యూఏఈ సంచలన విజయం (PC: Hong Kong Sixes X)
హాంకాంగ్ సిక్సెస్-2026 టోర్నమెంట్‌లో పాకిస్తాన్‌కు ఘోర పరాభవం ఎదురైంది. పసికూన యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) చేతిలో వికెట్ తేడాతో పాక్ ఓటమిపాలైంది. మోంగ్‌కాక్ వేదికగా హాంకాంగ్ సిక్సెస్ తాజా ఎడిషన్ శుక్రవారం మొదలైంది.
గ్రూప్- ‘సి’లో భాగంగా పాకిస్తాన్- యూఏఈతో తలపడింది. మిషన్ రోడ్ గ్రౌండ్‌లో టాస్ గెలిచిన పాక్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లలో ఖవాజా నఫాయ్ (3) విఫలం కాగా.. అబ్దుల్ సమద్ (15 బంతుల్లో 30 నాటౌట్) అదరగొట్టాడు.
పాక్ కెప్టెన్ మెరుపులు.. 13 బంతుల్లోనే
ఇక కెప్టెన్ అబ్బాస్ ఆఫ్రిది ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 13 బంతుల్లోనే ఒక ఫోర్, ఎనిమిది సిక్సర్ల సాయంతో ఏకంగా.. 407కు పైగా స్ట్రైక్‌రేటుతో 53 పరుగులు రాబట్టాడు. అబ్బాస్ రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరగగా.. ఇర్ఫాన్ ఖాన్ (8) నిరాశపరిచాడు.
ఫలితంగా నిర్ణీత ఆరు ఓవర్లలో పాకిస్తాన్ రెండు వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. యూఏఈ బౌలర్లలో ముహమ్మద్ ఫారూక్, మరూఫ్ మర్చంచ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన యూఏఈ అనూహ్య రీతిలో విజయం సాధించింది.
That's how you get the job done! 🏏🇦🇪 #TurnItUpToSix #HongKongSixes #M品牌活動#大型體育活動事務委員會#政府資助計劃 #MMarkEvents #MajorSportsEventsCommittee https://t.co/3AphyVbIuj
— Cricket Hong Kong, China (@CricketHK) October 30, 2026
యూఏఈ సారథి విధ్వంసం
ఓపెనర్, కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ ఖలీద్ షా కనీవినీ ఎరుగని రీతిలో విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. కేవలం 20 బంతుల్లోనే 3 ఫోర్లు, 9 సిక్సర్లు బాది 71 పరుగులు సాధించాడు.
మరో ఓపెనర్ అన్ష్ టాండన్ డకౌట్ కాగా.. ముహ్మద్ జుహైబ్ 7, మరూఫ్ మర్చంచ్ 2 పరుగులే చేశారు. ఆఖర్లో జహీద్ అలీ 8 బంతుల్లోనే 22 పరుగులు చేసి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.
ఈ క్రమంలో నిర్ణీత ఆరు ఓవర్లలో యూఏఈ ఐదు వికెట్లు మాత్రమే నష్టపోయి 109 పరుగులు చేసింది. ఫలితంగా వికెట్ తేడాతో గెలిచి.. డిఫెండింగ్ చాంపియన్ పాకిస్తాన్‌కు దిమ్మతిరిగేలా షాకిచ్చింది. అయితే, ఇదే రోజు టీమిండియాతో మ్యాచ్‌లో మాత్రం పాకిస్తాన్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా గ్రూప్-‘సి’ నుంచి అగ్రస్థానంలో నిలిచింది.
ఇవీ చదవండి: IND vs NZ: అర్ష్‌దీప్ సింగ్ ప్రపంచ రికార్డు
వాళ్లకు జాగ్రత్తగా బౌలింగ్ చేయాలి.. లేదంటే అంతే: కివీస్ కెప్టెన్


