ఫ్లాట్‌ వికెట్లకు అలవాటుపడ్డారు.. వీళ్లేం బౌలింగ్‌ చేస్తారనుకున్నా! | Used To Bowling On Flat Wickets: NZ Coach Surprised By Indian Pacers Adaptability | Sakshi
Sakshi News home page

ఫ్లాట్‌ వికెట్లకు అలవాటుపడ్డారు.. వీళ్లేం బౌలింగ్‌ చేస్తారనుకున్నా!

Nov 9 2026 2:00 PM | Updated on Nov 9 2026 2:15 PM

Used To Bowling On Flat Wickets: NZ Coach Surprised By Indian Pacers Adaptability

భారత జట్టు (PC: BCCI X)

న్యూజిలాండ్‌తో తొలి రెండు వన్డేల్లో టీమిండియా బౌలర్లు అదరగొట్టారు. ముఖ్యంగా పేసర్లు ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ఆతిథ్య కివీస్‌ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ఆక్లాండ్‌ వేదికగా మొదటి వన్డేలో న్యూజిలాండ్‌ను 185 పరుగులకే ఆలౌట్‌ చేసిన భారత బౌలర్లు.. రెండో వన్డేలో 134 పరుగులకే చాపచుట్టేలా చేశారు.

ఈ రెండు మ్యాచ్‌లలో కలిపి పేసర్లు అర్ష్‌దీప్‌ సింగ్‌, ఆకిబ్‌ నబీ, అన్షుల్‌ కాంబోజ్‌, గుర్నూర్‌ బ్రార్‌ కలిసి.. ఇరవైకి గానూ ఏకంగా 17 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌ కోచ్‌ ల్యూక్‌ రోంచి భారత పేస్‌ బౌలింగ్‌ విభాగంపై ప్రశంసలు కురిపించాడు. ఉపఖండంలో ఫ్లాట్‌గా ఉండే వికెట్లపై బౌలింగ్‌ చేసే వీరు.. ఇక్కడ ఇంత గొప్పగా ఆడతారని ఊహించలేదన్నాడు.

ఫ్లాట్‌ వికెట్లకు అలవాటుపడ్డారు
‘‘భారత పేసర్లు అద్భుతంగా ఆడుతున్నారు. వాళ్ల అస్త్రాల ముందు మా బ్యాటర్ల దగ్గర సమాధానాలే లేకుండా పోయాయి. పిచ్‌ కొద్గిగా సహకరించినా సరే వాళ్లు చెలరేగిపోతున్నారు. నిజానికి వాళ్లు ఫ్లాట్‌ పిచ్‌లపై ఆడేందుకు బాగా అలవాటు పడిపోయారు.

వీళ్లేం బౌలింగ్‌ చేస్తారనుకున్నా!
అలాంటిది ఇక్కడ మాత్రం సరైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో అదరగొడుతున్నారు. బంతి కాస్త స్వింగ్‌ అయినా.. బ్యాటర్ల పని పడుతున్నారు. గత రెండు మ్యాచ్‌లలో మా బ్యాటర్లకు వాళ్లు కఠిన సవాలు విసిరారు. సులువుగా వికెట్లు కూల్చారు. భారత యువ పేస్‌ బౌలింగ్‌ దళాన్ని చూసి సంతోషంగా ఉంది.

టెస్టులకు కూడా సన్నద్ధమైనట్లే
అనుభవం గడిస్తున్న కొద్దీ వాళ్లు మరింతగా రాటుదేలతారు. నిజానికి రెండో వన్డే జరిగిన వెల్లింగ్‌టన్‌ పిచ్‌ పూర్తిగా టెస్టు వికెట్‌ మాదిరే ఉంటుంది. కాబట్టి వీళ్లు సాంకేతికంగా టెస్టులకు కూడా పూర్తి స్థాయిలో ప్రస్తుతం సిద్ధంగా ఉన్నట్లే’’ అని మూడో వన్డేకు ముందు విలేకరులతో మాట్లాడుతూ రోంచి భారత పేసర్లను కొనియాడాడు. కాగా తొలి రెండు వన్డేల్లో టీమిండియా చేతిలో ఓడిన న్యూజిలాండ్‌ మంగళవారం మూడో వన్డేలో తలపడుతుంది. ఇందుకు హామిల్టన్‌ వేదిక.

ఇవీ చదవండి: IND vs NZ: వర్షం వల్ల ఆట ‘రద్దు’.. ఊపిరి పీల్చుకున్న కివీస్‌!
IND vs NZ ODIs: న్యూజిలాండ్‌కు భారీ ఎదురుదెబ్బ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement