రికార్డు భాగస్వామ్యం.. చ‌రిత్ర‌కెక్కిన‌ టీమిండియా | Jurel-Brar-Record-3rd-Highest 9th-Wicket-Partnership-New Zealand-Soil | Sakshi
Sakshi News home page

రికార్డు భాగస్వామ్యం.. చ‌రిత్ర‌కెక్కిన‌ టీమిండియా

Nov 29 2026 8:56 AM | Updated on Nov 29 2026 8:58 AM

Jurel-Brar-Record-3rd-Highest 9th-Wicket-Partnership-New Zealand-Soil

Photo Credit: BCCI Twitter

క్రైస్ట్‌చర్చిలోని హెగ్లీ ఓవల్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా స‌రికొత్త రికార్డు నెలకొల్పింది. ధ్రువ్ జురెల్ (88)కు తోడు ఆకాశ్ దీప్‌, గుర్నూర్ బ్రార్‌లు కీల‌క ఇన్నింగ్స్‌లు ఆడ‌డంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 246 ప‌రుగుల‌కు ఆలౌటైంది. 

ఈ నేప‌థ్యంలో న్యూజిలాండ్ గ‌డ్డ‌పై టెస్టుల్లో భార‌త్ త‌ర‌ఫున తొమ్మిది లేదా ప‌దో వికెట్‌కు అత్య‌ధిక ప‌రుగులు సాధించిన మూడో జోడీగా ధ్రువ్ జురెల్, గుర్నూర్ బ్రార్ రికార్డుల‌కెక్కారు. ఈ ఇద్ద‌రు క‌లిసి 123 బంతుల్లో 64 ప‌రుగులు జోడించారు. ఇందులో జురెల్‌వి 49 ప‌రుగులు కాగా, గుర్నూర్ ప‌ది ప‌రుగులు చేశాడు. 

తొలి స్థానంలో స‌య్య‌ద్ కిర్మాని-శివ‌లాల్ యాద‌వ్ (1981లో ఆక్లాండ్ టెస్టులో 105 ప‌రుగులు) ఉన్నారు. రెండో స్థానంలో మొహ్మ‌ద్ అజారుద్దీన్‌-అతుల్ వాస‌న్ (1990లో ఆక్లాండ్ టెస్టులో 86 ప‌రుగులు) కొన‌సాగుతున్నారు. జురెల్‌-గుర్నూర్ జోడీ మూడో స్థానంలో ఉండ‌గా, రాహుల్ ద్ర‌విడ్‌-వెంక‌టేశ్ ప్ర‌సాద్ జోడీ (1998లో హామిల్ట‌న్ టెస్టులో 61 ప‌రుగులు) నాలుగో స్థానంలో ఉన్నారు. 

ఐదో స్థానంలో మ‌హ్మ‌ద్ అజారుద్దీన్-వెంక‌టేశ్ ప్ర‌సాద్ జోడీ (1998లో వెల్లింగ్ట‌న్ టెస్టులో 58 ప‌రుగులు) ఉన్నారు. ఇక 2010లో అహ్మ‌దాబాద్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రిగిన టెస్టులో హ‌ర్భ‌జ‌న్‌-ప్ర‌గ్యాన్ ఓజా క‌లిసి తొమ్మిదో వికెట్‌కు 66 ప‌రుగులు జోడించారు. మ‌ళ్లీ 16 ఏళ్ల త‌ర్వాత‌ జురెల్‌-బ్రార్ జోడీ క‌లిసి తొమ్మిదో వికెట్‌కు 50 ప్ల‌స్ ప‌రుగులు జోడించ‌డం విశేషం.

న్యూజిలాండ్‌తో జ‌రిగిన‌ టెస్టుల్లో తొమ్మిదో వికెట్‌కు అత్య‌ధిక బంతులు ఎదుర్కొన్న జాబితాలో గుర్నూర్‌, జురెల్ మూడో స్థానంలో ఉన్నారు. ఈ ఇద్ద‌రు క‌లిసి తొమ్మిదో వికెట్‌కు 123 బంతులు ఎదుర్కొన్నారు. తొలి స్థానంలో జింబాబ్వే బ్యాట‌ర్లు ప్రిన్స్ మాస‌వెరె-డొనాల్డ్ టిరిపానో ఉన్నారు. 

ఈ జంట 2016లో బుల‌వాయో వేదిక‌గా జ‌రిగిన టెస్టులో 250 బంతులు ఎదుర్కొన్నారు. 2013లో బంగ్లాదేశ్ జోడీ రోబిహుల్ ఇస్లామ్‌-సోహ‌గ్ గాజి (152 బంతులు) రెండో స్థానంలో, 2008లో బ్రిస్బేన్ టెస్టులో ఆస్ట్రేలియా జోడీ మిచెల్ జాన్స‌న్‌- సైమ‌న్ క‌టిచ్ (115 బంతులు) నాలుగో స్థానంలో ఉన్నారు.

మ్యాచ్ విష‌యానికొస్తే, టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 246 ప‌రుగుల‌కు ఆలౌటైంది. త‌ద్వారా 110 ప‌రుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన న్యూజిలాండ్ 13 ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్టానికి 50 ప‌రుగులు చేసింది. డెవాన్ కాన్వే (23), హెన్రీ నికోల్స్ (19) ప‌రుగులు క్రీజులో ఉన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement