టీమిండియాకు షాక్‌.. అత‌డు ఆడేది అనుమానమే! | Rishabh Pant Ruled Out Of 3rd Unofficial Test Likely To Miss 1st Test Against New Zealand, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

టీమిండియాకు షాక్‌.. అత‌డు ఆడేది అనుమానమే!

Nov 1 2026 11:08 AM | Updated on Nov 1 2026 11:30 AM

Rishabh Pant-Ruled-Out-3rd Unofficial Test-Also-Doubtful-1st Test-Vs NZ

Photo Credit: Twitter

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ నేపథ్యంలో టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. గాయం నుంచి కోలుకున్నప్పటికీ రెగ్యూలర్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తొలి టెస్టు ఆడడం అనుమానంగానే ఉంది. ఇప్పటికే న్యూజిలాండ్‌-ఏతో జరుగుతున్న అనధికారిక టెస్టు సిరీస్‌లో తొలి రెండు  మ్యాచ్‌లకు దూరంగా ఉన్న పంత్‌.. తాజాగా మూడో మ్యాచ్‌కు కూడా అందుబాటులో ఉండడం లేదని బీసీసీఐ ప్రకటించింది. 

తొలి రెండు అనధికారిక టెస్టులకు పంత్‌ స్థానంలో ఎంపిక చేసిన కుమార్‌ కుషాగ్ర మూడో మ్యాచ్‌కు కూడా జట్టుతో పాటే కొనసాగుతాడని స్పష్టం చేసింది. పంత్ గాయం నుంచి కోలుకున్నప్పటికీ, పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించేందుకు సమయం పడుతుందని పేర్కొంది. అందుకోసం పంత్‌ మూడు నుంచి నాలుగు స్కిల్ (నైపుణ్యం) సెషన్స్ పూర్తి చేయాల్సి ఉందని వెల్లడించింది. ఇవి పూర్తైతేనే పంత్ టీమిండియాలో ఆడేందుకు ఆస్కారం ఉంటుంది. 

ఈ నేపథ్యంలో స్కిల్ సెషన్స్‌లో అతడి బ్యాటింగ్‌, వికెట్ కీపింగ్‌, ఫిట్‌నెస్‌లను పరీక్షించనున్నారు. ఈ సైకిల్ పూర్తయ్యేందుకు మూడు వారాలు పట్టనుండడంతో పంత్ తొలి టెస్టుకు దూరమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. నవంబర్ 19 నుంచి ఇరుజట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది.

తుదిజ‌ట్టులో నితీశ్‌రెడ్డి
ఒకవేళ పంత్ కివీస్‌తో తొలి టెస్టుకు దూరంగా ఉంటే, ధ్రువ్ జురెల్ కీపింగ్ బాధ్య‌త‌లు తీసుకోనున్నాడు. ఇప్ప‌టికే అన‌ధికారిక టెస్టు సిరీస్‌లో కెప్టెన్ క‌మ్ వికెట్ కీప‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్న ధ్రువ్ జురెల్ తాజాగా రెండో అన‌ధికారిక టెస్టులో సెంచ‌రీతో క‌దం తొక్కాడు. మంచి ఫామ్‌లో ఉండ‌డంతో జురెల్ కివీస్‌తో టెస్టు సిరీస్‌కు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండ‌నున్నాడు. 

ఇక పంత్ తొలి టెస్టుకు దూరంగా ఉంటే అత‌డి స్థానంలో ఆల్‌రౌండ‌ర్ నితీశ్ కుమార్ రెడ్డి ఆడే అవ‌కాశ‌ముంది. ఎందుకంటే తొలి మ్యాచ్ జ‌ర‌గ‌నున్న వెల్లింగ్ట‌న్ పేస‌ర్ల‌కు అనుకూలంగా ఉంటుంది. దీంతో నితీశ్‌రెడ్డి అటు బ్యాట్‌తోనూ, ఇటు బంతితోనూ రాణించే అవ‌కాశ‌ముంద‌ని బీసీసీఐ భావిస్తుంది.

ఇదీ చదవండి: చ‌రిత్ర సృష్టించిన సౌతాఫ్రికా కెప్టెన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement