తెలంగాణలో జనగణన 2027 నిర్వహణకు తేదీలు ఖరారు | Dates finalized for conducting the 2027 Census in Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో జనగణన 2027 నిర్వహణకు తేదీలు ఖరారు

Nov 9 2026 6:43 PM | Updated on Nov 9 2026 6:45 PM

Dates finalized for conducting the 2027 Census in Telangana

హైదరాబాద్‌: తెలంగాణలో జనగణన 2027 నిర్వహణకు తేదీలు ఖరారయ్యాయి. జనగణనపై తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2027 జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు జనాభా గణన జరగనుంది. జనవరి 10 నుంచి 24 వరకు స్వీయ గణనకు అవకాశం ఉంది. 

ఇంటింటి జనగణనకు ముందు సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియ ఉంటుంది. మార్చి 1 నుంచి 5 వరకు రివిజనల్ రౌండ్ నిర్వహిస్తారు. 2027 మార్చి 1 అర్ధరాత్రి 12 గంటలను జనగణన రిఫరెన్స్ తేదీగా నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర హోంశాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌ను తెలంగాణ గెజిట్‌లో పునఃప్రచురణ చేస్తారు. జనగణన నిర్వహణకు సంబంధించి అన్ని శాఖలకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement