PC: BCCI/X
ఆదివారం హామిల్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో ఐదో టీ20లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. నాలుగో టీ20లో 87 పరుగుల తేడాతో భారీ ఓటమిని ఎదుర్కొన్న భారత్.. ఇప్పుడు హామిల్టన్‌లో ప్రత్యర్ధిని ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది.
అయితే ఇప్పటికే సిరీస్‌ను 3-1తో సొంతం చేసుకున్న టీమిండియా ఆఖరి మ్యాచ్‌లో కొన్ని మార్పులతో బరిలోకి దిగే అవకాశముంది. నాలుగో టీ20లో బెంచ్‌కే పరిమితమైన యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ, పేసర్ భువనేశ్వర్ కుమార్ తిరిగి తుది జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది.
ఓపెనర్ సంజూ శాంసన్‌ను విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం. అతడి స్ధానంలో వైభవ్‌కు అవకాశమివ్వనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. రెండో టీ20కు ఇషాన్ కిషన్ స్ధానంలో తుది జట్టులోకి వచ్చిన వైభవ్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. కానీ మూడో టీ20లో మాత్రం 19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 45 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
మరోవైపు రీఎంట్రీలో భువనేశ్వర్ కుమార్ దారుణంగా విఫలమయ్యాడు. ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన భువీ కేవలం ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు. దీంతో నాలుగో టీ20కు అతడిని పక్కన పెట్టాడు. అయితే ఛాన్నాళ్ల తర్వాత జాతీయ జట్టులోకి వచ్చిన భువనేశ్వర్‌కు మరొక అవకాశమివ్వాలని టీమ్ మేనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.
ఒకవేళ అదే జరిగితే ప్రిన్స్ యాదవ్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. అదేవిధంగా వరుసగా విఫలమవుతున్న అక్షర్ పటేల్ స్థానంలో శివం దూబే తుది జట్టులోకి వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు.
కివీస్‌తో ఐదో టీ20కు భారత తుది జట్టు(అంచనా)
అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్) శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, నమన్ ధీర్, నితీష్ కుమార్ రెడ్డి, శివం దూబే, మయాంక్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, అర్ష్దీప్ సింగ్


