వరల్డ్ ఛాంపియన్స్ ఆఫ్ లెజెండ్స్-2026 టోర్నీలో వెస్టిండీస్ ఛాంపియన్స్ జోరు కొనసాగుతోంది. షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన రెండో సెమీ-ఫైనల్లో ఆస్ట్రేలియా ఛాంపియన్స్‌పై 5 వికెట్ల తేడాతో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. దీంతో ఆదివారం ఇంగ్లండ్‌తో జరగనున్న తుది పోరుకు విండీస్ అర్హత సాధించింది.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ఛాంపియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్లలో జో బర్న్స్(86) హాఫ్ సెంచరీతో సత్తాచాటగా.. వెల్స్(49) రాణించారు. కెప్టెన్ డేవిడ్ వార్నర్(0), షార్ట్(0) తీవ్ర నిరాశపరిచారు. విండీస్ బౌలర్లలో కాట్రెల్ 4 వికెట్లతో చెలరేగాడు.
వాల్టన్ విధ్వంసం
అనంతరం 173 పరుగుల లక్ష్యాన్ని విండీస్ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది. ఈ మ్యాచ్‌లో కూడా చాడ్విక్ వాల్టన్ విధ్వంసం సృష్టించాడు. వాల్టన్ కేవలం 42 బంతుల్లోనే 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 87 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు కరేబియన్ లెజెండ్ శివ్‌నారాయణ్ చందర్‌పాల్ (27 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 41 పరుగులు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆసీస్ బౌలర్లలో కేన్ రిచర్డ్సన్, కౌల్టర్ నైల్ తలా రెండు వికెట్లు చొప్పున పడగొట్టారు.


