న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్‌.. భారత్‌ ఫాలో ఆన్‌ గండం నుంచి గట్టెక్కాలంటే..? | How Many Runs Does India Need To Avoid Follow On vs New Zealand On Day 3 | Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్‌.. భారత్‌ ఫాలో ఆన్‌ గండం నుంచి గట్టెక్కాలంటే..?

Nov 28 2026 2:42 PM | Updated on Nov 28 2026 2:50 PM

How Many Runs Does India Need To Avoid Follow On vs New Zealand On Day 3

source: X

న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు కష్టాల్లో పడింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 116 పరుగులకే 6 వికెట్లు నష్టపోయి (తొలి ఇన్నింగ్స్‌లో) ఫాలో ఆన్‌ గండంలో చిక్కుకుంది. ఈ గండం నుంచి గట్టెక్కాలంటే భారత్‌ బ్యాటర్లు మరో 41 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో నాలుగు వికెట్లే ఉండటం, అందులోనూ న్యూజిలాండ్‌ బౌలర్లు విజృంభిస్తుండటం భారత్‌కు ప్రతికూలమైన అంశం.

అంతకుముందు న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 356 పరుగులు చేసింది. ఈ స్కోరుకు భారత్‌ ఇంకా 240 పరుగులు వెనుకబడి ఉంది. ఒకవేళ​ భారత్‌ ఫాలో ఆన్‌ గండం నుంచి గట్టెక్కినా, తిరిగి మ్యాచ్‌లోకి రావడం చాలా కష్టం. రెండు మ్యాచ్‌లో ఈ సిరీస్‌లో తొలి టెస్ట్‌ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. రెండో మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్‌ కూడా కైవసం చేసుకుంటుంది.

నిప్పులు చెరిగిన కివీస్‌ బౌలర్లు
రెండో రోజు కివీస్‌ బౌలర్లు చెలరేగిపోయారు. భారత బ్యాటర్లను క్రీజ్‌లో కుదురుకోనివ్వలేదు. పేసర్లు మ్యాట్‌ హెన్రీ (1-29), జేమీసన్‌ (2-33), డఫీ (2-21),  నాథన్‌ స్మిత్‌ (1-29) నిప్పులు చెరగడంతో భారత్‌ 46 ఓవర్లలో 116 పరుగులకే 6 వికెట్లు నష్టపోయింది. జైస్వాల​్‌ డకౌట్‌ కాగా.. కేఎల్‌ రాహుల్‌ 25, పడిక్కల్‌ 21, గిల్‌ 17, పంత్‌ 23, సుందర్‌ 10 పరుగులు చేశారు. జురెల్‌ 7 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు.

ఐదేసిన ఆకాశ్‌
246/5 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో రోజు ఆట కొనసాగించిన న్యూజిలాండ్‌కు భారత బౌలర్లు షాకిచ్చారు. మరో 110 పరుగులకే మిగిలిన 5 వికెట్లు తీశారు. ఆకాశ్‌ దీప్‌ ఐదు వికెట్లతో సత్తా చాటాడు. గుర్నూర్‌ బ్రార్‌, అన్షుల్‌ కాంబోజ్‌ చెరో రెండు వికెట్లు, సుందర్‌ ఓ వికెట్‌ పడగొట్టాడు.

ఇదీ చదవండి: జ‌స్ప్రీత్ బుమ్రా సంచ‌ల‌న నిర్ణ‌యం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement