంగా దొరికినా ఎదురుదాడి జయచంద్రారెడ్డికి టికెట్ ఇచ్చింది టీడీపీనే సురేంద్రనాయుడుకు క్షమాభిక్ష ఇచ్చింది ముఖ్యనేత బండారం బయటపడడంతో ఉక్కిరిబిక్కిరి నకిలీ మద్యం వ్యవహారంలో ముఖ్య నేత, టీడీపీ నాయకుల ప్రమేయం స్పష్టంగా బయటపడడంతో ఎల్లో మీడియా అడ్డగోలు రాతలు రాస్తోంది. తిరుగులేని ఆధారాలతో అడ్డంగా పట్టుబడినా.. తూచ్ అదేమీ లేదంటూ ఎదురుదాడి చేస్తోంది. ఉక్కిరిబిక్కిరి అయి గుక్కతిప్పుకోలేక సంబంధంలేని విషయాలను తెరపైకి తెస్తోంది. తంబళ్లపల్లెలో టీడీపీ అభ్యరి్థగా జయచంద్రారెడ్డి పోటీ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. సురేంద్రనాయుడుకు క్షమాభిక్ష ఇచ్చింది ముఖ్యనేతనే అయినా... కొత్త కథలు అల్లుతోంది. అసలు విషయం తొక్కిపెట్టి బురదజల్లాలని చూస్తోంది. మొత్తం దందా బయటపడడంతో.. డైవర్షన్ ప్రణాళిక వేస్తోంది. -
ఎల్లో బ్యాచ్ కామెడీ కథలపై వెంకటరెడ్డి సెటైర్లు..
-
‘ఈఆర్సీ’.. సీరియస్! సర్కారుకు 'షాక్'
సాక్షి, అమరావతి: ఎడాపెడా విద్యుత్తు చార్జీలతో వినియోగదారులను బాదేస్తున్న చంద్రబాబు సర్కారుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) గట్టి షాక్‌నిచ్చింది! విద్యుత్తు చార్జీల వాతలతో ప్రజల నుంచి ఇప్పటికే వసూలు చేసిన సొమ్ములో దాదాపు రూ.వెయ్యి కోట్లు తిరిగి వారికి వెనక్కి చెల్లించాలని ఆదేశించింది. చార్జీల మోత మోగించిన చంద్రబాబు సర్కారుకు ఏపీఈఆర్సీ ఇలా గట్టిగా మొట్టికాయలు వేస్తే అదేదో ప్రభుత్వం దయతలచి ఔదార్యంగా ఇస్తున్నట్లు ఎల్లో మీడియాలో నిస్సిగ్గుగా ప్రచారం చేసుకోవడంపై సర్వత్రా తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదికి అంటే 2024–25 ఆర్ధిక సంవత్సరానికి రూ.2,787.18 కోట్లు ఇప్పటికే ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేయగా అందులో రూ.923.55 కోట్లను వినియోగదారులకు వెనక్కి చెల్లించాలని ఏపీఈఆర్సీ తాజాగా ఆదేశించింది. అయితే ఇదంతా కూటమి సర్కారు గొప్పతనంగా, అసలు ట్రూ డౌన్ చంద్రబాబు ప్రభుత్వం కల్పించిన ఊరట అంటూ టీడీపీ అనుకూల మీడియా ప్రచారాన్ని నెత్తికెత్తుకుంది. ప్రజలపై ఇప్పటి వరకూ రూ.17,348.64 కోట్లు విద్యుత్ చార్జీల భారం వేసిన కూటమి ప్రభుత్వాన్ని భుజానకెత్తుకుని కీర్తించడంపై ఇంధన రంగ నిపుణులు, వినియోగదారులు విస్తుపోతున్నారు. తొలి ఏడాదికి అంటే 2024–25 ఆర్ధిక సంవత్సరానికి రూ.2,787.18 కోట్లు ఇప్పటికే ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేయగా అందులో రూ.923.55 కోట్లను వినియోగదారులకు వెనక్కి చెల్లించాలని ఏపీఈఆర్సీ తాజాగా ఆదేశించింది. అయితే ఇదంతా కూటమి సర్కారు గొప్పతనంగా, అసలు ట్రూ డౌన్ చంద్రబాబు ప్రభుత్వం కల్పించిన ఊరట అంటూ టీడీపీ అనుకూల మీడియా ప్రచారాన్ని నెత్తికెత్తుకుంది. ప్రజలపై ఇప్పటి వరకూ రూ.17,348.64 కోట్లు విద్యుత్ చార్జీల భారం వేసిన కూటమి ప్రభుత్వాన్ని భుజానకెత్తుకుని కీర్తించడంపై ఇంధన రంగ నిపుణులు, వినియోగదారులు విస్తుపోతున్నారు.కూటమి చెంప చెళ్లుమనిపించేలా ఏపీఈఆర్సీ ఆదేశాలు..గత ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేసిందంటూ తప్పుడు ప్రచారం చేసిన కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ఏపీఈఆర్సీ అనుమతించిన దానికి మించి అధిక రేట్లకు కరెంట్ కొనుగోలు చేసింది. ఈ విషయం ఏపీఈఆర్సీ తాజా ఆదేశాల ద్వారా రుజువైంది. యూనిట్ రూ.5.27కు కొనమని ఏపీఈఆర్సీ చెబితే ఏపీఈపీడీసీఎల్‌లో యూనిట్ రూ.5.84 చొప్పున, ఏపీసీపీడీసీఎల్‌లో రూ.5.86 చొప్పున, ఏపీఎస్పీడీసీఎల్లో యూనిట్ రూ.5.89 వెచ్చించి కూటమి ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేసింది. అందువల్లనే 2024–25 సంవత్సరానికి రూ.2,758.76 కోట్లు ఇంధన, విద్యుత్ కొనుగోలు సర్దుబాటు (ట్రూ అప్)ను డిస్కంలు ప్రతిపాదించాల్సి వచ్చింది. దీన్ని తీవ్రంగా ఆక్షేపించిన ఏపీఈఆర్సీ డిస్కంలు అడిగినదానికి ఆమోదం తెలపకుండా రూ.895.12 కోట్లను తగ్గించాల్సిందేనని తేల్చి చెప్పింది. రూ.1,863.64 కోట్లకు మాత్రమే అనుమతినిచ్చింది. అయితే కూటమి ప్రభుత్వం ప్రజలను విద్యుత్ బిల్లులతో బాదుతూ ఇప్పటికే రూ.2,787.18 కోట్లను అదనంగా వసూలు చేసేసింది. ఈ విషయాన్ని గుర్తించిన ఏపీఈఆర్సీ వినియోగదారుల నుంచి నేరుగా వసూలు చేసిన అదనపు చార్జీలను అక్టోబర్ నెల వినియోగం నుంచి అంటే నవంబర్‌లో ఇచ్చే బిల్లు నుంచి 12 వాయిదాల్లో వెనక్కి ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. ఏపీఈఆర్సీ ఆదేశాలు కూటమి సర్కారు చెంప చెళ్లుమనిపించేలా ఉన్నాయని విద్యుత్ రంగ నిపుణులు, వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో తొలి ఏడాదికి బాబు సర్కారు వసూలు చేసిన మొత్తం రూ.2,787.18 కోట్లను తిరిగి ప్రజలకు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. వాస్తవం ఇలా ఉంటే, ఇదంతా చంద్రబాబు కూటమి సర్కారు ఇచ్చిన ఊరట అంటూ టీడీపీ కరపత్రం ఈనాడు నిస్సిగ్గుగా తప్పుడు కథనాన్ని అచ్చేసింది.కూటమి ప్రభుత్వం వసూలు చేసిన రూ.923.55 కోట్లను ప్రజలకు తిరిగి చెల్లించాలంటూ ఏపీఈఆర్సీ ఇచ్చిన ఆదేశాలు బాబు బాదుడే బాదుడు..టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడమే ఆలస్యం.. తొలి ఏడాదిలోనే ఏకంగా రూ.15,485.36 కోట్ల చార్జీల భారాన్ని వేసి బాదుడుకు శ్రీకారం చుట్టింది. అయితే అదనంగా వసూలు చేసిన రూ.2,787.18 కోట్లలో తాజాగా రూ.1,863.64 కోట్లకు మాత్రమే ఈఆర్సీ నుంచి అనుమతి లభించింది. అదే రూ.923.55 కోట్లను ప్రజలకు తిరిగి చెల్లించాలని ఏపీఈఆర్సీ ఆదేశించకుంటే ప్రజలపై దాదాపు రూ.19 వేల కోట్ల భారం మోపినట్లయ్యేది! అంతేకాదు.. మరో పిడుగు కూడా సిద్ధంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు 4వ నియంత్రణ కాలానికి వాస్తవ ఆదాయ, ఖర్చుల వ్యత్యాసాన్ని రూ.12,771.96 కోట్లుగా లెక్కించాయి. ఈ మొత్తాన్ని విద్యుత్ బిల్లుల్లో కలిపి వినియోగదారుల నుంచి వసూలు చేసుకునేందుకు అనుమతినివ్వాల్సిందిగా ఇటీవల కమిషన్‌ను కోరాయి. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించకపోతే ఆ భారమంతా ప్రజలపైనే పడుతుంది.జగన్ ప్రభుత్వంలో..జనంపై భారం పడకుండాటీడీపీ కూటమి ప్రభుత్వం అదనంగా వసూలు చేసిన దానిలో కొంత మొత్తాన్ని తిరిగి ప్రజలకు ఇచ్చేయాల్సిందేనని ఏపీఈఆర్సీ ఆదేశిస్తే.. అదేదో తాము దయతలచి ఇస్తున్నట్లుగా ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయించుకుంటున్నారు. వాస్తవానికి విద్యుత్తు రంగంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో వినియోగదారులపై ఏమాత్రం భారం పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణలు, చౌకగా కొనుగోళ్లు, ఇంధన పొదుపు లాంటి విప్లవాత్మక నిర్ణయాల వల్ల 2019–24 మధ్య విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల నిర్వహణ ఖర్చులు భారీగా తగ్గాయి. దీంతో ఆ ఐదేళ్లలో మొత్తం రూ.4,434.5 కోట్లను మిగిల్చినట్లు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అధికారికంగానే వెల్లడించింది. డిస్కంలు ఖర్చులు తగ్గించుకుని మిగిల్చిన డబ్బులను ట్రూ డౌన్ చేశాయి.⇒ వైఎస్ జగన్ ప్రభుత్వంలో 2019–20 నుంచి 2023–24 వరకు ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్) రూ.1,974.75 కోట్లు, ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీసీపీడీసీఎల్) 2020–21 నుంచి 2023–24 వరకూ రూ.1,400 కోట్ల మేర ఖర్చులు మిగిల్చాయి. ఈ మొత్తం రూ.3,374.75 కోట్లను ట్రూ డౌన్ చేశాయి. ఈ డబ్బులను 2024–25 వార్షిక ఆదాయ వ్యయ నివేదిక (ఏఆర్ఆర్)లో డిస్కంలు సర్దుబాటు చేశాయి. అంటే వాటి రెవెన్యూ గ్యాప్ భర్తీ చేసుకోవడానికి వినియోగించుకున్నాయి. తద్వారా బకాయిలు తగ్గించుకున్నాయి. దీంతో ఆ మేరకు ప్రజలపై విద్యుత్ చార్జీల భారం కూడా తగ్గింది.⇒ ఏపీ ట్రాన్స్‌కో విద్యుత్ లైన్లను వినియోగించుకోవడంలోనూ గత ప్రభుత్వంలో డిస్కంలు రూ.1,059.75 కోట్లు మిగిల్చాయి. విద్యుత్ ప్రసార వ్యవస్థ వినియోగానికి ఏపీఈఆర్సీ అనుమతించిన టారిఫ్ కంటే తక్కువగా డిస్కంలు వినియోగించాయి. ఇది ఏపీఈపీడీసీఎల్‌లో రూ.383.84 కోట్లు, ఏపీఎస్పీడీసీఎల్లో రూ.428.57 కోట్లు, ఏపీసీపీడీసీఎల్‌లో 247.35 కోట్లుగా ఉంది. వీటిని కూడా ఏఆర్‌ఆర్‌లో సర్దుబాటు చేశారు. ఇలా గత ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా రాష్ట్ర ప్రజలపై రూ.4,434.51 కోట్ల మేర ట్రూ అప్ భారం తగ్గింది. -
తప్పుడు వార్తలకు చెంపదెబ్బ.. ఈనాడుకు YS భారతి నోటీసులు
-
మీకు సిగ్గుచేటుగా లేదా.. పదే పదే సునీతని,షర్మిలని పెట్టుకుని.. ABNకు సతీష్ రెడ్డి కౌంటర్
-
మద్యం అక్రమ కేసులో ఎల్లో మీడియా రోజుకో కథను వండుతోంది?:పుట్ట శివశంకర్
-
సంబంధం లేని ఎమ్మార్ కేసులో జగన్‌పై తప్పుడు రాతలు: శివశంకర్
సాక్షి, తాడేపల్లి: సంబంధం లేని ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో వైయస్ జగన్‌ను ఏ1 నిందితుడు అంటూ ఈనాడు పత్రిక ప్రచురించిన తప్పుడు కథనాన్ని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఆనందం కోసం రామోజీరావు కుమారుడు చెరుకూరి కిరణ్ జర్నలిజాన్ని సమాధి చేస్తూ, వైఎస్సార్సీపీ పైన తప్పుడు రాతలు రాయడమే ఈనాడు లక్ష్యం అన్నట్లుగా పత్రికను నడుపుతున్నారని మండిపడ్డారు.ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో వైఎస్ జగన్ నిందితుడుగా ఉన్నట్లు ఒక్క ఆధారమైనా చూపగలరా అని ప్రశ్నించారు. న్యాయవాది, వ్యాపారిగా ఉన్న సునీల్ రెడ్డిని వైఎస్ జగన్‌కు సన్నిహితుడని, లిక్కర్ స్కాంలో నిందితుడుగా ఉన్నాడంటూ అర్థం లేకుండా పిచ్చిరాతలు రాసిన ఈనాడు ఒక్కసారైనా ఆయన గత ఐదేళ్లలో ఇక్కడకు వచ్చినట్లు, ఏదైనా వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నట్లు నిరూపించగలరా అని నిలదీశారు. ఇంకా ఆయనేమన్నారంటే..‘‘ఎల్లో మీడియా ఈనాడులో బేతాళ కథల మాదిరిగా రోజుకో కొత్త కథను లిక్కర్ స్కాం అంటూ వండి వారుస్తున్నారు. వైఎస్ జగన్‌తో ఎవరైతే సన్నిహితులుగా ఉన్నారో వారిని అక్రమ కేసుల్లో ఇరికించేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు ఈనాడు పత్రిక బాకా ఊదుతోంది. అన్ని విలువలను వదిలిపెట్టి, బురదచల్లడమే జర్నలిజంగా తన విధానాన్ని మార్చుకుంది. గతంలో రామోజీరావు ఉన్నప్పుడు ఎలా భజనచేశారో, దానికి మించి ఆయన కుమారుడు చెరుకూరి కిరణ్ మొత్తం పత్రికనే చంద్రబాబు పాదాక్రాంతం చేస్తూ, అత్యంత నీచమైన స్థాయికి దిగజారిపోయి, అబద్ధాలు, అభూతకల్పనలతో కథనాలను రాస్తున్నారు...దీనిలో భాగంగానే వైఎస్ జగన్‌కు నమ్మినబంటు, ఎమ్మార్ ప్రాపర్టీలో నిందితుడు సునీల్ రెడ్డి లిక్కర్ స్కాంలో కీలకం అంటూ ఒక కథనాన్ని వండివార్చారు. ఈ కథనంలో సునీల్ రెడ్డి ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో ఏ7 అయితే, దీనిలో వైఎస్ జగన్ ఏ1 అంటూ తన కథనంలో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారంటూ రాశారు. ఈనాడు కిరణ్ తన పత్రికను జర్నలిజం ప్రకారం నడుపుతున్నారా? లేక తన బ్రోకరిజం పాలసీ మేరకు నడుపుతున్నారా? ఎమ్మార్ కేసులో వైయస్ జగన్‌కు ఏం సంబంధం? కోర్టులో ఉన్న రికార్డుల ప్రకారం ఈ కేసులో ఏ1 బిభూ ప్రసాద్ ఆచార్య. అసలు ఈ కేసులో వైఎస్ జగన్ పేరు ఎక్కడ ఉందో చూపగలరా?..కనీస అవగాహన లేకుండా తప్పుడు కథనం రాశామని, మరుసటి రోజు అయినా సవరణ వేస్తారని చూశాం. కానీ వారి వైఖరి చూస్తుంటే, కావాలనే వైఎస్ జగన్‌పై బురదచల్లేందుకే ఈ కథనం రాశారని అర్థమవుతోంది. పైగా ఇదే కథనంలో వైఎస్ జగన్‌కు సునీల్ రెడ్డి అత్యంత సన్నిహితుడు అంటూ రాశారు. సునీల్ అనే వ్యక్తి న్యాయవాది, వ్యాపారి. ఏనాడైనా ఆయన గత అయిదేళ్ళలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉండగా ఇక్కడకు వచ్చారా? ఎక్కడైనా ఏదైనా వ్యవహారంలో జోక్యం చేసుకున్నారా? సూట్‌కేసు కంపెనీలను ఏర్పాటు చేశాడంటూ ఎటువంటి ఆధారాలు లేకుండా ఎలా ఆరోపణలు చేశారో ఈనాడు పత్రిక చెప్పాలి...అత్యంత సన్నిహితుడు అంటే చంద్రబాబుకు నిత్యం భజన చేస్తూ పత్రికను నడిపించిన రామోజీరావు, ఆయన మరణం తరువాత ఆ స్థానంలో ఉన్న చెరుకూరి కిరణ్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ5 బీఆర్ నాయుడు. వీరు కదా చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు. సునీల్ రెడ్డి నివాసంలో సిట్ జరిపిన సోదాల్లో కీలక ఆధారాలు దొరికాయని, కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లు దొరికాయంటూ ఈనాడులో రాశారు. సిట్‌లోని ఏ అధికారి కీలక ఆధారాలు దొరికాయని చెప్పారో వెల్లడించాలి...గతంలో ఇదే లిక్కర్ స్కాంలో బంగారం, విదేశాల్లో ఫ్యాక్టరీలు, దుబాయ్‌లో ఆస్తులు ఇలా అనేక రకాలుగా ఊహాత్మక అంశాలను వార్తా కథనాలుగా రాశారు. ఈనాడు ఇలా దిగజారిపోయి రాస్తున్న తప్పుడు రాతలను చూస్తే, చంద్రబాబు కళ్ళలో ఆనందం కోసం జర్నలిజం విలువలను సమాధి చేసి, భజన చేయడమే తమ జీవితాశయంగా పత్రికను నడుపుతున్నారని అర్థమవుతోంది. లేని లిక్కర్ స్కాంలో వైఎస్ జగన్‌ను దోషిగా చూపాలన్నదే వారి తాపత్రేయంగా కనిపిస్తోంది...ఈనాడు పత్రిక పేరును చంద్రనాడు అని మార్చుకుంటే బాగుంటుంది. ఇటువంటి తప్పుడు వార్తను ప్రచురించినందుకు ఈనాడు పత్రిక నిర్వాహకుడు చెరుకూరి కిరణ్ క్షమాపణలు చెప్పాలి. లేని పక్షంలో న్యాయ పోరాటం చేస్తాం. ఇప్పటికే ఈనాడు పత్రికను ప్రజలు టిష్యూ పేపర్‌గా చూస్తున్నారు. దానిని టాయిలెట్ పేపర్ స్థాయికి తీసుకువెళ్ళేందుకు ఈనాడు కిరణ్ కంకణం కట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. అబద్దపు రాతలపై చర్యలు తీసుకుంటామంటున్న సీఎం చంద్రబాబు, తన నమ్మినబంటు చెరుకూరి కిరణ్ ఈనాడులో రాస్తున్న అసత్య కథనాలపై కూడా చర్యలు తీసుకోవాలి’’ అని పుత్తా శివశంకర్ రెడ్డి పేర్కొన్నారు. -
Big Question: ఒకే ఒక్క స్కామ్ 8500 కోట్లు.. చంద్రబాబు గ్యాంగ్.. అడ్డా కూలీలు
-
రోజుకో డ్రామా సజ్జల భార్గవ్ రెడ్డిపై పచ్చ మీడియా అవాస్తవ కథనాలు
-
లోకేష్‌తోనే ప్రద్యుమ్నకు సంబంధాలు: సజ్జల
సాక్షి, తాడేపల్లి: భీమ్ కంపెనీకి అసలు బ్యాంక్ అకౌంటే లేదని.. బ్యాంక్ అకౌంట్ లేని కంపెనీ ద్వారా డబ్బులు ఎలా ట్రాన్సాక్షన్ జరుగుతాయంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మా హయాంలో పేపర్ల కోసం కథలు సృష్టించలేదన్నారు. లేని స్కాం మీద ప్రజల్లో విషం నింపాలని చంద్రబాబు చూస్తున్నారని.. అందులో భాగంగానే రోజువారి విషపు కథలు ప్రచురిస్తున్నారంటూ సజ్జల దుయ్యబట్టారు.‘‘యాక్టివిటి లేని కంపెనీని అక్రమ లిక్కర్ స్కాంలో ఇరికించాలని చూస్తున్నారు. డబ్బులతో పట్టుబడిన వ్యక్తికి చెవిరెడ్డికి లింక్ పెట్టారు. ఈనాడు, ఆంధ్రజ్యోతికి సిట్ బ్యానర్ ఐటమ్స్ అందిస్తుంది. గతంలో ప్రద్యుమ్న స్టూడియో-ఎన్లో యాక్టివ్ డైరెక్టర్. స్టూడియో-ఎన్ను నారా లోకేష్ ప్రమోట్ చేశారు. లోకేష్‌తోనే ప్రద్యుమ్నకు సంబంధాలున్నాయి. రోజుకో కథ రాసి బురద అంటించాలని చూస్తున్నారు. సజ్జల భార్గవ్‌రెడ్డికి సంబంధించి ప్రచురించిన కథనాలు అవాస్తవం.లిక్కర్ స్కాంలో సజ్జల భార్గవ్‌రెడ్డిపై ఆరోపణలు అవాస్తవం’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.‘‘సిట్ పేరు చెప్పి ఎల్లోమీడియా మాపై విష ప్రచారం చేస్తోంది. సజ్జల భార్గవ్ కంపెనీగా చెప్తున్న భీమ్ అసలు ఎలాంటి యాక్టివిటీ చేయటం లేదు. ఆ సంస్థకు కనీసం బ్యాంకు ఎకౌంట్ కూడా లేదు. మరి లిక్కర్ స్కాంలోని నిధులను భీమ్ సంస్థ ఎకౌంట్ ద్వారా ఎలా వెళ్తాయి?. సిట్ విచారణ ఎలా జరుగుతుందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. మా హయాంలో మద్యం పాలసీ పారదర్శకంగా జరిగింది. ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నట్టు తన మనుషులకు లాభం చేకూర్చేలాగ జరగలేదు..డిస్టలరీల్లో ఏదైనా తప్పు జరిగి వాటి ద్వారా మేమైనా లబ్ధి పొందినట్టు ఆధారాలు ఉంటే ఏదైనా జరిగిందనుకోవచ్చు. కానీ ఏమీ జరగనిది జరిగినట్టు చూపించటానికి తెగ తాపత్రయ పడుతున్నారు. లేని స్కాం ఉన్నట్టుగా చెప్పి ప్రజల్లో విషం ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఏడాదిగా ఇలా కట్టుకథలతో విచారణ జరుపుతున్నారు. సజ్జల భార్గవరెడ్డిని కూడా లిక్కర్ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరెవరికో లింకులు కలుపుతూ స్కాం జరిగిందని ప్రచారం చేస్తున్నారు...ఎల్లోమీడియా ఆఫీసుల్లో కూర్చుని సిట్ అధికారులు పని చేస్తున్నారా?. లేకపోతే ఎల్లో మీడియా, సిట్ అందరూ కలిసి టీడీపీ ఆఫీసులో కూర్చుని పని చేస్తున్నారా?. ప్రద్యుమ్న స్టూడియో ఎన్ డైరెక్టర్. ప్రద్యుమ్న, నారా లోకేష్ మధ్య సంబంధాలు ఉన్నాయి. దానిని బట్టి నారా లోకేష్‌ను కూడా కేసులో ఇరికించవచ్చా?. చంద్రబాబు చిల్లర వార్తలతో రాజకీయాలు చేయటం, పరిపాలన చేయటం సిగ్గుచేటు. రాష్ట్రంలో సమస్యలను పక్కన పెట్టి నిత్యం ప్రజల మీద విషం చిమ్మే వార్తలు రాయిస్తున్నారు...కళ్లముందు కనిపిస్తున్న నిజాలను కూడా పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. నిజాలు మాట్లాడితే కేసులు పెట్టి వేధిస్తున్నారు. యూరియా కష్టాలు గురించి జగన్ ట్వీట్ చేస్తే అది ఫేక్ అంటూ ప్రచారం చేశారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా రైతులు యూరియా కోసం అవస్థలు పడుతున్నారు. మరి ఇవన్నీ ఫేక్ అని చంద్రబాబు చెప్పగలరా?. చినముత్తేవి గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న యూరియాను రైతులు అడ్డుకున్నారు. ఇందులో టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన వారు కూడా ఉన్నారు. కానీ వైఎస్సార్సీపీ వారు లారీని అడ్డుకున్నారంటూ చంద్రబాబు మాట్లాడటం సిగ్గుచేటు...అసలు సమస్యను పరిష్కరించకుండా రైతులను దూషించటం ఎందుకు?. యూరియాకు కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఇబ్బందుల పాల్జేస్తున్నారు. దివ్యాంగుల పెన్షన్ల విషయంలో కూడా సమస్యలు సృష్టించి వారి నుండి లంచాలు మెక్కుతున్నారు. యూరియా కూడా సమృద్ధిగా ఉంటే మరి ఈ సమస్యలు ఎందుకు వచ్చాయి?. ప్రజలు మీకు అధికారం ఇచ్చింది ఇందుకేనా?. ఫేక్ వార్తలు సృష్టిస్తున్నదే టీడీపీ...టీడీపీ ఆఫీసులోనే ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు పెట్టారు. తండ్రీ కొడుకులు వీకెండ్లో హైదరాబాద్ వెళ్లిపోతున్నారు. వారికి జనం సమస్యలు పట్టటం లేదు. వీటన్నిటి నుంచి డైవర్షన్ చేయటానికి లేని లిక్కర్ స్కాంని సృష్టించారు. సీఎం స్థాయి వ్యక్తే జనాన్ని బెదిరిస్తుంటే ఇంకేం అనాలి. అంత దిగజారి వ్యవహరించాలా చంద్రబాబూ?. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరయినా ఇంకా జగన్ మీద పడి ఏడవాలా?. విష ప్రచారం చేయటంలో లోకేష్ తండ్రిని మించి పోయారు. లోకేష్ ఆఫీసే సీఎంవోగా మారిపోయింది. తండ్రి నిర్ణయాల కంటే లోకేష్ నిర్ణయాలే అమలవుతున్నాయి...వైఎస్ జగన్, విజయమ్మ విషయంలో కూడా లోకేష్ దిక్కు మాలిన రాజకీయం చేస్తోంది. ఫేక్ వీడియోలు, ఫోటోలతో శునకానందం పొందుతున్నారు. చంద్రబాబుకు అసలు కుటుంబ బంధాల గురించి తెలుసా?. చంద్రబాబు చెల్లెళ్లు ఎవరో ఈ ప్రపంచానికి తెలుసా?. కనీసం లోకేషైనా వారి మేనత్తలను గుర్తు పట్టగలడా?. చంద్రబాబు తన తమ్ముడు, చెల్లెళ్లుకు ఏం న్యాయం చేశారు?. అత్యధిక ధనవంతుల సీఎంలలో చంద్రబాబే దేశంలో నంబర్ వన్. అలాంటి వ్యక్తి తన తమ్ముడు, చెల్లెళ్లకు ఏం న్యాయం చేశారు?. రాష్ట్ర ప్రజల సమస్యలు పట్టించుకోని ఫేక్ సీఎం చంద్రబాబు...యూరియా సమస్యపై ఈనెల 9న రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీవో ఆఫీసుల ఎదుట నిరసన చేపడతాం. రాష్ట్రంలో పరిపాలన సాగటం లేదు. జరుగుతున్నదల్లా దోపిడీలు, కుంభకోణాలే.. ప్రశ్నిస్తే ఎంతమందిని అరెస్టు చేయగలరు?. వైఎస్సార్సీపీ కార్యకర్తల నుంచి ఇప్పుడు సామాన్య ప్రజల మీద కూడా అక్రమ కేసులు పెడుతున్నారు. చంద్రబాబుకు ప్రజలు ఈస్టమన్ కలర్లో సినిమా చూపించే టైం దగ్గర పడింది. లోకేష్ ఢిల్లీ పర్యటన వలన రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదు. తమ పైరవీలు చేసుకోవటానికే పదేపదే ఢిల్లీ వెళ్తున్నారు. చంద్రబాబు బెయిల్ మీద ఉన్నారు. ఆయనపై ఉన్న కేసులు కొట్టేయించుకునేందుకు వెళ్తున్నారు’’ అంటూ సజ్జల మండిపడ్డారు. -
ఎల్లోమీడియాకు బాగానే గిట్టుబాటు అవుతున్నట్లుంది!
ప్రభుత్వంపై వచ్చే విమర్శలకు అధికారంలో ఉన్నవారు సమాధానం చెప్పగలగాలి. ముఖ్యమంత్రి లేదా మంత్రి, తదితరల అధికారులైనా ఈ పని చేయాలి. వివరణైనా ఇవ్వాలి. కానీ ఏపీలో ప్రభుత్వంపై వచ్చే విమర్శలకు ఎల్లోమీడియా నుంచి సమాధానాలు వస్తూండటమే వింత. విమర్శించేవారిని దూషించి అక్కసు తీర్చుకోవడం వీరి ప్రత్యేకత కూడా. ఇక రాసే మురికి వార్తలంటారా? వాటికి అంతేలేదు. నిజాలను వక్రీకరించి ప్రభుత్వాన్ని భుజాలకెత్తుకుని మరీ ఎదురుదాడి చేస్తూంటుంది ఇది. విషయం ఏమిటంటే కొద్ది రోజుల క్రితం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీ ఆర్థిక పరిస్థితిపై కాగ్ సమాచారంతో కూడిన ఒక ప్రకటననను సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. వివిధ మీడియాలలో ప్రముఖంగా వచ్చిన ఆ వ్యాఖ్యలను ప్రభుత్వ పెద్దలెవరూ ఖండన ఇవ్వలేకపోయారు. అవకాశం చిక్కినప్పుడల్లా జగన్‌ను విమర్శించేందుకు రెడీగా ఉండే చంద్రబాబు కూడా ఈ ఆర్థికాంశాలపై పెదవి విప్పితే ఒట్టు. దీంతో ఎల్లో మీడియా ఆ బాధ్యతను తన భుజాలకెత్తుకుంది. తెలుగుదేశం పార్టీకి బాండ్ వాయించే ఆంధ్రజ్యోతి ఒక పెద్ద కథనాన్ని ఇచ్చింది. జగన్ ప్రకటన సాక్షిలో 'రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత ఆందోళనకరం’’ అన్న హెడింగ్ తో వచ్చింది. కూటమి ప్రభుత్వం కేవలం 14 నెలల్లోనే రూ.1.86 లక్షల కోట్ల అప్పు చేసిందన్న వివరమూ అందులో ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పులో ఇది 56 శాతం అని జగన్ చెప్పారు. అవినీతి వల్ల ప్రస్తుత కూటమి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడిందని ఆరోపించారు. ఐదేళ్ల తన హయాంలో రూ.3.32 లక్షల కోట్ల అప్పు చేస్తే కూటమి ప్రభుత్వం 14 నెలల్లోనే అందులో 56 శాతం అప్పు చేసిందని జగన్ వివరిచారు. ఇది నిజమా? కాదా? అన్నదానిపై ప్రభుత్వం సాధికారికంగా జవాబు ఇవ్వాలి. ముఖ్యమంత్రి కాని, ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ గాని, ఆర్థిక శాఖ అధికారులు కాని కిమ్మనలేదు. ఆంధ్రజ్యోతి మాత్రం స్పందించింది. టీడీసీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వానికి బాగా డామేజీ అయిందని, చంద్రబాబు పరువు దెబ్బతిందని భావించిన ఆ మీడియా తన పత్రిక, టీవీ ఛానెల్ ద్వారా గుండెలు బాదుకుంటూ ఒక స్టోరీని ప్రచారంలో పెట్టింది. దానికి వారు పెట్టిన హెడింగ్ ‘నాడు అరాచకం-నేడు అభివృద్ధి’ అని. అలాగని అప్పట్లో జరిగిన అరాచకం ఏమిటో చెప్పారా అంటే అదేమీ కనిపించలేదు. ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని వివరించిందీ రొటీన్ ఊకదంపుడు వ్యవహారమే. జగన్ ప్రభుత్వం అప్పు చేసింది కాని రోడ్లు వేయలేదట. ఇప్పుడు రోడ్లు వేసేశారట. ఏ ప్రభుత్వంలో అయినా రోడ్లు వేయడం నిరంతరం ప్రక్రియ. అప్పట్లో ఎక్కడ ఏ చిన్న రోడ్డు పాడైనా భూతద్దంలో చూపుతూ ప్రజలను మోసం చేసింది ఎల్లో మీడియా. అలాగని అన్ని రోడ్లు బాగా ఉన్నాయని చెప్పడం లేదు. కాని ఎల్లో మీడియా రాసినంత దారుణంగా పరిస్థితి లేదు. పైగా అప్పట్లో కొత్త టెక్నాలజీని ఉపయోగించి కొత్త రోడ్ల మన్నిక పెంచేందుకు ప్రయత్నం చేశారు. ఆ విషయాలను దాచిపెట్టి ఇప్పుడే రోడ్లు వేసేసినట్లు ప్రచారం చేస్తున్నారు. నిజానికి ప్రస్తుతం కూడా అనేక రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని సచిత్ర సమేతంగా వార్తలు వస్తున్నాయి. పాడైన రోడ్లు పుంఖానుపుంఖాలుగా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సుమారు రూ.1200 కోట్లు ఖర్చు చేశామని చెబుతున్నారు. అయినా రోడ్లు అనేకం ఎందుకు అధ్వాన్నంగా ఉన్నాయి? ఏలూరు వద్ద ఒక రోడ్డును చూస్తే అంతా గోతులమయంగానే ఉంది. ఏజెన్సీలో రోడ్ల కోసం జనం గుర్రాలెక్కి ఎందుకు నిరసన చెబుతున్నారు? మిగిలిన రూ.1.84 లక్షల అప్పును ఏమి చేశారో శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయరో ఈ మీడియా చెప్పి ఉండాల్సింది. అమరావతిలో పనులు జరిగిపోతున్నాయట. అవును! వరద నీటిని తోడే మోటార్లు నిత్యం పని చేస్తున్నాయి. ప్రపంచ బ్యాంక్, హడ్కో వంటి సంస్థల నుంచి అప్పులు తెచ్చారు. ఆ నిధులు ఖర్చు చేస్తున్న తీరు, అందులో జరుగుతున్న అవినీతిపై వస్తున్న కథనాలు మాటేమిటి? భూమి ఖర్చు లేకపోయినా, చదరపు అడుగుకు రూ.ఎనిమిది వేల నుంచి రూ.పది వేల ఖర్చు చేస్తున్నారన్న ఆరోపణలకు ఎన్నడైనా జవాబిచ్చారా? పోలవరం పనులు జరుగుతున్నాయట. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇస్తుంటే, ఏపీ తెస్తున్న అప్పులు దాని కోసం ఎందుకు ఖర్చు చేస్తారు? పాఠకుల చెవిలో పూలు పెట్టడం తప్ప ఇందులో ఏమైనా నిజం ఉందా? ఐదేళ్లలో జగన్ ఆర్భాటంగా బటన్ నొక్కి సంక్షేమ పథకాలు అమలు చేసినా, కొన్ని హామీలలో మాట తప్పారని ఈ పత్రిక అంటున్నది. కొన్ని విస్మరించారని చెబుతోంది. ఏ హామీ అమలు చేయలేదో ఎందుకు ఉదహరించలేక పోయింది? అదే చంద్రబాబు ప్రభుత్వం ఎక్కువగానే సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఈ ఎల్లో మీడియా బుకయింపు. ఎన్నికల హామీలు దాదాపుగా నెరవేర్చిందట. జగన్ హామీలకు సంబంధించి రూ.2.70 లక్షల కోట్లను ప్రజలకు నేరుగా వారి ఖాతాలలో వేశారన్నది వాస్తవం.దాని గురించి చెప్పలేదు. సంక్షేమానికి ఇప్పటివరకు ఎన్ని వేల కోట్లను వెచ్చించిందో కూటమి ప్రభుత్వం వివరించగలదా? ఒకటి, రెండు తప్ప, మిగిలిన అన్ని ఎన్నికల హామీలను ఒక ఏడాది ఎగవేసింది నిజం. ఈ ఏడాది ఇస్తున్నప్పటికీ కోతలు పెడుతుండడం, ప్రజలు ఆందోళలనకు దిగుతుండడం నిత్యం చూస్తేనే ఉన్నాం. జగన్ టైమ్‌లో అలాంటివి కనిపించాయా? జగన్ 98 శాతం హామీలను నెరవేర్చారు. ఆయన తన మానిఫెస్టోని ధైర్యంగా జనం ముందుంచి చేసిన వాటి గురించి చెప్పగలరు. మరి చంద్రబాబు అలా తన మానిఫెస్టోలోని వాగ్దానాలు చదువుతూ ఎంతవరకు అమలు చేసింది వివరించగలుగుతారా? నెలకు రూ.3000 నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు రూ.1500, బీసలకు ఏభై ఏళ్లకే ఫించన్ తదితర హామీలను ఏమి చేశారో ఆంధ్రజ్యోతి వివరించి ఉండాల్సింది. అలాగే దేవుడి సాక్షిగా పండగ రోజు వలంటీర్లకు ఓట్టేసినట్లు ఇచ్చిన హామీ ఏమిటి? ఆ తర్వాత మాట మార్చిన సంగతేమిటి? రైతు భరోసాపై అప్పుడు ఏమి చెప్పారు? ఇప్పుడేమి చేస్తున్నారు. తల్లికి వందనంలో ఏమి ప్రామిస్ చేశారు? ఇప్పుడు కేంద్రం ఇచ్చే స్కాలర్ షిప్ లకు ఎందుకు లింక్ పెడుతున్నారు? ఉద్యోగుల సీపీఎస్ ఏమి చేశారు? వారి పీఆర్సీ హామీ ఏమైంది?అవన్నే కాదు. వారి డీఏ బకాయిలను ఇస్తున్నారా? ఇన్ని పెట్టుకుని ఏదో ఒకటి దబాయించి చంద్రబాబు తరపున ప్రచారం చేస్తే జనం నమ్మేస్తారా? జగన్ అభివృద్ధి చేయలేదట. ఆయన హయాంలో కుప్పంకు నీరు తెచ్చారా. లేదా? ఇప్పుడు మళ్లీ అదే స్కీమ్‌ను చంద్రబాబు ప్రారంభించారా? లేదా? ప్రతి గ్రామంలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్స్, ఇలా వేలాది భవనాలు నిర్మిస్తే అది అభివృద్ది కాదా? నాలుగు ఓడరేవులు, పది ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ లాండ్ సెంటర్ల నిర్మాణం ఆరంభించింది ఆయన కాదా? రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టింది జగన్ కాదా? ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటుకు కట్టబెట్టడానికి చేస్తున్న ప్రయత్నం మాటేమిటి? జగన్ తెచ్చిన మెడికల్ సీట్లను వదులుకోవడం కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి అని ఎల్లో మీడియా చెబుతోందా? జగన్ నాడు-నేడు కింద స్కూళ్లు, ఆస్పత్రులను బాగు చేయలేదా? ఆరవై నాలుగు లక్షల మందికి ఫించన్లు, అమ్మ ఒడి, చేయూత తదితర స్కీముల కింద ప్రజలకు ఆర్థిక సహకారం అందిస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని ప్రచారం చేశారు. మరి ఇప్పుడు అలాంటి స్కీములు, ఫించన్లు ఇవ్వడం రాష్ట్ర వికాసం అని ఆంధ్రజ్యోతి రాసింది. ఇలాంటి మీడియాను జనం నమ్మవచ్చా? మహిళలకు ఉచిత బస్ ప్రయాణం గొప్ప విషయం అని ఈ పత్రిక చెబుతోంది. అన్ని బస్ సర్వీస్‌లలో ఈ స్కీమ్ అమలు చేయకపోవడం మోసం కిందకు వస్తుందా? రాదా? ఉచిత ప్రయాణానికి మహిళలు ఎక్కువమంది వస్తుండడంతో బస్ సర్వీసులను తగ్గించేశారన్న విమర్శలు వస్తున్నాయి. కొన్ని చోట్ల స్త్రీలు గొడవలు పడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒక చోట అలాంటి ఘటన పోలీస్ కేసు కూడా అయింది. అదే టైమ్‌లో ఫ్రీబస్ కారణంగా నష్టపోతున్న ఆటోలవారు ఈ బస్సులలో భిక్షాటన చేస్తూ నిరసన చెబుతున్నారు. వారికి ఇచ్చిన ప్రామిస్ ఏమైంది. అసలు ఇదే మీడియా యజమాని పలుమార్లు ఈ స్కీములన్నీ వృథా అన్నట్లుగా మాట్లాడిన సంగతేమిటి? జగన్ చేస్తే తప్పు, చంద్రబాబు చేస్తే గొప్ప అన్న చందంగా ప్రచారం చేస్తుంటారే. కరెంటు చార్జీలు పెంచను, పైగా తగ్గిస్తాను అని చంద్రబాబు పలుమార్లు అన్నారు కదా? ఆ మాటమీద ఎందుకు నిలబడలేకపోయారు? దానిని వదలిపెట్టి గత ప్రభుత్వ హయాంలో కరెంటు ఛార్జీలు పెరిగాయని ప్రచారం చేయడంలో అర్ధం ఉందా? జగన్ టైమ్ లో రూ.3.32 లక్షల కోట్ల అప్పే చేశారన్న విషయం తేలినా, కేంద్రం కూడా చెప్పినా, టీడీపీతోపాటు ఈ ఎల్లో మీడియా వైసీపీపై విషం చిమ్ముతుంది. జగన్ చెప్పినట్లు కూటమి ప్రభుత్వంలో ఆదాయం తగ్గిందా? లేదా? కేంద్ర ప్రభుత్వం సొంత ఆదాయ వృద్ది 12 శాతం ఉండగా, రాష్ట్ర సొంత ఆదాయం పెరుగుదల కేవలం మూడు శాతమే అని జగన్ చెప్పింది నిజమా? కాదా? ఆదాయాలు తగ్గి, అప్పులు పెరగడం ఆందోళనకరమని జగన్ అన్నారు. దానిని అంగీకరిస్తారా?లేదా? ఎల్లో మీడియాగా పేరొంది టీడీపీకి మద్దతుగా నిలిచే ఈనాడు, ప్రభుత్వం ఆంధ్రజ్యోతి పత్రిక ఆర్థిక ప్రయోజనాలను పుష్కలంగా నెరవేరుస్తూన్నప్పుడు రాష్ట్రం అతా బ్రహ్మాండంగానే ఉన్నట్లు కనిపిస్తుంది. ఈటీవీ కార్తీక దీపోత్సవం నిర్వహిస్తుంటే ఏపీ ప్రభుత్వం ప్రకటనల రూపంలో రూ.92 లక్షలు ఇచ్చిందట. ఆంధ్రజ్యోతికి విశాఖలో మళ్లీ కోట్ల రూపాయల విలువైన భూమి ఇస్తున్నారట. వీరిద్దరికి ప్రచార ప్రకటనల రూపంలో కోట్ల రూపాయలు గిట్టుబాటు అవుతున్నాయి. అందుకే ప్రజల పక్షాన కాకుండా , ప్రభుత్వం తరపున ఇలాంటి అరాచకపు, అబద్దపు రాతలు రాస్తుంటారు! జగన్ చెప్పినట్లు రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి అధ్వాన్నంగానే ఉండవచ్చు కాని, ఎల్లో మీడియా పంట మాత్రం బాగానే పండుతోందన్న సంగతి ప్రజలందరికి తెలుస్తూనే ఉంది.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యత -
పరిపాలన మహాపతనం!
‘సుపరిపాలన – తొలి అడుగు’ అనే కార్యక్రమాన్ని ఏపీలోని కూటమి ప్రభుత్వం ఇటీవల చేపట్టింది. తమ తొలి ఏడాది పాలనా ఫలితాలు ఎంత రమ్యంగా ఉన్నాయో యెల్లో మీడియా కళ్లద్దాల్లోంచి లోకానికి చూపాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. కానీ, ఆ రంగుటద్దాలను బద్దలు కొట్టుకొని మరీ రోజుకో యథార్థం బ్లాక్ అండ్ వైట్ చిత్రంగా బయటకొస్తున్నది. ఆ చిత్రాల్లో కంచే చేను మేస్తున్న వంచనోదంతం కనిపిస్తున్నది. అండగా నిలబడవల సిన ప్రజా ప్రతినిధుల కళ్లలోంచి జారుతున్న కీచక కిరణాలు కనిపిస్తున్నాయి. వాటి కంపరాన్ని తట్టుకోలేని ఆడబిడ్డల నిస్స హాయత కన్నీటి బొట్టు రూపంలో స్పష్టంగా కనిపిస్తున్నది. భూమినీ భూగర్భాన్నీ, యేటిలోని ఇసుకనూ, గట్టు మీది మట్టినీ కబళిస్తున్న కబంధ హస్తాలు కనిపిస్తున్నాయి.‘ధిక్కారముల్ సైతుమా’ అంటున్న కంసమామల హింస రచన ఊరూవాడల్ని దాటి అడవులూ, కొండల్లోకి పాకింది.మంత్రుల పేషీలకి మూటలు మోసే బ్రోకరేజి పనులు చేయలేన న్నందుకు తనను శంకరగిరి మాన్యాలు పట్టించారని ఓ అధికారి ఆవేదనతో రాసుకున్న ఉత్తరం వెలుగులోకి వచ్చింది. ‘మా మంత్రిగారు పర్యటనకొస్తే స్టార్ హోటల్లో సేద దీరేందుకు ఏసీ రూమ్, పక్కనే ఇంకో రూమ్ పెట్టుకుని ఆ పనులకే పరిమిత మవుతార’ని సొంత పార్టీ నాయకుడే సర్కార్ వారి ఛానల్లో దండోరా వేశాడు. ఇలాంటి కథలింకెన్నో! వెలుగు చూసిన వాటిలో మంత్రుల లీలలూ, ఎమ్మెల్యేల విన్యాసాలూ, ఇతర నాయకుల కళలూ డజన్లకొద్దీ ఉన్నాయి. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అనేది మన పాత సామెత. ప్రభుత్వ యంత్రాంగంలోని దూడలన్నీ ఇప్పుడు చేలను చడతొక్కుతున్న దృశ్యమైతే అందరికీ కనిపిస్తున్నది. ఆవు గట్టున మేస్తే ఈ పరిస్థితి రాదు కదా! ఎమ్మెల్యేల మీద, నాయ కులు, మంత్రుల మీద జుగుప్సాకరమైన ఆరోపణలు వస్తున్నా ముఖ్యమంత్రి నుంచి పెద్దగా స్పందన రావడం లేదు. ఆయన ఫలానా వారి మీద చాలా సీరియస్ అయ్యారనీ, గట్టిగా మంద లించారనీ యెల్లో మీడియాకు ‘విశ్వసనీయంగా’ తెలియవస్తుంది. కథ అంతటితో ముగిసిపోతుంది. ఒకరిద్దరు నేతలనైతే ‘వివరణ’ పేరుతో ముఖ్యమంత్రి పిలిపించినట్టున్నారు. వారు గట్టిగా ఎదురు తిరిగారనీ, దాంతో ఆయన... అయితే ఓకే అని పంపించారని మనకు కూడా విశ్వసనీయంగా తెలియవచ్చింది. ఆ తదుపరి చర్యలేమీ లేకపోవడమే ఈ నిర్ధారణకు ఆధారం.నైతికంగా, పాలనాపరంగా, రాజకీయంగా ఇంతగా దిగ జారిన ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూసి ఉండలేదు. ఈ వైపరీత్యాన్ని ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే యెల్లో మీడియా కూడా దాచిపెట్టలేకపోతున్నది. ముఖ్యమంత్రి సీరి యస్ అయ్యారని చెప్పడం కోసమైనా ఒకటి రెండు ఉదంతా లను వారే స్వయంగా వెలుగులోకి తెస్తున్న వింత పరిణామాన్ని చూస్తున్నాము. కూటమిలోని మూడు పార్టీలకు చెందిన కొందరు సీనియర్ నాయకులు సైతం దుర్గంధ భరితమైన ఈ ప్రభుత్వ పాలనపై బహిరంగంగానే నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పతనాన్ని స్థూలంగా మూడు భాగాలుగా మనం విభ జించవచ్చు. 1. నేతల విచ్చలవిడి అవినీతి – విశృంఖల ప్రవ ర్తన, 2. పాలనా వైఫల్యం – వ్యవస్థల విధ్వంసం, 3. రాజకీయ అవకాశవాదం – రహస్య స్నేహాలు.విచ్చలవిడి అవినీతి – విశృంఖల ప్రవర్తన ఈ అంశంపై 14 నెలల కాలాన్ని సమీక్షించాలంటే ఓ గ్రంథమే రాయవలసి ఉంటుంది. ఒకటి రెండు వారాలుగా వెలుగు చూస్తున్న కొద్దిపాటి ఉదంతాలను పరికిస్తే చాలు. వ్యవ సాయ శాఖకు అనుబంధంగా ఉండే ఆగ్రోస్ జీఎమ్‌గా పనిచేసి బదిలీ అయిన అధికారి ఈమధ్య చీఫ్ సెక్రటరీకి ఒక ఉత్తరం రాశారు. మంత్రిగారి (అచ్చెన్నాయుడు) పేషీలోని అధికారి ఒకా యన తనను పిలిచి ఆగ్రోస్ కొనుగోళ్లకు సంబంధించిన కమీష న్లను తమకు మాట్లాడిపెట్టే మధ్యవర్తిత్వం చేయాలని సూచించా రని ఆయన ఉత్తరంలో ఆరోపించారు. ఈ పనికి తాను అంగీక రించకపోవడంతో తనను బదిలీ చేసి, అర్హత లేని ఒక జూనియర్ అధికారిని అక్కడ నియమించారని ఆయన సీఎస్‌కు ఫిర్యాదు చేశారు. కానీ, ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి చర్యా లేదు.తిరుపతి వాస్తవ్యుడైన సుధాకర్‌రెడ్డి అనే సీనియర్ టీడీపీ నాయకుడు ఈ మధ్య ఏబీఎన్ టీవీ ఛానల్ డిబేట్లో పాల్గొ న్నారు. తమ జిల్లాకు రెగ్యులర్‌గా వచ్చే మంత్రి ఫైవ్‌స్టార్, సెవెన్ స్టార్ హోటళ్లలో దిగి తన రూమ్‌తోపాటు ఇంకో అనుబంధ రూమ్‌ను కూడా మెయిన్‌టెయిన్ చేస్తాడనీ, పార్టీ వారికి మాత్రం అందుబాటులో ఉండరని ఆరోపించారు. ఎమ్మెల్యేలను అదు పులో పెట్టవలసిన మంత్రులే ఇలా ప్రవర్తిస్తుంటే ఇక వారి సంగతి చెప్పడానికేముందని ఆయన వాపోయారు. నెల్లూరు జిల్లాకు చెందిన కరుడుగట్టిన రౌడీషీటర్, జీవిత ఖైదీ శ్రీకాంత్‌కు సంబంధించిన పెరోల్ వ్యవహారం పెద్ద సంచలనంగా మారింది. ఆయనకు పెరోల్ ఇవ్వాలని ఇద్దరు ఎమ్మెల్యేలు – కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పాశం సునీల్ ప్రభుత్వానికి లేఖలు రాశారట! జైలు శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి కొంతకాలం సమాజంలో గడపడానికి కాలపరిమితితో, షరతులతో కూడిన విడు దలనే ‘పెరోల్’ అంటాము. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు మాత్రమే ఇస్తారు. ఈయనకు గతంలో జైలు నుంచి పారి పోయిన రికార్డు కూడా ఉన్నది. అందువల్ల హోంశాఖ అధికా రులు సిఫారసును తిరస్కరించారట! అయితే మంత్రిస్థాయిలో ఆమోదం లభించింది. ఎలా సాధ్యం? డబ్బులు చేతులు మారైనా ఉండాలి. మానవీయ కోణంతోనైనా ఆమోదించి ఉండాలి. లేదా అత్యున్నత స్థాయి ఆదేశాలైనా ఉండాలి. సుగాలి ప్రీతి మీద లేని మానవీయ కోణం రౌడీషీటర్ విషయంలో ఉంటుందా?మంత్రులకు సంబంధించిన పై మూడు ఉదంతాలు చాలా తీవ్రమైనవి. ఆరోపణలు నిజం కాకపోతే సాక్ష్యాధారాలతో కూడిన వివరణలు వారు స్వయంగా ఇచ్చి ఉండవలసింది. ఇక్కడ అర్ధాంగీకారాలు ఉండవు. కనుక ఈ మౌనాన్ని పూర్తి అంగీకారంగానే జనం భావిస్తారు. ఎమ్మెల్యేల కథలైతే బేతాళ కథల మాదిరిగా అనంతం. శ్రీశైలం ఎమ్మెల్యే పుణ్యక్షేత్రం చెక్ పోస్టు దగ్గర గిరిజన సామాజిక వర్గానికి చెందిన అటవీ అధికారులపై చేయి చేసుకున్న వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఎమ్మెల్యే అయినంత మాత్రాన ఇంత బరితెగింపు ఎలా వచ్చింది? ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవి తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య ఆరోపించారు. విసిగి వేసారిన ఆమె ఆత్మహత్యకు కూడా ప్రయత్నించారు. దాని మీద ఎమ్మెల్యే ఎదురుదాడికి దిగారు. కానీ, ఒక మహిళా ఉద్యోగికి ఎమ్మెల్యే రాత్రిపూట వీడియోకాల్స్ చేయవలసిన అవసరమేమిటనేదే కీలకమైన ప్రశ్న. చోడవరం ఎమ్మెల్యేపైనా, గుంటూరు ఎమ్మెల్యేపైనా వీడియోల సైతంగా ఇటువంటి ఆరోపణలే వచ్చాయి. రామాయంపేట పోర్టు పనుల కాంట్రాక్టర్‌ను కప్పం కోసం స్థానిక ఎమ్మెల్యే బెదిరిస్తున్నారని యెల్లో మీడియానే రాసింది. ఇలా అనేకమంది ఎమ్మెల్యేలు దందాలు చేస్తున్నారని కూడా ఆ మీడియానే రాసింది. కొస మెరుపుగా అధినేత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని రాయడం మాత్రం మరచిపోలేదు. అయినా ఈ దందాలు పెరుగు తున్నాయే తప్ప తగ్గడం లేదు.రాష్ట్రమంతటా మద్యం ఏరులై ప్రవహిస్తున్నది. నాలుగు వేలకుపైగా లైసెన్స్డ్ షాపులకు అనుబంధంగా భారీ పర్మిట్ రూమ్‌లకు ఈమధ్యనే అనుమతులిచ్చారు. 75 వేలకు పైగా బెల్టు షాపులు ఇప్పటికే గలగలలాడుతున్నాయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరంలో ఎక్సైజ్ ఆదాయం 24 వేల కోట్లయితే, మిగిలిన నాలుగేళ్లు నలభై వేల కోట్ల చొప్పున ఉంటుందని అంచనా వేస్తున్నారు. మొత్తం లక్షా 84 వేల కోట్లు. నాయకుల కమిషన్ బెల్ట్ షాపుల్లో 20 శాతం, లైసెన్స్డ్ షాపుల్లో 5 శాతం, పర్మిట్ రూమ్‌లు ఇచ్చిన నేపథ్యంలో 10 శాతంగా చెబుతున్నారు. సగటున 10 శాతం లెక్క వేసినా 18 వేల కోట్ల పైచిలుకు సర్కారు వారి కోటా. ఒక్కో ఎమ్మెల్యే సామ్రాజ్యంలో వంద కోట్లకు పైగానే మద్యం గిట్టుబాటనుకోవాలి.పాలనా వైఫల్యం – వ్యవస్థల విధ్వంసంవాగ్దాన భంగం కూడా పాలనా వైఫల్యం కిందకే వస్తుంది. దానికదే ఒక పెద్ద పరిశీలనాంశం. మేనిఫెస్టోలో అగ్ర ప్రాధాన్య తగా ‘సూపర్ సిక్స్’ను కూటమి ప్రకటించింది. ఈ ‘సూపర్ సిక్స్’ సూపర్ హిట్ అయింది. అన్నీ అమలు చేశామని చంద్రబాబు చెబుతున్నారు. ఇది పూర్తిగా మోసపూరిత ప్రకటనగానే భావించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా వ్యయమయ్యే రెండు ప్రధాన హామీల జోలికి ఆయన అసలు వెళ్లలేదు. 20 లక్షల మందికి ఉద్యోగాలు, నిరుద్యోగులందరికీ నెలకు మూడు వేల రూపాయల చొప్పున భృతిని అందజేస్తామని చెప్పారు. ఈ హామీని ప్రభుత్వం పూర్తిగా మరిచిపోయింది. కొత్త ఉద్యోగాల సంగ తేమో కానీ ఉన్న ఉద్యోగాలకు అంటకత్తెర పడుతున్నది. మేని ఫెస్టో హామీ ప్రకారం నిరుద్యోగ భృతిని కనీసం కోటిమందికి (రాష్ట్రంలో 1.6 కోట్ల కుటుంబాలున్నాయి) లెక్క వేసుకున్నా 14 నెలల్లో 42 వేల కోట్లు బకాయిపడ్డారు.మరో ముఖ్యమైన హామీ ‘ఆడబిడ్డ నిధి’. 19 నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న మహిళలందరికీ నెలకు 1500 చొప్పున ఏటా రూ.18 వేలు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారు. రాష్ట్రంలో ఈ వయసుల్లో ఉన్నవారు సుమారు ఒక కోటి 80 లక్షలమంది (ఓటర్ల జాబితా లెక్కల ప్రకారం, 59 పై వయసు వారిని మిన హాయించగా) ఉన్నట్టు అంచనా. వీరందరికీ తొలి ఏడాది 18 వేల రూపాయల చొప్పున ఎగనామం పెట్టినట్టే! ఇప్పుడు ఈ హామీ ప్రస్తావన కూడా తేవడం లేదు. మిగిలిన నాలుగు హామీ లను అరకొరగా అమలు చేయడం తెలిసిందే. ‘అన్నదాత సుఖీ భవ’ కోసం రాష్ట్ర ప్రభుత్వం వాటాగానే గత సంవత్సరం 20 వేలు, ఈ సంవత్సరం అందులో తొలి భాగంగా సగమైనా ఈపాటికి జమ చేసి ఉండవలసింది. కానీ ఇంతవరకు జమ చేసింది 5 వేలు మాత్రమే! ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళ లకు 14 నెలలు ఎగవేసి అనేక మినహాయింపులతో వారం రోజుల కింద ప్రారంభించారు. ‘తల్లికి వందనం’ తొలి సంవ త్సరం రద్దు. రెండో సంవత్సరం కోతలతో అమలు చేశారు. హామీ ప్రకారం ఈపాటికి ప్రతి ఇంటికీ నాలుగు ఉచిత గ్యాస్ బండలు అంది ఉండాలి కానీ, చాలాచోట్ల ఒకటి మాత్రమే అందింది.ఒక బస్తా యూరియా సంపాదించడం కోసం రైతన్నలు పడుతున్న అగచాట్లు అన్నీ ఇన్నీ కావు. నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు ఇంటి దగ్గరికి నడిచొచ్చిన జగన్ రోజులెక్కడ, ఈరోజులు ఎక్కడని జనం బేరీజు వేసుకుంటున్నారు. పెన్షన్ ఎగవేసి కడుపు కొట్టినందుకు ఆవేదనతో దివ్యాంగులు నడి రోడ్లపై ధర్నాలు చేయడం ఎప్పుడైనా చూశామా? కంటికి కనిపిస్తున్న అంగవైకల్యానికి సర్టిఫికెట్ ఇవ్వాలంటే లంచాలడుగు తున్న నికృష్టమైన అవినీతి వ్యవస్థ అమల్లోకి వచ్చింది. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్న దని విమర్శించి 14 నెలల్లోనే ఆయన 60 నెలల్లో చేసిన అప్పులో 56 శాతం చేసేశారు. ప్రాథమిక వైద్య రంగాన్ని నిర్వీర్యం చేశారు. జగన్ ప్రారంభించిన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో సహా వైద్యరంగాన్ని ప్రైవేట్‌పరం చేయడానికి శరవేగంగా పావులు కదుపుతున్నారు. పేద పిల్లలను నాణ్యమైన విద్యకు దూరం చేశారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చెప్పుకొంటున్న అమరావతి, పోలవరం ప్రాజెక్టుల పనుల్లో పారదర్శకత లేదు. వాటిని లోతుగా పరిశీలించిన వారెవరికీ ఆ ప్రాజెక్టులు గట్టెక్కు తాయన్న నమ్మకం లేదు. మేము అధికారంలో ఉన్నంతకాలం విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం కానీయమని ప్రభుత్వ పెద్దలు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే ఆరు వేలమంది కార్మికు లను తొలగించారు. 32 విభాగాలను ప్రైవేట్‌పరం చేయడానికి టెండర్లు పిలిచారు. ముడి పదార్థాల సరఫరా నియంత్రణ, విద్యుత్‌ను అందజేసే థర్మల్ ప్లాంట్లలో 44 విభాగాలు, బ్లాస్ట్ ఫర్నేస్‌కు సంబంధించిన కీలక విభాగాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ నవనాడుల్ని తెగ్గోసిన తర్వాత ఆ ఫ్యాక్టరీలో ఇంకా ఊపిరి మిగిలి ఉంటుందా? ఈ పద్నాలుగు నెలల కాలంలో ప్రజల పరిస్థితి దిగజారిపోయిందనడానికి జీఎస్టి వసూళ్లే పెద్ద సాక్ష్యం. ఇక వ్యవస్థల విధ్వంసం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. పోలీసు యంత్రాంగాన్ని ఈ స్థాయిలో ప్రైవేట్ సేనగా మార్చేసిన దాఖలాలు గతంలో ఎన్నడూ లేవు. ఉన్నత న్యాయస్థానం కూడా ఈ ధోరణిపై పలు మార్లు చీవాట్లు పెట్టవలసి వచ్చింది. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఏరకంగా భ్రష్టుపట్టిస్తున్నారో చూస్తూనే ఉన్నాము. ఐఏఎస్ అధికారులు తనకు ఎదురొచ్చి కుర్చీ వేయలేదని మండిపడ్డ ఒక ఎమ్మెల్యేను చూశాము. ప్రభుత్వ అధికారులను బండబూతులు తిడుతున్న నాయకులను చూస్తున్నాము. అధికా రులు తమకు కమీషన్ ఏజెంట్లుగా పనిచేయాలని డిమాండ్ చేస్తున్న మంత్రుల పేషీలను చూస్తున్నాము. ప్రభుత్వ యంత్రాంగాన్ని చివరకు ఎక్కడిదాకా నడిపిస్తారో తెలియని అగమ్య గోచరంగా పరిస్థితి మారింది.రాజకీయ అవకాశవాదం – రహస్య స్నేహాలుచంద్రబాబు రాజకీయ అవకాశవాదాన్ని గురించి కొత్తగా చెప్పుకోవలసిన అవసరం లేదు. ఇతర రాజకీయ పార్టీలతో తెలుగుదేశం పార్టీకి ఆయన చేసిన పెళ్లిళ్లు, తీసుకున్న విడాకులు న భూతో న భవిష్యతి. ఎన్డీఏ ప్రభుత్వాల్లో ఆయన ఇప్పటికి మూడుసార్లు చేరారు. మొదటిసారి విడాకులు ఇచ్చినప్పుడు బీజేపీ మసీదులు కూల్చే పార్టీ అని విమర్శించారు. రెండో విడా కుల తర్వాత ప్రధాని మోదీని వ్యక్తిగతంగా దుర్భాషలాడటాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. తొలి రోజుల్లో కమ్యూనిస్టులతో స్నేహం చేసి ఉమ్మడి రాష్ట్రంలో వారిని నిర్వీర్యం చేసేదాకా ఆయన నిద్రపోలేదు. ఇలా జెండాలు మార్చడం ఒక భాగమైతే, ఒక కూటమితో కాపురం చేస్తూ మరో కూటమితో రహస్య స్నేహం చేయడం రాజకీయ విలువల పతనానికి పరాకాష్ఠ. జగన్మోహన్రెడ్డి సొంత రాజకీయ పార్టీ పెట్టిన నేపథ్యంలో టీడీపీకి ఆగర్భ శత్రువైన కాంగ్రెస్‌తో రహస్య స్నేహం మొదలు పెట్టారు. 2012లోనే ఈ విషయంపై ‘రహస్య మిత్రులు?’ పేరుతో ‘ఇండియా టుడే’ కవర్ పేజీ కథనాన్ని ప్రచురించింది.అప్పుడు మొదలైన స్నేహం పుష్కరకాలం దాటినా అవిచ్ఛి న్నంగా కొనసాగుతూనే ఉన్నది. 2018 తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు ఒక కూటమిగా కూడా పనిచేశాయి. నేరారోపణకు గురై 30 రోజులు కస్టడీలో ఉన్న ప్రధాని, ముఖ్య మంత్రుల పదవులు కోల్పోయేలా రూపొందించిన బిల్లుపై ఈమధ్య పార్లమెంటులో తీవ్ర చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఈ చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ చంద్రబాబును పదవిలోంచి తొలగించేందుకే ఈ బిల్లు పెట్టారని ఆరోపించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. శత్రు కూటమిలో ఉన్న రహస్య మిత్రుడి కోసం ఇంకా కాంగ్రెస్ తాపత్రయపడుతూనే ఉన్నది. ఆ పార్టీ ఆంధ్ర, తెలంగాణా విభా గాలు ఇప్పటికే బాబు అభీష్టానికి అనుగుణంగా పనిచేస్తున్నా యనేది ఆ రాష్ట్రాల ప్రజలకు తెలిసిన సంగతే. బిహార్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోగానే బాబు ‘ఇండియా కూటమి’లో చేరిపోతారని ఇటీవల కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు అల్కా లాంబా చేసిన ఉపన్యాసం కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాంగ్రెస్ ఎం.పి. మల్లు రవి ఈమధ్యన ఒక విచిత్రమైన వ్యాఖ్యానం చేశారు. పార్టీ గుర్తు కోసం ఎన్టీఆర్ – చంద్రబాబుల మధ్య జరిగిన వివాదంలో తీర్పు చెప్పిన బెంచిలో జస్టిస్ సుదర్శన్‌రెడ్డి కూడా ఉన్నారు కనుక అందుకు కృతజ్ఞతగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆయనను బాబు సమర్థించాలని రవి విజ్ఞప్తి చేశారు. న్యాయమూర్తులు సాక్ష్యాలు, ఆధారాల ప్రాతి పదికన తీర్పులు చెబుతారు. అందుకు దశాబ్దాల తర్వాత కూడా కృతజ్ఞత చూపెట్టడం దేనికో... ఈ సందర్భంలో కాంగ్రెస్ నేతలు బాబుపై ఇలా కురిపిస్తున్న ప్రేమను చూస్తుంటే రాహుల్ – బాబుల మధ్యన హాట్‌లైన్ లేదంటే నమ్మశక్యమా?వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
‘నాకు లేని ల్యాప్‌టాప్‌ను సిట్ ఎలా స్వాధీనం చేసుకుంటుంది?’
సాక్షి, తిరుపతి: చంద్రబాబు తన పాలనా వైఫల్యాల నుంచి, తన దుర్మార్గాల నుంచి ప్రజలను పక్కదోవ పట్టించడానికి లేని లిక్కర్ వ్యవహారాన్ని సృష్టించారని మాజీ డిప్యూటీ సీఎం కే.నారాయణస్వామి మండిపడ్డారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో జీడీనెల్లూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త కె.కృపాలక్ష్మితో కలిసి మీడియాతో మాట్లాడారు. కేవలం కక్షసాధింపుల కోసం లిక్కర్ స్కాం అంటూ ఒక బేతాళ కథను తయారు చేసి, దాని ద్వారా తప్పుడు కేసులు పెడుతూ చంద్రబాబు కుట్రను అమలు చేస్తున్నాడని నారాయణస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇందులో భాగంగానే మా పార్టీకి చెందిన నాయకుల్ని, మచ్చలేని రిటైర్డ్ అయిన అధికారులను కూడా అరెస్టు చేసి చంద్రబాబు మానసిక ఆనందం పొందుతున్నారని ధ్వజమెత్తారు. దీనికి కొనసాగింపుగానే 76 ఏళ్ల వయస్సున్న నాపై కూడా చంద్రబాబు కుట్ర పన్ని, విచారణ పేరుతో ఇబ్బంది పెడుతున్నారన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే..వృద్ధాప్యం కారణంగా నాకు ఆరోగ్యం బాగోలేదు. అందుకనే నేను గత ఏడాది ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుని, నా కుమార్తెకు అవకాశం ఇవ్వాల్సిందిగా పార్టీకి విజ్ఞప్తి చేశాను. నా విజ్ఞప్తి మేరకు వైఎస్ జగన్ నా కుమార్తెకు టిక్కెట్ ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నిన్న సిట్ వాళ్లు వచ్చి దర్యాప్తు పేరిట నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. సిట్ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాను. ఎక్సైజ్ మంత్రిగా అయిదేళ్ళ పాటు పనిచేశాను.'నాకేమీ తెలియదు, నాపైన ఉన్న వారు అన్ని నిర్ణయాలు చేశారు' అని ఎలా చెబుతాను? అలా చెప్పాను అని అంత బాధ్యతారహితంగా ఎల్లో మీడియాలో ఎలా కథనాలు రాశారో అర్థం కావడం లేదు. నా ఇంటికి సిట్ బృందం వచ్చినప్పటి నుంచి నన్ను అరెస్ట్ చేస్తున్నారని, మా ఇంట్లో ఉన్న డబ్బును లెక్కిస్తున్నారని, ఏదో స్వాధీనం చేసుకుంటున్నారంటూ ఇలా కసీ, ద్వేషం, పగతోనే నాపైన తప్పుడు బ్రేకింగ్‌లు, స్క్రోలింగ్‌లు వేశారు. తప్పుడు కథనాలు రాశారు.నా రాజకీయ జీవితంలో ప్రజలకు సేవ చేస్తూనే పదవులను అందుకున్నాను. నాపైన ఎప్పుడూ ఎటువంటి ఆరోపణలు లేవు. సిట్ వాళ్లు దర్యాప్తులో తాము చేసిన ఆరోపణలకు సంబంధించి ఎలాంటిదీ తేల్చలేకపోయినా, వాళ్లేదో కనిపెట్టినట్టుగా కట్టు కథలు అల్లుతున్నారు. వాటినే ఈ ఎల్లో మీడియా రాస్తుంది. వాటినే ఛార్జిషీట్లలో పెట్టడం కూడా మనం చూస్తున్నాం. అంతకుమించి సిట్ వాళ్లు చూపించిన ఆధారాలు, సాక్ష్యాలు ఏమీ లేవు. ఈ లిక్కర్ వ్యవహారం అక్రమ కేసని తేల్చిచెప్పడానికి ఇంతకన్నా రుజువులు అవసరం లేదు.ఎల్లోమీడియా రాతలకు అడ్డూ అదుపు లేదునాకు ల్యాప్‌టాప్ లేకపోయినప్పటికీ నిన్న సిట్ వాళ్లు ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నట్టు తప్పుడు రాతలు రాశారు. నేను ఎప్పుడూ ల్యాప్ టాప్ వాడలేదు, ఉపయోగించడం కూడా నాకు తెలియదు. సిట్ వాళ్లు కూడా మా ఇంటి దగ్గర నుంచి ఎలాంటి ట్యాప్ టాప్‌ను తీసుకెళ్లలేదు. మరి ఈ తప్పుడు ఎలా రాయగలుగుతున్నారు? చివరకు సిట్ వాళ్లు నా ఫోన్‌ను తీసుకున్నారు. నా ఫోన్ తీసుకుని వాళ్లేం చేస్తారు? నా లాంటి వాడు ఈ ఫోన్లను ఎంతవరకూ వాడతాడు?అయినా ఏదో ఉందని ప్రజలను నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు. మద్యపానం వల్ల కుటుంబాల్లో వస్తున్న సంక్షోభాలు, ఆరోగ్య సమస్యలు, విచ్చలవిడి విక్రయాల కారణంగా వస్తున్న సామాజిక సమస్యలు, మహిళల భద్రత, వారికి రక్షణ తదితర అంశాలపై మా ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందుకే ప్రభుత్వం ఏర్పాటు కాగానే లిక్కర్ వినియోగాన్ని నియంత్రించడంపై దృష్టిపెట్టాం. లాభాపేక్ష ఉన్న ప్రైవేటు వ్యాపారుల వల్ల విక్రయాలు, వేళల్లో నియంత్రణ లేకపోవడం, మాఫియాలా మారి అక్రమాలకు పాల్పడ్డం, వీధికో బెల్టుషాపులు పెట్టి మద్యాన్ని డోర్ డెలివరీ పద్ధతిలో అందుబాటులోకి తీసుకురావడం… ఇవన్నీ చూసిన తర్వాత వీటికి కళ్లెం వేస్తూ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు పెట్టాం. వేళల్ని నియంత్రిస్తూ, లిక్కర్ వినియోగాన్ని తగ్గించాం. మాఫియాకు అడ్డుకట్ట వేశాం.పారదర్శకంగా మద్యం పాలసీని అమలు చేశాంటీడీపీ ప్రభుత్వ హయాంలో ఐఎంఎల్, బీర్ల అమ్మకాల ద్వారా చివరి ఏడాది 2018–19లో రూ.17,341 కోట్ల ఆదాయం వస్తే, మా ప్రభుత్వ హయాంలో చివరి ఏడాది 2023–24లో వచ్చిన ఆదాయం రూ.25,082 కోట్లు. అదే సమయంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో కంటే, మద్యం అమ్మకాలు తగ్గాయి. ఆదాయం ఎందుకు పెరిగిందంటే, పన్నులువేశాం. ఆవిధంగా రాష్ట్రానికి ఆదాయం తెచ్చాం. టీడీపీ ప్రభుత్వ హయాంలో చివరి ఏడాది ఐఎంఎల్ 3.84 కోట్ల కేసులు, బీర్లు 2.77 కోట్ల కేసులు అమ్ముడు పోతే, మా ప్రభుత్వ చివరి ఏడాదిలో ఐఎంఎల్ 3.32 కోట్ల కేసులు, బీర్లు 1.12 కోట్ల కేసులు అమ్ముడుపోయాయి. అత్యంత పారదర్శరకంగా మద్యం పాలసీని అమలు చేయడం వల్ల, లిక్కర్ వినియోగం తగ్గినా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, 2014-19తో పోలిస్తే పెరిగిందే తప్ప తగ్గలేదు. ఈ లెక్కలన్నీ ప్రభుత్వ వద్దే ఉన్నాయి.ఇంత పారదర్శకంగా మద్యం పాలసీని అమలు చేస్తే, మాపై తప్పుడు కేసులు పెట్టి, రాజకీయ కక్షలు తీర్చుకుంటున్నారు. ఈ విషయాన్ని ప్రజలంతా గమనిస్తున్నారు. మద్యం దుకాణాలనే ప్రభుత్వమే నిర్వహిస్తున్నప్పుడు, లాభాపేక్ష లేకుండా వాటిని నడుపుతున్నప్పుడు, ప్రైవేటు విక్రయాలకు పులిస్టాఫ్ పెట్టినప్పుడు చంద్రబాబు ఆరోపిస్తున్నట్టుగా స్కాంకు ఆస్కారం ఎక్కడ ఉంటుంది? మాపై చేస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలు. అసలు స్కాం ఎవరిది? లంచాలు ఎవరికి ఇస్తారు? మద్యాన్ని ఎక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారా? అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? మా హయాంలో అమ్మకాలు తగ్గితే, చంద్రబాబు హయాంలో పెరిగాయి.మద్యం అమ్మకాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా? లేక ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే లంచాలు ఇస్తారా? మేం ప్రభుత్వ దుకాణాల ద్వారా అమ్మితే, చంద్రబాబు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాడు. వాళ్లంతా మాఫియాలా ఏర్పడి దోచుకున్నారు. విక్రయ వేళలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? లేక ఎక్కువ సమయం అమ్మేలా చేస్తే లంచాలు ఇస్తారా? మా హయంలో అమ్మకం వేళలు తగ్గించాం. చంద్రబాబుగారు రాత్రీ పగలూ లేకుండా అమ్మించారు.చంద్రబాబు హయాంలోనే మద్యం అవినీతిమద్యం దుకాణాలను పెంచితే లంచాలు ఇస్తారా? దుకాణాలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? మేం దుకాణాలు తగ్గించాం. కాని చంద్రబాబు విచ్చలవిడిగాద మద్యం దుకాణాలు, బార్లు, పర్మిట్ రూమ్స్ పెట్టాడు. దుకాణాలకు తోడు పర్మిట్ రూమ్‌లు, బెల్టుషాప్‌లు పెడితే లంచాలు ఇస్తారా? లేక బెల్టు షాపులు తీసేసి, పర్మిట్ రూమ్స్‌ను రద్దు చేస్తే లంచాలు ఇస్తారా? మేం 43 వేల బెల్టుషాపులు రద్దుచేశాం. వీధి వీధికీ చంద్రబాబు బెల్టుషాపులు పెట్టాడు. ఆలయాల వద్దా, స్కూళ్ల వద్దా ఇలా ప్రతి చోటా బెల్టు షాపులు పెట్టాడు. ఎంపిక చేసుకున్న 4-5 డిస్టిలరీలకు మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? అన్ని డిస్టిలరీలకు సమాన స్థాయిలో ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? చంద్రబాబు హయాంలో పూర్తి వివక్ష పాటించాడు.అస్మదీయులైన తనవాళ్లకే ఆర్డర్లు ఇచ్చాడు. మరి ఎవరిది అవినీతి?. ఇప్పుడున్న డిస్టిలరీలలో అధిక భాగం అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు వస్తాయా? లేక ఏ ఒక్క డిస్టిలరీకీ అనుమతివ్వని వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలువస్తాయా? రాష్ట్రంలో ఉన్న డిస్టరీలకు అనుమతులు ఇచ్చింది చంద్రబాబే. మేం ఒక్క డిస్టలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. మరి ఎవరిది అవినీతి.అన్నిటికీ మించి 2014-19 మధ్య చంద్రబాబు ప్రివిలేజ్ ఫీజులను రద్దుచేసి, అధికార దుర్వినియోగం చేసి, సుమారు రూ.5 వేల కోట్లకు పైగా ప్రభుత్వానికి నష్టం చేకూర్చారు. దీనిమీద మా ప్రభుత్వం హయాంలో కేసులు కూడా నమోదయ్యాయి. ఆ కేసులో చంద్రబాబు ఇప్పుడు బెయిల్‌పై ఉన్నారు. దాన్ని మరుగున పరచడానికి, తాను అవలంబించిన తప్పుడు విధానాలు సరైనవే అని చెప్పుకోవడానికి, మాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుడు కేసులు పెడుతున్నారు. వాస్తవాలు ఇలా ఉంటే.. చంద్రబాబు తిమ్మిని బమ్మిని చేయడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నాడు. మేం వివక్షకు పాల్పడుతున్నామని ఆరోపిస్తూ అప్పట్లోనే కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియాకు కంపెనీలు వెళ్లాయి. ఆ కేసును కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియా కొట్టిపారేసింది. మా పారదర్శకతకు ఇది నిదర్శనం. అయినా మాపై బురదజల్లుతూనే ఉన్నారు.కూటమి ప్రభుత్వంలోనూ అదే దోపిడీఇవాళ మంచి ప్రభుత్వం అంటూ డబ్బాలు కొట్టుకుంటున్న ఈ ప్రభుత్వంలో లిక్కర్ పాలసీ పూర్తిగా అవినీతి మయం. ఇష్టానుసారం దోచుకుంటున్నారు. విలచ్చవిడిగా మద్యాన్ని అమ్ముతున్నారు. తెల్లవారు జాము మొదలుకుని మళ్లీ తెల్లవారుజాము వరకూ మందు అమ్ముతున్నారు. ఎమ్మార్పీ రేట్లకు మించి లిక్కర్ అమ్ముతున్నారు. ఎలాంటి అనుమతుల్లేకుండా మద్యం దుకాణాల పక్కనే పర్మిట్ రూమ్‌లు పెట్టి అమ్ముతున్నారు. గ్రామాల్లో బెల్ట్ షాపులకు వేలం పాటలు పెడుతున్నారు. ఇంటింటికీ డోర్ డెలివరీ చేస్తున్నారు. మొత్తం మాఫియా మయమే. వేల కోట్ల రూపాయాలు దోచుకుంటున్నారు. కింద నుంచి పై స్థాయివరకూ ఈ లంచం సొమ్ము చేరుతుంది. నా జీవితంలో ఎప్పుడూ కూడా ఇంతటి అవినీతి చూడలేదు. పైగా ఈ అవినీతి బాగోతానికి మంచి పాలసీ అని ముద్రవేసి ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు.మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానం చెబుతూ..ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకుని పనులు చేసిపెట్టినట్లు నిరూపిస్తే విషం తాగి చనిపోతాను. లిక్కర్ పాలసీలో ఏం తప్పు జరిగిందని అప్రూవర్‌గా మారాలి? దళిత, బలహీనవర్గానికి చెందిన నాయకుడిననే నా వ్యక్తిత్వాన్ని హననం చేసేలా తప్పుడు కథనాలు రాశారు. నా ఇంట్లో ఎనిమిది కోట్ల రూపాయలు సిట్ అధికారులు లెక్కించి తీసుకుపోయారంటూ ఎలా ఎల్లో మీడియాలో స్క్రోలింగ్‌లు వేశారు. రికార్డులు స్వాధీనం చేసుకున్నారని రాశారు. ఇది సమంజసమా?. అన్ని అర్హతలు ఉన్న దివ్యాంగుల పెన్షన్లలోనూ కోతలు పెడుతున్నారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. దీనిలో కేవలం అయిదు కేటగిరిలకే ఎందుకు పరిమితం చేశారు? వీటిపై మాట్లాడితే పోలీస్ వ్యవస్థను ఉపయోగించి వేధిస్తున్నారు. చివరికి జిల్లా కలెక్టర్ వద్ద సమస్యలపై వెళ్ళినా ఏ పార్టీ అని రాస్తున్నారు -
అడ్డంగా దొరికిపోయిన ఈనాడు
-
బాబు గారికి పిచ్చి అన్నా స్పందించరా?
‘పీ-4 పిచ్చిలో చంద్రబాబు’’ టీడీపీ అనుకూల మీడియాలో ప్రచురితమైన ఒక కథనం శీర్షిక ఇది. ఇలాంటి కథనం ఏదైనా సాక్షిలోనో.. లేదా టీడీపీకి సంబంధం లేని ఏ ఇతర మీడియాలోనో వచ్చి ఉంటే ఆ పార్టీ, దాని మద్దతుదారులు అంతెత్తున లేచి ఉండేవారు. ముఖ్యమంత్రి చంద్రబాబును పట్టుకుని అంత మాట అంటారా అని మండిపడేవి. ఏ మాత్రం అవకాశం ఉన్నా కేసులు పెట్టడానికి ప్రయత్నించి ఉండేవారు. కాని టీడీపీ మీడియా యజమానే అనడంతో వాళ్లెవరూ కిక్కురుమనలేకపోతున్నారు. కనీసం ఖండన కూడా ఇచ్చినట్లు కనిపించలేదు.చిత్రమైన విషయం ఏమిటంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్‌లు ఇద్దరూ ఎన్నికల ప్రణాళికను ప్రకటించిన సందర్భంలోనూ ఈ ‘పీ-4’ అంశం గురించి చెప్పడం. అప్పుడు టీడీపీ మీడియా ఆహా, ఓహొ అంటూ ప్రచారం చేశారు. సూపర్ సిక్స్‌తో సహా ఎన్నికల ప్రణాళికలోని అంశాలన్నీ అద్భుతం అని, పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని తెగ ప్రచారం చేశాయి. ఏడాది కాలంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏ పిచ్చి పని చేసినా అది రైటే అన్నట్లుగా వ్యాఖ్యానిస్తూనే ఉన్నాయి. కొన్ని సంస్థలకు 99 పైసలకే ఎకరా భూమి ఇస్తామని ప్రకటించినా, విజయవాడలో అత్యంత విలువైన ఆర్టీసీ స్థలం లులూ మాల్‌కు ఇచ్చేస్తున్నా టీడీపీ మీడియా అలా చేయడం తప్పు అని ఎక్కడా కథనాలు ఇవ్వలేదు. మరి ఇప్పుడు ఏమైందో.. చిత్తశుద్దితోనే రాశారా? లేక ఏదైనా తేడా వచ్చి రాశారా? లేక బ్లాక్ మెయిల్ చేసే ఉద్దేశంతో రాశారా? లేక ప్రజలలో ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి రాశారా? అన్నది తెలియదు కాని ‘పీ-4’ గురించి రాసిన కథనంలో చంద్రబాబు ‘పీ-4 పిచ్చిలో ఉన్నారని అంటున్నారు. శీర్షికలో పిచ్చి అని రాసి చంద్రబాబును తప్పుపట్టినా, మేటర్‌లో మాత్రం తప్పు సలహాదారులు, అధికారులపై నెట్టే యత్నం చేశారు. ఆ సందర్భంలో కొన్ని వాస్తవాలను తమకు తెలియకుండానే ఒప్పుకున్నారు. చంద్రబాబు నేల విడిచి సాము చేస్తుంటారట. ఆచరణ సాధ్యం కాని ‘పీ-4’ వంటి ఆలోచనలంటే ఆయనకు మా చెడ్డ ఇష్టమట. ఈ బలహీనతను గుర్తించిన కొందరు ప్రతి టర్మ్‌లోను పక్కన చేరి దిక్కుమాలిన ప్రణాళికలు రూపొందించి ఆయనను అందులోకి లాగుతారట. ఇప్పుడు ఇలా రాశారు కాని, టీడీపీ సూపర్ సిక్స్ ప్రకటించినప్పుడు ఇదే మీడియా అబ్బో ఇంకేముంది..జగన్‌పై శరాలు సిద్ధం అంటూ తెగ పొగిడింది. అది ఆచరణ సాధ్యమేనని ఈ మీడియాతో పాటు ఇతర టీడీపీ మీడియా సంస్థనలు కూడా హోరెత్తించాయి కదా! అలాగే చంద్రబాబుకు అత్యంత సన్నిహిత సలహాదారులలో ఈ మీడియా అధినేత కూడా ఉంటారని చెబుతారు. కాని ఇప్పుడు సడన్‌గా చంద్రబాబులో ఫలానా అవలక్షణం ఉందని ఆయనే చెబుతున్నారు. అదే టైమ్‌లో పుణ్యానికి పోతే, పాపం ఎదురైనట్లు చంద్రబాబుకు రాజకీయంగా నష్టం జరుగుతోందని అంటున్నారు. ఇందులో చంద్రబాబు చేసిన పుణ్యమేమిటో తెలియదు. ‘పీ-4’ కొత్త పల్లవి అందుకున్నారని రాశారే తప్ప ఎన్నికల ప్రణాళికలోనే దీనిని పెట్టిన విషయాన్ని మాత్రం కప్పిపుచ్చుతున్నారు. ఇప్పుడేమో అది దిక్కుమాలిన సలహా అని అంటున్నారు. 2029 నాటికి రాష్ట్రంలో పేదరికం లేకుండా చేస్తామని చంద్రబాబు చెప్పడాన్ని ఈ మీడియా కూడా నమ్మడం లేదు. బంగారు కుటుంబాలు, మార్గదర్శులు అంటూ ముద్దు పేర్లు పెట్టి, కొంతమందికి పేదలను దత్తత తీసుకోవాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందని ఈ మీడియా యజమాని చెబుతున్నారు. ఇలాంటి సమాచారంతో కూడిన వార్తను సాక్షిలో వస్తే, టీడీపీ సోషల్ మీడియా తెగ విమర్శించింది. ఇదంతా అక్కసుతో కూడిన విమర్శలని ఆరోపించింది. మరి ఇప్పుడు స్వయంగా టీడీపీ మీడియానే ఆ విషయం రాస్తే నోరు విప్పలేకపోయింది. పేదరికం లేని సమాజం ఎక్కడైనా ఉందా? పూర్తిగా నివారించడం మన దగ్గర ఎలా సాధ్యం అన్న సందేహం ఎందుకు కలగలేదో తెలియడం లేదట. దాతలు స్వచ్ఛంగా ముందుకు వచ్చి అమలు చేసే ఇలాంటి కార్యక్రమాలను నిర్భందం చేయడం ఏమిటని ఆ మీడియా ప్రశ్నించింది. కోటి మంది పేద కుటుంబాలు ఉంటే 11 లక్షల కుటుంబాలనే ఎంపిక చేశారని, దీనివల్ల మిగిలిన వారు టీడీపీకి దూరం కారా అన్నది ఈ మీడియా యజమాని బాధ. చంద్రబాబు కుప్పంలో 250 కుటుంబాలను దత్తత తీసుకుంటానని ప్రకటించారని, దానివల్ల మిగిలిన పేద కుటుంబాలు కినుక వహించవా అని ఆయన అన్నారు. వారు ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతున్నారట, ఇప్పటికే ఎంపికైన కుటుంబాలలో 26 శాతం అనర్హమైనవని కూడా అధికారులు చెబుతున్నారట.ముఖ్యమంత్రి చంద్రబాబు ‘పీ-4’ అమలు కోసం పారిశ్రామికవేత్తలు, వ్యాపారులను పిలిచి గంటల కొద్ది చర్చలు జరుపుతుండడాన్ని కూడా ఈ మీడియా ఆక్షేపించింది. ఈ సమావేశాలకు వెళ్లిన వారు ఇదెక్కడి తద్దినం అని తిట్టుకున్నారని కూడా వెల్లడించారు. దత్తత తీసుకునే వారిని ఇంతమందిని ఎంపిక చేయాలని కలెక్టర్లకు టార్గెట్లు పెడుతున్నారని ఈ మీడియా యజమాని అంగీకరించారు. ఇదే మాట సాక్షి మీడియా చెబితే ఇంతెత్తున ఎగిరిపడిన ప్రభుత్వం, టీడీపీ సోషల్ మీడియా ఇప్పుడు నోరు మెదపడం లేదు. ‘పీ-4’ పథకం అమలు కమిటీ వైస్ ఛైర్మన్ కుటుంబరావును దీనికంతటికి బాధ్యుడు అన్నట్లుగా ఈ మీడియా యజమాని చెబుతున్నారు. తొలుత ముఖ్యమంత్రి ‘పీ-4’ పిచ్చిలో ఉన్నారని రాసిన ఈయన చివరికి దానినంతటిని ఒక సలహాదారుపై నెట్టేశారన్న మాట. ‘పీ-4’ వల్ల కూలీలు దొరకరని ఈయన సూత్రీకరిస్తున్నారు. అంటే ఎవరైనా నిజంగానే బాగుపడితే కూడా ఈయనకు నచ్చదు అనుకోవాలన్నమాట. అయితే టీడీపీతోసహా కూటమి ఎమ్మెల్యేలు కొందరు అరాచకాలకు పాల్పడుతున్నారని, ప్రజలను పీడిస్తున్నారని ఈ టీడీపీ మీడియా అంగీకరించడం విశేషం. ఎమ్మెల్యేలకు కప్పం కడితేనే ఏ పని అయినా అవుతోందని, చివరికి పోలీస్ స్టేషన్లలో కేసు కట్టడానికి, రిజిస్ట్రేషన్లకు కూడా వీరు అనుమతి ఉండాలట. రాజధాని అమరావతి విషయంలో కూడా పరిస్థితి గందరగోళంగా ఉందని కూడా ఈయన చెబుతున్నారు. ఇన్నాళ్లకు ఈ మీడియా ఒక నిజం రాసినా, ఇందులో వారికి ఉన్న చిత్తశుద్దిని శంకిస్తున్నారు. గతంలో ఒక నేతపై కథనం రాస్తూ ఆయన చానా పైరవీలు చేస్తున్నారని, లోకేశ్ పేరుతో దందాలు చేస్తున్నారంటూ చెప్పారు. ఈ స్టోరీ సరిగ్గా రాజ్యసభ ఎన్నికల ముందు వచ్చింది. అయినా ఆయనకే ఎంపీ పదవి దక్కింది. ఆ తర్వాత ఈ మీడియా కలం, గళం మూతపడిపోయింది. దీని భావమేమి తిరుమలేశ! అని అంతా ప్రశ్నించుకున్నారు.ఇప్పుడు ఈ కథనం ఇవ్వడం ద్వారా ఎవరిని బెదిరించడానికి అన్న చర్చ టీడీపీ వర్గాలలోనే జరుగుతుండడం ఆసక్తికరం! కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
‘వేసుకుందే దొంగ ఓట్లు.. ఉత్కంఠ ఎక్కడిది?’
సాక్షి, పులివెందుల: పులివెందుల ఎన్నికల విషయమై ఎల్లో మీడియా రాతలపై వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రిగ్గింగ్ జరిగితే ఎన్నికలపై ఉత్కంఠకు తెర ఎలా అవుతుంది? అని ప్రశ్నించారు. తప్పుడు రాతలతో.. ఎవరిని నమ్మించడానికి ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అంటూ మండిపడ్డారు. ఇలాంటి రాతలు అనైతికం కాదా? అని ప్రశ్నలు సంధించారు.వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ తాజాగా మాట్లాడుతూ.. ‘ఈరోజు ఈనాడు పత్రిక చూస్తే ఆ రాతలు ప్రజలను ఏదో నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఉత్కంఠకు తెర అని ఈనాడు రాస్తే.. లోకేశ్ అయితే ప్రజాస్వామ్యం నిలబడింది అంటున్నాడు. పులివెందులలో దొంగ ఓటింగ్ జరిగిందని ప్రజలందరికీ తెలుసు. దొంగ ఓటింగ్ జరిగితే ఉత్కంఠ ఎలా అవుతుంది?. ఉత్కంఠకు తెర అని రాతలు రాసి నమ్మించాలని ప్రయత్నిస్తున్నారు. రిగ్గింగ్ జరిగితే ఉత్కంఠకు తెర ఎలా అవుతుంది?. తప్పుడు రాతలతో మరోసారి ఎల్లో మీడియా ప్రజలకు తప్పుడు ప్రచారం చేస్తోంది. ఎవరిని నమ్మించడానికి ఇలాంటి రాతలు, స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అసలు పులివెందులలో ఓటింగ్ జరిగితే కదా.. ఇలాంటి రాతలు అనైతికం కాదా?. మీ పత్రిక అనైతిక రాతలు చూసి ఆత్మవిమర్శ చేసుకోండి.ఎవరి కోసం స్టేట్మెంట్స్.. అసలు పులివెందుల జడ్పీటీసీ స్థానంలో ఓటింగ్ జరిగి ఉంటే కదా మీరు ఇలాంటి రాతలు రాయాల్సింది?. వేసుకుందే దొంగ ఓట్లు.. దానికి మళ్లీ ప్రజాస్వామ్యం నిలబడింది అంటూ స్టేట్మెంట్ ఇవ్వడం ఎందుకు?. ఇక్కడ జరిగింది పులివెందుల, కడప జిల్లా వాళ్లకు మాత్రమే తెలుసు. రాష్ట్రమంతా తెలియదు కాబట్టి ఎల్లో మీడియాలో ఇక్కడ అంతా సవ్యంగా జరిగినట్లు వార్తలు రాయించేసుకుంటున్నారు. మీ పత్రిక, చానల్ ఎంత అనైతికంగా ఇలాంటి వార్తలు రాస్తుందో మీరే ఒక సారి ఆత్మవిమర్శ చేసుకోండి. నిజమైన పోటీ జరిగి ఐదు ఓట్లతోనైనా టీడీపీ గెలిస్తే వారికి ఎనలేని తృప్తి ఉండేది.. మాకు బాధ ఉండేది. కానీ, ఈ విధంగా పోలీసుల సంపూర్ణ సహకారంతో వేలాది మంది టీడీపీ కార్యకర్తలను బూత్‌ల ఎదురుగా పెట్టి నిజమైన ఓటరు స్లిప్పులు లాక్కున్నారు.నిజమైన ఓటర్లు ఉన్నారా?నిజమైన ఓటరును అసలు పోలింగ్ బూత్‌లోకే పోనివ్వలేదు. దీన్ని ఎలక్షన్ అంటారా?.. ఇంకేమైనా అంటారా?. మీరు గెలిచామని మీరు అనుకోవాల్సిందే తప్ప ప్రజలు అనుకునే అవకాశమే లేదు. ప్రజలు ఓట్లు వేస్తే కదా.. మీరు గెలిచాం అని చెప్పుకోడానికి?. మీ దొంగ ఓటర్లు కూడా మీరు గెలిచారు అని అనుకోరు.. ఎందుకంటే జరిగిందతా వారికి తెలుసు కాబట్టి. వారితో ఓట్లు వేయించలేదు కాబట్టి పులివెందుల మండల ఓటర్లు మీరు గెలిచారని అసలే అనుకోరు. ప్రతిపక్ష పార్టీ ఏజెంట్లను, ఓటర్లను బూత్‌లోకి రానివ్వకుండా చేసుకున్న పోలింగ్‌ను ఎలక్షన్ అంటారా?. వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఎవ్వరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. వీరికి గుణపాఠం చెప్పే రోజు వస్తుంది.. అప్పుడు ఇలా దొంగ ఓట్లతో కాదు.. మనం ఎప్పుడు చేసే విధంగా నిజమైన ఓటింగ్‌తోనే వీళ్లకు గుణపాఠం చెబుదాం’ అని వ్యాఖ్యలు చేశారు. -
పులివెందులలో.. ఆ 10 మంది టీడీపీ వాళ్లే!
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ప్రజలు ముక్కున వేలేసుకునేలా పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికలు జరగబోతున్నాయంటూ హోంమంత్రి వంగలపూడి అనిత చేసిన వ్యాఖ్యలు.. పోలింగ్ వేళ అక్షరాలా నిజమనిపిస్తున్నాయి. నామినేషన్లు వేయకుండా ప్రత్యర్థులపై దాడులు చేయడం మొదలు.. ప్రచారాలను అడ్డుకోవడం.. దాడులు చేయడం, పోలింగ్ బూత్‌లను మార్పించడం, పోలీసుల సాయంతో అక్రమ కేసులు.. నిర్బంధాలు, చివరకు ఇవాళ పోలింగ్ వేళ ఓటర్లను భయపెట్టడం.. తద్వారా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం టీడీపీకి షరా మామూలే అనే విషయాన్ని స్పష్టం చేశాయి.పులివెందులతో పాటు ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ వేళ టీడీపీ అరాచకాలు తారాస్థాయిలో కొనసాగుతున్నాయి. పోలింగ్ బూత్‌లను ఆక్రమించిన టీడీపీ నేతలు, కొన్నిచోట్ల ఓటర్లను అడ్డుకుంటున్నారు. మరికొన్ని చోట్ల ఓటర్లను వెనక్కి పంపేసి మరీ ఓట్లు వేసుకుంటున్నారు. టీడీపీ మూకలు రిగ్గింగ్ చేస్తున్నా.. ఎన్నికల అధికారులు, పోలీసులు కళ్లకు గంతలు కట్టుకున్న చందాన ఉండిపోయారు. ఈ అరాచకాలను కప్పి పుచ్చేందుకు ఎల్లో మీడియా తీవ్రంగానే ప్రయత్నిస్తోంది.పులివెందుల, ఒంటిమిట్టలో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయంటూ ఈ ఉదయం నుంచి కథనాలతో ఊదరగొడుతోంది. ఈ క్రమంలో పోలింగ్ బూత్‌ల వద్దకు కేవలం కూటమి పార్టీల అనుకూల మీడియాలను(ఆఖరికి చిన్నాచితకా యూట్యూబ్ ఛానెల్స్‌ను సైతం) పోలీసులు అనుమతిసున్నారు. అలాగే.. ఎలక్షన్ ప్రశాంతంగా జరుగుతోందంటూ కవరేజ్‌తోనూ భలే కవరింగ్ చేస్తున్నారు. ఓ పది మంది టీడీపీ అనుకూల వ్యక్తులను క్యూ లైన్లో నిలబెట్టి వీడియోలు తీసి బయటకు వదులుతున్నారు. తద్వారా.. ఎన్నికలు ప్రజాస్వామ్య పద్దతులో, ఎంతో సక్రమంగా జరుగుతోందంటూ ఎల్లో మీడియా ద్వారానే ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కంటెంట్‌నే అటు టీడీపీ అండ్ కో సోషల్ మీడియాలోనూ ప్రమోట్ చేసుకుంటోంది. మరోవైపు.. పోలీసుల సాయంతోనే టీడీపీ పలుచోట్ల రిగ్గింగ్‌కు పాల్పడుతోంది. తమకు కావాల్సిన ఓట్లన్నీ టీడీపీ గుద్దించుకున్నాక.. ఆపై ఊళ్లలోకి వచ్చి ఓటేయడానికి రావాలంటూ అభ్యర్థులను, కొందరు ఓటర్లను పోలీసులు బతిమాలుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీంతో ఆగ్రహిస్తున్న ఓటర్ల నుంచి పోలీసులు చీత్కారాలు ఎదుర్కొంటున్నారు. ఇంకోపక్క.. పులివెందుల, ఒంటిమిట్టలోని పలు గ్రామాలకు చెక్ పోస్టులు వెలిశాయి. వాటి గుండా ఓటర్లతో పాటు వైఎస్సార్సీపీ శ్రేణులకు ఎంట్రీ ఇవ్వడం లేదు పోలీసులు. కేవలం టీడీపీ నేతల కార్లు కనిపిస్తే చాలూ రైట్ రైట్ చెబుతున్నారు. -
నన్ను కొట్టింది మా అన్నే.. ఎల్లో మీడియా పిచ్చి రాతలు నమ్మొద్దు.. పవన్ సంచలన వీడియో
-
బిల్డప్ బాబు కొత్త బొంకులు.. పచ్చ మీడియాపై సెటైర్లు!
‘చంద్రబాబు.. మీ మోసం మరోసారి రుజువైంది’ అంటున్నారు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్. ఎన్నికల సందర్భంగా ప్రతి రైతుకూ ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి తమ ‘సూపర్ సిక్స్’ హామీల్లో ప్రకటిస్తే.. పద్నాలుగు నెలలు అధికారంలో ఉన్న తరువాత ఇప్పుడు కేవలం ఐదు వేల చొప్పున పంపిణీ చేయడంపై జగన్ ఈ వ్యాఖ్య చేశారు.పైగా.. ‘అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం’ అన్న చంద్రబాబు వ్యాఖ్యలనూ తప్పుపట్టారు. మాటిచ్చి తప్పడం చంద్రబాబుకు ఇదేమీ కొత్త కాదు. గతాన్ని చూస్తే ఇలాంటి సంఘటనలు బోలెడు కనిపిస్తాయి. కానీ, బాబు తప్పిదాలను కప్పిపుచ్చేందుకు ఎప్పటికప్పుడు కలరింగ్ ఇస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా చంద్రబాబు తన మాట నిలబెట్టుకున్నాడూ అనే అభిప్రాయం కలిగించేలా చేసేందుకు ఆయన వ్యాఖ్యలను హైలైట్ చేస్తున్నారు. అయితే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నదెవరూ? ఎప్పటికప్పుడు కొత్త కొత్త సాకులు, బొంకులతో మాట తప్పింది ఎవరన్నది రైతులకు తెలియదా?.జగన్ ప్రభుత్వం ఏటా రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.13,500 క్రమం తప్పకుండా చెల్లించిన విషయం ఇక్కడ చెప్పుకోవాల్సి ఉంటుంది. చెప్పినదాని కంటే ఒక ఏడాది ఎక్కువగానే ఇచ్చింది కూడా. అయినా ఆ రోజుల్లో ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు విమర్శలు కురిపించేవారు. కేంద్రమిస్తున్న నిధులను కూడా తన పథకంలోకి కలిపి ఎలా ఇస్తారని ప్రశ్నించే వారు. తాము అధికారంలోకి వస్తే రైతులకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. కేంద్రం ఇచ్చే సాయంతో దీనికి సంబంధం లేదన్నట్లే చెప్పారు. 2014లో రూ.89వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి రూ.15 వేల కోట్లతో సరిపెట్టిన విషయంపై రైతుల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ ఈసారి మాట తప్పరేమో అనుకుని ఉండవచ్చు. కానీ ఆయన తీరేమీ మారలేదు. తొలి ఏడాది పెట్టుబడి సాయం మొత్తం ఇవ్వలేదు. రెండో ఏడు కూడా ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేక.. ఈ విషయాన్ని తరచూ ప్రస్తావిస్తున్న ప్రతిపక్ష నేతకు అడ్వాంటేజ్ వస్తుందేమో అన్న బెంగతో అరకొర అమలుకు సిద్ధమయ్యారు. ఇదే పూర్తి సాయం అన్న బిల్డప్‌కు తెరలేపారు.‘తల్లికి వందనం’ తీరులోనే ‘అన్నదాత సుఖీభవ’ లోనూ ఏడు లక్షల మందిని తగ్గించారని లెక్కలు చెబుతున్నాయి. అంతేకాక ఇరవై వేల బదులు రూ.14 వేలే ఇస్తామని ప్రకటించారు. ఆరు వేల చొప్పున కోత పెట్టారన్నమాట. దీన్ని మాట నిలబెట్టుకోవడం అంటారా? కాకపోతే చంద్రబాబు ఏ అసత్యాన్ని అయినా అలవోకగా చెప్పగల నేర్పరి. కూటమి ఎన్నికల ప్రణాళికనూ, ప్రభుత్వం అమలు చేసిన వాటిని పోల్చి చూస్తే ఈ విషయం తేలికగా తెలిసిపోతుంది. తల్లికి వందనం స్కీమ్ తర్వాత అన్నీ అమలు చేసేశామని, ఇంకెవరైనా అమలు కాలేదంటే నాలుక.. అంటూ వెంటనే సర్దుకుని మందం అనుకోవాలని వ్యాఖ్యానించారు. ఇప్పుడు అన్నదాత సుఖీభవ అమలలో కోత పెట్టినా, ఒక ఏడాది ఎగ్గొట్టినా, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం అని చంద్రబాబు చెప్పగలిగారు. నిజాయితీగా వ్యవహరించి ఉంటే.. ఇంత ఇవ్వాలని అనుకున్నాం.. కానీ అలా చేయలేకపోతున్నాం.. మన్నించాలని అడుగుతారు. అలా మాట్లాడకపోతే మానే.. అంతా చేసేసినట్లు మభ్య పెట్టాలని అనుకోవడమే చంద్రబాబు స్పీచ్ హైలైట్. దీనిని దృష్టిలో ఉంచుకునే జగన్ తన ప్రకటనలో చంద్రబాబు మోసం మరోసారి నిజమైందని అన్నారు.ఒక్కో రైతుకు ఇప్పటికి రూ.40 వేల చొప్పున ఇవ్వాల్సి ఉంటే ఇచ్చింది కేవలం ఐదు వేలే అని వ్యాఖ్యానించారు. వచ్చే రోజుల్లో మిగిలిన తొమ్మిది వేలు ఇచ్చినా రూ.26 వేల వరకు రైతులకు బాకీ పడినట్లే అవుతుంది కదా!. ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ కార్యక్రమంలో కొన్ని వింతలు కూడా చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం నిర్వహించిన సభలో నులక మంచాలు వాడారట. వాటిపై చంద్రబాబు కూర్చున్నారట. ప్రజలూ అలాగే చేశారట. ఇది సింప్లిసిటీ అనుకోవాలన్నది వారి లక్ష్యం కావచ్చు. కాని కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని నులక మంచాల దశకు తీసుకువెళ్లిందన్న విమర్శలకు ఆస్కారం ఇచ్చారని కూడా భావించవచ్చు. నిత్యం హెలికాప్టర్లో చిన్న, చితక కార్యక్రమాలకు కూడా కోట్లు ఖర్చు చేస్తూ అటెండ్ అవుతుండే చంద్రబాబు నులక మంచంపై కూర్చుంటే రైతులకు ఒరిగేది ఏం ఉంటుంది. వారికి ఇవ్వవలసిన గత ఏడాది బకాయి రూ.20 వేలు ఇచ్చి ఉంటే రైతులు కూడా శభాష్ అని ఉందురు కదా!.మరో సన్నివేశం ఏమిటంటే చంద్రబాబు హెలికాఫ్టర్ దిగి ఆటోలో ప్రయాణించడం. దీని కోసం ప్రత్యేక ఏర్పాట్లు, ఆటో డ్రైవర్‌తో ఐటీ గురించి కూడా మాట్లాడించడం, కెమెరాల కోసం చేతులు ఊపుతూ వెళ్లడం అంతా తమాషాగా ఉంది. సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవో అయ్యారంటే అది మనం చూపిన చొరవ అని అనడంలో కొందరైనా నమ్మకపోతారా అన్న భావన ఉండవచ్చు. కానీ, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అలా మాట్లాడితే నవ్వుల పాలు అవుతామన్న సంగతిని విస్మరిస్తున్నారు. చంద్రబాబు ఈ మధ్య ఎక్కడికి వెళ్లినా బడ్డి కొట్టు వద్దకో, సెలూన్ షాప్ వద్దకో వెళ్లి సామాన్యులను పలకరిస్తున్నారు. అది తప్పు కాదు. కానీ, ముందస్తు ఏర్పాట్లు చేసుకుని వెళ్లడం వల్ల అదంతా షోగా మారుతోందే తప్ప, వాస్తవ పరిస్థితి తెలుసుకునే ఆలోచన ఉన్నట్లు అనిపించదు.టీడీపీ మీడియా ఆహో, ఓహో అని భజన చేయవచ్చు. నిప్పులు చెరుగుతున్న ఎండలో చంద్రబాబు కూర్చున్నారని, భారీ వేదికలు లేవని, షామియానాలు లేవని గొప్ప విషయంగా ప్రచారం చేశారు. నిజమే.. ఇకపై అన్ని కార్యక్రమాలు ఇలాగే ప్రభుత్వానికి ఖర్చు లేకుండా చేస్తారని కూడా ఈ మీడియా గ్యారంటీ ఇచ్చి ఉండాల్సింది. పెంచిన వెయ్యి ఫించన్ ఇవ్వడం కోసం లక్షల రూపాయల వ్యయం చేస్తూ చంద్రబాబు చేస్తున్న ప్రచారార్భాటాన్ని కూడా టీడీపీ మీడియా ఆపగలిగితే మెచ్చుకోవచ్చు. ఇక యథా ప్రకారం వైఎస్సార్సీపీపై బురద చల్లుడు కూడా చంద్రబాబు సాగించారు. మహిళలపై వైఎస్సార్సీపీ వారు దౌర్జన్యాలు చేశారని, పార్టీ కార్యకర్త కాన్వాయ్ కింద పడితే పొదల్లో పడేశారనో, ఇంకా ఏవేవో వ్యాఖ్యలు చేసి చంద్రబాబు తన స్థాయిని తగ్గించుకుంటున్నారు.టీడీపీ వారికి మాత్రమే ముఖ్యమంత్రి అన్నట్లు వ్యవహరించడం పద్దతి అనిపించదు. వైఎస్సార్సీపీ మహిళా నేతలపై కొందరు టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు చేస్తున్న అరాచక వ్యాఖ్యలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, వైఎస్సార్సీపీ నేతల ఇళ్లపై దాడులు చేస్తున్నవారిపై కనీసం కేసులు పెట్టకుండా ఉంటున్న ఈ ప్రభుత్వాన్ని ప్రజా ప్రభుత్వం అనాలా? లేక కొందరి కోసమే పని చేసే ప్రభుత్వం అనుకోవాలా?. -కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
సూత్రధారి చంద్రబాబే
సాక్షి, అమరావతి : ‘అవసరాల కోసం అడ్డదారులు తొక్కే పాత్రలే అన్నీ’ అని ప్రస్థానం సినిమాలో సాయి కుమార్ పాపులర్ డైలాగ్ ఉంటుంది.. ‘స్వార్థం అన్నది నిజం.. నిస్వార్థం దాని కవచం’ అని కూడా చెబుతాడు. ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబు రెడ్‌బుక్ అక్రమ కేసు నాటకం అంతకు మించిన కుట్ర స్క్రిప్ట్‌తో సాగుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో లేని కుంభకోణాన్ని ఉన్నట్టుగా చూపించేందుకు వివిధ పాత్రలు హఠాత్తుగా తెరపైకి వస్తున్నాయి. అన్నీనూ చంద్రబాబు తన అవసరాల కోసం ప్రవేశ పెడుతున్న పాత్రలే. హఠాత్తుగా నోట్ల కట్టలు ప్రత్యక్షం అవుతున్నాయి.. ఆడియోలు, వీడియోలు ఎల్లో మీడియాలో వైరల్ అవుతున్నాయి.. కానీ న్యాయస్థానం క్రియాశీలత, అదే ఆడియో వీడియో ఆధారాలతో ఆ కుట్రలు బెడిసి కొడుతున్నాయి. ఈ రెడ్‌బుక్ కుట్ర నాటకంలో విలన్ మాత్రం కచ్చితంగా చంద్రబాబేనన్నది అంతిమంగా నిగ్గు తేలుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పారదర్శకంగా నిర్వహించిన మద్యం విధానంపై చంద్రబాబు ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసు వేధింపులు బెడిసి కొడుతున్నాయి. దాదాపు ఏడాదిగా సీఐడీ, సిట్లు దర్యాప్తు ముసుగులో వేధింపులకు పాల్పడుతున్నా, ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు. దాంతో న్యాయస్థానాలు సంధించే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక సిట్ చేతులెత్తేస్తోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు తన కుట్రలకు మరింత పదును పెడుతున్నారు. లేని కుంభకోణాన్ని ఉన్నట్టుగా చూపించేందుకు తన రెడ్‌బుక్ కుట్ర నాటకంలో కొత్త పాత్రధారులను పక్కా పన్నాగంతో ప్రవేశ పెడుతున్నారు. టీడీపీ మూలాలు ఉన్న వారు, సీనియర్ టీడీపీ నేతల కుటుంబ సభ్యులు, తమ ప్రభుత్వ హయాంలో ఆర్థికంగా లబ్ధి పొందిన వారిని ఏరికోరి తెరపైకి తెస్తున్నారు. వారందరినీ వైఎస్సార్సీపీ నేతలకు సన్నిహితులుగా ముద్ర వేస్తూ.. టీడీపీ అనుకూల మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తున్నారు. అందుకోసం టీడీపీ వీర విధేయ సిట్ అధికారులే స్వయంగా నోట్ల కట్టల జప్తు డ్రామాకు పాల్పడుతున్నారు. తద్వారా పాత్రధారులు టీడీపీ వర్గీయులే.. నోట్ల కట్టలు టీడీపీ వర్గీయులవే.. సిట్ అధికారులూ టీడీపీ వీర విధేయులే.. సూత్రధారి చంద్రబాబేనని స్పష్టమవుతోంది. అయితే ఇంత చేసినా, టీడీపీ కూటమి ప్రభుత్వ తాజా కుట్రలు కూడా బెడిసికొట్టాయి. సిట్ తాజాగా తెరపైకి తెచ్చిన వారందరూ చంద్రబాబు, లోకేశ్‌లతోపాటు టీడీపీ సీనియర్ నేతలకు అత్యంత సన్నిహితులన్నది ఫొటో, వీడియో ఆధారాలతో సహా బట్టబయలైన వైనం ఇలా ఉంది. టీడీపీ కేంద్రమంత్రులు, ఎంపీలు కూడా దగ్గరివారే.. టీడీపీకి చెందిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, విశాఖ, ఏలూరు ఎంపీలు భరత్, పుట్టా మహేష్‌తో వెంకటేశ్ నాయుడు (ఫైల్) టీడీపీ నేత తీగల కృష్ణారెడ్డి సోదరుని కుమారుడే తీగల విజయేందర్‌రెడ్డి ⇒ మద్యం విధానంపై అక్రమ కేసులో ఏడాదిగా ఎలాంటి ఆధారాలు సేకరించని సీఐడీ, సిట్.. వారం రోజుల క్రితం ఒక్కసారిగా హడావుడి చేశాయి. హైదరాబాద్ శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో రూ.11 కోట్లు జప్తు చేసినట్టు కనికట్టు చేసింది. ఈ కేసులో సిట్ అక్రమంగా అరెస్టు చేసిన రాజ్ కేసిరెడ్డి వర్దమాన్ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన ఆ ఫామ్‌హౌస్‌లో 2024 జూన్‌లో ఆ నగదును దాచిపెట్టినట్టు చెప్పుకొచ్చింది. సిట్ అధికారులే ఆ రూ.11 కోట్లు తెప్పించి ఈ జప్తు కట్టుకథ వినిపించారు. ⇒ ఈ హైడ్రామాకు సిట్‌కు పూర్తిగా సహకరించింది వర్దమాన్ ఇంజినీరింగ్ కాలేజి యజమాని తీగల విజయేందర్ రెడ్డి. తమ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన రూ.11 కోట్లను అట్ట పెట్టెల్లో అదే కాలేజీకి ఎదురుగా ఉన్న తమ ఫామ్‌హౌస్‌లో పెట్టించారు. అనంతరం ఆ నగదునే సిట్ జప్తు చేసినట్టు కథ నడిపించారు. ఇంతగా విజయేందర్ రెడ్డి ఈ కుట్రలో చంద్రబాబు ప్రభుత్వానికి ఎందుకు సహకరించారని సందేహం రావచ్చు. ఎందుకంటే ఈయన చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, టీడీపీ తరఫున హైదరాబాద్ మేయర్‌గా, ఎమ్మెల్యేగా చేసిన తీగల కృష్ణా రెడ్డి సోదరుని కుమారుడు. ⇒ తీగల విజయేందర్ రెడ్డికి చంద్రబాబు, లోకేశ్‌లతోపాటు టీడీపీ సీనియర్ నేతలతో, టీడీపీ అనుకూల మీడియా అధిపతులతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. ఈ రెడ్‌బుక్ కుట్ర కేసు వీగిపోతోందన్న ప్రమాద ఘంటికలు మోగగానే చంద్రబాబు పక్కా పన్నాగంతో విజయేందర్ రెడ్డిని తెరపైకి తీసుకువచ్చారు. ఆయన సహకారంతోనే రూ.11 కోట్ల నగదు జప్తు డ్రామాకు సిట్ పాల్పడింది. ⇒ కాగా, ఆ నగదును ఆర్బీఐతో తనిఖీ చేయించాలని రాజ్ కేసిరెడ్డి న్యాయస్థానంలో పిటిషన్ వేయడంతో చంద్రబాబు నోట్లో పచ్చి వెలక్కాయ పడింది. ఎందుకంటే ఆర్బీఐ అధికారులు వచ్చి తనిఖీ చేస్తే.. ఆ నోట్ల కట్టల మీద ఉన్న బ్యాచ్ నంబర్లు, సీరియల్ నంబర్లు ఏమిటన్నది వెల్లడవుతుంది. ఆ నోట్లను ఆర్బీఐ ఎప్పుడు ముద్రించింది.. వాటిని ఎవరు, ఎప్పుడు డ్రా చేశారు.. ఏ బ్యాంకు ఖాతాల నుంచి డ్రా చేశారన్న వివరాలు వెలుగులోకి వస్తాయి. ⇒ 2024 జూన్ తర్వాత ఆ నోట్ల కట్టలు అన్నీ గానీ, వాటిలో కొన్నిగానీ ముద్రించినట్టు వెల్లడైతే.. సిట్ చెప్పింది అంతా కట్టుకథేనని తేలి పోతుంది. ఆ నోట్లను 2024 జూన్ తర్వాత ఏదైనా బ్యాంకు నుంచి డ్రా చేశారని నిగ్గు తేలితే.. ఆ బ్యాంకు ఖాతాదారుడు ఎవరన్నది వెలుగులోకి వస్తుంది. దాంతో ఈ జప్తు కట్టుకథ వెనుక ఉన్న టీడీపీ పెద్దల పాత్ర బట్టబయలవుతుంది.⇒ అందుకే ఆ నోట్ల కట్టలను న్యాయస్థానం అనుమతి లేకుండానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో డిపాజిట్ చేసేయాలని సిట్ అధికారులు యత్నించారు. కాగా రాజ్ కేసిరెడ్డి పిటిషన్‌పై సత్వరం న్యాయస్థానం స్పందించడంతో సిట్ కుట్ర విఫలమైంది. ఆ నోట్ల కట్టలను విడిగా భద్రపరచాలని.. బ్యాచ్ నంబర్లు, సీరియల్ నంబర్లతో సహా పంచనామా నిర్వహించాలని.. మొత్తం ప్రక్రియను వీడియో తీయాలని న్యాయస్థానం ఆదేశించింది. దాంతో రూ.11 కోట్ల జప్తు హైడ్రామాతో కనికట్టు చేయాలన్న చంద్రబాబు కుట్ర పూర్తిగా బెడిసి కొట్టింది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో వెంకటేశ్ నాయుడు (ఫైల్) లోకేశ్ బినామీ ఎంపీ కేశినేని చిన్ని వ్యాపార భాగస్వామే రాజ్ కేసిరెడ్డి⇒ లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించే ఈ భేతాళ కుట్ర కథకు చంద్రబాబు పక్కాగా స్క్రిప్ట్ రచించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా కేవలం రెండేళ్లపాటు చేసిన రాజ్ కేసిరెడ్డికి ముడి పెడుతూ ఈ అక్రమ కేసు నమోదు చేశారు. తాము చెప్పమన్నట్టు అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని రాజ్ కేసిరెడ్డిని వేధించారు. అందుకు ఆయన తిరస్కరించడంతోనే నిందితుడిగా పేర్కొంటూ అరెస్టు చేశారు. విచారణలో రాజ్ కేసిరెడ్డి చెప్పని విషయాలు కూడా చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలంతో రిమాండ్ నివేదిక రూపొందించారు. కానీ ఆ వాంగ్మూల పత్రంపై సంతకం చేసేందుకు రాజ్ కేసిరెడ్డి తిరస్కరించారు. ఆ విషయాన్ని సిట్ న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ నివేదికే వెల్లడించింది. ⇒ అసలు రాజ్ కేసిరెడ్డిని ఈ కపట నాటకంలో ప్రధాన పాత్రధారిగా చేసుకోవాలని చంద్రబాబు ఎందుకు భావించారంటే.. రాజ్ కేసిరెడ్డి.. మంత్రి నారా లోకేశ్ బినామీగా ఉన్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) వ్యాపార భాగస్వామి కనుక. కేశినేని చిన్ని లోకేశ్ బినామీ అన్నది బహిరంగ రహస్యమే. ⇒ రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగానే అంటే 2021లోనే రాజ్ కేసిరెడ్డి ప్రస్తుత విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)తో భాగస్వామిగా వ్యాపారాలు నిర్వహించారు. రాజ్ కేసిరెడ్డికి చెందిన ‘ప్రైడే ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పీ’లో కేశినేని చిన్ని దంపతులు వాటాదారులుగా ఉన్నారు. అక్రమంగా నిధులు తరలించారని ప్రస్తుతం సిట్ అధికారులు చెబుతున్న ఇషన్వీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రైడే ఇన్ఫ్రా ఎల్ఎల్పీ హైదరాబాద్‌లోని ఒకే చిరునామా(జూబ్లీ హిల్స్, సర్వే నంబర్ 403, ప్లాట్ నంబర్ 9)తో రిజిస్టర్ అయ్యాయి. ⇒ ఈ రెండు కంపెనీలు ఒకే మెయిల్ ఐడీ ( accounts@wshanviinfraprojects. com)నే ఉపయోగిస్తుండటం గమనార్హం. కేశినేని చిన్ని ఏకంగా 12 రియల్ ఎస్టేట్, విదేశీ కంపెనీల ద్వారా భారీగా నల్లధనాన్ని అమెరికా, దుబాయ్‌లకు తరలించి భారీ పెట్టుబడులు పెట్టారు. లోకేశ్ తన బినామీ అయినందునే కేశినేని చిన్నికి విజయవాడ ఎంపీ టికెట్ ఇప్పించారు. అనంతరం ఆంధ్రా క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడిని చేశారు. ⇒ కేశినేని చిన్ని బినామీ కంపెనీ ఉర్సా ఐటీ సొల్యూషన్స్‌కు విశాఖపట్నంలో అత్యంత విలువైన 60 ఎకరాలను కారుచౌకగా కట్టబెట్టారు. కేశినేని చిన్ని ముసుగులో లోకేశ్ ఇలా దోపిడీకి పాల్పడుతున్నారు. అటువంటి కేశినేని చిన్నితో రాజ్‌కేసిరెడ్డి వ్యాపార భాగస్వామి. అంటే బినామీ దందా ముసుగు తొలగిస్తే లోకేశ్, రాజ్ కేసిరెడ్డి వ్యాపార భాగస్వాములు అన్నది స్పష్టమవుతోంది. పారని బాబు తాజా పాచిక⇒ అయినా సరే పట్టు వదలని చంద్రబాబు ఎల్లో మీడియా ద్వారా మరో కట్టుకథను వ్యాప్తిలోకి తెచ్చారు. వెంకటేశ్ నాయుడు చార్టెడ్ విమానాల్లో ప్రయాణిస్తున్న ఫొటోలు, వీడియోలు, హీరోయిన్ తమన్నా పక్క సీట్లోనే కూర్చున్న ఫొటోలు ఎల్లో మీడియాకు విడుదల చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణానికి పాల్పడిన డబ్బుతోనే వెంకటేశ్ నాయుడు ఇంతటి జల్సాలు చేశారని.. విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లారని రకరకాల కట్టు కథలను టీడీపీ సోషల్ మీడియాతోపాటు టీడీపీ అనుకూల ఎల్లో మీడియా వినిపించింది. ⇒ కానీ ఈ కుట్ర పాచిక కూడా విఫలమైంది. ఎందుకంటే వెంకటేశ్ నాయుడు చంద్రబాబు, లోకేశ్‌లకు అత్యంత సన్నిహితుడన్నది ఫొటో ఆధారాలతోసహా బట్టబయలైంది. వారిద్దరికి ఆయన అత్యంత సన్నిహితుడనే నిజాన్ని ఆ ఫొటోలు బయటపెట్టాయి. టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, టీడీపీ తరఫున కేంద్ర మంత్రులుగా ఉన్న కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌లతోపాటు పలువురితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో మొత్తం కుట్ర డ్రామా బట్టబయలైంది. ⇒ వెంకటేశ్ నాయుడు ప్రయాణించిన చార్టెడ్ ఫ్లైట్ ఎవరిదో తెలుసా.. చంద్రబాబు బీజేపీలోకి పంపిన నేత, ప్రస్తుత ఎంపీ సీఎం రమేశ్ కంపెనీది. టీడీపీ నేతలతో కలిసే వెంకటేశ్నాయుడు ఆ ఫ్లైట్‌లో హైదరాబాద్ నుంచి చెన్నై, కోయంబత్తూరు తదితర నగరాలకు వెళ్లారు. హీరోయిన్ తమన్నా కూడా అదే ప్రత్యేక విమానంలో ప్రయాణించారు. కానీ టీడీపీ నేతలతో వెంకటేశ్ నాయుడు ఉన్న ఫొటోలు కాకుండా తమన్నా పక్క సీట్లో కూర్చున్న ఫొటోనే సిట్ విడుదల చేసి ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించింది. కానీ పూర్తి ఫొటోలు బయట పడటంతో సిట్ కుట్ర బెడిసి కొట్టింది.చంద్రబాబు, లోకేశ్‌ల సన్నిహితుడే వెంకటేశ్ నాయుడు⇒ ఫామ్‌హౌస్‌లో రూ.11 కోట్ల జప్తు హైడ్రామా విఫలమవడంతో చంద్రబాబు మరో దుష్ప్రచార కుతంత్రం రచించారు. ఈ కుట్ర కేసులో మరో పాత్రధారిగా వెంకటేశ్ నాయుడు వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు. ఆయన హైదరాబాద్‌లో రూ.5 కోట్ల నగదును పరిశీలిస్తున్న వీడియోలను టీడీపీ అనుకూల మీడియాకు లీక్ చేశారు. ఆ రూ.5 కోట్లు నగదు అంతా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం డబ్బులేనని... 2024 ఎన్నికల్లో వెచ్చించేందుకే హైదరాబాద్ నుంచి రాష్ట్రానికి తరలించేందుకు సిద్ధం చేసినవని ప్రజల్ని నమ్మించేందుకు యత్నించారు. ⇒ కాగా, ఆ రూ.5 కోట్లలో 2023 మే లోనే ఆర్బీఐ ఉపసంహరించిన రూ.2 వేల నోట్ల కట్టలు ఉండటాన్ని పరిశీలకులు ప్రధానంగా ప్రస్తావించారు. దీంతో ఆ వీడియో 2023 మే కంటే ముందు తీసిందేనని స్పష్టమైంది. తద్వారా 2024 ఎన్నికల్లో వెచ్చించేందుకు వైఎస్సార్సీపీ ఆ నోట్లను తరలించడం అంతా కనికట్టేనని తేటతెల్లమైంది. మరోవైపు వెంకటేశ్ నాయుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఆయన వ్యాపార వ్యవహారాలకు చెందిన నగదును వైఎస్సార్సీపీకి ఆపాదిస్తూ చంద్రబాబు ప్రభుత్వం దుష్ప్రచారానికి పాల్పడిందన్నది బట్టబయలైంది. -
Big Question: వణుకు పుట్టించిన జనసునామి.. రంగంలోకి గోతికాడ నేతలు
-
ఈ కంపెనీకి 10కోట్లు ఎందుకు కొట్టారు..సైదాపూర్ లో చక్కర్లు కొడుతుంది
-
‘లిక్కర్ కేసులో ఈనాడు అసత్య ప్రచారం బట్టబయలు’
సాక్షి, తాడేపల్లి: అసలు లేని, జరగని లిక్కర్ స్కామ్‌పై రోజుకో కథనాన్ని వండి వారుస్తున్న ఈనాడు.. వైఎస్సార్సీపీని అప్రతిష్టపాల్జేయడానికి అత్యంత హేయంగా వ్యవహరించిందని పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి మండిపడ్డారు.ఏపీ బీసీఎల్ (రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్) సర్వర్లు, డేటా సిస్టమ్స్ నుంచి వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో, 2019–24 మధ్య లిక్కర్ కుంభకోణానికి సంబంధించి 3.58 లక్షల జీబీ డేటాను డిలీట్ చేశారంటూ ఈనాడు తప్పుడు కథనాన్ని ప్రచురించిందని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన తెలిపారు. ప్రెస్మీట్లో ఎం.మనోహర్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..ఏపీ బీసీఎల్ ఏం చెప్పిందంటే..:రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ (ఏపీ బీసీఎల్) సర్వర్లు, డేటా సిస్టమ్స్ నుంచి 371 కోట్ల పేజీలకు సంబంధించిన 3.58 లక్షల జీబీ డేటా డిలీట్ చేశారంటూ, ఈనాడు రాసిన వార్త నిజమేనా అని సమాచార హక్కు (ఆర్టీఐ) కార్యకర్త ప్రశాంత్ రెడ్డి అడిగిన ప్రశ్నపై ఆ సంస్థ సమాధానం చెప్పింది. గత ప్రభుత్వ హయాంలో తమ వద్ద ఎలాంటి డేటా డిలీట్ కాలేదని, అసలు అలాంటిదేమీ జరగలేదని ఏపీ బీసీఎల్ వెల్లడించింది.వాస్తవం ఇలా ఉంటే.. ‘వేల కోట్లు దోచేసి ఆధారాలు చెరిపేసి’ అంటూ ఈనాడు నిస్సిగ్గుగా కథనాన్ని వండి వార్చింది. దాని ఆధారంగా ఈటీవీలో కూడా ఏకంగా 8 నిమిషాల కథనాన్ని ప్రసారం చేశారు. అంటే, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురద చల్లడం, వైఎస్సార్సీపీని అప్రతిష్టపాల్జేయడమే లక్ష్యంగా ఈనాడు ఏ స్థాయికి దిగజారి వ్యవహరిస్తోంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.వైఎస్సార్సీపీకి క్షమాపణ చెప్పాలి:ఒక నీచమైన దుర్భుద్ధి, కుట్ర, కుతంత్రంతో వ్యవహరిస్తూ, వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నిత్యం బురద చల్లడమే లక్ష్యంగా పని చేస్తున్న ఈనాడు యాజమాన్యం ఇకనైనా బుద్ధి తెచ్చుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెంటనే క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో ఈనాడు చేస్తున్న దుష్ప్రచారం, ఆ పత్రిక చేస్తున్న కుట్ర, కుతంత్రాలపై పూర్తి సమాచారం, వివరాలతో ప్రెస్ కౌన్సిల్లో ఫిర్యాదు చేస్తాం. ఏ మాత్రం విచక్షణ ఉన్నా.. ఇప్పటికైనా ఈనాడు, ఈటీవీ యాజమాన్యం చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, జర్నలిస్టు విలువలను పాటించి ప్రజలకు వాస్తవాలు చెప్పాలి.అంతా ఒక వ్యూహం:‘సిట్’ దర్యాప్తు తీరు, ఛార్జ్‌షీట్‌లో ప్రస్తావించిన అంశాలు చూస్తే.. ఎల్లో మీడియాలో గాలి వార్తలన్నీ పోగేసి రాస్తున్న కథనాలను ప్రతిబింబిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అంతులేని ప్రజాభిమానం కలిగిన జగన్‌ని రాజకీయంగా ఎదుర్కోలేక, ఆయనను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలన్న దురుద్దేశంతో, తనకు సన్నిహితంగా ఉండి పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న నాయకులు, వ్యక్తుల మీద తప్పుడు కథనాలు రాసి వారి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు.ఇక ప్రభుత్వం తాము టార్గెట్‌గా పెట్టుకున్న వారిని అరెస్టు చేసేందుకు.. తొలుత వారిపై తమ అనుకూల ఎల్లో మీడియాలో కథనాలు రాయించడం, ఆ తర్వాత ఎవరితోనో ఫిర్యాదు చేయించడం, వాటి ఆధారంగా కొందరిని అదుపులోకి తీసుకుని వేధించి, భయపెట్టి తమ టార్గెట్ లిస్ట్‌లో ఉన్న వారి పేర్లు చెప్పించి, స్టేట్మెంట్ రికార్డు చేయడం, దాని తర్వాత తప్పుడు కేసు పెట్టి, అక్రమ అరెస్టు చేయడం ఒక పద్ధతి ప్రకారం జరుగుతోంది. ఆ ప్రక్రియలో భాగంగానే.. ఈ కేసులు, అరెస్టుల పర్వం కొనసాగుతోందని వైఎస్సార్సీపీ లీగల్‌సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి వివరించారు. -
టీవీ-5 తప్పుడు ఛానల్: నారాయణ స్వామి
సాక్షి, చిత్తూరు: ఎల్లో మీడియాపై మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మండిపడ్డారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీవీ-5 తప్పుడు ఛానల్ అని.. అందుకే వైఎస్సార్సీపీ నిషేధించిందన్నారు. టీడీపీ ప్రయోజనాలు తప్ప, ప్రజల ప్రయోజనాలు పట్టని ఛానల్ అది అంటూ దుయ్యబట్టారు.ఇవాళ మా ఇంటికి టీవీ-5 రిపోర్టర్ వచ్చారు. ఇంటికి వచ్చాడు కదా అని గౌరవించి కూర్చోబెట్టాను. అక్రమ లిక్కర్ కేసు గురించి అడిగితే కొన్ని విషయాలు మాట్లాడాను. కాని, నేను చెప్పని మాటలను చెప్పినట్టుగా ఆ ఛానల్ బ్రేకింగ్స్ వేసి నడిపించింది. నేను వెంటనే ఆ రిపోర్టర్‌కు ఫోన్ చేసి ఇది సరికాదని, అనని మాటలు అన్నట్టుగా చూపించడం భావ్యం కాదని వారిని హెచ్చరించాను. సరిచేయమని కోరాను...ఇప్పటివరకూ వారు స్పందించలేదు. సీనియర్ దళిత నాయకుడి మీద కనీస మర్యాదను పాటించకుండా, నా ప్రతిష్టకు భంగం కలిగించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాను. దీనిపై న్యాయ ప్రకారం ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నాను’’ అని నారాయణ స్వామి తెలిపారు. -
Dhanunjaya Reddy: జైలులో మా ఫోటోలు తీసి ఎల్లో మీడియాకు ఇస్తున్నారు
-
కోర్టు కంటే ముందే ఎల్లో మీడియాకు చార్జ్‌షీట్!
రెడ్‌బుక్ కుట్రల కోసం చంద్రబాబు ప్రభుత్వం, సిట్ అధికారులు ఏకంగా న్యాయ వ్యవస్థకే అగౌరవం కలిగిస్తుండడం విస్మయపరుస్తోంది. న్యాయస్థానం కంటే ముందుగా అక్రమ కేసులో చార్జ్‌షీట్ వివరాలను ఈనాడు–ఈటీవీ, ఆంధ్రజ్యోతి–ఏబీఎన్, టీవీ5, మహాన్యూస్ చానళ్లకు సిట్ అధికారులు తెలియజేయడమే దీనికి నిదర్శనం. అక్రమ కేసులో ప్రాథమిక చార్జ్‌షీట్‌ను సిట్ అధికారులు న్యాయస్థానంలో శనివారం రాత్రి సమర్పించారు. శనివారం(జులై 20) ఉదయం మార్కెట్లోకి వచ్చిన ఈనాడు పత్రికలో ఆ చార్జ్‌షీట్ వివరాలు ప్రచురితం కావడం గమనార్హం. రాజ్యాంగ నిబంధనల ప్రకారం కోర్టులో సమర్పించే వరకు చార్జ్‌షీట్‌లో ఉన్న వివరాలు ఎవరికీ తెలియకూడదు. ఆ చార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నట్టు న్యాయస్థానం ప్రకటించాలి. అనంతరం కోర్టు ద్వారానే చార్జ్‌షీట్ కాపీని ఈ కేసుతో సంబంధం ఉన్నవారు తీసుకోవాలి. ఈ నిబంధనలను చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కోర్టు కంటే ముందుగానే ఈనాడు, ఇతర ఎల్లో మీడియాకు చార్జ్‌షీట్ వివరాలను వెల్లడించింది. ఎంత పక్కాగా అంటే చార్జ్‌షీట్ ఎన్నిపేజీలు ఉన్నాయి...? అందులోని వివరాలన్నీ యథాతథంగా ఎల్లో మీడియా ముందే ప్రచురించింది. టీడీపీ అనుకూల ఎల్లో మీడియా టీవీ చానళ్లు చార్జ్‌షీట్‌లోని వివరాలను శనివారం ఉదయం నుంచే ప్రసారం చేశాయి. అంటే.. చంద్రబాబు ప్రభుత్వం న్యాయవ్యవస్థ కంటే ఎల్లో మీడియాకే పెద్దపీట వేస్తోందనన్నది మరోసారి స్పష్టమైంది. -
TV5, మహా న్యూస్, ఈనాడు.. పాత్రికేయ ముసుగులో పచ్చ వ్యభిచారం
-
డిస్కంల రేటింగ్‌పై ఎల్లోమీడియా తప్పుడు కథనాలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్రభుత్వ విధానాలు.. అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సహకారంతో రాష్ట్ర విద్యుత్ సంస్థలు మెరుగైన పనితీరుతో జాతీయ స్థాయిలో అత్యున్నత అవార్డులను సాధించాయి. కానీ.. గత చంద్రబాబు ప్రభుత్వంలోనూ, ప్రస్తుత పాలనలోనూ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల పనితీరు దారుణంగా దిగజారింది. అయితే.. టీడీపీ కరపత్రం ఈనాడు మాత్రం ఈ విషయాన్ని తారుమారు చేసి జగన్ హయాంలో డిస్కంల పనితీరు బాగోలేదంటూ పచ్చి అబద్ధాలను సోమవారం అచ్చేసింది.డిస్కంల రేటింగ్ 12వ ఎడిషన్‌లో అగ్రిగేట్ టెక్నికల్, కమర్షియల్ లాసెస్ (ఏటీఅండ్‌సీ), బిల్లింగ్ సామర్థ్యం, బకాయిలలో మెరుగుదలను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు కేటాయించగా.. 2023–24 సంవత్సరానికి స్మార్ట్ మీటర్లు ఏర్పాటు ప్రాతిపదికన కేంద్రం డిస్కంలకు రేటింగ్ ఇచ్చింది. అది కూడా మూడు నెలల క్రితం అంటే ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రకటించింది. నిజానికి 2023–24 సంవత్సరంలో ఏపీలో ఎక్కడా గృహాలు, వాణిజ్య సరీ్వసులకు స్మార్ట్ మీటర్లను అమర్చలేదు. అందువల్ల ఆ అంశంలో మన డిస్కంలకు రేటింగ్ తగ్గింది. ఆ పాత సమాచారాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్సార్సీపీ పాలనలో డిస్కంలు వెనుకబడిపోయాయంటూ తాజాగా ఈనాడు పత్రిక కథనాన్ని వండివార్చింది.నిజానికి 2022–23 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీ ఈపీడీసీఎల్) ఏ గ్రేడ్‌తో రాష్ట్రంలోనే మొదటి వరుసలో నిలిచింది. 13వ ఎడిషన్‌లో కూడా ఈ డిస్కం తన గ్రేడ్‌ను పదిలంగానే ఉంచుకుంది. ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీ సీపీడీసీఎల్), ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీ ఎస్పీడీసీఎల్) ఆ ఏడాది బీ గ్రేడ్ దక్కించుకున్నాయి. 2021–22 రేటింగ్స్‌తో పోల్చితే ఏపీ డిస్కంలు పనితీరును మరింత మెరుగుపరుచుకుని ఒక గ్రేడ్ పైకి ఎగబాకాయి. ఈపీడీసీఎల్ బీ నుంచి ఏ తెచ్చుకోగా, సీపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్ సీ నుంచి బీ గ్రేడ్‌కు చేరుకున్నాయి. కానీ, ఈనాడు మాత్రం ఈ రెండు డిస్కంలు బీ గ్రేడ్‌లో ఉన్నట్టు రాసుకొచి్చంది. అప్పుడే వెలుగులు వివిధ వర్గాలకు అందించే ఉచిత, రాయితీ విద్యుత్‌కు సంబంధించి ఏటా రూ.10,361 కోట్లు సబ్సిడీగా నిర్ణయించగా.. గత ప్రభుత్వం రూ.13,852 కోట్లు విడుదల చేసేది. ఈ సబ్సిడీలకు సకాలంలో చెల్లించడంతో పాటు, అనుకున్న దానికంటే ఎక్కువ చెల్లిస్తూ డిస్కంలు నూటికి 134 శాతం మార్కులు సాధించేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం దోహదపడింది. అదేవిధంగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ), రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ (ఆర్ఈసీ) నుంచి తీసుకున్న అప్పులను సకాలంలో చెల్లించేందుకు సాయపడేది. బిల్లింగ్ సామర్ధ్యం, రెవెన్యూ కలెక్షన్లో 99 శాతం పనితీరుతో డిస్కంలు అద్భుతంగా పనిచేసేవి.గత ప్రభుత్వ హయాంలో రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ) ప్రకటించిన టాప్ 62 డిస్కంల జాబితాలో ఏపీ డిస్కంలు జాతీయ స్థాయిలో టాప్ 10లో నిలిచి ‘ఏ’ గ్రేడ్ సాధించాయి. దేశ సగటు విద్యుత్ సరఫరాను మించి రాష్ట్రంలో విద్యుత్‌ను అందించి ఈ ఘనత సాధించాయి. 2017–18లో డిస్కంల పంపిణీ నష్టాలు 6.70 శాతం ఉంటే అవి 2022–23లో అవి 5.31 శాతానికి తగ్గాయి. ఇలా జగన్ హయాంలో డిస్కంలు అభివృద్ధి పథంలో దూసుకెళ్లాయి. కానీ.. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ప్రజలపై విద్యుత్ చార్జీల భారాలు వేస్తూ, సకాలంలో విద్యుత్ సమస్యలు పరిష్కరించలేక, విద్యుత్ సరఫరా అందించలేక చతికిలపడుతున్నాయి. -
విద్యారంగంపై విషపు చూపు!
ఆయనో గాడిదను చూపెడతారు. దాన్ని గుర్రం అనాలంటారు. ఔనౌను అది గుర్రమేనని పెంపుడు మీడియా నమ్మ బలుకుతుంది. తామేది చెబితే జనం దాన్నే నమ్మాలనే నియ మావళిని ఆయన అమల్లోకి తెచ్చారు. అయ్యయ్యో, అది గుర్రం కాదు గాడిదని అమాయకంగా ఎవరైనా అరిస్తే వారి మీద పెంపుడు మీడియా దండుపాళ్యం బ్యాచ్ అనే ముద్రను వేస్తుంది. ఆ దండుపాళ్యం బ్యాచ్‌ను దండించడానికి ఖాకీ మూక కదులుతుంది. దేశంలో ఉన్న అత్యంత సీనియర్ రాజకీయ నాయకుల్లో ఆయనొకరు. ముఖ్యమంత్రి కుర్చీతో నాలుగు విడ తలుగా పదిహేనేళ్ల సావాసముంది. అయినా పచ్చి అబద్ధాలను పబ్లిగ్గా వల్లెవేయడానికి ఇప్పటికీ వెనకాడటం లేదు.ఎందుకంటే, ఆయనకది అచ్చొచ్చిన విద్య. ఆ విద్యతోనే రాజకీయంగా తనను తాను ప్రమోట్ చేసుకున్నారు. పెంపుడు మీడియా అండదండగా నిలబడింది. ఇతరులకు దక్కవలసిన ఘనతను లాఘవంగా లాగేసుకోవడంలో, ఇతరుల మెడలో వేయాల్సిన వీరతాళ్లను తన మెడలో వేసుకోవడంలో ఆయన ప్రదర్శించే దిగ్భ్రాంతికరమైన చొరవ జగమెరిగిన సత్యమే. ఆయన వయసు డెబ్బై ఐదు దాటింది. ఇంకో పదిహేనేళ్లు ఆయన నాయకత్వంలోనే పని చేస్తానని పవన్ కల్యాణ్ పదే పదే చెబుతున్నారు. పవన్ కల్యాణ్ శిరోధార్యంగా తలపోసే సనాతన ధర్మంపై సర్వహక్కులున్న ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ మాత్రం మరోరకంగా ఆలోచిస్తున్నారు. సెవెంటీ ఫైవ్ దాటిందంటే శాలువా కప్పుకొని తప్పుకోవలసిందేనని ఆయన కుండబద్దలు కొడుతున్నారు.ఆరెస్సెస్ బాస్ విధిస్తున్న ఈ సెవెంటీ ఫైవ్ డెడ్‌లైన్‌పై భారత రాజకీయాల్లో ఈ సంవత్సరం పెద్ద చర్చే జరిగే అవ కాశముంది. ఈ నేపథ్యంలో మన సెవెంటీ ఫైవ్ ప్లస్ బాబు కూడా తననింతటి వాడిని చేసిన గోబెల్స్ వ్యూహాన్ని తన వారసుడి కోసం కూడా అమలు చేయడం మొదలుపెట్టాడు. అమెరికా వాళ్లు ఇటీవల ఇరాన్ మీద ప్రయోగించిన బంకర్ బస్టర్ లాంటి బాంబునొకదాన్ని సత్యసాయి జిల్లా కొత్తచెరువు స్కూల్లో చంద్రబాబు జారవిడిచారు. అడపాదడపా ఇలా బాంబులేయడం రివాజే కనుక పెద్దగా గగ్గోలు పుట్టలేదు కానీ, ఈ రకమైన క్షుద్ర రాజకీయాలను ఇంకో తరం కూడా భరించ వలసిందేనా అనే ఆందోళన మాత్రం మొదలైంది.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలుచేసిన విప్లవాత్మక కార్యాచరణలో ‘అమ్మఒడి’ అనే పథకం అతి ముఖ్యమైనఅంశం. 2014 ఎన్నికలకు ముందు విడుదల చేసిన మేనిఫెస్టో లోనే ఆయనీ వాగ్దానం చేశారు. 2019లో గెలిచిన తర్వాత అమలు చేయడం, దీనిపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురవడం తెలిసిన విషయాలే. చంద్రబాబు ఈ పథకం పేరు ‘తల్లికి వందనం’గా మార్చి మరింత గొప్పగా చేస్తానంటూ తన సూపర్ సిక్స్ ఎన్నికల హామీల్లో చేర్చారు. ఏడాది ఎగనామం తర్వాత ఆంక్షల వర్తింపుతో అమల్లోకి తెచ్చి ఆ వీరతాడును మీడియా కెమెరాల సాక్షిగా తన కుమారుడి మెడలో వేశారు. పాఠశాల పిల్లలతో మాట్లాడుతూ ‘‘విద్యామంత్రి బాగా చదువుకున్నారు. మంత్రయ్యారు. ఇప్పుడు మీకోసం ‘తల్లికి వందనం’ అనే ఆలోచన ఆయనే చేశార’’ని నిస్సంకోచంగా చెప్పుకొచ్చారు. ఆ విధంగా తన గోబెల్స్ బాటన్‌ను మరుసటి తరం చేతికి అందజేశారు.‘మెగా పేరెంట్స్ – టీచర్స్ మీట్’ అనే మరో గిన్నీస్ బుక్ కార్యక్రమం ఈ వేడుకకు వేదికైంది. విద్యార్థుల డేటాబేస్‌ను నిర్వహించే కేంద్ర ప్రభుత్వ సంస్థ లెక్క ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 87 లక్షలమంది విద్యార్థులుండాలి. ప్రతి విద్యార్థికీ ‘తల్లికి వందనం’ స్కీమును వర్తింపజేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం 67 లక్షలమందినే లెక్క తేల్చింది. అందులో తల్లికి వందనం నిధులు 60 లక్షల లోపు విద్యార్థులకే అందినట్టు లెక్కలున్నాయి. మెగా పీటీఎమ్ రికార్డు బ్రేకింగ్ కార్యక్రమానికి 61 వేల పాఠ శాలల్లోని 74 లక్షలమంది విద్యార్థులు పాల్గొన్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వారి తల్లిదండ్రులతో సహా 2 కోట్ల 30 లక్షల మంది హాజరై రికార్డు సృష్టించినట్టు చెప్పారు. 67 లక్షల మంది పిల్లల లెక్క తీసుకున్నప్పుడు తల్లుల సంఖ్యను 42 లక్షలుగా చూపెట్టారు. 74 లక్షలకు అదే నిష్పత్తితో లెక్కిస్తే తల్లుల సంఖ్య 46 లక్షలవుతుంది. అదే సంఖ్యలో తండ్రులు కూడా హాజరై ఉంటారు. 3 లక్షల పైచిలుకు టీచర్లు హాజరయ్యారు. అంతా కలిపి 1 కోటీ 69 లక్షలు. ఇంకో 60 లక్షలమంది పరిశీలకులూ, దాతలని పేర్కొన్నారు. సగటున ప్రతి పాఠశాలకు వందమంది వీరే. కొన్ని ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థుల సంఖ్య కంటే దాతల సంఖ్యే ఎక్కువ కనిపించడం గిన్నిస్ బుక్‌లో చేర్చాల్సిన అసలు విషయం.విద్య ప్రభుత్వ బాధ్యత కాదు, కార్పొరేట్ సంస్థలే చూసుకోవాలన్న చంద్రబాబు కొటేషన్ మరీ పాతదేం కాదు. ఆరేడేళ్ల కిందటిదే. ఇంతలోనే ఈ బృహత్తర కార్యక్రమాన్ని అమలు చేయడం కోసం ఆయన తన ఫిలాసఫీని వదిలేసు కున్నారా? ఎంతమాత్రమూ కాదు. ఇది నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించడం అనే డబుల్ యాక్షన్ ప్లాన్. ఈ పథ కాన్ని అమలు చేసే నాటికే ప్రభుత్వ బడుల్లో నాలుగు లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు. ప్రభుత్వ స్కూళ్లలో ప్రైవేటు స్కూళ్లకు దీటుగా సౌకర్యాలు మెరుగుపరిచే ‘నాడు–నేడు’ కార్యక్రమం ఆగిపోయింది. విద్యార్థుల పౌష్టికాహారం కోసం 16 రకాల పదార్ధాలతో జగన్మోహన్రెడ్డి స్వయంగా పరిశీలించిన ‘గోరుముద్ద’ పథకం స్థానంలో బొద్దింకల భోజనం స్వయంగా మంత్రుల అనుభవంలోకే వచ్చింది. విద్యా ప్రమాణాలు మెరుగుపరచడం కోసం ప్రాథమిక స్థాయిలోనే జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన సబ్జెక్ట్ టీచర్ బోధన ఎగిరిపోయింది. విద్యార్థులు లేక 4,700 పాఠశాలలు మూసివేతకు సిద్ధంగా ఉన్నాయి.పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం కోసం వైసీపీ సర్కార్ వెయ్యి స్కూళ్లలో ప్రారంభించిన సీబీఎస్ఈ బోధనను చంద్రబాబు – లోకేశ్‌ల సర్కార్ తొలగించింది. వారి నైపుణ్యానికి పదును పెట్టే టోఫెల్ శిక్షణను మాయం చేశారు. నగరాల్లో ఉన్నత వర్గాల వారు వారి పిల్లలకోసం లక్షలు గుమ్మ రించి చెప్పించే ఐబీ సిలబస్‌ను పేద పిల్లలకు ఉచితంగా నేర్పించాలన్న జగన్ సంకల్పానికి గండికొట్టారు. పేద విద్యార్థులు కూడా డిజిటల్ ప్రపంచంలో ముందడుగు వేయాలన్న లక్ష్యంతో ఎనిమిదో క్లాసు విద్యార్థులకు ట్యాబ్‌లను అందజేయడం ప్రారంభించింది జగన్ ప్రభుత్వం. ఆయన హయాంలో సుమారు పది లక్షలమంది చేతుల్లోకి ట్యాబ్‌లు వచ్చాయి. ఈ కార్య క్రమాన్ని నిర్దాక్షిణ్యంగా ఆపేసి, పేద బిడ్డల్ని డిజిటల్ ప్రపంచానికి దూరం చేసే కుట్రను అమలుచేశారు. పేద ప్రజల పిల్లల్ని ఐక్యరాజ్యసమితి వేదికపై నిలబెట్టిన ఇంగ్లిష్ మీడియం బోధనకు వ్యతిరేకంగా ఎన్ని కుట్రలు చేశారో, ఎంతమంది కుహనా సాంస్కృతిక రాబందుల్ని రంగంలోకి దింపారో, పేద పిల్లల నోటి దగ్గరి ‘నాణ్యతా’ ముద్దను తన్నేయడానికి ఎన్ని గద్దలు ఎగిరాయో ఈ సమాజం జ్ఞాపకాల్లోంచి అంత త్వరగా చెరిగిపోయేవి కావు.పేదల విద్యాసాధికారత మీద ఇన్ని కుట్రలు చేసిన తెలుగుదేశం పెద్దల పుర్రెల్లో ‘తల్లికి వందనం’ ఆలోచన పుట్టిందని చెప్పడం కంటే హాస్యాస్పద విషయం ఇంకేముంటుంది? ‘నాడు–నేడు’ కార్యక్రమాన్ని నిలిపివేయడం, జగన్ ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలను క్రమంగా ఉపసంహరించడం, మధ్యాహ్న భోజన పథకాన్ని నీరుగార్చడం వంటివన్నీ ఉద్దేశ పూర్వక చర్యలేనని అభిజ్ఞవర్గాల సమాచారం. ఈ చర్యలు ఇంకా చురుగ్గా సాగుతాయట! రెండో దశలో ఇంకో ప్రచారం మొదల వుతుంది. ప్రైవేట్ స్కూళ్లలో చదివినా తల్లికి వందనం వస్తున్న ప్పుడు సౌకర్యాలు లేని ప్రభుత్వ స్కూళ్లలో ఎందుకు చదవాలని టముకు వేస్తారు. చేరగలిగిన వాళ్లంతా ప్రైవేట్‌కు మారిన తర్వాత అసలు కథ మొదలవుతుంది. ప్రైవేట్ స్కూళ్లలో చదివించే స్థోమత కలిగిన వారికి ప్రభుత్వ సాయమెందుకని పెంపుడు మీడియానే ప్రశ్నిస్తుంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు. విద్య ప్రభుత్వం బాధ్యత కాదనే చంద్రబాబు మాట నెగ్గి ప్రైవేట్ విద్య వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది. నాణ్యమైన విద్యకు దూరమైన శ్రామిక వర్గాల పిల్లలు చౌక శ్రామికులుగానే మిగిలిపోతారు.బాల్యంలో వేగంగా నేర్చుకునే వయసులో ఉన్నప్పుడు వారికి అందే విద్యా ప్రమాణాలే వారి ఐక్యూ స్థాయులను నిర్ధారిస్తాయని అనేక సర్వేలు వెల్లడించాయి. పోషకాహార లేమి వేగంగా నేర్చుకునే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని కూడా చాలాకాలంగా నిపుణులు చెబుతున్నారు. ఉన్నత స్థాయి బోధనా పద్ధతులు, డిజిటల్ పరిజ్ఞానం. పౌష్టికాహారం కొంత మందికి మాత్రమే అందుబాటులో ఉండి ఎక్కువమంది బాలలకు అందని ద్రాక్షలుగా ఉన్న దేశాలు ఐక్యూ ర్యాంకుల్లో వెనుకబడి ఉండటానికి కారణం అదే. విద్యా వ్యవస్థపై శాస్త్రీయమైన మదింపు చేసిన తర్వాతనే జగన్ మోహన్‌రెడ్డి మన పిల్లలకు ఇచ్చే ఆస్తి చదువు మాత్రమేనని తన ప్రసంగాల్లో, సందేశాల్లో పదేపదే ప్రస్తావించేవారు. జగన్,చంద్రబాబుల దృక్పథంలో ఉన్న మౌలికమైన తేడా ఇదే! పేద, ధనిక, కులం, మతం, ప్రాంతం, ఆడ, మగ తేడాల్లేకుండా చదువు అనే ఆస్తి అందరికీ సమకూరాలనేది జగన్మోహన్ రెడ్డి తాత్విక భూమిక. చదువు అనే ఆస్తి కూడా కొనుగోలు చేయగలిగినవాడికే చెందాలనేది చంద్రబాబు విచార ధార.అందుకే దాన్ని ప్రభుత్వ బాధ్యతగా కాకుండా కార్పొరేట్ బాధ్యతగా వర్గీకరించారు. ‘తల్లికి వందనం’ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో కాకుండా ఒక ఎరగా వేశారని నిపుణులు అభిప్రా యపడుతున్నది కూడా అందుకే!ఈ మౌలికమైన తేడా ఇప్పుడు ఉపాధ్యాయుల అనుభవంలోకి కూడా వచ్చినట్టుంది. మొన్నటి మెగా పీటీఎమ్ కార్య క్రమాన్ని ఒక ఈవెంట్‌లా నిర్వహిస్తున్నారంటూ వారి సామాజిక మాధ్యమ గ్రూపుల్లో విమర్శలు వెల్లువెత్తాయి. అందులో ఒక్క పోస్టును క్లుప్తంగా గమనిస్తే వారి అభిప్రాయం ఏమిటో తేటతెల్లమవుతుంది. ‘‘బాబుగారూ, లోకేశ్‌గారూ... మీరు ఈ సమావేశంలో కూర్చున్న బెంచీలు మీ ప్రభుత్వం ఇచ్చినవి కావు. మీ ఎదురుగా వున్న ఐఎఫ్‌పీ ప్యానెళ్లు మీరు ఏర్పాటు చేయలేదు. పైన తిరుగుతున్న ఫ్యాను, వెలుగుతున్న లైటూ కూడా మీరిచ్చినవి కావు. మిగిలిన నాలుగేళ్లయినా ఈ పనికి మాలిన సమావేశాలు మానేయండి. టీచర్ల కాలాన్ని వృథా చేయకండి. పిల్లల భవిష్యత్తును నాశనం చేయకండి. ఉపాధ్యా యుల్ని మీ కూటమి ప్రభుత్వం ఈవెంటు మేనేజర్లుగా మార్చేస్తున్నది. పిల్లల తల్లిదండ్రులతో టీచర్ల సమావేశాలు ప్రతినెలా జరుగుతూనే ఉన్నాయి. దయచేసి ఈ కార్యక్రమాన్ని రాజకీయ కార్యక్రమంగా మార్చవద్దు. ముఖ్య విషయం: పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న మీరు పాఠశాలలకు చేసిన మేలు ఒక్కటంటే ఒక్కటైనా ఉన్నదా?... చెప్పండి సీ.ఎం. సారూ!’’వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
కొంతమందికి కూలీ ఇచ్చి వైఎస్ జగన్ ను తిట్టిస్తున్నారు
-
బాబు ఎల్లో గ్యాంగ్ పై వైఎస్ జగన్ ఫైర్
-
బాబు కళ్లల్లో ఆనందం కోసం.. రైతులపై కుళ్లు రాతలా?
నాకు 2 ఎకరాల మామిడి తోట ఉంది. వచ్చిన దిగుబడికి, అయిన ఖర్చుకు, ఈ ప్రభుత్వ పాలనలో ఫ్యాక్టరీలు ఇచ్చే మద్దతు ధరకు ఎలాంటి పొంతన లేదు. పూర్తిగా నష్టపోయాం. గిట్టుబాటు ధరలేక కడుపు మండి మా గోడు వైఎస్ జగన్‌కు చెప్పుకుందామని వెళితే మమ్మల్ని దండుపాళ్యం బ్యాచ్‌గా, సైకోలుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు చిత్రీకరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రైతులంటే అంత అలుసా? అధికార పారీ్టపై అంత ప్రేమ ఉంటే చంద్రబాబుకు భజన చేసుకోవాలి. – ఉమాపతి, బట్టికండ్రిగ, వడమాలపేట మండలం, తిరుపతి జిల్లా ‘‘ఏడాదిగా పండించిన ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. దిక్కుతోచక రోడ్డెక్కి అనేకమార్లు ఆందోళనలు చేశాం. ఏనాడూ ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు మా సమస్యలను సమాజం దృష్టికి తీసుకువెళ్లలేదు. బాధ్యత గల ప్రతిపక్ష నేతగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మా కష్టాలను తెలుసుకునేందుకు వచ్చారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా వైఎస్ జగన్ పర్యటనకు వేలాది మంది రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చారు. వైఎస్ జగన్ పర్యటన విజయవంతమైంది. జగన్ రాకతోనే మా కష్టాలు సమాజానికి తెలిశాయి.అందువల్లే కూటమి పాలకులు జీర్జించుకోలేకపోతున్నారు. చంద్రబాబు కళ్లలో ఆనందం కోసం పచ్చపత్రికలు బాధ్యతను మరిచి రైతులపై కుళ్లు రాతలు రాశాయి. కల్లాకపటం ఎరుగని రైతులను కరుడుగట్టిన నేరస్తులైన దండుపాళ్యం బ్యాచ్‌తో పోలుస్తారా? అసలు చంద్రబాబే తన అక్కసును ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో వార్తల రూపంలో వెళ్లగక్కుతున్నారు. వెంటనే రైతులపై దుర్మార్గపు రాతలను వెనక్కి తీసుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేకపోతే రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెబుతాం..’’ అని ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. - చిత్తూరు అర్బన్ ఆ పత్రికలకు పచ్చకామెర్లు కమ్మాయిరైతు పొలంలో కాలు పెడితేనే ఎంత ధనవంతుడికైనా తిండి నోట్లోకి వెళుతుంది. అలాంటి అన్నదాతలు ఆ పచ్చ పత్రికలకు దండుపాళ్యం బ్యాచ్‌లా కనిపిస్తున్నారా? ఆ పత్రికలకు పచ్చకామెర్లు కమ్మాయి. అందుకే ఇంత నీచమైన పదజాలం వాడుతున్నాయి. ఆరుగాలం కష్టపడి సాగుచేసిన పంట వల్ల నష్టాలు వస్తే, కోత కోసే కూలీకి కూడా గిట్టుబాటు లేక తోటలోనే పంటను వదిలేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో ఇలాంటి పిచ్చిరాతలు రాసే వారికి ఏం తెలుసు? – కృష్ణయ్య, చిన్నబ్బనాయుడు కండ్రిగ, పుత్తూరు మండలం, తిరుపతి జిల్లాఇంత నీచంగా వర్ణిస్తారా?పత్రికలు రైతుల పక్షాన నిలవాలి. లేకుంటే ఊరకుండాలి. ఇలా రైతులను ఆడిపోసుకోవడం మంచి సంప్రదాయం కాదు. రైతులను దండుపాళ్యం బ్యాచ్ అంటూ ఎల్లో మీడియా అభివర్ణించడం ముమ్మాటికీ సభ్యసమాజం తలదించుకునే చర్యే. రైతులపై ఆ పత్రికలకు అంత కక్ష ఎందుకో? నాకు 30 ఎకరాల పొలం ఉంది. మామిడి తోట సాగుచేశాను. తీరా పంటచేతికొచ్చి అమ్మకాలకు వెళితే ధర పడిపోయింది. తీవ్రంగా నష్టపోయాం. వైఎస్ జగన్‌కు మా బాధను తెలియజేసేందుకు వెళ్లాం. అంతమాత్రాన రైతుల్ని ఇంత నీచంగా వర్ణిస్తారా? – రామకృష్ణమ రాజు, నారపరాజు కండ్రిగ, విజయపురం మండలం, చిత్తూరు జిల్లాఆ వ్యాఖ్యలు వెనక్కు తీసుకోండి మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మా కష్టాలను గుర్తించి, పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ వచ్చారు. రైతు సమస్యలను ప్రతిపక్ష నేత దృష్టికి తీసుకు వెళ్లేందుకు మేము వెళితే దండుపాళ్యం బ్యాచ్‌గా చిత్రీకరించడం బాధాకరం. ఆ వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకోండి. – రంగనాథ్, యువ రైతు, చౌడేపల్లి మండలం, చిత్తూరు జిల్లాకూటమి నేతలే అసలైన దండుపాళ్యం బ్యాచ్దేశానికి అన్నం పెట్టే రైతులను దండుపాళ్యం బాచ్‌తో పోల్చడం బాధాకరం. మామిడి రైతులను పరామర్శించడానికి వచ్చిన జగనన్నను కలిస్తే తప్పా? ఆయనపై అభిమానంతో స్వచ్ఛందంగా వెళ్తున్న రైతులను అడ్డుకునేందుకు కుట్రలు పన్నింది కూటమి ప్రభుత్వమే. వైఎస్ జగన్ రాకతోనే మామిడి రైతుల కష్టాలు సమాజానికి తెలిశాయి. అసలైన దండుపాళ్యం బాచ్ కూటమి నేతలే. – మనోహర్‌రెడ్డి, పెరుమాళ్లపల్లి, యాదమరి, చిత్తూరు జిల్లాఈనాడులో పిచ్చివ్యాఖ్యలు దారుణం ఈనాడు సహా ఎల్లో పత్రికల్లో పిచ్చి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. మామిడి రైతులను ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ధరలు లేకుండా నట్టేట్లో ముంచటంతోపాటు వారిని దండుపాళ్యం బ్యాచ్ అనటం పద్ధతికాదు. మామిడి రైతులు పడుతున్న కష్టాలను చూసి చలించి వారికి భరోసా కల్పించడానికి వైఎస్ జగన్ వస్తే నిస్సిగ్గుగా తప్పుడు వార్తలు రాయటం దుర్మార్గం. చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను దారి పొడవునా పెట్టి స్వచ్ఛందంగా వస్తున్న రైతులపై విచక్షణ రహితంగా లాఠీచార్జ్ చేయించింది.. దీన్ని ఏమంటారు? చంద్రబాబు రైతులకు ఎప్పుడూ మేలు చేయరు. మేలు చేసే వారిని చూసి ఓర్వలేడు. చంద్రబాబు తన అక్కసును పచ్చ పత్రికల ద్వారా తీర్చుకుంటున్నారు. – లోకనాథరెడ్డి, ఐరాల, చిత్తూరు జిల్లారైతులకు క్షమాపణ చెప్పాలిమామిడి రైతులను పరామర్శించేందుకు వచ్చిన మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనకు వెళ్లిన రైతులను దండుపాళ్యం బ్యాచ్ అంటూ దుష్ప్రచారం చేసిన పచ్చ పత్రిక యాజమాన్యం వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలి. కూటమి ప్రభుత్వ అనుకూల దినపత్రిక రైతులపై విషం చిమ్మడం తగదు. – నారాయణప్ప, పుంగనూరు, చిత్తూరు జిల్లారైతులను నేరస్తులతో పోలుస్తారా?నాకు పది ఎకరాల మామిడి తోట ఉంది. దానిలో నాలుగు ట్రక్కులు మామిడి కాయలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు టోకెన్లు లేక తరలించలేకపోయాను. మేం పడుతున్న కష్టాలను మా నాయకుడు వైఎస్ జగన్‌కు చెప్పుకొనేందుకు ఎంతో ఆశతో వెళితే మాకు పోలీసులు నిరాశ మిగిల్చారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నలను కరుడుగట్టిన నేరస్తులతో పోల్చడం దుర్మార్గం. అసలు రైతు లేకపోతే మీరు ఏం తింటారు? – యుగంధర్ నాయుడు, దిగువ కండ్రిగ, చిత్తూరు జిల్లా.ఎన్నడూ ఇలాంటి రాతలు చూడలేదునా సొంత తోటతోపాటు కొన్ని మామిడి తోటలు కౌలుకు తీసుకున్నా. సుమారు 50 ట్రక్కుల వరకు మామిడి ఉంది. ఇప్పటివరకు 30 ట్రక్కుల వరకే ఫ్యాక్టరీకి తరలించాను. ప్రస్తుతం ఉన్న కాయలను ఏం చేయాలో అర్థం కావట్లేదు. కనీసం మద్దతు ధర కూడా లేదు. మా బాధలను వైఎస్ జగన్‌కు చెప్పుకొనేందుకు వస్తే కూటమి ప్రభుత్వం పోలీసులతో అడ్డుకుంది. కూటమి ప్రభుత్వం రైతుల బాధలు పట్టించుకోవడం లేదు. ఎన్నడూ మామిడి రైతులు ఇలాంటి కష్టాలు పడలేదు. ఎప్పుడూ పత్రికలు ఇలా రైతులను చులకన చేసి నీచంగా వార్తలు రాయడం చూడలేదు. – ధనుంజయరెడ్డి, కలికిరిండ్లు, చిత్తూరు జిల్లారైతులను అవమానించడం సిగ్గుచేటుఆంధ్ర అంటే అన్నపూర్ణ అని దేశవ్యాప్తంగా అంటారు. దీనికి కారణం అన్నదాతలు కష్టపడి పంటసాగు చేయడమే. అటువంటి రైతులను కూటమి నాయకులు, పచ్చ మీడియా కలిసి దండుపాళ్యం బ్యాచ్ అని అవమానపరచడం సిగ్గుచేటు. దండుపాళ్యం బ్యాచ్ అనేవారు ఒక్కరోజు పొలంలో పని చేస్తే అప్పుడు తెలుస్తుంది అన్నదాత కష్టం, ఆవేదన. – మునికృష్ణయ్య రైతు, మెట్టు, చిట్టమూరు మండలం, తిరుపతి జిల్లారైతుల ఉసురు తగులుతుందిఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక ఆక్రందనతో రోడ్డెక్కితే పచ్చ పత్రికల్లో రైతులను దండుపాళ్యం బ్యాచ్ అంటూ అవమానించడం అత్యంత దుర్మార్గం. రైతుల ఉసురు తగిలి ఈ ప్రభుత్వం, ఆ పత్రిక బంగాళాఖాతంలో కలవడం ఖాయం. – శంకర్‌రెడ్డి, గురవరాజుపల్లి, రేణిగుంట మండలం, తిరుపతి జిల్లాఓర్వలేకే ఈనాడు ఉన్మాదపు రాతలు... రాష్ట్రంలో రైతులు అన్ని విధాలా నిరాదరణకు గురై అల్లాడిపోతున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి బంగారుపాళెం పర్యటన విజయవంతం కావటంతో ఓర్వలేని కూటమి పాలకులు ఈనాడు, తోకపత్రిక చేత రైతులను దండుపాళ్యం బ్యాచ్‌గా అభివర్ణిస్తూ ఉన్మాదపు రాతలు రాయించారు. రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వానికి, ఆ పత్రికకు రైతులు తగిన బుద్ధి చెబుతారు. – హేమలత, చెంగారెడ్డి పట్టెడ, రేణిగుంట మండలం, తిరుపతి జిల్లా -
చంద్రబాబు.. ఇంక మీ డ్రామాలు ఆపండి: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: రైతుల పక్షాన మేము నిలబడితే ఎల్లో మీడియా దౌర్బాగ్యపు మాటలు, రాతలు ఏంటి? ఈ ఆంక్షలు ఎందుకు? అని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. మామిడి రైతులకు కష్టాలే లేనట్టుగా, వారంతా ఆనందంతో కేరింతలు కొడుతున్నట్టుగా, సంబరాలు చేసుకుంటున్నట్టుగా రాతలు రాయడానికి, మాట్లాడటానికి సిగ్గు ఉండాలి?. చంద్రబాబు.. రైతులకు నిజంగా మీరు మేలు చేస్తే.. మంత్రి అచ్చెన్నాయుడిని ఎందుకు ఢిల్లీకి పంపారు? అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నిన్నటి బంగారుపాళ్యం పర్యటనపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా రైతుల విషయమై.. చంద్రబాబు ప్రభుత్వానికి సూటిగా పలు ప్రశ్నలు సంధించారు. ఇదే సమయంలో పిచ్చి రాతలు రాసిన పచ్చ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 1.చంద్రబాబు.. మీరు, మీ ఈనాడు, మీ ఆంధ్రజ్యోతి, మీ టీవీ-5లు సహా మీకు కొమ్ముకాస్తున్న ఎల్లోమీడియా మరింతగా దిగజారిపోయారు. నిన్న బంగారుపాళ్యంలో రైతులకు సంఘీభావంగా నా పర్యటనకు, మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా, వందలమందిని నోటీసులతో నిర్బంధించినా, అణచివేతకు దిగినా, చివరకు లాఠీఛార్జి చేసినా, వెరవక వేలాదిగా రైతులు స్వచ్ఛందంగా, తమగోడు చాటుతూ హాజరయ్యారు. ప్రభుత్వ తీరుపట్ల రైతుల్లో ఉన్న ఆగ్రహాన్ని రాష్ట్రం మొత్తం చూసింది. ఇదే సందర్భంలో కొంతమంది రైతులు, తమకు తీవ్ర నష్టం వచ్చినా ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని, ఈ దేశం దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశంతో రోడ్లపై మామిడికాయలు వేసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఇది నేరమన్నట్టుగా, రైతులను, వారి తరఫున ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాన్ని పట్టుకుని రౌడీషీటర్లుగానూ, అసాంఘిక శక్తులుగానూ, దొంగలుగానూ చిత్రీకరిస్తూ వ్యాఖ్యానాలు చేస్తూ, మరోవైపు వక్రీకరిస్తూ తప్పుడు రాతలు మీ ఈనాడులో, మీ ఎల్లోమీడియాలో రాయించడం మీకే చెల్లింది. తప్పుడు వక్రీకరణలతో ఇలా మాట్లాడ్డం వ్యవసాయం పట్ల, రైతు సమస్యల పట్ల మీకు, మీ ప్రభుత్వానికి, మిమ్మల్ని భుజానమోస్తున్న మీ ఎల్లోమీడియాకు ఉన్న తేలికతనానికి, బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. మామిడి రైతులకు కష్టాలే లేనట్టుగా, వారంతా ఆనందంతో కేరింతలు కొడుతున్నట్టుగా, సంబరాలు చేసుకుంటున్నట్టుగా మీరు రాస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఇంతకన్నా నిస్సిగ్గుతనం ఏమైనా ఉంటుందా? చంద్రబాబుగారు మీరు పాలకుడని చెప్పుకోవడానికి మీకు సిగ్గు ఉండాలి? పత్రికలు, టీవీలు అని చెప్పుకోవడానికి మీ ఎల్లోమీడియాకు సిగ్గు ఉండాలి?2. 2.2లక్షల ఎకరాల్లో 6.5 లక్షల టన్నుల పంట, 76 వేల రైతు కుటుంబాలకు చెందిన సమస్య ఇది. గత 2 నెలలుగా మామిడి తోటల్లోనూ, ర్యాంపులవద్దా, ఫ్యాక్టరీల ముందు, పండిన పంటను కొనేవాడులేక రైతులు పారబోస్తున్నారు. ఇలాంటి ఘటనలకు మనమంతా సాక్షులమే. మరి వీళ్లంతా మీ కంటికి రౌడీలు, దొంగలు, అసాంఘిక శక్తులు మాదిరిగానే కనిపిస్తున్నారా? కష్టాల్లో ఉన్న రైతులకు చేదోడుగా మీరు ఉండకపోగా, ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా మేం రైతుల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నంచేస్తే, ఆ కార్యక్రమంపై మీరు చేస్తున్న వెకిలి వ్యాఖ్యలు, రాస్తున్న వెకిలి రాతలు, వక్రీకరణలను ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు.3. మీ సిద్ధాంతం ప్రకారం చూస్తే ఇకపై రాష్ట్రంలో తమకు అన్యాయం జరిగిందని రోడ్డెక్కే ప్రతి రైతూ, ప్రతి యువకుడూ, ప్రతి నిరుద్యోగి, ప్రతి మహిళా, ప్రతి ఉద్యోగీ, వారికి అండగా నిలబడేవాళ్లంతా మీదృష్టిలో రౌడీలు, అసాంఘిక శక్తులు, దొంగలు... అంతేకదా చంద్రబాబుగారూ..! అంతేకాదు, అసలు వీరికి ఏ ఒక్కసమస్యాలేదని, అన్ని హామీలూ మీరు తీర్చేశారని, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అందుకొని ఆనందంతో వీరంతా కేరింతలు కొడుతున్నారనే కదా మీ వక్రభాష్యం. తమకు ధరలేదని ఆందోళన చేసిన మిర్చి రైతులు, ధాన్యం రైతులు, కోకో రైతులు, పొగాకు రైతులు.. వీళ్లందరూ బాగున్నారని, మంచి రేట్లు వచ్చినా, వీళ్లందరూ అసాంఘిక శక్తులు కాబట్టి వీరు రోడ్లు ఎక్కారనేగా మీ ఉద్దేశం. ఇదేం పద్ధతి, ఇదేం విధానం చంద్రబాబుగారూ..?4. మామిడి రైతులు కష్టాల్లో లేకపోతే, రైతులు పంటను తెగనమ్ముకోకపోతే, మీరు ఎంతమేర అమలు చేశారన్న విషయం పక్కనపెడితే, కిలోకు రూ.4లు ప్రభుత్వం నుంచి ఇస్తామన్న ప్రకటన ఎందుకు చేశారు? ఫ్యాక్టరీలు కిలో రూ.8ల చొప్పున కొనుగోలు చేయాలని దొంగ ఆదేశాలైనా ఎందుకు జారీచేశారు? కర్ణాటకలో కిలో రూ.16ల చొప్పున కనీస ధరకు కొనుగోలుచేస్తామని కేంద్ర ప్రభుత్వం, మీ ఎన్డీయేలోనే ఉన్న జేడీఎస్ పార్టీ నాయకుడు కుమారస్వామికి లేఖ ఎందుకు రాసింది? బంగారుపాళ్యంలో నా పర్యటన కార్యక్రమం ఖరారుకాగానే మీ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడిని ఎందుకు ఢిల్లీకి పంపారు?. దాని అర్థం రైతులు నష్టపోతున్నట్టే కదా? మరి రైతులు నష్టపోయినట్టు ఓవైపు మీరు అంగీకరిస్తూ, ఆ నష్టాన్ని రైతుల పక్షంగా మేం ఎత్తిచూపితే మళ్లీ ఈ దౌర్బాగ్యపు మాటలు, రాతలు ఏంటి? ఈ ఆంక్షలు ఎందుకు?5. వైయస్సార్సీపీ హయాంలో రైతులకు ఏరోజు ఇలాంటి కష్టం రాలేదు. గతేడాది కూడా కిలో మామిడికి రూ.25-29ల ధర వచ్చింది. మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు ధరలు పడిపోయాయి? ప్రతి ఏటా మే 10-15తేదీల మధ్య తెరవాల్సిన పల్ప్ ఫ్యాక్టరీలను, ఈ ఏడాది ఆ సమయానికి ఎందుకు తెరవలేదు? ఒక నెలరోజులు ఆలస్యంగా ఎందుకు తెరిచారు? అవికూడా కొన్ని మాత్రమే ఎందుకు తెరిచారు? సకాలానికి ఫ్యాక్టరీలు తెరవకపోయినా చంద్రబాబుగారూ మీరు ఎందుకు పట్టించుకోలేదు, ఒకేసారి సరుకు వచ్చేలా చేయడంద్వారా ఉద్దేశపూర్వకంగా దోపిడీకి ఆస్కారం కలిగించినట్టు కాదా? మీ గల్లా ఫ్యాక్టరీకి, మీ శ్రీని ఫుడ్స్‌కు… ఇలా మీవాళ్లకు మేలు చేయాలన్న ఉద్దేశంతోనే ఇదంతా చేయడంలేదంటారా? మీరు ఇస్తానన్న రూ.4లు ఎంతమంది రైతులకు ఇచ్చారు? ఎంతమంది రైతులకు రూ.8ల చొప్పున ఫ్యాక్టరీలు చెల్లించాయి? ఇదికూడా నిరుడు సంవత్సరం వైయస్సార్సీపీ పాలనతో పోలిస్తే ఎక్కడ రూ.29ల రేటు, ఎక్కడ ఈరోజు అమ్ముకుంటున్న రూ.2.5/3లు కేజీకి. దీన్ని నిలదీసే కార్యక్రమాన్ని ప్రతిపక్షనేతగా, రైతుల పక్షాన నిన్న బంగారుపాళ్యంలో నేను చేస్తే, మీ దగ్గర సమాధానాలు లేక రైతులు మీద, మామీద తప్పుడు మాటలు మాట్లాడతారా? తప్పుడు వక్రీకరణ రాతలు రాస్తారా?6. చంద్రబాబుగారూ.. మీరు వచ్చిన తర్వాత వరి, మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జ, రాగులు, అరటి, ఉల్లి, చీనీ, కోకో, పొగాకు, చివరకు మామిడి… ఇలా ఏ పంటకూ కనీస మద్దతు ధరలు రావడంలేదన్నది వాస్తవం కాదా? గట్టిగా ప్రశ్నిస్తే, డ్రామాలతో రైతులను, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మిర్చిరైతులకు ధరలు రావడంలేదని గగ్గోలు పెడితే, కేంద్రంచేత కొనిపిస్తానంటూ డ్రామా చేశారు. చివరకు ఒక్క కిలో అయినా కొన్నారా? ఒక్క రూపాయి అయినా ఖర్చుపెట్టారా? టొబాకో రైతులు ఆందోళన చేస్తే, ఇంకో డ్రామా చేస్తూ, ప్రకటనలు చేయిస్తున్నారు. చిత్తశుద్ధితో మీరు వ్యవహరించారా?7. మా ప్రభుత్వం ఉన్నప్పుడు ధాన్యం కొనుగోలు కాక ఇతర పంటల కొనుగోలు విషయంలో రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెట్టి రూ.7,800 కోట్లు ఖర్చు చేశాం. రైతులు నష్టపోతున్నా మీరెందుకు ఆ పనిచేయడం లేదు? ఏ పంటకు ఏ ధర ఉందనే దానిపై ఆర్బీకేల్లో రియల్ టైం మానిటరింగ్ చేసే CM APP ఏమైంది?8. గత ఏడాది మీరు ఇస్తానన్న రైతు భరోసా రూ.20వేలు ఇవ్వలేదు, జూన్ 21 ఇస్తానని చెప్పి, జులై రెండోవారం అవుతున్నా ఇప్పటికీ, ఈ ఏడాదికూడా దాని గురించి ప్రస్తావించడంలేదు. సీజన్ మొదలై వారాలు గడుస్తున్నా పరిస్థితి అగమ్యగోచరమే. మా హయాంలో మే నెల చివరికల్లా రైతులకు పెట్టుబడి సహాయం వారి చేతికి అందేది.9. వరదలు వచ్చినా, కరువులు వచ్చినా సమయానికే సీజన్ ముగిసేలోగా ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీని ఇచ్చే మా విధానాన్ని గాలికి వదిలేశారు. ఉచిత పంటలబీమాను పూర్తిగా ఎత్తేశారు, ఆర్బీకేలను, ఇ-క్రాప్ విధానాన్ని, గ్రామంలోనే నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు సప్లై చేసే వ్యవస్థను, విత్తనం నుంచి పంటల కొనుగోలు వరకూ రైతును చేయిపట్టుకుని నడిపించే వ్యవస్థను నిర్వీర్యం చేశారు. టెస్టింగ్ ల్యాబ్స్‌ను నాశనం చేస్తున్నారు. ఇలా ప్రతిదశలోనూ రైతుకు తోడుగా ఉండే ప్రతి కార్యక్రమాన్ని దెబ్బతీశారు. వీటిని ప్రశ్నిస్తే, మీ వైఫల్యాలను ఎత్తిచూపితే మాపైన, ఆందోళన చేస్తున్న రైతులపైనా అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి చంద్రబాబుగారూ..! రైతులకు తోడుగా నిలబడే కార్యక్రమాలు చేయండి.1.@ncbn గారూ, మీరు, మీ ఈనాడు, మీ ఆంధ్రజ్యోతి, మీ టీవీ-5లు సహా మీకు కొమ్ముకాస్తున్న ఎల్లోమీడియా మరింతగా దిగజారిపోయారు. నిన్న బంగారుపాళ్యంలో రైతులకు సంఘీభావంగా నా పర్యటనకు, మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా, వందలమందిని నోటీసులతో నిర్బంధించినా, అణచివేతకు దిగినా, చివరకు లాఠీఛార్జి చేసినా,… pic.twitter.com/9WFD13951r— YS Jagan Mohan Reddy (@ysjagan) July 10, 2025 -
ABN,టీవీ 5 ఇది మిస్ అవ్వకండి.. రికార్డ్ చేసి పంపించండి.. బొత్స కౌంటర్
-
బెడిసికొట్టిన వ్యూహం.. అంబులెన్స్ లో అసలు నిజం
-
కలిస్తే తప్పేంటి? ఎల్లో మీడియాకు గూబ గుయ్యిమనేలా ఎస్పీ సమాధానం
-
పచ్చ బ్యాచ్ మొత్తం దొరికిపోయారు.. సింగయ్య మృతిలో ట్విస్ట్
-
ఎల్లో మీడియా తప్పుడు వార్తలపై వైఎస్సార్సీపీ ధ్వజం
తాడేపల్లి : తమ పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డిపై తప్పుడు రాతలు రాస్తున్న ఎల్లోమీడియాపై వైఎస్సార్సీపీ ధ్వజమెత్తింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరాధార ఆరోపణలతో వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డం ఎల్లో మీడియాకు ఒక అలవాటుగా మారిందని మండిపడింది. వైఎస్సార్సీపీని దెబ్బతీసే దురుద్దేశంతో తమ పార్టీ నాయకులను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి కుట్రలు చేయడం వారికి సర్వసాధారణంగా మారిపోయిందని, సజ్జలపై ఆంధ్రజ్యోతి, ఈటీవీ-2 సహా ఇతర ఎల్లో మీడియాలో ప్రచురించిన, ప్రసారమైన వార్త కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేసింది. కార్యాలయానికి వచ్చే సందర్శకులకు అనుచరుడిగా ముద్రవేసి, వారిపై వచ్చిన ఆరోపణలపై విచారణ లేకుండా, నిర్ధారించుకోకుండా, కనీస ఆధారాలు లేకుండా సజ్జల రామకృష్ణారెడ్డికి ఆపాదిస్తూ నిర్లజ్జగా వార్తా కథనం ప్రసారం చేయడం అత్యంత దారుణమని పేర్కొంది. ఆ వార్తల్లో పేర్కొన్న ప్రేమ్‌చంద్ అనే వ్యక్తితో కాని, అతనిపై వచ్చిన ఆరోపణలతో కాని సజ్జల రామకృష్ణారెడ్డికి ఎలాంటి సంబంధం లేదని వైఎస్సార్సీపీ తెలిపింది. పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించేలా తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలకు వెనుకాడమని వైఎస్సార్సీపీ హెచ్చరించింది. -
మనుగడ కోసం ‘మహా’ కుట్ర!
సుభద్రాదేవి గర్భంతో ఉన్న సమయంలో ఒకసారి అర్జునుడు ఆమెకు యుద్ధరంగంలో పద్మవ్యూహానికి సంబంధించిన జ్ఞానాన్ని బోధిస్తున్నాడట! ఆమె నిద్రలోకి జారుకోవడాన్ని గమనించకుండా అర్జునుడు చెప్పడం కొనసాగిస్తుండగా గర్భస్థ శిశువైన అభిమన్యుడు ఊ... కొడుతూ వింటున్నాడట! పద్మ వ్యూహంలో ఎలా ప్రవేశించాలనే ఉపదేశాన్ని పూర్తిచేసి, ఎలా నిర్గమించాలనే కథను అర్జునుడు ప్రారంభిస్తాడు. అదే సమయంలో కృష్ణపరమాత్ముడు ప్రత్యక్షమై సుభద్ర నిద్రపోతు న్నది... ఇక చాల్లే అని ఆపించాడట! ఆ రకంగా అభిమన్యుడు పద్మవ్యూహ ప్రవేశాన్ని గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే క్షుణ్ణంగా నేర్చుకోగలిగాడు. భారత రామాయణాది ఇతిహాసాలు, పురా ణాలు మన సంస్కృతిలో భాగం కనుక, వాటికి సంబంధించిన కథలన్నీ నమ్మాలనే కట్టుబాటు ఉన్నది కనుక ఈ కథను కూడా మనం నమ్ముతాము.ఈ కాలంలో కూడా అంతకు మించిన వండర్ టెలీపతీ ఉన్నదనే సంగతి నిన్ననే తెలిసింది. ‘ఏపీ పోలీస్–హ్యాకథాన్ –25’ అనే పేరుతో నిన్న గుంటూరులో ఒక టెక్నాలజీ సదస్సు జరిగింది. సందర్భం ఏదైనా సరే, టెక్నాలజీకి ఆది మధ్యాంతాలు తానేనని చెప్పుకోవడం చంద్రబాబు ఆనవాయితీ. అదే ఒరవడిని ఇక్కడ కూడా కొనసాగించారు. దేశంలో ఆటోలు, మోటార్ బైక్‌ల ఊబరైజేషన్ కోసం రూపొందించిన ‘ర్యాపిడో’ వృత్తాంతాన్ని ఆయన సభికులకు వివరించారు. ఆ యాప్‌ను రూపొందించిన వ్యక్తి తండ్రి గతంలో తెలుగుదేశం పార్టీ కార్య కర్తగా ఉండేవారట! అందువల్ల బాబు దగ్గరికి వస్తూపోతూ ఆయన చెప్పే సంగతులన్నీ వినేవారట. అలా విన్న ఫలితమే ఆయన కుమారుడు ర్యాపిడో యాప్‌ను డెవలప్ చేయడానికి కారణమైందట! చంద్రబాబు చేసిన జ్ఞానబోధ తండ్రి తలలోంచి తరంగయానం చేసి కుమారుడి మేధను తేజోమయం చేసిందన్నమాట!ఇటువంటి విడ్డూరాలను శషభిషలేమీ లేకుండా చెప్పు కోవడం చంద్రబాబుకు పరిపాటే! భారతదేశానికి ఐటీని పరి చయం చేసిందీ, సెల్‌ఫోన్ తీసుకొచ్చిందీ తానేనని చెప్పు కోవడం చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఎవరూ మరిచి పోకుండా ఉండడానికి ఆయన మళ్ళీ మళ్ళీ గుర్తుచేస్తూనే ఉంటారు. కలామ్‌ను రాష్ట్రపతిని చేసిందీ, వాజ్‌పేయికి జ్ఞానో దయం కలిగించి ‘స్వర్ణ చతుర్భుజి’ పథకానికి శ్రీకారం చుట్టించిందీ తానేనని కూడా ఆయన చెప్పుకున్నారు. సత్య నాదెళ్ల,పీవీ సింధు విజయాల వెనుక తన పాత్ర, కోవిడ్‌కు వ్యాక్సిన్ కనిపెట్టడం వెనుక తన దూరదృష్టీ వగైరాల గురించి పలు సందర్భాల్లో ఆయన నొక్కి వక్కాణించారు. ఇటువంటి వాగాడంబరాన్ని చూసి చాలామంది చాలారకాల అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. ఎటువంటి అనుమానమూ అవసరం లేదు. ఆయన పూర్తి స్వస్థతతోనే ఇలా మాట్లాడుతుంటారు. ఉద్దేశ పూర్వకంగానే ఆయన ఈ హాస్యరసాన్ని పండిస్తుంటారు.ఒక అబద్ధాన్ని వందసార్లు చెబితే నిజమైపోతుందనే గోబెల్స్ సూత్రాన్ని ఆయన తన పొలిటికల్ ఫిలాసఫీకి పునాదిగా భావిస్తారు. తాను వందసార్లు చెబితే వెయ్యిసార్లు రీసౌండ్ ఇచ్చేందుకు యెల్లోమీడియా ఉండనే ఉన్నది. ఈ సూత్రాన్ని ప్రత్యర్థులను అప్రతిష్ఠ పాల్జేయడానికీ, తనను ప్రమోట్ చేసు కోవడానికీ రెండు వైపులా పదునున్న కత్తిలా ఆయన వాడుతుంటారు. ఇప్పుడీ కత్తిని దూయడం బాగా ఎక్కువైంది. తనకి ప్పుడు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న జగన్మోహన్రెడ్డికి లభిస్తున్న అఖండ ప్రజాదరణ ఆయనకు కలవరం కలిగిస్తున్నది. ఇంచుమించు తన రాజకీయ అనుభవంతో సమానమైన వయసున్న జగన్ మాస్ ఇమేజ్ ఎన్ని జన్మలెత్తితే తనకు లభించాలి? లభించదు! అందుకే ఆయనపై దాడి. ఆయన వ్యక్తిత్వంపై కనీవినీ ఎరుగని దాడి. కోడికత్తి, తల్లీ – చెల్లీ, బాబాయ్–గొడ్డలి అనే పసలేని పదబంధాలతో అరిగిపోయిన రికార్డుల్నే ఆశ్రయిస్తూ చేస్తున్న అనైతిక దాడి. మద్య నియంత్రణ కోసం జగన్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఒక మంచి పాలసీకి సైతం అవినీతి మరక అంటించేందుకు ఆపసోపాలు పడుతూ చేస్తున్న అసహ్య కరమైన దాడి.ఏడాది గడిచిపోయింది. జగన్ వ్యక్తిత్వ హననం కోసం ఎక్కుపెట్టిన దాడులు, ఆయన పార్టీ శ్రేణుల్ని చెల్లాచెదురు చేయడానికి పెడుతున్న కేసులు, చేస్తున్న అరెస్టులు ఫలిత మిస్తున్న సూచనలేవీ కనిపించడం లేదు. పైపెచ్చు ఎదురుదాడి మొదలైంది. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేక గళం వీధివీధినా ప్రతిధ్వనిస్తున్నది. ఇక వ్యక్తిత్వ హనన కార్యక్రమమొక్కటే సరిపోదని, ఇంకేదో పెద్ద దాడే జరపాలని భావిస్తున్నట్టు పలు వురు అనుమానిస్తున్నారు. జగన్‌పై ఏదో దారుణమైన కుట్ర జరుగుతున్నదని రాష్ట్ర ప్రజలు బహిరంగంగానే శంకిస్తున్నారు. ఈ అనుమానాలను నిజం చేస్తూ జగన్‌ను ఉద్దేశించి ‘ఆ భూతం తిరిగి రాదు, భూస్థాపితం చేస్తాన’ని ముఖ్యమంత్రి చెబు తున్నారు. టీవీ ఇంటర్వ్యూల్లో చెబుతున్నారు. పెట్టుబడిదారు లతో జరిగే సమావేశాల్లో చెబుతున్నారు. పోలీసు అధికారుల సమావేశాల్లోనూ అదే రాజకీయ ఉపన్యాసం. కలెక్టర్ల మీటింగ్ లోనూ అదే తరహా సంస్కారహీనమైన ప్రసంగం.‘జగన్ మళ్లీ వస్తే ఎలా’ అని పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఎప్పుడు ప్రశ్నించారో తెలియదు. జగన్ హయాంలో పారి పోయిన కంపెనీలేమిటో చెప్పరు. కూటమి వచ్చాక రూపాయికి ఎకరం ఇస్తామంటే తప్ప పరుగెత్తుకొచ్చిన ఇతర కంపెనీలేమిటో చెప్పరు. నిజానికి వాస్తవాలను పరిశీలిస్తే పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నం. కూటమి నేతల కప్పం డిమాండ్లకు బెదిరి‘ఇండియా సిమెంట్స్’ కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. చెట్టినాడు, భవ్య సిమెంట్లు లంచాలివ్వలేక లాకౌట్లు ప్రకటించాయి. నవీన్ జిందాల్‌పై తప్పుడు కేసు పెట్టి వేధిస్తే జెఎస్‌డబ్లు్య కంపెనీ రాష్ట్రాన్ని వదిలేసి మహారాష్ట్రలో 3 లక్షల కోట్లు పెట్టుబడి పెడుతున్నది. మామూళ్ళ కోసం కూటమి నేతలు యూబీ కంపెనీ లారీలను అడ్డుకున్న ఖ్యాతి ఢిల్లీ సర్కార్‌ను కూడా తాకింది. గ్రీన్‌టెక్ రీమిక్స్‌లో, కోకాకోలా ప్లాంట్‌లో స్థానిక ఎమ్మెల్యేలు లంచాలు డిమాండ్ చేసి రచ్చ కెక్కారు. రామాయపట్నం పోర్టు పనుల్లో వాటా కోసం ఎమ్మెల్యే లారీలను అడ్డుకొని గబ్బు లేపాడు. కూటమి పాలనలో ఇటువంటి ఘటనలను డజన్లకొద్దీ ఉదాహరించవచ్చు.ఇక రూపాయికి ఎకరం కోటా పెట్టుబడిదారులను మిన హాయించి కూటమి సర్కార్ తెచ్చిన పెట్టుబడులు ఏమున్నాయి? ఎన్టీపీసీ వాళ్ళు గ్రీన్ ఎనర్జీ కోసం లక్ష కోట్ల పెట్టుబడి పెట్టేందుకు జగన్ హయాంలోనే ఒప్పందం కుదిరింది. దానికి సంబంధించిన పరిపాలనా అనుమతులు, భూ బదలాయింపులు కూడా పూర్తయ్యాయి. ఇప్పుడు దాన్ని చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారు. జగన్ హయాంలో ఒక్క గ్రీన్ ఎనర్జీ రంగంలోనే పది లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరి గాయి. ‘అవి మా ఘనతే’నని ఇప్పుడు కూటమి సర్కార్ ప్రక టించుకుంటున్నది. జగన్మోహన్రెడ్డి దావోస్‌లో ఆదిత్య మిట్టల్‌తో సమావేశమై స్టీల్ ప్లాంట్ స్థాపనకు ఒప్పందం చేసుకుంటే అది కూడా బాబు తన జేబులో వేసుకున్నారు. నిజం చెప్పాలంటే ఏపీలో అమలవుతున్న రెడ్‌బుక్ రాజ్యాంగం పారి శ్రామికవేత్తలను భయకంపితులను చేస్తున్నది. రాష్ట్రానికి రావడా నికి వారు నిరాకరిస్తున్నారు. కాని, జగన్‌కు భయపడి పరిశ్ర మలు వెళ్ళిపోయాయనే తప్పుడు ప్రచారాన్ని మాత్రం కూటమి నేతలు హోరెత్తిస్తున్నారు. యెల్లో మీడియా గగ్గోలు పెడు తున్నది.జగన్‌ను భూస్థాపితం చేస్తానని చంద్రబాబు ఒకటికి రెండు సార్లు అనగానే, ఓ వృద్ధ నేత జగన్ తల నరుకుతానంటూ బీపీ పెంచుకుంటాడు. ఒకరి తర్వాత ఒకరు చొప్పున కూటమి నేతలు ఇటువంటి ప్రకటనలే చేస్తారు. జగన్మోహన్రెడ్డి జనంలోకి వెళ్తున్నప్పుడు ఆయనకు ఇవ్వాల్సిన జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను నిరాకరించడం ద్వారా కూటమి సర్కార్ తన ఉద్దేశాన్ని బయటపెట్టుకుంటున్నది. ఆయనొక విశేష ప్రజా దరణ కలిగిన మాస్ లీడర్. ఆయన బయటకు వెళ్ళినప్పుడు ప్రజలు ఏ స్థాయిలో ఆయన వెంట నడుస్తా రన్నది అనేకమార్లు రుజువైంది. పోలీసులకు ప్రత్యేకంగా చెప్ప వలసిన పని లేదు. రాప్తాడు హెలిప్యాడ్‌ను అసంఖ్యాక జన సమూహం చుట్టుముట్టిన విజువల్స్‌ను టీవీల్లో చూడలేదా? ఆయన రోడ్డు ప్రయాణాల్లో వాహనాన్ని చుట్టుముట్టి కారు బానెట్‌పైకి కూడా ఎగబాకడం కనిపించలేదా? ఆయనకు ఇవ్వాల్సిన భద్రత ఇవ్వకపోతే ఆయనంటే గిట్టని శక్తులు సమూహంలో చొరబడి ఆయన సమీపానికి చేరుకునే అవకాశం లేదా? అటువంటిదేదో జరగాలనే ఉద్దేశం లేకపోతే ఆయన భద్రతను ఎట్లా ఉపేక్షిస్తారు? ఇది కేవలం నిర్లక్ష్యం కాదు, కుట్రపూరిత నిర్లక్ష్యం!ఈ వ్యవహారంపై పోలీసులు చెబుతున్న కహానీ చిత్రంగా ఉన్నది. మేము వందమందికి మాత్రమే అనుమతిచ్చాము, కానీ వాళ్ళు వేలాదిమంది వెళ్లారని పోలీసుల అభియోగం. ప్రజలు వేలాదిగా తరలిరావాలని జగన్మోహన్రెడ్డి గానీ, ఆయన పార్టీ వాళ్ళు గానీ దండోరా వేయలేదే? వార్త తెలిసిన ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. వాళ్ళను అడ్డుకోవడానికి రెంటపాళ్ల చుట్టూ ఇరవై చెక్‌పోస్టులు పెట్టి పోలీసుల్ని మోహరించారు కదా! నియంత్రించగలిగారా? రోడ్డు మీద అడ్డుకుంటే చేలల్లోంచి, చెలకల్లోంచి, వంకల్లోంచి, డొంకల్లోంచి తండోప తండాలుగా జనం చేరుకోలేదా? చెక్‌పోస్టుల్లో మోహరించిన పోలీసు సైన్యాన్ని జగన్ భద్రత కోసం కేటాయిస్తే అవాంఛనీయ సంఘటనలేమీ జరగవు కదా! అవాంఛనీయ ఘటనలు జరగా లన్నదే ప్రభుత్వ ఉద్దేశమైనపుడు, అందుకోసమే కుట్ర చేస్తున్నప్పుడు ఈవిధంగా ఆలోచించడం కూడా కుదరని పని.ఈ కార్యక్రమంలో ఒక వైసీపీ అభిమాని దురదృష్టకర మరణాన్ని కూడా కుట్రపూరిత కథకు ఉపయోగించుకోవడం రోత పుట్టించే చర్య. మరో కారు కింద పడి గాయాలైన సింగయ్య మృతి చెందాడని ప్రకటించిన ఎస్పీ, మూడు రోజుల తర్వాత ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో ప్లేటు మార్చిన వైనాన్ని రాష్ట్ర ప్రజలు గమనించారు. ఒక ఫేక్ వీడియోను సృష్టించి జగన్ ప్రయాణించే కారు కిందనే పడి సింగయ్య మర ణించాడనే కథను ప్రచారం చేశారు. మూడు నాలుగు రోజుల పాటు యెల్లో మీడియా దీనిపై వీరంగం వేసింది. జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమికి ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీ లోకల్ నాయకురాలు మాత్రం కూటమి తానా అంటే తందానా అనే స్థాయికి దిగజారిపోయారు. సింగయ్య మరణంపై ఎస్పీ ముందుగా చెప్పిన ప్రకారం నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్‌కు వర్తించే సెక్షన్లపై కేసులు పెట్టారు. జగన్మోహన్రెడ్డి కారును రంగంలోకి దించిన తర్వాత ఉద్దేశపూర్వకంగానే ప్రమాదం చేసినట్టు సెక్షన్లు మార్చారు. తమ పార్టీ కార్యకర్తను జగన్మోహన్రెడ్డితో పాటు అందులో ఉన్న వాళ్లంతా హత్య చేసే ఉద్దేశంతో కారు ఎక్కించారట! వాహనం ప్రమాదం చేస్తే అందులో ఉన్న ప్రయాణికులు ఎట్లా బాధ్యత వహిస్తారని ఉన్నత న్యాయస్థానమే చీవాట్లు వేయవలసి వచ్చింది. సాక్ష్యాధా రాలతో మళ్ళీ వస్తామని ప్రభుత్వ లాయర్ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. మరి ఏ సాక్ష్యాలున్నాయని కూటమి నేతలు, యెల్లో మీడియా నిపుణులు వీరంగం వేశారో?జగన్ భద్రతపై కూటమి సర్కార్ కపట నాటకమాడు తున్నది. ఒక ఎమ్మెల్యేకు ఇవ్వాల్సిన భద్రతను ఇస్తున్నామని హోంమంత్రి చెబుతున్నారు. జగన్మోహన్రెడ్డి కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమేనా? ఒంటరిగా పోటీలోకి దిగిన ఆయన పార్టీకి నలభై శాతం ఓట్లు వచ్చాయి. మూడు పార్టీల కూటమికి 55 శాతం ఓట్లు పడ్డాయి. అవన్నీ నిజంగానే పడ్డాయని వాదన కోసం ఒప్పుకుందాం. 2024 ఎన్నికలపై పరిశోధన చేసిన వోట్ ఫర్ డెమోక్రసీ (విఎఫ్‌డీ) అనే సంస్థ అనేక అనుమానాలు వ్యక్తం చేసిన సంగతిని వదిలేద్దాం. ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ ముగిసి ఎనిమిది గంటలకు తుది ప్రకటన చేసిన తర్వాత, వారం రోజుల పిదప అనూహ్యంగా పన్నెండున్నర శాతం ఓట్లు పెరిగిన మాయాజాలాన్ని కూడా వదిలేద్దాం. ఈవీఎమ్లలో ఎన్నికలు జరిగితే నూటికి నూరుపాళ్లు ట్యాంపరింగ్ జరిగే అవకాశం ఉన్నదని ఎలాన్ మస్క్ లాంటి వాళ్లు ఎంతోమంది చెబుతున్న విషయాన్ని పక్కనపెడదాం. ఈవీఎమ్‌లతో జరుగుతున్న ఎన్ని కల్లో అక్రమాలు జరుగుతున్నాయనీ, అందుకు సాక్ష్యాలున్నా యనీ అమెరికా ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబార్డ్ చెబుతున్న మాటల్ని కూడా పెడచెవిన పెడదాం. అయినా మూడు పార్టీలకు కలిసి వచ్చిన ఓట్లు 1 కోటీ 53 లక్షలు. జగన్ ఒక్కడికే 1 కోటీ 33 లక్షల ఓట్లు పడ్డాయి. తేడా ఇరవై లక్షలు. వారంరోజుల తర్వాత అనూహ్యంగా పెరిగిన ఓట్లు 49 లక్షలని విఎఫ్‌డీ ప్రకటించింది. అయినా, జగన్ కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమేనా? ఇటు వంటి సాకులతో జగన్ భద్రతను ప్రమాదంలో పడేయాలని ప్రభుత్వం కుట్రలు చేస్తే, ఆయనకు పార్టీ కార్యకర్తలే రక్షణ కవచమవుతారు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
కారు టైరు కింద కూటమి సర్కార్ కుట్రలు, కుతంత్రాలు
-
సింగయ్య మరణంపై కుట్రలు.. ఎల్లో మీడియాకు బిగ్ షాక్
సాక్షి,గుంటూరు: సింగయ్య మరణంపై పుంకాలు పుంకాలుగా ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియా అండ్ గ్యాంగ్‌కు బిగ్ షాక్ తగిలింది. సింగయ్య ప్రమాదం సమయంలో ఏం జరిగిందో తెలిపేలా ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. దీంతో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కూటమి ప్రభుత్వం, ఎల్లో మీడియా చేస్తున్న కుట్రలు మరోసారి బట్టబయలయ్యాయి. వైఎస్ జగన్‌పై కొనసాగుతున్న ప్రజల ఆదరాభిమానాలను చూసి కూటమి ప్రభుత్వం ఓర్వలేకపోతోంది. అందుకే వైఎస్ జగన్‌ను ప్రజల్లో తిరిగే అవకాశం లేకుండా, ఆటంకాలు సృష్టించేందుకు తన ఎల్లో మీడియాతో కలిసి కుట్రకు తెరతీసింది. అందుకు రెంటపాళ్ల వైఎస్ జగన్ పర్యటనను వినియోగించుకుంది కూటమి ప్రభుత్వంలో నేతలు, పోలీసుల వేధింపులు తాళలేక పల్నాడు జిల్లా, సత్తెన పల్లి నియోజకవర్గం రెంటపాళ్ల ఉపసర్పంచ్ నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే, నాగమల్లేశ్వరరావు కుటుంబసభ్యుల్ని పరామర్శించేందుకు జూన్ 18న వైఎస్ జగన్ రెంటపాళ్ల వెళ్లారు. వెళ్లే సమయంలో వైఎస్ జగన్ కాన్వాయ్ ఢీకొని సింగయ్య అనే వ్యక్తి మృతి చెందాడని ఎల్లో మీడియా అబద్ధాలు ప్రచారం చేసింది. కానీ కొద్ది సేపటికే ఎల్లో మీడియా కుట్రలు బయటపడ్డాయి. వైఎస్ జగన్ కాన్వాయ్కి కంటే ముందు వెళ్లిన వాహనం ఢీకొట్టిన తర్వాత సింగయ్య రోడ్డు పక్కన గాయాల పాలవ్వగా.. అప్రమత్తమైన స్థానికులు 108 ఫోన్ చేశారు. 108 వాహనం రావడం, అందులో సింగయ్యను తరలించిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. వీడియో లభ్యం కావడంతో ఎల్లో మీడియా కుట్ర బట్టబయలైంది. వైఎస్ జగన్ వాహనం ఢీకొట్టడంతో సింగయ్య మరణించారంటూ పచ్చ మీడియా విష ప్రచారం చేసిన కొద్ది సేపటికే ఒరిజినల్ వీడియో రావడంతో ఎల్లో గ్యాంగ్ అడ్డంగా దొరికింది. -
సింగయ్య మరణంపై ‘ఎల్లో గ్యాంగ్’ కుట్ర రాజకీయం
సాక్షి, గుంటూరు: సింగయ్య రోడ్డు ప్రమాదంపై టీడీపీ కుట్ర రాజకీయానికి తెర తీసింది. వైఎస్ జగన్‌పై టీడీపీ, ఎల్లో మీడియా దుష్ప్రచారానికి ఒడిగట్టాయి. సింగయ్య మరణాన్ని వివాదం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. వైఎస్ జగన్ వాహనం ఢీ కొనలేదని ప్రమాదం జరిగిన వెంటనే గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ ప్రకటించారు. 18వ తేదీన 1:20 గుంటూరు రేంజ్ ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి, గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ చీలి సింగయ్య మృతిపై మీడియా సమావేశం నిర్వహించారు.ఏటుకూరు ఆంజనేయ స్వామి బొమ్మ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగిందని.. మాజీ సీఎం కాన్వాయ్ వెళ్తున్నప్పుడు దాని ముందున్న అడ్వాన్స్ వెహికల్ ఢీ కొట్టినట్లు చెప్పిన ఎస్పీ.. AP 26 CE 0001 టాటా సఫారీ తగిలినట్లు స్పష్టం చేశారు. అయితే, ఎస్పీ చెప్పిన నాలుగు రోజులు తర్వాత కుట్రకు తెరలేపిన టీడీపీ, ఎల్లో మీడియా.. వైఎస్ జగన్ వ్యక్తిత్వ హననం చేసేలా తప్పుడు ప్రచారం మొదలుపెట్టాయి.సింగయ్య మృతిపై తప్పుడు ఫిర్యాదుకు కుటుంబ సభ్యులపై టీడీపీ నేతలు ఒత్తిడి తీసుకొచ్చారు. సింగయ్య కుటుంబం ఒప్పుకోకపోవడంతో ఎల్లో గ్యాంగ్ తప్పుడు ప్రచారం చేస్తోంది. వైఎస్ జగన్ వాహనం ఢీ కొనలేదని ఎస్పీ సతీష్ అధికారికంగా ప్రకటించారు. అయినా వైఎస్ జగన్‌పై టీడీపీ, ఎల్లో మీడియా బురదచల్లుతోంది. -
సింగయ్య మృతిపై తాము రాసిన నోట్ పై సంతకం చేయాలని పోలీసులు ఒత్తిడి చేశారు
-
సింగయ్య ఘటనపై ఎల్లో మీడియా క్షుద్ర రాజకీయాలు: అంబటి
సాక్షి, గుంటూరు: ఈ రాష్ట్రంలో ఆంధ్రజ్యోతి, ఈనాడు సంస్థలు ప్రజలకు వాస్తవాలను చెప్పడానికి బదులు చంద్రబాబుకు దాసోహమై నిత్యం తన అబద్దపు రాతలతో వైఎస్ జగన్ వ్యక్తిత్వహననమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరు క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వైయస్ జగన్ సత్తెనపల్లి పర్యటనలో దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో సింగయ్య అనే అభిమాని చనిపోతే, ఆ మరణంపై ఏ మాత్రం మానవత్వం లేకుండా ఎల్లో మీడియా క్షుద్రరాతలతో వైఎస్సార్సీపీపై విషం చిమ్ముతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ పర్యటనలకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతో వున్న కూటమి ప్రభుత్వ కుట్రలకు ఎల్లో మీడియా కూడా భాగస్వామిగా మారిందని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే. వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటన సందర్భంగా దురదృష్టవశాత్తు వెంగళాయపాలేనికి చెందిన సింగయ్య అనే వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోగా, సత్తెనపల్లిలో జయవర్ధన్‌రెడ్డి అనే యువకుడు వడదెబ్బ కారణంగా గుండెపోటుకు గురై మృతిచెందారు.మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వాహనం కానీ, ఆయన కాన్వాయ్ వాహనాలు కానీ సింగయ్యను ఢీకొట్టలేదని ఎస్పీ స్వయంగా వెల్లడించారు. కాన్వాయ్కి ముందు వెళ్తున్న కారు ఢీకొట్టడంతో ఆయన ప్రమాదానికి గురైనట్టు ఎస్పీ ధ్రువీకరించారు. దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదాన్ని కూడా రాజకీయం చేయాలని కూటమి ప్రభుత్వం చూస్తోంది. వైఎస్ జగన్ పర్యటన కోసం సింగయ్యతో పాటు మరో 40 మందిని మా పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాలసాని కిరణ్ కుమార్ తీసుకొచ్చినట్టుగా రాసిన స్టేట్మెంట్ మీద సంతకం పెట్టమని సింగయ్య మృతదేహానికి పోస్టుమార్టం సమయంలో ఆయన భార్యను పోలీసులు ఒత్తిడి చేశారు.పోలీసులు రాసి తీసుకొచ్చిన తప్పుడు స్టేట్మెంట్పై ఆ సమయంలో అక్కడే ఉన్న పార్టీ నాయకులమంతా అడ్డం తిరగడంతో పోలీసులు సింగయ్య భార్య, ఆమె బంధువులు ఇచ్చిన స్టేట్మెంట్ రికార్డు చేసుకుని వెళ్లిపోయారు. లేదంటే దీన్ని హత్యకేసుగా చిత్రీకరించి ఎవరో ఒకర్ని ఇరికించాలన్న కుట్ర అప్పుడే జరిగింది.వైఎస్ జగన్‌ని ఇబ్బంది పెట్టాలన్నదే వారి లక్ష్యంరాష్ట్రంలో ఏ మూలన ఏ సంఘటన జరిగినా పోలీసుల కన్నా ముందే ఈనాడు, ఆంధ్రజ్యోతి దర్యాప్తు చేసి రిపోర్టును ప్రింట్ చేస్తున్నాయి. వైఎస్ జగన్ వ్యక్తిత్వ హననమే ఎజెండాగా ఈ రెండు పత్రికలు ఏ చిన్న సంఘటన జరిగినా దానిని చిలువలు వలవులుగా చేసి మా నాయకునికి నేరాన్ని ఆపాదించే కుట్రలు చేస్తున్నారు. సింగయ్య మరణం ప్రమాదవశాత్తు జరిగిందని అందరికీ తెలిసిన సత్యం. చంద్రబాబు పర్యటనల్లోనూ చాలాసార్లు ఇలాంటి సంఘటనలు జరిగాయి. తొక్కిసలాటల్లో కూడా అమాయకులు బలయ్యారు. ఈ వాస్తవాలను పక్కనపెట్టి ఈనాడు, ఆంధ్రజ్యోతి వక్రీకరించి తప్పుడు కథనాలు రాస్తున్నారు.'జగన్ వాహనానికి సింగయ్య బలి', 'సింగయ్యను బలి తీసుకున్న జగన్ వాహనం' అంటూ ఈ రెండు పత్రికలు ప్రమాదాన్ని హత్యగా చూపించాలని క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారు. తన వాహనమే కాదు, ఆయన కళ్లముందు ఏదైనా ప్రమాదం జరిగినా వారిని ఆస్పత్రి చేర్చేవరకు ఆయన ఊరుకోరు. అలాంటిది జగనే స్వయంగా కారేసుకెళ్లి సింగయ్యను గుద్ది చంపాడు అన్నంతలా దుష్ప్రచారం చేస్తున్నారు. ఎవరికో ప్రమాదం జరిగితేనే తట్టుకోలేని జగన్, మా కార్యకర్త సింగయ్య చనిపోతే ఎలా వదిలేస్తారనుకున్నారు? ఆయన కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా నిలిచింది. ఇప్పటికే వారి కుటుంబాన్ని పరామర్శించి రూ. 10 లక్షల చెక్కును పార్టీ తరఫున వారి కుటుంబానికి అందజేయడం కూడా జరిగింది.చనిపోయిన వ్యక్తుల గురించి నీచంగా రాస్తున్నారువైయస్ జగన్ పర్యటన విజయవంతం కావడంతో ఓర్వలేక క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారు. వైఎస్ జగన్ ఎప్పటికీ బయటకు రావొద్దనే లక్ష్యంతో ప్రభుత్వం తప్పుడు కథనాలు రాయించి, తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సత్తెనపల్లి పర్యటన విజయవంతం కావడంతో దాని మీద ఇప్పటికే మా నాయకులు గజ్జల సుధీర్ భార్గవ్‌రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద కేసులు పెట్టారు. నాకు కూడా నిన్న రాత్రి నోటీసులు ఇచ్చి వెళ్లారు. చంద్రబాబుని జైల్లో పెట్టామనే కక్షతో ఇప్పుడు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులందర్నీ లోకేష్ జైళ్లకు పంపుతున్నాడు. ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కోవడానికి మేం సిద్ధంగా ఉన్నాం. వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు. -
చంద్రబాబు సమర్పించు.. ‘రప్పా రప్పా’ డైవర్షన్
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ రెండు గంటల తన సుదీర్ఘ మీడియా సమావేశంలో సంధించిన ప్రశ్నల్లో ఏ ఒక్క దానికి సమాధానం చెప్పే ధైర్యం లేని చంద్రబాబు తనకు అలవాటైన రీతిలో డైవర్షన్ రాజకీయానికి తెరలేపారు. రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తి చంద్రబాబు చేతిలో మోసపోయారని జననేత వైఎస్ జగన్ చెబుతూ శాంతిభద్రతల వైఫల్యం, ఏడాదిలోనే రాష్ట్రం అప్పులపాలైన పరిస్థితి, సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకపోవడం, తాను అమలు చేసిన పథకాలను కూడా నిలిపివేయడం, ఇసుక మాఫియా, అవినీతి, మద్యం... వంటి అనేక అంశాలపై సూటిగా ప్రశ్నలు సంధించారు.దానికి కౌంటర్‌గా చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించినా.. జగన్ అడిగిన ఒక్క ప్రశ్నకూ సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం ఆయనలో కనిపించలేదు. అందుకే ఎప్పుడూ చేసే మాదిరిగానే టాపిక్ డైవర్షన్ గేమ్ మొదలుపెట్టారు. నిజానికి గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఒక విలేకరి.. టీడీపీ కార్యకర్త ‘రప్పా రప్పా’ డైలాగు రాసి ప్లకార్డు పట్టుకున్న విషయాన్ని ప్రస్తావించగా.. జగన్ దానిపై స్పందిస్తూ అసలు ఆ ప్లకార్డులో ఏం రాసి ఉందో తనను ప్రశ్నించిన విలేకరులనే అడిగారు. ‘అది సినిమా డైలాగ్ కదా?’ అని మాట్లాడితే జగనే ‘రప్పా రప్పా నరికేస్తా’ అన్నట్లు ప్రచారం మొదలుపెట్టారు. దీనిపై ఐ–టీడీపీ ఒక ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసింది. జగన్ ప్రశ్నించిన అంశాల్లో ఒక్క దానిపైనా మాట్లాడని చంద్రబాబు రప్పా రప్పా డైలాగు గురించే మాట్లాడి టాపిక్ డైవర్షన్ మొదలుపెట్టడం గమనార్హం.దేశం కార్యకర్త నుంచే వ్యతిరేకత వాస్తవానికి జగన్ పల్నాడు జిల్లా పర్యటనలో టీడీపీ కార్యకర్త రవితేజ ‘రప్పా రప్పా’ అనే పుష్ప సినిమా డైలాగు రాసిన ఒక ప్లకార్డును పట్టుకున్నాడు. చంద్రబాబు పాలనలో మోసపోయానని కడుపుమండి ఒక టీడీపీ కార్యకర్త వైఎస్సార్సీపీ ర్యాలీలోకి వచ్చి అలా ప్లకార్డు పట్టుకున్నాడంటే చంద్రబాబు సిగ్గుపడాలి. కానీ వక్రీకరణలో ఆరితేరిన చంద్రబాబు ఆ విషయాన్ని నిస్సిగ్గుగా వక్రీకరించేశారు. ఆ వాదనకు మద్దతుగా ఎల్లో మీడియా, ఆయన సోషల్ మీడియా, పవన్ కళ్యాణ్, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, పయ్యావుల కేశవ్ వంటి కొన్ని పాత్రలను రంగంలోకి దింపారు. ఏడాదిలో ప్రజలకు ఏం చేశారో చెప్పుకోలేక, జగన్ అడిగిన వాటికి సమాధానం చెప్పలేక ఇలాంటి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నట్లు అర్థమవుతోంది. వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు ఫేక్ ప్రచారాలు చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్‌లు, 143 హామీల అమలు వైఫల్యం గురించి, ఏడాదిలోనే రూ.1.60 లక్షల కోట్లకు దాటిపోయిన అప్పుల గురించి, రెడ్‌బుక్ రాజ్యాంగం ప్రకారం వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై పెడుతున్న తప్పుడు కేసులు.. చేస్తున్న దాడులు, దౌర్జన్యాల గురించి.. అనేక ప్రజా సమస్యల గురించి వైఎస్ జగన్ ప్రశి్నస్తే వాటిపై స్పందించకుండా కేవలం ఆయన అనని మాటలను వక్రీకరిస్తూ విష ప్రచారానికి దిగడాన్ని బట్టి వారికి చెప్పుకోవడానికి ఏమీ లేదని స్పష్టమైంది.అమరావతి పేరుతో అవినీతి, ఇసుక, మద్యం దోపిడీ, ఎమ్మెల్యేల అవినీతితోపాటు మొత్తంగా చంద్రబాబు పాలనపై ఏడాదిలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు తాజా ఘటనలతో స్పష్టమవుతోంది. మరోవైపు జగన్మోహన్రెడ్డి పర్యటనలకు తరలివస్తున్న జనాన్ని చూసి కళ్లల్లో విషం నింపుకున్న కూటమి నేతలు తమకు అలవాటైన రీతిలో డైవర్షన్ రాజకీయానికి మరింత పదునుపెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ తమకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని రాష్ట్రంలోని ప్రతి ఇంట్లోనూ, ప్రతి వ్యక్తి చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించే పరిస్థితి వస్తుందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. జగన్‌ను భూస్థాపితం చేస్తానని ఇటీవలే నోరుపారేసుకున్న చంద్రబాబు ‘డైలాగులు సినిమాలకే సరిపోతాయంటూ’ చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారం పవన్ కళ్యాణ్ షూటింగ్‌ల బిజీలోనూ స్పందించారు. వాస్తవానికి ఎన్నికలకు ముందు ‘కొడకల్లారా.. తోలు తీస్తాం.. తొక్క తీస్తాం’ అంటూ వైఎస్సార్సీపీ నేతలపై ఇష్టం వచ్చినట్లు నోరుపారేసుకుంటూ పూనకం వచ్చినట్లు మాట్లాడింది ఆయనే. అంతెందుకు ఇటీవలే ఎంపిక చేసిన మీడియా ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు.. జగన్‌ను భూస్థాపితం చేస్తానని అన్నారు. సీఎం స్థాయిలో 70 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తి.. ఒక మాజీ సీఎంను, ప్రతిపక్ష నేతను ఆ మాట అనడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దీన్ని చంద్రబాబు ఎలా సమర్ధించుకుంటారు? ఎన్నికలకు ముందు అంగళ్లు సభలో చంద్రబాబు స్వయంగా అల్లర్లు సృష్టించి పోలీసులపై దాడులు చేయించారు.ఈ దాడిలో రణ«దీర్ అనే కానిస్టేబుల్‌పై దాడి చేసి కన్ను పోగొట్టారు. జగన్‌ను గాజుగ్లాసుతో పొడవండి.. రాళ్లతో కొట్టండి.. సీసం పోసి చంపండి అని రెచ్చిపోయి మాట్లాడింది చంద్రబాబే. ఇప్పుడు హోం మంత్రిగా ఉన్న అనిత అప్పట్లో జగన్‌పై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం స్పీకర్‌గా ఉన్న అయ్యన్నపాత్రుడు జగన్‌ను భౌతికంగా లేకుండా చేయాలని అన్న వీడియో బయటకు వచ్చింది.అంత బరితెగించి మాట్లాడిన వారికి ఏం శిక్ష పడాలి? ఇప్పుడు కూడా డైవర్షన్ రాజకీయాలు చేస్తూ, అందులో భాగంగా జగన్ తల నరికేయవచ్చు కదా? అసలు ఆయనకు జీవించే హక్కు ఉందా? అని టీడీసీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరితో చంద్రబాబు తన కడుపులోని విషాన్నంతా కక్కించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, అన్యాయాలు, నిర్భంధాలు, నోరెత్తితే అక్రమ కేసులు పెట్టి జైళ్ల పాలు చేస్తున్న వైనంపై జగన్ మాట్లాడితే బుచ్చయ్యచౌదరి దాన్ని వక్రీకరించి నక్సలైట్లను తయారు చేస్తావా? అంటూ తన నోటికి అడ్డూఅదుపూ లేదని నిరూపించారు. -
తెలుగుదేశం పార్టీ నాయకుల దొంగ నాటకాలు బట్టబయలు
-
ఇదేంది‘రప్పా’..! అడ్డంగా దొరికిపోయిన టీడీపీ
సాక్షి, నరసరావుపేట: అధికారపార్టీ అడ్డంగా బుక్కయింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెంటపాళ్ల పర్యటనలో భాగంగా వైఎస్సార్సీపీ అభిమానులు ప్రదర్శించిన ఫ్లెక్సీలపై కూటమి నేతలు, వారి అనుకూల మీడియా రెండు రోజులుగా నానాయాగీ చేశారు. ‘‘సైకోలు వీరంగం చేశారు, నరకుడు భాష ఏంటి’’ అటూ పచ్చ పత్రికల్లో వార్తలు రాయడంతోపాటు టీవీ చానళ్లలో డిబేట్లు నిర్వహించారు.వైఎస్సార్సీపీ అభిమానులకు వ్యతిరేకంగా విష ప్రచారం చేశారు. కూటమి మంత్రులు, ప్రజాప్రతినిధులు గగ్గోలు పెట్టారు. పుష్ప సినిమాలోని రప్పా.. రప్పా.. పోస్టర్ ప్రదర్శించిన బొల్లెద్దు రవితేజపై టీడీపీ మైనార్టీ సెల్ సత్తెనపల్లి టౌన్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలి చేత పోలీసులకు ఫిర్యాదు చేయించారు. పోలీసులూ తక్షణం కేసు నమోదు చేశారు. తీరా చూస్తే రవితేజ టీడీపీ వాడేనని తేలిపోయింది. దీంతో అధికారపార్టీ అడ్డంగా దొరికిపోయింది. బయటపడిన అసలు నిజాలు పోలీసులు పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండలం 88 తాళ్లూరు గ్రామానికి చెందిన బొల్లెద్దు రవితేజను బుధవారం రాత్రి అదుపులోకి తీసుకోవడంతో అసలు విషయం బయటపడింది. రవితేజ కుటుంబ సభ్యులు తాము టీడీపీ అభిమానులమని తమకు వైఎస్సార్సీపీతో సంబంధం లేదని తెలిపారు. సార్వత్రిక ఎన్నికలకు ముందే పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ చేతుల మీదుగా పచ్చ కండువా కప్పుకుని టీడీపీలో చేరామని ఫొటోలు చూపారు. బొల్లెద్దు రవితేజపై ఉన్న టీడీపీ సభ్యత్వ కార్డు రవితేజ పేరు మీద ఉన్న టీడీపీ సభ్యత్వ కార్డునూ వారే బయటపెట్టారు. దీంతో టీడీపీ నేతలు, సోషల్‌మీడియా కార్యకర్తలు ఒక్కసారిగా కంగుతిన్నారు. టీడీపీ సభ్యత్వం ఉండి వైఎస్సార్సీపీ కార్యక్రమంలో ఎందుకు పాల్గొన్నాడని, ఏ ఉద్దేశంతో హాజరయ్యాడు? రవితేజ వెనుక ఎవరున్నారంటూ సోషల్‌మీడియాలో వైఎస్సార్సీపీ అభిమానులు ప్రశ్నల వర్షం కురిపించారు. రవితేజ టీడీపీ కోవర్టేనని, వైఎస్ జగన్ పర్యటనలో ఆలజడులు సృష్టించడానికే టీడీపీ నేతలు అతనిని పంపి కుట్రలు పన్నారని వైఎస్సార్సీపీ నేతలు ధ్వజమెత్తారు. టీడీపీ నేతల కొత్త రాగం వైఎస్సార్సీపీ అభిమానులపై టీడీపీ చేసిన దు్రష్పచారం బూమరాంగ్ కావడంతో ఆ పార్టీ నేతలు కొత్త రాగం మొదలుపెట్టారు. రవితేజ తల్లిదండ్రులు టీడీపీ వారేనని, కానీ రవితేజ మాత్రం వైఎస్సార్సీపీ అభిమాని అంటూ బుకాయిస్తున్నారు. బీమా ఉందని టీడీపీ సభ్యత్వం తీసుకున్నాడంటూ పెదకూరపాడు నేతలతో వీడియోలు విడుదల చేయించారు. దీనికి సోషల్ మీడియా యాక్టివిస్టులు గట్టి సమాధానాలు ఇచ్చారు. కోట్ల మంది టీడీపీ సభ్యత్వం తీసుకున్నారంటూ మహానాడులో చేసే ప్రసంగాలన్నీ వట్టివేనా అంటూ ప్రశి్నంచారు. జీవిత బీమా ఉంటుందని ఆశచూపి ఇతర పార్టీల నేతలకూ సభ్యత్వాలు అంటగడుతూ గొప్పలు చెప్పుకుంటున్నారా అంటూ ఎద్దేవా చేశారు. -
ఎల్లో మీడియా, బాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు
-
చెప్పేవి నీతులు చూపించేవి బూతులు.. ఇదీ పచ్చ మీడియా బండారం
-
ఎల్లో మీడియా విష ప్రచారం చూసి అవాక్కవుతున్న జనం
-
నిజం దాచి ఎల్లో మీడియా విష ప్రచారం.. అసలు జరిగింది ఇదే..
సాక్షి, పల్నాడు: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనపై ఎల్లో మీడియా విషం కక్కుతోంది. ప్రజాదరణ చూసి ఓర్వలేక పచ్చి అబద్దాలను పచ్చ కూటమి వల్లె వేస్తోంది. సత్తెనపల్లిలో తొక్కిసలాట జరిగి ఒకరు మృతి చెందినట్టు ఎల్లోమీడియా తప్పుడు కథనాలు ప్రసారం చేస్తోంది. ఎల్లో మీడియా విష ప్రచారం చూసి జనం అవాక్కవుతున్నారు.నిజానికి జయవర్ధన్ రెడ్డి అస్వస్థతతో మృతి చెందారు. ర్యాలీ పాల్గొన్న సమయంలో ఆయన అలసటకు గురయ్యారు. అలసటతో ఒక షాపు ఎదుటకు వెళ్లి కూర్చున్న సీసీ కెమెరా విజువల్స్ లభ్యమయ్యాయి. కొద్దిసేపటి తర్వాత వెళ్లేందుకు లేచిన జయవర్ధన్ కుప్పకూలారు. వెంటనే స్థానికులు బైకు మీద ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జయవర్ధన్ మృతి చెందారు. దీనిపై కూడా ఎల్లో బ్యాచ్ విష ప్రచారం చేస్తోంది. -
పేర్నినానికి అరెస్టు వారెంట్ జారీ అంటూ తప్పుడు ప్రచారం..
సాక్షి,కృష్ణాజిల్లా: మాజీ మంత్రి పేర్ని నానిపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారానికి దిగింది. 2019 నాటి కేసులో పేర్నినానికి మచిలీపట్నం కోర్టు ఆరెస్ట్ వారెంట్ జారీ చేసిందంటూ చిలవలు పలవలుగా అల్లిన కథనాలతో ఊదరగొట్టాయి. కానీ కొద్ది సేపటికే ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని తేటతెల్లమైంది. ఓ కేసులో సాక్షిగా విచారణకు హాజరు కావాల్సిన పేర్నినానిని..మరుసటి వాయిదాకు హాజరవ్వాలని కోర్టు నోటీసులు జారీ చేసింది. నోటీసుల్లో ఏముందో చూడకుండా అరెస్ట్ వారెంట్ అంటూ తప్పుడు ప్రచారం చేయడంపై ఎల్లోమీడియాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
కృష్ణంరాజు వ్యాఖ్యలు ఎవరూ సమర్ధించరు.. మురికి వార్తలతో రెచ్చిపోతున్న ఎల్లో మీడియా
-
అరెస్ట్ అంటూ ఎల్లో మీడియాలో పిచ్చి వార్తలు ఇచ్చిపడేసిన పేర్ని నాని
-
మహిళల రక్షణ గురించి వీళ్లా మాట్లాడేది
-
కొమ్మినేని అరెస్ట్ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగం: అంబటి రాంబాబు
-
కృష్ణంరాజు కామెంట్స్ కు నేను క్షమాపణ చెప్పా.. KSR
-
సారీ చెప్పినా.. వినరా.. జరిగేది జరుగుద్ది.. తెగేసి చెప్పిన KSR
-
సాక్షి మీడియాపై కావాలనే ఎల్లో మీడియా విష ప్రచారం..
-
మహానాడు ‘ఆత్మ’కథ!
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ను ఉపయోగించుకొని చనిపోయిన వారి ఆత్మలను ఆవాహన చేయొచ్చన్న మాట. తెలుగుదేశం పార్టీ మహానాడును చూసిన తరువాత ఈ సంగతి తెలిసి వచ్చింది. ఆవాహన చేసుకున్న ఆత్మలతో మన పుర్రెకు తోచిన విధంగా మాట్లాడించవచ్చు. చరిత్రను చెరిపేయవచ్చు. వక్రీక రించవచ్చు. నిజాలపై నీళ్లు చల్లవచ్చు. అసత్యాలకు ఆజ్యం పోయవచ్చు. మన మేధోజనిత స్క్రిప్టును చనిపోయిన వారి ఆత్మలతో చదివించవచ్చు. కొత్త పుంతలు తొక్కిన ఈ టెక్నాలజీ వాడకాన్ని చూసిన తర్వాత వింత వింత అనుమానాలు కలుగు తున్నాయి. ముందు ముందు మహాత్ముడి ఆత్మను ఆవాహన చేయించి గాడ్సేకు కితాబునిప్పించే రోజులు కూడా వస్తాయేమో! గాడ్సే భక్తులు పుట్టుకొస్తున్న కాలం కదా ఇది.మహానాడు వేదికపై స్క్రీన్ మీద కనిపించిన ఎన్టీఆర్ బొమ్మ విచిత్రంగా మాట్లాడుతుంది. తెలుగుదేశం పార్టీ ఆశయాలను తన తర్వాత చంద్రబాబు గొప్పగా కొనసాగిస్తున్నారట! హైదరా బాదుకు తాను సాంస్కృతిక వారథిగా నిలబడితే, చంద్రబాబు సాంకేతిక వారథిగా నిలిచిపోయారట! రెండు రూపాయలకు కిలో బియ్యంతో తాను పేదవారి కడుపు నింపితే, ‘పి–4’ పథకం తెచ్చి పేదరికాన్ని పారద్రోలేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారట! ఎన్టీఆర్ బొమ్మలోని కృత్రిమ ఆత్మ పలికిన పలుకులే ఇవి. ఎన్టీఆర్‌కు వారసుడు ఎవరో కూడా ఆత్మ తేల్చే సింది. తన వారసత్వానికి వన్నె తెస్తున్న లోకేష్‌ను ‘భళా మన వడా’ అని కూడా ఏఐ ఆత్మ ఆశీర్వదించింది.ఎన్టీఆర్ జీవించి ఉన్న రోజుల్లో ఒకసారి తన వారసునిగా బాలకృష్ణ పేరును ఆయన ప్రకటించిన సంగతి అప్పటి వారికి గుర్తుండే ఉంటుంది. మహానాడులో ఎన్టీఆర్ ఆత్మ ప్లేట్ మారు స్తుందని బాలయ్యకు ముందే తెలుసా? అందుకే ఈ కార్య క్రమానికి డుమ్మా కొట్టారా? మహానాడు కంటే అతి ముఖ్యమైన మరో కార్యంలో లగ్నమై ఉన్నందువల్ల కూడా రాకపోయి ఉండవచ్చు. ఒక్క బాలయ్యే కాదు... నందమూరి వంశాంకురాలేవీ ఈ జాతరలో కనిపించలేదని మీడియా రిపోర్టులు వెల్లడి స్తున్నాయి. ఈ మహానాడులో నారా వారసుడే చక్రం తిప్పు తారని అందరూ ఊహించిందే. కాకపోతే పార్టీని శాసించే స్థాయి తనదేనని ఆయనే స్వయంగా ప్రకటించుకుంటారని ఎవరూ ఊహించలేదు.పార్టీ కోసం లోకేష్ ఆరు శాసనాలను ప్రకటించారు. శాసనమంటే అందరూ శిరసా వహించవలసిందే కదా! ఆరు శాసనాల పేర్లు కూడా విచిత్రంగా ఉన్నాయి. సామాన్య కార్యకర్తలు ఆ పేర్ల భావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రత్యేకంగా ఒక ఎల్లో బుక్కును అచ్చేయవలసిన అవసరం రావచ్చు. సరిగ్గా 30 ఏళ్ళ కింద ఎన్టీఆర్‌కు చంద్రబాబు బృందం వెన్నుపోటు పొడిచి పార్టీని, ప్రభుత్వాన్ని లాగేసుకున్న సంగతి జగమెరిగిన చరిత్ర. మూడు దశాబ్దాల తర్వాత ఇప్పుడు ఆయన ఆత్మకు సైతం బాబు పార్టీ వెన్నుపోటు పొడవడం విస్మయానికి గురి చేస్తు న్నది. మరణానికి ముందు వివిధ ఇంటర్వ్యూలలో, ప్రెస్ మీట్ లలో చంద్రబాబు గురించి ఎన్టీఆర్ ఏమని మాట్లాడారో తెలి యని వారెవరు?తండ్రిని కారాగారంలో బంధించి, సోదరులను హతమార్చి సింహాసనాన్ని హస్తగతం చేసుకున్న ఔరంగజేబుతో చంద్ర బాబును ఎన్టీఆర్ పోల్చారు. తన దగ్గర వినయం నటిస్తూనే పథకం ప్రకారం గోతులు తవ్విన నమ్మకద్రోహిగా నిందించారు. చరిత్ర హీనుడు అతగాడని ధ్వజమెత్తారు. చంద్రబాబుపై ఎన్టీఆర్ చేసిన విమర్శలకు సంబంధించిన వీడియోలు ఇప్పటికీ అందుబాటులోనే ఉన్నాయి. అంతలోనే ఆయన ఆత్మ (అటువంటివి ఉంటాయని నమ్మితే) యూ–టర్న్ తీసుకున్నట్టు ఎలా చిత్రించగలిగారు? జాతీయస్థాయిలో ఎన్డీఏ కూటమికి పెద్దన్నగా ఉన్న పార్టీ వెయ్యేళ్ల భారత చరిత్రను తిరగరాసే పనిలో ఉన్నది. అదే స్ఫూర్తితో ఈ ముప్ఫయ్యేళ్ల ఆంధ్ర చరిత్రను బాబు కూటమి తిరగరాయాలని భావిస్తున్నదా? గూగుల్‌లో వెన్నుపోటు అనే అక్షరాలు టైప్ చేస్తే చంద్రబాబు బొమ్మ కనిపించని రోజు రావాలని ప్రయత్నిస్తున్నదా? ఒక అబద్ధాన్ని వందసార్లు చెబితే అది నిజమైపోతుందనే గోబెల్స్ సూత్రాన్ని గడచిన 30 ఏళ్లుగా చంద్రబాబు పార్టీ, ఎల్లో మీడియా బాగా ఒంట పట్టించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటినుంచే ప్రయత్నం చేస్తే ఇంకో పదేళ్లకో, ఇరవై ఏళ్లకో వెన్నుపోటు కథను బుట్టదాఖలు చేయవచ్చనే విశ్వాసంతో ఉన్నట్టు కనిపిస్తున్నది. అటువంటిదేమీ జరగలేదని, ఎన్టీఆర్ ప్రోద్బలంతోనే, ఆయన ఆశీర్వాదంతోనే చంద్రబాబు ఈ పవిత్ర కార్యాన్ని నెరవేర్చారని చెప్పే కొత్త పరిశోధనలు కూడా ఎల్లో మీడియా వెలువరించవచ్చు. అందుకు ఈ మహానాడులో నాంది పలికారనుకోవాలి.ఒక పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంలో జరుగుతున్న పార్టీ మహాసభల మీద ప్రజలకు కొంత ఆసక్తి ఉంటుంది. ఎన్నికల హామీల అమలుపై సమీక్ష ఉంటుందని, అమలు చేయలేకపోయిన అంశాలపై వివరణ ఉంటుందని, పరిపాలనా తీరుతెన్నులపై ఆడిట్ ఉంటుందని ఆశిస్తారు. విచిత్రంగా ఈ మహానాడులో ఇవేమీ జరగలేదు. ప్రతిపక్ష నాయకుడైన జగన్ మోహన్ రెడ్డిని తిట్టిపోయడమనేది ప్రతి వక్త ప్రసంగంలోనూ తప్పనిసరి అంశంగా నిర్ధారించినట్టున్నారు. అధి నేతల దగ్గర మార్కులు కొట్టేయడానికి వక్తలందరూ దాన్ని తూచా తప్పకుండా పాటించారు.మహానాడు తేదీలకు ముందే తెనాలిలో జరిగిన దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. దళిత యువకులను బహిరంగంగా నడిరోడ్డుపై పడుకోబెట్టి వారి కాళ్లు కదలకుండా ఒక పోలీసు తొక్కిపట్టి మరో పోలీసు అధికారి వారి అరికాళ్ళ మీద లాఠీతో బాదుతున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. బాధతో ఆ యువకులు చేస్తున్న ఆర్తనాదాలు హృదయ విదారకంగా ఉన్నాయి. ఈ అమానుష ఘటన మహానాడులో చర్చకు వచ్చి ఉండాలి. హోం మంత్రి సంజాయిషీ ఇచ్చి ఉండాలి. అటువంటి దేమీ లేకపోగా జరిగిన సంఘటనను పోలీసు ఉన్నతాధికారులు నిస్సిగ్గుగా సమర్థించుకుంటున్నారు.మహానాడు సమయంలోనే టెన్త్ క్లాస్ పరీక్ష పత్రాల రీవాల్యుయేషన్ బాగోతం బయటపడింది. పరీక్ష పత్రాల మూల్యాంకనం ఒక ప్రణాళిక, పద్ధతి లేకుండా ఇష్టారాజ్యంగా జరిగి, ఆరు లక్షల కుటుంబాల్లో ఆవేదన నింపింది. ఫలితంగా ఎన్నడూ లేనంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు రీవాల్యుయేషన్‌కు దరఖాస్తులు పెట్టుకున్నారు. పదకొండు వేల పరీక్షా పత్రాల మార్కుల లెక్కింపులో పొరపాట్లు జరిగినట్టు వెల్లడైంది. ఆ పొరపాటు ఒకటి రెండు మార్కులు కాదు. కొన్ని పేపర్లలో యాభై మార్కుల వరకు తేడాలొచ్చాయి. కొన్ని సమాధానాలకు మార్కులే వేయని వైనం కూడా బయటపడింది. ఇది అసా ధారణం. రికార్డు సమయంలో ఫలితాలు వెల్లడించాలన్న దుగ్ధతో టీచర్ల మెడ మీద కత్తి పెట్టినందువల్లనే ఇలా జరిగిందని అనుభవజ్ఞులు చెబుతున్నారు.జగన్ మోహన్ రెడ్డి అపురూపంగా చూసుకున్న విద్యా వ్యవస్థను ఒక్క ఏడాదిలోనే నేలకేసి కొట్టిన ఈ నిర్లక్ష్యంపై సర్వత్రా అసహనం వ్యక్తమవుతున్నది. దీనిపై మహానాడులో చర్చ జరిగి ఉండాలని జనం కోరుకుంటారు. విద్యామంత్రి వివరణ ఇస్తారని ఆశిస్తారు. కానీ ఆయన వివరణ ఇవ్వలేదు. హాజరైన ప్రతినిధులు అడిగే సాహసం చేయలేదు. ఈ రెండు అంశాలే కాదు, పాలనాపరమైన ఏ అంశం పైనా చర్చ జరగ లేదు. నిర్వాహకులు రాసిచ్చిన తీర్మానం కాపీని చదవటమే నాయకులు చేసిన పని. ఎన్నికలకు ముందు ఇబ్బడిముబ్బడిగా చేసిన వాగ్దానాల గురించి గానీ, అందులో ముఖ్యమైన ‘సూపర్ సిక్స్’ గురించి గానీ ఏ చర్చా లేదు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పి నట్టున్నారు. 15 నెలల అధికారం కరిగిపోయిన తర్వాత అమలు చేస్తారట! త్వరలో ‘తల్లికి వందనం’ ఇస్తామని చెబుతున్నారు. 80 లక్షల మంది విద్యార్థులకు ఇవ్వాల్సిన గత సంవత్సరపు బకాయి గురించి మాత్రం మాట్లాడటం లేదు. ‘అన్నదాతా సుఖీభవ’, ‘నిరుద్యోగ భృతి’, ‘ఆడబిడ్డ నిధి’ వంటి కీలకమైన హామీల సంగతి మాట మాత్రంగానైనా మహానాడులో ప్రస్తావనకు రాలేదు.మరి మహానాడులో ఏం మాట్లాడారు? తండ్రి–కొడుకుల భజన, ప్రతిపక్ష నేతపై దూషణ... ఈ రెండూ కంపల్సరీ సబ్జెక్టులుగా కనిపించాయి. వీటితో పాటు అసత్య వాణి, మోసపూరిత వైఖరి, వంచనా శిల్పం, అధికార దాహం అనే నాలుగు అంశాలు మహానాడులో అంతర్లీనంగా ప్రవహించాయి. చరిత్రను వక్రీకరించే విధంగా కృత్రిమ మేధ సాయంతో ఎన్టీఆర్ ’ఆత్మ’ పేరుతో చెప్పించిన మాటల దగ్గర నుంచి మూడు రోజులపాటు జరిగిన అన్ని ఉపన్యాసాల్లో అసత్యాలు, అర్ధసత్యాలు కోకొల్లలుగా కనిపిస్తాయి. ఎన్టీఆర్ పట్ల ప్రకటించిన భక్తి, వినయం అన్నీ బూటకమేనని, మోసపూరితమైనవని సభ జరిగిన తీరే తేటతెల్లం చేసింది.ఎన్టీ రామారావుకు భారతరత్న పురస్కారం దక్కాలన్న కోరిక తెలుగుదేశం శ్రేణులతో పాటు తెలుగు ప్రజల్లో చాలామందికి ఎప్పటినుంచో ఉన్నది. ఆ కోరిక మేరకు కనీసం కంటి తుడుపుగా ఒక తీర్మానాన్ని కూడా మహానాడు ఆమోదించలేదు. నిజానికి ఆ పురస్కారం కోసం కేంద్రంపై ఒత్తిడి తేగల స్థితిలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్నది. ఆ పార్టీ మద్దతుపైనే కేంద్ర సర్కార్ ఆధారపడి ఉన్నది. అయినా చంద్రబాబు ఆ డిమాండ్ చేయరు. గతంలో వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు తాను చక్రం తిప్పానని చంద్రబాబు పలుమార్లు చెప్పుకున్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న కావాలనే డిమాండ్ మాత్రం ఆయన ఎప్పుడూ చేయలేదు. ఇప్పుడు కూడా చేయబోరని మహానాడు మరోసారి నిరూపించింది. ఈ మహానాడులో నందమూరి వంశస్థులు ఎవరూ కనిపించలేదని చెబుతున్నారు. బహుశా వచ్చే మహానాడులో నందమూరి తారక రామారావు బొమ్మ కూడా అదృశ్యం కావచ్చు.వంచనా శిల్పం కూడా అడుగడుగునా కనిపించింది. ఎన్నికలకు ముందు చేసిన ‘సూపర్ సిక్స్’ను పక్కన పెట్టి యువనేత శాసన ‘సిక్స్’ను ప్రవేశపెట్టారు. ఈ శాసనాలకు రూపకర్తలు ఎవరో చెప్పలేదు గనుక వాటి గురించి ప్రసంగించిన ఆయననే ఏకసభ్య శాసనసభగా పరిగణించాలి. అందులో 1) తెలుగు జాతి విశ్వఖ్యాతి, 2) యువగళం, 3) స్త్రీ శక్తి,4) పేదల సేవలో సోషల్ రీ ఇంజనీరింగ్, 5) అన్నదాతకు అండగా, 6) కార్యకర్తే అధినేత. ఈ పదబంధాల అర్థతాత్పర్యాలను ఏలినవారు ప్రత్యేకంగా విడుదల చేసిన తర్వాతే వీటి గుణ దోషాల గురించి మాట్లాడగలుగుతాము. మహానాడులో కనిపించిన మరో అంశం అంతులేని అధికార దాహం. స్వయంగా పార్టీ అధ్యక్షుడైన ముఖ్యమంత్రి తరతరాలు తమ కుటుంబమే పరిపాలించాలన్న కోరికను ఎటువంటి శషభిషలు లేకుండా కుండబద్దలు కొట్టి చెప్పారు. ఒకసారి గెలిపించటం మరోసారి ఓడించడం వంటి వైకుంఠపాళీ వద్దని, ఎప్పటికీ తమనే గెలిపించినట్లయితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, లేదంటే లేదని ఆయన మనోగతాన్ని బయటపెట్టారు. ఇదీ తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్య స్ఫూర్తి!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ఏడాది పాలన పొట్ట విప్పి చూడ..!
చంద్రబాబు అనే నాలుగు అక్షరాలకు అర్థమూ, తాత్పర్యమూ, నిర్వచనమూ అన్నీ కూడా అభివృద్ధేనని యెల్లో మీడియా మనకు ఎప్పటి నుంచో నేర్పిస్తున్నది. ముప్పయ్యేళ్ల లోపు వయసున్న తరానికైతే దొండాకు పసరు నాడే ఈ వసను కూడా కలిపి తాగించారు. అటువంటి రెండు కాళ్ల మీద నడిచే అభివృద్ధి నాలుగోసారి కుర్చీ ఎక్కి సంవత్సరకాలం పూర్తవు తున్నది. ఈ ఏడాది కాలంలో విరగబూసిన అభివృద్ధిని కళ్లారా వీక్షించాలన్న కోరిక ఎవరికి మాత్రం ఉండదు? ఆ వీక్షణ కోసం కొన్ని ‘వ్యూ పాయింట్స్’ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి.హిందూపూర్ రైల్వే స్టేషన్ కూడా ఒక వ్యూ పాయింట్.హిందూపూరంటే చంద్రబాబు పార్టీకి కంచుకోట కదా! ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి ఒక్కసారి కూడా ఓటమి చవిచూడలేదట! పైగా ముఖ్యమంత్రికి స్వయానా బావమరిది ప్లస్ వియ్యంకుడు ప్లస్ మాస్ మసాలా హీరో – బాక్సాఫీస్ బొనాంజా బాలయ్యబాబు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఇంత బిల్డప్ ఉన్నచోట అభివృద్ధి దద్దరిల్లకుండా ఉంటుందా? ఉదయం నాలుగున్నర నుంచి రెండు గంటలసేపు ఆ స్టేషన్లో నిలబడితే రైలు కూత వాయిస్‌లో అభివృద్ధి సౌండ్ వినిపిస్తుంది.బెంగళూరు నగరంలోని ఇళ్లలో పాచి పనులు చేసేందుకు, వీధుల్లో మూటలు మోసేందుకూ, ఇంకా ఇతర పనుల కోసం దాదాపు మూడు వేలమంది దాకా రోజూ అక్కడ ప్యాసింజర్ బండ్లెక్కి వెళుతున్నారు. ఇలా ప్రతిరోజూ వెళ్లి పనిచేసుకుని రావడం కొత్తేమీ కాదు. కాకపోతే ఏడాది కిందట వీరి సంఖ్య ఆరేడు వందలు దాటేది కాదు. ఈ ఏడాదిలో క్రమంగా మూడు వేల మార్కుకు చేరుకున్నది. ఈ పెరుగుదలను ఏడాది పాలన అభివృద్ధి ఖాతాలోనే కదా వేయాల్సింది. రోజువారీ చాకిరీ ముగిసిన తర్వాత మళ్లీ రైలు బండెక్కి రాత్రి పది గంటలు దాటిన తర్వాత ఇంటికి చేరుకుంటారు. మళ్లీ పొద్దున మూడు గంటలకే లేచి ఇంటి పనులు పూర్తి చేసుకుంటేనే... స్టేషన్లో బతుకు బండిని అందుకోగలుగుతారు.మహానగరానికి సమీపంలో ఉన్నందువలన హిందూపూర్ వలసల్లో డైలీ షటిల్ పద్ధతి కనిపిస్తున్నది. ఆ సమీపంలోనే ఉన్న రాయదుర్గం నియోజకవర్గంలోనైతే మూడో వంతు జనాభా మాత్రమే మిగిలిపోయిన గ్రామాలు కూడా ఉన్నాయి. అలా మిగిలిపోయిన వాళ్లలో వృద్ధులూ, పిల్లలే ఎక్కువ. భవన నిర్మాణ రంగంలో పనిచేయడానికి నెల్లూరు నగరంలో స్థిరపడ్డ కార్మికుల్లో ఇరవై వేలమంది ఈ మధ్యకాలంలోనే పట్టణం వదిలి వెళ్లిపోయారు. ఆంధ్రప్రదేశ్ వలసలపై గ్రామ సచివాలయాల సర్వేను ఆధారం చేసుకొని ఇటీవల ‘ప్రజాశక్తి’ పత్రిక ఒక కథ నాన్ని ప్రచురించింది. దానిప్రకారం ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేనంతగా వలసలు పెరిగాయి. గణనీయ సంఖ్యలో జనం వలస బాట పట్టారు.వలసలన్నీ అభివృద్ధికి వ్యతిరేకమైనవి కావు. మెరుగైన జీవితం కోసం, నైపుణ్యతకు తగిన ఉపాధి కోసం, ఉన్నతో ద్యోగాల కోసం నిరంతరం వలసలు జరుగుతూనే ఉంటాయి. అటువంటి వలసలను ప్రగతిశీలమైనవిగానే పరిగణిస్తారు. కానీ ఈ సంవత్సరం ఈ తరహా వలసల సంఖ్య చాలా తక్కువనీ, బతుకుదెరువు వలసలే ఎక్కువనీ సర్వే సారాంశమట! వ్యవ సాయ రంగాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం, రైతన్నలకు చేసిన హామీలను ఎగవేయడం, కరువు పరిస్థితులు, ఉపాధి హామీ కూలీలకు ఇవ్వాల్సిన బిల్లులు ఆపేయడం, నిర్మాణరంగం పూర్తిగా కుదేలవడం వంటి కారణాలు పెద్ద ఎత్తున వలసలకు కారణమయ్యాయి.తొలి ఏడాది అభివృద్ధికి సంబంధించి పెరిగిన వలసలు ఒక కొలమానమైతే, అధికారిక లెక్కలు వెల్లడించే డాక్యుమెంట్లు మరో బలమైన సాక్ష్యంగా ఉంటాయి. ఇదిగో ఈ సాక్ష్యాలను ముందుపెట్టుకొనే వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర యథార్థ పరిస్థితులను మీడియా సమావేశం ద్వారా మొన్న జనం ముందు ఉంచారు. ఈ సమావేశంలో తన పార్టీ వాళ్లు తయారుచేసిన నివేదికల ఆధారంగా ఆయన మాట్లాడలేదు. ప్రభుత్వం తయారుచేసిన బడ్జెట్ పత్రాల్లోని లెక్కల్ని ఆధారంగా చేసుకునే మాట్లాడారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) రిపోర్టుల్లోని విషయాలపైనే మాట్లాడారు. ‘కాగ్’కు తన ప్రమాణాలను పాటించడం తప్ప ఎటువంటి పక్షపాత ధోరణీ ఉండదనేది తెలిసిందే. తప్పొప్పులను తూర్పారపట్టడమే దాని పని. ఈ లెక్కల ఆధారంగానే కూటమి సర్కార్ మాటల్లోని కపటత్వాన్నీ, వారి ప్రచారాల్లోని డొల్లతనాన్నీ ఆయన చీల్చి చెండాడారు. ప్రభుత్వంపై ఆయన చేసిన దాడి ఎంత సాధికారికంగా, ఎంత శక్తిమంతంగా జనంలోకి వెళ్లిందంటే... మూడు రోజులు గడిచినా సర్కార్ వైపు నుంచి ఏ ఒక్కరూ ప్రతిపక్ష నేతకు సమాధానమిచ్చేందుకు ముందుకు రాలేకపోయారు. కొన్ని పిల్లి అరుపులు వినిపించడం, కొన్ని కుప్పిగంతులు కనిపించడం తప్ప!మూలధన వ్యయం పెరుగుదలను ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యానికి గుర్తుగా పరిగణిస్తారు. ఆర్థిక వ్యవస్థపై నమ్మకానికీ, ఉద్యోగాల కల్పనకూ, జీడీపీ ఉద్దీపనకూ ఈ మూలధన వ్యయం దోహదపడుతుంది. మరి, అభివృద్ధికి పర్యాయపదంగా యెల్లో మీడియా పలవరించే చంద్రబాబు తొలి ఏడాదిలో ఈ మూల ధన వ్యయం ఏ మేరకు పెరిగింది? పెరగలేదు సరికదా,అంతకుముందు సంవత్సరంతో పోల్చితే 17.80 శాతం తగ్గిందని ‘కాగ్’ నివేదికలోని అంశాన్ని జగన్ జనం ముందు పెట్టారు. జగన్ ప్రభుత్వపు చివరి సంవత్సరంలో మూలధన వ్యయం రూ. 23,330 కోట్లయితే చంద్రబాబు తొలి సంవత్సరం అది రూ. 19,177 కోట్లు మాత్రమేనని ‘కాగ్’ కుండబద్దలు కొట్టింది.స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం ఏటికేడు పెరుగుతుంటేనే అభివృద్ధి పనులు జరుగుతున్నట్టు! కానీ గత సంవత్సరంతో పోలిస్తే చంద్రబాబు తొలి సంవత్సరంలో ఈ ఆదాయం 7.39 శాతం తగ్గింది. జగన్మోహన్రెడ్డి జనం ముందుంచిన ప్రభుత్వ గణాంకాల్లో అత్యంత ఆసక్తికరమైనది ఎక్సైజ్ ఆదాయం.ఎందుకంటే అంతకుముందు కంటే మద్యం షాపుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రతి మద్యం షాపుకు అనుబంధంగా ఓ పర్మిట్ రూమ్ తయారైంది. ఇక బెల్ట్‌షాపుల సంఖ్య నలభై వేలు దాటింది. ఒక్కో బెల్ట్‌షాపు అనధికార పాటల్లో పది లక్షల నుంచి పదిహేను లక్షల వరకు పలికిందని వార్తలొచ్చాయి. బెల్ట్‌షాపుల కేటాయింపులోనే నాలుగు వేల నుంచి ఐదు వేల కోట్ల మేరకు అనధికారిక డీల్ కనబడుతుంటే... ప్రభుత్వానికి పెరిగిన ఎక్సైజ్ ఆదాయం కేవలం రూ. 3,800 కోట్లు మాత్రమే!ఇక ఈ 40 వేల పైచిలుకు బెల్ట్ షాపుల్లో అమ్మిన సరుకెంత? వచ్చిన ఆదాయమెంత? 4,400 మద్యం దుకాణాల్లో, వాటికి అనుబంధంగా కొత్తగా వెలసిన పర్మిట్ రూమ్‌ల సౌకర్యంతో పెరిగిన అమ్మకాలెన్ని? వచ్చిన ఆదాయమెంత? మద్యం దుకాణాలు, పర్మిట్ రూమ్‌లు, బెల్ట్‌షాపులు, బార్లు రౌండ్ ది క్లాక్ చేస్తున్న వ్యాపారం వల్ల పెరిగిన ఆదాయమెంత? ఇదంతా ఎవరి జేబుల్లోకి వెళుతున్నది? లేని స్కామ్‌పై నెలల తరబడి చేసిన దుష్ప్రచారం తర్వాత ఇప్పుడు ఎవరూ మాట్లాడొద్దని చంద్రబాబు చల్లగా ఆదేశాలివ్వడం వెనుక రహస్యమేమిటి? ఆధారాలు తుడిచేశారని ‘ఈనాడు’, దర్యాప్తు ఇప్పుడప్పుడే పూర్తి కాదని ‘ఆంధ్రజ్యోతి’ రాయడం వెనుక మర్మమేమిటి? ఇప్పుడు నడిపిస్తున్న విశృంఖల అవినీతి బయటికొస్తుందేమోనని భయ పడుతున్నారా? కేవలం 24 శాతం పెరుగుదలనే నమోదు చేసిన ఎక్సైజ్ ఆదాయం తీగ అవినీతి డొంకను కదిలించింది.సంపద సృష్టికర్తగా స్వీయ కీర్తనలు చేసుకొని, యెల్లో మీడియా కితాబులందుకునే చంద్రబాబు తొలి ఏడాది పాలనలో రాష్ట్ర సొంత వనరుల ద్వారా పెరిగిన ఆదాయం కేవలం 3.08 శాతం మాత్రమే! అదే కాలంలో కేంద్ర ప్రభుత్వ ఆదాయం 13.76 శాతం పెరిగింది. పక్కనున్న తెలంగాణ రాష్ట్ర ఆదాయం 12 శాతం పెరిగింది. అప్పుల్లో మాత్రం 30 శాతం అదనంగా చంద్రబాబు ప్రభుత్వం హైజంప్ చేసింది. ఇది బడ్జెటరీ అప్పుల సంగతే! అమరావతి అప్పులు, ఇతరత్రా అప్పులు వేరే ఉన్నాయి. అయిదేళ్ల కాలంలో తమ ప్రభుత్వం చేసిన అప్పుల్లో 41 శాతాన్ని చంద్రబాబు సర్కార్ తొలి సంవ త్సరంలోనే చేసేసిందని జగన్మోహన్రెడ్డి ఆధారసహితంగా జనం ముందు పెట్టారు. ఒకపక్క అప్పులు పెరుగుతున్నాయి. అవినీతి మహమ్మారి మాదిరిగా విస్తరిస్తున్నది. అభివృద్ధి మృగ్యమైందని సాక్ష్యాలు చెబుతున్నాయి. మరి సంపద సృష్టికీ, అభివృద్ధికీ బ్రాండ్ అంబాసిడర్‌గా చెప్పుకునే అయ్యవారు ఏం చేస్తున్నారయ్యా అంటే ఆయన తైనాతీలు, భజంత్రీలు అమరావతి వంక చూపెడుతున్నారు. అసలా అమరావతి నిర్మాణమే అతి పెద్ద స్కామ్‌గా గణాంకాల సహితంగా జగన్ నిరూపించారు.గతంలో పిలిచిన టెండర్లను, అసాధారణ రీతిలో పెంచి పిలవడం వెనుక, టెండర్లు దక్కించుకున్న వారికి మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇప్పించడం వెనుకనున్న మర్మం కమీషన్లు దండుకోవడం కాదా అని ప్రశ్నించారు. సచివాలయం, హెచ్ఓడీ భవనాలను 53 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించడంలోని ఔచిత్యాన్నీ, చదరపు అడుగు నిర్మాణ వ్యయాన్ని రూ. 8,931గా నిర్ణయించడంలో లోగుట్టునూ కూడా ఆయన ప్రశ్నించారు.అమరావతి నిర్మాణం పేరుతో ప్రభుత్వం వేస్తున్న ప్రతి అడుగూ అనుమానాస్పదంగానే ఉన్నది. ఎన్నికలకు ముందు రాజధానికి ప్రభుత్వం పైసా ఖర్చు చేయనవసరం లేదని చెప్పారు. భూముల అమ్మకం ద్వారానే నిర్మాణం పూర్తి చేయొచ్చనీ, ఆ రకంగా అది సెల్ఫ్ ఫైనాన్స్ నగరమనీ ప్రచారం చేసిన సంగతి ఎవరూ మరచిపోలేదు. ఇప్పుడేమో తొలిదశ 50 వేల ఎకరాలకే రూ.80 వేల కోట్లు కావాలని చంద్రబాబు చెబుతున్నారు. అందులో 30 వేల కోట్లు ఇప్పటికే అప్పుగా తెచ్చారు. మరో 45 వేల ఎకరాలతో రెండో దశ భూసమీకరణ కూడా జరుగుతుందట! ఈ లెక్కన రాజధాని నగరానికి రెండు లక్షల కోట్ల దాకా ఖర్చు పెట్టవలసి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆ నిర్మాణం పూర్తయ్యే సరికి తడిసి మోపెడవుతుందని జగన్మోహన్రెడ్డి కూడా హెచ్చరించారు. భూముల అమ్మకాలు జరిపినా అప్పులు తీర్చలేరని, చివరికి రాష్ట్ర ప్రజలపై అమరావతి ఒక గుదిబండ కాబో తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చౌకగా వసతి సౌకర్యాలు, అపారంగా ఉపాధి అవకాశాలను సృష్టించ గలిగితేనే ఆ నగరం నెమ్మదిగా ఒక రూపు తీసుకుంటుంది. రోమ్ నగరం ఒక్కరోజులో నిర్మితం కాలేదన్న సామెతకు ఒక అర్థం ఉన్నది.ఒక భారీ సంకల్పం నెరవేరాలంటే కావాల్సినంత సమ యం, సహనం, నిరంతర ప్రయత్నం, అంకితభావం ఉండాలి. అమరావతి ప్రాంతం ఇప్పటికే సామాన్యులకు అందు బాటులో లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఈ ప్రాంతంలో జగన్ ప్రభుత్వం ఇళ్ల స్థలాలను కేటాయిస్తే రాజధాని సమతుల్యత దెబ్బతింటుందని చంద్రబాబు బృందం కోర్టుకెక్కిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇటువంటి చోట ఎంత ప్రయాసపడ్డా వచ్చే పదేళ్లలో మరో మహానగరం కాదు, ఇంకో మంగళగిరి కూడా ఆవిర్భవించదు! ఏడాది కాలంలో ప్రజా సంక్షేమం పూర్తిగా పడకేసింది. అభివృద్ధి అలికిడే లేదు. అవినీతి విశ్వరూపం దాల్చింది. రాజకీయాల్లో ఒక అరాచక బర్బర సంస్కృతిని ప్రవేశపెట్టారు. ప్రత్యర్థులను వేటాడుతూ భయానక పాలనకు తెరతీశారు. ఈ రకంగా ప్రత్యర్థుల నోళ్లు నొక్కాలని ప్రయత్ని స్తున్నారు. శిరస్సుల మీద అప్పుల కిరీటాన్ని ధరించి, మెడలో అవినీతి మాల వేసుకొని, చేతులకు ప్రత్యర్థుల నెత్తురు పులుము కొని ఏడాది ఉత్సవాల పల్లకీలపై ఏలికలు ఊరేగబోతున్నారు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
జగన్ హయాంలో స్కాం జరగలేదని స్పష్టంగా తెలుస్తుంది: పోతిన మహేష్
-
‘ఆధారాల్లేవ్.. చేతులెత్తేసిన చంద్రబాబు ముఠా’
తాడేపల్లి: వైఎస్ జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక చంద్రబాబు ముఠా చేతులెత్తేసిందని.. వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్ ఎద్దేవా చేశారు. మద్యం కేసులో కోర్టుల కంటే ముందే ఎల్లోముఠా విచారణ చేస్తోందన్నారు. ఆధారాలు ఉన్నాయని కాసేపు, చెరిపేశారని మరి కాసేపు అంటున్నారు. వ్యవస్థలను ప్రభావితం చేసేందుకు రోజుకొక భేతాళ కథ అల్లుతున్నారు. 375 కోట్ల పేజీల డేటాను తొలగించారంటూ కొత్త కథ అల్లుతున్నారు. ప్రభుత్వం దగ్గర ఎలాంటి ఆధారాల్లేకనే ఇలాంటి కథలు చెప్తున్నారు. కోర్టులో ఒక్క ఆధారాన్ని కూడా చూపలేకపోయారు’’ అని పోతిన మహేష్ అన్నారు.‘‘నిజంగా డేటా డిలిట్ అయితే బేవరేజ్ కార్పోరేషన్ మీద ఎందుకు కేసులు పెట్టటం లేదు?. కంపెనీల దగ్గర ఉండే డేటా కూడా మాయం అయితే మరి వాటిపై కేసులు పెట్టాలి కదా?. డిస్టిలరీలకు ముడి సరుకు విక్రయించే సంస్థల దగ్గరైనా డేటా ఉంటుంది. అది కూడా డిలిట్ అయిందా? చంద్రబాబు సమాధానం చెప్పాలి. మద్యం క్రయ విక్రయాలన్నీ క్యూఆర్ కోడ్ ద్వారానే జరిగింది. అయినప్పటికీ అక్రమాలు అంటూ రోజుకొక కట్టుకథ అల్లుతున్నారు. జగన్ హయాంలో ఎలాంటి స్కాం జరగలేదని చాలా స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అయినప్పటికీ తప్పుడు వాంగ్మూలాలతో అరెస్టులు చేస్తున్నారు’’ అని పోతిన మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘స్కాంలో రాజ్ కసిరెడ్డి కీలకం అని మొదట్లో అన్నారు. తర్వాత ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి కీలకం అన్నారు. ఇప్పుడు మిథున్‌రెడ్డి కీలకం అంటున్నారు. తనకు సంబంధం ఉన్నట్టు ఆధారాలు చూపమని మిథున్‌రెడ్డి సవాల్ చేస్తే ప్రభుత్వం స్పందించలేదు. మిథున్‌రెడ్డి కంపెనీలోకి ఐదు కోట్లు వచ్చాయని తప్పుడు కథనాలను ఎల్లో మీడియా రాసింది. మిథున్‌రెడ్డి బెయిల్ పిటిషన్ కోర్టులో రాబోతున్నదని ఆయనపై తప్పుడు వార్తలు రాస్తున్నారు. కోర్టుల కంటే ముందే ఎల్లో మీడియా ట్రయల్ నిర్వహిస్తోంది. సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం 30 ఏళ్ల క్రితమే భూములు కొన్నది. ఈ 30 ఏళ్లలో 15 ఏళ్లు చంద్రబాబే సీఎంగా ఉన్నారు. మరి ఈ15 ఏళ్లలో కనపడని అక్రమాలు ఇప్పుడే ఎలా కనపడ్డాయి?’’ అంటూ పోతిన మహేష్ ప్రశ్నించారు.‘‘ఎల్లో మీడియా వార్తలు రాయటం, వెంటనే ప్రభుత్వం ఓవరాక్షన్ చేయటం పరిపాటి అయింది. సినిమా విషయాల్లో ప్రభుత్వం జోక్యం ఏంటని గతంలో పవన్ కళ్యాణ్ అన్నారు. మరి మంత్రి కందుల దుర్గేష్ ఇప్పుడు ఎందుకు విచారణ చేస్తోంది?. టీడీపీ నేతలే థియేటర్ల బంద్ వెనుక ఉన్నారని జనసేన నేతలు అంటున్నారు. కందుల దుర్గేష్ పర్యాటక శాఖ మంత్రిగా ఉండి రాష్ట్రానికి ఏం సాధించారు?’’ అని మహేష్ నిలదీశారు. -
ఈనాడు పత్రికపై వైఎస్ జగన్ వ్యాఖ్యలు వైరల్
-
‘వైఎస్ జగన్ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాల్సిందే’
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మీడియా సమావేశం ద్వారా కూటమి ప్రభుత్వానికి సంధించిన ప్రశ్నలకు సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌ను ఆధారాలతో సహా వైఎస్ జగన్ బయటపెట్టారని, దానికి బదులివ్వలేక ఎల్లో మీడియా 'ఈనాడు' ద్వారా ఒక అబద్దపు కథనాన్ని రాయించారని మండిపడ్డారు.బేతాళ కథల్లో భాగంగా కూటమి ప్రభుత్వం సృష్టించిన లిక్కర్ స్కామ్‌కు సంబంధించి కోట్ల పేజీల సమాచారంను డిలీట్ చేశారంటూ ఈనాడులో రాయించడం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు. ఒకవైపు డేటా మొత్తం నాశనం చేశారంటూనే, మరోవైపు బ్యాక్ ఎండ్ లో డేటాను సేకరించామనడం చూస్తుంటే చేసిన తప్పులను ఎలా కప్పిపుచ్చుకోవాలనే ప్రయత్నమే కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే...మాజీ సీఎం వైఎస్ జగన్ పాత్రికేయ సమావేశం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు సంధించారు. అలాగే తన ఎక్స్ వేదికగా కూడా ఆ ప్రశ్నలను సామాజిక మాధ్యమం ద్వారా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు కూడా పంపించారు. వీటికి సమాధానాలు చెప్పాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. అలాగే తాజాగా లిక్కర్ స్కామ్ అంటూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చెబుతున్న బేతాళ కథలు, కాకమ్మకథలను కూడా ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం కక్షపూరితంగా కేసులు పెట్టి, చట్టాలను ఉల్లంఘించి, దర్యాప్తు సంస్థలను చేతుల్లోకి తీసుకుని, అధికార దుర్వినియోగంకు పాల్పడుతున్నారని వైఎస్ జగన్ నిలదీశారు.అసలు లిక్కర్ కుంభకోణంకు పాల్పడింది ఎవరూ, డిస్టిలరీలకు అనుమతులు ఇచ్చింది ఎవరూ, వాటి సామర్థ్యంను పెంచింది ఎవరూ, కేబినెట్ ఆమోదం కూడా లేకుండా ప్రివిజైల్ ఫీజు కింద రూ.1300 కోట్లు మాఫీ చేసింది ఎవరూ, హేతుబద్దత లేకుండా సీఎంకు కావాల్సిన డిస్టిలరీలకు ఎక్కువ ఆర్డర్లు ఇచ్చింది ఎవరూ అని ప్రశ్నించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌లో నోట్ ఫైళ్ళలపై సీఎంగా చంద్రబాబు, ఆనాటి ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర సంతకాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెబుతున్న లిక్కర్ స్కామ్‌లో ఎక్కడైనా మా సంతకాలు ఉన్నాయా అని నిలదీశారు.బదులివ్వలేక బురదచల్లే యత్నంవైఎస్ జగన్ ప్రశ్నలకు బదులివ్వలేక ఎల్లో మీడియా ఈనాడును అడ్డం పెట్టకుని బురదచల్లేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. మొదటి నుంచి వైఎస్సార్సీపీపై విషం చిమ్మడమే తన లక్ష్యంగా పెట్టకుని దిగజారుడు రాతలు రాసే పచ్చపత్రిక ఈనాడు వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన లిక్కర్ వ్యవహారాల్లో మొత్తం డెటా డిలీట్ చేశారని, మెగా బైట్, జీబీ, టెర్రాబైట్ అంటే ఎంత, ఒక్కో దానికి ఎన్ని పేజీల ప్రింట్ బయటకు వస్తుందో చెబుతూ ఈ కథనంలో అనేక అబద్దాలను వండి వార్చారు. మీ వద్ద ఉన్న ఆధారాలు ఏమిటీ? దేనిని బట్టి లిక్కర్ స్కామ్ అంటున్నారని అడిగితే, దానికి సమాధానం చెప్పకుండా ఈనాడు పత్రిక వింత కథనాన్ని ప్రచురించింది. 375.80 కోట్ల పేజీల సమాచారంను తొలగించారని అత్యంత ఆశ్చర్యం కలిగించేలా తన కథనంలో ఆరోపించింది.అయినా కూడా ప్రభుత్వం అతికష్ట మీద బ్యాక్ ఎండ్ ద్వారా సేకరించిన సమాచారం మేరకు వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయంటూ నిర్ధారించింది. తలాతోక లేకుండా ఈనాడు పత్రిక రాసిన ఈ కథనం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. ఒక వైపు మొత్తం సమాచారమే లేదంటూనే, మరోవైపు బ్యాక్ ఎండ్ లో సమాచారం వచ్చిందని చెప్పడం వారి తెంపరితనంకు నిదర్శనం. ఏపీఎస్‌బీసీఎల్‌కు ఆయా సంస్థలు ఇచ్చిన డేటాను అంతర్గత సాఫ్ట్వేర్ సిస్టం, ఒరాకిల్ ఫైనాన్సియల్, ఎస్ఏపీ వంటి వాటిని వ్యవస్థీకృతంగా మ్యానిపిలేట్ చేశారని రాశారు. ఈ సమాచారాన్ని బ్యాక్ ఎండ్‌లో వెరిఫై చేస్తే పెద్ద ఎత్తున లోపాలు బయటపడ్డాయని రాశారు. ప్రభుత్వ వద్ద ఎటువంటి సమాచారం లేకుండా, బ్యాచ్ఎండ్ నుంచి తమకు నచ్చినట్లుగా సమాచారంను తయారు చేసుకుంటున్నారా అనే అనుమానం కలుగుతోంది.సమాచారం డిలీట్ చేస్తే చర్యలేవీ?గత ప్రభుత్వానికి సంబంధించి లిక్కర్ వ్యవహారాల సమాచారంను అధికారిక ఫైళ్ళ నుంచే డిలీట్ చేస్తే, అందుకు బాధ్యులైన ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులపై చర్యలు ఎందుకు తీసుకోలేదు. డిస్టిలరీలు, డిస్ట్రిబ్యూటర్లు, మార్కెటింగ్ అధికారులు, లిక్కర్ సంస్థలపై సమాచారం డిలీట్ చేశారని ఎందుకు కేసులు నమోదు చేయలేదు? కోట్ల పేజీల సమాచారం నాశనం చేశారని చెబుతుంటే, ఈ ప్రభుత్వం దానిని ఎందుకు ఉదాసీనంగా వదిలేసింది? అంటే అసలు సమాచారంను నాశనం చేశారనేదే పచ్చి అబద్దం. ప్రభుత్వ విభాగాల్లో ఒకచోట కాకపోతే మరోచోట కచ్చితంగా సమాచారం ఉంటుంది. దానిని మొత్తంగా నాశనం చేశారంటే అందుకు ఎక్సైజ్ కమిషనర్ స్థాయి నుంచి ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయితే తప్ప జరగదు. అలా జరిగితే ప్రభుత్వంకు చాలా సులువుగానే తెలిసిపోతుంది, మొత్తం వ్యవస్థపైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇదేదీ లేకుండా కోట్ల పేజీల సమాచారం మాయం అనేస్తే ఎలా? ఈ మాత్రం కూడా ఈనాడు పత్రికకు తెలియదా?లిక్కర్ అవినీతిపై కూటమి నేతల తలోమాటవైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్‌ను జరిగినట్లుగా, దానిలో రూ.వేల కోట్ల అవినీతి చోటుచేసుకున్నట్లుగా ఎన్నికల ముందు నుంచి, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత కూడా కూటమి నేతలు మాట్లాడారు. ఇలా మాట్లాడిన ప్రతి నాయకుడు వారికి తోచిన రీతిలో లిక్కర్ అవినీతిపై లెక్కలు చెప్పారు. లిక్కర్ విధానంపై చంద్రబాబు 25.3.2022న మాట్లాడుతూ వైఎస్ జగన్‌కు లిక్కర్ ద్వారా వచ్చిన ఆదాయం రూ.10వేల కోట్లు అని అన్నారు. ఆయన వదిన పురంధేశ్వరీ 09.10.24న మాట్లాడుతూ లిక్కర్ కుంభకోణంలో ఏటా రూ.25వేల కోట్లు జగన్ కు చేరాయని ఆరోపించారు.మంత్రి అచ్చెన్నాయుడు ఏడాదికి రూ.లక్ష కోట్లు అని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూ.41వేల కోట్లు అని ఆరోపించారు. 25.7.2024న చంద్రబాబు అసెంబ్లీలో రూ.18 వేల కోట్లు నష్టం జరిగిందని, అదే రోజు పవన్ కళ్యాణ్ రూ.30 వేల కోట్లు దోచుకున్నారని అసెంబ్లీలో మాట్లాడారు. ఎంపీ సీఎం రమేష్ లోక్ సభలో మాట్లాడుతూ లిక్కర్ స్కామ్‌లో రూ.30వేల కోట్లు అవినీతి అని అన్నారు. ఎంపీ కృష్ణదేవరాయులు మాట్లాడుతూ రూ.18 వేల కోట్లు కుంభకోణం, దానిలో రూ.4000 కోట్లు దేశం దాటి పోయాయంటూ మాట్లాడారు. ఇలా కూటమి పార్టీల నేతలు ఇష్టారాజ్యంగా లిక్కర్ పాలసీపై తలో విధంగా మాట్లాడారు. ఒకరు మాట్లాడే దానికి, మరోకరు మాట్లాడేదానికి పొంతన లేదు. అంటే నిజంగా లిక్కర్ స్కామ్ అనేదే లేకపోవడం వల్ల వీరంతా తమకు తోచిన విధంగా మాట్లాడారనే అర్థమవుతోంది. -
వామ్మో ఈనాడు.. పైత్యం పరాకాష్టకు!
ఈనాడుకు పచ్చపైత్యం పెరిగిపోతోంది!. నిస్సిగ్గుగా పాఠకులను మోసం చేసేందుకు, ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ఈనాడు కథనాలు వండి వారుస్తోంది. వైఎస్సార్సీపీ అధినేత జగన్‌పై విపరీతమైన ద్వేషం పెంచుకున్న ఈ పత్రిక యాజమాన్యం విచక్షణ కూడా కోల్పోయిందని స్పష్టమవుతోంది. జగన్ టిష్యూ పేపర్‌తో పోల్చినప్పటికీ ఈ పత్రిక తీరు మార్చుకోకపోగా మరింత దిగజారిపోతోంది. సోలార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకీ) మేనేజింగ్ డైరెక్టర్ రామేశ్వర ప్రసాద్ గుప్తాను కేంద్రం పదవి నుంచి తొలగించడానికీ.. ఆయన నియామకానికి ముందే ఆంధ్రప్రదేశ్, సెకీల మధ్య కుదిరిన ఒప్పందాలకు ముడిపెట్టే ప్రయత్నం చేసింది ఈనాడు. యాజమాన్యాన్ని సంతోషపెట్టడానికి ఈనాడు జర్నలిస్టు బృందం రాసిన దరిద్రపు గొట్టు వార్తపై వైఎస్సార్సీపీ తీవ్రంగా స్పందించింది. ఈనాడు(Eenadu)ది జర్నలిజమా? బ్రోకరిజమా అని ప్రశ్నించింది. జవాబు ఇవ్వలేని ఈనాడు తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకో దిక్కుమాలిన కథనాన్ని రాయడం ఆ పత్రిక దివాళాకోరుతనానికి నిదర్శనం. ప్రస్తుతం ఈనాడు పత్రిక రాసే అబద్దాల మధ్యలో ఎక్కడైనా నిజాలేమైనా ఉన్నాయా అని వెతుక్కోవలసిన పరిస్థితి. ఏపీ ఎడిషన్‌లో రాసే, ప్రసారం చేసే కథనాలలో అత్యధికం ఈ బాపతే. చంద్రబాబు సర్కార్‌కు భజన , వైఎస్సార్సీపీ, జగన్‌పై వ్యతిరేక కథనాలు, అసత్యాలు!. ‘‘సెకీ(SECI) ఒప్పందానికి సన్మానం జరిగింది’’..అంటూ హెడింగ్ పెట్టి ఒక వార్తను ప్రముఖంగా అచ్చేసింది. ఆ సంస్థ సీఎండీని తొలగిస్తూ కేంద్రం ఆకస్మిక నిర్ణయం తీసుకుందని, జగన్ ప్రభుత్వంతో ఒప్పందంపై వచ్చిన ఆరోపణలే పరోక్ష కారణం అని ఈ మీడియా తేల్చింది. అందులో తన ఇష్టానుసారం జగన్ పై ఆరోపణలు గుప్పించింది. 👉వైఎస్ జగన్(YS Jgan)తో బంధం ఏర్పరచుకున్న ఎవరికైనా జైలు.. పదవీ గండం తప్పదని మరోసారి నిరూపితమైనట్లు ఈనాడు ఎంతో ఘోరంగా రాసింది. తెలుగుదేశం కరపత్రిక కన్నా హీనంగా రాయడానికి ఈనాడు సిగ్గుపడలేదు. కాంగ్రెస్, తెలుగుదేశం లు కలిసి జగన్ పై తప్పుడు కేసులు పెట్టిన వైనం, వారికి మద్దతుగా ఈనాడు, తదితర ఎల్లో మీడియా దుష్ప్రచారం 15 ఏళ్లుగా సాగుతూనే ఉంది. ఇదే టైమ్ లో చంద్రబాబు పై వచ్చిన కేసులు, ఆ కేసుల్లో అధికారులు సస్పెండ్ అవడమో, లేదంటే విదేశాలకు పారిపోవడమో జరిగిన ఘటనలు ఈనాడు మీడియా మర్చిపోయినా ప్రజలు మర్చిపోలేదు. 👉స్కిల్ స్కామ్ లో అరెస్టు అయిన వారిలో చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న సంస్థల ప్రతినిధులు, కొందరు ప్రభుత్వ అధికారులు ఉన్న సంగతిని కప్పిపుచ్చితే సరిపోతుందా?. చంద్రబాబు పలు కేసుల్లో స్టేలు తెచ్చుకున్న విషయం ప్రజలకు తెలియదా?. ఆయన పీఎస్ శ్రీనివాస్ ఇంటిలో కేంద్ర ప్రభుత్వ ఐటీ శాఖ రైడ్ చేసి.. రూ.రెండు వేల కోట్ల అక్రమాలు గుర్తించినట్లు ప్రకటించిన సంగతి ఎవరికి తెలియదు!. ఆ తర్వాత స్కిల్ స్కామ్ కేసులో విచారణకు రాకుండా తప్పించుకునేందుకు ఆ పీఏని హుటాహుటిన అమెరికాకు పంపించడాన్ని ఏమంటారో ఈనాడు మీడియానే చెప్పాలి. ఈ సంగతి ఇలా ఉంచితే.. సెకీ సీఎండీ గుప్తాని తొలగించడానికి కారణం ఒక టెండర్లో అనిల్ అంబానీ సంస్థ సమర్పించినవి నకిలీ డాక్యుమెంట్లు అని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. దానిని విస్మరించి గతంలో సెకీతో జగన్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం అని రాసిపడేసి ఈనాడు తన పాఠకులను మోసం చేసింది. విశేషం ఏమిటంటే.. జగన్ ప్రభుత్వం సెకీతో ఒప్పందం చేసుకున్నప్పుడు గుప్తా ఆ సంస్థకు ఎండీనే కాదు. సెకీతో ఒప్పందం 2021 డిసెంబర్ లో కుదిరితే గుప్తా పదవిలోకి వచ్చింది 2023 జూన్‌లో. అలాంటప్పుడు ఇందులో ఆయన ప్రమేయం ఏమి ఉంటుంది?. అమెరికాలో దాఖలైన ఒక కేసులో గౌతమ్ అదానీ రూ.1,750 కోట్ల లంచం ఇచ్చినట్లు పేర్కొన్న తీరుపై అమెరికాలోనే విమర్శలు వస్తే.. దానిని ఈనాడు భుజాన వేసుకుని జగన్ పై తప్పుడు ప్రచారానికి దిగింది. అసలు సెకీతో అదానీ సంస్థ ఒప్పందం చేసుకుంటే దానికి జగన్ ప్రభుత్వానికి ఏమి సంబంధం అంటే జవాబు చెప్పదు!. పైగా అదానీ సరఫరా చేస్తున్నట్లు.. ‘జగన్ ప్రభుత్వానికి తెలుసు’ అంటూ అడ్డగోలు వాదన. అదానీ తక్కువ ధరకు సెకీ ద్వారా విద్యుత్ ఇస్తే ఏపీ తీసుకోరాదని ఈనాడు అసలు ఎలా చెబుతుంది?. నిజంగానే ఈ విద్యుత్‌ను తీసుకోకపోతే అప్పుడు ఏమని రాసేవారు?. లంచాలు రావడం లేదని, తక్కువ ధరకు కరెంటు వస్తుంటే తీసుకోలేదని ఇదే మీడియా తప్పుడు రాతలు రాసేదా? లేదా?. యూనిట్ విద్యుత్ రూ.2.49లకు కొంటే లంచాలు వచ్చేటట్లయితే.. ఈనాడు రాసినట్లు లక్ష కోట్ల భారం అయితే.. మరి చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా 4.60 పైసలకు యూనిట్ విద్యుత్ కొనుగోలు చేయడానికి ఒక ప్రైవేటు కంపెనీతో తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది కదా!. దానికి ఎంత లంచం తీసుకుని ఉండాలి? ఇప్పుడు రాష్ట్రంపై ఎన్ని లక్షల కోట్ల భారం పడి ఉండాలి?. దానిపై ఈనాడు మీడియా ఎందుకు నోరు మెదపదు. పోనీ నిజంగానే సెకీ సంస్థ అదాని నుంచి విద్యుత్ సరఫరా చేయడం వల్ల ఏపీకి నష్టం జరుగుతుంటే చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు రద్దు చేయడం లేదో కూడా ఈనాడు మీడియానే చెప్పాలి కదా. కేంద్ర ప్రభుత్వం అదానీ కంపెనీపై చర్య తీసుకుని ఉండాలి కదా. అంటే చంద్రబాబు, మోదీ, అదానీ అంతా మంచివాళ్లే. జగన్ మాత్రమే కాదా?. 👉ఇలాంటి పిచ్చి రాతలు రాసే ఈనాడు మీడియా పరువు పోగొట్టుకుంటోంది. నిజంగానే జగన్ అప్పట్లో చెప్పినట్లు యూనిట్ రూ.2.49లకే ఏపీకి విద్యుత్ వచ్చేలా చేసినందుకు, లక్షకోట్ల రూపాయల మేర ఆదా చేసినందుకు ఆయనకు సన్మానం చేసినా తప్పేమీ లేదు. కానీ ఈనాడు సిద్దాంతం ప్రకారం ఆయనకు కాకుండా యూనిట్ విద్యుత్ రూ.4.60లకు కొనుగోలు చేస్తున్నందుకు చంద్రబాబుకు సన్మానం చేయాలన్న మాట. జగన్ అప్పట్లో ఎల్లో మీడియా చేసిన దుష్ప్రచారంపై ఢిల్లీ హైకోర్టులో కేసు వేశారు. ఈనాడు కథనంపై సాక్షి ‘‘బాబుకు ఈనాడు నిత్య సన్మానం, పాత్రికేయానికే తీరని అవమానం’’ శీర్షికన కథనాన్ని ఇచ్చింది. అలాగే వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు తదితరులు ఈనాడు మీడియా తీరుపై విరుచుకుపడ్డారు. దాంతో ఈనాడు మీడియా మరుసటి రోజు గుప్తా హయాంలోనే ఆదానీ గుట్టు వీడిందని మరో పిచ్చి వార్తను ఇచ్చింది. అందులో మాటమార్చేసి.. గుప్తా వచ్చాక అనుబంధ ఒప్పందాలు కుదిరాయంటూ ఏదేదో రాసింది. గుప్తా తొలగింపునకు ఈ అంశంతోపాటు ఇతర కారణాలు ఉన్నాయని ఇప్పుడు చెబుతోంది. సెకీ సంస్థ అదానీ ప్లాంట్ల నుంచి సరఫరా చేస్తారని తెలిపిందట. అది తప్పట. అసలు ఏపీ ప్రభుత్వానికి తక్కువ ధరకు విద్యుత్ రావడం ముఖ్యమా? కాదా?. ఏపీలో జగన్ టైమ్‌లో గ్రీన్ కో, తదితర సంస్థలతో పాటు అదానీ గ్రూప్ కూడా రెన్యుబుల్ విద్యుత్ ఉత్పత్తికి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మరి ఇప్పుడు అదానీ సంస్థను చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు కొనసాగిస్తోంది?. అదంతా ఎందుకు.. ఈనాడు మీడియాకు దమ్ముంటే, ఏ మాత్రం నీతి, నిజాయితీ ఉంటే చంద్రబాబు ప్రభుత్వంతో సెకీ ఒప్పందాన్ని రద్దు చేయించమనండి.. తక్కువ ధరకు అదానీ ఇచ్చినా అక్కర్లేదు.. మేము రూ.2.49కి కాకుండా రూ.4.60లకే విద్యుత్ కొంటామని, అదే రైట్ అని చంద్రబాబు ప్రభుత్వంతో చెప్పించమనండి!!. రామోజీరావు జీవిత చరమాంకంలో అబద్దపు తప్పుడు వార్తలతో అప్రతిష్ట పాలైతే.. ఆయన కుమారుడు కిరణ్(Eenadu MD Kiran) ఇప్పుడే ఇలాంటి తప్పుడు వార్తలతో పరువు పోగొట్టుకుంటున్నారు. వేరేవారి మీద కోపం, ద్వేషంతో ఎవరైనా తమ బట్టలూడదీసుకుని నడి బజారులో తిరుగుతారా! మా ఇష్టం! మేం తిరుగుతాం అన్నట్లుగా ఈనాడు మీడియా పిచ్చి పరాకాష్టకు చేరుతోందా?. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఎల్లోమీడియాను ఉతికి ఆరేసిన వైఎస్ జగన్
-
ఈనాడు టాయిలెట్ పేపర్ కి ఎక్కువ.. టిష్యూ పేపర్ కి తక్కువ..
-
అసలువి మరచి.. కొసరుతో కాలక్షేపం!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనితీరు గమ్మత్తుగా ఉంటుంది. ఇచ్చిన హామీలను ఎగ్గొట్టిన విషయం ప్రజలకు గుర్తు రాకుండా చేసేందుకు అన్ని రకాల గిమ్మిక్కులూ చేస్తుంటారు. చిన్న, చితకా విషయాలపై సమీక్షల పేరుతో గంటల కొద్దీ సమావేశాలు పెట్టడం.. ఆ వార్తలు తమ అనుకూల పత్రికల్లో ప్రముఖంగా వచ్చేలా చూసుకోవడం.. ఇదీ బాబు మోడల్.చంద్రబాబు ఈ నెల 19న జరిపిన సమీక్ష సమావేశాలనే ఉదాహరణగా తీసుకుందాం. రెండు అంశాలు. ఒకటి.. ప్రభుత్వ సేవలలో లోపాలకు చెక్ పెట్టాలి. ప్రజల ఫీడ్‌బ్యాక్‌తో మార్పులు చేయాలి అని!. రెండోది... గ్యాస్ సిలిండర్ల డెలివరీకి డబ్బులు అడుగుతున్నారా? అన్నది. మామూలుగా చూస్తే ఇది బాగానే ఉంది కదా? అనిపిస్తుంది. కానీ.. ఇది ఒక ముఖ్యమంత్రి సమీక్షించాల్సిన అంశాలా? కింది స్థాయి అధికారో.. లేక సంబంధిత శాఖల మంత్రులో చేస్తే సరిపోదా? అన్నది ప్రశ్న! పైగా తమ సొంత నిర్ణయాల కారణంగా నిన్న మొన్నటి వరకూ ప్రజలకు అందుతున్న రకరకాల సేవలను తొలగించి ఇలా మాట్లాడటం బాబుకే చెల్లుతుంది!.ఈ సమీక్షలోనే రేషన్ సరుకులు పంపిణీ విషయంలో 74 శాతం మంది తమకు రేషన్ అందుతోందని చెప్పారట. ఆయన అడగాల్సిన ప్రశ్న ఇదా? ప్రత్యేక వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్ ఇచ్చే సౌకర్యాన్ని తొలగించిన తరువాత ఏం జరుగుతోందని కదా?. ఇంటి పట్టున అందే రేషన్ అందక ప్రజలు రేషన్ షాపుల వద్ద పడిగాపులు పడుతున్నారు. కొన్నిసార్లు రద్దీ కారణంగా తోపులాటలు కూడా జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో చిత్తశుద్ధిగల ప్రభుత్వం ఏదైనా ఇళ్లవద్దకే రేషన్ అందివ్వాలా? లేక షాపుల వద్దనైనా ఓకేనా? అని ప్రజలను అడిగి తెలుసుకోవాలి. ఇవేవీ చేయకుండానే.. రేషన్ సరఫరా వాహనాలను సేవల నుంచి తొలగించాలని మంత్రివర్గం ఎలా నిర్ణయించింది? ఎవరిని మభ్య పెట్టడానికి ఈ సమీక్ష!.గ్యాస్ సిలిండర్ల డెలివరీ విషయమూ ఇంతే. ఏజెన్సీల నుంచి సిలిండర్లు తీసుకొచ్చేవారికి ఎంతో కొంత టిప్ ఇవ్వడం సాధారణమే. ఇవ్వకపోయినా చెల్లుతుంది. పైగా ఇలాంటి అంశాల గురించి సాధారణంగా కలెక్టర్లు తమ సమీక్షల్లో చర్చిస్తుంటారు. పౌర సరఫరాల శాఖకు ఒక మంత్రి కూడా ఉన్నారు. వీరి స్థాయిలో జరగాల్సిన పనులను ముఖ్యమంత్రి స్వయంగా చేపట్టడం ఎంత వరకూ సబబు?. వాస్తవానికి బాబు సమీక్షించాల్సిన అంశం తాము ఎన్నికల సందర్భంగా ఓటర్లకు ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ఇచ్చిన హామీ ఎలా అమలవుతోంది? అని!. ఏడాదికి ఒక సిలిండర్.. అది కూడా కొంతమందికే ఇవ్వడం వల్ల ప్రజలేమనుకుంటున్నారు? అని!. ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఎల్లో మీడియాలో రాయించుకుంటే ఏం ప్రయోజనం?. పైగా ఇప్పుడు ఇంకొ కొత్తమాట మాట్లాడుతున్నారు.. మూడు సిలిండర్లకు డబ్బులు ప్రజల ఖాతాల్లోకి వేస్తామూ అంటున్నారు. మంచిదే కానీ.. వీటికి నిధులు ఎక్కడివి అని కూడా చెబితే కదా ప్రజలకు నమ్మకం కుదిరేది?. పంచాయతీలలో ఇళ్ల నుంచి చెత్త సేకరణ జరుగుతోందని అరవై శాతం మంది ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం కూడా సీఎం స్థాయి సమీక్ష సమావేశంలో చర్చకు వచ్చిన అంశం.జగన్ టైమ్‌లో కొద్దిపాటి నిర్వహణ ఛార్జీలతో చెత్త తరలింపు సమర్థంగా చేపడితే ‘‘చెత్త పన్ను’’ అంటూ బాబు అండ్ కో వ్యతిరేక ప్రచారం చేశారు. ఇప్పుడు చెత్తపన్ను తీసేశామని చెప్పి... ఆస్తి పన్ను పెంచేశారు! పోనీ చెత్త తొలగింపు జరుగుతోందా అంటే అది అంతంత మాత్రమే!. చెత్త సరిగా ఎత్తడం లేదని 40 శాతం మంది చెప్పారంటేనే ఆ విషయం స్పష్టమవుతోంది!. స్వచ్చాంద్రప్రదేశ్ పేరుతో చంద్రబాబు ఈ మధ్య ప్రత్యేక సభలు పెడుతున్నారు. ఈ మాత్రం పని పంచాయతీ, మున్సిపాలిటీ స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత మంత్రులు చేయలేకపోయారా?. పంచాయతీ రాజ్ శాఖను పర్యవేక్షిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నట్లు? బహుశా ఆయన సినిమా షూటింగ్లలో బిజీగా ఉన్నారేమో మరి.ఆర్టీసీ బస్స్టాండ్లలో సేవలపై ప్రజలలో అసంతృప్తి ఉందని తేలిందట. తాగునీరు, టాయిలెట్లు తదితర సదుపాయాలు బాగోలేవట. ఈ సంగతి ముఖ్యమంత్రి స్థాయిలో కనిపెట్టాలా? మరి సంబంధిత మంత్రి ఏమి చేస్తున్నారు?. ఆర్టీసీకి అవసరమైన నిధులు కేటాయించినా అధికారులు ఎందుకు ఈ సేవలు అందించ లేకపోతున్నారు?. ఇక వాట్సప్ సేవలతో అన్ని జరిగిపోతున్నట్లు ప్రొజెక్టు చేయాలని గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం 375 సేవలు అందిస్తున్నారని, జూన్ 12 నాటికి 500 సేవలు అందించాలని సీఎం ఆదేశించారు. బాగానే ఉంది. ఇంతవరకు 45 లక్షల మంది ఈ సేవలను వాడుకున్నారట. ఏపీ జనాభా ఐదు కోట్లు అనుకుంటే ఈ సేవలను పది శాతం మంది మాత్రమే వాడుకున్నారన్న మాట!. వాట్సప్ సేవల సంగతేమో కాని, జనం ప్రతీ సర్టిఫికెట్ కోసం ప్రభుత్వ ఆఫీస్‌ల చుట్టూ తిరగవలసి వస్తోంది.జగన్ హయాంలో ఉన్న గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్, వలంటీర్ల వ్యవస్థలన్నీ నీరు కార్చి ఇప్పుడు వాట్సాప్ కథలు చెబుతున్నారు. వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, వారి గౌరవ వేతనం ఐదు వేల నుంచి పది వేలకు పెంచుతామని ఉగాది నాడు పూజలు చేసి మరీ వాగ్దానం చేసిన చంద్రబాబు దానిని గాలికి వదిలి వేశారు. దీనిపై కూడా ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనవసరం లేదా!. ఆరోగ్యశ్రీని క్రమేపి బీమా కిందకు మార్చాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనిపై ప్రజల అభిప్రాయాలు తీసుకున్నారా?.కొన్ని ప్రభుత్వ సంస్థలలో నెలల తరబడి జీతాలు అందడం లేదని మీడియాలో వార్తలు వస్తున్నాయి. సూపర్ సిక్స్ హామీలపై అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. అలాంటి వాటిపై సమీక్ష జరిపితే పది మందికి మేలు జరుగుతుంది. ఏది ఏమైనా తాను ఇచ్చిన హామీలను అమలు చేసి ఆ తర్వాత వాటి తీరుతెన్నులపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటే ఉపయోగం తప్ప, ఇలా విషయం లేని అభిప్రాయ సేకరణలు జరిపి, ఈ స్థాయిలో వాటిని సమీక్షించడం అంటే అవి సీఎం వద్ద జరిగే కాలక్షేపం మీటింగులే అని ప్రజలు భావిస్తారని చంద్రబాబుకు తెలియదా!.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మన యుద్ధం చంద్రబాబు ఒక్కడితో కాదు..!
-
లేనివి ఉన్నట్టు.. ఉన్నవి లేనట్టు!
పచ్చ పత్రిక ఈనాడు చూస్తే ఆంధ్రప్రదేశ్‌లోకి పెట్టుబడుల ప్రవాహంలా వచ్చి పడుతున్నాయని అనిపిస్తుంది!. కానీ, బాబు వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు వీళ్లు చేస్తున్న విఫల ప్రయత్నాలు ఒక రకంగా ప్రజలను మోసం చేయడమే!. ఈ మధ్య కాలంలోనే రూ.33వేల కోట్ల పెట్టుబడులు వచ్చేసినట్లు వీటితో 34 వేల మందికి ఉపాధి దొరికేసినట్లు ఈనాడు ఒక కథనాన్ని వండి వార్చింది.రాష్ట్ర పెట్టుబడుల ప్రమోషన్ బోర్డు ఇటీవల ఆమోదించిన ప్రాజెక్టుల్లో కొన్నింటికి జగన్ హయాంలోనే ఒప్పందాలు కుదిరినా వాటిని బాబు గారి ఖాతాలో వేసేసి తరిస్తున్నాయి ఎల్లో పత్రికలు!. తప్పులేదు కానీ.. ఈ క్రమంలో గత ప్రభుత్వంపై బురద జల్లేందుకు చేస్తున్న ప్రయత్నాలే రోత పుట్టిస్తున్నాయి. ‘వైఎస్సార్సీపీ ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం పెట్టుబడిదారుల విశ్వాసాన్ని కోల్పోయింది’ అని చంద్రబాబు అన్నట్టు.. పారిశ్రామికవేత్తలను తిరిగి రాష్ట్రానికి రప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నట్లు బాబు చెప్పారని రాసుకొచ్చింది ఈనాడు!. మొత్తం రూ.4.95 లక్షల కోట్ల పెట్టుబడులకు బోర్డు ఆమోదం తెలిపిందని, 4.5 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని కూడా బాబు చెప్పినట్లు ఈ కథనం చెబుతోంది. విచిత్రం ఏమిటంటే బోర్డు సమావేశం జరగడానికి ముందు రోజు టీడీపీ పాలిట్‌బ్యూరో సమావేశంలో రూ.8.50 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసినట్లు వెల్లడించారని ఎల్లో మీడియానే రాసింది. వీటిలో దేనిని నమ్మాలి?.తాజాగా ప్రకటించిన 19 ప్రాజెక్టులలో కొన్ని గత ప్రభుత్వంలోనే ఆమోదం పొందాయన్నది వాస్తవమా? కాదా? ఉదాహరణకు సత్యసాయి జిల్లాలో బీఈఎల్ యూనిట్, అనకాపల్లి వద్ద టైర్ల ప్యాక్టరీ, శ్రీసిటీలో డైకిన్ సంస్థలన్నీ ఇవన్ని గత ప్రభుత్వ హయాంలో వచ్చినవే. ప్రభుత్వం అన్నది ఒక నిరంతర ప్రక్రియ. గత ప్రభుత్వంలో ఇవి వచ్చాయని, వాటిని మరింత ముందుకు తీసుకువెళుతున్నామని సీనియర్ నేత అయిన చంద్రబాబు చెప్పి ఉంటే హుందాగా ఉండేది. అలా కాకుండా అసలు జగన్ హయాంలో పరిశ్రమలే రానట్లు, ఇప్పుడే వస్తున్నట్లు చెప్పుకుంటూ పోతే ఆయనకు విలువ ఏమి ఉంటుంది!. అలాగే, లోకేష్ ఈ మధ్య శంకుస్థాపనలు చేస్తున్న క్లీన్ ఎనర్జీ కంపెనీలు కూడా గత జగన్ ప్రభుత్వంలో మంజూరు అయినవే అన్నది వాస్తవం.ఉదాహరణకు ఇంటిగ్రేటెడ్ రెన్యుబుల్ ఎనర్జీ కాంప్లెక్స్‌కు బేతపల్లిలో భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ సంస్థ ఛైర్మన్ సుమంత్ సిన్హా జగన్ పారిశ్రామిక విధానాలను ప్రశంసిస్తూ ప్రసంగించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తారంగా తిరుగుతోంది. ఓర్వకల్లు వద్ద నిర్మాణంలో ఉన్న గ్రీన్ కో ప్రాజెక్టు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడే గ్రౌండ్ అయి చాలా ముందుకు వెళ్లింది. అదానీకి చెందిన సంస్థకు కూడా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు కోసం భూములు కూడా కేటాయించారు.ఆ రోజులలో ఎల్లోమీడియా ఈ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా విపరీతంగా దుష్ప్రచారం చేసేది. రామాయంపట్నం వద్ద శిర్డిసాయి కంపెనీకి చెందిన ఇండో సోలార్ ప్రాజెక్టు వస్తుంటే ఈ కంపెనీ అధినేత విశ్వేశ్వరరెడ్డిపై ఎన్ని అసత్య కథనాలు వండివార్చారో లెక్కలేదు. జగన్ బినామీ అని కూడా ఎల్లో మీడియా ఆరోపించింది. కూటమి అధికారంలోకి వచ్చాక ఆ కంపెనీకి ప్రభుత్వం ట్రాన్స్ఫార్మర్ల ఆర్డర్ ఇస్తోందంటూ విషపు రాతలు రాసింది. తదుపరి ఏమైందో కానీ, ఆ సంస్థ ప్రభుత్వానికి అనుకూలంగా ఇచ్చిన ఫుల్ పేజీ ప్రకటనను ఆనందంగా ప్రచురించుకుంది. అంటే, ఆ కంపెనీ యజమానిని ఈ మీడియా బ్లాక్ మెయిల్ చేసిందని అనుకోవాలా? ఆయా కంపెనీలకు లోకేష్ శంకుస్థాపన చేయడాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ, అదేదో తమ ప్రభుత్వం వచ్చాకే జరుగుతోందన్న భ్రమ కల్పించడానికి చేస్తున్న యత్నాలే బాగోలేవు.మరో ఉదాహరణ కూడా చెప్పాలి. విజయవాడ సమీపంలోని మల్లవల్లి వద్ద అశోక్ లేలాండ్ సంస్థ 2022లోనే బస్సుల తయారీని ఆరంభించింది. ఆ విషయం ఆ కంపెనీ సెబీకి కూడా తెలిపింది. కానీ, కొద్ది రోజుల క్రితమే ఉత్పత్తి ఆరంభమైనట్లు, లోకేశ్ ప్రారంభోత్సవం చేసినట్లు కలరింగ్ ఇచ్చే ప్రయత్నం జరిగింది. సోషల్ మీడియా యుగంలో ఏదో మాయ చేయాలనుకుంటే ఇట్టే దొరికిపోతామన్న సంగతిని నేతలు అర్థం చేసుకోవాలి. చంద్రబాబు పాలన మొదలయ్యాక ఎన్ని పరిశ్రమలు మూతపడ్డాయి?. కూటమి ఎమ్మెల్యేలు ఎన్ని పరిశ్రమలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు?. కాంట్రాక్టుల కోసం ఏ రకంగా ఒత్తిడి తెస్తున్నది పుంఖానుపుంఖాలుగా వార్తలు వస్తున్న మాట అబద్దమా?. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచర వర్గం సిమెంట్ కంపెనీలపై చేసిన దాడులు, ఇలాగైతే తాము పని చేయలేమని ఒక సిమెంట్ కంపెనీ హెచ్చరించడమూ తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకరరెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిల మధ్య బూడిద తగాదా అన్నీ టీడీపీ నేతల దౌర్జన్యాలు, అవినీతి కార్యకలాపాలను ఎత్తి చూపేవే కదా?.ఆది నారాయణ రెడ్డి అనుచరుల దౌర్జన్యాలపై బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఏకంగా జిల్లా కలెక్టర్‌కే ఫిర్యాదు చేశారే!. పల్నాడులో గురజాల ఎమ్మెల్యే యరపతినేని దందాలకు రెండు సిమెంట్ కంపెనీలు కొన్నాళ్లపాటు మూతపడ్డాయి కదా?. శ్రీకాకుళం జిల్లాలో స్థానిక కూటమి నేతలు కింగ్ ఫిషర్ కంపెనీ వారిని బెదిరించి డబ్బులు వసూలు చేయాలని ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి కదా?. రెడ్‌బుక్ కారణంగా జిందాల్ సంస్థ ఏపీలో పెట్టాల్సిన పెట్టుబడులను కాస్తా మహారాష్ట్రకు తరలించిందే!. గత ఫిబ్రవరి 12న ఒక అధికారిక సమావేశంలోనే చంద్రబాబు ఏపీలో పారిశ్రామికాభివృద్ది ‘-2.94 శాతం’గా ఉందని, పరిశ్రమలు మూతబడుతున్నాయని చెప్పారే. అంటే కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు తొమ్మిది నెలల తర్వాత ఆ పరిస్థితి ఉందనే కదా! దానికి ఆయనే బాధ్యత వహించాలి కదా?. దావోస్‌కు వెళ్లి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెస్తామని హోరెత్తించి, చివరికి ఒక్క రూపాయి కూడా తేలేని పరిస్థితి ఎందుకు ఏర్పడింది? దానిని కవర్ చేయడానికి ఏపీ బ్రాండ్ బాగా ప్రచారమైందని ఎల్లో మీడియా ఎందుకు రాసింది? ఆ తర్వాత లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నట్లు ఒకసారి, వచ్చేసినట్లు మరోసారి చంద్రబాబు, లోకేశ్‌లు ఎందుకు చెప్పారు?. చంద్రబాబు చెబుతున్నట్లు జగన్ టైంలో పెట్టుబడులు రాలేదా?. వివరాలు పరిశీలిస్తే కూటమి నేతలు అసత్యాలు చెబుతున్నారని చెప్పడానికి ఎన్నో ఆధారాలు కనిపిస్తాయి. రెండేళ్ల కరోనా సంక్షోభం ఉన్నప్పటికీ, జగన్ టైంలో లక్షల కోట్ల విలువైన ప్రతిపాదనలు వచ్చాయి. అంబానీ, అదానీ వంటి ప్రముఖులు సైతం గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వచ్చారు. కొన్ని శంకుస్థాపన చేసుకుని ప్రారంభమయ్యాయి కూడా. బద్వేల్ వద్ద సెంచరీ ప్లైవుడ్ ప్లాంట్ ను చూడవచ్చు.అంతేకాదు.. ఎన్టీపీసీ లక్ష పదివేల కోట్ల వ్యయంతో హైడ్రో పార్కు ఏర్పాటుకు ముందుకు వచ్చింది. కొంతకాలం క్రితం ప్రధాని మోదీ దీనికే శంకుస్థాపన చేశారు. కాకపోతే దీన్ని టీడీపీ నేతలు తమ ఖాతాలో వేసుకుంటున్నారు. రిలయన్స్ బయోగ్యాస్, బిర్లా కార్బన్ ఇండియా, కోరమాండల్, అల్ట్రాటెక్, ఏసీసీ సిమెంట్స్, ఇండోసోలార్ మాడ్యూల్స్ ఇలా పలు రకాల పరిశ్రమలు సుమారు రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరిచాయి. వాటిలో కొన్నిటిని ప్రస్తుత ప్రభుత్వ రెడ్ బుక్ విధానాల వల్ల కోల్పోయాయన్న విమర్శలు ఉన్నాయి.ఒకవైపు చంద్రబాబు పేరే బ్రాండ్ అని, ఏ కంపెనీ వచ్చినా ఆయనను చూసే వస్తున్నాయని లోకేష్ చెబుతుంటారు. కానీ, అత్యంత విలువైన విశాఖ భూములను కొన్ని కంపెనీలకు ఎకరా 99పైసలకే కట్టబెట్టవలసిన దుస్థితిలో రాష్ట్రం ఉంది. లీజుకు ఇవ్వాలని టీసీఎస్ సంస్థ కోరినా దాదాపు ఉచితంగా విక్రయించడం ఎందుకో?. ఊరు పేరు లేని ఉర్సా కంపెనీకి కారుచౌకగా అరవై ఎకరాల భూమిని కట్టబెడ్టడంలోని ఆంతర్యం ఏమిటి? ఏది ఏమైనా పరిశ్రమలు, ఒప్పందాలకు సంబంధించి కాకి లెక్కలు చెప్పడం చంద్రబాబు ప్రభుత్వానికి కొత్తకాదు.2014 హయాంలో ఏకంగా రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసినట్లు, లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేసినట్లు ప్రచారం చేశారు. తీరా చూస్తే అందులో పదోవంతు కూడా వచ్చినట్లు స్పష్టంగా తెలియలేదు! నిరుద్యోగ భృతి ఎగవేయడానికి ఇలా చేస్తుండవచ్చు. ఇప్పటికైనా కాకి లెక్కలు మాని, గత ప్రభుత్వంపై బురద చల్లడం ద్వారా ఏపీ పరువును, బ్రాండ్‌ను పాడు చేయకుండా చిత్తశుద్దితో పెట్టుబడులు తీసుకురావడానికి కృషి చేయాలని కోరుకుందాం.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బోల్తా కొట్టిన ఎల్లోపిట్ట!
ఎల్లో మీడియా శోకాలు పెడుతోంది. అరచి గీపెట్టి మరీ రోదిస్తోంది. దాని బాధల్లా ఒకటే.. చంద్రబాబు హయాంలో ప్రభుత్వ ఆదాయం బాగానే ఉన్నా సాక్షి మీడియా దాన్ని తక్కువగా చేసి రాసిందీ అని! జగన్ ప్రభుత్వంలో కంటే ఆదాయం ఇప్పుడు ఎక్కువే ఉంటే ఆ మాట నేరుగా చంద్రబాబే ఢంకా బజాయించి మరీ చెప్పుకునేవాడు. ఆయన ఆ పని చేయలేదు కానీ.. ఆయన తరఫున ఆంధ్రజ్యోతి యజమాని రాధాకృష్ణ మాత్రం తెగ బాధపడిపోతున్నారు. ఆయనగారి పత్రికలో ఈ మధ్యే ‘సంపదపై శోకాలు’ అంటూ ‘జగన్ పత్రిక రోత రాతలు’ అన్న శీర్షికతో ఒక కథనం ప్రచురితమైంది.పచ్చి అబద్ధాలతో నిండిన ఇలాంటి కథనాలు నిత్యం వండి వారుస్తున్నందుకే.. వైసీపీ నేతలు.. సామాన్యులు చాలా మంది ఈ పత్రికను చంద్రజ్యోతిగాను, బూతు పత్రికగాను విమర్శిస్తుంటారు.రాధాకృష్ణ కాని, ఆయన సంపాదక బృందం కాని ఒకే ఒక్క ప్రశ్నకు సమాధానం చెబితే అందరం ఆయన కథనాలు సరైనవేనని ఒప్పేసుకుందాం. ఆ ప్రశ్న ఏమిటంటే... ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పిందేమి? ఆ తరువాత ఏడాది కాలంలో ఆయన చేసిందేమిటి? ‘‘అప్పులు చేయబోను’’, ‘‘సంపద సృష్టి నాకు తెలుసు’’, ‘‘సూపర్ సిక్స్‌తోపాటు ఎన్నికల హామీలన్నీ అమలు చేసి చూపిస్తా’’ అని ఎన్నికల ముందుకు ఒకటికి పదిసార్లు హామీ ఇచ్చిన ఆ పెద్దమనిషి అధికారంలోకి వచ్చిన తరువాత.. ‘‘గల్లా పెట్టె ఖాళీగా కనబడుస్తా ఉంది’’, ‘‘అప్పులు పుట్టడం లేదు’’ ‘‘సంపద సృష్టించే మార్గముంటే చెవిలో చెప్పండి’’. ‘‘అప్పులు చేసి సంక్షేమానికి ఖర్చు చేయలేను’’ అని ప్లేటు ఫిరాయించిన విషయం తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయాలే. రాధాకృష్ణ భాషలో వీటిని శోకాలు అంటారా? లేదా? ఆయన రాసినట్లే చంద్రబాబు హయాంలో ఆదాయం ఎక్కువ ఉందని కాసేపు అనుకుందాం. అలాంటప్పుడు చంద్రబాబు ఖజానా ఖాళీగా కనబడుతోంది అని ఎందుకు అన్నట్టు? పైగా.. అప్పుల కోసం ఏకంగా ఖజానానే తనఖా పెట్టి చరిత్ర సృష్టించడం ఎందుకు? అప్పులు పుట్టడం లేదన్న బాబు మాట కూడా నిజమే అయితే ఏడాది కాలంలో రూ.1.5 లక్షల కోట్ల రుణం చేసిన రికార్డు మాటేమిటి? జగన్ హయాంలో ఆదాయం తక్కువగా ఉందనుకున్నా.. సంక్షేమ పథకాలన్నీ ఐదేళ్లూ చక్కగా అమలు చేశారు కదా? దానికి సమాధానం ఏమిటి? ఓడరేవులు, మెడికల్ కాలేజీలు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్, పాఠశాలల్లో ‘నాడు-నేడు’’ ఇలా బోలెడంత అభివృద్ధినికి ప్రజల కళ్లముందే నిలిపారు కదా? అయినా సరే.. జగన్ ఎప్పుడు బీద అరుపులు అరవలేదే? ఒకపక్క చంద్రబాబేమో ఖజానా ఖాళీ అంటారు.. ఇంకోపక్క రాధాకృష్ణ ఆదాయం భేష్ అంటారు. ఏది నిజం? ఈ ప్రశ్నకు సమాధానం కాగ్ లెక్కల్లో వెతుకుదాం.. జగన్ పాలన చివరి ఏడాది రాష్ట్ర రెవెన్యూ రాబడులు మొత్తం సుమారు రూ.1.74 లక్షల కోట్లు. ఆ తరువాత చంద్రబాబు (Chandrababu) పాలనలో తొలి ఏడాది (2024-2025) రూ.1.68 లక్షల కోట్లు! అయితే... ఆంధ్రజ్యోతి 2014-15కు సంబంధించిన రెవెన్యూ లోటు మొత్తాన్ని కేంద్రం 2023-24లో ఇవ్వడం వల్ల జగన్ హయాంలోని ఆదాయం ఎక్కువగా కనిపిస్తోందని అంటోంది. ఇదే నిజం అనుకుందాం. అప్పుడు కూడా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను సమర్థంగా రాబట్టడంలో జగన్ ప్రభుత్వం విజయం సాధించినట్లే అవుతుంది కదా? ఐదేళ్లు కేంద్రంలో భాగస్వామిగా ఉన్నా పది వేల కోట్ల రూపాయల మొత్తం కూడా కేంద్రం నుంచి రాబట్టుకోలేని అసహాయ స్థితిలో చంద్రబాబు ఉన్నట్లు రాధాకృష్ణ ఒప్పుకున్నట్లేనా? జగన్ ప్రభుత్వం 12వ ఆర్థిక సంఘం నిధులను కూడా రాబట్టుకుందని ఆంధ్రజ్యోతి చెబుతోంది. ఇది కూడా జగన్ గొప్పదనమే అవుతుంది కదా! ఈ స్థాయిలో కేంద్రం నుంచి చంద్రబాబు నిధులు ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారు? ఈ రెండింటినీ మినహాయిస్తే జగన్ హయాం చివరి ఏడాది వచ్చిన రాబడి రూ.1.61 లక్షల కోట్లేనని, చంద్రబాబు తన తొలి ఏడాదిలో ఆదాయం రూ.1.68 లక్షల కోట్లు అని ఈ పత్రిక తెలిపింది.అలాంటప్పుడు చంద్రబాబు పదే, పదే ఎందుకు డబ్బులు లేవని వాపోతున్నారు? రూ.1.5 లక్షల కోట్ల అప్పు ఎందుకు చేశారు? ఈ మొత్తాన్ని ఎందుకోసం ఖర్చు చేశారు? జగన్ టైమ్ నాటికన్నా పదివేల కోట్లు ఎక్కువగా పన్ను ఆదాయం చంద్రబాబు ప్రభుత్వం పొందిందని ఎల్లో మీడియా చెబుతోంది. ఇదే నిజమైతే బాబు బీద అరుపుల మతలబు ఏమిటి? జీఎస్టీ వసూళ్లు రూ.2850 కోట్లు, ఎక్సైజ్ ఆదాయం రూ.3900 కోట్లు, కేంద్ర పన్నుల వాట రూ.ఐదు వేల కోట్ల మేర ఎక్కువ వచ్చిందని ఈ పత్రిక రాసింది. ఇంత భారీ ఎత్తున ఆదాయం వచ్చినా ఎందుకు ఒక్క స్కీమ్ అమలు చేయడం లేదు?జగన్ ప్రభుత్వం చివరి సంవత్సరంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా రూ.9542 కోట్లు వచ్చినట్లు కాగ్ లెక్కలు చెబుతున్నాయి. చంద్రబాబు పాలనలో తొలి ఏడాది ఈ మొత్తం రూ.8837 కోట్లే! దీని అర్థం బాబు హయాంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గినట్లే కదా? అమ్మకం పన్ను, పన్నేతర ఆదాయం మొదలైన వాటి పరిస్థితి కూడా ఇలాగే ఉందని కాగ్ గణాంకాలు చెబుతున్నాయి. జగన్ హయాంతో పోలిస్తే ఇప్పుడు రెవెన్యూ, ద్రవ్య లోటులు రెండూ సుమారు రూ.20 వేల కోట్లు ఎక్కువన్నది కూడా వాస్తవమే కదా? రాధాకృష్ణ ఏదో మసిపూసి మారేడుకాయ చేద్దామని ప్రయత్నించి సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లుగా ఉంది. ఆయన రాసింది వాస్తవమైతే చంద్రబాబు అబద్దాలు చెబుతున్నట్లు అవుతుంది. పైగా ఆదాయం బాగున్నా.. రూ.1.5 లక్షల కోట్లు అప్పు తెచ్చినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలేవీ అమలు చేయకుండా ప్రజలను మోసం చేసినట్టు అవుతుంది. ఖజానా ఖాళీ అన్న చంద్రబాబు మాటలు నిజమైతే ఈ జాకీ పత్రిక రాసింది అవాస్తవమని అంగీకరించవలసి ఉంటుంది. ఏతావాతా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ శోకాలకు చంద్రబాబు సర్కారే బద్నాం అయ్యింది. కూటమి ప్రభుత్వానికి భజన చేద్దామని అనుకుని ఇలాంటి పిచ్చి రాతలు రాసి చంద్రబాబునే డిఫెన్స్ లో నెట్టేసినట్లయింది. ఆ విషయం అర్థమైందా?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
బాబుకు ఈనాడు నిత్య సన్మానం పాత్రికేయానికి తీరని అవమానం
సాక్షి, అమరావతి: ఎద్దు ఈనిందంటే గాటికి కట్టేయండన్న చందంగా తయారైంది ఎల్లో మీడియా. ప్రజలు ఏమనుకుంటారన్న సిగ్గూ, ఎగ్గూ లేకుండా చంద్రబాబు కోసం ఎంతగా బరితెగించడానికైనా సై అంటోంది. వలువలూడదీసుకుని పచ్చి అబద్ధాలను అచ్చేస్తోంది. వ్యవసాయానికి పగటి పూట 9 గంటల పాటు ఉచిత విద్యుత్‌ను 30 ఏళ్ల పాటు హక్కుగా అందించాలని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈసీఐ–సెకీ)తో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై విషం చిమ్ముతూనే ఉంది. ఈ ఒప్పందానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) వరకు అన్ని విధాలుగా ఆమోదం లభించింది. అయినా గత ప్రభుత్వంపై బుదర జల్లాలి.. జగన్‌పై నిందలు వేయాలి.. ఒప్పందంపై విషం గక్కాలి.. అనే అజెండాతో అర్థం లేని ఆరోపణలు చేస్తూ టీడీపీ కరపత్రం ఈనాడు, ఎల్లో మీడియా అసత్య కథనాలను వండివారుస్తూనే ఉంది. తాజాగా సెకీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) రామేశ్వర్ ప్రసాద్ గుప్తాను కేంద్ర ప్రభుత్వం ఆ పదవి నుంచి తప్పించడాన్ని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంతో ముడిపెట్టి ఈనాడు పచ్చి అబద్ధాలతో శనివారం ఓ తప్పుడు కథనాన్ని అచ్చేసింది.ఎప్పుడో 2021లో జరిగిన ఒప్పందానికి 2023లో సీఎండీగా చేరిన అధికారికి సంబంధం ఏమిటనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా దిగజారుడు రాతలతో తన నైజాన్ని చాటుకుంది. ‘సెకీ’తో ఒప్పందం కారణంగా విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లపై ఆరి్ధక భారం పడుతుందని, అంతర్ రాష్ట్ర ప్రసార చార్జీ (ఐఎఎస్‌టీఎస్)ల నుంచి మినహాయింపు లభించదని ఇప్పటికే అనేక సార్లు అసత్య కథనాలను రాసి భంగపడ్డ టీడీపీ కరపత్రం ఇప్పుడు అభూత కల్పనలతో ప్రజలను ఏమార్చాలని చూస్తోంది. యూనిట్ రూ.2.49 చవక ధరకే సౌర విద్యుత్‌ను అందించే సెకీ ఒప్పందంపై ఇంతగా విషం చిమ్ముతున్న ఈనాడు.. అంతకు దాదాపు రెట్టింపు ధర యూనిట్ రూ.4.60తో చంద్రబాబు ప్రభుత్వం యాక్సిస్ అనే ప్రైవేటు సంస్థ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంటే మాత్రం కళ్లున్న గుడ్డి వాడిలా నటిస్తోంది. ముడుపులకు ఆస్కారం ఎక్కడ? ⇒ వైఎస్ జగన్ ప్రభుత్వానికి రైతుల పట్ల ఉన్న నిబద్ధత చూసి, యూనిట్ రూ.2.49 చవక ధరకే సౌర విద్యుత్‌ను అందిస్తామంటూ 2021 సెపె్టంబర్ 15న సెకీ లేఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన చేసింది. ప్రాజెక్టు వాణిజ్య కార్యకలాపాల (కమర్షియల్ ఆపరేషన్ డేట్)తో సంబంధం లేకుండా ప్రత్యేక ప్రోత్సాహకంగా ఐఎస్టీఎస్ చార్జీల నుంచి కేంద్ర ప్రభుత్వం మినహాయింపు ఇచి్చందని ఆ లేఖలో సెకీ స్పష్టంగా పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అలాంటి చార్జీలు వర్తించవని లేఖలో వివరంగా చెప్పింది. రెండు నెలల సుదీర్ఘ చర్చలు, సమగ్ర అధ్యయనం తర్వాత సెకీతో గత ప్రభుత్వం, డిస్కంలు మధ్య త్రైపాక్షిక విద్యుత్ కొనుగోలు ఒప్పందం జరిగింది. ఇందులో ఎలాంటి రహస్యం లేదు. రాష్ట్ర మంత్రి మండలితో పాటు ఏపీఈఆర్సీ ఆమోదంతో అత్యంత పారదర్శకంగా బహిరంగంగానే ఈ ఒప్పందం జరిగింది. ⇒ సెకీతో ఒప్పందం వల్ల రాష్ట్రానికి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ యూనిట్ రూ.2.49కే పాతికేళ్ల పాటు సరఫరా అవుతుంది. ఈ ధర అప్పటికి ఎనీ్టపీసీ సరఫరా చేస్తున్న సౌర ధర రూ.2.79 కన్నా 30 పైసలు తక్కువ. ప్రస్తుతం చంద్రబాబు కుదుర్చుకున్న రూ.4.60 కన్నా రూ.2.11 తక్కువ. ⇒ ప్రస్తుతం రాష్ట్రం కొనుగోలు చేస్తున్న విద్యుత్ యూనిట్‌కు సగటున రూ.5.10 ఖర్చు అవుతోంది. ఈ లెక్కన ఏటా దాదాపు రూ.3,750 కోట్లు సెకీ విద్యుత్ వల్ల ఆదా అవుతుంది. కానీ ఈ ఒప్పందంలో ముడుపుల వ్యవహారం వల్లే సెకీ సీఎండీని కేంద్రం తప్పించిందంటూ ఈనాడు వక్ర భాష్యం చెప్పింది. ముడుపులే కావాలనుకుంటే చంద్రబాబులా ప్రైవేటు సంస్థలతోనే ఒప్పందం కుదుర్చుకునేవారు కదా..? ఇంత చిన్న లాజిక్ కూడా ఈనాడుకు తెలియదా? ⇒ అదీకాక 2021లో ఒప్పందం జరిగినప్పుడు గుప్తా సెకీ సీఎండీనే కాదు. ఆయన ఆ పదవి చేపట్టిందే 2023 జూన్‌లో. ఈనెల 10న ఆయ న్ను పదవి నుంచి తొలగించారు. అంటే సెకీ ఒప్పందం జరిగినప్పుడు ఆయన పదవిలోనే లేరు. అలాంటిది ఆ ఒప్పందంతో ఆయనకు ఎలా ముడిపెడతారనే కనీస జ్ఞానం కూడా టీడీపీ కరపత్రానికి లేకుండా పోయిందని విద్యుత్ రంగ నిపుణులు విస్తుపోతున్నారు. బురదజల్లడమే పని⇒ ఈ ఒప్పందంలో రైతుల పట్ల జగన్‌కు నిబద్ధత తప్ప స్వప్రయోజనం అనేది మచ్చుకైనా కనిపించదు. అయితే ఈ ఒప్పందంలో ఏ మాత్రం ప్రమేయం లేని అదానీ నుంచి లంచాలందాయంటూ గత ముఖ్యమంత్రి వ్యక్తిత్వాన్ని హననం చేస్తోంది కూటమి ప్రభుత్వం. అమెరికాలో అదానీ సంస్థపై అభియోగాలు నమోదైతే దానికి జగన్‌కు ముడిపెట్టి అత్యుత్సాహంతో విష ప్రచారం చేస్తూ.. పుంఖానుపుంఖాలుగా అసత్యాలు వండి వార్చింది టీడీపీ అనుబంధ పత్రిక ఈనాడు. ⇒ వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఉన్న జనాదరణను తగ్గించకపోతే చంద్రబాబుకు మళ్లీ వానప్రస్థం తప్పదని భయపడుతున్న ఈనాడు.. అమెరికాలో నమోదైన కేసులో జగన్ పేరు లేకపోయినా ఉందంటూ పచ్చి అబద్దాన్ని ప్రచారం చేస్తోంది. దానికి అనుబంధంగానే సెకీ చైర్మన్ తొలగింపునూ ఈ ఒప్పందానికి ముడి పెడుతూ కుట్రలు పన్నుతోంది. దాదాపు 18 లక్షల మంది రైతులకు ఉచిత విద్యుత్తు అందటమే మహాపరాధంగా చిత్రీకరిస్తోంది. ⇒ గతేడాది నవంబర్‌లో గౌతమ్ అదానీ, ఇతర కార్యనిర్వాహకులపై లంచం తీసుకున్నారని అమెరికా ప్రాసిక్యూటర్లు అభియోగం మోపినప్పుడు, వాటికి ఎలాంటి ఆధారాలు లేనందున సెకీ ఆ ఆరోపణలపై ఎలాంటి విచారణ చేపట్టదని గుప్తా ప్రకటించారు. తాను ఎటువంటి తప్పు చేయలేదని, తనకు ఎలాంటి సంబంధం లేదని కూడా ఖండించారు. గతేడాది నవంబర్ 6న, నకిలీ పత్రాలను సమరి్పంచారనే ఆరోపణలతో రిలయన్స్ పవర్, దాని అనుబంధ సంస్థ రిలయన్స్ ఎన్యు బిఇఎస్‌ఎస్‌ను మూడు సంవత్సరాల పాటు టెండర్లలో పాల్గొనకుండా సెకీ నిషేధించింది. ⇒ కానీ ఢిల్లీ హైకోర్టు ఆదేశం తర్వాత ఆ నిషేధాన్ని ఉపసంహరించుకుంది. ఈ ఏడాది మేలో, రిలయన్స్ అనుబంధ సంస్థ రిలయన్స్ ఎన్యు సన్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్‌తో 25 ఏళ్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందం (సీపీఏ)పై సెకీ సంతకం చేసింది. దీనికి తప్పుడు ధృవపత్రాలను సృష్టించారనే ఆరోపణలు వెల్లువెత్తడంతోనే కేంద్రం నెల రోజుల్లో పదవీ విరమణ చేయనున్న గుప్తాను ఉన్నపళంగా తొలగించిందంటూ జాతీయ మీడియా ఇప్పటికే అనేక కథనాల్లో వెల్లడించింది. ఈ వాస్తవాన్ని ఈనాడు నిస్సిగ్గుగా దాస్తోంది. అది జర్నలిజమా? లేక బ్రోకరిజమా? ఈనాడుపై వైఎస్సార్సీపీ మండిపాటు‘వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వ హననం కోసం పత్రిక పేరుతో ఇంతగా దిగజారిపోతారా? నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు రాస్తారా? ఈనాడుది జర్నలిజమా? లేక బ్రోకరిజమా?’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నించింది. సెకీ విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై ఈనాడు పత్రిక చేస్తున్న అసత్యాలను ఖండిస్తూ ‘ఎక్స్’లో ఆ పార్టీ ఈ మేరకు పోస్టు చేసింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందం 2021 డిసెంబర్లో జరిగిందని, 2023లో సెకీ సీఎండీగా రామేశ్వర్ గుప్తాను నియమించారని తెలిపింది. అలాంటప్పుడు ఏపీ–సెకీ ఒప్పందానికి ఏం సంబంధం ఉంటుందని ఆ పార్టీ ప్రశ్నించింది.‘సెకీకి రామేశ్వర్ గుప్తా సీఎండీ కాక ముందు కేంద్ర పర్యావరణ శాఖ సెక్రటరీగా పనిచేశారు. అనిల్ అంబానీ కంపెనీ ఫేక్ డాక్యుమెంట్లతో బిడ్డింగ్ వేశారన్న ఆరోపణల నేపథ్యంలో రామేశ్వర్ గుప్తాను తొలగించినట్టుగా ఐదారు రోజుల క్రితమే జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ వార్తలను వక్రీకరించి ఏపీ సెకీ ఒప్పందానికి లింకు పెడుతూ నిస్సిగ్గుగా ఎల్లో పత్రిక ఈనాడు పచ్చి అబద్ధాలు రాసింది. ఈనాడుకు ధైర్యం ఉంటే సెకీతో ఒప్పందాన్ని రద్దు చేయమని మీ గ్యాంగ్ లీడర్ చంద్రబాబుకు చెప్పు. ఈనాడులో రూ.1.90కే యూనిట్ సౌర విద్యుత్ వస్తుందని రాశారు. మరలాంటప్పుడు మొన్న యాక్సిస్‌తో రూ.4.60కి కొనుగోలు చేస్తూ ఎందుకు ఒప్పందం చేసుకున్నావని దమ్ముంటే చంద్రబాబును ప్రశ్నించు. లేదా తప్పుడు రాతలు రాసినందుకు ప్రజల్ని క్షమాపణలు కోరాలి’ అంటూ ఈనాడు రాసిన ఫేక్ న్యూస్ కథనాన్ని జత చేసి, శనివారం ఎక్స్ పోస్ట్‌లో వైఎస్సార్సీపీ నిలదీసింది. -
Ambati Rambabu: కేసులు పెట్టి వేధిస్తే మరింత స్ట్రాంగ్ అవుతాం
-
మరోసారి బయటపడ్డ ఈనాడు పచ్చి అబద్ధాలు
సాక్షి, అమరావతి: మరోసారి ‘ఈనాడు’ పచ్చి అబద్ధాలు బయటపడ్డాయి. సెకీ సీఎండీ రామేశ్వరగుప్తాను కేంద్రం తొలగించిన వార్తపై ఈనాడు వక్రభాష్యం చెప్పింది. వైఎస్ జగన్ హయాంలో ఏపీలో జరిగిన విద్యుత్ ఒప్పందాలే తొలగింపునకు కారణం అంటూ ఈనాడు అబద్ధాలు రాసింది.2023లో జూన్‌లో సెకీ సీఎండీగా రామేశ్వర్ పదవి చేపట్టగా.. రామేశ్వర్ గుప్తా ఛైర్మన్ కాకముందే ఏపీ ప్రభుత్వం సెకీతో ఒప్పందం కుదుర్చుకుంది. రామేశ్వర్ గుప్తా సెకీలో లేనప్పుడు ఒప్పందాలు జరిగితే.. ఆయన తొలగింపునకు ఏపీతో జరిగిన ఒప్పందాలే కారణమంటూ ఈనాడు అబద్ధాలు అచ్చేసింది.2021 డిసెంబర్లోనే ఏపీ ప్రభుత్వం సెకీతో ఒప్పందం కుదుర్చుకుందని ఈనాడు ఒప్పుకుంది. అబద్ధం వండివార్చాలనే తాపత్రయంలో కనీసం వాస్తవాలు ఏంటో తెలుసుకోని ఈనాడు.. అడ్డగోలు రాతలతో రెచ్చిపోయింది.ఈనాడు పిచ్చిరాతలపై వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వైఎస్ జగన్ వ్యక్తిత్వ హననం కోసం పత్రిక పేరుతో ఇంతగా దిగజారిపోతారా? నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు రాస్తారా?. ఈనాడుది జర్నలిజమా? లేక బ్రోకరిజమా?. విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై సెకీతో 2021 డిసెంబర్లో ఒప్పందం జరిగింది. 2023లో సెకీ సీఎండీగా రామేశ్వర్ గుప్తా నియమితులయ్యారు. 2023లో ఛైర్మన్ అయిన రామేశ్వర్ గుప్తాకు 2021 నాటి ఏపీ-సెకీ ఒప్పందానికి ఏం సంబంధం’’ అంటూ వైఎస్సార్సీపీ ప్రశ్నించింది.🚨 #BanYellowMediaSaveAPఏమిటీ రాక్షసత్వం. వైయస్.జగన్మోహన్రెడ్డిగారి వ్యక్తిత్వ హననంకోసం పత్రిక పేరుతో ఇంతగా దిగజారిపోతారా? నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు రాస్తారా? “ఈనాడూ’’ మీది జర్నలిజమా? లేక బ్రోకరిజమా?విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై సెకీతో 2021 డిసెంబరులో ఒప్పందం. 2023లో సెకీ… pic.twitter.com/CJzt414GJH— YSR Congress Party (@YSRCParty) May 17, 2025 ‘‘సెకీకి రామేశ్వర్ గుప్తా సీఎండీ కాకముందు కేంద్ర పర్యావరణ శాఖ సెక్రటరీగా పనిచేశారు. అనిల్ అంబానీ కంపెనీ ఫేక్ డాక్యుమెంట్లతో బిడ్డింగ్ వేశారన్న ఆరోపణలు నేపథ్యంలో రామేశ్వర్ గుప్తాను తొలగించినట్టుగా 5-6 రోజులుగా జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలను వక్రీకరించి ఏపీ-సెకీ ఒప్పందానికి లింకు పెడుతూ.. నిస్సిగ్గుగా ఈనాడు పచ్చి అబద్ధాలు రాసింది’’ అని వైఎస్సార్సీపీ మండిపడింది. -
బాబూ.. మీడియాతో పెట్టుకోకు!
ఎవరైనా బలవంతంగా ఇంట్లోకి చొరబడితే ఏం చేస్తాం?. ముందుగా అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. ఆ తరువాత పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. మరి పోలీసులే వ్యక్తుల ఇళ్లల్లోకి బలవంతంగా చొరబడితే? చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తే? ప్రజల స్వేచ్ఛను కాపాడాల్సిన ప్రభుత్వమే వాటిని హరిస్తూ అరాచకాలకు పాల్పడితే? ఏపీలో ప్రస్తుత పరిస్థితి ఇదే.ఏపీ ప్రభుత్వం మిగిలిన పనులన్నీ పక్కనబెట్టి మరీ పోలీసులతో తప్పుడు కేసులు పెట్టిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను వేధిస్తూ చివరికి ప్రజల పక్షాన వార్తలు రాస్తున్న మీడియా గొంతు నొక్కేందుకూ ప్రయత్నిస్తోంది. సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి నివాసంపై పోలీసుల దాడిని కూడా ఈ కోణంలోనే చూడాలి. టీడీపీ, అధికారంలోకి వచ్చినప్పటి జనసేన, బీజేపీ కూటమి దుశ్చర్యలకు అంతు లేకుండా పోతోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎప్పుడూ మీడియాపై ఒక కన్నేసే ఉంచుతారు. బాకా మీడియాను ఒకరకంగా, వైఫల్యాలను, ప్రభుత్వ స్కామ్‌లను బయటపెట్టే మీడియాను మరో రకంగా చూస్తారు. మాట వినని జర్నలిస్టులను ఉద్యోగాల నుంచి తొలగించేలా యాజమాన్యాలపై ఒత్తిడి తీసుకు వస్తారు కూడా. అనుకూలంగా ఉండే మీడియాకు రకరకాల రూపాలలో మేళ్లు చేస్తారు. తద్వారా ఆ యాజమాన్యాలను తన గుప్పెట్లో ఉంచుకుంటారు.1995లో తన మామ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక వర్గం మీడియా ద్వారా ఆయనపైనే వ్యతిరేక ప్రచారం అనండి.. దుష్ప్రచారం చేయించిన చరిత్ర చంద్రబాబుది అని అప్పటి నుంచి రాజకీయాలు చూస్తున్నవారు చెబుతుంటారు. ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రిగా ఉంటూనే ఆయన తెలివిగా ఎన్టీఆర్ ప్రతిష్టను తగ్గించే వ్యూహాలు అమలు చేశారని ఆరోపణలున్నాయి. ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతిని బూచిగా చూపెట్టేందుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి పత్రికలను బాగా వాడుకోగలిగేవారు. ఈనాడు చూడడానికే అసహ్యంగా ఉండే ఘోరమైన కార్టూన్లు ఎన్టీఆర్‌పై వేసేది. అయినా ఆ రోజుల్లో ఈ పత్రికలపై ఎన్టీఆర్ కేసులు పెట్టలేదు.మామను కూలదోసి ముఖ్యమంత్రి అయిన తరువాత చంద్రబాబు పాలన మాటెలా ఉన్నా అనుకూల మీడియా వ్యవస్థనైతే బాగానే ఏర్పాటు చేసుకున్నారు. మీటింగ్‌లు జరిగినా, జరగకపోయినా, కల్పిత కథనాలకు కొదవ ఉండేది కాదు. అదే టైమ్‌లో రాజకీయ ప్రత్యర్థులపై బురద చల్లే వ్యూహాలు పక్కాగా అమలయ్యేవి. ఆ రోజుల్లో కూడా ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాసే కొన్ని పత్రికలకు ప్రభుత్వ ప్రచార ప్రకటనలు నిలిపివేసే వారు. కానీ ఇప్పటిలా బరితెగించి మరీ కేసులు పెట్టేవారు కాదనే చెప్పాలి. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడం చంద్రబాబుకు కొత్తకాదు. అయితే, ఆ హామీలను అమలు చేయకపోయినా ఎవరూ వాటిని గుర్తు చేయకూడదు! అందుకోసం ఆయన నానా ప్రయత్నాలూ చేస్తుంటారు.2014లో రైతుల సంపూర్ణ రుణమాఫీ కావచ్చు.. కాపుల రిజర్వేషన్ ఉద్యమం కావచ్చు.. మరేదైనా కావచ్చు. చంద్రబాబు పంథా ఒక్కటే. తనకు వ్యతిరేకంగా ఏదైనా జరుగుతుంటే అనుకూల మీడియా చేత వాటిని అణచివేసే ప్రయత్నం చేయడం. అంశం ఏదైనా.. టీవీ ఛానళ్లలో అనుకూల ప్రచారమే సాగాలన్నది ఆయన ఆకాంక్ష. కాపుల రిజర్వేషన్ విషయమే తీసుకుందాం.. ఇచ్చిన హామీ అమలుకు ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేపడితే ఆ విషయం ప్రజలలోకి వెళ్లనీయకుండా కొన్ని టీవీ చానళ్లను బ్లాక్ చేయడానికి యత్నించారు. ఇదే చంద్రబాబు ప్రతిపక్షంలో ఉంటే మాత్రం అధికార పార్టీపై వ్యతిరేక వార్తలు రాయాలని జర్నలిస్టులకు నూరి పోస్తుంటారు. దానికి తగినట్లే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి తమ రాజకీయ, వ్యాపార ప్రయోజనాల కోసం ఉన్నవి, లేనివి కల్పించి వార్తలు ఇచ్చేవి. ఈ మీడియా 2019-2024 మధ్యలో ముఖ్యమంత్రి జగన్‌పై కక్కినంత విషం బహుశా ప్రపంచంలోనే మరే మీడియా కక్కి ఉండదు. ఇందుకోసం పచ్చి అబద్ధాలు రాసేందుకూ వెనుకాడలేదు ఈ సంస్థలు.టీడీపీ మీడియా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్‌ను కించపరిచేలా కథనాలు ఇచ్చినా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ తదితరులు దారుణమైన వ్యాఖ్యలు చేసినా అప్పట్లో ఎవరిపై కేసులు పెట్టలేదు. కానీ 2024లో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చంద్రబాబు.. సాక్షి మీడియా అణచివేతకు యత్నిస్తూనే ఉన్నారు. పలువురు విలేకరులపై పోలీసు కేసులు నమోదవడం ఇందుకు నిదర్శనం. నెల్లూరు జిల్లా కావలి వద్ద ఎప్పుడో మూడేళ్ల క్రితం శిలాఫలకం పడవేశారంటూ అప్పటి ఎమ్మెల్యేతోపాటు విలేకరిపై కూడా కేసు పెట్టారట. అప్పుడు ఏం చేశారో కాని, కూటమి అధికారంలోకి వచ్చాక, టీడీపీ, జనసేన వారు లెక్కలేనని శిలా ఫలకాలను ధ్వంసం చేసినా ఒక్క కేసు నమోదు కాలేదు. మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఎవరెవరో ఫిర్యాదు చేయడం పోలీసులు హుటాహుటిన వైఎస్సార్సీపీ వారిని అరెస్టు చేయడం సాధారణమై పోతోంది.ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి లోకేశ్ ‘రెడ్ బుక్’పేరుతో కక్ష రాజకీయాలు చేస్తున్నారు. ఎందుకు ఇవన్నీ?. చాలా సింపుల్ ప్రభుత్వ తప్పులు ఎవరూ ఎత్తి చూపకూడదు. సూపర్ సిక్స్ తో సహా ఎన్నికల సమయంలో ఇచ్చిన 150 హామీలు ఎందుకు అమలు చేయడం లేదని ఎవరూ ప్రశ్నించకూడదు. గత ప్రభుత్వం చేసిన అప్పులపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదితరుల అసత్యపు ప్రచారాన్ని ఎవరూ గుర్తు చేయకూడదు. ఏడాది తిరగకుండానే కూటమి ప్రభుత్వం చేసిన రూ.1.5 లక్షల కోట్ల అప్పులు ఎందుకు? దేనికి ఖర్చుపెట్టారు? అని ఎవరూ అడగకూడదు. ప్రభుత్వంలో జరుగుతున్న కుంభకోణాలను ఎవరూ వెలికి తీయకూడదు. సాక్షి మీడియా ఇవన్నీ చేస్తున్నందునే చంద్రబాబు ప్రభుత్వం కక్ష కట్టి దాడి చేస్తోంది.నిజానికి సాక్షి మీడియా ప్రతీ వార్తనూ ఆధార సహితంగానే రాస్తుంది. సౌర శక్తి ఒప్పందాలనే తీసుకుందాం. జగన్ హయాంలో యూనిట్‌కు రూ.2.49లకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సంస్థ సెకీతో ఒప్పందం చేసుకుంది. ఇందుకు గగ్గోలు పెట్టిన చంద్రబాబు, ఎల్లోమీడియా..లక్ష కోట్ల రూపాయల నష్టం జరిగిపోయిందని ప్రచారం చేశాయి. తీరా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిందేమిటి? అదే విద్యుత్తును రూ.4.60లకు కొనుగోలు చేస్తున్నారు. అంటే.. యూనిట్‌కు దాదాపు రెండు రూపాయలు ఎక్కువ పోసి కొంటున్నారన్నమాట. అయినా సరే.. దీనిపై ఈనాడు, ఆంధ్రజ్యోతుల్లో ఒక్క వార్త కూడా రాలేదు. సాక్షి మాత్రం పక్కా ఆధారాలతో జరిగిన అవినీతిని వివరించారు. సౌర శక్తి కొనుగోళ్ల విషయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో చంద్రబాబు ప్రభుత్వ ప్రతిష్ట మసకబారింది.అలాగే.. విశాఖలో టీసీఎస్‌కు 99 పైసలకు ఎకరా భూమి ఇవ్వడం, ఊరు, పేరు లేని ఒక కంపెనీకి అరవై ఎకరాలు కట్టబెట్టడం, అమరావతి రాజధాని నిర్మాణాల పేరుతో అధిక రేట్లకు ఇష్టారాజ్యంగా టెండర్లు కేటాయించడం, అప్పుల కోసం ఏకంగా రాష్ట్ర ఖజానాను కూడా తాకట్టు పెట్టడం పెన్షన్లు మినహా మరే హామీ అమలు చేయకపోవడంతో ప్రజలలో అసంతృప్తి నెలకొనడం మొదలైన వార్తలను సాక్షి మీడియా ఇస్తోంది. ఏలికలకు ఇది పంటికింద రాయిలా మారింది. దీంతో సాక్షిని ఇబ్బంది పెట్టడానికి యత్నిస్తోంది. ఈ క్రమంలో ఆధారాలు లేని మద్యం స్కామ్‌ను సృష్టించి వైఎస్సార్సీపీ నేతల అరెస్టుకు చంద్రబాబు.. పోలీసులను ప్రయోగించారు. నిందితులు సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి ఇంటిలో ఉన్నారన్న అనుమానం వచ్చిందని పోలీసులు.. చెప్పా పెట్టకుండా విజయవాడలో ఆయన ఇంటిపై పడ్డారు. నిజంగా అలాంటి అనుమానం ఉంటే ఏమి చేయాలి? సెర్చ్ వారంటే ఇచ్చి సోదాలు చేయాలి. అసలు ఒక పత్రికా సంపాదకుడి ఇంటికి అంత ధైర్యంగా వెళ్లారంటే ఈ ప్రభుత్వం ఎంత నియంతృత్వంగా వ్యవహరిస్తున్నది అర్థం చేసుకోవచ్చు.సాక్షి సిబ్బందిని మానసికంగా వేధించడానికి ఇలా చేసినట్లు తెలుసుకోవడం కష్టం కాదు. ఇంత మాత్రానికే సాక్షి మీడియా వణికిపోతుందా?. 2008 నుంచి సాక్షి మీడియా ఇలాంటి ఆటుపోట్లను ఎన్నింటినో ఎదుర్కొంది. ఈ మీడియాను దెబ్బతీయడానికి చంద్రబాబు కాంగ్రెస్‌తో కలిసి ఎన్ని కుట్రలు పన్నింది.. ఎన్ని కేసులు పెట్టించింది తెలియనిది కాదు. 2014 టర్మ్‌లో కూడా సాక్షిని లేకుండా చేయాలని ప్రయత్నించి విఫలం అయ్యారు. తిరిగి ఈ టర్మ్‌లో అంతకన్నా ఎక్కువగా కక్ష సాధింపు చర్యలకు తెగిస్తున్నారు. ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి వాటిని సమర్థంగానే ఎదుర్కొన్నారు. పోలీసులు మూడు గంటలపాటు అక్కడ ఉన్నా వారికి ఏమీ దొరకలేదు. దాంతో వారు సైలెంట్‌గా వెళ్లిపోక తప్పలేదు. సెర్చ్ వారంట్ లేకుండా వెళ్లడం ద్వారా పోలీసులు దుశ్చర్యకు పాల్పడినట్లు అయింది.ఇక, ఎమర్జన్సీలో సైతం ఇందిరాగాంధీ ఇలాంటి పద్దతులు అనుసరించి మీడియా గొంతు నులమాలని విశ్వయత్నం చేశారు. కానీ, అంతిమంగా ఆమె ఘోర పరాజయాన్ని మూట కట్టుకున్నారు. తొలుత ఇందిరాగాంధీ శిష్యుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసి, ఆ తర్వాత తెలుగుదేశంను తన అధీనంలోకి తెచ్చుకుని రాజకీయం చేస్తున్న చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు అవే పద్దతులు అవలంభిస్తున్నారు. చరిత్ర చెప్పిన పాఠాలను మర్చిపోయి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఎవరికైనా ఓటమి తప్పదు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
KSR Live Show; భజంత్రీ బిల్డప్ బాబాయ్ ఓవరాక్షన్
-
బిల్డప్ బాబాయ్ బడాయి!
అమరావతిలో నాలుగు వేల ఎకరాలు అమ్మితే రూ.80 వేల కోట్లు వస్తాయట! ఎల్లో మీడియాలో బిల్డప్ బాబాయి రాసిన ఒక కథనం చెబుతోంది. రాజధాని పేరుతో లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలా ప్లాన్ చేశారన్నమాట! ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. విశాఖపట్నంలో టీసీఎస్‌కు కేవలం 99 పైసలకే భూములు కేటాయించిన ప్రభుత్వం అమరావతిలో మాత్రం ఆయా సంస్థలకు ఎకరా రూ.20 కోట్లకు విక్రయించాలని నిర్ణయించిందట.ఇలా సంపాదించిన మొత్తాన్ని అమరావతిలో వివిధ ప్రాజెక్టులకు, రుణాల చెల్లింపులకూ ఉపయోగిస్తారని ఈ మీడియా చెబుతోంది.ఎవరైనా నమ్మగలరా? గోబెల్స్ మాదిరి ఒకటికి, పదిసార్లు ప్రచారం చేస్తే జనం నమ్మక చస్తారా అన్నదే వీరి ధీమా కావచ్చు. గతంలో జగన్ ప్రభుత్వంపై ఇష్టారీతిలో అబద్దాలు రాసిన ఎల్లో మీడియా, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కొమ్ముకాస్తూ అసత్యాలు ప్రచారం చేస్తోంది. ఇక్కడ ఒక కిలకమైన విషయం ఉంది. మూడేళ్లలో రాజధానికి సంబంధించిన కొన్ని భవనాలను పూర్తి చేస్తామని చంద్రబాబు చెబుతున్నా, ప్రపంచ బ్యాంక్, ఇతర ఆర్థిక సంస్థలు మంజూరు చేసిన రూ.31 వేల కోట్లు మూడేళ్లలో ఇవ్వడం లేదు. దశల వారీగా ఐదారేళ్లలో ఇస్తాయని ఎల్లో మీడియానే తెలిపింది. అందుకనే బ్యాంకర్లతో కూడా చర్చలు జరిపి మరో రూ.40 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ సంగతి బయటకు వస్తే మరింత అల్లరి అవుతుందని భయపడి, డైవర్ట్ చేయడానికి భూములు అమ్మడం ద్వారా రూ.80 వేల కోట్ల రూపాయలు వస్తాయని ప్రచారం ఆరంభించారు. హైదరాబాద్ లోనే ఏవో కొన్ని ప్రదేశాలలో తప్ప ఎకరా ఇరవై కోట్ల ధర పలకడం లేదు. గత ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ లో ఎకరా వంద కోట్లకు వేలంలో పోయిందని చెప్పినా, ఆ రకంగా కొనుగోలు చేసిన సంస్థలు ఆ డబ్బు చెల్లించలేదు. ఇటీవలీ కాలంలో ఆర్థిక మాంద్యం ఏర్పడిన పరిస్థితిలో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బాగా దెబ్బతింది. అమరావతిలో పలు రకాలుగా గిమ్మిక్కులు చేస్తున్నా భూముల విలువలు ఆశించిన రీతిలో పెరగడం లేదు. చంద్రబాబు సొంతంగా ఇల్లు కట్టుకుంటున్నట్లు చెప్పినా, చివరికి ప్రధాని మోడీని తీసుకువచ్చి అమరావతి పనుల పునః ప్రారంభం అంటూ హడావుడి చేసినా పరిస్థితిలో పెద్దగా మార్పు రావడం లేదు. దాంతో ఇప్పుడు ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని అప్పులన్నీ భూముల అమ్మకం ద్వారా తీరిపోతాయని చెబుతూ కొత్త డ్రామాకు తెరదీశారు. ఏ సంస్థ ఎకరా రూ.ఇరవై కోట్లకు కొనుగోలు చేయడానికి సిద్దం అవుతుంది? రియల్ ఎస్టేట్ సంస్థలు సైతం ఈ ధరకు ఎందుకు కొనుగోలు చేస్తాయి? అమరావతిలో సమీకరించిన 33 వేల ఎకరాల భూమి, ప్రభుత్వ భూమి మరో ఇరవై వేల ఎకరాలు కలిపి అభివృద్ది చేసిన తర్వాత పదివేల ఎకరాల భూమి ప్రభుత్వానికి మిగులుతుందని తొలుత చెప్పారు. ఆ తర్వాత దానిని ఎనిమిదివేల ఎకరాలు అన్నారు. తదుపరి రెండువేల ఎకరాలే మిగులుతుందని చెప్పారు. ఇప్పుడు నాలుగువేల ఎకరాలు మిగులుతుందని అంటున్నారు. వీటిలో దేనిని నమ్మాలి? ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ఉన్న 53 వేల ఎకరాల భూమి చాలదు కనుక మరో 44 వేల ఎకరాలు సమీకరిస్తామని చెప్పారు. ఐదు వేల ఎకరాలలో కొత్త విమానాశ్రయం నిర్మిస్తామని, అది కట్టకపోతే ఈ భూములు అన్ని వృథా అయిపోతాయని, కేవలం మున్సిపాల్టీగా మిగిలిపోతుందని చంద్రబాబే బెదిరించారు. గతంలో 53 వేల ఎకరాలు సరిపోతుందని అన్నారు కదా అంటే దానికి జవాబు ఇవ్వరు. కేవలం ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ఏవో కట్టు కధలు చెప్పడం ద్వారా జనాన్ని మభ్య పెట్టే దిశలోనే సర్కార్ అడుగులు వేస్తోంది. మరో విశేషం ఉంది. రెండో దశలో ఎంత భూమి మిగులుతుందో తెలియదు కాని, అప్పుడు అమ్మే భూమిని రియల్ ఎస్టేట్ సంస్థలకు 60ః40 రిష్పత్తిలో భూములు ఇస్తారట. వారు అభివృద్ది చేసిన గృహాలు ,విల్లాలు, వాణిజ్య ప్లాట్ల రూపంలో ప్రభుత్వానికి ఆస్తులు సమకూరతాయట.ఇదంతా గాలిలో మేడలు కట్టినట్లే అనిపిస్తుంది. కీలకమైన అంశం ఏమిటంటే చంద్రబాబు మూడేళ్లలో ఐకానిక్ టవర్లతో సహా ఆయా భవనాల నిర్మాణం చేస్తామని చెప్పినా, దశల వారీగా వచ్చే నిధులతో పనులు పూర్తి కావని ఎల్లో మీడియానే స్పష్టం చేసింది. అందుకే బ్యాంకుల ద్వారా రూ.40 వేల కోట్లు సమీకరించాలని రాజధాని అభివృద్ది సంస్థ తలపెడుతోందట.దీంతో అమరావతి అప్పు రూ.70 వేల కోట్లు అవుతుంది. మంత్రి నారాయణ లక్ష కోట్ల రూపాయల విలువైన పనులు చేపడుతున్నట్లు ప్రకటించారు. వాటన్నిటిని పూర్తి చేయడానికి ఇంకో 30 వేల కోట్లు అవసరం అవుతాయి. కాలం గడిచే కొద్ది నిర్మాణ వ్యయం పెరుగుతుంది. ఐదేళ్ల క్రితం నిర్ణయించిన రేట్లకన్నా డబుల్ రేట్లను కాంట్రాక్టర్ లకు చెల్లించి భవనాలను చేపడుతున్న సంగతి తెలిసిందే. అలాంటప్పుడు మూడేళ్లకు ఈ పనులు పూర్తి కాకపోతే సహజంగానే ఇంకా రేట్లు పెరుగుతాయి. ఆ మొత్తం ఎంత అవుతుందో ఇప్పుడే చెప్పలేం. లక్షల కోట్ల రుణాలు తెచ్చి పనులు చేపడితే ఏపీ ప్రజలపై పడే అప్పు భారం తడిసి మోపెడవుతుంది. ముందుగా లక్షల కోట్లు వ్యయం చేసి ఈ మొత్తం భూమికి ప్రాధమిక సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత నిజంగానే భూమి ప్రభుత్వానికి ఏదైనా మిగిలితే దానిని ఎకరా రూ.20 కోట్లకు అమ్మాలి. దానిని ఆ ధరకు కొనడానికి ఎన్ని సంస్థలు ముందుకు వస్తాయన్నది చెప్పలేం. ఒకవేళ ఆ ధరకు కొనడానికి ఎక్కువమంది సిద్దపడకపోతే పరిస్థితి ఏమిటన్నది కూడా ప్రభుత్వం ఆలోచించాలి కదా? అదేమీ లేకుండా చేతిలో మీడియా ఉంది కదా అని ఇలాంటి కల్పిత కధలు సృష్టించి ప్రజల జీవితాలతో ఆడుకోవడం సరైనదేనా? అసలు ప్రభుత్వం తనకు అవసరమైన కొద్దిపాటి భవనాలను నిర్మించుకొని, మిగిలిన భూమిని రైతులకే వదలివేసి ఉంటే,వారే రియల్ ఎస్టేట్ వారికో, లేక ఇతరులతో అమ్ముకుంటారు కదా? ఈ పని అంతా ప్రభుత్వం ఎందుకు భుజాన వేసుకుంటోంది? కేవలం తమ వర్గంవారి ఆస్తుల విలువలు పెంచడానికే ఈ తంటాలు అన్న విమర్శకు ఎందుకు ఆస్కారం ఇస్తున్నారు? గతంలో కూడా అభూత కల్పనలు, అర్ధ సత్యాలు రాసి ప్రజలను ఏమార్చే యత్నం చేశారు. ప్రపంచ స్థాయి రాజధాని అంటూ దేశ,దేశాలు తిరిగి వచ్చారు.అసలు ప్రపంచ రాజధాని అవసరం ఏమిటి?ఒక రాష్ట్ర ప్రభుత్వంతో అయ్యేపనేనా?భవిష్యత్తులో ఈ ప్లాన్ లన్నీ తలకిందులైతే ఎపి ప్రజలు ఆర్ధికంగా తీవ్రంగా నష్టపోరా? అలాంటి వాటిని పరిగణనలోకి తీసుకుని, అన్ని రక్షణ చర్యలు చేపట్టిన తర్వాత పెద్ద రాజధాని కట్టుకుంటారా? మహా నగరాన్ని నిర్మించుకుంటారా? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటారా? అన్నది మీ ఇష్టం.అలా కాకుంటే ఏదో రకంగా తన సొంత కీర్తి కోసం నగర నిర్మాణం చేపట్టి ఏపీ ప్రజలను నట్టేట ముంచారన్న అపకీర్తిని చంద్రబాబు మూట కట్టుకోవల్సి ఉంటుంది. ఎల్లో మీడియా ఇచ్చే దిక్కుమాలిన సలహాలు విని చంద్రబాబు మునుగుతారా? లేక వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరిస్తారా? అన్నది ఆయన ఇష్టం.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘అప్పుడు రూ. 2.49.. ఇప్పుడు రూ. 4.60.. మరి ఇదేంటి బాబూ?’
సాక్షి,విశాఖ: వైఎస్సార్సీపీ అధినేత, వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తప్పుడు వార్తలు రాసిన ఎల్లోమీడియా క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. యాక్సిస్‌తో కుదుర్చుకున్న ఈ ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని గుడివాడ అమర్నాథ్ కూటమి ప్రభుత్వానికి సూచించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ‘కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకితో వైఎస్ జగన్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే అవినీతి జరిగిందంటూ తప్పుడు ప్రచారం చేశారు. లక్ష కోట్ల అవినీతి జరిగిందని తప్పుడు వార్తల రాశారు. సెకితో అత్యంత తక్కువ రేటుకు 2.49 రూపాయలకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. కూటమి ప్రభుత్వం యాక్సిస్ కంపెనీతో యూనిట్‌కు రూ.4.60 రూపాయలకు విద్యుత్ ఒప్పందం చేసుకుంది. రూ.2.49 రూపాయలకు ఒప్పందం చేసుకుంటే అవినీతి జరిగిందన్న మీరు రూ.4.60 ఎలా ఒప్పందం చేసుకున్నారు. రూ.2.11 రూపాయలకు ఎక్కువ కొనుగోలు చేశారు. ఈ ఒప్పందాలపై ఎల్లో మీడియా ఎందుకు వార్తలు రాయడం లేదు. రూ.2.49 అత్యంత తక్కువ ధరకు కొనుగోలు చేసిన వైఎస్ జగన్‌పై రాసిన తప్పుడు వార్తలకు ఎల్లోమీడియా క్షమాపణలు చెప్పాలి.కూటమి ప్రభుత్వ కొనుగోలు వల్ల రాష్ట్ర ఖజానాకు రూ.11 వేల కోట్ల రూపాయల గండి పడుతుంది. దీనిపై కూటమి పార్టీల నేతలు ఏం సమాధానం చెబుతారు. డబ్బులు ఎలా కొట్టి వేయాలనే దానిమీద ఈ ఏడాది పరిపాలన జరిగింది. యాక్సెస్‌తో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలి. ప్రభుత్వ అవినీతిని ప్రజల్లో పెడతామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా, వ్యవసాయ విద్యుత్ అవసరాలకు దాదాపు 30ఏళ్ల పాటు ఢోకా లేకుండా రైతులకు పగటి పూటే 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించేలా కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో ఏడువేల మెగావాట్ల విద్యుత్ ఒప్పందాన్ని కారుచౌకగా నాడు వైఎస్ జగన్ ప్రభుత్వం యూనిట్‌కు రూ.2.49కే అందించేలా ఒప్పందం చేసుకుంది. అయితే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం యాక్సెస్ ఎనర్జీ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో యూనిట్‌కు ఏకంగా రూ.4.60లు కొనుగోలు చేస్తూ ఒప్పందం కుదుర్చుకుంది. -
రాష్ట్రంలో మీడియా ట్రయల్ జరుగుతోంది
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మీడియా ట్రయల్ జరుగుతోందని.. ఎల్లో మీడియా ప్రతిరోజూ వైఎస్సార్సీపీ నాయకులే లక్ష్యంగా తప్పుడు కథనాలు వండి వడ్డిస్తోందని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం, ఎల్లో మీడియా, కొందరు పోలీస్ అధికారులు కలిసి చట్ట పరిధిని దాటి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏమీ లేకపోయినా తప్పుడు వార్తలు సృష్టించి.. లిక్కర్ స్కామ్ పేరుతో రాజకీయాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న వారిని, కొందరు ఐఏఎస్ అధికారులను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు.టీడీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌లో చంద్రబాబు పేరును చేర్చిన అధికారులను.. ఇప్పుడు టార్గెట్ చేసుకొని దర్యాప్తును అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో మీడియా ట్రయల్ నిర్వహిస్తున్నారని.. నేరం ఎలా జరిగిందో వారే రాస్తారని.. అందులో ఎవరెవరు ఉన్నారో కూడా వారే రాస్తారని.. ఇంకా ఎవరెవరిని స్కామ్‌లో చేర్చవచ్చో కూడా డిసైడ్ చేస్తూ డిబేట్లు నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనే ఆదేశించారని రాజ్ కేసిరెడ్డి సిట్ విచారణలో చెప్పినట్లుగా ఈనాడులో రాసుకొచ్చారని మండిపడ్డారు. సిట్ ఏ ప్రశ్నలడిగిందో.. దానికి రాజ్ కేసిరెడ్డి ఏ జవాబులిచ్చారో కూడా రాసుకొస్తున్నారంటూ దుయ్యబట్టారు. జర్నలిజం ప్రమాణాలు గాలికొదిలేసి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని.. రాజ్ కేసిరెడ్డి ఒకటి చెబితే ఇక్కడ మరొకటి రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి కోసం ఇదంతా చేస్తున్నారని ఎల్లో మీడియాను నిలదీశారు. మిథున్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగినప్పుడు.. మిథున్‌రెడ్డి పాత్రను ఎక్కడా ధ్రువీకరించలేదంటూ ప్రాసిక్యూషన్ చెప్పిందని గుర్తు చేశారు. మళ్లీ సుప్రీంకోర్టులో మిథున్‌రెడ్డికి సంబంధం ఉందంటూ కౌంటర్ వేశారని మండిపడ్డారు. కోర్టులను కూడా తప్పుదోవపట్టించేలా ప్రాసిక్యూషన్ వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాజ్యాంగం, చట్టం, కోర్టులంటే లెక్కలేనితనంగా వ్యవహరిస్తున్నారని.. వారికి ఎల్లో మీడియా వంతపాడుతోందని దుయ్యబట్టారు. వైఎస్ జగన్ మీద ప్రతిరోజూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని.. కూటమి ప్రభుత్వం, కొందరు పోలీస్ అధికారులు, ఎల్లో మీడియా కలిసి ఎవరెవరిని ఎలా ఇరికించాలా? అని కుట్ర పన్నుతున్నాయని మండిపడ్డారు. చట్ట పరిధిని దాటి వ్యవహరిస్తున్న ప్రతి ఒక్కరినీ కోర్టుకీడుస్తామని హెచ్చరించారు. -
అంతా ఎల్లో మాయ.. రుషికొండా గోంగూరా అంటున్న కూటమి!
రుషికొండ నిర్మాణాల విషయంలో ఎల్లోమీడియా చేసిన రాద్ధాంతం గుర్తుందా?. టూరిజం శాఖ ఆధ్వర్యంలోని పాత భవనాలను తొలగించి అత్యాధునిక సదుపాయాలతో కొత్త భవనాలను నిర్మించే యోచన చేసినందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తెలుగుదేశం, జనసేన, ఈనాడు, ఆంధ్రజ్యోతి నానా విమర్శలూ చేశాయి. పర్యావరణం నాశనమైపోతోందని గగ్గోలు పెట్టారు. రిషికొండకు గుండు కొడుతున్నారని దుర్మార్గపు ప్రచారం చేశారు.సీన్ కట్ చేస్తే.. ఆ అభిప్రాయాలు ఇప్పుడు మారిపోయాయి. రుషికొండ వృథాగా పడి ఉన్న భూమి అయిపోయింది. రుషులు నడయాడిన భూమి కాస్తా ప్రైవేటు సంస్థలకు సంపద సృష్టించే కొండలయ్యాయి. ఆ ప్రాంతాన్ని బోడిగుండు చేసినా, పర్యావరణం విధ్వంసమైనా ఫర్వాలేదు. అది అభివృద్ది కింద లెక్క. జగన్ ప్రభుత్వం తరఫున భవనాలు నిర్మిస్తే అదంతా ఆయన వ్యక్తిగత అవసరాల కోసం కడుతున్నట్లు. ప్రస్తుతం వందల కోట్ల రూపాయల విలువైన భూమిని ఉత్తపుణ్యానికి ప్రైవేటు కంపెనీలకు కట్టబెడుతుంటే అది గొప్ప పని.అదేమిటి! మీరే కదా.. రిషికొండపై ఎలాంటి నిర్మాణాలు జరగరాదని చెప్పారే! అని ఎవరైనా ప్రశ్నిస్తే, లోపల నవ్వుకుని పిచ్చోళ్లారా? మేము ఏది రాస్తే దానిని నమ్మాలి?. మళ్లీ మేము మాట మార్చి అబద్దాలు రాస్తే అవే నిజమని నమ్మాలి.. అన్న చందంగా ఎల్లో మీడియా కథనాలు ఉంటున్నాయి. ఎల్లో మీడియా ఇప్పుడు ఏం రాస్తోందో చూశారా!. రిషికొండ భూముల గురించి ప్రశ్నించినా, అమరావతి రాజధానిలో లక్ష ఎకరాల పచ్చటి పంట భూములను ఎందుకు నాశనం చేస్తున్నారని అడిగినా.. అది రాష్ట్ర ప్రగతిపై పగ పట్టినట్లట.. గతంలో ఏ మీడియా అయితే తెలుగుదేశం, జనసేన వంటి పార్టీల కోసం దారుణమైన అసత్యాలు ప్రచారం చేశాయో, ఇప్పుడు అదే మీడియా మొత్తం రివర్స్‌లో రాస్తోంది. కూటమి ప్రభుత్వాన్ని ఎవరూ ప్రశ్నించకూడదట. వారు ఎకరా 99 పైసలకు ప్రైవేటు వారికి, ఉర్సా కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నా అడిగితే విషనాగు బుసలు కొడుతున్నట్లట. ఇలా నీచంగా తయారైంది వీరి జర్నలిజం.ఒకప్పుడు పవిత్రమైన వృత్తిగా ఉన్న ఈ పాత్రికేయాన్ని వ్యభిచార వ్యాపారంగా మార్చేశారన్న బాధ కలుగుతుంది. అయినా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఎవరు ఏమీ చేయలేరు. రిషికొండపై ఐదెకరాల భూమిలో భవనాలు కడితేనే విధ్వంసం అయితే, మరి రాజధాని పేరుతో లక్ష ఎకరాలలో పర్యావరణ విధ్వంసం జరుగుతుంటే ఎవరూ ప్రశ్నించకూడదట. అది పెట్టుబడులను అడ్డుకోవడమట. ఊరూపేరులేని ఉర్సా కంపెనీకి సంబంధించి ప్రభుత్వమే ఇంతవరకు వివరణ ఇవ్వలేకపోయినా, తెలుగుదేశం పక్షాన ఎల్లో మీడియా మాత్రం భుజాన వేసుకుని అది గొప్ప కంపెనీ అని చెబుతోంది. రెండు నెలల క్రితం ఏర్పడిన సంస్థకు ఏకంగా మూడు వేల కోట్ల విలువైన అరవై ఎకరాల భూమిని ఎవరైనా ఇస్తారా?. అదానీకి గత జగన్ ప్రభుత్వం డేటా సెంటర్ నిమిత్తం ఎకరా కోటి రూపాయల చొప్పున భూమి ఇస్తే ఏపీని అదానీకి జగన్ రాసిచ్చేస్తున్నారంటూ ప్రచారం చేసిన వారికి, బోగస్ అని ఆరోపణలు ఎదుర్కుంటున్న కంపెనీ మాత్రం అంతర్జాతీయ సంస్థ. వినేవాడు ఉంటే చెప్పేవాడు ఏమైనా చెబుతాడని సామెత.ఇప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లోమీడియా రీతి అలాగే ఉంది. జగన్ ప్రభుత్వంలో ఏవైనా లోపాలు ఉంటే వార్తలు ఇస్తే తప్పు కాదు. కానీ, ఉన్నవి, లేనివి రాసి పాఠకులను మోసం చేసి, ప్రజలను ప్రభావితం చేయడానికి పత్రికలను పార్టీ కరపత్రాలుగా, టీవీలను బాకాలుగా మార్చేసుకుని నిస్సిగ్గుగా పనిచేస్తుండటమే విషాదకరం. అదే చంద్రబాబు ప్రభుత్వం రాగానే అంతా బ్రహ్మండం, భజగోవిందం అని ఒకటే భజన చేస్తున్నారు. ఇక, అమరావతి విషయానికి వద్దాం. అమరావతి రాజధానికి ఏభై వేల ఎకరాలు సరిపోతుందనే కదా గత ప్రభుత్వ హయాంలో చెప్పింది. మళ్లీ ఇప్పుడు కొత్తగా 45 వేల ఎకరాలు ఎందుకు అని అడిగితే అంతర్జాతీయ నగరం కావాలా? మున్సిపాల్టీగానే ఉంచాలా అన్నది తేల్చుకోవాలన్నట్లుగా ముఖ్యమంత్రే బెదిరిస్తున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం లేకపోతే అది ప్రపంచ నగరం కాదట. అంతర్జాతీయ స్టేడియం లేకపోతే గుర్తింపు ఉండదట. 2014 టర్మ్‌లో నవ నగరాలు అంటూ ఓ పెద్ద కాన్సెప్ట్ చెప్పారు కదా? అందులో క్రీడా నగరం కూడా ఉంది కదా? అప్పుడు కూడా స్టేడియం ప్లాన్ చేశారు కదా? మళ్లీ ఇప్పుడు ఈ పాట ఏమిటి అని అడగకూడదు. అడిగితే అమరావతికి అడ్డుపడినట్లు అన్నమాట.లక్ష ఎకరాలు, లక్ష కోట్ల రూపాయల విలువైన పనులు చేపడుతున్నామని మంత్రి నారాయణ ప్రకటించారు. లక్ష కోట్ల రూపాయల విలువైన పనులు కేవలం రాజధాని పేరుతో ఉన్న ఆ ముప్పై, నలభై గ్రామాలలోనే చేపడితే, మిగిలిన ప్రాంతం పరిస్థితి ఏమిటని ఎవరూ ప్రశ్నించకూడదు. అందుకే వ్యూహాత్మకంగా రాయలసీమకు ఏదో ఇస్తున్నామని, ఉత్తరాంధ్రకు ఇంకేదో ఇస్తున్నామని ఆ ప్రాంత ప్రజలను భ్రమలలో పెట్టడానికి కొన్ని కార్యక్రమాలు చేయడం, ప్రచారం సాగించడం జరుగుతోంది.ఉదాహరణకు ఎప్పటి నుంచో కడప సమీపంలోని కొప్పర్తి పారిశ్రామిక వాడను కొత్తగా ఇవ్వబోతున్నట్లు ఎల్లో మీడియా రాసింది. ఇదంతా డైవర్షన్ రాజకీయం అన్నమాట. మరో వైపు అమరావతి అంటే ఎంత విస్తీర్ణం, పరిధులు ఏమిటి అన్నదానిపై కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు నోటిఫై చేయలేదట. ఇప్పుడు దానిపై ఆలోచన చేస్తారట. ఇంకో సంగతి చెప్పాలి. గత టర్మ్‌లో మోదీ శంకుస్థాపన చేయడానికి ముందు, ఆ తర్వాత, ఆయా నిర్మాణాలకు స్వయంగా చంద్రబాబు తన కుటుంబ సమేతంగా పూజలు, పునస్కారాలు చేసి మళ్లీ శంకుస్థాపనలు చేశారు. కేంద్రం నుంచి కొందరు ప్రముఖులను కూడా అందులో భాగస్వాములను చేశారు. గతంలో మాదిరే ఇప్పుడు కూడా ఆర్భాటాలకు వందల కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకో మాట చెప్పాలి.తెలంగాణలో హైదరాబాద్‌లో 400 ఎకరాల భూమిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏవో నిర్మాణాలు చేయతలపెడితే పర్యావరణం విధ్వంసం అయిందని మోదీనే నానా యాగీ చేశారు. అలాంటిది ఏపీలో లక్ష ఎకరాలలో పర్యావరణాన్ని నాశనం చేస్తుంటే, పచ్చటి పంట భూములను బీడులుగా మార్చుతుంటే, అదంతా అభివృద్ది అని మోదీ కూడా భావిస్తున్నారేమో తెలియదు. చంద్రబాబు, మోదీ.. 2019 టైమ్ లో తీవ్రంగా ఒకరినొకరు విమర్శించుకున్నారు. దేశ ప్రధానిని ఉగ్రవాది అని చంద్రబాబు అంటే, ఈయనను పెద్ద అవినీతిపరుడని, పోలవరంను ఏటీఎంగా మార్చుకున్నారని మోదీ ధ్వజమెత్తారు. 2024 నాటికి మళ్లీ సీన్ మారింది. వీరిద్దరూ ఒకరినొకరు పొగుడుకుంటున్నారు. ఇదేమిటి.. ఇంత సీనియర్ నేతలు ఇలా చేయవచ్చా అని ఎవరైనా అమాయకులు అడిగితే అది వారి ఖర్మ అనుకోవాలి.గతసారి మోదీ అమరావతి వచ్చి చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి ఇచ్చి వెళ్లారని అప్పట్లో చంద్రబాబు నిందించేవారు. ప్రస్తుతం కేంద్రం బ్రహ్మాండంగా సాయం చేస్తోందని చెబుతున్నారు. అది నిజమో కాదో అందరికీ తెలుసు. రిషికొండ అయినా, అమరావతి అయినా తమ రాజకీయ అవసరాలకు ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ఎన్ని డ్రామాలు అయినా ఆడగలుగుతున్నారు. అదే వారి గొప్పదనం.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఎవరి అక్షయపాత్ర అమరావతి?
'అక్షయపాత్ర అమరావతి" ఎల్లో మీడియా ఈనాడులో ప్రధాన శీర్షిక ఇది. ప్రశ్న ఏమిటంటే.. ఇది ఎవరి అక్షయపాత్ర? పేదలకా? లేక ధనికులు, భూస్వాములు, కాంట్రాక్టర్లకా? బాబు గారి వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని ఒకరోజు కోసమైనా మళ్లించేందుకు ఇలాంటి శీర్షికలు, కథనాలు ఉపయోగపడతాయేమో కానీ.. అన్నివేళలా మాత్రం కాదు. లేదంటే.. తమ వర్గానికి అనూహ్యస్థాయి లబ్ధి చేకూరుతోందని ఈనాడు యాజమాన్యం సంతోషంతో ఇలాంటి కథనాలు వండి వార్చి ఉండాలి. అయితే... ఈ కథనం వచ్చిన రోజే సాక్షి దినపత్రికలో ఇంకో కథనం వచ్చింది. దీని శీర్షిక 'అవినీతి ఐకానిక్’... అమాంతంగా పెరిగిన ఐదు ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయం’’ అని వివరమైన బ్యానర్ కథనం వచ్చింది. నిజానికి పాత్రికేయ వృత్తిలో ఉన్నవారు. ప్రభుత్వ వ్యవహారాలతోపాటు, అధికారంలో ఉన్నవారు చేస్తున్న వాటిలో మంచి,చెడు విశ్లేషించి రాయాలి. ఎల్లో మీడియా ఆ పని మానేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ అధికారంలో ఉన్నా, లేకపోయినా, ఆయనపైనే ఏడుపుగొట్టు వార్తలు, అబద్ధాలు రాయడమే పనిగా పెట్టుకుంది. కూటమి వైఫల్యాలను కప్పిపుచ్చుతూ ప్రజలను వంచించడానికి కృషి చేస్తోంది. అందుకే ఆరికి అమరావతిలో అంతా అద్భుతంగానే కనిపిస్తోంది.2014-19 మధ్యకాలంలోనూ అమరావతికి విపరీతమైన హైప్ ఇచ్చారు. ఇప్పుడు మరోసారి అదే బాకా ఊదుతున్నారు. అక్షయపాత్ర అని, ప్రపంచ స్థాయి రాజధాని అని ఊదరగొడుతున్నారు. అయితే వీరి ప్రచార ఆర్భాటానికి మోసపోయి అప్పట్లో భూములు కొన్న వారు ఇప్పటికీ తేరుకోలేదు. మరోసారి మోసపోయేందుకు వారు సిద్ధంగా ఉన్నారా? అన్నది ప్రశ్న. చంద్రబాబు ప్రధానమంత్రి మోడీని కలిసి అమరావతి పనుల పునఃప్రారంభానికి ఆహ్వానించారు. అంతవరకు ఓకే. కాని ఆ సందర్భంగా మోడీతో మాట్లాడిన విషయాలు అంటూ ఈ అక్షయపాత్రను సృష్టించారు. రాష్ట్రంలోని 26 జిల్లాల వాసుల అవసరాలు తీర్చే నగరంగా తీర్చిదిద్దనున్నామని, విద్య, ఉపాధి, వైద్య అవకాశాలు కల్పించే అక్షయపాత్రలా తయారు చేయాలన్నది ముఖ్య ఉద్దేశమని చంద్రబాబు ప్రధానితో అన్నారని ఈ కథనంలో చెప్పారు.ఇది ఎంత వరకూ వాస్తవరూపం దాలుస్తుందో తెలియదు కానీ.. ప్రస్తుతానికైతే రాష్ట్ర ప్రజలందరి నెత్తిన రూ. లక్ష కోట్ల రుణ భారమైతే గ్యారెంటీ. ఎందుకంటే చంద్రబాబు అండ్ కో గతంలో నొక్కి వక్కాణించినట్లు ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ నగరం ఏమాత్రం కాదని ఇప్పటికే స్పష్టమైపోయింది. ఈ నగర నిర్మాణానికి తెచ్చే అప్పులు ఏదో ఒక రూపంలో కట్టాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రజలే. లబ్ధి మాత్రం నేతలదవుతుంది. అమరావతిలో ఐకానిక్ టవర్ల నిర్మాణ టెండర్లు పిలిచిన తీరు, కావల్సిన వారికి వాటిని కేటాయించుకున్న వైనం, అమాంతం రేట్లు పెంచేసిన పద్దతి ఇవన్ని చూస్తుంటే కాంట్రాక్టర్లకు, కూటమి పెద్దలకు అమరావతి కచ్చితంగా అక్షయపాత్రే కానుందని చెప్పవచ్చు.మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ సిమెంట్, స్టీల్ రేట్లు 2019 నాటికన్నా తగ్గాయని, అయినా అమరావతిలో నిర్మాణాల వ్యయాన్ని రూ.38 వేల కోట్ల నుంచి రూ.77 వేల కోట్లకు పెంచేశారని విమర్శించారు. సచివాలయం, ముఖ్యమంత్రి కార్యాలయం, విభాగాల అధిపతుల కార్యాలయాల కోసం సీఆర్డీఏ టెండర్లు పిలిచింది. చదరపు అడుగుకు రూ.8981ల చొప్పున ఖర్చుపెట్టడానికి ఓకే అయింది. మొత్తం రూ.4688 కోట్ల వ్యయం అవుతుంది. 2018లో ఇవే టవర్లకు రూ.2271 కోట్లు అవుతుందని అంచనా వేశారు. అప్పట్లో చదరపు అడుగుకు రూ.4350లే చాలా ఎక్కువ అని అనుకుంటే, ఇప్పుడు దానిని డబుల్ చేశారు.నిజానికి హైదరాబాద్‌లో భూమి విలువతో లెక్కవేసుకున్నా ఈ స్థాయి ఖర్చు కాదని పలువురు బిల్డర్లు చెబుతున్నారు. అమరావతిలో భూమి ఖర్చు లేదు. ఇసుక ఉచితం. ఇతర నిర్మాణ సామాగ్రీ ధరలు కూడా గతంతో పోలిస్తే తక్కువగా ఉన్న నేపథ్యంలో నిర్మాణ వ్యయం పెరగడం అసాధారణమైన విషయమని చెబుతున్నారు. ఒక ఐకానిక్ టవర్‌లో 49 అంతస్తులు, మరో మూడు టవర్లు 39 అంతస్తులు చొప్పున నిర్మించబోతున్నారు. మొత్తం ప్రభుత్వంలో పర్మనెంట్ సిబ్బంది రెండువేల లోపు ఉంటే, ఇతరత్రా అంతా కలిపి మరో రెండువేల మంది ఉంటారని అనుకున్నా, ఈ స్థాయిలో భవనాల అవసరం ఏమిటో అర్థః కాదు.ప్రస్తుతం తాత్కాలిక సచివాలయంలో ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉద్యోగులు పనిచేస్తున్నారు. పోనీ దీనికి రెట్టింపు స్థలం అవసరం అనుకుంటే 12 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన భవనాలు నిర్మిస్తే సరిపోతుంది. అలా కాకుండా ఏకంగా 52 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ నిర్మాణాలు చేపడతారట. నాలుగు టవర్లలో మొత్తం సచివాలం నిర్మిస్తుంటే, ఇన్నివేల ఎకరాల భూమి దేనికో తెలియదు.ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ సచివాలయంతో సహా అన్ని భవనాలు కలిపి కూడా సుమారు 250 ఎకరాలలోపే ఉంటాయని అంటారు. ఇతర రాష్ట్రాల రాజధానులలో సైతం ఎక్కడా రెండు, మూడు వేల ఎకరాలకు మించి కార్యాలయాలకు వాడడం లేదు. తెలంగాణలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు నిర్మించిన సచివాలయానికి సుమారు వెయ్యికోట్లు అయితే, విభజిత ఏపీలో కేవలం రూ.4688 కోట్లు ఖర్చుపెట్టబోతున్నారు. ఇది ఇక్కడితో ఆగుతుందని గ్యారంటీ లేదు. ఇప్పటికే తాత్కాలిక సచివాలయం కోసం వెయ్యి కోట్లకుపైనే వ్యయం చేశారు. అందులో అవినీతి జరిగిందని ఆరోపణలు రావడం, కేంద్ర ప్రభుత్వ శాఖలు అప్పటి చంద్రబాబు పీఏ ఇంటిపై దాడిచేసి రూ.రెండు వేల కోట్ల అక్రమాలు జరిగాయని గుర్తించడం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు దానిని మేనేజ్ చేశారని అంటున్నారు. అందువల్లే అన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలు తదుపరి అడుగు ముందుకు వేయలేదు. అది వేరే సంగతి.ఇప్పుడు కూడా ఈ స్థాయిలో ఖర్చుపెడితే ప్రజలపైనే భారం పడుతుంది కదా! అసెంబ్లీ, తదితర నిర్మాణాలకు ,భూములు ఇచ్చిన రైతులకు రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, నీరు తదితర అన్ని వసతులు కల్పించడానికి ఇంకెన్ని వేల కోట్లు అవసరం అవుతాయో ఎవరూ చెప్పలేరు. కాంట్రాక్టర్లకు పనుల విలువలో పది శాతం ముందుగానే ప్రభుత్వం చెల్లిస్తుందట. ఇందులో ఎనిమది శాతం వరకు ప్రభుత్వ పెద్దలకు కాంట్రాక్టర్లు ముట్ట చెబుతారని ఇప్పటికే వైసీపీ ఆరోపించింది. గతంలో మొబిలైజేషన్ అడ్వాన్స్ పద్దతిని వ్యతిరేకించిన టీడీపీ ఇప్పుడు ఎందుకు అమలు చేస్తోందో చెప్పాలి కదా? మొత్తం మీద ఇది పేదలు, మధ్య తరగతి వర్గాలకు ఉపయోగపడే రాజధాని కాదు. పెత్తందార్లకు, కాంట్రాక్టర్లు, బడాబాబులకు మాత్రమే ఉపయోగపడేదని తేలడం లేదా?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
లిక్కర్ కేసులో భేతాళ కథలు.. అన్నీ కుట్రలే: మనోహర్ రెడ్డి
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు హయాంలో జరిగిన లిక్కర్ కుంభకోణాన్ని బయట పెట్టినందుకే ఇప్పుడు పోటీగా కేసును పెట్టారని చెప్పుకొచ్చారు వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి. లిక్కర్ కేసులో భేతాళ కథలు, కుట్రలు తప్ప మరేమీ లేదని ఎద్దేవా చేశారు. దీనిపై ఎల్లో మీడియా అడ్డగోలుగా విష ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ఏపీలో లిక్కర్ స్కాం అంటూ ఎవరితోనో ఒక లెటర్ రాయించి కేవలం తొమ్మిది రోజుల్లోనే విచారణ చేసినట్టు చూపించారు. అసలు ఆ తొమ్మిది రోజుల్లో ఎవరెవరిని విచారణ చేశారో కూడా చెప్పలేదు. తాము ఇరికించాలనుకున్న వ్యక్తుల పేర్లను లిక్కర్ కేసులో వరుసగా పెట్టేస్తున్నారు. సిట్‌ని ఏర్పాటు చేస్తే దానికంటూ ప్రత్యేకంగా ఒక పోలీసు స్టేషన్ ఉండాలి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. కానీ అవేమీ లేకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారుఅప్పటి ముఖ్యమంత్రిని కూడా కేసులో ఇరికించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సిట్‌లోని అధికారులంతా పాలకులు చెప్పినట్టే కేసును నడిపిస్తున్నారు. గౌరవంగా బతికే పారిశ్రామికవేత్తలను కూడా వేధిస్తున్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన లిక్కర్ స్కాంని బయటపెట్టినందుకే పోటీగా ఇప్పుడు కేసును పెట్టారు. నేర అంగీకార పత్రాలపై రాజ్ కెసిరెడ్డి సంతకాలు చేయలేదు. దీన్ని కోర్టు కూడా గుర్తించింది. అయినప్పటికీ ఎల్లో మీడియా అడ్డగోలుగా విష ప్రచారం చేస్తోంది.జగన్ ప్రభుత్వ హయాంలో అత్యంత పారదర్శకంగా లిక్కర్ పాలసీ అమలైంది. చంద్రబాబు హయాంలో స్కాం జరిగినట్టు లెక్కలే తేల్చాయి. 53% మద్యాన్ని నాలుగు కంపెనీల ద్వారా కొనుగోలు చేయటం వెనుక కుట్ర దాగుంది. ఈ అక్రమాలపై విచారణకు కూటమి ప్రభుత్వానికి దమ్ముందా?. సీబీఐతో విచారణకు ముందుకు రాగలరా?. మా సవాల్ స్వీకరించే ధైర్యం కూటమి ప్రభుత్వానికి ఉందా?. జగన్ హయాంలో పారదర్శకంగా లిక్కర్ పాలసీ అమలైనందున అక్రమాలకు అవకాశం లేదు. కానీ మిథున్‌రెడ్డి సహా అనేక మందిని ఇబ్బందులు పెట్టాలని ప్రభుత్వం చూస్తోంది. పోలీసు అధికారులు చట్టప్రకారం చేయాల్సిన పని చేయటం లేదు. పారిశ్రామిక వేత్తల నుండి వైఎస్సార్సీపీ నేతల వరకు అందరినీ బెదిరిస్తున్నారు. తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేసి, ఇబ్బందులు పెడుతున్న పోలీసులపై చర్యలు తప్పవు’ అంటూ హెచ్చరించారు. -
ఎల్లో మీడియాకు ఎంత ముడుతోందో?
‘ఖజానాకు కిక్కు’ కొద్ది రోజుల క్రితం ఎల్లో మీడియా పత్రిక ఒకటి పెట్టిన శీర్షిక ఇది. ఏపీలో మద్యం విచ్చలవిడి ప్రవాహంపై ఆందోళన చెందాల్సిన మీడియా ఏడాదిలో మద్యం వ్యాపారం ద్వారా ప్రభుత్వ ఆదాయం 14 శాతం వృద్ది చెందిందని సంబరపడింది. 2024-25లో రూ.28,842 కోట్ల రాబడి మద్యం ద్వారా వచ్చిందని ఎగిరి గంతేసినట్లు ప్రచారం చేసింది.గత సంవత్సరం అంటే జగన్ ప్రభుత్వ చివరి సంవత్సరంలో వచ్చిన మొత్తం కన్నా రూ.3750 కోట్లు ఎక్కువ అని ఈ కథనంలో చెప్పారు. అంతటితో ఆగి ఉంటే బాగుండేది. కానీ, ఈ పెరిగిన ఆదాయమంతా జగన్ హయాంలో జరిగిందనడంలోనే పచ్చమీడియా తన కుట్ర స్వభావాన్ని సిగ్గు లేకుండా బయటపెట్టుకుంది. నిజానికి ఇది పిచ్చి వాదన. దీని సాయంతో రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతున్న విషయాన్ని ప్రజల దృష్టి నుంచి తప్పించాలన్నది ప్లాన్ కావచ్చు.జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా మద్యం దుకాణాలను ప్రభుత్వమే నడిపేది. నిర్దిష్ట వేళలు ఉండేవి. మద్యం ప్రియులు కూడా ఇబ్బంది పడేలా దుకాణాలు దూరంగా ఉంచేవారు. బెల్ట్‌షాపుల్లేకుండా చూసుకున్నారు. ఇదంతా చేసింది ప్రజలు మద్యానికి బానిసలు కాకూడదనే. మద్యపాన నియంత్రణకే. అందుకే అప్పట్లో తాగే మద్యం మోతాదు తగ్గినా ఆదాయం మాత్రం రూ.25,082 కోట్ల వరకూ వచ్చింది. అయినా ఇందులో ఏదో కుంభకోణం జరిగిందని కాకి లెక్కలు రాసి వైఎస్సార్సీపీ నేతలను ఇరికించడమే లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఏ రంగమైనా ఏటా ఎంతో కొంత వృద్ధి చెందుతూ ఉంటుంది. బడ్జెట్ల మాదిరిగానే ఎల్లో మీడియా తలతిక్క రాతలను పరిగణనలోకి తీసుకుంటే బడ్జెట్ల రూపకల్పనలోనే కుంభకోణాలున్నట్లు అనుకోవాలి.చంద్రబాబు ప్రభుత్వం మద్యం వ్యాపారాన్ని మళ్లీ ప్రైవేటు వారికి అప్పగించింది. ఆ షాపుల వేలం పాటల ద్వారా కూడా సుమారు రెండు వేల కోట్ల ఆదాయం వచ్చింది. బెల్ట్ షాపుల సంగతి చెప్పనవసరం లేదు. బెల్ట్ షాపులు నిర్వహిస్తే ఐదు లక్షల జరిమానా విధిస్తామని చంద్రబాబు ఉత్తుత్తి హెచ్చరికలు చేస్తున్నట్లు కనిపిస్తున్నా.. టార్గెట్లు పెట్టి అమ్మకాలు చేయిస్తుండటంతో ఇవి మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నాయి. బెల్ట్ షాపులషాపుల నిర్వాహకుల్లో ఎక్కువ మంది టీడీపీ, జనసేనకు చెందినవారే. గుడి, బడి తేడా లేకుండా, నివాస ప్రాంతం, వ్యాపార ప్రాంతం తేడా లేకుండా షాపులు పెడుతున్నారు. గుంటూరు తదితర ప్రాంతాలలో వైన్ షాపులు తీసివేయండి అని మహిళలు మొత్తుకున్నా, ధర్నాలు చేసినా ఎక్సైజ్ శాఖ అధికారులు చీమ కుట్టినట్లుగా కూడా స్పందించడం లేదు!.త్రీస్టార్ హోటల్స్, బార్లు, ప్రివిలేజ్ ఫీజ్ తగ్గించడం, వ్యాపారుల మార్జిన్ పెంచడం స్కామ్‌లు కాదట. ప్రభుత్వపరంగా విక్రయిస్తే స్కామ్ అట. ఏపీలో ఉన్న విచ్చలవిడి మద్యం అమ్మకాల పరిస్థితిని కొందరు టీడీపీ ఎమ్మెల్యేలే బహిరంగంగానే విమర్శించారు. అంతేకాదు.. చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో, ఆ తర్వాత..‘తాగండి తమ్ముళ్లు’ అంటూ సామాన్యులకు మద్యాన్ని అందుబాటులోకి తెచ్చామని, అదేదో గొప్ప విషయంగా అసెంబ్లీలోనే ప్రకటించారు. మద్యం డిస్టిలరీల ద్వారా అధికారికంగా ఎంత కొనుగోలు చేస్తున్నారు? అనధికారికంగా మరెంత వస్తున్నదో ఎవరైనా చెప్పగలరా?. 2014-19 మధ్య ఐదు డిస్టిలరీల నుంచే ఏభై శాతం మద్యాన్ని కొనుగోలు చేశారట. పవర్ స్టార్, లెజెండ్, తదితర కొత్త బ్రాండ్లు వచ్చింది కూడా చంద్రబాబు టైమ్‌లోనే. వాటి సంగతి ఏమిటి?.ఆ కుంభకోణాలపై గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విచారణ జరిపించి కేసు పెట్టడంతో, ఆ కక్షతో ఎలాగోలా వైఎస్సార్సీపీ సీనియర్ నేతలను ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి కదా?. ఇందుకోసం గతంలో వైఎస్సార్సీపీలో ప్రముఖుడిగా ఉన్న విజయసాయి రెడ్డిని వాడుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. మద్యం స్కాం అంటూ తొలుత విజయసాయి రెడ్డిపై కూడా కూటమి నేతలు అభియోగాలు మోపారు. బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఎన్నికలకు ముందు విజయసాయి రెడ్డిపై ఎన్ని వేల కోట్ల ఆరోపణలు చేశారు. ఆయన పార్టీని వీడిన తర్వాత సిట్ విచారణకు హాజరవడానికి ముందు ఏదో బ్రహ్మాండం బద్దలవుతుందన్నట్లుగా ఎల్లో మీడియా ఊదరగొట్టింది. తీరా ఆయన విచారణకు హాజరై, ఒక్క రాజ్ కేసిరెడ్డి అన్న వ్యక్తిపై ఆరోపణలు చేసి, మద్యంలో స్కామ్ జరిగినట్లు తనకు తెలియదని, అందువల్ల వ్యక్తుల ప్రమేయం తనకు ఎలా తెలుస్తుందని ప్రశ్నించడంతో కూటమి ప్రభుత్వానికి, ఎల్లో మీడియాకు నిరుత్సాహం వచ్చింది.ఆ తర్వాత వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డిని విచారణకు పిలిచారు. కానీ, ఏమీ సాధించలేక పోయారన్నది తెలిసిపోతోంది. తదుపరి రాజ్ కేసిరెడ్డి, శ్రీధర్ రెడ్డిలను విచారించినా, వారు రిమాండ్ రిపోర్టుపై సంతకాలే చేయలేదు. అలాంటప్పుడు ఆ రిపోర్టులకు ఎంత విలువ ఉంటుంది?. అయినా అందులో సీఐడీ రాసిన కథలన్నిటినీ ఎల్లో మీడియా బ్యానర్లుగా పరిచి జగన్‌పై తమకు ఉన్న విద్వేషాన్ని కక్కాయి తప్ప, అందులో సరుకు కనిపించడం లేదు. సాధారణంగా సిట్ అధికారులు తమ వద్ద ఉన్న ఆధారాలను చూపించి ప్రశ్నిస్తారు. కానీ, మిథున్ రెడ్డిని తమ వద్ద ఉన్న ఊహాజనిత ఆరోపణలు, బలవంతంగా కొందరి నుంచి తీసుకున్న వాంగ్మూలాల బేసిస్‌తో ప్రశ్నలు అడగడంతో ఆయన వాటికి గట్టిగా బదులిచ్చారు.గతంలో చంద్రబాబుపై స్కిల్‌స్కామ్ ఆరోపణలు వచ్చినప్పుడు సిట్ బృందం స్పష్టమైన ఆధారాలు సేకరించింది. అంతకుముందే ఈడీ ఆ కేసును డీల్ చేసి కొందరిని అరెస్టు చేసింది. ఆ అంశంతో పాటు, స్కిల్ స్కామ్ డబ్బు టీడీపీ బ్యాంక్ ఖాతాలోకి కూడా చేరిందని, షెల్ కంపెనీలు ఎలా పనిచేశాయన్నది వివరాలతో సహా అధికారులు బయటపెట్టడంతో వాటి గురించి చెప్పకుండా చంద్రబాబు తప్పించుకునే యత్నం చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అన్ని ఆధారాలు చూపించినా, అవి అక్రమ కేసులంటూ ఎల్లో మీడియా గగ్గోలు పెట్టింది. అధికారం రావడంతో ఇప్పుడు వాటన్నిటిని కప్పిపుచ్చుతున్నారు. మరో సంగతి చెప్పాలి. మార్గదర్శి డిపాజిట్లు, చిట్ ఫండ్స్‌లో అక్రమాల గురించి ఆధారాలను చూపి రామోజీరావును విచారించినప్పుడు ఆయన తనకు గుర్తులేదు.. తెలియదు.. అని మాత్రమే జవాబిచ్చారు. తమ తప్పులను కప్పిపుచ్చుకుంటూ, ఎదుటివారిపై మాత్రం బురద వేయడం చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ మూల సిద్దాంతాలలో ఒకటిగా మారిపోయింది.ఎల్లో మీడియా రాసిందే కొలమానం అయితే, చంద్రబాబు ప్రభుత్వం ఈ పది నెలల్లో ఎన్ని స్కాంలకు పాల్పడినట్లు?. ఉదాహరణకు జగన్ టైమ్ లో ఇసుక విక్రయం ద్వారా ఏడాదికి సుమారు రూ.700 కోట్ల ఆదాయం సమకూరింది. కొన్ని వందల కోట్ల విలువైన ఇసుకను స్టాక్ యార్డులలో నిల్వ చేసింది. చంద్రబాబు అధికారంలోకి రాగానే టీడీపీ, జనసేన నేతలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అందినకాడికి దోచేశారు. పోనీ ఇప్పుడు ఉచితం అని చెబుతున్నా, వినియోగదారుడికి ఏమైనా రేటు తగ్గిందా అంటే అదీ లేదు. అంటే కూటమి నేతలు రోజూ ఎంత పెద్ద స్కామ్ చేస్తున్నట్లు?. జగన్ టైమ్ లో వచ్చిన ఆదాయం ఇప్పుడు రావడం లేదు కనక అదంతా కూటమి కుంభకోణం అని ఎల్లో మీడియా అంగీకరించాలి.టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఒక్క తిరువూరు ప్రాంతంలోనే వందల ట్రక్కుల ఇసుక అక్రమ రవాణా అవుతోందని వెల్లడించారు కదా!. ఆ మొత్తం అంతా ఎవరి ఖాతాలోకి వెళుతోంది?. బహుశా ఎల్లో మీడియాకు కూడా వాటాలు ఉన్నాయేమో?.. అందుకే టీడీపీ ఎమ్మెల్యే అక్రమ వ్యవహారాలను బయటపెట్టడం తప్పన్నట్లు రాశారా?. గనుల శాఖలో కూడా గత జగన్ ప్రభుత్వంలో వచ్చిన ఆదాయంతో పోల్చితే ఇప్పుడు తక్కువ వచ్చింది. పైగా ఈ శాఖలో అవినీతి జరిగిపోతోందని ఎల్లో మీడియానే కథనాలుగా ఇచ్చింది కదా? దాని గురించి ఏమంటారు? ఏది ఏమైనా జగన్ టైమ్ లో మద్యం స్కామ్ అటూ వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వచ్చి మళ్లీ ఎంపీ అయిన లావు కృష్ణదేవరాయలతో ఢిల్లీలో ప్రచారం చేయించినా, రాష్ట్రంలో సిట్‌తో దర్యాప్తు చేయించినా, ఎల్లో మీడియాతో పిచ్చి కథనాలు రాయించినా ఆ ఆరోపణలకు ఆధారాలు కనిపించడం లేదే!. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
Perni Nani: చంద్రబాబు అప్పులు చేయడమే పనిగా పెట్టుకున్నారు
-
'ఛీ'ఎం చంద్రబాబు.. నికృష్ట పాలన
-
బాబు పాలనపై టీడీపీ నేతల్లో క్లారిటీ.. నెక్స్ట్ కష్టమే
-
వాస్తవానికి అతకని పచ్చరాతలు!
‘వృద్ధి రేటులో దేశంలోనే రెండో స్థానం.. మొదటి స్థానంలో తమిళనాడు! తలసరి ఆదాయంలోనూ రాష్ట్రం పైపైకి..’ ఇది తెలుగుదేశం పత్రిక ఈనాడులో పతాక శీర్షికన వచ్చిన కథనం. ఈ కథనాల ప్రకారం వృద్ధిరేటులో ఏపీ రెండో స్థానంలో ఉంటే తెలంగాణ 14వ స్థానంలో ఉంది! అంటే తెలంగాణ బాగా వెనుకబడి ఉన్నట్లే కదా? ఆ వెనుకబాటు గురించి తెలంగాణలోనూ ప్రచురించాలి కదా? వారి టీవీలలో ప్రసారం చేయాలి కదా!.కానీ, తెలంగాణ ఎడిషన్లలో ఈనాడు, తదితర ఎల్లో మీడియా పత్రికలు అసలు ఆ కథనాలే ఇవ్వలేదు. అంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వంతో ఉన్న మ్యాచ్ ఫిక్సింగ్ అనుకోవాలా? లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే భయపడుతున్నారా? లేక ఎల్లో మీడియా వ్యాపార ప్రయోజనాలు తెలంగాణలో అధికంగా ఉన్నాయి కనుక ఆ తరహా వార్తలు ఇచ్చి ప్రభుత్వానికి అసంతృప్తి కలిగించరాదని? లేక అసలు ఈ వృద్ధి రేటు లెక్కలన్నీ కాకి లెక్కలని తెలుసు కనుకనా?. ఏపీలో తాము భజన చేస్తున్న చంద్రబాబు సర్కారుకు మేలు చేయాలనా? అన్న ప్రశ్నలు సహజంగానే వస్తాయి. ఇంకో కారణం కూడా ఉండవచ్చు. ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కుంటోంది. దానిని కప్పిపుచ్చి ప్రజలను డైవర్ట్ చేయడానికి ఎల్లో మీడియా ఈ ప్రయత్నం చేసి ఉండవచ్చు. ఏపీలో బాగా పడిపోయిన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ,ఇతర వ్యాపారాలను హైప్ చేయడానికి కూడా ఇది ఒక మార్గం కావచ్చు.జగన్ టైమ్‌లో కేంద్రం ఏపీకి ఏదైనా మంచి ర్యాంకు ఇస్తే ఒక్క ముక్క రాయకపోగా, పచ్చి అబద్ధాలను ప్రచారం చేసిన ఈ ఎల్లో మీడియా ఇప్పుడు మాత్రం బ్యానర్ కథనాలు వండివార్చి ప్రజలను మోసం చేస్తోంది. వాస్తవంగా వృద్ధి రేటు ఆ స్థాయిలో ఉండి ఉంటే ఎవరూ తప్పుపట్టరు. కానీ, క్షేత్ర స్థాయిలో భిన్నమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఇలాంటి స్టోరీలు ఇచ్చినా జనం నమ్ముతారా? ఈ కథనాలు రావడం, వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు దానిపై కామెంట్ చేస్తూ రాష్ట్రంలో అభివృద్ది జరిగిపోతోందని సంబరపడిపోవడం చూడడానికి బాగానే అనిపించవచ్చు. నిజానికి ఈ లెక్కలు రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసేవే. కేవలం ముందస్తు అంచనాలు. ఏ స్వతంత్ర సంస్థ వీటిని ధృవీకరించలేదు. ఈ లెక్కలను అనేక ఇతర రాష్ట్రాలు ఇంకా కేంద్రానికి పంపలేదు కూడా. నిజంగా ఎల్లో మీడియా వార్తలు చదివితే ఈ పది నెలల కాలంలో ఏపీ ఇంతగా అభివృద్ధి చెందిందా? అన్న డౌటు రావచ్చు.తలసరి ఆదాయం పెరిగిపోతే ప్రజలు తమకు స్కీములు ఏవీ ఇవ్వక పోవడంపై ఎందుకు గగ్గోలు పెడుతున్నారు?. దానికి వీరెవ్వరూ సమాధానం ఇవ్వరు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో చేసిన వాగ్దానాలు, సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడానికి ఎందుకు వెనుకాడుతున్నారు? ఒకవేళ డబ్బులు ఉన్నా ఖజానా ఖాళీగా ఉందని అసత్యాలు చెబుతున్నారా?. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్కడకు వెళ్లినా తనకు సూపర్ సిక్స్ హామీల అమలు కష్టంగా ఉందని అంటున్నారు. ఎన్నికలకు ముందు అప్పులు చేయబోనని, సంపద సృష్టిస్తానని ఊదరగొట్టిన బాబు ఇప్పుడేమో రికార్డు స్థాయిలో అప్పులు చేశారు. ఒక ఏడాదిలో అమరావతి అప్పులతో సహా సుమారు రూ.1.5 లక్షల కోట్లు చేస్తుండడం దేశంలో మరే రాష్ట్రంలో జరిగి ఉండదు. అయినా వృద్ధిరేటు అధికంగా ఉందంటే ఎలా నమ్మాలి?.ఇక్కడ మరో కోణం చూద్దాం. మొదటి పది నెలల్లో ప్రభుత్వం ఆశించిన ఆదాయంలో 33 శాతం తగ్గుదల ఉంది. మూలధన వ్యయంలో 48 శాతం తగ్గుదల నమోదైంది. అయినా వృద్ధిరేటు మాత్రం 2023-24లో 6.19 శాతం ఉంటే, 2024-25లో 8.21 శాతంగా ఉందని గణాంకాలు తయారు చేశారు. తలసరి ఆదాయం వృద్ధిలోనూ పైపైకి వెళ్లిందని రాశారు. అయితే ఏ రకంగా, ఏ కారణం వల్ల ప్రజల ఆదాయం పెరిగిందన్న వివరణ మాత్రం వీరివ్వరు. ఆదాయం నిజంగా పెరిగి ఉంటే ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. వస్తువుల కొనుగోళ్లు, ఆస్తుల లావాదేవీలపై ఖర్చు చేస్తారు. చిత్రంగా రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా రావాల్సిన ఆదాయం అంతకుముందు సంవత్సరంలో పోల్చితే రూ.800 కోట్లు తగ్గిందని రికార్డులు చెబుతున్నాయి. అలాగే వాణిజ్య పన్నులు కూడా ఆశించిన రీతిలో వసూలు కావడం లేదు. అయితే ఒక మద్యంలో మాత్రం ఆదాయం వస్తుండ వచ్చు. ప్రజలను తాగుబోతులుగా మార్చడం ద్వారా వృద్ధి రేటు వచ్చిందని ప్రభుత్వం చెప్పదలిస్తే మనం ఏమీ చెప్పలేం. కానీ, వృద్ధి రేటు ద్వారా పేద ప్రజల ఆర్థిక స్థితి గతులు మెరుగుపడాలి. వారి జీవన ప్రమాణాలు పెరగాలి. అందుకోసం ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ స్కీములు ఉపయోగపడతాయి.జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాదాపు అన్ని సంక్షేమ హామీలు అమలు అయ్యాయి. అందువల్ల అప్పట్లో తలసరి ఆదాయం పెరగడం, పేదరికం తగ్గుముఖం పట్టడం జరిగిందని కేంద్ర ప్రభుత్వ లెక్కలు తెలిపాయి. కానీ, చంద్రబాబు ప్రభుత్వం పెన్షన్ మోతాదు వెయ్యి రూపాయలు పెంచడం మినహా సూపర్ సిక్స్, ఇతర హమీలేవీ అమలు చేయలేదు. అయినా తలసరి ఆదాయం పెరిగిందటున్నారు. రియల్ ఎస్టేట్ ఊపందుకుందని కథనాలు ఇస్తున్నారు. అమరావతితో సహా రాష్ట్రంలో ఏ నగరం, పట్టణంలోనూ భూముల విలువలు పెరగలేదు. కొనుగోళ్లు, అమ్మకాలు పెద్దగా జరగడం లేదని చాలామంది చెబుతున్నారు.కృష్ణా జిల్లా విజయవాడ, గన్నవరం మొదలైన పట్టణాలలో ధరలు సగానికి సగం పడిపోయాయి. పోనీ అమరావతిలో వేల కోట్లు వ్యయం చేస్తున్నందున అక్కడ ఏమైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగుతోందా అంటే చెప్పుకోదగిన స్థాయిలో లేవని అంటున్నారు. ప్రభుత్వం అచ్చంగా అమరావతిలోనే రియల్ ఎస్టేట్ పెరగాలని భావిస్తున్నందున విశాఖతో సహా ఇతర నగరాలలో పరిస్థితి దారుణంగా తయారైందని వార్తలు సూచిస్తున్నాయి. రైతులు గిట్టుబాట ధరలు లేక అల్లాడుతున్నారు. అక్వా రైతులకు ట్రంప్ దెబ్బ తగిలింది. ఏ రంగం చూసినా ఆశాజనకంగా పరిస్థితులు కనిపించడం లేదు. జీఎస్డీపీ, వృద్ధి రేటు, తలసరి ఆదాయం వంటి వాటిపై ఇచ్చిన లెక్కలు చూసి ఏపీ ప్రజలు ఆనందపడతారా?. వాస్తవంగా వారి జీవితాలు ఎంత భారంగా గడుస్తున్నాయో వారికి తెలియదా!.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
చంద్రబాబు మరో మహా ప్యాలెస్
సాక్షి, అమరావతి: సువిశాల విస్తీర్ణంలో హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన ప్రాంతంలో కళ్లు జిగేల్మనేలా రూ.వందల కోట్ల విలువైన అత్యంత విలాసవంతమైన రాజభవనం..! నిజాం నవాబు తరహాలో హైదరాబాద్ నగరం నడిబొడ్డున కొండాపూర్‌లో హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో ఊహకు అందని రీతిలో ఐదెకరాలలో ఓ భారీ ఫాంహౌస్..! వీటికితోడు అమరావతిలో రూ.వందల కోట్లతో.. మరో ఐదు ఎకరాల్లో ఇంకో రాజభవనాన్ని నిర్మించుకుంటున్నారు సీఎం చంద్రబాబు..! అత్యాధునిక హంగులు.. కనీవిని ఎరుగని అధునాతన రీతిలో.. రాజధాని అమరావతి నడిబొడ్డున.. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం సమీపంలో చేపట్టే ఈ ప్యాలెస్ నిర్మాణ పనులను తనకు అత్యంత సన్నిహితుడికి చెందిన సంస్థకు అప్పగించారు. దీనికి ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు భూమి పూజ చేశారు. కాగా, దీనికోసం వెలగపూడిలో సర్వే నంబర్ 111, 112, 113, 122, 150, 152, 239లలోని 5.16 ఎకరాలను (25 వేల చదరపు గజాలు) చంద్రబాబు తనయుడు మంత్రి నారా లోకేశ్ భార్య నారా బ్రాహ్మణి పేరుతో రూ.18.75 కోట్లకు కొనుగోలు చేయడం గమనార్హం. అంటే గజం రూ.7,500 చొప్పున ఖరీదు చేశారు. కాగా, చంద్రబాబు అమరావతి ప్రాంతంలో చదరపు గజం రూ.60 వేలు పలుకుతోందని చెబుతుంటారు. ఈ ప్రకారం చూస్తే నాలుగు వైపులా రోడ్డు ఉన్న వెలగపూడిలోని స్థలం విలువ సుమారు రూ.150 కోట్ల వరకు ఉంటుంది. మరి రాజభవనం నిర్మాణానికి ఇంకెన్ని రూ.వందల కోట్లు వ్యయం చేస్తారోనని రాష్ట్ర ప్రజలు విస్తుపోతున్నారు. బాబుకు ఉన్నవి అన్నీ ప్యాలెస్‌లే..చంద్రబాబుకు ఇప్పటికే హైదరాబాద్‌లో అత్యంత సంపన్నులు ఉండే జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ సమీపంలో రూ.వందల కోట్లతో నిర్మించిన భారీ ప్యాలెస్ ఉంది. దీనిని పక్కనున్న భవనాలు, స్థలాలు కొనేసి సువిశాల విస్తీర్ణంలో నిర్మించడం గమనార్హం. 2014–19 మధ్య అధికారంలో ఉండగా దీని నిర్మాణానికి ప్రయత్నాలు ప్రారంభించారు. 2019 ఎన్నికలకు ముందు గృహ ప్రవేశం చేశారు. అంతకుముందే జూబ్లీహిల్స్‌లో చంద్రబాబుకు సువిశాల విస్తీర్ణంలో ప్యాలెస్ ఉండేది. దానిని కూల్చివేసి.. అధునాతన సాంకేతికత, అత్యాధునిక హంగులతో రాజభవనం నిర్మించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి అత్యంత ఖరీదైన ఉపకరణాలను దిగుమతి చేసుకుని నిర్మాణంలో వినియోగించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో చంద్రబాబు ఇంద్రభవనం మదీనాగూడలో నిజాం నవాబును తలదన్నేలా..హైదరాబాద్‌లోని కొండాపూర్ ప్రాంతం హైటెక్ సిటీకి దగ్గరగా ఉంటుంది. చాలా ఖరీదైనదిగా పేరుగాంచింది. అక్కడికి సమీపంలోని మదీనాగూడలో చంద్రబాబుకు ఐదు ఎకరాల ఫాంహౌస్ ఉంది. దీని విలువ రూ.వందల కోట్లలోనే ఉంటుంది. నిజాం నవాబును తలపించే రీతిలో వైభోగం అన్నమాట. మరోవైపు హైదరాబాద్‌లో సంపన్న ప్రాంతమైన జూబ్లీహిల్స్‌లో రాజభవనం లాంటి నివాసం. బహుశా దేశంలో సంపన్నులు ఉండే ప్రాంతంలో రాజభవనం, ఫాంహౌస్ చంద్రబాబుకు ఒక్కరికే ఉందని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు.పదేళ్లుగా అక్రమ ప్యాలెస్‌లో విలాసంచంద్రబాబు.. పదేళ్లుగా ఉండవల్లి సమీపాన కృష్ణా నది కరకట్ట లోపల లింగమనేని రమేష్ అక్రమంగా నిర్మించిన విలాసవంతమైన బంగ్లాలో నివసిస్తున్నారు. రమేష్ అత్యాధునిక హంగులతో ఈ భారీ బంగ్లాని నిర్మించారు. కాగా, 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారు. ఆడియో టేపుల సాక్షిగా ఆయన బండారం బయటపడింది. అప్పటి తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ చర్యలు తీసుకుంటుందోనన్న భయంతో హైదరాబాద్‌ను ఉన్నపళంగా వదిలి వచ్చేశారు. లింగమనేని అక్రమ బంగ్లాను నివాసంగా ఎంచుకున్నారు. అప్పటినుంచి.. అంటే పదేళ్లుగా అందులోనే ఉంటున్నారు.ఉండవల్లిలో కృష్ణానది కరకట్ట వెంట చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ భవనం పార్టీ వారికీ ప్రవేశం లేదు..చంద్రబాబు తాజాగా వెలగపూడిలో తలపెట్టిన రాజభవన నిర్మాణం భూమి పూజకు టీడీపీ నేతలను సైతం ఆహ్వానించకపోవడడం గమనార్హం. ఇక జూబ్లీహిల్స్‌లోని రాజభవనం గృహ ప్రవేశ కార్యక్రమానికి పార్టీ నేతలను ఎవరినీ ఆహ్వానించలేదని టీడీపీ సీనియర్ నేతలు చెబుతుంటారు. అందులోకి ఇప్పటికీ తమ పార్టీ నేతలకు ప్రవేశం లేదని అంటుంటారు.కొత్త రాజభవనం.. నిర్మాణానికి ఇంకెన్ని కోట్లో..?చంద్రబాబు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఆరేళ్ల కిందట నిర్మించుకున్న రాజ భవనానికే రూ.వందల కోట్లు వ్యయం అయినట్లు చెబుతుంటారు. ఇప్పుడు అమరావతిలో తలపెట్టిన రాజభవనం మరింకెన్ని కోట్లు ఉంటుందోనని అంటున్నారు. భూమి కొనుగోలుకే రూ.18 కోట్లకు పైగా వ్యయం చేసిన నేపథ్యాన్ని గుర్తు చేస్తున్నారు. పైగా వెలగపూడిలో ఏకంగా 5.16 ఎకరాల్లో నిర్మాణం చేపట్టనుండడాన్ని ప్రస్తావిస్తున్నారు.అప్పుడు ఇప్పుడు అధికారంలో ఉండగానే..చంద్రబాబు జూబ్లీహిల్స్ రాజభవనం నిర్మాణాన్ని 2019కి ముందు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే చేపట్టి పూర్తి చేశారు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉండగానే వెలగపూడిలో మరింత భారీఎత్తున రాజభవనం నిర్మాణం చేపట్టడం గమనార్హం.అద్దాల మేడల్లో ఉంటూ అవతలి వారిపై దుష్ప్రచారంతాను 5.16 ఎకరాల్లో రాజభవనం కట్టుకుంటూ పేదవాడిననే బిల్డప్‌లుపార్టీ కార్యాలయం లేకుండానే భారీ విస్తీర్ణంలో నిర్మాణానికి ప్రయత్నంవైఎస్ జగన్ 2 ఎకరాల్లో పార్టీ కార్యాలయం, ఇల్లు నిర్మించుకుంటే నిందలుతాడేపల్లి ప్యాలెస్ అంటూ తీవ్ర స్థాయిలో చంద్రబాబు దుష్ప్రచారంవిశాల విస్తీర్ణంలో జూబ్లీహిల్స్‌లో, మదీనాగూడలో రాజభవనాలు కలిగి.. ప్రస్తుతం అక్రమంగా కట్టిన విలాసవంతమైన భారీ బంగ్లాలో ఉంటూ.. కొత్తగా మరో భారీ రాజభవనం నిర్మాణానికి పూనుకున్న చంద్రబాబు తాను నిరుపేదను.. గుడిసె వాసిని అనే తరహాలో బీద అరుపులు అరుస్తుంటారు. అవతలివారిపై అకారణంగా నిందలు వేస్తుంటారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలో రెండు ఎకరాల విస్తీర్ణంలో ఇల్లు, పార్టీ కార్యాలయం నిర్మించుకున్నారు. వాటిని చూపుతూ తాడేపల్లి ప్యాలెస్ అంటూ తరచూ చంద్రబాబు, ఎల్లో మీడియా, పచ్చ దండు దుష్ప్రచారం చేస్తుంటారు. తాను ఉంటున్న ఇంద్ర భవనాలు మాత్రం పూరి గుడిసెలు అన్నట్లు ప్రజలను నమ్మించడానికి చంద్రబాబు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రచారాలు తెరపైకి తెస్తుంటారు. -
గ్రేట్ ఆంధ్రా మ్యాజిక్ షో!
పీసీ సర్కార్ ఇంద్రజాలం గొప్పదా... ఏపీ సర్కార్ ఇంద్ర జాలం గొప్పదా? పీసీ సర్కార్ మ్యాజిక్ ట్రిక్స్ ఈ దేశ ప్రజలను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తేవని విన్నాము. ఏపీ సర్కార్ ట్రిక్స్ మాత్రం ప్రజలను షాక్ మీద షాక్‌కు గురిచేస్తున్నాయి. అది... స్టేజ్ షో. అంతా మ్యాజిక్ అనే సంగతి ముందుగానే తెలుసు! కానీ, ఇది... జనజీవితంతో ఆటాడుకోవడం! మోసపోతున్నా మని ముందుగా ప్రజలకు తెలియదు. క్రమంగా అనుభవంలోకి వస్తుంది. ఎన్నికలకు ముందు ఇంటింటికీ ఓ వైకుంఠాన్ని వాగ్దానం చేసిన మ్యానిఫెస్టో కూడా మ్యాజిక్ షోలో భాగమని అప్పుడు అర్థం కాలేదు. మెజీషియన్ దాన్ని తన టోపీలో పడే శారు. ఇప్పుడా టోపీలోంచి కుందేళ్లు, కుక్కపిల్లలు వగైరాలే వస్తున్నాయి. మ్యానిఫెస్టో మాయమైంది.ఇంద్రజాల విద్యలతో జనాన్ని ఆహ్లాదపరచాలని, హామీల సంగతిని మరిపింపజేయాలని చంద్రబాబు సర్కార్ ప్రయాస పడుతున్నది. అందులో భాగంగా ఆయన నాలుగు రోజులకో కొత్త ట్రిక్కును నేర్చుకొస్తున్నారు. వేదికల మీద వాటిని ప్రదర్శి స్తున్నారు. కీలకమైన మూడు అంశాల్లో వాస్తవాలకు గంతలు కట్టడానికి, ప్రజలను భ్రమల్లో ముంచెత్తడానికి శతవిధాలైన విన్యాసాలను ఆయన ప్రదర్శిస్తున్నారు. ఇందులో మొదటి అంశం – అభివృద్ధి అనే పదానికి తననే నిర్వచనంగా చెప్పు కోవడం, అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్‌గా తనను తాను ప్రమోట్ చేసుకోవడం! కానీ, వాస్తవ పరిస్థితి? ఈ పది మాసాల కాలంలోనే అప్పుల్లో రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రికార్డులను బద్దలు కొట్టింది. ప్రజల కొనుగోలుశక్తి దారుణంగా పడిపోయింది. పన్నుల వసూళ్లు మందగించాయి. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు తిరోగమన పథంలోకి వెళ్లాయి. రైతు కుటుంబాలు తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నాయి. ప్రభుత్వ నిర్వాకం కారణంగానే ధాన్యం రైతుల దగ్గర్నుంచి ఆక్వా రైతుల వరకు అందరూ దయనీయ స్థితిలోకి జారిపోతున్నారు. విద్యుత్ బిల్లుల భారంతో వేలాది ఎమ్ఎస్ఎమ్ఈ పరిశ్రమలు మూతపడ్డాయి. ఇరవై వేలమంది ఉపాధి కోల్పోయారు.బాబు సర్కార్ మ్యాజిక్ చేయదలచుకున్న రెండో అంశం – సంక్షేమ రంగం. సంక్షేమం అంటేనే తెలుగుదేశం పార్టీ గుర్తు కొస్తుందని బహిరంగ సభల్లో చంద్రబాబు చెప్పుకొస్తున్నారు. ఎన్నికలకు ముందు కూటమి తరఫున ఆయన చేసిన వాగ్దానాల సంగతిని కాసేపు మరిచిపోదాం. అంతకుముందు జగన్ ప్రభుత్వం అమలుచేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలను చాప చుట్టేసి అటకెక్కించారు. ‘అమ్మ ఒడి’ ఆగిపోయింది. మహిళలకు ‘చేయూత’ అందడం లేదు. ‘వైఎస్సార్ బీమా’ కనుమరుగైంది. ‘మత్స్యకార భరోసా’ మాయమైంది. ‘కల్యాణమస్తు’ కనిపించడం లేదు. ఆటో డ్రైవర్లకు ‘చేదోడు’ లేదు. చిల్లర వర్తకులకు తోడుగా నిలిచిన రుణ సదుపాయం నిలిచిపోయింది. ఇవి కొన్ని మాత్రమే! చెప్పుకుంటూ పోతే సంక్షేమం కథ చాలా పెద్దది.ఇక మూడో ఇంద్రజాల ఇతివృత్తం – తనను తాను గొప్ప ప్రజాస్వామికవాదిగా ప్రచారం చేసుకోవడం. తన రాజకీయ జీవితంలో ఎన్నడూ హింసా రాజకీయాలు చేయలేదు. కక్షలూ కార్పణ్యాలకు పూనుకోలేదు. వ్యక్తిత్వ హననాలకు పాల్పడలేదని బాబు చాలా సందర్భాల్లో చెప్పుకుంటున్నారు. అనుబంధ మీడియా ఇంకో నాలుగడుగులు ముందుకెళ్లి ఆయన్ను ప్రమోట్ చేస్తున్నది. ఈ ప్రమోషన్‌కూ, వాస్తవ పరిస్థితికీ మధ్యన 180 డిగ్రీల దూరం ఉన్నదని పది నెలల కాలంలో జరిగిన అనేక ఘటనలు రుజువు చేశాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చీరావడంతోనే ప్రత్యర్థుల వేట మొదలుపెట్టింది. వ్యతిరేకంగా పనిచేసిన వాళ్లను బహిరంగంగా నరికి చంపుతున్న భయానక దృశ్యాలను చూడవలసి వచ్చింది. పల్నాడు వంటి ప్రాంతాల్లో వేలాదిమంది ప్రజలు దాడులకు భయపడి ప్రవాస జీవితాలు గడపవలసి వచ్చింది. సోషల్ మీడియాలో విమర్శలు చేసేవారి మీద దారుణమైన సెక్షన్లతో కేసులు పెట్టారు. 50 పైచిలుకు మందిని అరెస్టు చేశారు. వందలాది మందిపై కేసులు నమోదయ్యాయి. బీఎన్ఎస్ 111 సెక్షన్‌ను దుర్వినియోగం చేస్తు న్నారని పోలీసులను పలుమార్లు ఉన్నత న్యాయస్థానం మంద లించవలసి వచ్చింది. ‘రెడ్‌బుక్’ గైడ్‌లైన్స్ ప్రకారం పనిచేయా లని పోలీసులను వారి ఉన్నతాధికారులే ఒత్తిడి చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. గతంలో ఎన్నడూ ఎరుగని పరిణామాలివి.తనకు లేని ఘనతల్ని ఆపాదిస్తూ యెల్లో మీడియా తగిలించిన భుజకీర్తులను కాపాడుకోవడానికి చంద్రబాబు ఇప్పుడు మ్యాజిక్ షోలను ఆశ్రయించక తప్పడం లేదు. అమరావతి ప్రాంతంలో కొన్ని కృత్రిమ మెరుపుల్ని మెరిపించి, ‘అదిగో అభి వృద్ధి’ అని చెప్పుకోవాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. అమరావతి పేరుతో 30 వేల కోట్ల అప్పులు ఇప్పటికే తీసు కొచ్చారు. రైల్వే స్టేషన్ ఎక్కడొస్తుందో ప్రకటించారు. బస్టాండ్ స్థలాన్ని గుర్తించడం జరిగింది. అద్భుతమైన స్టేడియం వస్తుందని ప్రచారం చేశారు. ఆకాశ హర్మ్యాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఐటీ పరిశ్రమను వేలు పట్టుకొని హైదరాబాద్‌కు తీసుకొచ్చిన తాను, అదే చందంగా ‘క్వాంటమ్ వ్యాలీ’ని అమ రావతికి పిలుచుకొస్తానని కూడా చంద్రబాబు పదేపదే ప్రక టిస్తున్నారు. ‘క్వాంటమ్ వ్యాలీ’ ఏర్పాటుకు అవసరమయ్యే భౌతిక, మే«ధాపరమైన పరిస్థితులు అమరావతిలోనే కాదు,ఆంధ్రప్రదేశ్‌లోనే లేవనేది నిపుణుల అభిప్రాయం. సమీప భవి ష్యత్తులో అటువంటి ఎకో సిస్టమ్ ఏర్పడే అవకాశాలు కూడా లేవని వారు చెబుతున్నారు.అయినా సరే, అమరావతి టైర్లలో గాలి నింపడానికి ఆయన ఇటువంటి అసంగతమైన సంగతులు ఇంకా ఎన్నయినా చెప్ప వచ్చు. అయినప్పటికీ అక్కడ రియల్ ఎస్టేట్ రంగంలో కదలిక కనిపించడం లేదు. అక్కడ ప్లాట్లు కొనేందుకు జనం ఎగబడడం లేదు. చివరికి మొన్న అమరావతి కోర్ క్యాపిటల్ ప్రాంతంలో ఐదెకరాల పైచిలుకు విస్తీర్ణం (25 వేల చదరపు గజాలు)లో ఉన్న ప్లాట్‌లో స్వగృహ నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. వెలగ పూడి గ్రామానికి చెందిన కంచర్ల కుటుంబం వారు తమ 29 ఎకరాల 51 సెంట్ల వ్యవసాయ భూమిని ల్యాండ్ పూలింగ్‌కు అప్పగించగా వారికి 25 వేల చదరపు గజాల ప్లాటు కోర్ క్యాపి టల్ ఏరియాలో లభించింది. 18 కోట్ల 75 లక్షల రూపాయలు వెచ్చించి ఈ భూమిని నారా బ్రాహ్మణి పేరుతో ఉన్న ట్రస్టు ద్వారా కొనుగోలు చేశారు. అంటే గజానికి 7,500 పడిందన్న మాట. కోర్ క్యాపిటల్ ప్రాంతంలో మరీ ఇంత తక్కువ రేటేమిటో?ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సీనియర్ మోస్ట్ రాజకీయవేత్త మిగిలిన సొమ్మును బ్లాక్‌లో చెల్లించి ఉంటారని అనుకోలేము కదా! అమరావతిలోని చాలా ప్రాంతాల్లో రిజిస్ట్రే షన్ విలువ గజానికి ఐదు వేలు మాత్రమే ఉందట! చిన్న చిన్న పట్టణాల్లో కూడా ఇంత తక్కువ విలువ ఎక్కడా లేదు. ప్రపంచంలోని ఐదు పెద్ద నగరాల్లో ఒకటిగా నిలబెట్టాలని తలపోస్తున్న అమరావతిలో ఈ విలువేమిటో అర్థం కాదు. ప్రస్తుతం అమరావతి పట్నం ‘బ్లాక్’ ఈజ్ బ్యూటీ అని కలవరిస్తున్నది. పిలు స్తున్నది. కానీ ఆ బ్యూటీ మాత్రం అమరావతిని ఇంకా కరుణించడం లేదు. ఎప్పుడు కరుణిస్తుందో, రియల్ ఎస్టేట్ ఎప్పుడు పుంజుకుంటుందో, ఆకాశహర్మ్యాలకు పునాదులు ఎప్పుడు పడతాయో! అప్పటికీ తన మీద అభివృద్ధి ప్రదాత అనే స్టాంపు వేయించుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం చేయగలిగినంత మ్యాజిక్‌ను చేస్తూనే ఉన్నది.అభివృద్ధి ముద్ర కోసం అమరావతి ముసుగును వేసు కున్నట్టే... సంక్షేమం సర్టిఫికెట్ కోసం ఆయన ‘పీ–ఫోర్’ అనే దౌర్భాగ్య సిద్ధాంతాన్ని ముందుకు తెస్తున్నారు. పేదరిక నిర్మూలనకు కృషి చేయవలసిన ప్రభుత్వ బాధ్యత నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేల మీద పుట్టిన ప్రతి జీవి ఈ దేశ సంపదలో హక్కుదారేనన్నది సహజ న్యాయం.ఆ సహజ న్యాయం రాజ్యాంగ హక్కుగా పౌరులందరికీ భరోసా నిచ్చింది. కానీ, దేశ సంపదను ప్రైవేటీకరించడంలో ఉత్సాహాన్ని ప్రదర్శించే చంద్రబాబు పేద ప్రజలను కూడా ప్రైవేటీకరించడానికి పూనుకున్నారు. తమ హక్కుల సాధన కోసం, తమ న్యాయమైన వాటా కోసం పిడికిళ్లు బిగించ వలసిన ప్రజలను మభ్యపెట్టి, తక్షణావసరాల కోసం సంప న్నుల ముందు సాగిలపడేట్టు ప్రోత్సహిస్తున్నారు. తన సంక్షేమ బాధ్యతల నుంచి తప్పుకొని తన అనుచరులకు సంపద సృష్టించే పథకాల గురించి ఆయన ఆలోచిస్తున్నారు. ‘పీ–ఫోర్’ మంత్రంతో పేదరికం పోదు. ఈ మ్యాజిక్ ఎక్కువ కాలం చెల్లదు. అనగనగా ఒక చిత్తకార్తె చతుష్పాద జీవి లాంటి వెధవొకడు టీడీపీకి అనుబంధ సోషల్ మీడియాలో కిరాయి సైనికుడు. వైసీపీ అగ్రనేత మీద సొల్లు వాగాడు. ఈ రకమైన వాగుడు, అటువంటి పోస్టింగులు అతడికి చిరకాలంగా అలవాటే! కానీ, మొన్నటి ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి ఖండించారు. అతడిని పార్టీ నుంచి తప్పిస్తున్నట్టు ప్రక టించారు. అరెస్ట్ చేశారు. స్వాగతించవలసిన విషయమే! కానీ, ఈ వ్యవహారంలో చిత్తశుద్ధి ఉండాలనేది సహజమైన ఆకాంక్ష. ఈ ఖండన వెలువడిన వెంటనే సిద్ధంగా ఉన్నట్టుగా యెల్లో మీడియా స్పందించింది. చంద్రబాబును ప్రశంసలతో ముంచె త్తింది. ఇమేజ్ మేకోవర్ ఎక్సర్‌సైజని అర్థమవుతూనే ఉన్నది. అదే బాధాకరం. రెడ్‌బుక్ రాజ్యాంగ పాలన జరుగుతున్నదని ఈ పది నెలల పాలనపై ఆరోపణలు వస్తున్నాయి. చిత్తశుద్ధి వుంటే దీన్ని సరిదిద్దుకోవాలి. కానీ హైకోర్టు హెచ్చరిస్తున్నా ఈ పాలనలో మార్పు రావడం లేదు. టీడీపీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఐటీడీపీలో వందలాదిమంది సైకోల్లాంటి కిరాయి సైనికులు పనిచేస్తున్నారు. వారి జుగుప్సాకరమైన రాతలతో, వాగుడుతో ఎంతోమంది కలతచెందిన ఘటనలున్నాయి. ఎన్ని కలకు ముందు గుంటూరు జిల్లాలో గీతాంజలి అనే గృహిణి ఈ వేట కుక్కల దాడి తట్టుకోలేక, ఆత్మహత్య చేసుకున్నది. అప్పుడే ఖండించి ఉంటే, చర్యలు తీసుకొని ఉంటే పరిస్థితులు ఇలా దిగజారి ఉండేవా? విజయవాడలో జగన్ మామ గురించి ఆప్యాయంగా మాట్లాడిన ఓ పసిబిడ్డ మీద అవాకులు చవాకులు పేలినప్పుడైనా ఈ ఖండన రావాల్సింది. ఇటువంటి అను భవాలు కోకొల్లలు. ఎప్పుడూ స్పందించలేదు. పైపెచ్చు ప్రోత్సహించారని మొన్నటి సొల్లు వెధవే ఒక వెబ్ చానల్లో చెప్పుకొచ్చాడు. ఈ కారణాల రీత్యా, దిగజారి పోతున్న ప్రతిష్ఠను కాపాడుకోవడానికే ఇలా స్పందించారని భావించవలసి వస్తున్నది. మ్యాజిక్ షోలెప్పుడూ మ్యానిఫెస్టో అమలుకు ప్రత్యామ్నాయం కాబోవు. అలా భావిస్తే భంగపాటు తప్పదు!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
జగన్ కోసం దేనికైనా సిద్ధం.. ఎల్లో మీడియాకి వార్నింగ్
-
Big Question: జగన్ దెబ్బకు కూటమిలో మొదలైన భయం!
-
గోదారమ్మ సాక్షిగా మరోసారి పోలవరంపై చంద్రబాబు అసత్యాలు
-
పోలవరంపై పచ్చి అబద్ధాలు
సాక్షి, అమరావతి: పోలవరం నిర్మాణంలో తాను చేసిన చారిత్రక తప్పిదాలు, విధ్వంస కాండను కప్పిపుచ్చుకుంటూ.. గోదారమ్మ సాక్షిగా.. ప్రాజెక్టు వేదికగా సీఎం చంద్రబాబు మార్చి 27న మరోసారి అసత్యాలను వల్లించారు. ఎద్దు ఈనిందంటే.. దూడను గాటికి కట్టేయడానికి తాడు తెచ్చిన రీతిలో ‘గాడిన పడిన పోలవరం ప్రాజెక్టు’ శీర్షికన ‘ఈనాడు’ సోమవారం పచ్చి అబద్ధాలు అచ్చేసింది. అసలు వాస్తవాలు ఇవీ..⇒ తెలుగు ప్రజల దశాబ్దాల కల పోలవరాన్ని సాకారం చేస్తూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టారు. 2009 నాటికే రూ.5,298.71 కోట్ల విలువైన పనులు పూర్తి చేశారు. రిజర్వాయర్, కుడి, ఎడమ కాలువలకు అవసరమైన లక్ష ఎకరాలకుపైగా భూమిని సేకరించారు. కుడి కాలువలో 95 శాతం, ఎడమ కాలువలో 70 శాతం పనులను పూర్తి చేశారు.⇒ కేంద్రమే నిర్మించాల్సిన పోలవరాన్ని కమీషన్ల దాహంతో ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి మరీ 2016లో సీఎం చంద్రబాబు దక్కించుకున్నారు. 2013–14 ధరల ప్రకారం అంటే.. 2014 ఏప్రిల్ 1 నాటికి ప్రాజెక్టు నీటి పారుదల విభాగం వ్యయంలో మిగిలిన రూ.15,667.90 కోట్లు మాత్రమే ఇస్తామని కేంద్రం విధించిన షరతుకు అంగీకరించారు. ఆ మేరకే నిధులు ఇచ్చేలా 2017 మార్చి 15న కేంద్ర కేబినెట్ తీర్మానించింది. నిజానికి పోలవరం భూసేకరణ, నిర్వాసితుల పునరావాసానికే రూ.33 వేల కోట్లు వ్యయం అవుతుంది. దీన్ని బట్టి చూస్తే ఆదిలోనే పోలవరాన్ని చంద్రబాబు ఆర్థిక సంక్షోభంలోకి నెట్టినట్లు స్పష్టమవుతోంది.⇒ గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను పూర్తి చేయకుండా.. నదికి అడ్డంగా నిర్మించాల్సిన ప్రధాన డ్యాం గ్యాప్–2లో 1,396.6 మీటర్ల పొడవున పునాది డయాఫ్రం వాల్ పనులను 2016 నవంబర్‌లో చంద్రబాబు చేపట్టారు. 2018 జూన్ నాటికి పూర్తి చేశారు. 2017, 2018లో గోదావరి వరద డయాఫ్రం వాల్ మీదుగా ప్రవహించడంతో.. ఆ వరద ఉద్ధృతికి కోతకు గురై దెబ్బతిందని ఇటీవల కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) నియమించిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ (పీవోఈ) తేల్చి చెబుతూ నివేదిక ఇచ్చింది. దీన్ని బట్టి పోలవరం ప్రాజెక్టులో విధ్వంసం సృష్టించింది చంద్రబాబేనన్నది స్పష్టమవుతోంది. ⇒ 2019 మే 30న వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం వెంటనే ప్రణాళికాబద్ధంగా పోలవరాన్ని పూర్తి చేసేలా అడుగులు వేశారు. ఈ క్రమంలో పీపీఏ ఆదేశాల మేరకు ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలకు ఇరు వైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేసి.. చేసిన పనులకు రక్షణ చర్యలను అధికారులు చేపట్టారు. రామోజీరావు సమీప బంధువుకు చెందిన నవయుగకు నామినేషన్ పద్ధతిలో చంద్రబాబు కట్టబెట్టిన రూ.2,917 కోట్ల పనులను నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు రద్దు చేశారు. ఆ సంస్థకే సీఎం చంద్రబాబు కట్టబెట్టిన జలవిద్యుత్కేంద్రం పనుల్లో తట్టెడు మట్టి కూడా ఎత్తకపోవడంతో ఆ కాంట్రాక్టును రద్దు చేసి.. రెండు పనులకు ఒకే ప్యాకేజీ కింద రివర్స్ టెండరింగ్ నిర్వహించి ఖజానాకు రూ.838.5 కోట్లను ఆదా చేశారు. ⇒ వైఎస్ జగన్ ప్రభుత్వం ఒకవైపు నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూనే మరోవైపు గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాం పనులను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టింది. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ 48 గేట్లతో సహా స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను పూర్తి చేసి 2021 జూన్ 11న స్పిల్ వే మీదుగా 6.1 కి.మీ. పొడవున గోదావరి ప్రవాహాన్ని మళ్లించారు. జలవిద్యుత్కేంద్రం పనులను పరుగులెత్తించారు. ప్రధాన డ్యాం గ్యాప్–1లో డయాఫ్రం వాల్, గ్యాప్–3లో కాంక్రీట్ డ్యాంలను పూర్తి చేశారు. సీడబ్ల్యూసీ అదనంగా ప్రతిపాదించిన పనులను పూర్తి చేశారు. జలాశయంతో కుడి, ఎడమ కాలువను అనుసంధానం చేసే కనెక్టివిటీస్ పనులను కొలిక్కి తెచ్చారు. చంద్రబాబు సర్కారు చేసిన చారిత్రక తప్పిదాలను సరిదిద్దారు. ⇒ ప్రధాన డ్యాం గ్యాప్–2లో దెబ్బతిన్న డయాఫ్రం వాల్ భవితవ్యాన్ని తేల్చితే ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేస్తామని.. తాజా ధరల మేరకు నిధులిచ్చి పోలవరం పూర్తికి సహకరించాలని ప్రధాని మోదీని అనేక మార్లు నాడు సీఎం వైఎస్ జగన్ కోరారు. పోలవరం భూసేకరణ, నిర్వాసితుల పునరావాసానికే రూ.33 వేల కోట్లు అవసరమని.. అలాంటిది 2013–14 ధరల ప్రకారం రూ.15,667.90 కోట్లతో ప్రాజెక్టును పూర్తి చేయడం సాధ్యం కాదని వివరించారు. వీటిపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారు. ⇒ డయాఫ్రం వాల్ సహా వరదలకు దెబ్బతిన్న పనులను పునరుద్ధరించేందుకు రూ.2 వేల కోట్లు, తొలిదశ పనుల పూర్తికి రూ.పది వేల కోట్లు వెరసి.. రూ.12 వేల కోట్లు ఇచ్చేందుకు అంగీకరిస్తూ 2023 జూన్ 5న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నోట్ సిద్ధం చేశారు. ప్రాజెక్టును తొలి దశలో పూర్తి చేయడానికి మిగిలిన పనులకు రూ.12,157 కోట్లు.. ఆ తర్వాత రెండో దశ పూర్తి చేయడానికి నిధులు మంజూరు చేయాలని 2024, ఫిబ్రవరి 29న ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు(పీఐబీ) కేంద్ర కేబినెట్‌కు ప్రతిపాదన పంపింది. అప్పటికే ఎన్డీఏలో చేరిన చంద్రబాబు ఆ ప్రతిపాదనపై కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేయకుండా మోకాలడ్డారు. ⇒ 41.15 మీటర్ల ఎత్తు వరకూ నీటిని నిల్వ చేసేలా పోలవరాన్ని పూర్తి చేసేందుకు రూ.12,157 కోట్లను మంజూరు చేస్తూ 2024 ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అంటే ప్రాజెక్టులో నీటి నిల్వను 194.6 టీఎంసీల నుంచి 115.44 టీఎంసీలు మాత్రమే నిల్వ చేసేలా ఎత్తును తగ్గించారు. దీనివల్ల పోలవరం ప్రాజెక్టు కింద 7.20 లక్షల ఎకరాల్లో కేవలం 1.98 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లందించడం సాధ్యమవుతుంది. దీన్ని బట్టి పోలవరానికి చంద్రబాబు మళ్లీ ద్రోహం చేసినట్లు స్పష్టమవుతోంది. ⇒ వైఎస్సార్సీపీ హయాంలో పోలవరాన్ని గాడిలో పెట్టడం.. ప్రధాన డ్యాం గ్యాప్–2లో డయాఫ్రం వాల్.. ఇక గ్యాప్–1, గ్యాప్–2లలో ప్రధాన డ్యాం నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులు లేకపోవడం వల్లే 2026 మార్చి నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని కేంద్ర కేబినెట్ లక్ష్యంగా నిర్దేశించిందని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. -
‘వివేకా కేసు.. రెండో పెళ్లి కోణంలో విచారణ ఎందుకు చేయరు?’
సాక్షి, వైఎస్సార్: సినిమాలో ఒక క్లిప్పింగ్ పెడితే కూడా అరెస్టు చేసి, వారిని కొట్టే వ్యవస్థ ఏపీలోనే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. వివేకా హత్య ఉదంతం టీవీ సీరియల్‌ను తలపిస్తోందన్నారు. ఆయన కేసులో.. అసలు రెండో పెళ్లి కోణంలో విచారణ ఎందుకు చేయరు? అని ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘వివేకా హత్య ఉదంతం జరిగి ఐదేళ్లు గడుస్తున్నా నిన్న కాక మొన్న జరిగినట్లే పచ్చ పత్రికలు రాస్తున్నాయి. వాళ్ళకి వివేకాపై ప్రేమ లేనే లేదు.. ప్రజాస్వామ్యం కోసం అంటే అదీ కాదు. సొంత తమ్ముడు రాంమూర్తినాయిడిపైనే చంద్రబాబుకు ప్రేమ లేదు. అయినా మీరు వండి వారుస్తూనే ఉన్నారు. ఒకే ఒక కారణం.. వివేకా రక్తాన్ని జగన్ చొక్కాకి రాయాలని చూస్తున్నారు. రక్తం మాదే.. చొక్కా మాదే.. వీళ్ళ రాతలకు అడ్డే లేదుమా ఎంపీ అవినాష్ రెడ్డిని బలిపశువును చేయడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఐదు ఏళ్లుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, పచ్చ మీడియా.. వారి కుటుంబ గౌరవాన్ని పోగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. వ్యక్తిత్వ హననం చేసి మానసిక వేదనకు గురిచేశారు. అవినాష్ రెడ్డికి హత్యలో ఏమాత్రం సంబంధం లేదని మేము ఎన్నో సార్లు చెప్పాం. ప్రజలని నమ్మించి..వారిపై ఆపాదించాలని ప్రయత్నిస్తున్నారు. దీనికోసం పచ్చ పత్రికల నుంచి వ్యవస్థలను ఉపయోగించుకుంటున్నారు.హత్య అనే సినిమాకి సెన్సార్ సర్టిఫికెట్ కూడా వస్తే దాంట్లో ఒక సన్నివేశాన్ని షేర్ చేసిన వారిపై కేసు. నేను ఎన్టీఆర్ సినిమా క్లిప్ పెట్టినా చంద్రబాబుకు తప్పుగా కనిపిస్తుంది. సినిమాలో ఒక క్లిప్పింగ్ పెడితే కూడా అరెస్టు చేసి కొట్టే వ్యవస్థ ఈ రాష్ట్రంలో ఉంది.పెన్ను,పేపర్ ఉందని.. ఒక బాధితుడు వైఎస్ జగన్‌ను కలిస్తే దానిపై కూడా గూడు పుటానీ అని రాస్తున్నారు. హత్య చేసిన వ్యక్తి సునీల్ ఫిర్యాదు చేస్తే పవన్‌ను అరెస్టు చేశారు. సునీల్ కుమార్ యాదవ్ మనోభావాలు దెబ్బతిన్నాయి అంటున్నారు.. ఇదెక్కడి న్యాయం?. ఈ నిందితులు కోట్లకు పడగలెత్తారంటే.. ఆ డబ్బు సునీత ఇచ్చిందా..? చంద్రబాబు ఇచ్చాడా?.దస్తగిరి తరపు వాదించే లాయర్ సిద్ధార్థ లూథ్రా.. గంటకు 2 లక్షలు తీసుకునే లాయర్. చంద్రబాబు వ్యక్తిగత లాయరే.. దస్తగిరి, సునీల్‌కి లాయర్‌గా ఉన్నారు. దీని వెనుక సునీత, చంద్రబాబు ఉన్నారు. రైతుల ఆత్మహత్యలు, లైంగిక దాడుల గురించి ఈ పత్రికలు మాట్లాడవు. నిత్యం జగన్ జగన్ అంటున్నారు. అయ్యన్నపాత్రుడు చెప్పింది నిజం చేయాలని చూస్తున్నారు. జగన్ ఓడిపోయాడు మరణించలేదు అని అయ్యన్నపాత్రుడు అన్నాడు.పీఏ కృష్ణారెడ్డి నిన్న అన్నీ విషయాలు వివరిస్తే దాన్ని రాయరు. అసలు రెండో పెళ్లి కోణంలో విచారణ ఎందుకు చేయరు?. ఆయన కొడుకు అని చెప్తున్న వాళ్లకు డీఎన్ఏ టెస్ట్ చేశారా?. ఇవన్నీ ఎవ్వరూ మాట్లాడారు. జగన్‌ను చూస్తే మీకు వెన్నులో వణుకు.. అందుకే మీరు ఇలాంటివి చేస్తున్నారు. వివేకాను పాశవికంగా హత్య చేసిన వ్యక్తులతో సునీత, చంద్రబాబు అంటకాగుతున్నారు. ఇంతటి దిక్కుమాలిన రాజకీయం చేస్తున్న మీది ఒక ప్రభుత్వమా? అని ప్రశ్నించారు. -
ఎవరిది డైరెక్షనో, ఎవరిది యాక్షనో అందరికీ తెలుసు
పులివెందుల: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఎల్లో మీడియా అవాస్తవ కథనాలను వండి వారుస్తోందని ఆయన పీఏ మూలి వెంకట కృష్ణారెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలోని ప్రెస్ క్లబ్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎల్లో మీడియాలో దుష్ప్రచారం చేస్తుండటం చూసి తాను మీడియా ఎదుటకు వచ్చానని చెప్పారు. ఈ కేసులో వాస్తవంగా ఎవరు డైరెక్షన్ చేస్తున్నారో, ఎవరు యాక్షన్ చేస్తున్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. ‘వివేకా చనిపోయిన రోజు నాకు ఒక లెటర్ దొరికితే, ఆ విషయం నేను నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి తెలిపాను. దాన్ని దాచిపెట్టమని ఆయన చెప్పగా.. పోలీసులతో ప్రాబ్లమ్ అవుతుందన్నాను. నీకెందుకు.. నేను చూసుకుంటానని ఆయన గట్టిగా చెప్పగా.. వారి ఉప్పు తిన్న విశ్వాసంతో లెటర్ దాచి పెట్టాను. నాతో ఆ పని చేయించిన ఆయన బయట ప్రశాంతంగా తిరుగుతున్నాడు. ఆయన చెబితే ఆ పని చేసిన నన్ను ఇరికించారు. ఎల్లో మీడియా ఈ వాస్తవాలను మాత్రం రాయదు.. చూపదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణారెడ్డి ఇంకా ఏమన్నారంటే.. మా ఫోన్ల ఆధారంగా విచారించాలి⇒ అప్పట్లో నన్ను డీటీసీలో పోలీసులు బాగా కొట్టారు. రిమాండ్‌కు పంపించారు. 90 రోజుల తర్వాత నాకు బెయిల్ వచ్చింది. కొద్ది రోజుల తర్వాత కేసును సీబీఐ హ్యాండోవర్ చేసుకుంది. వారు ఎప్పుడు పిలిచినా వెళ్లి సహకరించాను. 2021 మార్చి 3న ఢిల్లీ నుంచి అప్పటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దీపక్ కౌర్ నుంచి నోటీసు అందుకున్నాను. ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో హాజరు కావాలని చెప్పారు. ఇలా జరుగుతుందని రాజశేఖర్ నాకు ముందుగానే చెప్పారు. అంటే వారికి ముందే ఈ విషయం తెలిసి నాతో డ్రామాలాడారని తర్వాత తెలిసింది. ⇒ నేను ఢిల్లీ వెళ్లడానికి రాజశేఖర్ విమానం టిక్కెట్ ఏర్పాటు చేసి, అక్కడ ఉండటానికి వసతి కూడా కల్పించారు. ఖర్చుల కోసం నా అకౌంట్లో రూ.50 వేలు జమ (పాస్‌బుక్ జిరాక్స్ చూపారు) చేశారు. పులివెందుల ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లోని నాలుగో సూట్ రూంలో రాంసింగ్ మేము చెప్పినట్లు విని రంగన్న, దస్తగిరి బయటపడ్డారని.. నువ్వు కూడా నేను చెప్పినట్లుగా అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి పేర్లు చెప్పాలని నన్ను కొట్టారు. నొప్పి తట్టుకోలేక కేకలు వేశాను. ఆ అరుపులను బయటున్న ఈసీ సురేంద్రనాథరెడ్డి విన్నారు.ఇప్పుడు వాటికి సాక్ష్యాల్లేవంటున్నారు. ⇒ కడప సెంట్రల్ గెస్ట్ హౌస్ కేంద్రంగా రాంసింగ్ నా కుమారుల ఎదుటే నన్ను కొట్టారు. థర్డ్ డిగ్రీ ఉపయోగించారు. వీటికీ సాక్ష్యాలు లేవంటున్నారు. అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు వారికి అనుకూలంగా సాక్ష్యం చెప్పాడంటున్నారన్నారు. వారి వద్ద పనిచేసే వ్యక్తి వారికి అనుకూలంగా చెప్పకుండా నా తరఫున చెబుతాడా? 2021 అక్టోబర్ 17వ తేదీన హైదరాబాద్‌లో ఉన్న నా కుమారుడిని సునీత, రాజశేఖర్‌లు పిలిపించుకుని ‘మీ నాన్న రాంసింగ్ చెప్పినట్లు వినాలి. అందుకు నువ్వు ఎలాగైనా ఒప్పించాలి’ అని తీవ్రంగా ఒత్తిడి చేశారు. ⇒ దీంతో నేను ఆ రాత్రే బయలుదేరి 18నహైదరాబాద్కు వెళ్లాను. పాత ఆఫీస్‌కు కాకుండా కొత్త ఆఫీసుకు (ఇక్కడ సీసీ కెమెరాలు లేవు) రమ్మని చెప్పారు. అక్కడికి వెళ్లాక రాంసింగ్ చెప్పినట్లు వినాలని సునీత నాపైఒత్తిడి తెచ్చారు. నేనేమో ఉన్నది ఉన్నట్లు చెబుతానన్నాను. మనం చెప్పినట్లు కృష్ణారెడ్డి వినకపోతే నువ్వు జైలుకు వెళతావని సునీత.. రాజశేఖర్‌తో అనడంతో ఈ హత్యలో వారి ప్రమేయం ఉన్నట్లుగా నాకు అనుమానం వచ్చింది. మా అందరి ఫోన్ల ఆధారంగా విచారిస్తే నిజాలు బయటకు వస్తాయి.నేను వేసిన కేసును కొట్టేయించుకోవడానికి పాట్లు⇒ ఆ పరిస్థితిలో సునీత, రాజశేఖర్, రాంసింగ్‌లు నన్ను బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాను. పోలీసులు పట్టించుకోకపోతే అప్పటి ఎస్పీని స్వయంగా కలిసి ఫిర్యాదు చేశాను. అయినా స్పందన లేనందున పులివెందుల కోర్టులో ప్రైవేట్ కంప్లయింట్ వేశాను. కోర్టు ఆదేశాల మేరకు అప్పటి సీఐ రాజు స్వయంగా మా ఇంటికి రెండుసార్లు వచ్చి నాతో 20 పేజీల స్టేట్మెంట్ తీసుకున్నారు. ఇప్పుడు రాజు అసలు విచారణే చేయలేదని చెబుతున్నారు. ఇందులో పోలీసు అధికారులైన రాజేశ్వరరెడ్డి, రామకృష్ణారెడ్డిలకు ఎటువంటి సంబంధం లేదు. నేను అవినాష్‌తో మాట్లాడినట్లు నిరూపించాలి. సునీత, రాజశేఖర్‌లు నన్ను బెదిరించలేదని, రాంసింగ్ నన్ను కొట్టలేదని తిరుమల/కాణిపాకం/ఏ చర్చిలో అయినా సరే వారు ప్రమాణం చేస్తే నేను ఈ కేసును విత్‌డ్రా చేసుకుంటాను. ⇒ నేను వేసిన కేసును క్వాష్ చేసుకోవడానికి అప్పట్లో సునీత, రాజశేఖర్, రాంసింగ్‌లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, కింది కోర్టులో తేల్చుకోవాలని సూచించింది. తర్వాత వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇంతలో కూటమి ప్రభుత్వం రావడంతో కేసు కొట్టేయించుకోవాలని సునీత.. చంద్రబాబును, హోం మంత్రి అనితను ఆశ్రయించారు. (అందుకు సంబంధించిన ఫొటోలను మీడియాకు చూపారు). -
CBI SP రామ్ సింగ్ చెప్పినట్లు సహకరించాలని సునీత దంపతులు బెదిరించారు
-
దయ్యాల వేద పఠనం!
తెర వెనుక కత్తుల కోలాటమాడుతున్నవారు తెరముందుకొచ్చి శాంతి కపోతాలను వదులుతున్నారు. రోత చేష్టల రంగమార్తాండులు శ్రీరంగనీతులు బోధిస్తున్నారు. అదిగో దొంగ ఇదిగోదొంగ అంటూ గజదొంగలే అరుస్తున్నారు. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌లో కంచె చేను మేస్తున్నది. పోలీసు వ్యవస్థను ప్రతిపక్షంపైకి పాలకులు ఉసిగొల్పుతున్నారు. ఇదే కదా, అసలు సిసలైన వ్యవస్థీకృత నేరం. అత్యున్నత స్థాయి పోలీసు అధికారి మంత్రి వర్గం ముందు హాజరై ఓ గొప్ప వాగ్దానం చేశాడని వార్తలు వెలువడ్డాయి. ప్రతిపక్షాన్నీ, దాని అభిమానులనూ వేటాడే పనిలో మరింత వేగం పెంచుతారట. దీన్నేమంటాము? నేరమే అధికారమై కొలువు దీరడం కాదా? నేరమే అధికారమై కొరడా ఝుళిపించడం కాదా?నేరమే అధికారమై ప్రజల్నే నేరస్థుల్ని చేస్తుంటే నోరుండీ ఊరక కూర్చున్న ప్రతి ఒక్కడూ నేరస్థుడేనంటారు విప్లవకవి వరవరరావు. ఈరోజు వేటాడుతున్నది ప్రతిపక్షాన్నే కావచ్చు. రక్తం రుచి మరిగిన పులికి పరిమితులూ, షరతులూ వర్తి స్తాయా? ఉపవాస దీక్షలేమైనా అడ్డొస్తాయా? పౌరహక్కులను పాదాల కింద తొక్కేయడానికి అలవాటుపడ్డ పోలీస్ రాజ్యం కూడా అంతే! ఈ రోజున వాడు తడుతున్నది నీ ఇంటి తలుపును కాకపోవచ్చు. నేడు కాకపోతే రేపు లేదా మరునాడు... నువ్వు నీ హక్కుల్ని గురించి ప్రశ్నించిన రోజున నీ ఇంటి ముంగిట కూడా ఆ బూట్ల చప్పుడు వినిపిస్తుంది.నేరమే అధికారమై ప్రశ్నిస్తున్న ప్రతివాడి మీద నేరస్థుడనే ముద్ర వేసే ధోరణిని ఆదిలోనే ప్రతిఘటించకపోతే ప్రజా స్వామ్య మనుగడకే ప్రమాదమేర్పడుతుంది. అధికారంలోకి రావడానికి అసత్యాలకూ, అభూత కల్పనలకూ ఒడిగట్టారు గనుక ప్రభుత్వపక్ష స్వభావాన్ని నేరపూరితమైనదిగా భావించ వలసి వస్తున్నది. అసత్యాలూ, అభూత కల్పనలన్నీ ఒక్కొ క్కటిగా రుజువౌతూ వస్తున్నాయి గనుక నేరమే అధికారం రూపు దాల్చిందని అనుకోవలసి వస్తున్నది. గతకాలపు జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిందనీ, 14 లక్షల కోట్ల అప్పు చేశారనీ కూటమి పక్షం ఊరూవాడా ఏకంచేసి ప్రచారం చేసింది. మొన్ననే రాష్ట్ర శాసనసభలో సాక్షాత్తూ ఆర్థికమంత్రి పాత ప్రచారానికి విరుద్ధమైన ప్రకటన చేశారు. జగన్ ప్రభుత్వం చేసిన మొత్తం అప్పు 3 లక్షల 39 వేల కోట్లేనని తేల్చారు. ఎంత గుండెలు తీసిన బంట్లు వీరు? ఈ ఒక్క ఉదాహరణ చాలదా, ప్రభుత్వ నేరపూరిత స్వభావాన్ని నిర్ధారణ చేయడానికి?అప్పుల ప్రస్తావన మచ్చుకు మాత్రమే. ఇటువంటి బేషరమ్ ప్రచారాలు చాలా చేసింది కూటమి. సామాన్య ప్రజల ఆశల మీద, ఆకాంక్షల మీద కూటమి జూదమాడింది. వారి కలల అలల మీద ఆటలాడింది. ఏమార్చడానికి ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోను డస్ట్‌బిన్‌లోకి గిరాటేసింది. కుర్చీ మీద కూర్చొని నవమాసాలు గడిచిపోయాయి. హామీల డెలివరీ ఆనవాళ్లే లేవు. ఉండకపోవచ్చు కూడా. బడ్జెట్లో కొన్ని హామీలకు మాత్రమే అరకొర కేటాయింపులు చూపారు. మిగతా వాటి ఊసే లేదు. నిరుద్యోగులకు నెలకు 3 వేల భృతి ఇస్తామన్నారు. మోసం చేశారు. ఆడబిడ్డలకు నెలకు పదిహేను వేలిస్తామన్నారు. మోసం చేశారు. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికీ ఏటా 15 వేలిస్తా మన్నారు. దానికి ఒక ఏడాది ఎగనామం పెట్టి, ఈసారి బడ్జెట్లో అవసరమైన సొమ్ములో సగం మాత్రమే కేటాయించారు.ఇంతవరకూ ఒక్క పైసా కూడా లబ్ధిదారులకు చేరలేదు.రైతుకు ఏటా 20 వేల ఆర్థిక సాయమన్నారు. రైతన్న ఎదురు చూస్తూనే ఉన్నాడు.సాయం సంగతి దేవుడెరుగు. పండించిన పంటకు గిట్టు బాటు ధర లేక రైతులు అల్లాడుతున్నారు. జగన్ హయాంలో ఇరవై నుంచి ఇరవై ఏడు వేల దాకా పలికిన క్వింటాల్ మిర్చి ధర ఇప్పుడు ఆరేడు నుంచి పదివేల దాకా పడిపోయింది. పెట్టుబడి ఖర్చులు కూడా రైతులకు రాలేదు. అన్ని పంటల కథలూ దాదాపు ఇంతే! కాల్వల కింద వేసుకున్న వరి పైర్లు కూడా నీటి తడులు లేక ఎండిపోతున్న వైనాన్ని ఐదేళ్ల తర్వాత ఇప్పుడే చూస్తున్నాము. మహిళలకు ఉచిత బస్సు ఇంకా డిపో దాటి రోడ్డెక్కలేదు. అప్పుడే దానిమీద మాట మార్చడం మొదలైంది. ఉచిత బస్సును ఒక్క జిల్లాకే పరిమితం చేస్తామని ఇప్పుడు చెబుతున్నారు.ఈ రకంగా హామీల ఎగవేతతోపాటు పాలనా వైఫల్యాలతో ఆదిలోనే అప్రతిష్ఠ మూటగట్టుకున్న కూటమి సర్కార్ విమర్శ కుల నోళ్లు మూయించి, అసత్యాలను ప్రచారంలో పెట్టి పబ్బం గడుపుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీపై దాడిని కేంద్రీకరించి, భారత న్యాయసంహితలోని 111వ సెక్షన్‌ను ఈ దాడికి ఆయుధంగా వాడటం మొదలుపెట్టారు. సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసే వారిపై ఈ సెక్షన్ వాడకూడదని ఏపీ హైకోర్టు చెప్పినా కూడా కూటమి సర్కార్ చెవికెక్కించుకోలేదు. కిడ్నాపులు, దోపిడీలు, భూకబ్జాలు, ఉగ్రవాద కార్యకలాపాలు, ఆర్థిక నేరాలు వగైరా ముఠాలుగా ఏర్పడి చేసే నేరాలు (వ్యవస్థీకృత నేరాలు) ఈ సెక్షన్ పరిధిలోకి వస్తాయి.సోషల్ మీడియాలో చేసే విమర్శలను ఈ పరిధిలోకి తెచ్చి రాష్ట్ర సర్కార్ చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నది. ప్రత్యర్థుల పట్ల కక్షపూరిత వైఖరి కారణంగానే సర్కార్ ఈ కుట్రకు తెరతీసిందనుకోవాలి. సోషల్ మీడియాలో చేసే విమర్శల వెనుక ఎవరిదో ప్రోద్బలం ఉన్నదనీ, ఇదంతా వ్యవస్థీకృతంగా జరుతున్నదనీ ఓ స్క్రీన్‌ప్లేను తయారుచేసి, దానికి అనుగుణంగా కీలక వ్యక్తులను అరెస్ట్ చేయాలనీ, తద్వారా ఆ పార్టీని బలహీన పరచాలనే పన్నాగం స్పష్టంగానే కనిపిస్తున్నది. ఇందు కోసం వేలాదిమంది కార్యకర్తలు, అభిమానుల మీద కేసులు పెట్టాలనీ, వేధించాలనీ జిలాల్ల వారీగా టార్గెట్లు పెట్టుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.ఇటీవల పోలీసు ఉన్నతాధికారి నిర్వహించిన ఒక సమీక్షా సమావేశంలో కూడా ఈ టార్గెట్లను చేరుకునేలా సహకరించాలనే ఆదేశాలిచ్చినట్టు వచ్చిన వార్తలు నిజమైతే అంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదు. గత ప్రభుత్వ హయాంలో కూటమి అగ్రనాయకులంతా బరితెగించి మాట్లాడిన బూతుల ఆడియోలు, చెప్పులు చూపెట్టిన వీడియోలు కోకొల్లలు. వీరికి భిన్నంగా వైసీపీ అధినేత ఏనాడూ ఏ ఒక్క అసభ్యకర వ్యాఖ్యానం చేయలేదు. అయినా సరే, వీరి బూతులకు బదు లిచ్చిన నేతలపై అక్రమ కేసులకు తెగబడుతున్నారు.మొన్నటి మంత్రివర్గ సమావేశం ఎజెండా ముగిసిన తర్వాత ఒక పోలీస్ ఉన్నతాధికారి హాజరై ఒక వింత సందేశాన్ని వినిపించినట్టు యెల్లో మీడియా టాప్ న్యూస్‌గా ప్రచారంచేసింది. బహుశా కూటమి పెద్దల తాజా కుట్రలో భాగంగానే ఈ వింత కథను ప్రచారంలోకి తెచ్చి ఉంటారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఇటీవల చనిపోయిన రంగన్న అనే వివేకానందరెడ్డి ఇంటి వాచ్‌మన్ మరణం అనుమానాస్పదమేనని ఆ ఉన్నతాధికారి మంత్రులకు ఉపదేశించారట! అనారోగ్యంతో ఉన్న తన భర్తను పోలీసులు వేధించారనీ, అందువల్లనే అయన చనిపోయాడనీ రంగన్న భార్య మీడియాతో మాట్లాడిన మాట లను వారెందుకు పరిశీలనలోకి తీసుకోలేదో తెలియదు మరి!అంతటితో ఆగలేదు. ఈమధ్యకాలంలో చనిపోయిన వ్యక్తులను వివేకానంద హత్య కేసుకు లింకు చేస్తూ అవన్నీ అనుమానాస్పద మరణాలేనని చెప్పడానికి పూనుకోవడం, మోకాలుకు, బోడిగుండుకు ముడిపెట్టినట్టు కథలు అల్లడం దిగ్భ్రాంతి కలిగిస్తున్నది. అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన అభిషేక్ రెడ్డి మరణంపై కూడా అనుమానాలున్నాయట! జగన్ కుటుంబ సభ్యుల ప్రేమాభిమా నాలు చూరగొన్న డ్రైవర్ నారాయణ కేన్సర్ వ్యాధికి చికిత్స తీసుకుంటూ కొంతకాలం క్రితం చనిపోయాడు. అందులో కూడా అనుమానం ఉన్నదట! నీచమైన కుట్రలకు పరాకాష్ట డాక్టర్ గంగిరెడ్డి పేరును కూడా ఇందులోకి లాగడం. డాక్టర్గంగిరెడ్డి భారతమ్మ తండ్రి. కరోనా సోకడంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ చనిపోయారు. ఆయన మరణం కూడా అనుమానమేనట! పోలీస్ అధికారి ఏం చెప్పాడో తెలియదుగానీ ‘ఈనాడు’ మాత్రం అరపేజీ ఫిక్షన్ రాసి పారేసింది.తాము చెప్పదలుచుకున్న కథలో ఆవగింజంత నిజమైనా ఉండాలన్న నియమం వారికేమాత్రం లేదు. చెప్పింది ప్రచారం చేసిపెట్టడానికి మోచేతి కింద వందిమాగధ మీడియా సిద్ధంగా ఉన్నది. చేతిలో అధికారం ఉన్నది. వ్యవస్థల మెడలకు బిగించిన ఇనుప గొలుసులు తమ చేతిలోనే ఉన్నాయి. ఉసిగొలిపితే చాలు. కేసులు పెట్టడం ఎంత పని? ఇప్పుడిదే కూటమి సర్కార్ సింగిల్ పాయింట్ ఎజెండా! దయ్యాలు వేదాలు వల్లించినట్టు,తోడేళ్లు – గుంటనక్కలూ శాకాహార ప్రతిజ్ఞలు చేసినట్టు ఈ పెద్దలంతా సభలు పెట్టుకొని ఒకరినొకరు పొగుడుకుంటూ, ప్రజా సంక్షేమం గురించి, ప్రజాస్వామ్యం గురించి, అభివృద్ధి గురించి మాట్లాడటం కంటే ఎబ్బెట్టు దృశ్యాలు ఇంకేముంటాయి? అటువంటి ఎబ్బెట్టు దృశ్యాన్ని ఈమధ్యనే విశాఖతీరంలో చూడవలసి వచ్చింది.తెలంగాణ పునరాలోచన?తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటై సరిగ్గా పదిహేను మాసాలైంది. అరవై మాసాల (ఐదేళ్ల) పాలన కోసం ప్రజలు ఎన్నుకున్నారనుకుంటే అందులో పావు భాగం ప్రయాణం పూర్తయిందన్నమాట. నిజానికి ఈపాటికే ప్రభుత్వం పూర్తిగా కుదురుకొని దాని ఎజెండాను పరుగెత్తించే క్రమంలో ఉండాలి. కానీ, ఎందుకనో ఇప్పటికీ పార్టీకి, ప్రభుత్వానికి మధ్య, ప్రభు త్వంలోని మంత్రుల మధ్య, మంత్రులకు అధికారులకు మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తున్నది. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ గనుక ఇటువంటివన్నీ షరా మామూలేనని ఆ పార్టీ నేతలు సమర్థించుకోవచ్చు గాక. కానీ, ఈ వాదనను అంగీకరించడానికి జనం సిద్ధంగా లేరు.శాసన మండలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆర్భాటంగా పోటీ చేసి, ముఖ్యమంత్రితో సహా యంత్రాంగమంతా రంగంలోకి దిగి కూడా ఓటమి పాలైంది. అది కూడా బీజేపీ చేతిలో! రాష్ట్ర వ్యాప్తంగా బలమైన పునాది, కార్యకర్తల బలం, నాయకత్వ ఇమేజ్ ఉన్న బీఆర్ఎస్ చేతిలో ఓడిపోయి ఉంటే కనీసం గుడ్డిలో మెల్ల అనుకోవచ్చు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రధాన శత్రువు, ఉత్తరాది పార్టీగా తాము విమర్శించే బీజేపీ చేతిలోభంగపడటం కచ్చితంగా కాంగ్రెస్ సర్కార్‌కు ఇబ్బందికరమైన విషయమే. బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. పోటీ చేయకుండా బీజేపీకి సహకరించిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది.అయితే ఈ ఆరోపణకు సరైన ఆధారం కనిపించడం లేదు. బీఆర్ఎస్ గనుక లోపాయకారిగానైనా బీజేపీకి పూర్తిగా సహకరించి ఉంటే బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు అంత భారీస్థాయిలో ఓట్లు పడేవి కావు. బీసీ నినాదం వల్లనే హరికృష్ణ పెద్దసంఖ్యలో ఓట్లు సంపాదించారనే వాదన కూడా ఉన్నది. కానీ తెలంగాణ బీసీ సమూహాల్లో సామాజిక విధేయత కన్నా రాజకీయ విధేయతే ఎక్కువ. బీఆర్ఎస్కు విధేయంగా ఉండే ఓటర్లలో బీసీలే ఎక్కువ సంఖ్యలో ఉంటారు. కనుక బీఆర్ఎస్ ఓట్లు పెద్దసంఖ్యలో హరికృష్ణకు బదిలీ అయుండవచ్చనే అభిప్రాయం ఉన్నది.కేవలం వ్యక్తిగత సంబంధాల మీద ఆధారపడి పెద్దగా ఆర్థిక దన్ను లేకుండానే బీజేపీ, కాంగ్రెస్‌లకు హరికృష్ణ గట్టి పోటీ ఇవ్వగలిగినప్పుడు, బీఆర్ఎస్ రంగంలో ఉన్నట్లయితే గెలిచేది కాదా అనే చర్చ కూడా మొదలైంది. పోటీ చేయకపోవడానికి బీఆర్ఎస్కు ఉన్న కారణాలేమిటో అధికారికంగా తెలియదు. పార్టీ గుర్తుపై ఎన్నికై అధికార పార్టీలో చేరిన పదిమంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడి ఆ స్థానాల్లో ఉపఎన్నికలు రావాలని బీఆర్ఎస్ బలంగా కోరుకుంటున్నది. అందుకు కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ సహకారం అవసరమని కూడా ఆ పార్టీ భావిస్తుండవచ్చు. అందుకోసమే కౌన్సిల్ బరికి బీఆర్ఎస్ దూరం జరిగిందనే అభిప్రాయం కూడా ఉన్నది.తెలంగాణలో తమ పార్టీ బాగా బలపడిందని బీజేపీ శ్రేణులు బలంగా నమ్ముతున్నాయి. నిజంగానే అర్బన్, సెమీ ఆర్బన్ ప్రాంతాల్లో కొంత హిందూత్వ ప్రభావం ఆ పార్టీకి ఉపకరిస్తున్న సూచనలు కన్పిస్తున్నాయి. ముఖ్యంగా బీసీ యువతలో వీరహిందూత్వ ప్రచారం బాగానే పనిచేస్తున్నది. బంజారా, ఇతర గిరిజన తెగల్లో ప్రాబల్యం సంపాదించడానికి కాషాయ పార్టీ వ్యూహాత్మకంగా పనిచేస్తున్నది. ఈ పరిణామాలు సహజంగానే బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు కలవరం కలిగిస్తాయి.రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఒక చిన్న లిట్మస్ టెస్ట్ అందుబాటులో ఉన్నది. పదిమంది ఫిరాయింపు ఎమ్మెల్యేల గుండెచప్పుడు వింటే చాలు. అనర్హత విషయంలో సుప్రీంకోర్టు పట్టుదలగా ఉండటంతో వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారట. కాంగ్రెస్ టిక్కెట్‌పై ఉపఎన్నికల్లో గెలిచే ప్రసక్తే లేదని ఫిరాయింపుదారులు బలంగా నమ్ము తున్నారు. కొందరు బహిరంగంగా తాము పార్టీ మారలేదని చెబుతున్నారు. గోడ దూకినవారు మళ్లీ గోడెక్కి కూర్చుంటు న్నారు. మరికొందరు అంతర్గతంగా మథనపడుతున్నారు.అంతే తేడా!ప్రయాణంలో పాతిక శాతం కూడా పూర్తికాక ముందే కాంగ్రెస్ పార్టీ ఆత్మవిశ్వాసం కోల్పోయినట్టు కనిపిస్తున్నది. ధిక్కార స్వరాలు వినిపించడం మొదలైంది. ఈ పరిస్థితి రావడా నికి ప్రభుత్వంలో సమన్వయ లోపం, అనుభవ రాహిత్యం కూడా ప్రధాన కారణాలే! రైతులకు రెండు లక్షల రుణమాఫీకింద 20 వేల కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం రైతాంగపు సానుభూతిని మాత్రం సంపాదించలేకపోయింది. రెండు లక్షల మీద ఐదువేలో పదివేలో వడ్డీ మిగిలిపోయిన వారికెవరికీ రుణమాఫీ జరగలేదు. సాంకేతిక కారణాల వల్ల 30 శాతంమందికి మాఫీ జరగలేదు. దానికితోడు రైతుబంధు నిలిచి పోవడం, గతంతో పోలిస్తే గిట్టుబాటు ధరలు దక్కకపోవడం, వేసంగి పంటకు నీళ్లివ్వలేకపోవడం, ఎప్పుడో మరిచిపోయిన కరెంటు కోతలు, మోటార్లు కాలిపోవడాలు మళ్లీ ప్రత్యక్షం కావ డంతో రైతాంగంలో వ్యతిరేకత పెరుగుతున్నది.ఆర్థిక మందగమనం అనే పరిణామం దేశవ్యాప్తంగా ఉన్నదే కావచ్చు. కానీ తెలంగాణలో స్వయంగా ప్రభుత్వమే పూనుకొని హైడ్రా అనే అసందర్భ శరభ నాట్యం చేయడం రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేసింది. ఇది రాష్ట్రమంతటా డబ్బు చలా మణిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. దానికితోడు కేసీఆర్ హయాంలో రైతుబంధు, దళిత బంధు వగైరా స్కీముల ద్వారా ఏటా జనం చేతుల్లోకి చేరిన వేలకోట్ల రూపాయలు ఆగి పోయాయి.అవసరాలకు భూమిని అమ్ముకోవాలన్నా, కొనే నా«థుడు దొరక్క రైతులు అవస్థలు పడ్డారు. ఆరోగ్యశ్రీ నిధులు సకాలానికి అందక, ఫీజు రియింబర్స్‌మెంట్ అమలు జరగక, రిటైర్మెంట్ బెనిఫిట్లు అందక వివిధ వర్గాల ప్రజలు సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో ఆర్భాటంగా ప్రారంభించిన ప్రజా దర్బార్ మూణ్ణాళ్ల ముచ్చటగా మిగిలి పోయింది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడానికి ఇటువంటి కారణాలేమీ లేవు. కేవలం నాయకత్వ అహంకారపూరిత ధోరణి ప్రజలకు దూరం చేసింది. నిరుద్యోగ యువత సమస్య లను విని వారిని సాంత్వన పరచడంలో చూపిన నిర్లక్ష్యం వల్ల భారీ మూల్యాన్ని చెల్లించవలసి వచ్చింది. దసరా సెలవుల్లో ఇళ్లకు చేరుకున్న ఈ యువత తల్లిదండ్రులను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్చడంలో కృతకృత్యులయ్యారు. ప్రతిష్ఠాత్మకంగా భావించిన పథకాలు కొన్ని గురితప్పాయి. కొందరు ఎమ్మెల్యేల అహంకారం, అవినీతి కూడా జనంలో ఏహ్యభావం ఏర్పడ్డానికి కారణమై ఆ పార్టీకి నష్టం చేకూర్చాయి. అంతే తప్ప విస్తార జనబాహుళ్యం బీఆర్ఎస్ హయాంలో ఇక్కట్లపాలైన దాఖలాలు లేవు.చేసిన ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చలేకపోగా కొన్ని సంక్షోభాలను పిలిచి మరీ అక్కున చేర్చుకుంటున్న కాంగ్రెస్ సర్కార్ పనితీరు మారకుంటే చేదు అనుభవాలను చవిచూడక తప్పక పోవచ్చు. ఈ వేసవి కష్టాలను, మంచినీటి కటకటను ప్రభుత్వం ఏ రకంగా ఎదుర్కోబోతున్నదో చూడవలసి ఉన్నది. మరో పక్కన గత కేసీఆర్ పాలనే ఈ పాలనకంటే బాగున్నదని బలపడుతున్న ప్రజాభిప్రాయాన్ని ఎలా మార్చగలరో కూడా చూడాలి. ఈ వేసవి పరీక్షలో గనుక కాగ్రెస్ ఫెయిలయితే వచ్చే రజతోత్సవ సభలో కేసీఆర్ పాంచజన్యం పూరించడం ఖాయం!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
సహజ మరణాలపై సిట్ కుట్ర: వైఎస్ మదన్‌మోహన్‌రెడ్డి
పులివెందుల: వైఎస్సార్సీపీ డాక్టర్స్ విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వైఎస్ అభిషేక్‌రెడ్డి అనారోగ్యంతో మృతి చెందితే, దానిపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని, దానికి ప్రభుత్వ పెద్దలు కూడా వంతపాడుతున్నారని అభిషేక్ రెడ్డి తండ్రి, వైఎస్సార్సీపీ నేత వైఎస్ మదన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయన శనివారం వైఎస్సార్ జిల్లా పులివెందులలో మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షులంతా ఒక్కొక్కరుగా చనిపోతున్నారంటూ ఎల్లో మీడియా విషపూరిత కథనాలు ప్రచురించడాన్ని ఖండించారు.తమ కుమారుడు అభిషేక్ రెడ్డి అనారోగ్యంతో చనిపోయారని చెప్పారు. తమ కుమారుడి ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు శక్తివంచన లేకుండా ప్రయత్నించారని, కోమా నుంచి బయటపడతాడని ఆశించామని, దేవుడు చిన్న చూపు చూడటంతో మృతి చెందాడని తెలిపారు. ఎంతో భవిష్యత్ ఉన్న అభిషేక్‌రెడ్డి చిన్న వయస్సులో చనిపోవడం ఈ ప్రాంతంలో అందరినీ కలచివేసిందని చెప్పారు. అభిషేక్‌రెడ్డి పిల్లలను చూస్తే కడపు తరుక్కుపోతోందని ఆవేదన వ్యక్తంచేశారు.అభిషేక్ మృతి తమకు తీరని లోటని, ఆ బాధ నుంచి కోలుకోలేకపోతున్నామని తెలిపారు. ఇలాంటి తీవ్ర విషాద పరిస్థితుల్లో తాముంటే.. చిన్నాన్న వైఎస్ వివేకా నందరెడ్డి హత్య కేసులో సాక్షులు ఒక్కొక్కరుగా చనిపోతున్నారని, అందులో కుట్ర ఉందంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి పెడర్థాలు తీయడం, ప్రభుత్వ పెద్దలూ ఇదే విధంగా మాట్లాడటం దారుణమని అన్నారు. మామ డాక్టర్ ఈసీ గంగిరెడ్డి కరోనా వైరస్, అనారోగ్యంతో దీర్ఘ కాలం చికిత్స పొందుతూ చనిపోయారని తెలిపారు.మొన్న వాచ్‌మేన్ రంగన్న కూడా అనారోగ్యంతో చనిపోయాడని చెప్పారు. రంగన్నకు ఆయాసం ఉందని ఆయన కుటుంబ సభ్యులు కూడా చెబుతున్నారని, అతని అనారోగ్యం ఇక్కడి అందరికీ తెలుసునని చెప్పారు. వీరందరి సహజ మరణాలను అసహజ మరణాలుగా చిత్రీకరించేందుకు ఒక పథకం ప్రకారం ఎల్లో మీడియా పనిచేస్తోందని అన్నారు. బయటి ప్రపంచానికి పులివెందులలో దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని తెలియజెప్పేందుకు ఎల్లో మీడియా విశ్వప్రయత్నం చేస్తోందని, ప్రభుత్వ పెద్దల చర్యలూ ఇదే విధంగా ఉన్నాయని ధ్వజమెత్తారు.సిట్ కాదు.. జ్యుడీషియల్ విచారణ జరిపించండిచిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షులుగా ఉన్న వారు మృతి చెందిన వ్యవహారంపై ప్రభుత్వ సిట్ దర్యాప్తు అంటేనే ఏదో కుట్ర దాగి ఉందన్న అనుమానం వస్తోందని వైఎస్ మదన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సిట్ కాకుండా జ్యుడిషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అనేక మందిపై పెడుతున్న అడ్డగోలు కేసులు, చేపడుతున్న ఏకపక్ష విచారణ అందరమూ కళ్లారా చూస్తున్నామని, అందువల్లే సిట్‌పై నమ్మకం లేదని చెప్పారు. -
చంద్రబాబు తప్పుడు మాటలు.. ఈనాడు రోత రాతలు: పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: ఈనాడు రోత రాతలపై వైఎస్సార్సీపీ మండిపడింది. వైఎస్ జగన్ లక్ష్యంగా ఈనాడు విషపు రాతలు రాస్తోందని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకా హత్య కేసులో నారాయణ సాక్షిగా ఉన్నారని ఈనాడు రోత రాతలు రాసింది. కేబినెట్లో చంద్రబాబు ఏదో మాట్లాడితే.. ఈనాడు తప్పుడు వార్తలు వండి వార్చింది. వివేకా వాచ్మెన్ రంగయ్య మృతిని కూడా వైఎస్ జగన్‌కు ఆపాదించే యత్నం చేసింది. హామీలు అమలు గురించి తప్పించుకునేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్’’ అంటూ పేర్ని నాని నిప్పులు చెరిగారు.‘‘డైవర్షన్ పాలిటిక్స్ చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు.. ఎన్నికలయ్యాక చేతులెత్తేశారు. రాజకీయ ప్రత్యర్థులపై తప్పుడు వార్తలు రాయించడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఎన్టీఆర్ పరపతిని కూడా ఈనాడును అడ్డంపెట్టకుని బాబు దెబ్బతీశాడు. గతంలో లక్ష్మీపార్వతిపై కూడా ఈనాడులో ఇలాగే తప్పుడు రాతలు రాయించారు. వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి ఈనాడును చంద్రబాబు వాడుతున్నారు. వైఎస్ వివేకా హత్యతో వైఎస్ జగన్‌కు ఏం సంబంధం?. వ్యవస్థలను ప్రభావితం చేసి వైఎస్సార్సీపీ నేతలను బాబు ఇబ్బంది పెట్టాలని చూశారు’’ అని పేర్ని నాని ధ్వజమెత్తారు.‘‘వైఎస్ జగన్, వైఎస్ అవినాష్‌రెడ్డిలపై విషం చిమ్మడమే చంద్రబాబు లక్ష్యం. న్యాయ వ్యవస్థలను కూడా ప్రభావితం చేసేలా ఈనాడులో వార్తలురాస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా రంగన్న మృతిని కేబినెట్లో చర్చించారు. నారాయణ యాదవ్ అనారోగ్యంతో మృతి చెందారు. గంగాధర్‌రెడ్డిది సహజ మరణమని పోస్టుమార్టం రిపోర్ట్ చెప్తుంది. గంగాధర్‌రెడ్డి మరణం అనుమానం అంటూ బాబు డైరెక్షన్లో ఈనాడు తప్పుడు రాతలు రాసింది. గన్మెన్లు ఉండగా రంగన్న మృతిపై చంద్రబాబుకు సందేహం ఏంటో అర్థం కావడం లేదు. చంద్రబాబు ఇచ్చిన గన్మెన్లు ఉండగా.. రంగన్న మృతి ఎలా అనుమానాస్పదం?’’ అంటూ పేర్ని నాని ప్రశ్నించారు.‘‘పరిటాల మృతి తర్వాత చంద్రబాబు సీఎం అయ్యారు. 2014- 2019 మధ్య పరిటాల సునీత కూడా మంత్రిగా ఉన్నారు. పరిటాల రవి హత్యపై ఎందుకు విచారణ చేయలేదు. వివేకా హత్య కేసులో నారాయణ సాక్షి కాదని రికార్డులు చెప్తూ ఉంటే.. నారాయణ సాక్షి అని ఈనాడు ఎలా రాస్తోంది?’’ పేర్ని నాని నిలదీశారు.‘‘వివేకా హత్య కేసులో ఈనాడు తప్పుడు వార్తలు రాసింది. సుగాలి ప్రీతి హత్య కేసు గురించి తీవ్రంగా పరిగణించరుగానీ రంగయ్య మృతిపై మాత్రం తీవ్రంగా స్పందిస్తారంట. జగన్ డ్రైవర్ నారాయణ యాదవ్ ఆ కేసులో సాక్షి అంటూ తప్పుడు కథనాలు రాశారు. జగన్ లక్ష్యంగా విషపు రాతలు రాసింది. చంద్రబాబువి.. తప్పుడు మాటలు, ఈనాడువి తప్పుడు రాతలు. కేబినెట్లో ప్రజలకు చేయాల్సిన మేలు గురించి చర్చించలేదు. ఎన్నికలలో ఓట్ల కోసం ప్రజలను మోసం చేస్తారు. అధికారంలోకి వచ్చాక తన తప్పుడు హామీల నుండి బయట పడటానికి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. హామీలకు పంగనామాలు పెట్టారు...రాజకీయ ప్రత్యర్థులపై ఈనాడులో విషం కక్కించటం చంద్రబాబుకు అలవాటే. ఎన్టీఆర్ కు వెన్నుపోటు నుండి అనేక అంశాలలో ఇదే జరిగింది. లక్ష్మీ పార్వతి విషయంలో కూడా అప్పట్లో ఇలాగే రాయించారు. అవినాష్ కు సంబంధం లేకపోయినా కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. న్యాయవ్యవస్థను కూడా ప్రభావితం చేసేలాగ పెద్దపెద్ద అక్షరాలతో వార్తలు రాయిస్తున్నారు. నారాయణకు వివేకా కేసుకు ఎలాంటి సంబంధం లేదు. బ్రెయిన్ ట్యూమర్ తో నారాయణ చనిపోయారు. కల్లూరి గంగాధరరెడ్డిని 243వ సాక్షిగా ఉన్నాడు. దీర్ఘకాలంగా షుగర్ వ్యాధితో మృతి చెందారు. ఆయనది సహజ మరణం అని పోస్టుమార్టం రిపోర్టు కూడా ఉంది. శ్రీనివాసరెడ్డి 2018 సెప్టెంబరు లో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వేధింపుల కారణంగానే సూసైడ్ చేసుకున్నట్టు సూసైడ్ నోట్ రాశారు..వైఎస్ అభిషేక్‌రెడ్డి తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు. జగన్, సునీతమ్మ ఇద్దరికీ అభిషేక్ బంధువే. మల్టీ ఆర్గన్స్ డేమేజ్ వలన అభిషేక్ మృతి చెందిన సంగతి అందరికీ తెలిసినా ఈనాడు విషపు రాతలు రాసింది. వాచ్మెన్ రంగన్నకు పోస్టుమార్టం అయ్యాక ఖననం చేశారు. రంగన్న గురించి కేబినెట్లో చర్చించారు. డీజీపీతో పాటు కడప నుండి పోలీసు అధికారులు వచ్చి ప్రభుత్వ పెద్దల సందేశం తీసుకుని వెళ్లారు. రంగన్నకు 2+2 గన్ మెన్లతో జగన్ ప్రభుత్వం భద్రత కల్పించారు. చంద్రబాబు వచ్చాక 1+1 భద్రతకు తగ్గించారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన గన్‌మెన్ ఉండగా ఎలా అనుమానాస్పదంగా రంగన్న మృతి చెందారు?. ఖననం చేసిన రంగన్న మృతదేహాన్ని మళ్ళీ బయటకు తీసి రీపోస్టుమార్టం చేస్తున్నారు. ఆ నివేదికలు రాకముందే ఈనాడులో తప్పుడు కథనాలు ఎలా రాశారు?..పరిటాల రవి హత్యలో సాక్షుల మృతిపై చంద్రబాబు ఎందుకు విచారణ జరపలేదు?. ఎప్పుడో చనిపోయిన నారాయణ యాదవ్ మృతితో సహా అందరిపై విచారణ చేస్తారట, ఎవరిని ఇరికించటానికి విచారణల పేరుతో వ్యవస్థలను నాశనం చేస్తారు?. ఎన్నికల హామీలను డైవర్షన్ చేయటానికి ఇలాంటి తప్పుడు వార్తలు, తప్పుడు విచారణలు చేయిస్తున్నారు. రంగన్న ఇచ్చిన 164 స్టేట్మెంటులో అవినాష్ రెడ్డి పేరు లేదు. అసలు ఏ సాక్షి కూడా అవినాష్ పేరు చెప్పలేదు. ఇలాంటి తప్పుడు కథనాలు రాసే విష సంస్కృతి మానుకోవాలి’’ అని పేర్ని నాని హితవు పలికారు. -
రైతుల కోసమే 'సెకీ' విద్యుత్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఏపీఈఆర్సీ) ఇటీవల ఆమోదించిన డిస్కంల ఆదాయ, అవసరాల నివేదికలో సెకీ నుంచి 4 వేల మెగావాట్ల విద్యుత్‌ను ఈ ఏడాది కొనుగోలు చేసేందుకు అనుమతించింది. ఆ సందర్భంలోనే సెకీ ఒప్పందంపై ఫిర్యాదులను సుమోటోగా స్వీకరించి, ఒప్పందాన్ని రద్దు చేసేందుకు తగిన కారణాలేమీ కనిపించడం లేదంటూ స్పష్టం చేసింది. దీంతో సెకీ ఒప్పందంపై కూటమి చేస్తున్న విమర్శలు, కరపత్రం రాసుకొచ్చిన కథనాలు అసత్యాలని తేలిపోయింది. తాజాగా సోమవారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సర్వే–2024 కూడా సెకీ ఒప్పందం గురించి మరింత స్పష్టత ఇచ్చింది. ‘వనరుల ప్రణాళిక’లో భాగంగా సెకీ నుంచి 7 వేల మెగావాట్ల విద్యుత్తు కొనుగోలు చేస్తున్నట్లు కూటమి ప్రభుత్వం అంగీకరించింది. 2024–25 నుంచి 2028–29 వరకు (5వ నియంత్రణ కాలం), 2029–30 నుంచి 2033–34 (6వ నియంత్రణ కాలం) వరకు ఏపీ ట్రాన్స్‌కో, డిస్కంలు సమర్పించిన విద్యుత్ వనరుల ప్రణాళికకు 2023 జూన్‌లో ఏపీఈఆర్సీ అనుమతినిచ్చిందని కూటమి ప్రభుత్వం తెలిపింది. వివిధ ప్రాజెక్టుల నుంచి విద్యుత్ ఏ విధంగా వస్తుందనే వివరాలున్న వీటిలో ‘సెకీ’తో కుదుర్చుకున్న 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్తు ఒప్పందం కూడా ఉంది.అవే భవిష్యత్తుకు భరోసా..వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2023 డిసెంబరులో విజయవాడ సమీపంలోని నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం (ఎన్టీటీపీఎస్)లో 800 మెగావాట్ల (స్టేజ్–5) యూనిట్ ఉత్పత్తి ప్రారంభించిందని కూటమి సర్కారు తెలిపింది. ఈ కేంద్రం నుంచి 25 ఏళ్ల పాటు వంద శాతం విద్యుత్ కొనుగోలుకు ఏపీజెన్కో 2022 అక్టోబరులో ఒప్పందం కుదర్చుకుందని పేర్కొంది. ఇదికూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే జరిగింద్ధి. ఏపీ పంప్డ్ స్టోరేజ్ (పీఎస్పీ) ప్రమోషన్ పాలసీ–2022 ద్వారా రాష్ట్రంలో 29 ప్రదేశాల్లో 33,240 మెగావాట్ల పీఎస్పీల ఏర్పాటుకు టెక్నో–కమర్షియల్ ఫీజిబులిటీ రిపోర్ట్స్ సిద్ధం చేసినట్లు ఆర్థిక సర్వే సాక్షిగా తేటతెల్లమైంది. ఇది గత ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలకు నిదర్శనం. ఇక కూటమి ప్రభుత్వం వచ్చాక పీఎం సూర్యఘర్ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటోంది. ఆచరణలో మాత్రం పురోగతి సాధించడం లేదని సర్వే తేల్చిచెప్పింది. ఈ పథకానికి 3 డిస్కంలలో కలిపి 16,35,672 మంది చేత రిజిస్టర్ చేయించారు. వారిలో 9,79,665 మంది చేత దరఖాస్తులు పెట్టించారు. కేవలం 10,278 మందికే రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్ అమర్చారు. పథకం అట్టర్ ఫ్లాప్ అని ఈ గణాంకాలను బట్టి అర్థమవుతోంది. కేవలం గత ప్రభుత్వం ఐదేళ్లలో సాధించిన విద్యుత్ రంగ ప్రగతిని తమదిగా చెప్పుకొనే ప్రయత్నం మినహా ఆర్థిక సర్వే –2024లో ఈ ప్రభుత్వం గొప్పగా చెప్పుకొనేందుకు ఏమీ లేకపోవడం విశేషం.‘సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సెకీ)తో 7వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలోని వ్యవసాయ వినియోగదారులకు పగటిపూట 9 గంటల నిరంతర విద్యుత్తు సరఫరాను కొనసాగించేందుకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వ్యవసాయ విద్యుత్తు సరఫరా సంస్థ (ఏపీఆర్ఏపీఎస్సీవోఎం) పేరుతో ప్రత్యేక నోడల్ ఏజెన్సీని ప్రభుత్వం నియమించింది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈసీఐ) మాన్యుఫ్యాక్చరింగ్ లింక్డ్ స్కీమ్ నుంచి 7 వేల మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలు కోసం రాష్ట్ర విద్యుత్తు పంపిణీ సంస్థలు (డిస్కం) అనుమతి కోరాయి. దానికి ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అనుమతించింది’– ఏపీ సామాజిక ఆర్థిక సర్వేలో కూటమి ప్రభుత్వం -
పోసాని ఆరోగ్యంపై విషపు రాతలు.. పచ్చ మీడియా సిగ్గుపడాలి: భూమన
సాక్షి, తిరుపతి: సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేని వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు వైఎస్సార్సీపీ నాయకులు భూమక కరుణాకర్ రెడ్డి. అలాగే, సంపద సృష్టించలేకపోతున్నా అంటూ చంద్రబాబు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక, పోసాని ఆరోగ్యంపై విషపు రాతలు రాస్తున్న ఎల్లో మీడియా సిగ్గు పడాలని చురకలు అంటించారు.చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో అబద్దపు హామీలు ఇచ్చి కూటమి నేతలు ప్రజలను మోసం చేశారు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఏ ఒక్క హామీని అమలు చేయడం లేదు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవలో కోతలు పెట్టారు. బడ్జెట్లో నిరుద్యోగ భృతి ఊసే లేదు. హామీలను గాలికి వదిలేశారు. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అయినప్పటికీ ప్రజలకు చేసిందేమీ లేదు. సంక్షేమం పట్టించుకోవడం లేదు.. అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదు. మీరు ప్రజల్లోకి వెళ్తే పేదలు కష్టాలు తెలుస్తాయి.ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయని వ్యక్తి చంద్రబాబు. 2లక్షల కోట్లు పేదలకు పంచిన వ్యక్తి వైఎస్ జగన్. పేదలకు మంచి చేశారు కాబట్టే వైఎస్ జగన్‌కు 40 శాతం ఓట్లు వచ్చాయి. మంచి చేశాం కాబట్టే వైఎస్సార్సీపీ పట్ల ప్రజల్లో సానుభూతి వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలో వైఎస్సార్సీపీ బలంగా ఉంది అంటూ పచ్చమీడియాలో వార్తలు రాస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వం పట్ల టీడీపీ సానుభూతిపరుల్లోనే వ్యతిరేకత ఉంది. కూటమికి ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. వైఎస్సార్సీపీ పాలన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.కుట్రలతో పోసాని కృష్ణమురళిపై అక్రమ కేసులు పెట్టారు. ప్రతీకార కక్షతో చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. పోసాని ఆరోగ్య పరిస్థితిపై నాటకాలు అంటూ విష ప్రచారం చేస్తున్న పచ్చ పత్రికలు సిగ్గుపడాలి. ఆయన ఆసుపత్రిలో ఉన్నా బెయిల్ వచ్చే పరిస్థితి లేదు. ఆయనపై ఎల్లో మీడియా ఎందుకు విషపు రాతలు రాస్తోంది. పోసానికి వచ్చిన పరిస్థితి మీకు ఎదురైతే ఇలానే ఆలోచిస్తారా? అని ప్రశ్నించారు. -
పీక్కు చంద్రబాబు ప్రచార పిచ్చి: పుత్తా శివశంకర్‌రెడ్డి
సాక్షి, తాడేపల్లి: ఓర్వకల్లు విమానాశ్రయానికి 'ఉయ్యాలవాడ' పేరు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న డ్రామాలతో ఆయన ప్రచార పిచ్చి పీక్కు చేరుకుందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కర్నూలులోని ఓర్వకల్లు విమానాశ్రయానికి నాలుగేళ్ల క్రితమే నాటి సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారికంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టారని గుర్తు చేశారు. ఈ విషయం కూడా తెలుసుకోకుండా సీఎం చంద్రబాబు ఈ అంశంపై మాజీ సీఎం వైఎస్ జగన్‌పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు.. రెడ్డి సంఘం ప్రతినిధుల పేరుతో కొందరిని పిలిపించుకుని వారితో ఒక వినతిపత్రం తీసుకున్నారు. సదరు సంఘం ప్రతినిధులు ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్‌కు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టాలని, గతంలో ఈ మేరకు సీఎంగా పనిచేసిన వైఎస్ జగన్ హామీ ఇచ్చి విస్మరించారంటూ చంద్రబాబుకు విన్నవించుకున్నారు. వెంటనే చంద్రబాబు చాలా అన్యాయం జరిగింది.. ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్ కు ఉయ్యాలవాడ పేరును పెడతానంటూ హామీ ఇచ్చేశారు. ఇదంతా కూడా నిత్యం చంద్రబాబుకు వంతపాడే ఎల్లో మీడియా ఈనాడు పత్రికలో పెద్ద ఎత్తున ప్రచురించారు. ఈ కథనంలో చంద్రబాబును కలిసిన ఆ రెడ్డి సంఘం ప్రతినిధులు ఎవరో కూడా వెల్లడించకుండా ఈనాడు పత్రిక జాగ్రత్త పడింది.నిత్యం వైఎస్ జగన్‌పై బురద చల్లాలనే లక్ష్యంతో పనిచేస్తున్న చంద్రబాబు తాజాగా ఓర్వకల్లు విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు అంటూ చేసిన హంగామా ఆయన దిగజారుడు రాజకీయాలకు అద్దం పడుతోంది. గతంలోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ ఎయిర్ పోర్ట్‌కు ఉయ్యాలవాడ పేరును ప్రకటించడంతో పాటు, అధికారికంగా ఉత్తర్వులు జారీ జారీ చేసింది. రాష్ట్ర ప్రజలందరికీ ఈ విషయం తెలుసు.మార్చి 25, 2021న ఏపీ సీఎంగా వైఎస్ జగన్ ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును జాతికి అంకితం చేస్తూ విమానాశ్రయానికి బ్రిటీష్ వారిపై పోరు సల్పిన మహనీయుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును పెడుతున్నట్టు బహిరంగ సభలో ప్రకటించారు. దీనిని అన్ని ప్రముఖ మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రచురించాయి. అంతేకాకుండా దీనిపై మే 16, 2021న నాటి వైయస్ జగన్ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ మేరకు జీవో ఆర్టీ నెంబర్ 21ని విడుదల చేసింది.వాస్తవానికి రాష్ట్రంలో కేవలం 6 విమానాశ్రయాలుంటే నాలుగోసారి ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుకి వాటి పేర్లు కూడా తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉంది. స్వాతంత్ర కాంక్షను ప్రజల్లో రగిలించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును ఓర్వకల్లు విమానాశ్రయంకు పెట్టి నాలుగేళ్లు అయ్యిందని తెలిసి కూడా తెలియనట్లు వ్యవహరించడం చంద్రబాబుకే చెల్లింది. చివరికి తన ప్రచార యావ, వైఎస్ జగన్‌పై విషప్రచారం చేయాలనే ఉద్దేశ్యంతో మహనీయుల పట్ల కూడా అగౌరవంగా వ్యవహరించిన చంద్రబాబు.. ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఎప్పుడైనా జాతికి మార్గదర్శకులుగా వ్యవహరించిన మహనీయుల విషయంలో స్పందించే సమయంలో వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని, ముఖ్యమంత్రి హోదాకు ఉన్న గౌరవాన్ని దిగజార్చకూడదని సూచిస్తున్నాం -
‘సెల్’బ్రిటీ కష్టాలు!
సెలబ్రిటీల కదలికలు, వ్యక్తిగత జీవిత విషయాలను సొమ్ము చేసుకునే ఎల్లో మీడియా పాపరాజీ దారిలో రాజీ పడకుండా నడుస్తుంటుంది. ఇప్పుడు స్మార్ట్ఫోన్ల పుణ్యమా అని మీడియాతో సంబంధం లేని వారు కూడా సెలబ్రిటీలు కనిపిస్తే చాలు పాపింగ్ చేస్తున్నారు. సెలబ్రిటీల పాలిట పెను భూతం పాపరాజీ. ఇల్లు దాటి బయటికి వస్తే ఎవరు ఎక్కడ కెమెరాతో క్లిక్ అనిపిస్తారో తెలియదు. బిగ్ బాస్ సీజన్ 17 ద్వారా సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకున్న నటి ఆయేషా ఖాన్ పాపరాజీపై మండిపడింది. తన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ అనవసర కామెంట్స్ చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మీడియా పట్ల నాకు గౌరవం ఉంది. అయితే పాపరాజీ మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది. నా కారు వరకు నన్ను అనుసరించడం, నన్ను ముందుకు నడవనివ్వక పోవడం...ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. చేతిలో మొబైల్ ఉంటే చాలు పాపింగ్ పేరుతో వెంటబడుతున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేసింది. ఆయేషా విషయానికి వస్తే అభిమానులతో పాటు, నెటిజనులు ఆమెకు సపోర్ట్ చేస్తూ పాపరాజీ తీరుపై మండిపడుతున్నారు. ‘చౌకబారు మనసున్న వ్యక్తులకు వ్యతిరేకంగా మీరు గళం విప్పినందుకు సంతోషంగా ఉంది. పాపరాజీ పేరుతో మిమ్మల్ని అసౌక్యరానికి గురి చేసే హక్కు వారికి లేదు’ అని ఒక నెటిజనుడు స్పందించాడు. -
అధికారులను విసిగించేలా ఈనాడు తీరు..
-
Bhumana Karunakar Reddy: పచ్చి అబద్ధాలు రాయడంలో దిట్ట..
-
ఎల్లో మీడియా కొంపముంచిన చంద్రబాబు!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదేమిటి ఇలా అన్నారు.. అని ఆశ్చర్యపోనవసరం లేదు. ఆయన అలా అనకపోతేనే వింత అవుతుంది. సంపద సృష్టించే మార్గం ఏదైనా ఉంటే ఒక ఐడియా ఇవ్వండి అని ప్రజలనే అడుగుతున్నారు. అది కూడా ఆయన చెవిలో చెప్పాలట. ఈ మాట వినగానే ఎల్లో మీడియా నిర్ఖాంతపోయినట్లు ఉంది. తామేదో బిల్డప్ ఇచ్చుకుంటూ వస్తుంటే చంద్రబాబు ఇలా వ్యాఖ్యానించి కొంప ముంచారే అనుకుంటోంది. అందుకే అంత కీలకమైన వ్యాఖ్యలను ఎల్లో మీడియా దాచేసే యత్నం చేసింది.అన్నమయ్య జిల్లా సంబేపల్లి గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఎదురైన ఒక చేదు అనుభవం రీత్యా చంద్రబాబు ఈ విషయం చెప్పేశారు. ఒక రైతు తమకు రైతు భరోసా ఎప్పుడు ఇస్తారని అడిగారు. దానికి కాస్త చికాకుపడిన చంద్రబాబు డబ్బులు వస్తే ఇస్తామని, దీనికి వర్క్ అవుట్ చేస్తున్నామని, అయినా మీకు ఇవ్వాలంటే ముందుగా డబ్బు సంపాదించాలిగా అని అన్నారు. అక్కడితో ఆగలేదు. డబ్బు సంపాదించే మార్గం ఉంటే తనకు చెవిలో చెప్పాలని చంద్రబాబు అనడంతో అక్కడ ఉన్నవారికి మతిపోయినంత పని అయింది. నిజానికి చంద్రబాబు ఇలాంటి ప్రశ్నలను ఊహించి ఉండరు. తన కుమారుడు, మంత్రి లోకేష్ ఎన్నికలకు ముందు హామీలను నెరవేర్చకపోతే చొక్కా కాలర్ పట్టుకుని నిలదీయండని అన్నారు. అయినా తాము సూపర్ సిక్స్ హామీలను, ఎన్నికల ప్రణాళికలోని మరో 175 హామీలను ఎగవేస్తే మాత్రం ఎవరు అడుగుతారులే అన్న ధీమాతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లు ఉంటారు.కానీ, లోకేష్ కాలర్ డైలాగ్ బాగా వైరల్ అవుతుండటంతో ధైర్యం వచ్చిందేమో తెలియదు.. ఒక రైతు తమకు రావాల్సిన భరోసా మొత్తం రూ.20వేల గురించి ప్రశ్నించారు. దానికి ఏం చెప్పాలో అర్ధం కాని చంద్రబాబు చివరికి డబ్బులు లేవు పొమ్మంటూ, మీరే ఐడియా ఇవ్వండి అని చెప్పి చేతులెత్తేశారు. కేంద్రం గత ఏడాదికి గాను రైతు భరోసా కింద ఆరువేల రూపాయల చొప్పున మంజూరు చేసి ఉండాలి. అది పోను మిగిలిన మొత్తాన్ని ఇవ్వడానికి అయినా చంద్రబాబు ప్రభుత్వం సిద్దపడి ఉండాల్సింది. ఎన్నికల ప్రణాళిక ప్రకారం ప్రతీ రైతుకు ఇరవై వేల రూపాయల పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీభవ పేరుతో అందిస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అధికారం వచ్చాక అసలుకే మోసం తెచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. కేంద్రం ఇచ్చిన ఆరువేల రూపాయలను కూడా ప్రభుత్వం ఎగవేయడం విశేషం. ఈ ఏడాది నుంచి కేంద్రం పదివేల చొప్పున ఇస్తుంది. దానినైనా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా? లేదా? అన్నది చూడాలి. ప్రతీ ఒక్కరూ తెలివితేటలతో ఆర్ధికంగా ఎదగాలని కూడా సలహా ఇచ్చారు.ఇంతకాలం తన తెలివితేటలతో రాష్ట్రం, రాష్ట్ర ప్రజలు అభివృద్ది చెందుతారని హోరెత్తించిన చంద్రబాబు ఇప్పుడు ఎవరి బతుకు వారే చూసుకోవాలని అంటున్నారు. ఆయన చెప్పేది వాస్తవమే. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని అనుకుని మోసపోకుమా అన్న శ్రీశ్రీ గేయాన్ని గుర్తు చేసుకోవాలి. ఈయనేమీ వైఎస్ జగన్ కాదు కదా!. చెప్పినవి చెప్పినట్లు చేయడానికి అని ఇప్పుడు జనం భావిస్తున్నారు. మరో ఘటన కూడా జరిగింది. కొందరు యువకులు మదనపల్లె వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేయరాదని కోరుతూ నినాదాలు చేశారు. వారికి సమాధానం ఇవ్వకపోగా, ఒకరిద్దరు వచ్చి ఇలా చేస్తారని, వారు అవుట్ డేటెడ్ అని కొట్టిపడేశారు. వామపక్షాలు చంద్రబాబుతో కలిసి ఉంటే కమ్యూనిజం గొప్పదని చెబుతారు. ఆయన బీజేపీతో కలిస్తే కమ్యూనిజం కాదు.. టూరిజం ముఖ్యమని అంటారు. వైఎస్ జగన్ హయాంలో ప్రభుత్వపరంగా చేపట్టిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం రెడీ అయినట్లే అని అర్ధం అవుతోంది. ఇప్పటికే 750 మెడికల్ సీట్లను ఈ ప్రభుత్వం వదులుకుని విద్యార్ధులకు తీవ్ర అన్యాయం చేసింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి రాగానే మరో మాట చెప్పడం చంద్రబాబుకు అలవాటైన విద్యే. మదనపల్లె మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేయవద్దని కోరిన విద్యార్ధులను పోలీసులతో బయటకు నెట్టేయించారు. నారా లోకేష్ ఎన్నికలకు ముందు చొక్కా కాలర్ పట్టుకోమన్నారు కదా అని ఎవరైనా ప్రయత్నిస్తే, పోలీసులతో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తారని తేలిపోయింది. తల్లికి వందనంతో సహా ఆయా పథకాలను జూన్‌లో ఇస్తామని టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం తర్వాత చెప్పారు. అప్పుడు ఏం ఇస్తారో తెలియదు కానీ, ఈ సభలో మాత్రం తల్లికి వందనం పథకం కింద డబ్బులు ఒకసారి ఇవ్వాలా?రెండు దఫాలుగా ఇవ్వాలా అన్నది నిర్ణయం తీసుకుని అందిస్తామని అన్నారట. ఈ పాయింట్ ఆధారంగా ఎల్లో మీడియా మళ్లీ వెంటనే ఆ స్కీమ్ అమలు అయిపోతుంది అన్నంతగా బిల్డప్ ఇచ్చి కథనాలు వండి వార్చాయి. తాము చెప్పినదానికన్నా ఎక్కువే చేసి చూపిస్తామని చంద్రబాబు అన్నారని కూడా రాసేశారు.హామీలు ఇచ్చినవాటికే దిక్కు లేదు కానీ.. ఎల్లో మీడియా బిల్డప్ ఏమిటా అని అంతా అనుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. తల్లికి వందనం పథకాన్ని ఒక ఏడాది ఎగవేసిన విషయాన్ని మాత్రం జనం మర్చిపోవాలన్నది చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, ఎల్లో మీడియా కోరికగా ఉంది. అధికారం రావడమే ఆలస్యం అన్నీ జరిగిపోతాయని ప్రచారం చేసిన కూటమి నేతలు ఇన్ని రకాలుగా పిల్లిమొగ్గలు వేస్తున్నారు. వలంటీర్లను కొనసాగిస్తామని గతంలో ఊదరగొట్టిన చంద్రబాబు ఇప్పుడు వాట్సాప్ పాలన లోకేష్ ఆలోచన అని కుమారుడిని ప్రమోట్ చేసేపనిలో ఉన్నారు. చంద్రబాబు తన ప్రచారం కోసం నిధులను దుర్వినియోగం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ప్రతి నెల ఇచ్చే పెన్షన్ల పంపిణీకి స్వయంగా చంద్రబాబు వెళ్లవలసిన అవసరం ఏముందని అంటున్నారు. గతంలో వైఎస్సార్సీపీ హయాంలో వృద్దులకు పెన్షన్‌గా మూడువేల రూపాయలు ఇచ్చేవారు. దానికి మరో వెయ్యి అదనంగా ఇస్తున్నారు. అంతవరకు ఓకే. మరోవైపు పెన్షన్లను ప్రతీ నెలా కోత పెడుతున్నారని చెబుతున్నారు. ఈ పెన్షన్లను గతంలో వలంటీర్లు అందచేసేవారు. ఆ వలంటీర్లకు జీతాలు పెంచుతామని చెప్పి వారి ఉద్యోగాలకే మంగళం పలికారు.ఒక వలంటీర్ చేయగలిగిన పనిని ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ప్రత్యేకంగా సభ పెట్టి పంపిణీ చేసి, ప్రసంగం చేసి ప్రచారం జరిగేలా చూసుకోవడం ఆశ్చర్యంగానే ఉంటుంది. కాకపోతే, ఆయన స్టైలే అది. పావలా కోడికి రూపాయి మసాలా అన్నట్లుగా ఆయన యావ ఎప్పుడూ ప్రచారంపైనే ఉంటుంది. చంద్రబాబు ఏపీలోనే కాదు.. ఢిల్లీ వెళ్లి సైతం అక్కడ జరుగుతున్న ఎన్నికలలో బీజేపీకి మద్దతుగా ప్రచారం చేస్తున్న సందర్భంగా కూడా పలు అసత్యాలు చెప్పి వచ్చారు. 2019లో చంద్రబాబుకు మద్దతుగా ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ విశాఖపట్నం వచ్చి ప్రచారం చేశారు. కానీ, ఇప్పుడు అదే కేజ్రీవాల్‌ను ఓడించాలని చంద్రబాబు ప్రచారానికి దిగారు. గతంలో మోదీని నానా రకాలుగా దూషించిన చంద్రబాబు ఇప్పుడు ఆయనను ఆకాశానికి ఎత్తుతూ పొగుడుతున్నారు. అలాగే 2019లో కేజ్రీవాల్ విద్యావంతుడు, నిజాయితీపరుడు, ఢిల్లీని బాగా అభివృద్ది చేశారని చంద్రబాబు ప్రశంసించారు. 2024 వచ్చేసరికి ఆయన దృష్టిలో కేజ్రీవాల్ అవినీతిపరుడయ్యారు. ఢిల్లీని నాశనం చేశారు అని చంద్రబాబు అనగలిగారంటే ఏమనుకోవాలి?. కేజ్రీవాల్‌పై వచ్చిన లిక్కర్ స్కామ్ గురించి కూడా చంద్రబాబు ప్రస్తావించారు. కానీ, అదే స్కాంలో భాగస్వామి అన్న ఆరోపణలు ఉన్న మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఎంపీ టిక్కెట్‌ను ఇదే చంద్రబాబు ఇచ్చారు.ఏపీకి ఏడు నెలల్లో ఏడు లక్షల పెట్టుబడులు వచ్చేసినట్లు కూడా చంద్రబాబు ఆ సభలలో చెప్పుకోవడం విశేషం. దావోస్ వెళ్లి ఒక్క ఎంవోయూ కుదుర్చుకోకుండా ఖాళీ చేతులతో తిరిగి వచ్చారన్న విమర్శలను ఎదుర్కోవడానికి కొత్త గాత్రం అందుకుని ఆల్రెడీ ఏడు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేశాయని అబద్దపు ప్రచారం ఆరంభించారు. దానిని ఢిల్లీ వరకు తీసుకువెళ్లారు. ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి బడ్జెట్లో ప్రత్యేకంగా ఏమీ రాకపోయినా కేంద్ర బడ్జెట్‌ను మెచ్చుకోవాల్సిన నిస్సహాయ స్థితిలో చంద్రబాబు ఉన్నారు. ఎల్లో మీడియా యథాప్రకారం విశాఖ స్టీల్, పోలవరం ప్యాకేజీలు కొత్తవి అయినట్లు, అమరావతి అప్పును కేంద్రం సాయం కింద అబద్దపు ప్రచారం చేశారు. కేంద్రం రాష్ట్రానికి దన్నుగా నిలబడిందని కూడా సర్టిఫికెట్ ఇచ్చేశారు. గతంలో సీఎంగా ఉన్నప్పుడు కూడా ఒకసారి ప్రభుత్వపరంగా ఒక ప్రకటన చేస్తూ ప్రజలు సలహాలు ఇవ్వాలని కోరారు. సరిగ్గా అదే పద్దతిలో ఇప్పుడు ఐడియాలను చెవిలో చెప్పాలని అంటున్నారు.ఇంతకాలం చంద్రబాబు తన ఐడియాలతో స్కీములు అమలు చేస్తారనుకుంటే, జనమే ఆ ఐడియాలు ఇవ్వాలని కోరుతున్నారు. అదేదో సినిమాలో చెప్పినట్లు కొండను తాను ఒక్కడినే మోస్తానని ప్రజలందరితో నమ్మబలికి.. తీరా కొండను మోసే సమయం వచ్చేసరికి, జనం అంతా వచ్చి కొండను తన భుజాలపై పెడితే మోసి చూపిస్తానన్నారట. ఆ సినిమా సన్నివేశం హాస్యం కోసం అయితే, చంద్రబాబు ప్రకటన జనాన్ని మోసం చేయడం కోసం కాదా!. - కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
బాబు ముఠా.. బాగా దోచుకో పంచుకో..!
-
చంద్రబాబు అబద్ధాలు మోయడమే జాకీ మీడియా పని.. చెల్లుబోయిన సీరియస్ కామెంట్స్
-
అప్పులే సరి.. సంపద ఎక్కడమరి?
సాక్షి, అమరావతి: అప్పుల మీద అప్పులు చేయడమే సంపద సృష్టిలా భావిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సాగిస్తున్నారు. బడ్జెట్ బయట, లోపల ఏడాది తిరక్కుండానే ఏకంగా రూ.1.26 లక్షల కోట్ల అప్పు చేశారు. ఇన్ని అప్పులు చేసినా సూపర్ సిక్స్‌లో ప్రధాన హామీలు అమలు చేయకుండా తాత్సారం చేస్తుండటం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూపర్ సిక్స్‌లో ప్రధాన హామీలైన రైతు భరోసా, తల్లికి వందనం, ఆడ బిడ్డ నిధి అమలు చేయడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా మంగళవారం చంద్రబాబు ప్రభుత్వం సెక్యూరిటీల వేలం ద్వారా 7.17 శాతం వడ్డీకి రూ.5,820 కోట్లు అప్పు చేసింది. దీంతో ఇప్పటి వరకు బడ్జెట్లోనే కేవలం మార్కెట్ రుణాల ద్వారా చేసిన అప్పులు రూ.80,827 కోట్లకు చేరాయి. బడ్జెట్లో ఈ ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ రుణాల ద్వారా రూ.71,000 కోట్లు అప్పు చేస్తామని తెలిపారు. ఆర్థిక సంవత్సరం పూర్తవ్వడానికి ఇంకా రెండు నెలలు మిగిలి ఉండగానే బడ్జెట్లో చెప్పిన దాని కంటే ఎక్కువగా ఏకంగా రూ.10 వేల కోట్లు అప్పు చేశారు. బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల నుంచి ప్రభుత్వ గ్యారెంటీలతో రూ.14,700 కోట్లు అప్పు చేశారు. మరో పక్క రాజధాని పేరుతో రూ.31 వేల కోట్లు అప్పులు చేస్తోంది. ప్రపంచ బ్యాంకు నుంచి రూ.15 వేల కోట్లు, హడ్కో నుంచి రూ.11 వేల కోట్లు, జర్మనీ సంస్థ నుంచి రూ.5 వేల కోట్లు అప్పు చేస్తోంది. ఇందుకోసం ఉత్తర్వులు కూడా జారీ చేశారు. రాజధాని పేరుతో, వివిధ కార్పొరేషన్ల గ్యారెంటీల ద్వారా బడ్జెట్ బయట రూ.45,700 కోట్లు అప్పు చేస్తోంది.కేంద్రం నుంచి తీసుకునే అప్పులు అదనంచంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్ బయట, బట్జెట్ లోపల కలిపి ఏడాది తిరగకుండానే రూ.1,26,527 కోట్లు అప్పు చేస్తొంది. ఇంత పెద్ద ఎత్తున ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే గతంలో ఏ ప్రభుత్వం అప్పు చేయలేదు. కేంద్ర నుంచి తీసుకునే అప్పలు వీటికి అదనం. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం, ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడే అప్పులు చేసినప్పటికీ, ఎల్లో మీడియాతో పాటు చంద్రబాబు బృందం.. ఎక్కువ అప్పులు చేస్తున్నారని, రాష్ట్రం శ్రీలంకగా మారిపోతోందంటూ గగ్గోలు పెడుతూ లేని అప్పులున్నట్లు దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేస్తున్నా, ఆస్తుల కల్పనకు, ప్రజల సంక్షేమానికి వ్యయం చేస్తున్నారా అంటే అదీ లేదు. కాగ్ గణాంకాల ప్రకారం చంద్రబాబు సర్కారు గత డిసెంబర్ వరకు మార్కెట్ రుణాల ద్వారా రూ.73,875 కోట్లు అప్పు చేసినట్లు స్పష్టమైంది. ఇందులో ఆస్తుల కల్పనకు సంబంధించి మూల ధన వ్యయం డిసెంబర్ నాటికి రూ.8,894 కోట్లు మాత్రమేనని కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. ఆస్తుల కల్పనకు వ్యయం చేయకుండా మరో పక్క సూపర్‌సిక్స్ అమలు చేయకుండా ఇన్ని అప్పులు దేనికి వ్యయం చేస్తున్నారో తెలియడం లేదని ఆర్థిక రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతగా అప్పులు చేస్తూనే.. మరో పక్క సూపర్ సిక్స్ అమలుకు డబ్బుల్లేవంటూ ప్రజలను మోసం చేయడానికి సీఎం చంద్రబాబు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తుండటం గమనార్హం. -
నాపై ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తోంది
-
పెద్దిరెడ్డిపై ఎల్లో మీడియా విషపు రాతలు.. భూమన స్ట్రాంగ్ కౌంటర్


