అతడికి అన్యాయం: టీమిండియా సెలక్టర్లపై మండిపడ్డ దిగ్గజం | R Ashwin Slams Selectors For Ignoring Yashasvi Jaiswal In India’s New Zealand ODI Squad And Calls It Unfair, Read Full Story For Details | Sakshi
Sakshi News home page

అతడికి అన్యాయం: టీమిండియా సెలక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్‌

Oct 17 2026 9:48 AM | Updated on Oct 17 2026 10:49 AM

It Is Very Unfair: R Ashwin Lambasts Selectors For Jaiswal ODI Snub

PC: BCCI X

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) రెండు జట్లను ఎంపిక చేసింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌లకు శుబ్‌మన్‌ గిల్‌ సారథ్యంలోని జట్టు కివీస్‌తో తలపడనుండగా.. మిగిలిన రెండు మ్యాచ్‌లలో శ్రేయస్‌ అయ్యర్‌ వన్డే జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.

యశస్వి జైస్వాల్‌కు మొండిచేయి
అయితే, ఈ రెండు జట్లలోనూ టీమిండియా స్టార్‌ ఓపెనర్‌, టెస్టు స్పెషలిస్టు యశస్వి జైస్వాల్‌కు చోటు దక్కలేదు. స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో ఈ ఏడాది జూన్‌లో జరిగిన సిరీస్‌ సందర్భంగా జైసూ భారత్‌ తరఫున చివరి వన్డే ఆడాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మకు ఓపెనింగ్‌ జోడీగా వచ్చి అజేయ శతకం (86 బంతుల్లో 110 నాటౌట్‌)తో రాణించాడు.

అయినప్పటికీ న్యూజిలాండ్‌తో ఆడే రెండో వన్డే జట్టులోనైనా చోటు యశస్వి జైస్వాల్‌కు చోటు దక్కలేదు. శుబ్‌మన్‌ గిల్‌ ఈ మ్యాచ్‌లకు దూరం కాగా.. వైస్‌ కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ రోహిత్‌ శర్మకు జోడీగా వచ్చే అవకాశం ఉంది. ఇక బ్యాకప్‌ ఓపెనర్‌గా రుతురాజ్‌ గైక్వాడ్‌ రెండు జట్లకు ఎంపికయ్యాడు.

సెలక్టర్ల తీరుపై ఆగ్రహం
ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ సెలక్టర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కివీస్‌తో సిరీస్‌కు యశస్వి జైస్వాల్‌ను ఎంపిక చేయకపోవడాన్ని తప్పుబట్టాడు. ఈ మేరకు తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా మాట్లాడుతూ.. ‘‘న్యూజిలాండ్‌తో చివరి రెండు వన్డేలకు శుబ్‌మన్‌ గిల్‌ దూరమైనపుడు.. యశస్వి జైస్వాల్‌కు కచ్చితంగా జట్టులో ఇవ్వాల్సింది.

కానీ దురదృష్టవశాత్తూ సెలక్టర్లు జైసూను ఎంపిక చేయకుండా.. అతడి ఆత్మవిశ్వాసాన్ని నాశనం చేసే పనికి పూనుకున్నారు. చివరి మ్యాచ్‌లో శతకం బాదినా అతడికి మొండిచేయి చూపారు. నేను కేవలం యశస్వి జైస్వాల్‌ అవకాశాల గురించి మాత్రమే ఇక్కడ మాట్లాడటం లేదు.

ఆ వాదనతో నేనూ అంగీకరిస్తాను.. కానీ
టెస్టుల నేపథ్యంలో శుబ్‌మన్‌ గిల్‌, కేఎల్‌ రాహుల్‌ను రెండో వన్డే జట్టు నుంచి విశ్రాంతినిచ్చారు. జైస్వాల్‌ కూడా టెస్టులు ఆడాలి. అందుకే అతడిని వన్డే జట్టుకు ఎంపిక చేసి ఉండకపోవచ్చనే వాదనతో నేనూ అంగీకరిస్తాను.

అయితే, ఈ నిర్ణయం తీసుకునే ముందు నేనే గనుక సెలక్టర్‌ అయి ఉంటే.. ‘టెస్టులకు ముందు ఈ రెండు వన్డేలు ఉన్నాయి. నువ్వు ఆడగలవా? ఒకవేళ ఆడాలనుకుంటే నీకు అవకాశం ఇస్తాం’ అని యశస్వి జైస్వాల్‌కు చెప్పి ఉండేవాడిని.

అతడికి అన్యాయం
కానీ అతడికి ఈసారి కూడా అవకాశం దక్కలేదు. ఒకప్పుడు అతడు రన్‌మెషీన్‌. ఇప్పుడిలా వరుస సిరీస్‌లకు పక్కనపెట్టి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారు. 

ఇది అన్యాయం. వన్డే వరల్డ్‌కప్‌-2027 తర్వాత రోహిత్‌ శర్మ రిటైర్‌ అయితే అతడికి సరైన ప్రత్యామ్నాయం జైస్వాల్‌ మాత్రమే అనుకుంటే.. వైభవ్‌ సూర్యవంశీ రూపంలో పోటీ ఉంది. అయితే, ఇప్పటికి వైభవ్‌ను కేవలం టీ20లలోనే ఆడిస్తున్నారు. ఏదేమైనా జైస్వాల్‌కు అన్యాయం జరిగింది’’ అని అశ్విన్‌ మండిపడ్డాడు.

ఇవీ చదవండి: IND vs NZ: కివీస్‌తో సిరీస్‌కు భారత వన్డే, టెస్టు జట్ల ప్రకటన
IND vs WI: తుదిజట్టులో దక్కని చోటు.. వైభవ్‌ సూర్యవంశీ పోస్ట్‌ వైరల్‌
Kavya Maran - Anirudh Marriage: ఏజ్‌ గ్యాప్‌, ఇద్దరి ఆస్తుల విలువ ఎంత?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement