ప్రసిద్- సిరాజ్- నితీశ్ (PC: BCCI)
టీమిండియా ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉంది. ఇప్పటికే ఐదు టీ20 సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న భారత్.. 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది. ఆక్లాండ్, హామిల్టన్‌లో మిగిలిన రెండు నామమాత్రపు టీ20 మ్యాచ్‌ల తర్వాత కివీస్‌తో నవంబరు 4 నుంచి వన్డే సిరీస్ మొదలుపెడుతుంది.
ఇంకొన్నాళ్లు విశ్రాంతి
ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక ప్రకటన విడుదల చేసింది. పేసర్ ప్రసిద్ కృష్ణ న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు దూరమైనట్లు ప్రకటించింది. ఈ కర్ణాటక బౌలర్ పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించలేదని.. అందుకే సిరీస్ మొత్తానికి అందుబాటులో ఉండడని శుక్రవారం తెలిపింది. ఈ రైటార్మ్ పేసర్ తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడని.. అతడికి ఇంకొన్నాళ్లు విశ్రాంతి అవసరమని పేర్కొంది.
రెండో అనధికారిక టెస్టుకు సిరాజ్.. మూడో మ్యాచ్‌కు నితీశ్
ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్- ‘ఎ’ జట్టుతో భారత్- ‘ఎ’ జట్టు మూడు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్‌లో తలపడుతున్న సంగతి తెలిసిందే. ధ్రువ్ జురెల్ సారథ్యంలో తొలి అనధికారిక టెస్టును డ్రా చేసుకున్న భారత్.. అక్టోబరు 31 నుంచి రెండో మ్యాచ్ మొదలుపెట్టనుంది.
భారత్- ‘ఎ’ జట్టులోకి ప్రసిద్
ఈ నేపథ్యంలో టీమిండియా సీనియర్ పేసర్, హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ కివీస్- ‘ఎ’ జట్టుతో రెండో అనధికారిక టెస్టులో భాగమవుతాడని బీసీసీఐ ప్రకటించింది. అదే విధంగా.. ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి మూడో అనధికారిక టెస్టు కోసం భారత్- ‘ఎ’ జట్టుతో చేరతాడని తెలిపింది. అంతేకాదు మొదటి వన్డేకు మాత్రమే అతడు అందుబాటులో ఉంటాడని తెలిపింది.
ఇక ప్రసిద్ కృష్ణ సైతం ఫిట్‌నెస్ పరీక్ష తర్వాత పూర్తి స్థాయిలో కోలుకున్నట్లు తేలితే కివీస్- ‘ఎ’తో మూడో మ్యాచ్ కోసం జట్టులోకి వస్తాడని యాజమాన్యం తెలిపింది.
న్యూజిలాండ్-‘ఎ’ జట్టుతో రెండో అనధికారిక టెస్టు కోసం భారత్- ‘ఎ’ జట్టు (అప్‌డేటెడ్)
యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, యశ్ రాథోడ్, ఆర్. స్మరణ్, ధ్రువ్ జురెల్ (కెప్టెన్, వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, శిఖర్ మోహన్, ముకేష్ చౌదరి, ముకేష్ కుమార్, మానవ్ సుతార్, కుమార్ కుషాగ్రా (వికెట్ కీపర్).
న్యూజిలాండ్‌తో మొదటి మూడు వన్డేలకు భారత జట్టు (అప్‌డేటెడ్)
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, నమన్ ధీర్, అన్షుల్ కాంబోజ్, గుర్నూర్ బ్రార్, రుతురాజ్ గైక్వాడ్, అర్ష్‌దీప్ సింగ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, నితీశ్ రెడ్డి (మొదటి వన్డేకు మాత్రమే)
న్యూజిలాండ్‌తో నాలుగు, ఐదో వన్డేలకు భారత జట్టు (అప్‌డేటెడ్)
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్, వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, నమన్ ధీర్,ఘాకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్, రుతురాజ్ గైక్వాడ్, అర్ష్‌దీప్ సింగ్, కుమార్ కుషాగ్రా (వికెట్ కీపర్), మహ్మద్ సిరాజ్, యశ్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్.
ఇవీ చదవండి: చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్
అతడి కోసం త్యాగం చేశాడు.. సంజూ భయ్యా గొప్పోడు: అభిషేక్


