నేటి నుంచి ఇండియన్‌ గోల్ఫ్‌ ప్రీమియర్‌ లీగ్‌ | Indian Golf Premier League 11 th event at Hyderabad | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఇండియన్‌ గోల్ఫ్‌ ప్రీమియర్‌ లీగ్‌

Nov 11 2026 6:11 AM | Updated on Nov 11 2026 6:11 AM

Indian Golf Premier League 11 th event at Hyderabad

ఇండియన్‌ గోల్ఫ్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐజీపీఎల్‌)–2026 సీజన్‌లో భాగంగా 11వ ఈవెంట్‌ హైదరాబాద్‌ వేదికగా జరగనుంది. నగరానికి సమీపంలోని వూటీ గోల్ఫ్‌ కౌంటీలో బుధవారం ప్రారంభమయ్యే ఈ పోటీలు మూడు రోజుల పాటు సాగుతాయి. మొత్తం 10 జట్లు హైదరాబాద్, గురుగ్రామ్, చెన్నై, గోవా, పంజాబ్, బెంగళూరు, ముంబై, వైజాగ్, ఢిల్లీ, కోల్‌కతా టోర్నీ బరిలో నిలిచాయి. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు జరిగిన 10 ఈవెంట్లలో 6 పోటీలను విదేశాల్లో నిర్వహించారు. 

11 సార్లు ఆసియా టూర్‌ విన్నర్‌ అయిన స్టార్‌ గోల్ఫర్‌ గగన్‌జీత్‌ భుల్లర్‌ ఈ పోటీలకు ప్రధాన ఆకర్షణ కానున్నాడు. వింత్రా చెన్నై జట్టుకు అతను ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.  2026లో ఇప్పటికే మూడు ఈవెంట్‌లు నెగ్గిన అతను మంచి ఫామ్‌లో ఉన్నాడు. హైదరాబాద్‌ టీమ్‌లో సభ్యుడైన సచిన్‌ బైసోయా నుంచి భుల్లర్‌కు గట్టి పోటీ ఎదురు కానుంది. రంజిత్‌ సింగ్, రాఘవ్‌ ఛుగ్, అర్జున్‌ భాటీ హైదరాబాద్‌ టీమ్‌లోని ఇతర గోల్ఫర్లు. వెటరన్‌ ఆటగాడు శివ్‌ కపూర్‌ ఆర్‌వీఆర్‌ ఢిల్లీ జట్టు తరఫున సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement