గుంటూరు | - | Sakshi
Sakshi News home page

గుంటూరు

Jan 7 2026 7:49 AM | Updated on Jan 7 2026 7:49 AM

గుంటూ

గుంటూరు

బుధవారం శ్రీ 7 శ్రీ జనవరి శ్రీ 2026 వైభవంగా ధనుర్మాస పూజలు డీ–అడిక్షన్‌ సెంటర్‌ ప్రారంభం వసతి గృహాలపై దృష్టి సాకుగా తేమ..

న్యూస్‌రీల్‌

పత్తి రైతులకు నిండా ముంచుతున్న పాలకులు తేమ పేరుతో క్వింటా రూ.6,500కే కొనుగోలు దళారులు తీసుకెళితే మాత్రం రూ.8,110 సీసీఐ తీరుతో తీవ్రంగా నష్టపోతున్న కర్షకులు దిగుబడి ఉన్నా కొనుగోళ్లు అంతంతే రైతుల వద్ద ఇంకా సుమారు 3.50 లక్షల క్వింటాళ్లు విక్రయించిన రైతుల ఖాతాలకూ జమ కాని నగదు

అక్రమాలు జరగకుండా చర్యలు

కలెక్టర్‌ ఆదేశాలు బేఖాతరు

బుధవారం శ్రీ 7 శ్రీ జనవరి శ్రీ 2026

7

బెల్లంకొండ: పులిచింతల ముంపు గ్రామం కేతవరంలోని శ్రీ వజ్రలక్ష్మీ నరసింహస్వామి

ఆలయంలో మంగళవారం ధనుర్మాస పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నక్షత్ర హారతితో పూజలు చేశారు.

చేబ్రోలు: నారాకోడూరులోని గాయత్రీ శక్తిపీఠం ఆధ్వర్యంలో నిర్మించిన డీ–అడిక్షన్‌ సెంటర్‌ను

హరియాణ మాజీ గవర్నర్‌, బీజేపీ సీనియర్‌ నేత బండారు దత్తాత్రేయ మంగళవారం ప్రారంభించారు.

నల్లపాడు రోడ్‌లో ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రం ఎదుట వేచి ఉన్న పత్తి వాహనాలు

జిల్లా కలెక్టర్‌ ఎ.తమీమ్‌ అన్సారియా

గుంటూరు వెస్ట్‌: జిల్లాలో ఎస్‌టీ, ఎస్‌టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ వసతి గృహాలతోపాటు గురుకులాల్లోనూ మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎ.తమీమ్‌ అన్సారియా తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో నిర్వహించిన అధికారుల సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ పీ4 కార్యక్రమంలో భాగంగా ‘స్వీకారం‘ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ప్రతి వసతి గృహం సంపూర్ణ ప్రగతికి చిహ్నంగా, చిన్నారుల మానసిక వికాసానికి ప్రేరణగా ఉండాలనే తలంపుతో దీనిని చేపట్టినట్లు పేర్కొన్నారు. హాస్టళ్లను ఆధునికీకరించేందుకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్‌ కంపెనీలు, బ్యాంకులు సహకరించాలన్నారు.

ఏడో తరగతి విద్యార్థినికి అభినందన

తెనాలి: స్థానిక మారీసుపేటలోని ఎన్‌సీఆర్‌ మున్సిపల్‌ హైస్కూలులో ఏడో తరగతి చదువుతున్న షేక్‌ జాస్మిన్‌కు మంగళవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం నుంచి స్పీడ్‌పోస్ట్‌ వచ్చింది. జిల్లా కలెక్టర్‌ నుంచి శుభాకాంక్షలు తెలుపుతూ వచ్చిన పోస్ట్‌ అది. అందులో ‘డియర్‌ జాస్మిన్‌... ఎక్స్‌లెంట్‌ పెయింటింగ్‌, క్రియేటివిటీ, ఇమాజినేషన్‌, హార్డ్‌వర్క్‌’ అన్న ప్రశంసలతో గ్రీటింగ్‌ కార్డు, చిన్న లెటర్‌, డైరీ మిల్క్‌ చాక్లెట్‌ ఉన్నాయి. స్పీడ్‌పోస్ట్‌ అందుకున్న ప్రధానోపాధ్యాయుడు పఠాన్‌ కరిముల్లా సదరు విద్యార్థిని జాస్మిన్‌కు అందజేసి అభినందించారు. విషయమేమంటే, నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని హైస్కూలు విద్యార్థులు, చిత్రలేఖన ఉపాధ్యాయుడు బెల్లంకొండ వెంకట్‌ పర్యవేక్షణలో చిన్న కార్డులపై బొమ్మలను స్వయంగా చిత్రించి గ్రీటింగ్‌ కార్డులుగా తయారుచేశారు. వాటిని అధికారులు, ఉపాధ్యాయులు, బంధువులకు పోస్ట్‌ చేశారు. జిల్లా కలెక్టర్‌ స్పీడ్‌పోస్టు పంపటంతో ఆమె సంతోషంతో పొంగిపోయింది.

పత్తి రైతుకు పాలకులు కన్నీరే మిగుల్చుతున్నారు. తేమ పేరుతో అడ్డగోలుగా ధర తగ్గించడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. సీసీఐకి తీసుకెళితే సాకులు చెబుతున్నారని వాపోతున్నారు. దిక్కు లేక దళారులకు తక్కువ ధరకే విక్రయిస్తున్నామని . మళ్లీ దళారులు అదే పత్తి తీసుకెళితే మద్దతు ధరకు సీసీఐ కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొంటున్నారు.

చంద్రబాబు సర్కారు నిర్వాకంతో అధికారులు, సిబ్బంది, దళారులు కలిసి రైతులను పట్టపగలే దోచుకుంటున్నారు.

సాక్షి ప్రతినిధి, గుంటూరు: మద్దతు ధరతో పత్తి కొనుగోలు చేయడంలో సీసీఐ నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గుంటూరు జిల్లాలో 66,130 ఎకరాల్లో పత్తి సాగయింది. గుంటూరు, ఫిరంగిపురం, తాడికొండ, ప్రత్తిపాడులలో 14 పత్తి జిన్నింగ్‌ మిల్లుల్లో మద్దతు ధరతో సీసీఐ పత్తి కొనుగోలు చేస్తోంది. జిల్లాలో సుమారు 6 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. దిగుబడులు భారీగా ఉన్నప్పటికీ సీసీఐ కొనుగోళ్లలో వేగం పెంచకపోవడం గమనార్హం. ఇప్పటి వరకు 2,32,338.19 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసింది. రైతుల వద్ద ఇంకా సుమారు 3.50 లక్షల క్వింటాళ్ల పత్తి నిల్వలు పేరుకుపోయాయి. సీసీఐ మద్దతు ధర రూ.8,110 ఉండగా.. మార్కెట్‌లో రూ.6 వేల నుంచి రూ.6,500 మాత్రమే ఉంటోంది.

ఖాతాలకు జమకాని నగదు..

సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరతో పత్తి అమ్ముకున్న రైతులకు సకాలంలో నగదు జమ కావడం లేదు. వ్యవసాయ ఉత్పత్తులు చేతికి రావడంతో బ్యాంకర్లతోపాటు ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారులు, ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల వ్యాపారులు రైతులపై రుణాల వసూలుకు ఒత్తిడి చేస్తున్నారు. పత్తి విక్రయించిన రైతులు మాత్రం సీసీఐ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

దళారులకే లాభం

పత్తి విక్రయాల్లో అక్రమాలు జరగకుండా ప్రభుత్వం సాంకేతికతను ఉపయోగిస్తున్నా.. దళారులు ఎత్తుకు పైఎత్తు వేస్తున్నారు. గ్రామాల్లో తక్కువ ధరతో కొనుగోలు చేసిన పత్తిని స్థానిక రైతుల పేరున సీసీఐకి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. సీసీఐ, మార్కెటింగ్‌ శాఖల అధికారుల అండదండలతో దళారుల దందా జోరుగా సాగుతోంది. ఇప్పటి వరకు ప్రైవేట్‌లో సుమారు 30 వేల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేస్తే, సీసీఐ సుమారు 2.32 లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేసింది. జిల్లాలో ప్రైవేట్‌లో పత్తికి ధర లేదు. సీసీఐకి విక్రయించాలంటే తేమ పేరిట నిరాకరిస్తోంది. విధి లేని పరిస్థతుల్లో తక్కువ ధరైనా రైతులు మాత్రం వ్యాపారులనే ఆశ్రయిస్తున్నారు. ఇదే పత్తిని దళారులు తీసుకొస్తే.. 8 శాతం తేమతో సీసీఐ కొనుగోలు చేస్తోంది. రైతుల నుంచి క్వింటాళ్లకు రూ.6 వేల నుంచి రూ.6,500 లోపు ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్న దళారులు.. తమకు తెలిసిన రైతుల పేరున సీసీఐ కేంద్రాల్లో క్వింటా రూ.8,110 చొప్పున విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ లెక్కన క్వింటాలు పత్తికి సుమారు రూ.1,500 పైగా లాభం పొందితే అందులో పట్టాదారు పాసుపుస్తకం జిరాక్స్‌ ఇచ్చిన రైతుతో పాటు సీసీఐ, మార్కెటింగ్‌ శాఖల సిబ్బందికి వాటాలు ఉంటాయనే ఆరోపణలు ఉన్నాయి. వివరాలపై అక్రమాలు బయటపడే వీల్లేదు.

తేమ, రంగు విషయంలో కాస్త ఉదారంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్‌ ఎ.తమీమ్‌ అన్సారియా కూడా సీసీఐ అధికారులను ఆదేశించారు. కానీ సీసీఐ అధికారులు ఇవేమీ పట్టించుకోని పరిస్థితి నెలకొంది. 12 శాతం కంటే ఎక్కువ తేమ ఉంటే నిర్ధాక్షిణ్యంగా వెనక్కు పంపుతున్నట్లు గమనార్హం. తిరస్కరించిన పత్తిని దళారులు కొని అదే పత్తిని మద్దతు ధరతో అమ్ముతున్నారు. సీసీఐ అధికారులే ముడుపుల కోసం దళారులలను పోత్సహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పత్తి కొనుగోళ్లలో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఆన్‌లైన్‌లో్‌ వివరాలు ఉన్న రైతుల నుంచి మాత్రమే పత్తి కొనుగోలు చేస్తున్నారు. సీసీఐ కేంద్రాల్లో అక్రమాలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాం. సీసీఐ కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తాం.

– పి.సత్యనారాయణ చౌదరి, సహాయ సంచాలకులు, వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ

గుంటూరు1
1/7

గుంటూరు

గుంటూరు2
2/7

గుంటూరు

గుంటూరు3
3/7

గుంటూరు

గుంటూరు4
4/7

గుంటూరు

గుంటూరు5
5/7

గుంటూరు

గుంటూరు6
6/7

గుంటూరు

గుంటూరు7
7/7

గుంటూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement