పెద్దవూర: ముగ్గురు గురుకుల విద్యార్థులపై ఓ మైనర్ల గ్యాంగ్ విచక్షణారహితంగా దాడి చేసింది. నల్లగొండ జిల్లా పెద్దవూరలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. చీకట్లో నేలపై కూర్చోబెట్టి ముగ్గురు విద్యార్థుపై మైనర్ల గ్యాంగ్ దాడి చేసింది. కాళ్లతో తంతూ, పిడిగుద్దుల వర్షం కురిపించింది. విచ్చలవిడిగా తలపై, శరీరంపై దాడి చేసింది మైనర్ గ్యాంగ్.
సినిమా తరహాలో ఫీల్ అవుతూ దాడికి దిగడంతో ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. బాధిత విద్యార్థులు స్థానిక గురుకులానికి చెందిన వారిగా తెలిసింది. గురుకులంలో ఉండాల్సిన గురువులు, సెక్యూరిటీ లేకపోవడంతోనే ఘటన జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దాడి జరుగుతున్న సమయంలో ఒకరు వీడియో కూడా తీశారు. దాడి అనంతరం బాధిత ముగ్గురు విద్యార్థులు అక్కడి నుంచి పరుగులు తీసినట్లు తెలుస్తోంది.


