న్యూజిలాండ్‌ కెప్టెన్ వరల్డ్‌ రికార్డు | Mitchell Santner Breaks Record For Most Wickets Against India In T20Is | Sakshi
Sakshi News home page

IND vs NZ: న్యూజిలాండ్‌ కెప్టెన్ వరల్డ్‌ రికార్డు

Oct 30 2026 6:51 PM | Updated on Oct 30 2026 7:04 PM

Mitchell Santner Breaks Record For Most Wickets Against India In T20Is

సొంత‌గ‌డ్డ‌పై టీమిండియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్ ఎట్ట‌కేల‌కు గెలుపు రుచి చూసింది. శుక్ర‌వారం అక్లాండ్ వేదిక‌గా జ‌రిగిన నాలుగో టీ20లో భార‌త్‌పై 87 ప‌రుగుల తేడాతో కివీస్ ఘ‌న విజ‌యం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 7 వికెట్ల న‌ష్టానికి 259 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది.

కివీస్ సూప‌ర్ మేన్ గ్లెన్ ఫిలిప్స్‌(107) భారీ సెంచ‌రీతో క‌దం తొక్కాడు. భార‌త బౌల‌ర్ల‌లో మ‌యాంక్ యాద‌వ్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు.  అనంత‌రం 260 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 172 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. కివీస్ బౌలింగ్ యూనిట్‌లో జాక‌బ్ డ‌ఫీ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. కెప్టెన్ మిచెల్ శాంట్న‌ర్‌, మాథ్యూ ఫిష‌ర్ త‌లా రెండు వికెట్లు సాధించారు. ఈ క్ర‌మంలో శాంట్న‌ర్ ఓ అరుదైన రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు.

శాంట్న‌ర్ సరికొత్త చ‌రిత్ర‌
టీ20ల్లో భార‌త్‌పై అత్య‌ధిక వికెట్లు ప‌డ‌గొట్టిన బౌల‌ర్‌గా శాంట్న‌ర్ వ‌ర‌ల్డ్ రికార్డు సృష్టించాడు. అతడు ఇప్పటివరకు టీమిండియాపై 31 వికెట్లు తీశాడు. ఇంతకముందు ఈ రికార్డు తన సహచర ఆటగాడు ఇష్ సోధి(30) పేరిట ఉండేది. తాజా ప్రదర్శనతో సోధి ఆల్‌టైమ్ రికార్డును శాంట్నర్ బ్రేక్ చేశాడు.

భారత్‌పై అత్యధిక టీ20 వికెట్లు తీసిన బౌలర్లు
31 మిచెల్ సాంట్నర్
30 ఇష్ సోధి
24 క్రిస్ జోర్డాన్
22 జోఫ్రా ఆర్చర్/ఆదిల్ రషీద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement