Photo Credit: Twitter
న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ మాట్ హెన్రీ తన అంతర్జాతీయ టెస్టు కెరీర్‌లో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. భారత్‌పై టెస్టుల్లో 50 వికెట్ల మార్క్ పూర్తి చేసుకున్న ఆరో కివీస్ బౌలర్‌గా మాట్ హెన్రీ చరిత్ర సృష్టించాడు. ఈ నేపథ్యంలో టిమ్ సౌథీ, రిచర్డ్ హడ్లీ, ట్రెంట్ బౌల్ట్, మిచెల్ శాంట్నర్, డానియెల్ వెటోరి వంటి దిగ్గజాల సరసన చేరాడు.
కాగా హగ్లే ఓవల్ జరుగుతున్న రెండో టెస్టుకు ముందు మాట్ హెన్రీ 48 వికెట్లతో బరిలోకి దిగాడు. రెండో రోజు ఆటలో తొలి ఓవర్‌లోనే జైస్వాల్‌ను ఔట్ చేసిన మాట్ హెన్రీ.. మూడోరోజు తన మొదటి ఓవర్‌లోనే అన్షుల్ కాంబోజ్‌ను ఔట్ చేసి 50 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు.
భారత్‌పై 50 లేదా అంతకంటే ఎక్కువ అంతర్జాతీయ వికెట్లు తీసిన కివీస్ బౌలర్లు
113 – టిమ్ సౌథీ
92 – సర్ రిచర్డ్ హాడ్లీ
79 – ట్రెంట్ బౌల్ట్
75 – మిచెల్ సాంట్నర్
73 – డేనియల్ వెట్టోరి
50 – మాట్ హెన్రీ*
టిమ్ సౌథీ 113 వికెట్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా, అతని తర్వాతి స్థానాల్లో సర్ రిచర్డ్ హ్యాడ్లీ, ట్రెంట్ బౌల్ట్ ఉన్నారు. తాజాగా వీరి సరసన మాట్ హెన్రీ చేరాడు. 34 ఏళ్ల మాట్ హెన్రీ 2014లో భారత్‌పై వన్డేలలో తన అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి భారత జట్టుకు హెన్రీ తలనొప్పిగా మారాడు.
హెన్రీ భారత్‌పై 24.44 సగటుతో 50 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టాడు. భారత్‌పై కనీసం 50 వికెట్లు తీసిన న్యూజిలాండ్ బౌలర్లలో, సర్ రిచర్డ్ హాడ్లీ మాత్రమే 23.01 సగటుతో మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. ఓవరాల్‌గా మాట్ హెన్రీ 36 టెస్టుల్లో 153 వికెట్లు, 96 వన్డేల్లో 178 వికెట్లు, 45 టీ20ల్లో 53 వికెట్లు పడగొట్టాడు.
ఇదీ చదవండి: మూడోరోజు ముగిసిన ఆట.. భారీ ఆధిక్యంలో న్యూజిలాండ్


