IND VS NZ 3rd ODI: వర్షం కారణంగా టాస్‌ ఆలస్యం | IND VS NZ 3rd ODI Updates | Sakshi
Sakshi News home page

IND VS NZ 3rd ODI: వర్షం కారణంగా టాస్‌ ఆలస్యం

Nov 10 2026 7:07 AM | Updated on Nov 10 2026 7:13 AM

IND VS NZ 3rd ODI Updates

source: X

భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య ఇవాళ హ్యామిల్టన్‌ వేదికగా మూడో వన్డే జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు కూడా వరుణుడు అడ్డంగా మారాడు. తొలి రెండు వన్డేలకు కూడా వర్షం​ కారణంగా అంతరాయాలు ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే ఆ మ్యాచ్‌ల్లో ఫలితాలు భారత్‌కు అనుకూలంగా రావడంతో ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్‌ ప్రస్తుతం 2-0 ఆధిక్యంలో ఉంది.

ఇవాల్టి ఈ మ్యాచ్‌కు వరుణ గండం మరింత ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ నివేదించింది. మ్యాచ్‌కు ముందే వర్షం​ పలకరించడంతో టాస్‌ కూడా పడలేదు. భారతకాలమానం ప్రకారం టాస్‌ ఉదయం 7 గంటలకు పడాల్సి ఉండింది. అయితే 7:10కి కూడా టాస్‌ సమాచారం లేదు. 

దీనికి ముందే వర్షం​ రావడంతో అప్పుడు టాస్‌ 7:32కు పడుతుందని క్రిక్‌బజ్‌ నివేదించింది. ప్రస్తుతానికి టాస్‌పై ఎలాంటి సమాచారం లేదు. వర్షం కురుస్తుండటంతో పిచ్‌పై కవర్లు ఉంచారు. 

ఇదీ చదవండి: డ‌బుల్ సెంచ‌రీతో చ‌రిత్ర సృష్టించిన జింబాబ్వే బ్యాట‌ర్‌


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement