Man Cheating Young Woman Name Of Love In Kurnool District - Sakshi
Sakshi News home page

పెళ్లి చేసుకుంటానని గర్భవతిని చేసి.. చివరికి వేరే అమ్మాయితో..

Nov 2 2022 7:13 AM | Updated on Nov 2 2022 8:30 AM

Man cheating Young Woman Name of Love in Kurnool District - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, కర్నూలు: ప్రేమించి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి పట్టణానికి చెందిన మోహన్‌ ఉరఫ్‌ యోహానుపై ఓ యువతి పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేసింది. అందులోని వివరాలిలా ఉన్నాయి. నాలుగు సంవత్సరాలుగా తాము ప్రేమించుకున్నామని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడని తెలిపింది.

తరువాత గర్భం తీయించుకుంటేనే పెళ్లి చేసుకుంటానని నమ్మించి బలవంతంగా టాబ్లెట్లు మింగించి గర్భస్రావం చేయించాడని, చివరికి వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడని పేర్కొంది. నమ్మించి మోసం చేసిన తన ప్రియుడిని, వేరే అమ్మాయితో పెళ్లికి ప్రేరేపిస్తున్న అతడి కుటుంబ సభ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో పేర్కొంది. యువతి ఫిర్యాదు మేరకు ఆమె ప్రియుడు మోహన్, అతనికి సహకరిస్తున్న ముగ్గురిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ ప్రసాద్‌ తెలిపారు.    

చదవండి: (Nursing Student: ‘నాన్న తాగొద్దు, అమ్మను కొట్టొద్దు, అంతా అన్న చూసుకుంటాడు')

Advertisement
 
Advertisement
Advertisement