సూపర్‌మేన్‌ తరహాలో డైవ్‌.. ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్‌ | Jaiswal Pulls-Off-Stunning Catch-Shocks Everyone-NZ Vs IND 2nd Test | Sakshi
Sakshi News home page

సూపర్‌మేన్‌ తరహాలో డైవ్‌.. ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్‌

Nov 28 2026 8:03 AM | Updated on Nov 28 2026 8:05 AM

Jaiswal Pulls-Off-Stunning Catch-Shocks Everyone-NZ Vs IND 2nd Test

Photo Credit: BCCI Twitter

క్రైస్ట్‌చ‌ర్చి వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టులో భార‌త ఆట‌గాడు య‌శ‌స్వి జైస్వాల్ సూపర్‌మేన్‌ తరహాలో డైవ్‌ చేసి క‌ళ్లు చెదిరే క్యాచ్‌ అందుకున్నాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 107వ ఓవ‌ర్‌లో ఈ అద్భుతం చోటు చేసుకుంది. అప్ప‌టికే ఆకాశ్‌దీప్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు బాది దూకుడు మీదున్న కైల్ జేమిస‌న్‌కు రౌండ్ ది వికెట్ వ‌చ్చి బౌన్సర్ విసిరాడు. 

దీంతో జేమిస‌న్ డీప్ మిడ్‌వికెట్ మీదుగా భారీ షాట్ ఆడే ప్ర‌య‌త్నం చేశాడు. బౌండ‌రీ వ‌ద్ద ఫీల్డింగ్ చేస్తున్న జైస్వాల్ ప‌రిగెత్తుకుంటూ వ‌చ్చి డైవ్ చేసి ఒంటిచేత్తో స్ట‌న్నింగ్ క్యాచ్ తీసుకున్నాడు. అత‌డి అద్భుత క్యాచ్‌తో జేమిస‌న్ ఇన్నింగ్స్‌కు తెర‌ప‌డింది. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇక తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చిన కైల్ జేమిస‌న్‌ ద‌నాధ‌న్ ఇన్నింగ్స్ ఆడాడు. 26 బంతుల్లో 19 ప‌రుగులు చేసిన కైల్ జేమిసన్ ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు ఉన్నాయి.

బ్యాటింగ్‌లో విఫ‌లం..
ఫీల్డింగ్‌లో స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిసిన‌ప్ప‌టికీ, బ్యాటింగ్‌లో మాత్రం జైస్వాల్ పూర్తిగా విఫ‌ల‌మ‌య్యాడు. ఆరు బంతులెదుర్కొన్న జైస్వాల్ మాట్ హెన్రీ బౌలింగ్‌లో డ‌కౌట్‌గా వెనుదిరిగాడు. తొలి ఓవ‌ర్‌లో మాట్ హెన్రీ తొలి ఐదు బంతులను ఔట్‌సైడ్ ఆఫ్ దిశ‌గా వేశాడు. ఇక చివ‌రి బంత‌ని కూడా ఔట్‌సైడ్ వేసిన‌ప్ప‌టికీ, స్వింగ్ అయిన బంతి ఆఫ్ స్టంప్‌ను ఎగుర‌గొట్టింది. దీంతో జైస్వాల్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.

మ్యాచ్ విష‌యానికొస్తే, న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 356 ప‌రుగుల‌కు ఆలౌటైంది. కివీస్‌ బ్యాట‌ర్ల‌లో టామ్ బ్లండెల్ (89) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా, కెప్టెన్ టామ్ లాథ‌మ్ (59) అర్థ‌సెంచ‌రీ సాధించాడు. గ్లెన్ ఫిలిప్స్ (36),  కాన్వే (31), డారిల్ మిచెల్ (31) రాణించారు. భారత బౌల‌ర్ల‌లో ఆకాశ్‌దీప్ ఐదు వికెట్లు తీయ‌గా, అన్షుల్ కాంబోజ్‌, గుర్నూర్ బ్రార్ చెరో 2 వికెట్లు ప‌డ‌గొట్టారు. 

టామ్ బ్లండెల్ సెంచ‌రీ మిస్ అయిన‌ప్ప‌టికీ, లోయ‌ర్ ఆర్డ‌ర్‌లో వ‌చ్చిన ప్ర‌తీ బ్యాట‌ర్ త‌లా కొన్ని ప‌రుగులు చేయ‌డంతో కివీస్ 350 ప‌రుగుల మార్క్‌ను దాటింది. ఆఖ‌ర్లో నాథ‌న్ స్మిత్ (26), కైల్ జేమిస‌న్ (19), మాట్ హెన్రీ (19) ప‌రుగులు చేయ‌డంతో పాటు విలువైన భాగ‌స్వామ్యాలు న‌మోదు చేశారు.

ఇదీ చదవండి: NZ Vs IND: ఐదు వికెట్ల‌తో చెల‌రేగిన ఆకాశ్‌.. కివీస్ 356 ఆలౌట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement