అత‌డే మా కొంప‌ముంచాడు.. బ్యాటింగ్‌కు నేను ఫ్యాన్ అయిపోయా: శ్రేయస్‌ | Shreyas Iyer blames bowlers after Indias defeat against New Zealand | Sakshi
Sakshi News home page

అత‌డే మా కొంప‌ముంచాడు.. బ్యాటింగ్‌కు నేను ఫ్యాన్ అయిపోయా: శ్రేయస్‌

Oct 30 2026 5:32 PM | Updated on Oct 30 2026 5:57 PM

Shreyas Iyer blames bowlers after Indias defeat against New Zealand

న్యూజిలాండ్ ప‌ర్య‌ట‌న‌లో టీమిండియాకు తొలి ఓట‌మి ఎదురైంది. శుక్ర‌వారం అక్లాండ్ వేదిక‌గా జ‌రిగిన నాలుగో టీ20లో 87 ప‌రుగుల తేడాతో భార‌త్ ఓట‌మి పాలైంది. కివీస్ నిర్ధేశించిన 260 ప‌రుగుల ల‌క్ష్యాన్ని చేధించలేక భార‌త జ‌ట్టు చ‌తిక‌ల ప‌డింది. బ్లాక్‌క్యాప్స్ బౌల‌ర్ల ధాటికి టీమిండియా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 172 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. 

కివీస్ సూప‌ర్ స్టార్ గ్లెన్ ఫిలిప్స్‌(107) భారీ సెంచ‌రీతో చెల‌రేగ‌గా.. భార‌త్ నుంచి ఒక్క‌రు కూడా క‌నీసం హాఫ్ సెంచ‌రీ కూడా సాధించ‌లేక‌పోయారు. న్యూజిలాండ్‌ స్పీడ్ స్టార్ జాక‌బ్ డ‌ఫీ నాలుగు వికెట్ల‌తో భార‌త జ‌ట్టును దెబ్బ‌తీశాడు. ఇక ఈ ఓట‌మిపై మ్యాచ్ అనంత‌రం టీమిండియా కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ స్పందించాడు. బౌలింగ్‌, బ్యాటింగ్ రెండింటిలోనూ త‌మ స్దాయికి త‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేక‌పోయామ‌ని శ్రేయ‌స్ చెప్పుకొచ్చాడు.

"తొలుత బౌలింగ్‌లో మేము విఫ‌ల‌మయ్యాం. ముఖ్యంగా పవర్‌ప్లేలోని మూడో ఓవర్ నుంచే న్యూజిలాండ్ జట్టు ఊపందుకుంది. ఆ త‌ర్వాత‌ మా బౌలర్లు మ్యాచ్‌ను కంట్రోల్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ, గ్లెన్ ఫిలిప్స్ త‌న అద్భుత ఇన్నింగ్స్‌తో మాకు అవ‌కాశమివ్వ‌లేదు.

అత‌డు ఆడిన కొన్ని షాట్లు నన్ను ఆశ్చ‌ర్య‌ప‌రిచాయి. నిజంగా అత‌డొక అద్భుతం.  ఈ సిరీస్ అసాంతం అత‌డు నిల‌క‌డ‌గా రాణించాడు.  అతడి నుంచి మేము నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మేము ఎక్కడ తప్పిదాలు చేశామో హామిల్ట‌న్‌కు వెళ్లేముందు ఖచ్చితంగా చ‌ర్చిస్తాం. 

త‌దుప‌రి మ్యాచ్‌లో  మా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు అన్ని విధాల ప్ర‌య‌త్నిస్తాం.  అక్లాండ్ మైదానంలో బౌండ‌రీలు చాలా చిన్న‌విగా ఉంటాయి. ఆ విష‌యం మాకు ముందే తెలుసు. కానీ  మా జట్టులోని కొందరు ఆటగాళ్లకు ఇలాంటి మైదానాల్లో ఆడటం ఇదే తొలిసారి. కాబట్టి ఈ వాతావరణానికి, సవాళ్లకు అలవాటు పడటానికి కొంత సమయం పడుతుంది. 

మొద‌టి మూడు మ్యాచ్‌ల‌లో మా బాయ్స్ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచారు. ఈ ప‌ర్య‌ట‌న నుంచి యువ ఆట‌గాళ్లు చాలా విష‌యాలు నేర్చుకుంటారు. మ‌రోసారి ఇక్క‌డికి వచ్చినప్పుడు ఏ విధంగా ఆడాలనే దానిపై స్పష్టమైన అవగాహన ఉంటుంది" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేష‌న్‌లో అయ్య‌ర్ పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement