చేపల పిల్లల పంపిణీ లేనట్టే.. | - | Sakshi
Sakshi News home page

చేపల పిల్లల పంపిణీ లేనట్టే..

Nov 11 2026 3:33 AM | Updated on Nov 11 2026 3:33 AM

ఆరు నెలలు నీరుండాలి..

చేప పిల్లలు 350 గ్రాముల నుంచి 500 గ్రాముల (అరకిలో) బరువు పెరగాలంటే కనీసంగా ఆరు నెలల పాటు చెరువుల్లో నీరుండాలి. ఇలా అరకోరగా బరువు పెరిగినా మత్స్యకారులకు ఎలాంటి ఉపయోగం ఉండే అవకాశం లేదు. రాబోయే రెండు మూడు నెలలు మాత్రమే చెరువుల్లో నీరు ఉంటే చేప పిల్లలు పంపిణీ చేసినా డబ్బులు వృథా అవుతాయనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. అయితే ప్రభుత్వ అధికారిక నిర్ణయం కోసం మత్స్యకారులు ఎదురుచూస్తున్నారు.

నల్లగొండ టూటౌన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం మత్స్యకారులకు అందించే చేప పిల్లల పంపిణీపై ఎల్‌నినో ప్రభావం పడింది. జిల్లాలోని చెరువులు, జలాశయాలు, కుంటల్లో నీరు లేక పూర్తిగా ఎండిపోయాయి. దీంతో ఈ ఏడాది చేప పిల్లల పంపిణీ లేనట్లే అని తెలుస్తోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ జిల్లాలో కూడా చేప పిల్లల పంపిణీ చేపట్టలేదని అధికార యంత్రాంగం చెబుతోంది. వర్షాబావ పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా చేప పిల్లలు చెరువుల్లో పోయడం ద్వారా డబ్బులు వృథా అవుతాయి తప్ప మత్స్యకారులకు ఎలాంటి జీవనోపాధికి ఉపయోగపడే అవకాశాలు లేవనే చెప్పాలి.

90 శాతం చెరువులు ఖాళీ...

జిల్లా వ్యాప్తంగా ఉన్న 1169 చెరువులు, జలాశయాల్లో కేవలం 165 చెరువుల్లోనే సగం వరకు నీరు ఉన్నట్లు సాగునీటి శాఖ అధికారులు మత్స్యశాఖకు వివరాలు సమర్పించారు. దాదాపు 90 శాతం చెరువుల్లో నీరులేకుండా ఖాళీగా ఉన్నాయి. ఉన్న నీటిని అంచనా వేసి చేప పిల్లలు పోయడం ద్వారా ఎలాంటి ప్రయోజనం చేకూరదనే అభిప్రాయానికి వచ్చారు. ప్రస్తుతం ఉన్న ఉష్ణోగ్రతలను బేరీజు వేసుకుంటే చెరువులు, కుంటల్లో నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండే అవకాశాలు లేవనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఫ ఎల్‌నినో ప్రభావంతో ప్రభుత్వం పునరాలోచన

ఫ నీళ్లున్న చెరువుల్లోనూ త్వరగా తగ్గిపోయే అవకాశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement