TG: బియ్యం ధరల పెంపుపై ప్రభుత్వం సీరియస్‌ | TG Govt finalized the maximum prices for different varieties of rice | Sakshi
Sakshi News home page

TG: బియ్యం ధరల పెంపుపై ప్రభుత్వం సీరియస్‌

Nov 9 2026 6:08 PM | Updated on Nov 9 2026 6:27 PM

TG Govt  finalized the maximum prices for different varieties of rice

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో బియ్యం ధరలను అంతకంతకూ పెంచుతూ కొంతమంది ‘ బియ్యం కృత్రిమ కొరత’ దందాకు తెరలేపడంపై ప్రభుత్వం తీవ్రంగా స్పం‍దించింది. ఎంఆర్‌పీ రేట్లు దాటి అమ్మితే కఠిన చర్యలు తప్పవని, ఒకవేళ స్టిక్కర్లు మార్చి గందరగోళం సృష్టించే పని చేసినా వారిపై తీసుకునే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. బియ్యం కొరతపై వస్తున్న వార్తలు వదంతులేనని, ప్రజలు ఆందోళన చెందొద్దని  పేర్కొంది. కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచితే కఠిన చర్యలు ఉంటాయంటా స్ట్రాంగ్‌ వార్నింగ్‌  ఇచ్చింది. 

బియ్యం కొరత రాకపోయినా కొంతమంది దళారులు కృత్రిమంగా కొరత సృష్టించి ప్రజల నడ్డివిరిచే యత్నాలు చేస్తున్నారు.  దీన్ని వ్యాపారులు కూడా మంచి మలుచుకుని వ్యాపారం కూడా చేసుకుంటున్నారు. ఏదో కొరత రాబోతుందనే ఆందోళన కల్గించి ఒక్కసారిగా రేట్లు పెంచి అమ్మేస్తున్నారు.  

ఈ నేపథ్యంలో బియ్యం ధరల నియంత్రణకు రంగంలోకి దిగింది పౌరసరఫరాల శాఖ. రిటైలర్లకు హోల్‌సేల్ వ్యాపారులతో పనిలేదు.. నేరుగా మిల్లర్ల నుంచే బియ్యం తెప్పించుకోవచ్చవని స్పష్టం చేసింది. స్టాక్ సమస్యలుంటే జిల్లా పౌరసరఫరాల అధికారులను సంప్రదించాలని పేర్కొంది. పదేపదే అక్రమాలకు పాల్పడితే పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని, 25 కిలోల బస్తాపై 26 కిలోల స్టిక్కర్ వేస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొంది. అసలు MRPపై అధిక ధరల నకిలీ స్టిక్కర్లు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. 

బియ్యం రకాల వారీగా గరిష్ట ధరలు ఖరారు చేసిన ప్రభుత్వం!

  • BPT, KNM రకాల బియ్యం కిలో గరిష్ట ధర రూ.66

  • RNR, తెలంగాణ సోనా బియ్యం కిలో గరిష్ట ధర రూ.74

  • HMT, JSR బియ్యం కిలో గరిష్ట ధర రూ.79

  • నిర్ణయించిన ధరలకు మించి విక్రయిస్తే చర్యలు తప్పవు!

  • బియ్యం ధరలపై ఫీల్డ్ లెవల్‌లో తనిఖీలు ముమ్మరం!

  • వినియోగదారులు మోసపోకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు!- సివిల్ సప్లై శాఖ
     

ఇదీ చదవండి: ప్రధాన నిందితుడు ఎవరి మనిషో తేలాల్సి ఉంది: నేరెళ్ల శారద

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement