వారెవ్వా జైస్వాల్‌.. అమాంతం గాల్లోకి ఎగిరి స్టన్నింగ్‌ క్యాచ్‌ | Yashasvi Jaiswal One-Handed Stunner-Dismiss-NZ-Opener Devon Conway | Sakshi
Sakshi News home page

వారెవ్వా జైస్వాల్‌.. అమాంతం గాల్లోకి ఎగిరి స్టన్నింగ్‌ క్యాచ్‌

Nov 29 2026 11:05 AM | Updated on Nov 29 2026 11:10 AM

Yashasvi Jaiswal One-Handed Stunner-Dismiss-NZ-Opener Devon Conway

Photo Credit: Twitter

క్రైస్ట్‌చర్చి వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ మ‌రోసారి స్ట‌న్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. ఫిఫ్టీ సాధించి దూకుడు మీదున్న కివీస్ ఓపెన‌ర్ డెవాన్ కాన్వేను త‌న అద్భుత క్యాచ్‌తో షాక్‌కు గురయ్యేలా చేశాడు. 

విష‌యంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 32వ ఓవ‌ర్ తొలి బంతికి ఇది చోటు చేసుకుంది. సుంద‌ర్ వేసిన బంతిని కాన్వే ఫైన్‌లెగ్ దిశ‌గా ఆడాడు. బ్యాక్‌వ‌ర్డ్ పాయింట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న జైస్వాల్ ప‌రిగెత్తుకుంటూ వ‌చ్చి ఎడ‌మ‌వైపు డైవ్ చేస్తూ ఒంటిచేత్తో స్ట‌న్నింగ్ క్యాచ్ తీసుకున్నాడు. 

క్యాచ్ ప‌డ‌తాన‌ని జైస్వాల్ ఊహించ‌లేద‌నుకుంటా.. అందుకే క్యాచ్ ప‌ట్ట‌గానే మైదానంలో జోష్‌తో ప‌రిగెత్తాడు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. మ్యాచ్ విష‌యానికొస్తే, రెండో టెస్టులో టీమిండియా ముంగిట భారీ టార్గెట్ విధించే దిశ‌గా కివీస్ ప‌యనిస్తోంది. 

46 ఓవ‌ర్లు ముగిసేస‌రికి కివీస్ మూడు వికెట్ల న‌ష్టానికి 128 ప‌రుగులు చేసింది. ర‌చిన్ ర‌వీంద్ర (42), డారిల్ మిచెల్ (4) క్రీజులో ఉన్నారు. బుమ్రా రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. అంత‌క‌ముందు భార‌త్ త‌మ తొలి ఇన్నింగ్స్‌లో 246 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఆట‌కు మ‌రో రెండు రోజుల మిగిలి ఉండ‌డంతో న్యూజిలాండ్‌కు విజ‌యావ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి.

ఇదీ చదవండి: రికార్డు భాగస్వామ్యం.. చ‌రిత్ర‌కెక్కిన‌ టీమిండియా

NZ Vs IND: చ‌రిత్ర సృష్టించిన ధ్రువ్ జురెల్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement