డిమాండ్‌ ఉన్న పంటలు వేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

డిమాండ్‌ ఉన్న పంటలు వేసుకోవాలి

Nov 11 2026 3:33 AM | Updated on Nov 11 2026 3:33 AM

హాలియా : రైతులు భూముల స్వభావం, నీటి లభ్యత ఆధారంగా, మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలు సాగు చేయాలని కలెక్టర్‌ చంద్రశేఖర్‌ సూచించారు. మంగళవారం ఆయన అనుముల మండలం పులిమామిడి గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. శ్రీనాథపురంలో పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సీరియల్‌ ప్రకారం ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రంలో జియో ట్యాగింగ్‌ ప్రక్రియను పరిశీలించారు. రైతులు నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకొని తక్కువ నీరు అవసరమయ్యే పంటలు సాగు చేయాలని సూచించారు. కుసుమ పంట సాగుపై రైతులు ఆసక్తి చూపాలన్నారు. సోలార్‌ విద్యుత్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకునే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. రైతులు పంట ఉత్పత్తులను కోల్డ్‌ స్టోరేజ్‌లలో భద్రపరిచి మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోవడం ద్వారా లాభాలు పొందవచ్చని కలెక్టర్‌ సూచించారు. రైతులు ముందుకొస్తే మహిళా సంఘాల ఆధ్వర్యంలో విబీజీ రామ్‌ జీ కింద కోల్డ్‌ స్టోరేజ్‌లు, గోదాముల నిర్మాణానికి ప్రభుత్వం ద్వారా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రైతుల్లో డిగ్రీలు చదువుకున్న వారు చాలా మంది ఉన్నారని, వారు వ్యవసాయంలో నూతన ఆలోచనలతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వినోద్‌కుమార్‌, మండల ఉద్యాన అధికారి రమేష్‌, డిప్యూటీ తహసీల్దార్‌ ప్రవీణ్‌కుమార్‌, సర్పంచ్‌లు అరుణ, సీతమ్మ, సత్యనారాయణరెడ్డి, ఏఈఓ మహేష్‌, జీపీఓ స్వామి, నరేష్‌ పాల్గొన్నారు.

ఫ కలెక్టర్‌ చంద్రశేఖర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement