ఓ రైడ్‌ కొడదాం గురూ.. | Financial Security For The Youth Through Bike Taxis | Sakshi
Sakshi News home page

ఓ రైడ్‌ కొడదాం గురూ..

Nov 11 2026 7:54 AM | Updated on Nov 11 2026 7:55 AM

Financial Security For The Youth Through Bike Taxis

సాక్షి, హైదరాబాద్‌: జీతం సరిపోవట్లేదా? జాబ్‌కు ప్రిపేర్‌ అయ్యేందుకు ఆర్థికంగా ఇబ్బంది అవుతున్నదా..? కాలేజీ ఫీజుల కోసం కష్టమవుతున్నదా..? డోంట్‌ వర్రీ. చేతిలో బైక్, స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే చాలు..గంటలో రూ.200 నుంచి రూ.300 ఈజీగా సంపాదించేయొచ్చు. నెలకు రూ.15 వేల వరకు అదనంగా పొందొచ్చు. బైక్‌ ట్యాక్సీ కల్చర్‌ ఇప్పుడు సిటీలో హాట్‌ ట్రెండ్‌గా నిలుస్తోంది.

ఖాళీగా ఉంటే ‘రైడ్‌‘ రైట్‌.. 
ఒకప్పుడు పార్ట్‌ టైం అంటే సూపర్‌ మార్కెట్లో పనో..ట్యూషన్‌ చెప్పడమో చేసేవారు. ఇప్పుడు సీన్‌ మారింది. సిటీలో ఇప్పుడు యువత బైక్‌ ట్యాక్సీల వైపు చూస్తున్నారు. ఆఫీస్‌ పనిగంటలకు ముందు ఉదయం 7 నుంచి 9 గంటల దాకా, ఆఫీస్‌ అయ్యాకా ఇంటికి రిటర్న్‌ వెళ్తూ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రాపిడో, ఓలా బైక్, ఊబర్‌ మోటో నడుపుతున్నారు. వీకెండ్స్, సెలవు దినాల్లోనూ కెపె్టన్లు బిజీ అయిపోతున్నారు. దిల్‌సుఖ్‌నగర్, అమీర్‌పేట్, ఎస్‌ఆర్‌నగర్‌లో ఈ ట్రెండ్‌ ఎక్కువగా కనిపిస్తున్నది. పాకెట్‌ మనీ, కాలేజీ ఫీజులు, జాబ్‌ కోచింగ్‌ కోసం రైడ్స్‌ కొడుతున్నారు. 

ఒక్కో రైడర్‌ రెండు, మూడు యాప్‌లను ఆన్‌లైన్‌లో ఉంచుతున్నారు. దేనిలో ఎక్కువ అమౌంట్, తొందరగా రైడ్‌ తగులుతుందో దాన్ని వెంటనే కొట్టేస్తున్నారు. హైటెక్‌ సిటీ, గచ్చిబౌలిలోని ఐటీ ఉద్యోగులు ఆఫీస్‌ అయిపోయాక ఇంటికి వెళ్లే దారిలోనే రెండు నుంచి మూడు రైడ్స్‌ కొడుతున్నారు. దీంతో పెట్రోల్‌ ఖర్చు మిగులుతోందని చెప్పుకొస్తున్నారు. రిటర్న్‌లో ఎలాగూ ఖాళీగా వస్తాం..రైడ్‌ బుక్‌చేసుకుంటే ఆదాయం కలిసివస్తోందని చెబుతున్నారు.  

ఎందుకీ క్రేజ్‌? 
పెట్టుబడి లేకుండా,నచ్చిన సమయంలో పనిచేసుకునే వెసులుబాటు ఉండటంతో బైక్‌ ట్యాక్సీలకు ఫుల్‌ డిమాండ్‌ ఏర్పడింది. చేతిలో ఫోన్, ఉన్న బైక్‌ చాలు. బాస్‌ ఎవరూ లేరు. నచ్చినప్పుడు యాప్‌ ఆన్, నచ్చనప్పుడు ఆఫ్‌ చేసుకోవచ్చు. బైక్‌తో పాటు లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్‌ ఉండాలి. యాప్‌ డౌన్‌లోడ్‌ చేసి 24 గంటల్లో జాయిన్‌ అవ్వొచ్చు. అయితే ఇందులో సమస్యలు కూడా ఉన్నాయి. రిస్క్‌ ఎక్కువ. యాక్సిడెంట్‌ భయం భరించాల్సిందే. బైక్‌ పాడయ్యే అవకాశాలు ఉన్నాయి. వీటినీ దృష్టిలో పెట్టుకోవాల్సి వస్తోంది.  

ఫుల్‌ డిమాండ్‌ 
సిటీలో 2 లక్షలకు పైగా రైడర్స్‌ ఉన్నట్లు తెలుస్తున్నది. కంపెనీలు కిలోమీటరుకు రూ.8 నుంచి రూ.10 ఇస్తున్నాయి. రోజుకు 3–4 గంటలు పనిచేస్తే రూ.500–రూ.800 వరకు మిగులుతుంది.పెట్రోలు ఖర్చు, కంపెనీ కమీషన్‌ పోగా నెలకు రూ.15 వేలపైగా అదనపు ఆదాయం. ఇక కొన్ని కంపెనీలు ఇన్సెంటివ్స్‌ ఆఫర్‌ చేస్తున్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ రైడ్స్‌ చేస్తే రూ.100 నుంచి 200 వరకు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. వారానికోసారి డబ్బులు కెపె్టన్‌ అకౌంట్‌లో జమ అవుతాయి. మరో వైపు నిరుద్యోగులు రోజంతా రైడ్స్‌ చేస్తూ నెలకు రూ.30 వేల నుంచి రూ. 40 వేల వరకు సంపాదిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement