టాస్‌తో సరి! | India vs newzealand Third odi match abandoned due to rain | Sakshi
Sakshi News home page

టాస్‌తో సరి!

Nov 11 2026 6:00 AM | Updated on Nov 11 2026 6:00 AM

India vs newzealand Third odi match abandoned due to rain

భారత్, న్యూజిలాండ్‌ మూడో వన్డే రద్దు 

శుక్రవారం మౌంట్‌ మాంగనుయ్‌లో నాలుగో వన్డే

హామిల్టన్‌: భారత్, న్యూజిలాండ్‌ సిరీస్‌ను మొదటి నుంచి వెంటాడుతున్న వాన ఈసారి పూర్తి స్థాయిలో ప్రభావం చూపించింది. ఇరు జట్ల మధ్య మంగళవారం జరగాల్సిన మూడో వన్డే భారీ వర్షం కారణంగా రద్దయింది. ఉదయం నుంచి వర్షం కారణంగా మైదానంలోకి దిగే పరిస్థితి కనిపించలేదు. అయితే కాస్త తెరిపినివ్వడంతో నిరీ్ణత సమయం కంటే రెండు గంటలు ఆలస్యంగా (భారత కాలమానం ప్రకారం గం. ఉ.9:30 నుంచి) 40 ఓవర్ల మ్యాచ్‌ను నిర్వహించాలని అంపైర్లు నిర్ణయించారు. 

వరుసగా మూడో మ్యాచ్‌లో టాస్‌ నెగ్గిన శుబ్‌మన్‌ గిల్‌ మరోసారి ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. అయితే సరిగ్గా మ్యాచ్‌ సమయానికి వాన మళ్లీ మొదలైంది. మరో గంటన్నర పాటు వర్షం తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తొలి రెండు మ్యాచ్‌లు నెగ్గి 2–0లో ఆధిక్యంలో నిలిచిన భారత్‌ ఇక సిరీస్‌ ఓడిపోయే అవకాశం లేదు. మరోవైపు స్వదేశంలో వరుసగా 11 వన్డే సిరీస్‌లు గెలిచిన న్యూజిలాండ్‌ జోరుకు బ్రేక్‌ పడింది. ఇరు జట్ల మధ్య శుక్రవారం మౌంట్‌ మాంగనుయ్‌లో నాలుగో వన్డే జరుగుతుంది. 

వన్డేలు వదిలి టెస్టు సన్నాహాలకు... 
భారత్, న్యూజిలాండ్‌ మధ్య తొలి టెస్టు నవంబర్‌ 19 నుంచి వెలింగ్టన్‌లో జరగనుంది. మిగిలిన రెండు వన్డేలతో పోలిస్తే భారత్‌కు వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) పాయింట్లు కీలకం. కివీస్‌ గడ్డపై టెస్టుల్లో పరిస్థితులు, వాతావరణం, బంతి భిన్నంగా స్పందించే తీరువంటి అంశాలను చూస్తే మన ఆటగాళ్లకు ప్రత్యేక సన్నద్ధత అవసరం. దీనిని దృష్టిలో ఉంచుకొని కెపె్టన్‌ శుబ్‌మన్‌గిల్, కేఎల్‌ రాహుల్‌ టెస్టు మ్యాచ్‌ ప్రాక్టీస్‌పై దృష్టి పెట్టారు. అందుకే మ్యాచ్‌కు 10 రోజుల ముందే వెలింగ్టన్‌కు బయల్దేరారు. వీరిద్దరితో పాటు టెస్టు జట్టులో ఉన్న బౌలర్లు సిరాజ్, కుల్దీప్‌ యాదవ్, అన్షుల్‌ కంబోజ్‌ కూడా వెళ్లారు. 

బ్యాటింగ్‌ కోచ్‌ సితాన్షు కొటక్, పేస్‌ బౌలింగ్‌ కోచ్‌ మోర్నీ మోర్కెల్‌ టెస్టు ఆటగాళ్ల సాధనను పర్యవేక్షిస్తారు. ముందుగా అనుకున్న విధంగా చివరి రెండు వన్డేలకు గిల్‌ దూరం కానుండగా, శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. హెడ్‌ కోచ్‌ గంభీర్, స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌ సాయిరాజ్‌ బహుతులే మాత్రం వన్డే టీమ్‌తో పాటు ఉంటారు. మరోవైపు టెస్టు జట్టులో లేని పేసర్లు అర్‌‡్షదీప్, గుర్నూర్, ఆఖిబ్‌ నబీ కూడా న్యూజిలాండ్‌లోనే ఉండనున్నారు. మిగిలిన రెండు వన్డేలు ముగిసిన తర్వాత వీరు వెలింగ్టన్‌కు వెళ్లి భారత బ్యాటర్ల నెట్‌ ప్రాక్టీస్‌కు 
సహకరిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement