source: X
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2026 టోర్నీలో మరో విజయం సాధించింది. ఇప్పటికే బంగ్లాదేశ్, వెస్టిండీస్‌పై విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉండిన ఆ జట్టు.. తాజాగా ఇంగ్లండ్‌పై గెలిచి రెండో స్థానానికి ఎగబాకింది.
ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ మరోసారి డకౌటై నిరాశపరిచినా, ఆర్కీ షార్ట్ (60), జోనాథన్ వెల్స్ (58 నాటౌట్) మెరుపు అర్ద సెంచరీలు సాధించి ఆసీస్‌కు భారీ స్కోర్ అందించారు.
ఆఖర్లో కౌల్టర్ నైల్ (21), కల్లమ్ ఫెర్గూసన్ (24) కూడా బ్యాట్ ఝులిపించారు. జో బర్న్స్ (8) తక్కువ స్కోర్‌కే ఔట్ కాగా.. కేన్ రిచర్డ్సన్ 9 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో రవి బోపారా 2, మొయిల్ అలీ, తైమాల్ మిల్స్, అజ్మల్ షెహజాద్, ప్లంకెట్ తలో వికెట్ తీశారు.
భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ చివరి వరకు అద్భుతంగా పోరాడినప్పటికీ విజయానికి 17 పరుగుల దూరంలో నిలిచిపోయింది. మొయిన్ అలీ (94 నాటౌట్) వీరోచిత పోరాటం చేసినా, ఇంగ్లండ్‌ను విజయతీరాలు దాటించలేకపోయాడు.
నిర్ణీత 20 ఓవర్లలో ఇంగ్లండ్ 4 వికెట్ల నష్టానికి 202 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ ఓటమితో ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పడిపోయింది. సౌతాఫ్రికా ఆడిన 4 మ్యాచ్‌ల్లో గెలిచి టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది. భారత్ ఆడిన 5 మ్యాచ్‌ల్లో నాలుగింట ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఇదీ చదవండి: యువరాజ్ ఫెయిల్.. వెస్టిండీస్ చేతిలో టీమిండియా ఘోర ఓటమి


