దుష్ప్రచారంలో ‘ఈనాడు’ బరితెగింపు | Yellow Media Fake News: Andhra pradesh | Sakshi
Sakshi News home page

దుష్ప్రచారంలో ‘ఈనాడు’ బరితెగింపు

Dec 23 2025 5:36 AM | Updated on Dec 23 2025 6:12 AM

Yellow Media Fake News: Andhra pradesh

సౌభాగ్యమ్మ పేరిట ఉన్న భూమి ఇప్పటికీ ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం

సాక్షి ప్రతినిధి, కడప: తప్పుడు వార్తలు వండివా­ర్చడంలో ‘ఈనాడు’ మరోసారి ముందు వరు­సలో నిలిచింది. ‘వివేకా కుటుంబంపై వైకాపా పగ’ కథ­న­మే అందుకు తాజా ఉదాహరణ. ఇప్ప­టికీ వైఎస్‌ సౌ­భాగ్యమ్మ పేరిట ఆన్‌లైన్‌లో ఉన్న భూమి­ని లేన­ట్లుగా ఎల్లో మీడియా చిత్రీకరించింది. పైగా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ హయాంలో ఇతరుల పేరుతో మ్యుటేషన్‌ చేశారని, అప్పటి తహశీల్దార్‌ మాధవకృష్ణారెడ్డి ఇలాంటి చర్యలకు పాల్పడ్డారంటూ తప్పుడు ప్రచారానికి తెగబడింది.

పులివెందుల మండలం కె.వెలమ­వారి­పల్లెలో 2006 ఫిబ్రవరి 17న సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో దస్తావేజుల సంఖ్య 1577/2006, 1579/­2006 ప్రకారం నాలుగు సర్వే నంబర్లలో 7.03 ఎకరాల భూమి కొనుగోలు చేశా­రు. సర్వే నంబర్‌ 351/ఏలో 2.91 ఎకరాలు, 352–­ఏలో 4.05 ఎకరాలు, 353/1ఏలో 0.04 సెంట్లు, 354ఏలో 0.03 సెంట్లు కలిపి మొత్తంగా 7.03 ఎక­రా­లు వైఎస్‌ సౌభాగ్యమ్మ పేరిట వెబ్‌ల్యాండ్‌లో కని­పించడం లేదంటూ ఈనాడు దుష్ప్రచారానికి దిగింది.

టీడీపీ హయాంలోనే ల్యాండ్‌ కన్వర్షన్‌..
వైఎస్‌ సౌభాగ్యమ్మ పేరుతో ఉన్న భూములను ల్యాండ్‌ కన్వర్షన్‌ చేయాలంటూ 2018లో దరఖాస్తు చేసుకున్నారు. ఆమేరకు రూ.65 వేలు చలానా చెల్లించారు. ఆ ఫైలును పరిశీలించిన అప్పటి జమ్మ­ల­మ­డు­­గు ఆర్డీవో ద్వారా 2018 మార్చి 20న ల్యాండ్‌ కన్వ­ర్షన్‌ కూడా అయింది. అప్పటి టీడీపీ ప్రభుత్వంలోనే ల్యాండ్‌ కన్వర్షన్‌ చేపట్టారు. ఆమేరకు రెగ్యులర్‌ ఖాతా 763 నుంచి నోషనల్‌ ఖాతా నంబర్‌ 300004­కి మారింది.

రాష్ట్ర ప్రభు­త్వం నిర్వహిస్తున్న మీ­భూ­మి పోర్టల్‌లో ఇప్పటికీ వైఎస్‌ సౌభాగ్యమ్మ పేరిట 1బీ నమోదై ఉంది. 351/ఏలో 3.47 ఎక­రాలు పట్టా­దారు పేరు తెలి­యదని వెబ్‌ ల్యాండ్‌లో నమో­దై ఉంది. వైఎస్‌ సౌభా­గ్యమ్మ భూమి ఇప్పటికీ వారి స్వా­ధీనంలో, వారి అనుభవంలోనే ఉంది. ఈ విష­యమై పులి­వెందుల తహ­శీల్దార్‌ నజీర్‌ను వివరణ కోరగా.. సౌభాగ్యమ్మ పేరిట ఉన్న భూమి వన్‌టైమ్‌ కన్వర్షన్‌ అయ్యిందని.. కాబట్టే నోషనల్‌ ఖాతా నంబర్‌కు బద­లాయింపు అయ్యిందని వివరించడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement