బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ మిడిలార్డర్ బ్యాటర్ కేవమ్ హాడ్జ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. నాలుగువ రోజు నాటి ఆటలో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన 33 ఏళ్ల హాడ్జ్ తన సూపర్ బ్యాటింగ్‌తో విండీస్‌ను పటిష్ట స్థితిలో నిలిపాడు. 189 బంతుల్లో17 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 140 పరుగులు చేసి ఇంకా క్రీజులో ఉన్నాడు. అతడికి ఇది మూడో టెస్టు సెంచరీ కావడం గమనార్హం. ఈ క్రమంలో కేవమ్ హాడ్జ్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
బంగ్లాదేశ్ గడ్డపై టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన వెస్టిండీస్ టాపార్డర్ బ్యాటర్‌గా కేవమ్ హాడ్జ్ నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు డారెన్ బ్రావో పేరిట ఉండేది. 2012లో ఖుల్నా వేదికగా జరిగిన టెస్టులో డారెన్ బ్రావో 127 పరుగులు సాధించాడు. తాజా మ్యాచ్‌తో బ్రావో ఆల్‌టైమ్ రికార్డును హాడ్జ్ బ్రేక్ చేశాడు.
బంగ్లాదేశ్‌లో విండీస్ టాప్-ఆర్డర్ బ్యాటర్ల అత్యధిక టెస్టు స్కోర్లు:
కేవమ్ హాడ్జ్: 140* వర్సెస్ బంగ్లాదేశ్ (సిల్హెట్, 2026)
డారెన్ బ్రావో: 127 వర్సెస్ బంగ్లాదేశ్ (ఖుల్నా, 2012)
కిర్క్ ఎడ్వర్డ్స్: 121 వర్సెస్ బంగ్లాదేశ్ (మీర్పూర్, 2011)
రామ్‌నరేష్ సర్వాన్: 119 వర్సెస్ బంగ్లాదేశ్ (ఢాకా)
కియారన్ పొవెల్: 117 వర్సెస్ బంగ్లాదేశ్ (మీర్పూర్, 2012)


