చరిత్రకు అడుగు దూరంలో అర్ష్‌దీప్ | IND vs NZ, 4th T20I: Arshdeep Singh set to create history | Sakshi
Sakshi News home page

చరిత్రకు అడుగు దూరంలో అర్ష్‌దీప్

Oct 29 2026 9:09 PM | Updated on Oct 29 2026 9:09 PM

IND vs NZ, 4th T20I: Arshdeep Singh set to create history

source: X

టీమిండియా స్టార్‌ పేసర్‌ అర్ష్‌దీప్ సింగ్ చరిత్ర సృష్టించేందుకు అడుగుదూరంలో ఉన్నాడు. రేపు న్యూజిలాండ్‌తో జరుగబోయే నాలుగో టీ20లో ఓ వికెట్‌ తీస్తే, అంతర్జాతీయ టీ20ల్లో 150 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా, ప్రపంచవ్యాప్తంగా తొమ్మిదో బౌలర్‌గా రికార్డు నెలకొల్పుతాడు.

అర్షదీప్‌కు ముందు రషీద్‌ ఖాన్‌ (199), ఆదిల్‌ రషీద్‌ (171), ఎహసాన్‌ ఖాన్‌ (165), ఐష్‌ సోది (165), సౌధీ (164), హసరంగ (163), ముస్తాఫిజుర్‌ (163), జంపా (153) అంతర్జాతీయ టీ20ల్లో 150 వికెట్ల మైలురాయిని తాకారు.

ఇప్పటివరకు 102 టీ20లు ఆడిన అర్షదీప్‌ 149 వికెట్లు ఖాతాలో కలిగి ఉన్నాడు. ఇప్పటికే అతడు భారత్‌ తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చలామణి అవుతున్నాడు. అర్షదీప్‌ తర్వాత భారత్‌ తరఫున అత్యధిక టీ20 వికెట్లు తీసిన బౌలర్లుగా జస్ప్రీత్‌ బుమ్రా (126), అక్షర్‌ పటేల్‌ (115), హార్దిక్‌ పాండ్యా (114) ఉన్నారు.

వరల్డ్‌ రికార్డు
న్యూజిలాండ్‌తో మూడో టీ20లో అర్ష్‌దీప్ ఓ ప్రపంచ రికార్డు కూడా నెలకొల్పాడు. ఆ మ్యాచ్‌లో ఒక వికెట్ పడగొట్టిన అతడు.. ఓ క్యాలెండర్ ఇయర్‌లో (టెస్టు హోదా కలిగిన దేశాల బౌలర్లలో) అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఐర్లాండ్ పేసర్ జాషువ లిటిల్‌తో కలిసి అగ్రస్థానంలో నిలిచాడు.

2022లో లిటిల్ 39 వికెట్లు పడగొట్టగా.. అర్షదీప్‌ ఈ ఏడాది 30 మ్యాచ్‌ల్లో అన్నే వికెట్లు సాధించాడు. అర్షదీప్‌ ఈ ఏడాది మరిన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉండటంతో సోలోగా ఈ ప్రపంచ రికార్డును సొంతం చేసుకోవచ్చు.

ఇదిలా ఉంటే, న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్‌ ఇప్పటికే 3-0తో కైవసం చేసుకుంది. రేపు ఆక్లాండ్‌లో జరుగబోయే నాలుగో టీ20 కూడా గెలిచి తమ ఆధిపత్యాన్ని మరిం​త పెంచుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. 

ఇదీ చదవండి: 8 వికెట్లతో సత్తాచాటిన తనీష్‌.. ముంబైకి హ్యాట్రిక్‌ విజయం


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement