పంచాయతీల్లో కొత్త ఖాతాలు | - | Sakshi
Sakshi News home page

పంచాయతీల్లో కొత్త ఖాతాలు

Nov 11 2026 3:33 AM | Updated on Nov 11 2026 3:33 AM

పర్యవేక్షణ సులభం

నల్లగొండ : గ్రామ పంచాయతీల ఆర్థిక లావాదేవీల నిర్వహణలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. 16వ ఆర్థిక సంఘం ద్వారా వచ్చే నిధుల జమ, ఖర్చుల నిర్వహణ కోసం ప్రతి గ్రామ పంచాయతీకి కొత్త బ్యాంక్‌ ఖాతా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో జిల్లాలోని గ్రామ పంచాయతీలు కొత్త అకౌంట్లు తెరిచే పనిలో నిమగ్నమయ్యాయి. ఇప్పటికే దాదాపు 90 శాతం గ్రామాల్లో కొత్త బ్యాంక్‌ ఖాతాల ఏర్పాటు పూర్తయ్యాయి.

జిల్లాలో 869 పంచాయతీలు

నల్లగొండ జిల్లాలో మొత్తం 869 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 16వ ఆర్థిక సంఘం కింద గ్రామ పంచాయతీలకు నిధులు రానున్నాయి. ఈ నిధుల నిర్వహణ కోసం ప్రత్యేక బ్యాంక్‌ ఖాతాలు తెరవాల్సి ఉంది. గతంలో నిర్వహించిన సాధారణ ఖాతాలకు భిన్నంగా, ఆర్థిక సంఘం నిధుల కోసం ప్రత్యేకంగా ఈ ఖాతాలను ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా నిధుల జమ, ఖర్చుల వివరాలను విడిగా నిర్వహించేందుకు అవకాశం ఉంటుంది.

నిబంధనల ప్రకారమే ఖర్చులు..

ఆర్థిక సంఘం నుంచి వచ్చే నిధులను ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు, నిబంధనల ప్రకారమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు ఇతర అనుమతించిన మౌలిక సదుపాయాల కల్పన వంటి పనులకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆయా పనులకు సంబంధించిన నిబంధనలు, అనుమతుల మేరకే బిల్లుల చెల్లింపులు, నగదు ఉపసంహరణ చేపట్టాల్సి ఉంటుంది.

ప్రతి పంచాయతీకి ప్రత్యేక ఖాతా ఏర్పాటు చేయడం ద్వారా ఆర్థిక సంఘం నిధుల వినియోగాన్ని పర్యవేక్షించడం సులభతరం కానుంది. ఏ పంచాయతీకి ఎన్ని నిధులు వచ్చాయి? వాటిని ఏ పనులకు ఖర్చు చేశారు ఎంత మొత్తం మిగిలి ఉంది. అనే వివరాలను విడిగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయడంతో పాటు ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత పెంచేందుకు ఈ విధానం దోహదపడనుంది.

ఫ 16వ ఆర్థిక సంఘం నిధుల నిర్వహణకు ప్రత్యేకంగా..

ఫ పారదర్శకతకు ప్రాధాన్యం ఇచ్చేలా నిర్ణయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement