సాక్షి,గుంటూరు: విజ్ఞాన్ యూనివర్సిటీలో విషాదం చోటుచేసుకుంది. మూడో సంవత్సరం బీటెక్ చదువుతున్న నల్లూరి రాఘవేంద్ర వెంకట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యూనివర్సిటీ బాత్రూంలో తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు.
తీవ్ర గాయాలతో ఉన్న రాఘవేంద్రను సహ విద్యార్థులు, యూనివర్సిటీ సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే అతను మృతి చెందాడు. ఈ ఘటనతో యూనివర్సిటీ వాతావరణం విషాదంలో మునిగిపోయింది.
విద్యార్థి మృతిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి స్వగ్రామం తెనాలి మండలం నందివెలుగు.



