పబ్లిక్‌ హాలిడే ప్రకటించండి!.. పాక్‌ ప్రధానిపై సెటైర్లు | Pakistan PM Shehbaz Sharif Trolled For Celebrating Win Over India In Hong Kong Sixes 2026, Netizens Says Declare Public Holiday | Sakshi
Sakshi News home page

మ్యాచ్‌ గెలిచాం.. పబ్లిక్‌ హాలిడే ప్రకటించండి!.. పాక్‌ ప్రధానిపై సెటైర్లు

Oct 31 2026 3:04 PM | Updated on Oct 31 2026 3:30 PM

Declare Holiday Pakistan PM Trolled For Post Win On Team India

PC: X

పాకిస్తాన్‌ ప్రధాని షెబాజ్‌ షరీఫ్‌పై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్‌ వస్తున్నాయి. గల్లీ మ్యాచ్‌లకు కూడా ఆనందపడటం ఏమిటో అంటూ నెటిజన్లు ఆయనపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. విజయానికి గుర్తుగా పబ్లిక్‌ హాలిడే ప్రకటించేయండి అంటూ సెటైర్లు వేస్తున్నారు.

అసలేం జరిగిందంటే.. హాంకాంగ్‌ సిక్సెస్‌-2026 టోర్నీకి శుక్రవారం తెరలేచిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గ్రూప్‌-‘సి’లో ఉన్న పాక్‌ జట్టు తొలుత యూఏఈతో తలపడి వికెట్‌ తేడాతో ఓటమిపాలైంది. అనంతరం భారత్‌తో మ్యాచ్‌లో మాత్రం నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది.

అభినందనలు అబ్బాయిలు
ఈ నేపథ్యంలో పాక్‌ ప్రధాన షెబాజ్‌ షరీఫ్‌ సోషల్‌ మీడియా వేదికగా తమ జట్టును అభినందించారు. ‘‘అభినందనలు అబ్బాయిలు. హాంకాంగ్‌ సిక్సెస్‌ 2026 ఓపెనింగ్‌ మ్యాచ్‌లో ఇండియాపై నాలుగు వికెట్ల తేడాతో గెలిచినందుకు కంగ్రాట్స్‌.

పీసీబీ చైర్మన్‌ మోసిన్‌ నక్వీని కూడా అభినందిస్తున్నా. ఆటగాళ్లకు మద్దతుగా ఉంటూ.. అడుగడుగునా ప్రోత్సహించడం గొప్ప విషయం’’ అంటూ షెబాజ్‌ ప్రశంసలు కురిపించారు. నిజానికి పాక్‌ తొలి మ్యాచ్‌లో యూఏఈ చేతిలో ఓడిపోగా.. భారత్‌తో తమ జట్టు తొలి మ్యాచ్‌ ఆడి గెలిచిందని షెబాజ్‌ పప్పులో కాలేశారు.

పబ్లిక్‌ హాలిడే ప్రకటించండి!
ఈ నేపథ్యంలో నెటిజన్లు ఆయనపై తీవ్రస్థాయిలో ట్రోల్‌ చేస్తున్నారు. ‘‘గల్లీ క్రికెట్‌ మాదిరి ఆరు ఓవర్ల ఆటలో గెలిచినందుకు ప్రధాని ఇంత సంబరపడిపోతున్నారా!.. ఇంకా నయం ఐసీసీ టోర్నీలో గనుక పాక్‌ జట్టు గెలుపొందితే ఇంకేం చేసేవారో!.. మీ జట్టు గల్లీ మ్యాచ్‌లో గెలిచినందుకు పబ్లిక్‌ హాలీడే ఇచ్చేయండి’’ అంటూ నెటిజన్లు షెబాజ్‌ షరీఫ్‌ను ట్రోల్‌ చేస్తున్నారు. 

ఇదీ చదవండి: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌.. భారత జట్టులో కీలక మార్పు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement