మానవత్వం మళ్లీ గెలిచింది! | Humanity Raises ₹16 Crore In Three Months To Save Infant Battling Rare Genetic Disorder, More Details Inside | Sakshi
Sakshi News home page

మానవత్వం మళ్లీ గెలిచింది!

Feb 26 2026 7:35 AM | Updated on Feb 26 2026 12:31 PM

Injection cost is 16 crores child Poorvika

రూ.16 కోట్ల కష్టాన్ని జయించిన చిన్నారి

మానవతావాదుల స్పందన...  రూ.కోట్ల సహాయం

కేంద్ర సహాయం రూ.50 లక్షలు.. త్వరలో చికిత్స ప్రారంభం 

కర్నూలు జిల్లా: మానవతావాదుల స్పందనతో పసిమొగ్గకు వచ్చిన రూ.16 కోట్ల కష్టం కేవలం మూడు నెలల్లో తొలగిపోయింది. కర్నూలు జిల్లా వెల్దుర్తి పట్టణానికి చెందిన సురేశ్, పుష్పావతి దంపతుల కుమార్తె పునర్వికశ్రీ.  పుట్టుకతోనే జన్యు సంబంధిత వెన్నె ముక కండరాల వ్యాధికి గురైంది. పుట్టినప్పటి నుంచి కదలలేని స్థితి.  రెండేళ్లలోపు రూ.16 కోట్ల ఇంజక్షన్‌ ఇస్తే మామూలు స్థితికి చేరుకుంటుందని వైద్యులు తెలిపారు. 

డిసెంబర్‌ 2024లో పాపకు 8 నెలల వయసులో ఆమె పేద తండ్రి సురేశ్‌ తన పాపను కాపాడమంటూ చేసిన అభ్యర్థన మానవతావాదులను కదిలించింది.  ఇటు సాక్షిలో ‘పసిమొగ్గకు రూ.16కోట్ల కష్టం’ శీర్షికన కథనం వెలువడింది. అనంతరం ఇతర మీడియాలు కూడా పాప సహాయానికి సేవ్‌ పునర్విక అంటూ ప్రచారం మొదలుపెట్టాయి. దీంతో మూడు నెలల్లోనే చిన్న చిన్న విరాళాలే పెద్ద మొత్తంగా పాప చికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయం అందింది. పునర్విక చికిత్సకు కేంద్ర ఆరోగ్య శాఖ రూ.50 లక్షలు ప్రకటించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి తెలిపారు. ఇందుకు సహకరించిన కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు కృతజ్ఞతలు తెలిపారు.

విరాళాలు ఇక వద్దు
నేను కోరినప్పటి నుంచి ఇప్పటి వరకు వివిధ ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాంలు, దాతల సమీకరణల ద్వారా  అలాగే ప్రత్యక్షంగా నా అకౌంట్‌కు వచ్చిన మొత్తం రూ.9 కోట్లకు మించిపోయింది. దీంతో త్వరలో పాపకు చికిత్స ప్రారంభం కానుంది. ఆర్థిక సహాయం చేసిన వారందరికీ  కృతజ్ఞతలు. ఇకపై విరాళాలు వద్దు. చికిత్స ప్రారంభించిన తరువాత వివరాలు తెలుపుతాను. 
– సురేశ్, పునర్వికశ్రీ తండ్రి

 

Advertisement
 
Advertisement
Advertisement