హాంగ్‌కాంగ్‌లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. అక్కడ హాంకాంగ్ తెలుగు సమాఖ్య (THKTS) ఆడపడుచులు తెలంగాణ బతుకమ్మ పండుగను ఉత్సాహభరితంగా జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ప్రతి ఏడాది బతుకమ్మ పండుగను నిర్వహించడం ఈ సమాఖ్యకు ఒక అందమైన సంప్రదాయంగా మారింది. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల ఆడపడుచులు విభిన్న రకాల బతుకమ్మలను తయారు చేసి, తుంగ్‌చుంగ్ ప్రామినాడ్ వద్ద పాటలు పాడుతూ బతుకమ్మను సాగనంపారు.
ఈ ఏడాది వేడుకలో ప్రత్యేకత ఏమిటంటే—హాంకాంగ్ తమ పిల్లల వద్దకు వచ్చిన తల్లిదండ్రులను, వారు ఇక్కడ తక్కువ కాలం మాత్రమే ఉన్నప్పటికీ, సంతోషంగా ఉంచేందుకు సమాఖ్య వ్యవస్థాపకురాలు “జాలీ గుడ్ మైత్రీవనం” అనే ఒక వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. ఈ గ్రూప్ ద్వారా శ్రేయస్సు, వినోదం, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ వారందర్నీ చురుకుగా అనుసంధానిస్తున్నారు.

“జాలీ గుడ్ మైత్రీవనం”లోని పెద్దలు (సీనియర్ సిటిజన్స్) కూడా ఆసక్తిగా పాల్గొన్నారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారు బతుకమ్మ పండుగలో పాల్గొని, దాని ఆచారాలు, సంప్రదాయాలను తెలుసుకున్నారు. ఈ పండుగలోని సాంస్కృతిక వైభవం వారిని ఆకట్టుకుంది.
ఇదీ చదవండి: కెనడాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు


