Asia Cup: శ్రీలంకను చిత్తుగా ఓడించిన అఫ్గానిస్తాన్‌ | ACC Mens U19 Asia Cup 2026: Afghanistan Beat Sri Lanka By 106 Runs | Sakshi
Sakshi News home page

Asia Cup: శ్రీలంకను చిత్తుగా ఓడించిన అఫ్గానిస్తాన్‌

Nov 9 2026 6:50 PM | Updated on Nov 9 2026 6:57 PM

ACC Mens U19 Asia Cup 2026: Afghanistan Beat Sri Lanka By 106 Runs

PC: ACC Media X

ఏసీసీ మెన్స్‌ ఆసియా అండర్‌-19 కప్‌-2026 వన్డే టోర్నమెంట్లో అఫ్గానిస్తాన్‌ జట్టు అద్భుత విజయం సాధించింది. శ్రీలంకను ఏకంగా 106 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. అల్‌ ఎమిరేట్‌ వేదికగా సోమవారం నాటి మ్యాచ్‌లో గ్రూప్‌-‘బి’ నుంచి అఫ్గానిస్తాన్‌- శ్రీలంక యువ జట్లు తలపడ్డాయి.

శతకంతో చెలరేగిన సుభాన్‌
టాస్‌ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. అఫ్గాన్‌ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లలో అబీదుల్లా నదర్జాన్‌ అర్ధ శతకం (55)తో ఆకట్టుకోగా.. ఫరీదుల్లా ఇన్సాస్‌ (10) మాత్రం విఫలమయ్యాడు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన సుభాన్‌ జఖైల్‌ శతకం (107తో చెలరేగగా.. మిగిలిన వారిలో షా ఫైసల్‌ రహీమీ (33, తాహిర్‌ సర్వారి (32) చెప్పుకోదగిన స్కోర్లు చేశారు.

ఫలితంగా అఫ్గాన్‌ జట్టు 49.5 ఓవర్లలో 275 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. శ్రీలంక బౌలర్లలో సెత్మిక సెనెవిరత్నె మూడు వికెట్లతో సత్తా చాటగా.. విఘ్నేశ్వరన్‌ ఆకాశ్‌ రెండు వికెట్లు కూల్చాడు. గిమ్హాన్‌ మెండిస్‌, కెప్టెన్‌ విరేన్‌ చముదిత, కిత్మ వితనపతిరణ తలా ఒక వికెట్‌ దక్కించుకున్నారు.

169 పరుగులకే లంక ఆలౌట్‌
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక.. అఫ్గాన్‌ బౌలర్ల విజృంభణకు తాళలేక 34.1 ఓవర్లలో కేవలం 169 పరుగులే చేసి ఆలౌట్‌ అయింది. టాపార్డర్‌లో ఓపెనర్‌ లిత్మ పెరీరా, వన్‌డౌన్‌ బ్యాటర్‌ సెనుజ వెకునగొడ డకౌట్‌ కాగా.. మరో ఓపెనర్‌ రెహాన్‌ పెరీస్‌ 12 పరుగులు చేయగలిగాడు.

మిగిలిన వారిలో కిత్మ వితరపతిరణ అర్ధ శతకం (58)తో ఆకట్టుకోగా.. చముదిత (17), సెత్మిక (23), మెండిస్‌ (16) మాత్రమే డబుల్‌ డిజిట్‌ స్కోర్లు చేశారు. అఫ్గాన్‌ బౌలర్లలో నూర్‌ అలీ నియాజి నాలుగు వికెట్లతో చెలరేగి లంక బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించగా.. ఆమిర్‌ హంజా, కెప్టెన్‌ సొహైల్‌ ఖాన్‌, మహ్మద్‌ అలీ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఈ విజయంతో గ్రూప్‌-‘బి’ నుంచి మూడింట మూడు మ్యాచ్‌లు గెలిచిన అఫ్గానిస్తాన్‌ ఆరు పాయింట్లతో టాపర్‌గా నిలిచింది. 

ఇవీ చదవండి: ఫ్లాట్‌ వికెట్లకు అలవాటుపడ్డారు.. వీళ్లేం బౌలింగ్‌ చేస్తారనుకున్నా!
IND vs NZ ODIs: న్యూజిలాండ్‌కు భారీ ఎదురుదెబ్బ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement