ఆసియా కప్‌ ఫైనల్‌.. పాక్‌ను స్వల్ప స్కోర్‌కే కట్టడి చేసిన శ్రీలంక | ACC Mens Asia cup Rising stars 2026 Final: Sri Lanka A restricted Paksitan A to 216 runs | Sakshi
Sakshi News home page

ఆసియా కప్‌ ఫైనల్‌.. పాక్‌ను స్వల్ప స్కోర్‌కే కట్టడి చేసిన శ్రీలంక

Nov 29 2026 6:56 PM | Updated on Nov 29 2026 6:56 PM

ACC Mens Asia cup Rising stars 2026 Final: Sri Lanka A restricted Paksitan A to 216 runs

source: X

ఏసీసీ మెన్స్‌ ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ 2026 టోర్నీ ఫైనల్లో శ్రీలంక, పాకిస్తాన్‌-ఎ జట్లు తలపడుతున్నాయి. దోహా వేదికగా ఇవాళ జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. శ్రీలంక బౌలర్లు చెలరేగడంతో పాక్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 216 పరుగులకే పరిమితమైంది.

రవిందు ఫెర్నాండో, గరుక సంకేత్‌ తలో 3 వికెట్లు తీసి పాక్‌ను భారీ దెబ్బతీయగా.. వనుజ సహాన్‌ 2, నిపున్‌ ధనుంజయ ఓ వికెట్‌ తీశారు. విజయ్‌కాంత్‌ వియాస్‌కాంత్‌ (10-1-38-0) వికెట్లు తీయకపోయినా పొదుపుగా బౌలింగ్‌ చేశాడు. లియనాగే, లహీరు సమరకూన్‌ కూడా వికెట్లు తీయకపోయినా ఓ మోస్తరు బౌలింగ్‌ ప్రదర్శన చేశారు.

పాక్‌ ఇన్నింగ్స్‌లో వన్‌డౌన్‌ బ్యాటర్‌ షాజైబ్‌ ఖాన్‌ (60) మాత్రమే అర్ద సెంచరీతో రాణించాడు. షమీల్‌ హుసేన్‌ (40), రోహైల్‌ నజీర్‌ (37), కెప్టెన్‌ అబ్దుల్‌ సమద్‌ (33) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. మిగతా ప్లేయర్లలో సుఫ్యాన్‌ మొఖిమ్‌ (16 నాటౌట్‌) రెండంకెల స్కోర్‌ చేయగా.. మాజ్‌ సదాకత్‌ (5), హసన్‌ నవాజ్‌ (9), ఫర్హాన్‌ యూసఫ్‌ (7), ఇమ్రాన్‌ రంధవా (2), అహ్మద్‌ దనియాల్‌ (2) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. 

ఇదీ చదవండి: మార్ష్ సెంచ‌రీ వృథా.. ఇంగ్లండ్ చేతిలో ఆస్ట్రేలియా ఓటమి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement