అక్షర్‌తో జడేజా (PC: BCCI)
టీమిండియా సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా కీలక వ్యాఖ్యలు చేశాడు. వన్డేల్లో జడ్డూ కెరీర్ ముగింపునకు వచ్చిందని.. యాజమాన్యం అతడిని ఇకపై పరిగణనలోకి తీసుకోకపోవచ్చని అభిప్రాయపడ్డాడు.
కాగా 2009లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన 37 ఏళ్ల జడేజా.. ఇప్పటి వరకు 91 టెస్టులు, 212 వన్డేలు, 74 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 4160 పరుగులు చేసిన జడ్డూ.. 356 వికెట్లు కూడా పడగొట్టాడు. ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వన్డేల్లో 2905 రన్స్ చేయడంతో పాటు 234 వికెట్లు తీశాడు.
వన్డేలతో పాటు టెస్టుల్లోనూ
ఇక 2024లో టీ20 ప్రపంచకప్ టోర్నీలో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికాడు జడ్డూ. టీమిండియా తరఫున టీ20లలో 515 పరుగులు చేయడంతో పాటు.. 54 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం వన్డేలతో పాటు టెస్టుల్లోనూ జడ్డూ కొనసాగుతున్నాడు.
జడ్డూ చివరగా ఈ ఏడాది శ్రీలంక పర్యటనలో టెస్టు, ఇటీవల స్వదేశంలో వెస్టిండీస్‌తో రెండో వన్డేలో ఆడాడు. అయితే, న్యూజిలాండ్‌తో తలపడే రెండు వన్డే జట్లలోనూ జడ్డూకు చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో పుజారా IANSతో మాట్లాడుతూ.. జడ్డూ వన్డే కెరీర్ దాదాపు ముగిసిపోయినట్లే అన్నాడు.
అక్షర్ పటేల్ ప్రధాన ఆల్‌రౌండర్
‘‘ఒకవేళ యాజమాన్యం గనుక రవీంద్ర జడేజా అవసరం జట్టుకు ఉందని భావిస్తే తప్పకుండా న్యూజిలాండ్ పర్యటనకు ఎంపిక చేసేది. ఇప్పటికే అతడికి కూడా సెలక్టర్లు విషయం చెప్పేసి ఉంటారు. ప్రస్తుతం వన్డే క్రికెట్‌లో అక్షర్ పటేల్ ప్రధాన ఆల్‌రౌండర్.
జడ్డూ ఖేల్ ఖతమే
అతడికి ఎక్కువ అవకాశాలు రావడం సహజమే. జడ్డూ వయసు కూడా పెరుగుతోంది. కాబట్టి కేవలం టెస్టు క్రికెట్‌కు మాత్రమే పరిమితం కావాలని యాజమాన్యం చెప్పి ఉంటుంది. వైట్‌బాల్ క్రికెట్‌లో అతడికి ఇకపై ప్రాధాన్యం ఉండబోదు.
టెస్టుల మీదే దృష్టి సారించాల్సి ఉంది. వన్డే వరల్డ్‌కప్-2027 ప్రణాళికల్లో జడ్డూ లేడనే చెప్పవచ్చు. ఎవరైనా గాయపడితే తప్ప జడేజా మళ్లీ వన్డే జట్టులోకి వచ్చే అవకాశం లేదు’’ అని ఛతేశ్వర్ పుజారా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
ఇవీ చదవండి: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. భారత జట్టులో కీలక మార్పు
సౌతాఫ్రికా పేసర్ వరల్డ్ రికార్డు.. సరికొత్త చరిత్ర


