కెనడాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు | Bathukamma Celebrations In Brampton Canada | Sakshi
Sakshi News home page

కెనడాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Oct 21 2026 7:48 AM | Updated on Oct 21 2026 7:50 AM

Bathukamma Celebrations In Brampton Canada

టొరంటో: తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (TDF) కెనడా ఆధ్వర్యంలో కెనడాలోని బ్రాంప్టన్ నగరంలో బతుకమ్మ పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఎన్నారైల నుంచి విశేష స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో ప్రవాస తెలంగాణవాసులు తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరై ఆటపాటలతో బతుకమ్మ పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను ప్రతిబింబించేలా TDF కెనడా నిర్వాహకులు వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేశారు. తెలంగాణ సంప్రదాయ బతుకమ్మ సంబరాలతోపాటు, ప్రత్యేక తెలంగాణ వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. విదేశీ గడ్డపై తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పేలా ఈ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య కొనసాగాయి. ఈ కార్యక్రమంలో టీడీఎఫ్ కెనడా అధ్యక్షుడు జితేందర్ రెడ్డి గార్లపాటి, ఫౌండేషన్ కమిటీ చైర్మన్ అమితా పినికేసి, జనరల్ సెక్రటరీ వెంకట్ రెడ్డి పోలు, టీడీఎఫ్ కెనడా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గంటా మాణిక్ రెడ్డి స్మారక విశేష సేవా పురస్కారాన్ని వెంకట్ రమణా రెడ్డి మేడ, శాంతా దంపతులకు టీడీఎఫ్‌ కెనడా కమిటీ తరఫున అందజేశారు. టీడీఎఫ్ కెనడా నిర్వహిస్తున్న బతుకమ్మ సంబరాలకు గత 22 సంవత్సరాలుగా అందిస్తున్న సహకారం, సేవలను గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.

గత 22 సంవత్సరాలుగా బతుకమ్మ సంబరాలను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ టీడీఎఫ్‌ కెనడా కమిటీ కృతజ్ఞతలు తెలిపింది. భవిష్యత్తులోనూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేస్తూ, ప్రవాస తెలంగాణవాసుల మధ్య ఐక్యతను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు, ప్రవాస తెలంగాణవాసులకు టీడీఎఫ్‌ కెనడా కమిటీ దసరా శుభాకాంక్షలు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement