జింబాబ్వేతో టెస్టు.. శతకాలతో చెలరేగిన ఆఫ్గన్ బ్యాటర్లు | Two Afghan Batters-Centuries-Creates-History-Vs ZIM 1st Test-Sharjah | Sakshi
Sakshi News home page

జింబాబ్వేతో టెస్టు.. శతకాలతో చెలరేగిన ఆఫ్గన్ బ్యాటర్లు

Nov 7 2026 1:38 PM | Updated on Nov 7 2026 2:14 PM

Two Afghan Batters-Centuries-Creates-History-Vs ZIM 1st Test-Sharjah

Photo Credit: Twitter

షార్జా వేదిక‌గా జింబాబ్వేతో జ‌రుగుతున్న తొలి టెస్టులో అఫ్గానిస్తాన్ బ్యాట‌ర్లు శ‌త‌కాలతో చెల‌రేగారు. ఓపెన‌ర్ అబ్దుల్ మాలిక్ (2) విఫ‌ల‌మైన‌ప్ప‌టికీ, మ‌రో ఓపెన‌ర్ సెదికుల్లా అట‌ల్‌తో పాటు వ‌న్‌డౌన్‌లో వ‌చ్చిన ర‌హ‌మ‌నుల్లా శ‌త‌కాల‌తో చెల‌రేగ‌డంతో అఫ్గానిస్తాన్ 64 ఓవ‌ర్ల‌లో వికెట్ కోల్పోయి 216 ప‌రుగులు చేసిన భారీ స్కోరు దిశ‌గా ప‌య‌నిస్తోంది. 

ముందుగా ర‌హ‌మ‌నుల్లా 157 బంతుల్లో సెంచ‌రీ పూర్తి చేసుకోగా, అత‌డి ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, ఒక సిక్స‌ర్ ఉన్నాయి. ఆ వెంట‌నే ఓపెన‌ర్ సెదికుల్లా అట‌ల్ 197 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స‌ర్ల సాయంతో శ‌త‌కం మార్క్‌ను అందుకున్నాడు. ఈ ఇద్ద‌రు రెండో వికెట్‌కు అజేయంగా 200 ప‌రుగుల‌కు పైగా జోడించారు. 

ఇది మూడోసారి..
ఒక టెస్టు మ్యాచ్‌లో అఫ్‌గానిస్తాన్ తరఫున ఇద్దరు లేదా ఎక్కువ మంది బ్యాటర్లు సెంచరీలు చేయడం ఇది మూడోసారి. గతంలో 2024లో ఇదే జింబాబ్వేతో జరిగిన టెస్టులో హష్మతుల్లా షహిదీ (246), రహమత్ షా (234 పరుగులు)ఏకంగా డబుల్ సెంచరీలు సాధించడం విశేషం. ఇదే మ్యాచ్‌లో అఫ్సర్ జజయ్ (113) సెంచరీ చేశాడు. 

ఇక 2021లో అబుదాబి వేదికగా జింబాబ్వేతో జరిగిన టెస్టులో హష్మతుల్లా షహిదీ (200 నాటౌట్‌) డబుల్‌సెంచరీ చేయగా, అస్గర్ అఫ్గాన్ (164 పరుగులు) సెంచరీ సాధించాడు.

అంతకముందు జింబాబ్వే తమ తొలి ఇన్నింగ్స్‌లో 504 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ బ్రియాన్ బెన్నెట్ (128), బ్రెండన్ టేలర్ (131) శతకాలతో అదరగొట్టగా, ఆఖర్లో గ్రేమీ క్రీమర్ (34 నాటౌట్) మెరవడంతో జింబాబ్వే 500 పరుగుల మార్క్‌ను దాటింది. అఫ్గానిస్తాన్ బౌలర్లలో మొహమ్మద్ సలీమ్‌, ఖయాస్ అహ్మద్‌లు చెరో 3 వికెట్లు తీయగా, జియావుర్ రెహ్మాన్ రెండు వికెట్లు పడగొట్టాడు.

ఇదీ చదవండి: కివీస్ గ‌డ్డ‌పై చ‌రిత్ర సృష్టించిన భార‌త‌ బౌల‌ర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement