రిషభ్ పంత్ (PC: BCCI X)
న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో శతక్కొట్టిన టీమిండియా స్టార్ రిషభ్ పంత్ (128 పరుగులు).. రెండో టెస్టులో మాత్రం నిరాశపరిచాడు. మొత్తంగా 39 బంతులు ఎదుర్కొన్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. ఒక ఫోర్, ఒక సిక్సర్ సాయంతో 23 పరుగులు చేశాడు. కివీస్ పేసర్ జేకబ్ డఫీ బౌలింగ్‌లో నిర్లక్ష్యపు షాట్‌తో కైలీ జెమీసన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
ప్రపంచ రికార్డు
అయితే, రిషభ్ పంత్ నామమాత్రపు స్కోరుకే అవుటైనప్పటికీ.. న్యూజిలాండ్‌తో రెండో టెస్టు సందర్భంగా ఓ అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ బెన్ స్టోక్స్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు.
ఆ రెండుసార్లు టీమిండియాకు చేదు అనుభవం
కాగా 2019లో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) ఆరంభించిన సంగతి తెలిసిందే. రెండేళ్లకు ఓసారి జరిగే WTC ఫైనల్లో గెలిచిన జట్టుకు ‘గద’ను బహూకరిస్తారు. మొట్టమొదటి డబ్ల్యూటీసీ సీజన్ (2019-21) ఫైనల్‌లో న్యూజిలాండ్ టీమిండియాను ఓడించి విజేతగా నిలిచింది.
ఇక 2021-23 సీజన్‌లో ఆస్ట్రేలియా టీమిండియాపై గెలిచి చాంపియన్‌గా అవతరించింది. గత ఎడిషన్ (2023-25)లో సౌతాఫ్రికా ఆస్ట్రేలియాను చిత్తు చేసి ‘గద’ను సొంతం చేసుకుంది.
తడబడుతున్న భారత బ్యాటర్లు
ఇదిలా ఉంటే.. డబ్ల్యూటీసీ 2025-27 సీజన్‌లో భాగంగా న్యూజిలాండ్- టీమిండియా మధ్య తాజాగా రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో.. వెల్లింగ్‌టన్‌లో తొలి టెస్టు ‘డ్రా’ అయింది. ఇక క్రైస్ట్‌చర్చ్ వేదికగా శుక్రవారం మొదలైన రెండో టెస్టులో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 356 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత జట్టు 104 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్‌లో గెలవడంతో పాటు.. స్వదేశంలో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుంటేనే టీమిండియా డబ్ల్యూటీసీ-2027 ఫైనల్ ఆశలు సజీవంగా ఉంటాయి.
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్లు
🏏రిషభ్ పంత్ (ఇండియా)- 89 సిక్సర్లు
🏏బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్)-88 సిక్సర్లు
🏏రోహిత్ శర్మ (ఇండియా)- 56 సిక్సర్లు
🏏శుబ్‌మన్ గిల్ (ఇండియా)- 48 సిక్సర్లు
🏏యశస్వి జైస్వాల్ (ఇండియా)- 45 సిక్సర్లు.
ఇదీ చదవండి: శ్రేయస్ అయ్యర్ కీలక నిర్ణయం!


