అర్ష్‌దీప్‌ సింగ్‌ ప్రపంచ రికార్డు | Arshdeep Singh scripts history, becomes first Indian to 150 T20I wickets | Sakshi
Sakshi News home page

IND vs NZ: అర్ష్‌దీప్‌ సింగ్‌ ప్రపంచ రికార్డు

Oct 30 2026 3:01 PM | Updated on Oct 30 2026 4:08 PM

Arshdeep Singh scripts history, becomes first Indian to 150 T20I wickets

PC: BCCI/X

అక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న నాలుగో టీ20లో టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన అర్ష్‌దీప్ 38 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. తద్వారా ఒక క్యాలెండర్ ఈయర్‌లో టీ20ల్లో ఐసీసీ ఫుల్ మెంబర్ టీమ్ తరపున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా అర్ష్‌దీప్ వరల్డ్ రికార్డు సృష్టించాడు.

ఈ ఏడాది అర్ష్‌దీప్ ఇప్పటివరకు 40 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఐర్లాండ్ పేసర్ జోష్ లిటిల్ పేరిట ఉండేది. 2022 క్యాలెండర్ ఇయర్‌లో జోష్ లిటిల్ 39 వికెట్లు తీశాడు. తాజా మ్యాచ్‌తో లిటిల్ ఆల్‌టైమ్ రికార్డును ఈ పంజాబ్ పేసర్ బ్రేక్ చేశాడు.

అదేవిధంగా అర్ష్‌దీప్ మరో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో  150 వికెట్ల మైలురాయిని అందుకున్న తొలి భారత బౌలర్‌గా అర్ష్‌దీప్ రికార్డులకెక్కాడు. 103 మ్యాచ్‌ల్లో అతడు ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. అయితే అత్యంత వేగంగా ఈ ఫీట్‌ను అందుకున్న మూడో బౌలర్‌గా అర్ష్‌దీప్(2143 బంతులు) నిలిచాడు. ఈ జాబితాలో శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగా(2035) అగ్రస్దానంలో ఉన్నాడు.

ఒక క్యాలెండర్ ఈయర్‌లో అత్యధిక టీ20 వికెట్లు పడగొట్టిన బౌలర్లు
40 అర్షదీప్ సింగ్ (2026)
39 జోష్ లిటిల్ (2022)
38 వనిందు హసరంగ (2024)
37 భువనేశ్వర్ కుమార్ (2022)

అత్యంత తక్కువ బంతుల్లో 150 వికెట్లు అందుకున్న ప్లేయర్లు వీరే
2035 వనిందు హసరంగా
2098 రషీద్ ఖాన్
2143 అర్ష్‌దీప్ సింగ్
2320 ఎహ్సాన్ ఖాన్
చదవండి: సికందర్‌ రజా ప్రపంచ రికార్డు.. సరికొత్త చరిత్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement