తొలి బౌల‌ర్‌గా రికార్డు.. ఆఫ్గన్‌ చేతిలో జింబాబ్వే క్లీన్‌స్వీప్‌ | Noor Ahmad 1st-Fifer-T20I-Cricket-AFG-3-0-Clean-Sweep-Zimbabwe | Sakshi
Sakshi News home page

తొలి బౌల‌ర్‌గా రికార్డు.. ఆఫ్గన్‌ చేతిలో జింబాబ్వే క్లీన్‌స్వీప్‌

Nov 2 2026 7:39 AM | Updated on Nov 2 2026 7:57 AM

Noor Ahmad 1st-Fifer-T20I-Cricket-AFG-3-0-Clean-Sweep-Zimbabwe

Photo Credit: Twitter

షార్జా వేదిక‌గా జింబాబ్వేతో జ‌రిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను అఫ్గానిస్తాన్ క్లీన్‌స్వీప్ చేసింది. ఆదివారం జ‌రిగిన చివ‌రి టీ20 మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ 7 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని అందుకుంది. ఆఫ్గ‌న్ బౌల‌ర్‌ నూర్ అహ్మద్ ఐదు వికెట్ల‌తో జింబాబ్వే ప‌త‌నాన్ని శాసించాడు. ఫ‌లితంగా తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 14.3 ఓవ‌ర్ల‌లో 79 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. 

రెయాన్ బ‌ర్ల్ (30) మిన‌హా మిగ‌తావారంతా సింగిల్ డిజిట్‌కే ప‌రిమిత‌మ‌య్యారు. నూర్ అహ్మ‌ద్ ఐదు వికెట్లు తీయ‌గా, అబ్దుల్లా త‌రాఖాలి రెండు, ఫ‌జ‌ల్లా ఫరూకీ, అజ్మ‌తుల్లా, అబ్దుల్లా ఒక్కో వికెట్ ప‌డ‌గొట్టారు. అనంత‌రం బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ జ‌ట్టు 8.1 ఓవ‌ర్ల‌లో 3 వికెట్లు కోల్పోయి 81 ప‌రుగులు చేసి గెలుపొందింది. 

కెప్టెన్ ఇబ్ర‌హీం జ‌ద్ర‌న్ (25 నాటౌట్‌), సెదీకుల్లా అట‌ల్ (20), అజ్మ‌తుల్లా (18 నాటౌట్‌) జ‌ట్టు విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించారు. జింబాబ్వే బౌల‌ర్ల‌లో ఎర్నెస్ట్ మ‌సుకు రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఐదు వికెట్ల‌తో చెల‌రేగిన నూర్ అహ్మ‌ద్ ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోగా, సిరీస్‌లో 140 ప‌రుగులు చేయ‌డంతో పాటు బౌలింగ్‌లో నాలుగు వికెట్లు తీసిన అజ్మ‌తుల్లా ఒమ‌ర్‌జ‌య్ ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు సొంతం చేసుకున్నాడు.

ఐదు వికెట్ల హాల్..
ఇక నూర్ అహ్మ‌ద్‌కు అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఇదే తొలి ఐదు వికెట్ల హాల్ కావ‌డం విశేషం. జింబాబ్వేతో టీ20 మ్యాచ్‌లో ఐదు వికెట్ల హాల్ న‌మోదు చేసిన తొలి బౌల‌ర్‌గా రికార్డుల‌కెక్కాడు. ఓవరాల్‌గా ఆఫ్గ‌న్ త‌ర‌ఫున టీ20ల్లో ఐదు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న న‌మోదు చేసిన ఆరో బౌల‌ర్‌గా నూర్ అహ్మ‌ద్ నిలిచాడు. ఓవ‌రాల్‌గా టీ20 క్రికెట్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 230 మ్యాచ్‌లాడిన నూర్ అహ్మ‌ద్ 261 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

 

ఇదీ చదవండి: NZ Vs IND: వ‌న్డే సిరీస్ ముంగిట‌ న్యూజిలాండ్‌కు భారీ షాక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement