రోహిత్ శ‌ర్మ కీల‌క నిర్ణ‌యం | Rohit Sharma-ODI WC-Plans-Returns-Mumbai-To-Play-Vijay Hazare Trophy | Sakshi
Sakshi News home page

రోహిత్ శ‌ర్మ కీల‌క నిర్ణ‌యం

Nov 1 2026 11:42 AM | Updated on Nov 1 2026 12:30 PM

Rohit Sharma-ODI WC-Plans-Returns-Mumbai-To-Play-Vijay Hazare Trophy

Photo Credit: BCCI Twitter

న్యూజిలాండ్‌తో వ‌న్డే సిరీస్ ఆడేందుకు ఇప్ప‌టికే కివీస్ గడ్డ‌పై అడుగుపెట్టిన టీమిండియా స్టార్ రోహిత్ శ‌ర్మ కీల‌క నిర్ణయం తీసుకున్నాడు. కివీస్‌తో వ‌న్డే సిరీస్ ముగిసిన అనంత‌రం స్వ‌దేశంలో జ‌ర‌గ‌నున్న‌ దేశ‌వాళీ టోర్నీ విజ‌య్ హ‌జారే ట్రోఫీలో ఆడాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. ఈ మేర‌కు తాను విజ‌య్ హ‌జారే ట్రోఫీకి అంద‌బాటులో ఉండ‌నున్న‌ట్లు ముంబై క్రికెట్ అసోసియేష‌న్‌కు రోహిత్ వెల్ల‌డించిన‌ట్లు తెలుస్తోంది.

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ప్ర‌ణాళిక‌ల్లో భాగంగానే..
న‌వంబ‌ర్ 15తో న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్ ముగియ‌నుంది. ఆ త‌ర్వాత భార‌త్ స్వ‌దేశంలో లంక‌తో వ‌న్డే సిరీస్ ఆడ‌నుంది. డిసెంబ‌ర్ 13 నుంచి 19 మ‌ధ్య టీమిండియా, శ్రీలంకల మ‌ధ్య మూడు వ‌న్డే మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇది పూర్త‌యిన వెంట‌నే రోహిత్ విజ‌య్ హ‌జారే ట్రోఫీ ఆడ‌నున్నాడు. డిసెంబ‌ర్ 14 నుంచి 29 వ‌ర‌కు ఈ ప్ర‌తిష్టాత్మ‌క టోర్నీ జ‌ర‌గ‌నుంది. 2027 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ప్ర‌ణాళిక‌ల్లో భాగంగానే విజ‌య్ హ‌జారే ట్రోఫీలో ఆడాల‌ని నిశ్చ‌యించుకున్న‌ట్లు రోహిత్ శ‌ర్మ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపాడు.

ప‌ది రోజుల గ్యాప్‌..
అయితే జ‌న‌వ‌రి 3 నుంచి జింబాబ్వేతో వ‌న్డే సిరీస్ ప్రారంభం కానుండ‌డంతో రోహిత్ మ‌ళ్లీ టీమిండియాతో చేర‌నున్నాడు. డిసెంబ‌ర్ 22 నుంచి ప‌ది రోజుల గ్యాప్‌లో రోహిత్ ముంబై త‌ర‌ఫున విజ‌య్ హాజారే ట్రోఫీలో పాల్గొన‌నున్నాడు. విజ‌య్ హ‌జారే ట్రోఫీలో లీగ్ ద‌శ డిసెంబ‌ర్ 14 నుంచి 29 వ‌ర‌కు, జ‌న‌వ‌రి 2 నుంచి 8 వ‌ర‌కు నాకౌట్ మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి.

ఇక రోహిత్ శ‌ర్మ విజ‌య్ హజారే ట్రోఫీలో పాల్గొన‌డం ఇదేమి తొలిసారి కాదు. 2018లో రెండు మ్యాచ్‌లు ఆడాడు. సిక్కింతో జ‌రిగిన మ్యాచ్‌లో రోహిత్ 94 బంతుల్లోనే 155 ప‌రుగులు సాధించాడు. మొత్తం మీద విజ‌య్ హ‌జారే ట్రోఫీలో రోహిత్ ముంబై త‌ర‌ఫున 18 మ్యాచ్‌లు ఆడాడు. 2024లో టీ20లు, 2025లో టెస్టుల‌కు వీడ్కోలు ప‌లికిన రోహిత్ ప్ర‌స్తుతం వ‌న్డే ఫార్మాట్‌లో మాత్రమే కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే.

ఇదీ చదవండి: చ‌రిత్ర సృష్టించిన సౌతాఫ్రికా కెప్టెన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement