సాక్షి, తాడేపల్లి: ఎల్లో మీడియాకు ప్రజా సమస్యలు ఏమాత్రం పట్టదు.. ఎల్లోమీడియాకు విపరీతమైన కుల గజ్జి పట్టింది అంటూ ఘాటు విమర్శలు చేశారు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. వైఎస్సార్‌సీపీ వైఎస్ జగన్ సీబిఐ కోర్టులో ఉన్నప్పుడు వీడియో ఎలా తీశారు? అని ప్రశ్నించారు. ఆ వీడియోలను ప్రసారం చేసిన ఎల్లోమీడియా, సోషల్ మీడియాపై కేసులు పెట్టాలి అని డిమాండ్ చేశారు. కుట్ర, చంద్రబాబు కవల పిల్లలు అంటూ సెటైర్లు వేశారు.
మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్ జగన్ కోర్టులో ఉన్న వీడియోలు రిలీజ్ చేయటం నేరం. దీనిపై కోర్టు సుమోటోగా కేసు నమోదు చేయాలి. దొంగతనంగా వీడియోలు తీసిన వారిపై చర్యలు తీసుకోవాలి. జడ్జి గారిని కూడా వీడియో తీసి దాన్ని ఎల్లో మీడియాలో ప్రసారం చేశారు. జడ్జిని కూడా చూపుతూ వీడియోలు తీయటం తీవ్రమైన నేరం. ఆ ఛానళ్లపై కోర్టు చర్యలు తీసుకోవాలి. వైఎస్ జగన్ అంటే ఎల్లో మీడియాకు భయం అందుకే.. ప్రతి నిమిషం జగన్ నామస్మరణే చేస్తున్నారు.
ఎల్లోమీడియాకు విపరీతమైన కుల గజ్జి పట్టింది. జగన్ కోసం కార్యకర్తలు, అభిమానులు వచ్చినా పచ్చ బ్యాచ్ తట్టుకోలేక పోతోంది. హైదరాబాదు సీబిఐ కోర్టుకు జగన్ వెళ్తే బల ప్రదర్శన అంటూ ఎల్లోమీడియా దుష్ప్రచారం చేసింది. ఎల్లోమీడియా, సోషల్ మీడియాపై కేసులు పెట్టాలి. దీనిపై కోర్టు సుమోటోగా కేసు నమోదు చేయించాలి. చివరికి కోర్టు ప్రొసీడింగ్స్ ను కూడా దొంగతనంగా చిత్రీకరిస్తారా?. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు మేము కూడా వీడియో తీయించవచ్చు. కానీ అలాంటి దుర్మార్గపు పనులు మేము చేయలేదు. జగన్‌కు వచ్చినట్టు చంద్రబాబు, లోకేష్‌కు ఏనాడూ జనం రారు.
ఏ రాష్ట్రం వెళ్లినా జగన్‌కు అభిమానులు ఉన్నారు.
విజయవాడలో ఒక్కడే బైకు మీద వెళ్లినా జనం తండోపతండాలుగా వస్తారు. అదంతా జగన్ మీద ఉన్న అభిమానం. జగన్ తన సొంత డబ్బుతో విమాన ఖర్చు పెట్టుకున్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ తిరుగుతున్న స్పెషల్ ఫ్లైట్ల ఖర్చు ఎవరిది?. ప్రజా సొమ్ముతోనే వారు ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్నారు. చివరికి లండన్ వెళ్లినా ప్రభుత్వ సొమ్మునే ఖర్చు చేశారు. ప్రజా సొమ్ముతో విలాసాలు చేయటంలో చంద్రబాబుకు మించిన వారు లేరు అంటూ ఘాటు విమర్శలు చేశారు.


