49 బంతుల్లో సెంచరీ.. అయినా చెత్త రికార్డు మూటగట్టుకున్న మిచెల్ మార్ష్ | Mitchell Marsh Attains Rare Unwanted Record With 49 Ball Century Vs England | Sakshi
Sakshi News home page

49 బంతుల్లో సెంచరీ.. అయినా చెత్త రికార్డు మూటగట్టుకున్న మిచెల్ మార్ష్

Nov 29 2026 8:40 PM | Updated on Nov 29 2026 8:40 PM

Mitchell Marsh Attains Rare Unwanted Record With 49 Ball Century Vs England

source: X

ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టీ20లో ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌ (ఎస్‌సీజీ) వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో కేవలం 49 బంతుల్లోనే శతకం పూర్తి చేశాడు. మొత్తంగా 57 బంతుల్లో 9 ఫోర్లు, 9 సిక్సర్లతో 119 పరుగులు చేశాడు. అయితే మార్ష్ పోరాటం వృథా అయ్యింది. ఆస్ట్రేలియా ఏడు పరుగుల తేడాతో పరాజయంపాలైంది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే 1-3తో చేజార్చుకుంది.

ఈ మ్యాచ్‌లో మెరుపు సెంచరీ చేసినప్పటికీ మార్ష్‌ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ టీ20ల్లో సెంచరీ చేసి కూడా ఓడిన జట్టులో ఉన్న తొలి ఆటగాడిగా నిలిచాడు. ఇంతకుముందు ఈ రెండు జట్ల మధ్య టీ20ల్లో సెంచరీలు చేసిన ఆటగాళ్లుగా ఆస్ట్రేలియాకు చెందిన ఆరోన్ ఫించ్ (2013), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (2018) మాత్రమే ఉన్నారు. అయితే వీరిద్దరూ సెంచరీలు చేసిన మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది.

మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. సామ్‌ కర్రన్‌ మెరుపు అర్ద శతకంతో ఇంగ్లండ్‌కు ఓ మోస్తరు స్కోర్‌ అందించాడు.

సహకరించని మిగతా బ్యాటర్లు
అనంతరం 182 పరుగుల ఛేదనలో మార్ష్ 119 పరుగులతో చెలరేగినా.. జట్టులో ఏ ఒక్క ఆటగాడి నుంచి కూడా అతడికి సహకారం లభించలేదు. మార్ష్‌ మినహా జట్టులో ఒక్క ఆటగాడు కూడా కనీసం 20 పరుగుల మార్కును అందుకోలేకపోయాడు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సామ్ హార్పర్ 18 పరుగులతో రెండో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. దీంతో మార్ష్‌ ఒంటరిపోరాటం వృధా అయ్యింది. ఆసీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 174 పరుగులకే పరిమితమైంది.

ఇదీ చదవండి: మార్ష్ సెంచ‌రీ వృథా.. ఇంగ్లండ్ చేతిలో ఆస్ట్రేలియా ఓటమి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement