IND vs WI: తుదిజట్టులో దక్కని చోటు.. వైభవ్‌ సూర్యవంశీ పోస్ట్‌ వైరల్‌ | IND Vs WI 5th T20I, Vaibhav Sooryavanshi Cryptic Post Goes Viral Amid Gambhir Selection Stance, Read Story For More Details | Sakshi
Sakshi News home page

IND vs WI: తుదిజట్టులో దక్కని చోటు.. వైభవ్‌ సూర్యవంశీ పోస్ట్‌ వైరల్‌

Oct 17 2026 8:53 AM | Updated on Oct 17 2026 11:05 AM

IND vs WI Vaibhav Sooryavanshi Cryptic Post Viral Gambhir Strict PlayingXI Stance

గంభీర్‌తో వైభవ్‌ (PC: BCCI/Instagram)

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో చావో రేవో తేల్చుకునేందుకు టీమిండియా సిద్ధమైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికి ఇరుజట్లు చెరో రెండు గెలిచి.. 2-2తో సమంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగళూరు వేదికగా శనివారం నాటి ఐదో టీ20తో సిరీస్‌ విజేత ఎవరో తేలనుంది.

వాటర్‌ బాయ్‌ సేవలకే పరిమితం
ఈ నేపథ్యంలో టీమిండియా చిచ్చర పిడుగు వైభవ్‌ సూర్యవంశీ సోషల్‌ మీడియా పోస్టు వైరల్‌గా మారింది. కాగా ఇటీవల జపాన్‌ వేదికగా ఆసియా క్రీడలు-2026లో భారత్‌ తరఫున ఆడిన ఈ పదిహేనేళ్ల పిల్లాడు.. వెస్టిండీస్‌తో స్వదేశంలో జరుగుతున్న సిరీస్‌లో పూర్తైన నాలుగు మ్యాచ్‌లలోనూ బెంచ్‌కే పరిమితమయ్యాడు.

భారత టీ20 ఓపెనింగ్‌ జోడీగా సంజూ శాంసన్‌- అభిషేక్‌ శర్మ కొనసాగుతుండటంతో వైభవ్‌ వాటర్‌ బాయ్‌ సేవలకే పరిమితం కావాల్సి వచ్చింది. జపాన్‌లో తాత్కాలిక హెడ్‌కోచ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ మార్గదర్శనంలో వైభవ్‌- అభిషేక్‌ ఓపెనర్లుగా రాగా.. సంజూ వన్‌డౌన్‌లో ఆడాడు.

ఇప్పట్లో అవకాశం ఇవ్వను
అయితే, టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ మాత్రం ఇప్పటికే వైభవ్‌కు తుదిజట్టులో చోటు ఇచ్చే అంశం గురించి కుండబద్దలు కొట్టేశాడు. టీ20 వరల్డ్‌కప్‌-2026 హీరో సంజూతో పాటు ఇతర సీనియర్లకు అవకాశాలు ఇచ్చే క్రమంలో.. ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌ ఇంకొన్నాళ్లు వేచిచూడక తప్పదని పలుమార్లు స్పష్టం చేశాడు.

అందుకు తగినట్లుగానే వైభవ్‌ సూర్యవంశీ విండీస్‌తో సిరీస్‌లో ఇప్పటికి ఒక్క అవకాశం కూడా పొందలేకపోయాడు. మరోవైపు.. సంజూ- అభిషేక్‌ ఈ సిరీస్‌లో నిలకడగా రాణించలేకపోతున్నారు. ఇప్పటి వరకు సంజూ 11, 82, 3, 56.. అభిషేక్‌ 21, 20, 69, 29 పరుగులు చేశారు.

ఇంకా నమ్మకం ఉంది
ఈ క్రమంలో వైభవ్‌ సూర్యవంశీని సిరీస్‌ నిర్ణయాత్మక ఐదో టీ20లోనైనా తప్పక ఆడించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైభవ్‌ సూర్యవంశీ ఇన్‌స్టా స్టోరీలో బ్యాట్‌ ఎత్తిన ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘లక్ష్యం చేరకుంటానని.. ఇంకా నమ్మకం ఉంది’ అని ఎమోజీని షేర్‌ చేశాడు. 

తద్వారా తనకు అవకాశం ఇస్తే.. కచ్చితంగా సిరీస్‌ గెలిపిస్తానని వైభవ్‌ చెప్పకనే చెప్తున్నాడని.. అతడిని బెంగళూరులో ఆడించాలని అభిమానులు గంభీర్‌కు సోషల్‌ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా పదిహేనేళ్ల సూర్యవంశీ.. ఇప్పటికి టీమిండియా తరఫున ఎనిమిది టీ20 మ్యాచ్‌లు ఆడి 186కు పైగా స్ట్రైక్‌రేటుతో 246 పరుగులు చేశాడు. 

మరో‘సారీ’
ఇదిలా ఉంటే.. వెస్టిండీస్‌తో ఆఖరి టీ20లోనూ వైభవ్‌కు మొండిచేయే ఎదురుకానున్నట్లు తెలుస్తోంది. ఓపెనింగ్‌ జోడీగా సంజూ- అభిషేక్‌ కొనసాగనున్నట్లు సమాచారం. ఇక గాయపడిన అర్ష్‌దీప్‌ సింగ్‌ స్థానంలో వెటరన్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ తుదిజట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

వెస్టిండీస్‌తో ఐదో టీ20కి భారత తుదిజట్టు (అంచనా)
శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), సంజూ శాంసన్‌, అభిషేక్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌, తిలక్‌ వర్మ, నమన్‌ ధిర్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, అక్షర్‌ పటేల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, మయాంక్‌ యాదవ్‌, ప్రిన్స్‌​ యాదవ్‌.

ఇవీ చదవండి: చందర్‌పాల్ విధ్వంసం.. సెమీస్‌లో ఆసీస్‌ను చిత్తు చేసిన వెస్టిండీస్‌
Kavya Maran Weds Anirudh: ఏజ్‌ గ్యాప్‌, ఇద్దరి ఆస్తుల విలువ ఎంత?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement