Photo Credit: Twitter
సొంతగడ్డపై టెస్టు సిరీస్‌ను 0-1తో వెస్టిండీస్‌కు కోల్పోయిన బంగ్లాదేశ్ రెండో టెస్టులో మాత్రం రికార్డులు కొల్లగొట్టింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ బ్యాటర్ తౌహిద్ హృదోయ్ ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో అజేయ డబుల్ సెంచరీ (242 నాటౌట్), రెండో ఇన్నింగ్స్‌లో 82 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 324 పరుగులు చేశాడు.
బంగ్లాదేశ్ తరఫున ఒక టెస్టు మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా తౌహిద్ హృదోయ్ తొలి స్థానంలో నిలిచాడు. గతంలో ఈ రికార్డు మోమినుల్ హక్ పేరిట ఉండేది. 2018లో శ్రీలంకతో టెస్టు మ్యాచ్‌లో మోమినుల్ హక్ తొలి ఇన్నింగ్స్‌లో 176 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 105 పరుగులు సాధించాడు. ఓవరాల్‌గా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు చేసిన మోమినుల్ 281 పరుగులు సాధించాడు.
ఇదే ఇప్పటివరకు బంగ్లా తరఫున అత్యుత్తమంగా ఉండేది. తాజాగా ఆ రికార్డును తౌహిద్ సవరించడంతో మోమినుల్ రెండో స్థానానికి పడిపోయాడు. ఇక మూడో స్థానంలో నజ్ముల్ హసన్ షాంటో 273 పరుగులు (తొలి ఇన్నింగ్స్‌లో 148, రెండో ఇన్నింగ్స్‌లో 125 నాటౌట్) సాధించాడు.
ఇక 2021లో బంగ్లాదేశ్ పర్యటనకు వచ్చిన వెస్టిండీస్ అప్పుడు కూడా టెస్టు సిరీస్‌ను ఎగరేసుకుపోయింది. తాజాగా మరోసారి టెస్టు సిరీస్‌ను నెగ్గిన విండీస్ జట్టు.. బంగ్లాదేశ్ డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలను మరింత క్లిష్టతరం చేసింది. విండీస్‌తో సిరీస్ ముగించుకున్న బంగ్లాదేశ్ తర్వాత సౌతాఫ్రికాలో పర్యటించనుంది. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇరుజట్ల మధ్య తొలి టెస్టు సెంచూరియన్ వేదికగా నవంబర్ 15 నుంచి ప్రారంభం కానుంది.
ఇదీ చదవండి: కెప్టెన్‌గా రీఎంట్రీ.. ‘ట్రోఫీని ఇంటికి తీసుకొస్తా’


