కృనాల్ పాండ్యా (PC: BCCI/X)
హాంకాంగ్ సిక్సెస్-2026 టోర్నమెంట్కు ఎంపిక చేసిన భారత జట్టు కెప్టెన్సీలో మార్పు చోటు చేసుకుంది. కెప్టెన్గా భువనేశ్వర్ కుమార్ స్థానాన్ని కృనాల్ పాండ్యా భర్తీ చేశాడు. కాగా ఐపీఎల్లో గత రెండు సీజన్లలో సత్తా చాటి ఆర్సీబీ వరుసగా రెండుసార్లు టైటిళ్లు గెలవడంలో భువీ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
టీమిండియాలో రీఎంట్రీ
ఈ నేపథ్యంలో నాలుగేళ్ల తర్వాత భువీకి తిరిగి టీమిండియా సెలక్టర్ల నుంచి పిలుపువచ్చింది. న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు ఈ వెటరన్ పేస్ బౌలర్ ఎంపికయ్యాడు. అయితే, అంతకంటే ముందే ఈ యూపీ పేసర్ రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.
తప్పుకొన్న భువీ..
వెస్టిండీస్తో బెంగళూరులో ఆఖరిదైన ఐదో టీ20కి ముందు అర్ష్దీప్ సింగ్ గాయపడగా.. భువీని జట్టులో చేర్చింది యాజమాన్యం. కాగా అంతకంటే ముందు హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో పాల్గొనే భారత జట్టుకు భువనేశ్వర్ కుమార్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. అయితే, అతడు టీమిండియాతో చేరడంతో.. ఈ టోర్నీ నుంచి తప్పుకొన్నాడు.
కుల్వంత్ ఖేజ్రోలియాకు చోటు
ఈ నేపథ్యంలో భువీ స్థానంలో కొత్త కెప్టెన్గా ఆల్రౌండర్, మరో ఆర్సీబీ ప్లేయర్ కృనాల్ పాండ్యా ప్రమోషన్ పొందగా.. గుజరాత్ టైటాన్స్ స్టార్ కుల్వంత్ ఖేజ్రోలియా జట్టులోకి వచ్చాడు.
కాగా ఇరుజట్లు ఆరు ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసే హాంకాంగ్ సిక్సెస్ టోర్నీకి అంతర్జాతీయ క్రికెట్ మండలి గుర్తింపు ఉంది. మోంగ్ కాక్ వేదికగా అక్టోబరు 30- నవంబరు 1 మధ్య హాంకాంగ్ సిక్సెస్ టోర్నీకి షెడ్యూల్ ఖరారైంది. కాగా గత సీజన్లో భారత జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించి చేదు అనుభవం మూటగట్టుకుంది.
హాంకాంగ్ సిక్సెస్-20260 టోర్నీకి భారత జట్టు (అప్డేటెడ్)
కృనాల్ పాండ్యా (కెప్టెన్), నితీశ్ రాణా, శశాంక్ సింగ్, టి.నటరాజన్, రాహుల్ త్రిపాఠి, రాహుల్ తెవాటియా, కుల్వంత్ ఖేజ్రోలియా.
ఇదీ చదవండి: అతడికి అన్యాయం: టీమిండియా సెలక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్


