అఫ్గాన్‌ బౌలర్లకు చుక్కలు.. జింబాబ్వే 504 పరుగుల భారీ స్కోర్‌ | Zimbabwe Post Massive 504 Runs in 1st Test Against Afghanistan | Sakshi
Sakshi News home page

అఫ్గాన్‌ బౌలర్లకు చుక్కలు.. జింబాబ్వే 504 పరుగుల భారీ స్కోర్‌

Nov 6 2026 4:55 PM | Updated on Nov 6 2026 5:48 PM

Zimbabwe Post Massive 504 Runs in 1st Test Against Afghanistan

షార్జా వేదిక‌గా అఫ్గానిస్తాన్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో జింబాబ్వే బ్యాటర్లు అదరగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో జింబాబ్వే ఏకంగా 504 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. ఖైస్ అహ్మద్ తొలుత ఓపెనర్లు ఇనోసెంట్‌ కియా(34), బెన్‌ కుర్రాన్‌(42) మంచి ఆరంభం ఇవ్వగా.. ఆ తర్వాత మిడిలార్డర్‌ బ్యాటర్‌ బ్రెండన్‌ టేలర్‌(131), కెప్టెన్‌ బ్రియన్‌ బెన్నెట్‌(128) భారీ సెంచరీలతో కదం తొక్కారు.

అదేవిధంగా లోయార్డర్‌ బ్యాటర్లు వెస్లీ మాధవేరే(54), సిగా(44),క్రీమర్‌(34) రాణించారు. అఫ్గాన్‌ బౌలర్లలో మహ్మద్‌ సలీమ్‌, ఖైస్ అహ్మద్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. జియూర్‌ రెహ్మన్‌, హస్మతుల్లా షాహిది తలా వికెట్‌ చొప్పున సాధించారు. జింబాబ్వేకు టెస్టుల్లో ఇది ఐదో అత్యధిక స్కోర్ కావడం గమనార్హం.

తుది జట్లు
ఆఫ్ఘనిస్తాన్ : సెడిఖుల్లా అటల్, అబ్దుల్ మాలిక్, షాహిదుల్లా కమల్, రహమత్ షా(కెప్టెన్‌), హష్మతుల్లా షాహిదీ, ఇక్రమ్ అలీఖిల్(వికెట్ కీపర్‌), రహ్మానుల్లా, కైస్ అహ్మద్, జియా-ఉర్-రెహ్మాన్ అక్బర్, జియా ఉర్ రహ్మాన్ షరీఫీ, మహ్మద్ సలీమ్ సఫీమ్

జింబాబ్వే: బెన్ కుర్రాన్, ఇన్నోసెంట్ కైయా, బ్రియాన్ బెన్నెట్ (కెప్టెన్‌), బ్రెండన్ టేలర్, క్రెయిగ్ ఎర్విన్, అంటుమ్ నఖ్వీ, వెస్లీ మాధవెరే, తఫద్జ్వా త్సిగా (వికెట్ కీపర్‌), గ్రేమ్ క్రీమర్, న్యూమాన్ న్యామ్‌హురి, బ్లెస్సింగ్ ముజారబానీ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement